"ఈడ్చుకెళ్లారు.. ఎక్కడ పడితే అక్కడ కొట్టారు" | NSUI workers meet Rahul Gandhi in Delhi | Sakshi
Sakshi News home page

"ఈడ్చుకెళ్లారు.. ఎక్కడ పడితే అక్కడ కొట్టారు"

Oct 14 2026 2:50 PM | Updated on Oct 14 2026 3:04 PM

NSUI workers meet Rahul Gandhi in Delhi

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో చేపట్టిన సీఈసీ వ్యతిరేఖ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాహుల్ గాంధీ ఒక 'హై-టీ' సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఇండియా (INDIA) కూటమి నాయకులతో పాటు, సీఈసీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్న సివిల్ సొసైటీ కార్యకర్తలు, యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ భేటీలో  పోలీసుల చేతిలో గాయాలైన NSUI విద్యార్థులు ప్రత్యేకంగా రాహుల్‌ని కలిశారు. తమను పోలీసులు రోడ్లపై ఈడ్చెకళ్లారని ఇష్టారీతిన కొట్టారని ఈ సందర్బంగా ఆందోళనకారులు రాహుల్‌ గాంధీతో వాపోయారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన రాహుల్‌ గాంధీ పోలీసులు దాడి చేసిన వీడియో ఆధారాలు సేకరించాలని  బాధ్యులకు తగిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని రాహుల్‌ ఈ వారికి హామీ ఇచ్చారు  

అనంతరం రాహుల్ మాట్లాడుతూ "కేరళకు చెందిన అతిర ఒక చెవి వినికిడిని కోల్పోయింది. ఆ చెవిపై దెబ్బ తగలడంతో ఆమెకు ఒక చెవి వినపడకుండా అయ్యింది. ఆమె ఇక వినలేకపోతుంది. గతసారి నేను మీకు కళ్ళు కోల్పోయిన ఒక బాలుడిని చూపించాను. ఇప్పుడు, ఆమెకు చెవి వినపడకుండా అయ్యింది," అని  అన్నారు.

కాగా గత వారం రోజులుగా ఢిల్లీ నిరసనలతో అట్టుడుకుతుంది. అక్టోబర్‌ 6న ఈసీ కార్యాలయం (ఎన్నికల సంఘం ఆఫీస్) మరియు ఆకాశవాణి భవన్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు అక్టోబర్ 10 (శనివారం) కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాలు, జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి. అక్టోబర్ 12న రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండి  కూటమి వేలాది మంది కార్యకర్తలతో సుప్రీంకోర్టు వైపు భారీ నిరసన మార్చ్ నిర్వహించింది.

ఈ నిరసనల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అక్టోబర్‌ 10న ఢిల్లీని అష్ట దిగ్భందనం చేసింది. జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థులు, యువజన సంఘాలపై పోలీసులు లాఠీలతో దాడి చేశారని నిరసనకారులు పేర్కొన్నారు. ఈ లాఠీఛార్జ్‌లో పలువురు NSUI విద్యార్థి నాయకులు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాధితులతో రాహుల్‌  ఈ రోజు తన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. 


ఇదీ చదవండి: యూపీలో బీజేపీ నేత బంధీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement