మోదీ గద్దె దిగు.. లేదా ప్రజలే దింపుతారు | Revanth Reddy ECI Gyanesh Kumar Remarks | Sakshi
Sakshi News home page

మోదీ గద్దె దిగు.. లేదా ప్రజలే దింపుతారు

Oct 9 2026 6:05 AM | Updated on Oct 9 2026 6:05 AM

Revanth Reddy ECI Gyanesh Kumar Remarks

ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించలేవు

జనాభా 140 కోట్లు దాటితే 13 కోట్ల ఓట్లు ఎలా గల్లంతయ్యాయి?

దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్ల తొలగింపే లక్ష్యం

ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయతి్నస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ దాడులు ఇకపై బీజేపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం రక్షించలేవన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో గద్దె దిగాలని, లేకపోతే ప్రజలే గద్దె దించుతారని అన్నారు.

ఓట్‌ బచావో..దేశ్‌ బచావో ఉద్యమంలో భాగంగా లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రియాంకాగాం«దీ, కేసీ వేణుగోపాల్, ఇతర ఇండియా కూటమి నేతలు గురువారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. వారితో కలిసి అక్కడ నివాళులర్పించిన తర్వాత రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

ఓట్లు లాక్కోవడానికి ప్రధాని, జ్ఞానేశ్‌ ప్రయత్నం
‘ఓట్‌ బచావో..దేశ్‌ బచావో ఉద్యమం కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కోసమో, ఇండియా కూటమి కోసమో కాదు. ఇది దేశంలోని సామాన్యుల హక్కుల పరిరక్షణ ఉద్యమం. 2014 ఎన్నికల నాటికి దేశంలో 81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2019 నాటికి ఆ సంఖ్య 91 కోట్లకు చేరింది. 2024 నాటికి 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దేశ జనాభా 140 కోట్లకు చేరుకుంది. ఓటర్ల సంఖ్య మరింతగా పెరగాల్సింది పోయి ఏకంగా 13 కోట్ల ఓట్లు గల్లంతు అయ్యాయి? అవి ఎలా తగ్గిపోయాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చెప్పాలి. 

ఇప్పటివరకు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ఎన్నిసార్లు జరిగినా పేదల ఓట్లకు ముప్పు కలగలేదు. ఇప్పుడు మాత్రం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి గుంజుకునేందుకు ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను ఎన్నికల సంఘం కలవకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.

బీజేపీని వ్యతిరేకించే వారి ఓట్లే లక్ష్యం 
కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశ ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి వచి్చంది. దేశ ప్రజలను ఓటు ఉన్నవాళ్లు, ఓటు లేనివాళ్లని, రెండు వర్గాలుగా విభజిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్లు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న పేదలు మరోవైపు అన్నట్లుగా మోదీ, జ్ఞానేశ్‌కుమార్‌ పరిస్థితులను మార్చారు. బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని వాటిని తొలగిçస్తున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు.

రాహుల్‌ వెంటే సీఎం..
గురువారం మధ్యాహ్నం మోట్స్‌ హోటల్‌లో ఇండియా కూటమి లంచ్‌ మీటింగ్‌ నిర్వహించగా, ఆ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో ఈ సమావేశానికి వచ్చిన రేవంత్‌రెడ్డి సుమారు కిలోమీటరు దూరంలోనే తన కాన్వాయ్‌ నుంచి దిగారు. రాష్ట్ర ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్‌ లతో కలిసి నడుచుకుంటూ వచ్చి సమావేశానికి హాజరయ్యారు. అనంతరం అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంకాగాంధీలతో కలిసి ఒకే బస్సులో రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సైబర్‌ మోసాల కట్టడికి గ్లోబల్‌ ఫ్రేమ్‌వర్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement