సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాహుల్ గాంధీ మతిలేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష‍్మణ్ అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఢిల్లీలో కాంగ్రెస్ నిరనసలు చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ రోజు ( సోమవారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ సంస్థలపై రాహుల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.
ఎంపీ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూకలను వెంట తీసుకొని సుప్రీం కోర్టుకు వెళ్లడం ఏమిటి?సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి క్లియర్‌గా వ్యక్తిగతంగా కలవలేను అని చెప్పారు.మూకలను వెంట వేసుకొని రాహుల్ సుప్రీంకోర్టు ముట్టడికి వెళ్తారా..! దేశంలో ఇప్పటికే ఎనిమిది సార్లు ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరిగింది. మర్చిపోయారా? అని అడిగారు.
రాష్ట్రంలో నీరు, కరెంట్ లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిందని. ఒకప్పుడు కాంగ్రెస్ దేశంలో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పింది మర్చిపోయిందా అని అడిగారు.
ఇదీ చదవండి: కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్


