రఫేల్ డీల్‌పై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు సుప్రీంలో ఊరట | Rahul Gets Supreme Court Relief In Rafale Case Over Remarks On Pm Modi | Sakshi
Sakshi News home page

రఫేల్ డీల్‌పై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు సుప్రీంలో ఊరట

Oct 13 2026 11:47 AM | Updated on Oct 13 2026 11:51 AM

Rahul Gets Supreme Court Relief In Rafale Case Over Remarks On Pm Modi

ఢిల్లీ: రఫేల్ డీల్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్ గాంధీపై క్రిమినల్‌ పరువునష్టం కేసులో ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రధాని మోదీని ‘చోరోన్ కే సర్దార్’, ‘కమాండర్ ఇన్ థీఫ్’ అన్న వ్యాఖ్యలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాహుల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. బాంబే హైకోర్టు సెప్టెంబర్ 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును రాహుల్‌ ఆశ్రయించారు.

పరువునష్టం కేసును కొట్టివేయాలన్న రాహుల్ గాంధీ పిటిషన్‌ను  బాంబే హైకోర్టు తిరస్కరించింది. బీజేపీ కార్యకర్త దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదుపై రాహుల్‌కు సమన్లు పంపింది. తాను రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించలేదని రాహుల్ గాంధీ వాదన. తన వ్యాఖ్యలు నిర్దిష్ట వ్యక్తుల లేదా గుర్తించదగిన వర్గాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రాహుల్ పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

రాహుల్ గాంధీ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పరువు నష్టం కేసు తదుపరి విచారణ కొనసాగింపుపై  సుప్రీంకోర్టు పరిశీలించనుంది.

ఇదీ చదవండి: టార్గెట్‌ జ్ఞానేశ్‌ కుమార్‌.. రాహుల్‌ గాంధీ బిగ్‌ మీటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement