యాసంగి పంటలు వేయొద్దు.. నీరు ఇవ్వలేం: మంత్రి పొంగులేటి | Telangana Minister Ponguleti Srinivas Reddy Warns Of Water Shortage Due To El Niño, Urges Farmers To Avoid Rabi Crops | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. యాసంగి పంటలు వేయొద్దు.. నీరు ఇవ్వలేం: మంత్రి పొంగులేటి

Oct 11 2026 6:03 PM | Updated on Oct 11 2026 7:29 PM

Ponguleti Srinivasa Reddy says to farmers about Yasangi crops

సాక్షి, ఖమ్మం: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీంతో రానున్న రోజుల్లో సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎలాగైనా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తాం. కానీ రానున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగి పంటలు సాగు చేయకుండా సహకరించాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావం కేవలం తెలంగాణకే పరిమితం కాదు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. దానివల్ల ప్రజలందరూ విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి. నీటి కొరత పరిస్థితులను రైతులు అర్థం చేసుకుని రెండో పంట వేయకుండా ఉండాలని మంత్రి కోరారు.

ఇదీ చదవండి: రెండో రోజు సీజేపీ నిరసనలు.. 100 మందికి పైగా అరెస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement