న్యూఢిల్లీ: సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అందులో ఈత కొట్టడం తనకు చాలా ఇష్టమని, అల్లకల్లోలం కూడా ఒక రకమైన ప్రశాంతతను నేర్పుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో నర్మగర్భమైన పోస్టుచేశారు. కానీ, దీనిపై పూర్తి వివరణ ఇవ్వలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)తోపాటు ఎన్నికల సంఘం పనితీరుపై రాజకీయ దుమారం మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పోస్టు చర్చనీయాంశంగా మారింది. ‘సర్’ పేరుతో ఓట్ల చోరీ జరుగుతోందని ఆయన చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు.


