రేపు సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ మార్చ్: రాహుల్ గాంధీ | Rahul Gandhi announced Congress Party to Do March to Supreme Court | Sakshi
Sakshi News home page

రేపు సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ మార్చ్: రాహుల్ గాంధీ

Oct 11 2026 8:48 PM | Updated on Oct 11 2026 9:00 PM

Rahul Gandhi announced Congress Party to Do March to Supreme Court

సాక్షి,న్యూఢిల్లీ: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు(సోమవారం) ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అందులో భాగంగా సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించి, భారత ప్రజల తరఫున ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మార్చ్‌లో యువత, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఓట్ల చోరీకి ముగింపు పలకాలని, SIR ప్రక్రియను నిలిపివేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీకి రావాలని ఏఐసీసీ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, సుమారు 60 మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. SIR ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ వరుస ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేపు జరగనున్న కాంగ్రెస్ మార్చ్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. యాసంగి పంటలు వేయొద్దు.. నీరు ఇవ్వలేం: మంత్రి పొంగులేటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement