గువాహటి: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓ పిచ్చోడని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. రాహుల్ ఓసారి గడ్డంతో, మరోసారి నీట్‌గా షేవ్ చేసుకుని కనిపిస్తారంటూ ఎద్దేవా చేశారు. బెంగాల్‌లోని నందిగ్రామ్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్టు చేయడంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సీఎం స్పందించారు.
19 ఏళ్లనాటి నాన్ బెయిలబుల్ కేసుల్లో మిలన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ‘అసలు రాహుల్ గాం«దీని ఏమనాలో అర్థం కావడం లేదు. మిలన్ ప్రధాన్‌పై 2007 నుంచి మూడు హత్య కేసులున్నాయి. ఇలాంటివి బయటపడిన తర్వాత కూడా పోలీసులు అరెస్ట్ చేయొద్దా? రాహుల్‌ను చూస్తే నాకు నవ్వొస్తుంది. అతడో పిచ్చోడు. ఒకసారి గడ్డంతో, మరోసారి నీట్‌గా షేక్ చేసుకుని కనిపిస్తాడు. కొన్నిసార్లు ఇక్కడ, ఇంకొన్ని సార్లు విదేశాల్లో పర్యటనలు చేస్తుంటారు. ఆయన పిచ్చోడు తప్ప మరేమీ కాదు’అంటూ ఎద్దేవా చేశారు.


