ముగిసిన ఇండి కూటమి నేతల సమావేశం.. కీలక నిర్ణయం | Meeting of INDIA bloc leaders at Rahul residence concludes | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇండి కూటమి నేతల సమావేశం.. కీలక నిర్ణయం

Oct 13 2026 6:16 PM | Updated on Oct 13 2026 7:27 PM

Meeting of INDIA bloc leaders at Rahul residence concludes

సాక్షి, న్యూ ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ నివాసంలో ఇండి కూటమి నేతల సమావేశం ముగిసింది. సీఈసీకి జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని  నిర్ణయించినట్లు  విపక్షాలు తెలిపాయి. అదే విధంగా జంతర్ మంతర్ ను నిరసన ప్రదేశంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.

 మీటింగ్ అనంతరం ఇండి కూటమి నేతలు మాట్లాడుతూ

రాహుల్ మాట్లాడుతూ..  "ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలనే మా తాపత్రేయం దేశంలో ఎన్నికల వ్యవస్థ నాశనం చేశారు. మోదీ, అమిత్‌షా, జ్ఞానేష్‌ కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ధ్వంసమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా లక్షం". అని అన్నారు.  

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ..తమ పోరాటం విజయవంతమైందని  నిన్న సుప్రీంకోర్టుకు విపక్షాలు చేపట్టిన ధర్నాలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారని పేర్కొన్నారు. 

సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు ఎట్టి పరిస్థితుల్లో  శిక్ష తప్పదని రాబోయే రోజుల్లో మా పోరాటం కొనసాగుతుందని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ పేర్కొన్నారు. 

ఆందోళనపై భయంతోనే జంతర్ మంతర్ ను మూసివేశారని జంతర్ మంతర్ ను నిరసన ప్రదేశంగా కొనసాగించాలని  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 


ఇదీ చదవండి: రాహుల్‌కు పిటిషన్ వేయడం రాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement