సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సరిగ్గా పిటిషన్ వేయడం సైతం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రావడం లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. నిన్న ఎస్‌ఐఆర్‌పై విపక్షాలు వేసిన పిటిషన్‌లో 14 లోపాలు రిజిస్ట్రీ గుర్తించిందన్నారు. ఈ రోజు (మంగళవారం) ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఈసీకి వ్యతిరేకంగా సరైన ఆధారాలుంటే కోర్టుకు ఎందుకు సమర్పించలేదన్నారు. మీరు గెలిచిన రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ సక్రమమా ఓడిన చోట అక్రమమా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దేశంలో అరాచకం సృష్టించాలని చూస్తున్నారు. అసత్యాలతో రాజకీయం చేసే యత్నం చేస్తున్నారన్నారని పీయూష్ గోయల్ విమర్శించారు.
కాగా ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, సర్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై దాఖలైన పిటిషన్ల విచారణ వాయిదా పడింది. ఈ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టుల నిర్బంధం, ప్రజా రవాణాపై ఆంక్షలు తదితర అంశాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై స్పందన తెలియజేస్తూ నివేదికలు, కౌంటర్లు దాఖలు చేసేందుకు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గడువు కోరింది. అయితే అందుకు న్యాయస్థానం అంగీకరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించాల్సి ఉంది. అయితే జస్టిస్ మోహన అనారోగ్యానికి గురికావడంతో విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేయాలని సీజేఐ బెంచ్ భావించింది. ఈ లోపు కేంద్రం గడువు కోరడంతో.. వాయిదాకు ఇరుపక్షాల న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
ఇదీ చదవండి: అక్టోబర్ 15న విచారణ


