సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏ1 గా చార్జ్‌షీట్‌లో తన పేరును తొలగించాలంటూ పేర్కొన్నారు. నిందితుల జాబితా నుండి తన పేరు తప్పించాలన్నారు. తాను అవినీతి చేసినట్లు ఏసీబీ అధికారులు నిరూపించలేకపోయారని కనుక ఈ కేసు నుండి తనను తప్పించాలని కోరుతూ కేటీఆర్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ విచారణను నాంపల్లి కోర్టు విచారణను వచ్చే నెల కు వాయిదా వేసింది.కాదా ఇదివరకే ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ఏసీబీ కోర్టు A1 నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ రెండు సార్లు కోర్టు విచారణకు హాజరయ్యారు.
ఇదీ చదవండి: వాచ్‌మెన్ ఉద్యోగం తీసేశారని హత్య


