రెండో రోజు సీజేపీ నిరసనలు.. 100 మందికి పైగా అరెస్ట్ | Delhi CJP protest: Delhi Police detained over 100 protesters | Sakshi
Sakshi News home page

రెండో రోజు సీజేపీ నిరసనలు.. 100 మందికి పైగా అరెస్ట్

Oct 11 2026 5:11 PM | Updated on Oct 11 2026 5:36 PM

Delhi CJP protest: Delhi Police detained over 100 protesters

సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు రెండో రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) జంతర్‌మంతర్‌ వైపు ర్యాలీగా వెళ్తున్న 100 మందికి పైగా ఆందోళనకారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిటాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ఏ నాయకులు, పలువురు విద్యార్థులను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల దాడిలో తమ నాయకులు గాయపడ్డారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

శనివారం జరిగిన నిరసనల్లో 7,000 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలు కూడా నిర్బంధానికి గురయ్యారు. ఈ ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. నిరసనకారులు పోలీసులపై దాడి చేసినట్టు, వారి విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు వారిపై నమోదు చేసినట్లు సమాచారం. నిరసనల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 15 మందికి పైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

ఇదీ చదవండి: జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకే అణచివేత: సౌరవ్ దాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement