breaking news
kerala
-
క్షణం ఆలస్యమైతే అంతే సంగతులు : వైరల్ వీడియో
రైలు ప్రయాణాల్లో పిల్లలు, పెద్దలూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రైలు ఎక్కేటపుడు, దిగేటపుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు అసలు పనికి రాదు. ప్రాణాలు ముఖ్యం అనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. తాజాగా కేరళలో జరిగిన ఒక ఘటన ఈ విషయాలను మరోసారి గుర్తు చేస్తుంది.కేరళలోని ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్లో ఒక మహిళను ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన విశేషంగా నిలిచింది. రైలు నుండి దిగడానికి ప్రయత్నించినప్పుడు ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. దాదాపు పట్టాలపై పడిపోయింది. అక్కడనే రైల్వే ఉద్యోగి రాఘవన్ ఉన్ని తక్షణమే స్పందించారు. ఆమెను ఒడుపుగా పట్టుకొని పక్కకు లాగారు. వెంటనే అలర్ట్ అయ్యి శరవేగంగా ఆయన స్పందించకపోతే ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. ఆసీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన నెట్టింట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు రాఘవన్ చాకచక్యంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు రైల్వే సిబ్బంది అంకితభావాన్ని ప్రశంసిస్తూనే, మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని కూడా నొక్కి చెబుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంతKerala : ಚಲಿಸುವ ರೈಲಿನಿಂದ ಇಳಿಯಲು ಹೋದ ಮಹಿಳೆಗೆ ಏನಾಯಿತು ನೋಡಿ.? | Sanjevani News....#kerala #train #Ernakulam #NorthRailwayStation #viralvideo #ಕೇರಳ pic.twitter.com/LTd6J1YQmF— Sanjevani News (@sanjevaniNews) August 20, 2025కాగా 2022లో ఇలాంటి ఘటన ఒకటి రైలు ప్రమాదాల్లో సిబ్బంది అప్రమత్తతను గుర్తు చేస్తూ కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్లో సతీష్ అనే RPF హెడ్ కానిస్టేబుల్ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడిన మైనర్ బాలికను రక్షించాడు. దీనికి సంబంధించిన RPF ఇండియా విడుదల చేసింది. ఈ వీడియోలో లిప్తపాటులో స్పందించి కానిస్టేబుల్ అమ్మాయిని రక్షించాడు. -
kerala: బాలికను బలిగొన్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా.. మరో మూడు కేసులు నమోదు
కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా(అమీబిక్ ఎన్సెఫాలిటిస్) కలకలం సృష్టిస్తోంది. ఈ అరుదైన వ్యాధికి గురైన తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలొదిలింది. నేగ్లేరియా ఫౌలేరి జిల్లాలో ఇదే తరహాలో మరో మూడు కేసులను ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపధ్యంలో ప్రజారోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.కలుషిత నీటిలో కనిపించే ఈ అరుదైన అమీబా మానవ మెదడు ఇన్ఫెక్షన్కు కారణమవుతుందని నిపుణులు తెలిపారు. అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం వారం రోజుల క్రితం ఒక బాలికకు తీవ్ర జ్వరం రావడంతో, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాధిత బాలికను కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. ఈ ఏడాది జిల్లాలో ఈ తరహా కేసులలో ఇది నాల్గవది.అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అంటే..వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అనేది మెదడుకు సోకే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. దీనిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) ,గ్రాన్యులోమాటస్ అమీబిక్ ఎన్సెఫాలిటిస్ (GAE). ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌కు ప్రధాన కారణం నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా. ఈ అమీబా మెదడు కణజాలాన్ని నాశనం చేసి, మెదడు వాపుకు దారితీస్తుంది. చాలా సందర్భాల్లో ఇది మరణానికి కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా అరుదుగా కనిపించినప్పటికీ, కౌమార దశలోనివారికి సోకుతుండటాన్ని నిపుణులు గమనించారు. కలుషితమైన నీటిలో మునిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నదులు, చెరువులు, కాలువలలో ఈతకు దిగేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు తెలిపారు.లక్షణాలు- నివారణవైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి సోకినప్పుడు ప్రారంభంలో సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు ఇబ్బంది పెడతాయి. వ్యాధి తీవ్రమైన తరుణంలో మెడ బిగుసుకుపోవడం, మూర్ఛ, కోమా తదితర సమస్యలు సమస్యలు తలెత్తవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ 18 రోజుల్లో ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వ్యాధి నివారణకువైద్య నిపుణులు పలు సూచనలు చేశారు. పిల్లలను చెరువులు లేదా నిలిచిన నీటిలో స్నానం చేయనివ్వకూడదని సూచించారు. స్విమ్మింగ్ పూల్స్, వాటర్ థీమ్ పార్క్‌లలో నీటిని క్లోరినేట్ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. కలుషిత నీటికి దూరంగా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. -
అవకాశాలిప్పిస్తానని పదేళ్ల కిత్రం: నటి అరెస్ట్
చెన్నై: కేరళకు చెందిన మలయాళ సినీ నటి వర్మిని మునీర్, సినిమాల్లో అవకాశం కల్పిస్తాని చెప్పి తన బంధువు అయిన ఓ 14 ఏళ్ల బాలికను కేరళ నుంచి చెన్నైకి తీసుకువచ్చింది. ఆ నటి, ఆ అమ్మాయి తిరుమంగళం ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేస్తున్నారు. ఆ సమయంలో, నటి ఉంటున్న గదికి నలుగురు యువకులు వచ్చారు. వారు బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనికి నటి మిను మునీర్ కూడా సహకరించారని తెలు స్తోంది. దీంతో బాలిక వారి నుంచి తప్పించుకుని కేరళకు వెళ్లిపోయింది. ఈ సంఘటన జరిగి 10 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాధితు రాలు తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించికేరళ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ బాలికతో నిర్వహించిన విచారణలో, తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటన చెన్నైలోని తిరుమంగళంలోని ఓ లాడ్జిలో జరిగినట్లు తేలడంతో కేరళ రాష్ట్ర పోలీసులు చెన్నై పోలీసులకు సమాచారం అందించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, తిరు మంగళం మహిళా పోలీసులు, నటి ప్రోద్బలంతో బాలికను లైంగికంగా వేధించిన సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దీని తరువాత, మల యాళ నటి మిను మునీర్ ను చెన్నై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నటిని చెన్నైకి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
అపర్ణకు జనం సెల్యూట్!
తిరువనంతపురం: ఈ రోజుల్లో పోలీస్ డ్యూటీ అంటే కేవలం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు.. మానవత్వానికి ప్రతిరూపంగా నిలవడం కూడా. తాజాగా కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారిణి అందుకు నిదర్శనంగా నిలిచారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు ప్రయత్నం చేయడమే కాదు.. రోడ్డు మధ్యలో పరుగెత్తుతూ వాహనాలను పక్కకు జరుపుతూ సంకేతాలు ఇచ్చారు. ఆమె చేసిన ఈ చర్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో ఆగస్టు 9న కేరళలోని త్రిసూర్ జిల్లాలో జరిగింది. త్రిసూర్ జిల్లాకు చెందిన ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ అంబులెన్స్ జూబ్లీ మిషన్ ఆస్పత్రి వైపు వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో పోలీసు వాహనంలో వెళ్తున్న స్టేషనల్ హౌస్ ఆఫీసర్ అపర్ణా లవకుమార్ ఆ అంబులెన్స్‌ను గమనించారు. వెంటనే పోలీసు వాహనం నుంచి మెరుపు వేగంతో బయటకు వచ్చారు. అంబులెన్స్ ముందు పరుగెత్తుతూ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీంతో అంబులెన్స్ సకాలంలో ఆస్పత్రికి చేరడం,రోగికి చికిత్స అందడంపై అపర్ణా లవకుమార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.అపర్ణా మానవత్వం చూపించిన ఘటనలో కోకొల్లలు. 2019లో త్రిసూర్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండగా ఐదోతరగతి చదువుతున్న చిన్నారి బాధడను చూడలేక ఆమె తన జుట్టును పూర్తిగా తీసేసి కేన్సర్ పేషెంట్ల కోసం దానం చేశారు. పోలీస్ శాఖ నియమాల ప్రకారం జుట్టు పూర్తిగా తీసేసుకోవడానికి అనుమతి అవసరం. ఆమె నిర్ణయాన్ని త్రిసూర్ రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ స్వాగతించారు.2008లో ఓ మృతదేహాన్ని విడుదల చేయించేందుకు ఆసుపత్రి బిల్లులు చెల్లించేందుకు తన బంగారు గాజులను ఇచ్చారు. ఇలా విధులు నిర్వహిస్తున్న అపర్ణా లవకుమార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Big Salute to #Kerala police woman ASI Aparna Lavakumar. In Thrissur, she ran ahead of a stalled ambulance in heavy traffic, personally urging vehicles aside so that the emergency vehicle with the patient could proceed safely. Aparna was previously praised for pawning her gold… https://t.co/RoUqXSzwAv pic.twitter.com/mip2MMLO7k— Ashish (@KP_Aashish) August 11, 2025 -
షాకింగ్ ప్రమాదం: తృటిలో తప్పిన ప్రాణాపాయం వీడియో వైరల్
స్కూటీపై వెళుతున్న మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో ఆమె స్కూటర్‌పై వెళుతోంది. ఇంతలో అకస్మాత్తుగా అడవి పందుల గుంపు ఒకటి రోడ్డు మీదకి వచ్చింది. ఈ పరిణామాన్ని ఊహించని ఆమె వాటిని ఢీకొట్టింది. అంతే.. స్కూటర్ అదుపు తప్పి ఆమెఎగిరి పల్టీలు కొట్టింది. . స్థానికులు ఆమెను గుర్తించి, ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. తిరువనంతపురంలోని పలోడ్ పెరింగల రోడ్డుపై ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలు పెరింగమ్మలకు చెందిన నిసాగా గుర్తించారు. ఇంటికి తిరిగి వెళుతుండగా ఆగస్టు 8 వ తేదీ మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఆమెను చికిత్స కోసం మెడికల్ కాలేజీకి తరలించారు. రాత్రిపూట అడవి పందుల దాడులు సర్వసాధారణం అయినప్పటికీ, పగటిపూట ఇటువంటి సంఘటనలు చాలా అరుదు అని స్థానికులు వ్యాఖ్యానించారుतिरुवनंतपुरम में जंगली सूअरों से टकराकर एक महिला का गंभीर एक्सीडेंट हुआ. महिला स्कूटी से जा रही थी, तभी सड़क पार कर रहे सूअर अचानक आ गए और महिला गिर पड़ी. स्थानीय लोगों ने उसे अस्पताल पहुंचाया, जहां उसकी हालत गंभीर बनी हुई है.#kerala #tiruvananthapuram #accident #pigs #viral… pic.twitter.com/ukS6OrM4ec— ABP News (@ABPNews) August 10, 2025 -
Nimisha Priya Case: ‘నిమిషకు వెంటనే శిక్ష అమలుపరచండి’
కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. వారానికో మలుపు తిరుగుతోంది. మరణ శిక్ష అమలుకు ఒక్కరోజు ముందు.. అంటే జులై 15న వాయిదా పడ్డట్లు యెమెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిమిష తల్లి విజ్ఞప్తి, మతపెద్దల జోక్యంతో శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఉత్తర్వులు వెలువరించారు. అయితే..అప్పటి నుంచి బాధిత కుటుంబంతో నిమిష తల్లి, మధ్యవర్తులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. బ్లడ్ మనీ ప్రైవేట్ వ్యవహారం కావడంతో భారత విదేశాంగ శాఖ దూరంగా ఉంటోంది. దీంతో నిమిష ప్రియ కేసులో చర్చలు ఎలా కొనసాగుతున్నాయో అనే గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహ్దీ హతమార్చిన కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. అయితే నిమిషకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని అతని సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహ్దీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు యెమెన్ డిప్యూటీ జనరల్‌ను కలిసి మరణశిక్ష తేదీ అమలుకు తేదీని ఖరారు చేయాలని కోరారు. అదే సమయంలో ఆ దేశ అటార్నీ జనరల్‌కు శిక్షను త్వరగతిన అమలు చేయాలంటూ శుక్రవారం ఓ లేఖ రాశాడు.‘‘మా కుటుంబం అంతా కోరుకునేది ఒక్కటే. ఆమె చేసింది క్రూరమైన నేరానికి పాల్పడింది. ఆ నేరానికి క్షమాపణ ఉండదు.. ఉండబోదు. ఆమెకు తక్షణమే శిక్ష అమలు కావాలి. ఇంక ఆలస్యం చేయకుండా న్యాయం అందించాలి’’ అని ఫేస్‌బుక్‌లోనూ ఫతాహ్ ఓ పోస్ట్ చేశాడు. అయితే ఫతాహ్ ఇలా డిమాండ్ చేయడం ఇదే తొలిసారేం కాదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాస్తవానికి నిమిషకు మరణశిక్ష జూన్ 7వ తేదీనే అమలు కావాల్సి ఉందని, అయితే దానిని జులై 16వ తేదీకి ాయిదా వేశారు. అప్పట ఇనుంచి అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచారని ఫతాహ్ ఆరోపిస్తున్నాడు. నిమిషకు మరణశిక్షలో జాప్యం చేయొద్దని జులై 25న, ఆగస్టు 4వ తేదీల్లో అక్కడి అదికారులకు లేఖ రాశాడు. మరోవైపు.. కేరళ మతపెద్ద, భారత గ్రాండ్ ముఫ్తా కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ చేస్తున్న వరుస ప్రకటనలనూ అబ్దుల్ ఫతాహ్ ఖండించాడు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. ఇది ఆ మత పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి. నిమిషకు శిక్ష పడితేనే మా కుటుంబానికి న్యాయం దక్కేది’’ అని అంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ మరణశిక్ష తన దౌత్యం వల్లే వాయిదా పడిందని కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ తాజాగా ప్రకటించారు. అలాగే.. ఈ వ్యవహారంలో కొందరు ఆ ఘనతేనని ప్రకటించుకున్నారని, అవసరమైతే ఆ క్రెడిట్ వాళ్లకే కట్టబెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు. మరోవైపు.. నిమిష ప్రియ వ్యవహారంలో భారత ప్రభుత్వం తాము చేయగలిగినదంతా చేశామంటూ ఇదివరకే ప్రకటించింది. అయితే శిక్ష వాయిదా ప్రకటనను అధికారికంగా ధృవీకరించిన విదేశాంగ శాఖ.. ఏదైనా పురోగతి కనిపిస్తే అధికారికంగా తామే ప్రకటిస్తామని, అప్పటిదాకా వదంతులను నమ్మొద్దంటూ స్పష్టం చేస్తూ వస్తోంది. -
మాజీ సీఎస్కే ఆటగాడి కోసం సంజూ శాంసన్‌పై వేటు..!
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో అతను జట్టు మారతాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. సీఎస్కే సంజూను ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేస్తుందని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.ఈ ప్రచారాల నడుమ సంజూకు సంబంధించిన మరో వార్త ట్రెండింగ్‌లోకి వచ్చింది. సీఎస్కేకు చెందిన మాజీ ఆటగాడు ఎన్ జగదీసన్ కోసం సంజూను దులీప్ ట్రోఫీ (సౌత్ జోన్ జట్టు) కోసం ఎంపిక చేయలేదని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సౌత్ జోన్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ తైలవన్ సర్గునమ్ జేవియర్ పరోక్షంగా అంగీకరించారు.దులీప్ ట్రోఫీ కోసం సంజూను ఎంపిక చేయకపోవడానికి గత సీజన్లో అతని గైర్హాజరీ ప్రధాన కారణమని ఆయన చెప్పారు. జట్టు ఎంపిక ఆటగాళ్ల గత సీజన్ ప్రదర్శన ఆధారంగా జరిగిందని తెలిపారు. సంజూతో పోలిస్తే జగదీసన్ గత సీజన్లో ఓ మోస్తరు మ్యాచ్‌లు ఆడాడు. అందులోనూ అతను పర్వాలేదనిపించాడు. అందుకే సంజూను కాకుండా అతన్ని ప్రిఫర్ చేశామని వివరణ ఇచ్చారు.కాగా, గత సీజన్ విజయ్ హజారే ట్రోఫీ నుంచి తప్పుకున్న తర్వాత సంజూను (కేరళ) వరుసగా రెండో దేశవాలీ టోర్నీ కోసం ఎంపిక చేయలేదు. దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టులో ఏకంగా ఐదుగురు కేరళ ఆటగాళ్లను ఎంపిక చేసినా సంజూపై మాత్రం వేటు వేశారు. ప్రస్తుతం సంజూ గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసే భారత టీ20 జట్టులో కూడా అతని స్థానం ప్రశ్నార్థకంగా మారింది. సంజూ దేశవాలీ క్రికెట్‌కు అందుబాటులో ఉండకపోవడాన్ని భారత సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని కారణంగా చూపి సంజూను జాతీయ జట్టు నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదు.ఇదిలా ఉంటే, సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కేరళకు చెందిన మొహమ్మద్ అజహారుద్దీన్ వ్యవహరించనున్నాడు.సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2025 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్) (హైదరాబాద్), మహ్మద్ అజహారుద్దీన్ (వైస్ కెప్టెన్) (కేరళ), తన్మయ్ అగర్వాల్ (హైదరాబాద్), దేవదత్ పడిక్కల్ (కర్ణాటక), మోహిత్ కాలే (పాండిచ్చేరి), సల్మాన్ నిజర్ (కేరళ), నారాయణ్ జగదీసన్ (తమిళనాడు), త్రిపురణ విజయ్ (ఆంధ్ర), ఆర్ సాయి కిషోర్ (తమిళనాడు), తనయ్ త్యాగరాజన్ (హైదరాబాద్), విజయ్‌కుమార్ వైషాక్ (కర్ణాటక), నిధీష్ ఎండి (కేరళ), రికీ భుయ్ (ఆంధ్ర), బాసిల్ ఎన్‌పి (కేరళ), గుర్జప్నీత్ సింగ్ (తమిళనాడు), స్నేహల్ కౌతాంకర్ (గోవా)స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), ఆర్ స్మరణ్ (కర్ణాటక), అంకిత్ శర్మ (పాండిచ్చేరి), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), షేక్ రషీద్ (ఆంధ్ర). -
అమ్మే... క్లాస్మేట్
ఈ రెండు ఫొటోలు చూడండి. ఇక్కడ ఉన్నది 40 ఏళ్ల తల్లి.. 17 సంవత్సరాల కుమారుడు. ఇద్దరూ ఒకేసారి సేమ్ కాలేజీలో డిగ్రీ కోర్సు చేరారు. వేరే వేరే గ్రూపులే. కాని లాంగ్వేజ్ క్లాసుల్లో కలిసి కూచుంటారు. తల్లీ కొడుకు ఒకే కాలేజీలో ఒకే క్లాసులో కలిసి చదువుకుంటూ ఉంటే చదువుకునే వారికి అడ్డు లేదనిపిస్తుంది. అక్షరాస్యత మెండుగా ఉన్న కేరళలోది ఈ దృశ్యం.ఎర్నాకుళం నుంచి గంటన్నర దూరంలో ఉండే చిన్న ఊరు సత్యమంగళం. అక్కడే ఉంది ఎం.ఏ. డిగ్రీ కాలేజీ. రోజూ ఉదయాన్నే ఆ కాలేజీకి ఈ సంవత్సరం ఒక స్కూటీ వస్తోంది. ముందు తల్లి కూచుని నడుపుతూ ఉంటుంది. వెనుక కొడుకు కూచుని ఆమెతో పాటు వస్తారు. చూసేవారు కొడుకును కాలేజీలో దించి ఆమె వెళ్లిపోతుందని అనుకుంటారు. తప్పు. ఆమె స్కూటీని పార్క్ చేసి చక్కా ఒక క్లాస్‌లోకి వెళుతుంది. కొడుకు మరో క్లాస్‌లోకి వెళతారు. అందాక వాళ్లు తల్లీకొడుకులు. కాలేజీలో అడుగు పెట్టాక డిగ్రీ విద్యార్థులు. చాలా అరుదుగా కనిపించే ఈ దృశ్యం ఎందరికో ముచ్చట గొలుపుతోంది. చదువు మధ్యలో ఆపిన తల్లులు తమ పిల్లలతో పాటు కాలేజీ చదువు కొనసాగిస్తే ఎంతో బాగుంటుంది కదా.తల్లి బి.ఏ.. కొడుకు బి.కామ్40 ఏళ్ల మాధురి ఈ సంవత్సరం ఎం.ఏ కాలేజీలో బి.ఏలో చేరింది. ఆమె కొడుకు వైష్ణవ్ బీకాంలో చేరాడు. ఇద్దరివీ వేరే వేరే గ్రూప్‌లైనా లాంగ్వేజ్ క్లాసులు కామన్‌గా వినాలి. అప్పుడు పక్కపక్కన కూచుని హాయిగా క్లాసులు వింటారు. మధ్యాహ్నం ఇద్దరూ కలిసి భోజనం చేసి మళ్లీ క్లాసులకు చలో. కాలేజీ పూర్తయ్యాక స్కూటీ మీద ఆమె కొడుకును వెంటబెట్టుకుని ఇల్లు చేరుకుంటుంది.మలయాళ సాహిత్యం అంటే ఆసక్తి ఉన్న మాధురి బి.ఏ ఇంగ్లిష్‌లో చేరడం ఇష్టమే అంటోంది. మంచి ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన వైష్ణవ్ స్పోర్ట్స్ కోటాలో బి.కామ్. సీటు సాధించాడు. ఇప్పుడు తల్లి తనతో పాటు కాలేజీకి రావడంతో సంతోషంగా ఉన్నాడు. ‘మీ ఫ్రెండ్స్ ఏమైనా ఎగతాళి చేస్తున్నారా మీ అమ్మను చూసి’ అనంటే ‘ఎగతాళి ఎందుకు... ఇందులో వాళ్లు ఎగతాళి చేయడానికి ఏమీ లేదు... నేను ఇబ్బంది పడే విషయం అంతకన్నా లేదు. ఆమె చదువుకోవడానికి కాలేజీకి వచ్చింది’ అంటాడు వైష్ణవ్.ఎన్నో ఏళ్ల కలమాధురికి డిగ్రీ చదవాలని ఎప్పటి నుంచో ఉంది. కాని ఇంటర్ కావడంతోటే పెళ్లి... వెంట వెంటనే ఇద్దరు పిల్లలు.. సంసారంలో పడి కుదరలేదు. కాని బస్ కండక్టర్‌గా పని చేసే ఆమె భర్త బిను భార్య కోరికను గౌరవించాడు. చదువుకోమని చాలాసార్లు కోరాడు. ఇన్నాళ్లకు మాధురికి కుదిరి బి.ఏ.లో చేరింది. ‘క్లాసులో ఉన్న విద్యార్థులు నా వయసు కాకపోయినా వెంటనే స్నేహం చేశారు. వారితో కలగలిసి పోవడం నాకు ఇబ్బంది కాలేదు’ అంది మాధురి.ఇలా తల్లీకొడుకు చదువుకోవడం పట్ల కాలేజీ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ కూడా సంతోషంగా ఉన్నారు. ‘ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు ఉంది. మనం అవకాశం కల్పించాలి’ అన్నాడా కాలేజీ ప్రిన్సిపాల్. మాధురిలా చదువుకోవాలని ఉన్న గృహిణులు ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది. ప్రయత్నించాలి అంతే. -
‘రెండు రూపాయల డాక్టర్’ ఇకలేరు
తిరువనంతపురం: పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నిస్వార్ధ సేవకుడు. డాక్టర్ ఏకే రైరూ గోపాల్ అలియాస్ ‘రెండు రూపాయల డాక్టర్’ ఆదివారం (ఆగస్టు 3న) కన్నుమూశారు. ఉత్తర కేరళలోని కన్నూర్‌లో వేలాది మంది జీవితాల్లో నిస్వార్థ సేవ చేసిన డాక్టర్ గోపాల్ పేదలు,అణగారిన ప్రజలకు దశాబ్దాలుగా(ఒక దశాబ్ధం అంటే 10ఏళ్లు) రెండు రూపాయిలకే వైద్యం అందించారు.డాక్టర్ ఏకే రైరూ గోపాల్ 50 ఏళ్ల పాటు అతి తక్కువకే రూ.2కే వైద్యం చేసేవారు. అందుకే ఆయనను అందరూ ‘రెండు రూపాయల డాక్టర్..రెండు రూపాయల డాక్టర్’ అని పిలుస్తుంటారు. ఇతర డాక్టర్లు ఒక్క ఓపీకి వందల్లో ఛార్జ్ చేస్తుంటే డాక్టర్ గోపాల్ మాత్రం పేషెంట్ స్థోమతను బట్టి రూ.40, రూ.50 మాత్రమే తీసుకునేవారు.అలా వైద్యం ఖరీదైన తరుణంలో డాక్టర్ గోపాల్ మాత్రం వైద్యంలో దాతృత్వం, నీతికి చిహ్నంగా నిలిచారు. వైద్యుడిగా సేవలందిస్తుండగా.. ఓ రోగి దారుణమైన పరిస్థితిని చూసి చలించిపోయారు. అలా ఆయన ప్రయాణం స్వచ్ఛంద సేవతో ప్రారంభమైంది. నాటి నుంచి ముఖ్యంగా రోజూవారి దినసరి కూలీలు, విద్యార్థులకు, పేదలకు అందుబాటులో సరసమైన వైద్యాన్ని అందించేందుకు తనని తాను అంకితం చేసుకున్నారు.విధులు నిర్వహించే సమయంలో తన మిత్రులు, కుటుంబ సభ్యులు,ఇంకెవరైనా తనని కలిసేందుకు వస్తే రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. తన ఇంటి గేటుకు ఓ బోర్డు తగిలలించారు. ఆ బోర్డులో రోగులకు చికిత్స చేసే సమయంలో తనకోసం ఎవరూ రావొచద్దు. ఒక వేళ రావాలని ప్రయత్నం చేస్తారేమో.. రావద్దు. చిరునవ్వుతో తిరిగి వెనక్కి వెళ్లిపోండి అని రాసి ఉంచారు. అంతలా తన వైద్య సేవల్ని అందించడంలో నిమగ్నమయ్యేవారు.ఆయన ఎందుకంత ప్రత్యేకం50 సంవత్సరాలకు పైగా వైద్య రంగంలో సేవ చేసిన ఆయన రూ.2 రూపాయలకే వైద్యం పొందేలా అవకాశం కల్పించారు. దినసరి కూలీలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజూ అర్ధరాత్రి 2:15 నుండే రోగుల కోసం వైద్య సేవలు ప్రారంభించి.. ఇలా ప్రతి రోజు 300-400 మంది వరకు రోగులకు చికిత్స అందించేవారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే మందులే సూచించేవారు. గోపాల్‌కు తోడుగా ఆయన సతీమణి డాక్టర్ శకుంతల, సహాయకులు మందులు పంపిణీ చేయడంలో సహాయపడేవారు.డాక్టర్ గోపాల్ చేసిన సేవలకు గానుడాక్టర్ గోపాల్ చేసిన సేవలకు గాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నుండి కేరళలో ఉత్తమ ఫ్యామిలీ డాక్టర్ అవార్డు పొందారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన సేవలను ప్రశంసిస్తూ “ప్రజల డాక్టర్” అని అభివర్ణించారు. ఆయన దగ్గరకు వెళ్లడం అంటే మందు (మెడిసిన్) కోసం కాదు, ప్రేమ కోసం అని స్థానికులు చెబుతుండగా..‘ఆయనను కలిస్తే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇట్టే తగ్గిపోతుందనేది రోగుల నమ్మకం. డాక్టర్ గోపాల్ తదనంతరంతో ఆయన సోదరులు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రాజగోపాల్‌లు వైద్య సేవల్ని కొనసాగించనున్నారు. Dr. #RairuGopal, a dedicated doctor, succumbed to age-related health issues today. For over 50 years, he selflessly served the community at Lakshmi Home Clinic, providing medical care to the poor at a nominal fee of Rs 2 per consultation. His daily routine involved treating… pic.twitter.com/qjA61cubat— Harish M (@chnmharish) August 3, 2025 -
నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
యెమెన్‌లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో భారత ప్రభుత్వ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి అక్కడికి వెళ్లకుండా రెడ్ సిగ్నల్ వేసింది. నిమిషను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ వెనకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ(MEA) అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది.సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.‘‘సనాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే యెమెన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్‌కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మరింత ప్రమాదకరం. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేం’’ అని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే తాము చేయాల్సిందంతా చేశామని, మిగిలిన మార్గం బ్లడ్ మనీనే అని, అయితే అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలోనే చెప్పింది. ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే యెమెన్ బాధిత కుటుంబంతో బ్లడ్‌మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది. తాజాగా.. శుక్రవారం విదేశాంగ శాఖ ‘యెమెన్‌కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్‌లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.కేరళకు చెందిన నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. 2020లో అక్కడి ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జులై 16వ తేదీ మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు(జులై 15వ తేదీ) మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి తలాబ్ కుటుంబంతో బ్లడ్ మనీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యలో కేరళ కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ శిక్ష రద్దైందని ఓ ప్రకటన చేసినప్పటికీ.. అందులో వాస్తవం లేదని కేంద్రం తర్వాత మరో ప్రకటన చేసింది. బ్లడ్‌మనీ అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది. -
విద్యార్ధుల వేసవి సెలవులు రద్దు?
వేసవి సమయంలో తీవ్రమైన ఎండల వేడి తరచుగా రోజువారీ కార్యకలాపాలకు అసౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులను ఇబ్బందుల పాటు చేస్తుంది. ఎండలు మండే వేళ, వడదెబ్బల వంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా భావితరాన్ని రక్షించడానికి పుట్టుకొచ్చాయి సమ్మర్ హాలిడేస్. దశబ్ధాల తరబడి కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పుడు మొదటి సారి చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా వర్షాకాలం సైతం తన తఢాఖా చూపిస్తోంది. అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు ఒక్క రోజులోనే దేశంలోని అనేక పెద్ద పెద్ద నగరాలను అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి సమయంలో తరచుగా పాఠశాలలకు కూడా సెలవులు (Holidays) ప్రకటించడం జరుగుతోంది.నిజానికి కొందరు విద్యార్ధులైనా ఎండల నుంచి ఎసి బస్సులు, పాఠశాలల్లో ఎసిల ద్వారా అన్నా తప్పించుకోవచ్చునేమో కానీ నగరాల్లో ట్రాఫిక్, పొంగిపొర్లే నాలాలు, డ్రైనేజీలు తదితర పరిస్థతుల దృష్ట్యా చూస్తే తీవ్రమైన వర్షాల నుంచి తప్పించుకోవడానికి స్కూల్‌కి డుమ్మా తప్ప వేరే మార్గమే లేదు. ఈ నేపధ్యంలో అసలు వేసవి సెలవుల్ని వర్షాకాలం సెలవులుగా మారిస్తే ఎలా ఉంటుంది? అంటూ ఒక కొత్త చర్చ దేశంలో మొదలైంది. ఈ చర్చకు శ్రీకారం చుట్టింది రుతుపవనాలను ఎదురేగి ఆహ్వానించే తొలి రాష్టమైన కేరళ (Kerala). తమ రాష్ట్రంలోని వేసవి సెలవులను ఏప్రిల్ మే నెల నుంచి జూన్, జూలై వర్షాకాల నెలలకు మార్చాలా? అనే చర్చ ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది.నైరుతి రుతుపవనాల ప్రారంభంతో పాటే జూన్ లో పాఠశాలలు తిరిగి తెరవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది, అయితే భారీ వర్షపాతం వాతావరణ సంబంధిత హెచ్చరికల కారణంగా తరచుగా పాఠశాల తరగతులకు అంతరాయం కలుగుతోంది. తరచుగా తలెత్తుతున్న ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, కేరళ ప్రభుత్వం గరిష్ట రుతుపవన కాలంలో సెలవులను తిరిగి షెడ్యూల్ చేసే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ఈ విషయంపై చర్చోపచర్చల్లో భాగంగా కొందరు ప్రత్యామ్నాయంగా మే–జూన్ నెలను కూడా సూచించారట. అయితే ‘‘ఈ మార్పు వల్ల లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? ఇది విద్యార్థుల అభ్యాసం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఆచరణాత్మకంగా ఉంటుందా? మనం ఇతర భారతీయ రాష్ట్రాలు లేదా దేశాల నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్చుకోగలమా?’ అంటూ కేరళ మంత్రి శివన్ కుట్టి (Sivankutty) అడిగారు, దీనిపై ఆయన ప్రజల నుంచి సూచనలను కూడా ఆహ్వానిస్తున్నారు.ఈ విషయంపై నిర్మాణాత్మక సంభాషణకు ఈ చొరవ మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ,కేరళ విద్యాశాఖా మంత్రి తన పోస్ట్‌లోని కామెంట్స్ విభాగంలో ప్రజలు తమ అభిప్రాయాలను సిఫార్సులను పంచుకోవాలని కోరుతున్నారు. ఈ నేపధ్యంలో కేరళలో దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. వర్షాల కారణంగా విలువైన విద్యా సంవత్సరంలో అనేక రోజులు స్కూల్స్ మూతబడుతున్న పరిస్థితిలో ఇది చర్చనీయాంశమేనని అనేకమంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఆన్ మనోరమ అనే స్థానిక మీడియా సంస్థ నిర్వహించిన పోల్‌లో 42 శాతం మంది జూన్–జులై మధ్య సెలవుల మార్పుకు అనుకూలంగా స్పందించగా 30.6 మంది మాత్రం ఏప్రిల్–మే అనే పాత విధానాన్ని యథాతధంగా కొనసాగించాలని కోరారు. అలాగే 27.52 శాతం మంది మే నుంచి జూన్ వరకూ సెలవుల్ని సవరించాలని సూచించారు.చదవండి: బుడ్డోడి ఫైరింగ్ స్టంట్‌కి షాకవ్వాల్సిందే! -
అలాంటి సినిమాకు జాతీయ అవార్డా..? ముఖ్యమంత్రి ఫైర్!
‘ది కేరళ స్టోరీ’ సినిమాకు రెండు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, సినిమాటోగ్రఫీ) అవార్డులు వచ్చాయి. అయితే ఈ సినిమాకు అవార్డులు రావడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపట్టారు. ‘‘మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా తీసిన సినిమాకు గౌరవాన్ని కల్పించడం అనేది సంఘ్‌పరివార్ విభజనాత్మక సిద్ధాంతాలను పరోక్షంగా అవార్డు జ్యూరీ కమిటీ సమర్థించినట్లే. అలాగే మత సామరస్యానికి చిరునామా అయిన కేరళను అవమానించినట్లే. ఇది కేవలం మలయాళీలను మాత్రమే కాదు... ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ బాధించే అంశం. రాజ్యాంగ విలువలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ స్వరం విప్పాలి’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు విజయన్ .By honouring a film that spreads blatant misinformation with the clear intent of tarnishing Kerala’s image and sowing seeds of communal hatred, the jury of the #NationalFilmAwards has lent legitimacy to a narrative rooted in the divisive ideology of the Sangh Parivar. Kerala, a…— Pinarayi Vijayan (@pinarayivijayan) August 1, 2025 -
నిమిష ప్రియ మరణశిక్ష రద్దు కాలేదు: కేంద్రం
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో మరణశిక్ష రద్దు అయ్యిందన్న కథనాలను కేంద్ర విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆమె మరణశిక్ష రద్దు వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. తన సహచర భాగస్వామిని హత్య చేసిన అభియోగాల మీద ఆమెకు ఈ శిక్ష పడిన సంగతి తెలిసిందే.కేరళకు చెందిన ప్రముఖ మత గురువు, సున్నీ నేత కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాయలం నుంచి ఆమెకు మరణశిక్ష తప్పిందనే ప్రకటన వెలువడింది. యెమెన్ రాజధాని సనాలోని ఓ జైలులో ఖైదీకి ఉన్న నిమిషకు.. హౌతీ మిలిటరీ ప్రభుత్వం నుంచి ఊరట లభించిందని తెలిపింది. అయితే ఆ ప్రకటనపై ఎలాంటి అధికారిక సమాచారం లేదంటూ కేంద్రం కాసేపటి కిందట స్పష్టత ఇచ్చింది. నిమిష ప్రియ కేసులో వ్యక్తిగతంగా చేసే ప్రకటనలతో సంబంధం లేదని.. అక్కడి అధికారులు ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలతో ప్రముఖ వెబ్సైట్ హిందూ ఓ కథనం ఇచ్చింది.#Government denies claim of #NimishaPriya's #deathpenalty being revoked: Sources https://t.co/sNMZ3AhC9S #WeRIndia pic.twitter.com/PszX95Kbz1— Werindia (@werindia) July 29, 2025సనాలో అత్యున్నత సమావేశం తర్వాత.. సోమవారం అర్ధరాత్రి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం మరణశిక్ష రద్దు అంటూ ప్రకటన చేసింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు.అబుబాకర్ ప్రకటనను యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధ్రువీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ కేంద్రం ఇప్పుడు ఆ ప్రకటనను తోసిపుచ్చడం గమనార్హం. మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరమే స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్ పలుమార్లు కోరడంతో జులై 16న అమలు కావాల్సిన మరణశిక్షను వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను ఫలించి.. మరణశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. -
‘దయ చూపండి.. మా అమ్మ ఉరిశిక్షను ఆపండి’
యెమెన్ దేశంలో ఓ హత్య కేసులో ఇరుక్కుని జీవన్మరణ పోరాటం చేస్తున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు కుటుంబ సభ్యులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజులు క్రితం ఆమెకు పడాల్సిన ఉరిశిక్ష చివరి నిమిషంలో రద్దు కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు నిమిష. బ్లడ్‌మనీ(క్షమాధనం లేక నష్టపరిహారం) ఇచ్చేందుకు కూడా సిద్ధమైన తరుణంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. అయితే బాధిత తలాల్ అబ్దో మెహదీ కుటుంబం మాత్రం తమకు బ్లడ్‌మనీ వద్దని ఇప్పటికే తెగేసి చెప్పింది. ఆమెకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దాంతో నిమిష ఉరిశిక్ష రద్దు అనేది పక్కకు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా నిమిష కూతరు 13 ఏళ్ల మిషెల్ తన తల్లియందు దయ చూపించాలని యెమెన్ అధికారుల్ని వేడుకోంటుంది. ఈ మేరకు మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో తల్లిని రక్షించాలంటూ ప్రాధేయపడుతోంది. ‘ఐ లవ్ యూ మమ్మీ. ఐ మిస్ యూ. మా అమ్మను తిరిగి వెనక్కి పంపడానికి సాయం చేయండి. మా అమ్మ పట్ల దయ చూపండి. తలాల్ కుటుంబానికి థాంక్స్ చెప్పేందుకు మిషెల్ ఇక్కడ ఉంది. మీరు మా అమ్మపై కరుణ చూపి అక్కడ నుంచి విడుదలకు మార్గం చూపండి. రేపు, రేపు మరుసటి రోజు మీ పట్ల మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని వేడుకుంటోంది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌తో కలిసి నిమిష ప్రియ కుటుంబ సభ్యులు యెమెన్‌లో తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే కేఎ పాల్‌తో కలిసి నిమిష కూతురు మిషెల్ మీడియాతో మాట్లాడింది. -
మహిళల శబరిమల గురించి తెలుసా? పురుషులకు నో ఎంట్రీ
Sabarimala of Women" మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతారని తెలుసు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో మహిళల కోసం ఏకంగా ఒక ఆలయమే ఉంది. పురాతన కథలు, మత సంప్రదాయాలకు ప్రసిద్ధిగాంచిన అట్టుకల్ భగవతి ఆలయం అది. భద్రకాళి దేవికి అంకిత మిచ్చిన ఈ ఆలయంలోని దేవేరిని అట్టుక్కల్ అమ్మగా పిలుస్తారు. ఆమె ఎంతటి రక్షకురాలో అంతటి విధ్వంసకురాలిగా భక్తులు భావిస్తారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో స్త్రీలకు మాత్రమే ప్రవేశం. అందుకే ఈ ఆలయాన్ని ‘మహిళల శబరిమల’గా పిలుస్తారు. ఏటా పది రోజులపాటు నిర్వహించే అట్టుకల్ పొంగళ (Attukal Pongala) ఉత్సవంలో ఆడవాళ్లు మాత్రమే పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో పురుషులను ఆలయ దరిదాపులకు కూడా రానివ్వరు.ఆలయ చరిత్రఒకానొక సాయంత్రం ఓ వ్యక్తి కిల్లియర్ నదిలో స్నానం చేస్తుండగా, ఒక బాలిక వచ్చి నది దాటడానికి సహాయం చేయాలని అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆమె ప్రవర్తనకు ముగ్ధుడైన ఆ వ్యక్తి బాలికను ఇంటికి ఆహ్వానించాడు. కుటుంబసభ్యులంతా చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది. అదే రాత్రి ఆ వ్యక్తికి కలలో ఆమె దేవత రూపంలో కనిపించింది. సమీపంలోని అడవిలో మూడు గీతలు గీసిన చోట తన కోసం గుడి కట్టించాలని ఆదేశించింది. మర్నాడు ఆ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లి మూడు గీతలను చూశాడు. వెంటనే ఆ స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అది పూర్తయ్యాక నాలుగు చేతులున్న దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా అట్టుక్కల్ భగవతి ఆలయం వెలుగు చూసింది.ఆలయ నిర్మాణంకేరళ, తమిళనాడు రాష్ట్రాల శిల్పులు గుడి గోపురాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ గోడలు, ప్రధాన ద్వారంపై∙మహిషాసురమర్దిని, కాళి, రాజరాజేశ్వరి, శివపార్వతుల దేవతా రూపాలను చక్కగా చెక్కారు. ఇంకా విష్ణుమూర్తి దశావతారాల కథలు కూడా తోరణంపై కనిపిస్తాయి. దక్షిణ గోపురంపై దక్షయజ్ఞం కథను చిత్రీకరించారు. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, శివుడు, నాగ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయం లోపల రెండు దేవతా విగ్రహాలు ఉంటాయి. ఒకటి ఆభరణాలతో అలంకరించిన అసలు విగ్రహం, దాని వెనుక మరో విగ్రహం ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించగానే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కణ్ణగిని అమ్మవారి అవతారంగా భావించి మహిళలు అత్యంత భక్తితో పూజిస్తారు.అట్టుక్కల్ పొంగళఏటా మార్చి నెలలో పది రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆలయంలో జరిగే అతి పెద్ద పండుగ. దీన్ని అట్టుకల్ పొంగళ అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది మహిళలు ఇక్కడికొస్తారు. స్త్రీ దైవత్వాన్ని గౌరవించడానికి మగువలకు మాత్రమే ఆలయ ప్రవేశం కల్పిస్తారు. అంతేతప్ప పురుషుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదు. ఆచార వ్యవహారాల్లో కేవలం మహిళల భాగస్వామ్యం కోసం మాత్రమేనని చెబుతారు. పేద, ధనిక, వివాహితులు, వితంతువులు అనే తేడా లేకుండా మహిళలందరూ బియ్యం, బెల్లం, కొబ్బరి ఉపయోగించి తీపి పొంగలిని కట్టెలపొయ్యిపై కుండల్లో వండి భగవతిదేవికి నైవేద్యం సమర్పిస్తారు. మహిళా శక్తిని ప్రదర్శించడానికి వనితలు దీన్ని వేదికగా మలచుకుంటారు. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేసిన పోరాటానికి ప్రతీక ఈ వేడుక అని పురాణ గా«థ ఒకటుంది. 2009లో గిన్నిస్ రికార్డుల్లోకి సయితం ఎక్కింది. ఒకే రోజు 25 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొన్న మతపరమైన సమావేశంగా గిన్నిస్ బుక్ గుర్తించడం విశేషం. ఈ వేడుకకు కేరళ రాష్ట్ర ఆర్టీసీ, భారతీయ రైల్వే ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాయి.ఇదీ చదవండి: Ananya Reddy తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, మార్క్ షీట్ వైరల్ఎలా చేరుకోవాలి?తిరువనంతపురం విమానాశ్రయం నుంచి ఆలయం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గంలో వస్తే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గుడి ఉంటుంది. ఇంకా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గుడికి చేరుకోవచ్చు. స్థానికంగా ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఉదయం 4–30 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8–30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. -చెన్నాప్రగడ శర్మ -
నిలిచాడు.. ఎదిరించాడు.. గెలిచాడు
తేదీ: జూలై ఐదు, 2025..స్థలం: కేరళలోని పన్నియాంకర టోల్ ప్లాజా!ఒక్కటొక్కటిగా కార్లు బారులు తీరుతున్నాయి!నిమిషాలు గడుస్తున్నాయి కానీ..ఒక టోల్బూత్లో వాహనాలు ఎంతకీ ముందుకు కదలడం లేదు!హారన్లు మోగుతున్నాయి... అరుపులు వినిపిస్తున్నాయి.. ఇక లాభం లేదనుకుని కొన్ని వాహనాలు పక్క బూత్‌లకు మళ్లుతున్నాయి.అంతటి హడావుడిలోనూ షెంటో వి.ఆంటో మాత్రం చాలా కూల్‌గా ఉన్నాడు!ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయిన బూత్‌లో అందరికంటే ముందు ఉన్నది అతడే. కేరళ సినిమా రంగంలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న సినిమాటోగ్రఫర్ ఈ కుర్రాడు. పని కోసం పాలక్కాడ్, ఎర్నాకులం, త్రిశూర్ ప్రాంతాల్లో రోజూ తిరుగుతూంటాడు. రోజులాగే జూలై ఐదున అతడు పన్నియాంకర టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని నిలిపేశాడు.. టోల్ కట్టమని బూత్‌లోని ఉద్యోగి అడుగుతూనే ఉన్నాడు కానీ షెంటో మాత్రం ససేమిరా అంటున్నాడు. డబ్బుల్లేక కాదు. ‘‘నేనిప్పటివరకూ ప్రయాణించిన టోల్ రోడ్డు ఏం బాగాలేదు. అన్నీ బాగా ఉంటేనే కదా నేను ఆ రోడ్డును వాడుకున్నందుకు టోల్ కట్టాలి. బాగాలేదు కాబట్టి కట్టను’’ అని భీష్మించుకున్నాడు. ఉద్యోగి సూపర్వైజర్లు వచ్చినా షెంటో మాత్రం తన పంథా మార్చుకోలేదు. ఏమాత్రం తొణకకుండా, బెణకక్కుండా తన వైఖరిని విస్పష్టంగా చెబుతూనే ఉన్నాడు. ఎక్కడా మాట తూలింది లేదు. గట్టిగా అరిచిందీ లేదు. అంతేకాదు.. గుంతలు పడ్డ ఇలాంటి రహదారుల్లో తాను గర్భవతి అయిన తన చెల్లెల్ని తీసుకెళ్లానని, ఆమెకేమైనా అయిఉంటే బాధ్యత ఎవరిది? అని వివరిస్తున్నాడు. ఇలా ఏమాత్రం భద్రతలేని విధంగా రోడ్లు నిర్మించినందుకు.. నిర్వహణ చేయనందుకు టోల్ ఎందుకు కట్టాలని ప్రశ్నించాడు. సమయం గడుస్తోంది... షెంటో కదలనంటున్నాడు.. టోల్‌ప్లాజా ఉద్యోగులు వదలమంటున్నారు. ఆఖరుకు టోల్ నిర్వాహకులు ఈ విషయాన్ని తమ ఉన్నతాధికారులకు తెలిపారు. ఏం చేయాలో వారికీ దిక్కుతోచలేదు. మల్లగుల్లాలు పడ్డారో.. చర్చలు జరిపారో తెలియదు కానీ.. తొమ్మిదిన్నర గంటల తరువాత... ‘‘బాబూ నువ్వు టోల్ కట్టనవసరం లేదు. వెళ్లండి’’ అని దారి ఇచ్చారు. ఓరిమికి ఉన్న బలం ఇదన్నమాట!.ఈ ఒక్క నిరసన వైరల్ అయిపోవడం పెద్ద విశేషం కాదు కానీ.. సాఫీగా ప్రయాణించలేని రోడ్లపై టోల్ ట్యాక్స్ వసూలు చేయకూడదని కేరళ హైకోర్టు స్వయంగా వ్యాఖ్యానించడం మాత్రం విశేషమే. పైగా తొమ్మిదిన్నర గంటలపాటు ఎలాంటి ఆవేశ కావేశాలకు లోను కాకుండా షెంటో తన వైఖరికి కట్టుబడి నిలిచిన తీరు అందరి మన్ననలు పొందింది. టోల్ ట్యాక్స్ వసూలు చేసే సంస్థలు కూడా కొంత రహదారులను సక్రమంగా నిర్వహిస్తే మేలేమో!. View this post on Instagram A post shared by Shento V Anto (@shento_v_anto) -
సౌమ్య కేసు: దుస్తులే తాడుగా.. జైలు గోడ దూకి పరార్.. కేరళలో హైఅలర్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌమ్య(23) హత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న గోవిందచామీ అలియాస్ ఛార్లీ థామస్ జైలు నుంచి పరారయ్యాడు. దీంతో పోలీస్ శాఖ కేరళవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి అప్రమత్తమైంది. అయితే గంటల వ్యవధిలో.. ఓ స్థానికుడి సహాయంతో పోలీసులు ఆ మానవ మృగాన్ని పట్టుకోగలిగారు.2011లో సౌమ్య అనే యువతిని రైలు నుంచి బయటకు నెట్టేసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు చార్లీ థామస్. ఈ కేసులో బాధితురాలు చికిత్స పొందుతూ నాలుగు రోజులకే కన్నుమూసింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసులో ఘటన జరిగిన మరుసటిరోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కన్నూరు జైలులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న చార్లీ.. గత అర్ధరాత్రి సమయంలో జైలు నుంచి పరారయ్యాడు. తాను ఉంటున్న సెల్ ఊచలను తొలగించి బయటకు వచ్చిన చార్లీ.. ఆపై తోటి ఖైదీల దుస్తులను తాడుగా మార్చేసి కరెంట్ ఫెన్సింగ్‌ను దాటేసి మరీ పరారయ్యాడు. గోడ దూకాక.. రోడ్డు మీద తాపీగా నడుచుకుంటున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసు శాఖ స్టేట్ వైడ్ అలర్ట్ ప్రకటించింది. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు.. ఇలా అన్నిచోట్ల చార్లీ ఫొటోలతో గాలింపు ముమ్మరం చేసింది. చార్లీని గుర్తిస్తే 9446899506 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరింది.ఈలోపు.. కన్నూరు తలప్పు ఏరియాలో ఓ పాడుబడ్డ ఇంటి ఆవరణలో చార్లీని చూసినట్లు స్థానికుడు ఒకరు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. అక్కడ బావిలో దాక్కుని కనిపించాడు. దీంతో తాడు సాయంతో అతన్ని బయటకు తీశారు. ఉదయం. 11గం. ప్రాంతంలో చార్లీని పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్లీ జైలుకు తరలించారు. 2011, ఫిబ్రవరి 1వ తేదీన కొచ్చి నుంచి షోరణూర్ వెళ్తున్న రైలులో సౌమ్య(23) ఒంటరిగా ప్రయాణిస్తోంది. అది గమనించిన గోవిందచామీ.. ఆమెను రైలు నుంచి తోసి, ట్రాక్ పక్కన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. అటుపై ఆమె ఫోన్‌తో ఉడాయించాడు. ఆ ఫోన్ ఆధారంగానే పోలీసులు ఆ మరుసటిరోజే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇటు త్రిసూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సౌమ్య ఫిబ్రవరి 6వ తేదీన కన్నుమూసింది.ఈ ఘటన కేరళతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఏడాది నవంబర్ 11న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గోవిందచామీకి మరణశిక్ష విధించింది. కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో చార్లీ నవ్వుతూ కనిపించాడు. పైగా శిక్ష ప్రకటించే సమయంలోనూ అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. అయితే.. 2013లో కేరళ హైకోర్టు ఆ శిక్షను నిలుపుదల చేయగా, 2014లో సుప్రీం కోర్టు సైతం స్టే ఇచ్చింది. 2016లో గోవిందచామీపై మర్డర్ అభియోగాన్ని తొలగించి.. కేవలం రేప్‌కేసు కింద జీవిత ఖైదును సుప్రీం కోర్టు విధించింది. అంత కట్టుదిట్టమైన భద్రత నుంచి ఎలా?కన్నూరు సెంట్రల్ జైలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుందని, అలాంటి జైలు నుంచి చార్లీ తప్పించుకోవడం ఏంటి? అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఎవరో అతనికి సాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చార్లీ కరడుగట్టిన నేరస్తుడు. అర్ధరాత్రి 1గం. సమయంలో తప్పించుకున్నాడు. అధికారులేమో ఉదయం 5గం. గుర్తించారు. ఏడుగంటలకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిగ్గా అతను తప్పించుకునే టైంలోనే జైల్లో కరెంట్ పోయింది. ఇది పక్కా స్కెచ్‌తోనే జరిగి ఉంటుంది’’ అనే అనుమానాలు వ్యక్తం చేశారాయన. అయితే కేరళ పోలీస్ శాఖ మాత్రం అతని కోసం వేట కొనసాగుతోందని తెలిపింది. ఈలోపు అతను దొరకడం విశేషం. -
పనస పండు ఎంత పనిచేసింది..? పాపం ఆ డ్రైవర్లను పట్టుబడేలా చేసింది..!
డ్రైవర్లు లేదా వాహనాలు నడిపేవాళ్లు ఈ పండు తిన్నారో అంతే సంగతులు. చుక్క మందు తాగకపోయినా..అన్యాయంగా ఇరుక్కుపోతారు. తమాషా కాదు..నమ్మశక్యం కానీ పచ్చి నిజం. ఏంటిదంతా అనుకోకండి. పాపం ఇలానే కేరళ డ్రైవర్లు రొటీన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో పట్టుబడి చిక్కుల్లోపడ్డారు. చివరికి అధికారులే అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే..కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పండలం మండలంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది అక్కడ డ్రైవర్లకు రొటీన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అవాక్యయ్యారు ఆ ఉద్యోగులు. ఒక్క చుక్క మందు తాగకుండానే ఇదేంటని విస్తుపోయారు. పాపం వాళ్లంతా తాము మద్యం సేవించలేదని మమ్మల్ని నమ్మండి మహాప్రభో అంటూ మొరపెట్టుకోవడంతో..అధికారులు వారికి ఒక్క అవకాశం ఇచ్చారు. తాము కొల్లం జిల్లాలో వస్తువులు రవాణా చేసేటప్పుడు పనసపండు కొన్నామని అది తప్ప ఇంకొకటి తాము తినలేదని చెప్పారు. అయితే మీరు చెప్పింది నిజమే అయితే మరొక సిబ్బంది ఈ పనస పండు ఇచ్చి వాస్తవం నిర్థారిస్తామని ఆ డ్రైవర్లోతో అధికారులు అన్నారు. అన్నట్లుగానే తదుపరి పరీక్ష నిర్వహించారు. ఒక సిబ్బందికి ఇలాంటి పనసండు పెట్టి బ్రిత్ అనలైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించినట్లుగా పాజిటివ్ చూపించింది. అది చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. పనసపండు ఇంతలా బ్రీత్ అనలైజర్‌ను కన్ఫ్యూజ్ చేసేలా తప్పుదారిపట్టిస్తుందా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సదరు డ్రైవర్లు మద్యం సేవించలేదని నిర్థారించి వారిని వదిలేశారు అధికారులు. పనపండు తింటే మద్యం సేవించినట్లేనా అంటే..కేరళకు చెందిన ఈ సుగంధభరిత పనసపండు. అసాధారణమైన తేనెలాంటి తీపి రుచిని కలిగి ఉంటుంది. పైగా ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. అయితే అతిగా పండిన ఈ పనసపండులోని సహజ కిణ్వప్రక్రియ కారణంగా ఆల్కహాల్‌ని కలిగి ఉంటుందట. ఎప్పుడైతే దీన్ని తింటామో అది శరీరంలోకి వెళ్లగానే ఇథనాల్‌ని ఉత్పత్తి చేస్తుందట. దాంతో ఈ పనసపండు తిన్న వెంటన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ సేవించినట్లుగా చూపిస్తుందట. ముఖ్యంగా బాగా ముగ్గిన పనస పండు తీసుకుంటే ఇది మరింత స్పష్టంగా ఆల్కాహాల్ సేవించినట్లు చూపిస్తుందట బ్రిత్ అనలైజర్ రీడింగ్‌లో. ఇందుకు ప్రధాన కారణం బాగా పండిన పండ్లు ఇథనాల్‌ను తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడమేనని చెబుతున్నారు నిపుణులు.ఇలా తప్పుదారి పట్టించేవి ఇవే..అతిగా పండిన అరటిపండు, మామిడిపండు కిమ్చి, సౌర్‌క్రాట్, ఇడ్లీఆల్కాహాల్ లేని బీర్ లేదా మౌత్వాష్వెనిగర్ అధికంగా ఉండే వంటకాలు లేదా ఆల్కహాల్‌తో వండిన ఆహారాలుచక్కెర ఆల్కహాల్‌లు లేదా కిణ్వ ప్రక్రియ ఉపఉత్పత్తులను కలిగి ఉన్న ప్రోటీన్ బార్లు లేదా ఎనర్జీ డ్రింక్స్(చదవండి: ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
డుగ్గు డుగ్గుమని... బుల్లెట్ బండి మీద డాడీ వచ్చిండు!
‘నాన్నా... కొత్త బుల్లెట్ కొన్నాను. ఎలా ఉంది?’ తండ్రిని అడిగాడు కొడుకు. ‘చాలా బాగుందిరా’ అన్నాడు నాన్న. ‘ఇది నా కోసం కాదు నీ కోసం’ అని కొడుకు అన్నప్పుడు ఆ తండ్రి కళ్లు ఆశ్చర్యానందాలతో మెరిసిపోయాయి. పద్నాలుగు సంవత్సరాల క్రితం కేరళలోని కొచ్చికి చెందిన అశ్విన్ తండ్రి బుల్లెట్ కొనాలని బలంగా అనుకున్నాడు. అయితే ఆర్థిక కష్టాలు కూడా అంతే బలంగా ఉండడంతో బుల్లెట్ బండి కొనలేకపోయాడు. పద్నాలుగు సంవత్సరాల తరువాత తండ్రి కోరికను నిజం చేశాడు చేతికి అందివచ్చిన కొడుకు అశ్విన్. అశ్విన్ తన తండ్రికి బ్రాండ్–న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ కీ అందించడం, తల్లిదండ్రులు ఆ బండిని చూసి మురిసిపోవడం... ఇలాంటి దృశ్యాలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఎంత చేసినా తక్కువే’ ‘ఈ తరం పిల్లలు ఆశ్విన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. ఇదీ చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే! -
పాము ఉందంటే పరిగెత్తుకొస్తుంది.. 800కి పైగా స్నేక్స్..!
సాధారణంగా బొద్దింకలు, బల్లులను చూస్తేనే కెవ్వుమని అరుస్తుంటారు మహిళలు. వాళ్లు సున్నిత మనస్కులు ఇలాంటివి వాళ్లకు చేతనవ్వదు అన్న మాటలే పదేపదే వినిపిస్తుంటాయి. కానీ వాటన్నింటిని కొట్టిపడేసిలా శివంగిలా దూకి తామెంటో నిరూపుంచికుంటున్నారు మగువలు. అయితే యుద్ధం నుంచి అగ్నిమాపకదళం వరకు అన్ని కఠినతరమైన రంగాల్లోనూ అలవోకగా తామేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడూ ఏకంగా స్నేక్ క్యాచర్‌గా కూడా సత్తా చాటుతున్నారు. అలా అత్యంత విషపూరితమైన పాములను రెప్పపాటులో పట్టే ఏకైక మహిళా స్నేక్ క్యాచర్‌గా పేరుతెచ్చుకుంది ఓ మహిళ. ఆ ధీర వనితే కేరళకు చెందిన డాక్టర్ జిఎస్ రోష్ని. దూరదర్శన్‌లో మాజీ న్యూస్ రీడర్ కూడా. హాయిగా న్యూస్ రీడర్‌గా సాగిపోతున్న కెరీర్..వన్యప్రాణుల రక్షణ శిక్షణతో ఊహించని మలుపు తిరిగింది. అలా ఆమెకు భయంకరమైన పాములను పట్టి అడువుల్లో వదలడం తెలియకుండానే హాబీగా మారింది. అలా స్నాక్ క్యాచర్ రంగంలోకి వచ్చింది. ఆ అభిరుచితో ఇప్పటి వరకు దాదాపు 800కు పైగా పాములను సునాయాసంగా పట్టేసింది. వాటిలో కొండచిలువలు, రక్తపింజరలు, కింగ్ కోబ్రాలు కూడా ఉన్నాయి. ఆమె ఏ పామునైనా జస్ట్ మూడు నుంచి ఆరు నిమిషాల్లో పట్టేసి అడవుల్లో వదిలేస్తారామె. ఆమె అజేయమైన ధైర్య సాహసాలకు గానూ సర్టిఫైడ్ ఫిమేల్ స్నేక్ క్యాచర్‌గా లైసెన్స్ పొందిన ఏకైక కేరళ మహిళ కూడా రోష్నినే. ఆ విధంగా కేరళ అటవీ శాఖలోకి ప్రవేశించి స్నేక్ క్యాచర్‌గా సేవలందిస్తున్నారామె. ఆ వృత్తిలో ఆమెకు అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాము కనిపించింది అంటూ ఏ అర్థరాత్రి, తెల్లవారుజామునో కాల్స్ వస్తుంటాయి. వెంటనే పాము కొక్కెం, సంచి తీసుకుని బైక్‌పై వెళ్లిపోవాల్సిందే అంటున్నారు రోష్ని. కానీ ఏపనిలో అయినా సవాలు ఉంటుంది. నిజమైన సవాలు మన భావోద్వేగాలే అంటారామె. నిజంగా పాములను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అదేమంతా భయం కాదట. ఇబ్బందుల పాలు చేసే పరిస్థితుల్లో ఎలాంటి భావోద్వేగానికి గురికాకుండా ఉండటమే అతికష్టమైన సవాలు అని చెబుతోంది రోష్ని. ప్రస్తుతం ఆమె త్రివేండ్రంలో రాపిడ్ రెస్పాన్స్ బృందానికి నాయకత్వం వహిస్తోంది. చివరగా ఆమె ఏ రంగంలో అయినా రాణించగలను అనే నమ్మకం ఉంటే..ధైర్యంగా వెళ్లిపోండి, వెనక్కిచూడొద్దు అప్పుడే విజయం తథ్యం అంటోంది రోష్ని. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: ఐటీ గర్ల్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే ధరించే కాలా ధాగా స్టోరీ ఏంటో తెలుసా..!) -
బ్రిటిష్ ఫైటర్ జెట్ ఎగిరింది!
త్రివేండ్రం: సాంకేతికలోపంతో కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నెల రోజుల పాటు నిలిచిపోయిన బ్రిటన్‌కు చెందిన అత్యంత అధునాతన ఎఫ్–35బీ యుద్ధవిమానం ఎట్టకేలకు స్వదేశానికి పయనమైంది. సరిపడా ఇంధనం లేకపోవడం, అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ విమానం జూన్ 14వ తేదీన కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవడం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నిసార్లు రిపేర్లుచేసినా మళ్లీ టేకాఫ్ తీసుకోలేక అక్కడే రన్‌వే పైనే చతికిలపడిన విషయం విదితమే.కీలక హైడ్రాలిక్ వ్యవస్థ వైఫల్యంతో యుద్ధవిమానం ఎగరలేకపోయింది. దాన్ని సరిచేయడానికి బ్రిటన్ రాయల్ నేవీ టెక్నీషియన్ల బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) రక్షణలో నాలుగో నంబర్ రన్‌వేపై ఉండిపోయింది. హైడ్రాలిక్ వ్యవస్థ వైఫల్యం కారణంగా చివరకు ఈ యుద్ధవిమానం రెక్కలను జాగ్రత్తగా విడదీసీ అత్యంత భారీ సరకు రవాణా సైనిక విమానంంలో బ్రిటన్‌కు తరలించనున్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. అయితే చివరి ప్రయత్నంగాబ్రిటన్ నుంచి ప్రత్యేకంగా 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు, నిపుణుల బృందం తిరువనంతపురం విచ్చేసింది.రిపేర్ల కోసం ఎట్టకేలకు యుద్ధ విమానాన్ని రన్‌వే మీద నుంచి హ్యాంగర్‌కు తరలించారు. జూలై ఆరో తేదీన ఎయిర్‌బస్ ఎ400ఎమ్ అట్లాస్ విమానంలో కొత్త విడిభాగాలు, అధునాతన పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ బృందం రాకతో పరిస్థితులు మారిపోయాయి. ఫైటర్ జెట్‌కు చకచకా మరమ్మతు చేశారు. లాక్‌హీడ్ మారి్టన్ రక్షణరంగ తయారీసంస్థ అభివృద్ధిచేసిన ఈ ఎఫ్–35బీ.. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. దీని ధర దాదాపు రూ.950 కోట్లు. అత్యవసర పరిస్థితుల్లో నిట్టనిలువుగా ల్యాండింగ్ కావడం ఈ విమానం ప్రత్యేకత. ఇది నాటో వైమానిక శక్తికి మూలస్తంభం లాంటిదని చెప్పొచ్చు. -
హమ్మయ్యా..! అత్యంత ఖరీదైన యుద్ధ విమానం.. గాల్లోకి లేచింది..!
తిరువనంతపురం: గత నెల 14వ తేదీన కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన బ్రిటీష్ రాయల్ నేవీ యుద్ధ విమానం ఎఫ్-35 ఎట్టకేలకు గాల్లోకి ఎగిరింది. 37 రోజుల తర్వాత యుద్ధ విమానం తిరిగి ఇంగ్లండ్‌కు పయనమైంది. తొలుత ఈ యుద్ధ విమానాన్ని తిరిగి మరమ్మత్తులు చేయడం కష్టమని భావించారు. విడిగా పార్ట్లు తీసి తీసుకెళ్లాల్సిందేనని నిపుణులులు తేల్చారు. అయితే ఈ యుద్ధ విమానాన్ని తిరిగి పట్టాలక్కెంచేందుకు యూకే నుంచి నిపుణుల్ని తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేసి చూశారు. అది సత్ఫలితాల్ని ఇవ్వడంతో ఆ యుద్ధ విమానం తిరిగి గాల్లోకి ఎగిరింది. అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35 ఎపిసోడ్ మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు నానా తంటాలు పడ్డారు. బ్రిటన్‌కు చెందిన ఆధునాతన స్టెల్త్ యుద్ధ విమానం F-35Bను రిపేర్ చేసేందుకు 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ఈ నెల తొలి వారంలో తిరువనంతపురంలో అడుగుపెట్టారు. ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ఫలించడంతో ఆ విమానం విడిభాగాల్ని తొలగించాలనే అంశానికి ఫుల్‌స్టాఫ్ పడింది. కాగా, బ్రిటన్‌కు చెందిన నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. ఆ క్రమంలోనే జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు.అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. తాజాగా ఆ యుద్ధ విమానం గాల్లోకి లేపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించడంతో యూకే నిపుణులు ఊపిరి పీల్చుకున్నారు.అత్యంత ఖరీదైన విమానం..F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్‌లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.పార్కింగ్ ఫీజు ఎంతంటే..?తిరువనంతపురం ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 37 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు రూ. కోటి అంతకంటే ఎక్కువ అవుతుందనే అంచనా వేస్తున్నారు. -
అడవిని సాకుతున్న ఆడపడుచులు!
అడవిలోని కోతులు చిటారుకొమ్మనున్న పండును రుచి చూస్తున్నట్టుగా కొద్దిగా కొరికేసి, మళ్లీ మరో పండును అందుకుంటాయి. పూర్తిగా తినేయకుండానే పండ్లనిలా పక్కకు విసిరేస్తున్నందుకు విసుగూ, చిరాకు మనకు. అరణ్యంలోని ఏనుగు అవసరమైనదేదో తినేయకుండా అందుతున్న కొమ్మల్ని అల్లిబిల్లిగా విరిచేసి అల్లంత దూరానికి విసిరేసి చెల్లాచెదురుగా పడేస్తుంది. చూడ్డానికి ఇదేదో వృథా పనిలా అనిపిస్తుందిగానీ... ఇందులో అడవి మనుగడ దాగుంది. కోతి మాత్రమే చిటారు కొమ్మకు చేరగలుగుతుంది. కానీ అంతదూరాలకు ఎక్కలేనివీ... మధ్య కొమ్మలూ, చెట్టు మొదళ్లలో ఉండే జీవులూ తినడానికి ప్రకృతి చేసిన ఏర్పాటది. అలా ఎన్ని జీవులు ఎంత ఎక్కువగా తింటే... వాటి గింజలు అంతంత దూరాలకు చేరి అక్కడ మొలకెత్తుతుంటాయి. అలా మొలకెత్తే మొక్కలకు సూర్యరశ్మి అందేందుకూ... పక్కలకు పాకకుండా ఇతర మొక్కలకూ అవకాశమిస్తూ చెట్టు నిటారుగానే ఎదిగేందుకు ఏనుగులిలా పక్క కొమ్మల్ని విరిచి పడేస్తుంటాయి. మనుగడ కోసం అన్ని జీవులూ ప్రయత్నిస్తున్నట్టే... తనలోని ఇతర జీవులను బతికించుకుంటూ... తాను బతికి పచ్చటి ఆకుల బట్టకట్టడానికి ప్రయత్నిస్తుంది అడవి. సహజ సహజాతం తప్ప ఇతర జ్ఞానాలేమీ లేని మూగజీవులూ అందుకు తోడ్పడుతుంటే... అద్భుత జ్ఞానం ఉండి... అన్నీ తెలిసిన మనిషి మాత్రం అడవుల నిర్మూలనకు పాల్పడుతుంటాడు. అయితే కేరళ ఉత్తర వాయనాడ్‌లోని పెరియ అనే ప్రాంతంలోని గురుకుల బొటానికల్ శాంక్చువరీలో... అంతరిస్తున్న ఓ అడవిని కాపాడటానికి ఇరవై మంది మహిళలు నిత్యం కృషి చేస్తుంటారు. వారి శ్రమ కారణంగా మునపటి విస్తీర్ణానికి తోడు... ఇప్పుడు మరో 32 హెక్టార్లు అదనంగా పెరుగుతోందా ఆ అడవి. అక్కడి అరుదైన జాతుల్లో దాదాపు 40% మొక్కలకు ఆ అడవే నివాసం. గోరింటాకు పెట్టుకునే ఆ మహిళల చేతులే... ఇప్పుడు ‘గుల్మెహందీ’ అనే హిందీ పేరున్న ‘బల్సామినసీ’ కుటుంబపు అనేక ప్రజాతుల మొక్కలను పెట్టని కోటలా కాపాడుతున్నాయి. ఆ అడవి ఇప్పుడు అత్యంత అరుదైన మొక్కలకు ఆలవాలం. ఎర్రచందనం చెట్లు కేవలం శేషాచలం అడవుల్లోనే పెరుగుతూ మరెక్కడా జీవించలేనట్టే... అత్యంత అరుదైన జాతి మొక్కలైన ‘ఇంపాటియెన్స్ జెర్డోనియా’ వంటి మొక్కలు అక్కడ... అంటే ఆ పశ్చిమ కనుమల సానువుల్లో తప్ప మరెక్కడా పెరగవు. ‘బల్సామినసీ’ అనే కుటుంబానికి చెందిన ఆ మొక్కలన్నీ దాదాపుగా అంతరించే దశకు చేరుకున్నాయి. అలాంటి జాతుల మొక్కల్ని సంరక్షించడమే కాదు... అలాంటి అనేక రకాల అరుదైన ఇతర జాతుల మొక్కలకూ ఆ అడవిలో ఆవాసం కల్పిస్తూ వాటిని సంరక్షిస్తున్నారా అతివలు. మరోమాటగా చెప్పాలంటే అవన్నీ ఎపీఫైటిక్ప్లాంట్స్. ‘ఎపీ’ అంటే ‘పైన’... ‘ఫైట్’ అంటే మొక్క. అంటే తమ మనుగడ కోసం అవి మరో చెట్టుని ఆలంబనగా చేసుకోవాలి. ఇక్కడ ‘పారసైట్’కూ, ‘ఎపీఫైట్’కు తేడా ఏమిటంటే... తాము ఎదుగుతున్న చెట్టుపైనే బతుకుతూ, అలా బతకడానికి దాని ఆహారాన్ని దొంగతనంగా తీసుకుంటే అవి పారసైట్స్. కేవలం తమ అవసరాలైన సూర్యరశ్మీ, ఇతర వనరులు చక్కగా అందడానికి ఇతర మొక్కల మీద ఎదిగేవీ ఎపీఫైట్స్. తాము పెరగడానికి దోహదపడుతున్న చెట్ల ఆహారాన్ని ఇవి దొంగిలించవు. అలాంటి ఈ ఎపీఫైట్స్ మనుగడ కోసం తీవ్రంగా ఫైట్ చేస్తున్నారు ఆ అడవిని సంరక్షిస్తున్న ఆడపిల్లలు. – యాసీన్ -
కేరళ వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అభినయ (ఫొటోలు)
-
కేరళ మాజీ సీఎం కన్నుమూత
-
కేరళ మాజీ సీఎం కన్నుమూత
తిరువనంతపురం: ప్రముఖ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వెలిక్కకట్టు శంకరన్ అచ్యుతానంద కన్నుమూశారు. ఈ రోజు (సోమవారం, జూలై 21, 2025) త్రివేండ్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. 101 ఏళ్ల వయసు కల్గిన అచ్యుతానంద వృద్ధాప్య భారంతో అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఇక ఆయన 2006 నుండి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1923లో జన్మించిన అచ్యుతానందన్ సీపీఐఎం స్థాపక సభ్యుల్లో ఒకరు. విపక్ష నాయకుడిగా 15 సంవత్సరాలు పనిచేశారు. ఇది కేరళ అసెంబ్లీ చరిత్రలో అత్యధిక కాలం.ఉద్యమాలతో స్పూర్తిఓ వైపు క్రియా శీలక రాజకీయాల్లో కొనసాగుతూ.. మరో వైపు పలు ఉద్యమాలు చేశారు. పున్నప్ర-వయలార్ ఉద్యమం, మునార్ భూసేకరణ, లాటరీ మాఫియాపై పోరాటం, ఫిల్మ్ పైరసీపై ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేశారు. ఆయన చేసిన ఉద్యమాల కారణంగా 5 ఏళ్ల పాటు జైలు జీవితం, 4.5 సంవత్సరాల పాటు రహస్య జీవితాన్ని గడిపారురాజకీయ జీవితం1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.1964లో సీపీఐ నుంచి బయటకు వచ్చారు. సీపీఎం స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1985లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులై, 2009లో పార్టీ అంతర్గత విభేదాల కారణంగా తొలగించబడ్డారు. 2016 తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.అచ్యుతానందన్ మరణంతో కేరళ రాజకీయ రంగం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ప్రజల మనసుల్లో చిర స్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ ప్రముఖులు కేరళ రాష్ట్రానికి అచ్యుతానందన్ చేసిన సేవల్ని కొనియాడుతున్నారు. -
షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణం
షార్జాలో మరో మలయాళీ మహిళ మరణం ఆందోళన రేపుతోంది. కేరళకు చెందిన అతుల్య శేఖర్ శనివారం తెల్లవారు జామున యుఎఇలోని షార్జా అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై హత్య కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.గల్ఫ్ న్యూస్ ప్రకారం, అతుల్య 30వ పుట్టినరోజే కన్నుమూసింది. అదీ కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆమె అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం,ఆమె భర్త సతీష్ ఆమెను గొంతు పిసికి, కడుపుపైతన్నాడు, తలపై ప్లేట్‌తో కొట్టాడు, ఫలితంగానే ఆమె మరణించింది. మృతురాలికి పదేళ్ల కుమార్తె కూడా ఉంది. అతుల్య ఏకైక కుమార్తె ఆరాధిక (10) ప్రస్తుతం కొల్లాంలో తన అమ్మమ్మ, తాతాయ్య రాజశేఖరన్ పిళ్లై , తులసి భాయ్‌లతో ఉంది అతుల్య మరణం భారతీయ సమాజాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.చదవండి: లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే2014లో సతీష్, అతుల్య వివాహం జరిగింది. భర్త సతీష్‌తో కలిసి షార్జాలో నివసిస్తోంది అతుల్య అప్పటినుంచీ బైక్, 43 తులాల బంగారం ఇచ్చినప్పటికీ, తగినంత కట్నం తీసుకురాలేదని పదేపదే వేధించే వారని అతుల్య కుటుంబం ఆరోపిస్తోంది. అల్లుడు మద్యానికి బానిస అని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడని అతుల్య తండ్రి ఆరోపించారు.పాప కోసంమే తన బిడ్డ అన్ని హింసలను భరించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులకు సంబంధించి గతంలో ఇరు కుటుంబాల మధ్య చర్చలకు జరిగాయి. పోలీసు కేసు కూడా నమోదైంది. ఇదీ చదవండి: బాలీవుడ్ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్ : 100మందికి పైగా ముంచేసిన ఎన్ఆర్ఐ జంటఅయితే ఈ ఆరోపణలను సతీష్ ఖండించాడు. అతుల్య మరణంలో తన పాత్ర లేదని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే తాను నమ్మడం లేదన్నాడు. కాగా యూఏఈ షార్జాలో వరకట్న వేధింపుల కారణంగా కేరళకు చెందిన మహిళ బిడ్డను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన 16 నెలల కుమార్తెను హత్య చేసి, తాను తనువు చాలించిన సంగతి తెలిసిందే. -
‘శశిథరూర్ మాతో లేరు.. మీటింగ్‌లకు పిలవం’
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యవహార శైలిపై సొంత పార్టీలో.. అదీ సొంత రాష్ట్రంలోనే తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఆయన్ను తమలో ఒకరిగా పరిగణించడం లేదంటూ తాజాగా పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దేశ భద్రత అంశంపై థరూర్ తన వైఖరిని మార్చుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించేది లేదన్నారు మాజీ ఎంపీ కే మురళీధరన్. పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని శశిథరూర్ వ్యాఖ్యానించిన వేళ.. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత కే మురళీధరన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘శశిథరూర్ తన తీరును మార్చుకునే వరకు.. తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోం. ఆయన మాతో కలిసి లేరు. కాబట్టి.. ఆయన్ను బహిష్కరించే ప్రశ్నే పుట్టదు. అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది’’ అని మురళీధరన్ అన్నారు. ఇదిలా ఉంటే.. కే మురళి శశిథరూర్‌పై మండిపడ్డడం ఇదే తొలికాదు. ఎమర్జెన్సీ రోజులపై థరూర్ రాసిన వ్యాసంపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఆయనకు(శశిథరూర్ పేరును ప్రస్తావించకుండా) ఏమైనా ఆంక్షలు ఉన్నట్లు అనిపిస్తే.. స్పష్టమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇంకోవైపు కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా శశిథరూర్ వైపే మొగ్గు ఉందంటూ ఓ సర్వేకు సంబంధించిన పోస్టుపైన మురళీధరన్ గతంలో విరుచుకుపడ్డారు. ఆయన ఏ పార్టీకి చెందినవారో ముందుగా నిర్ణయించుకోవాలన్నారు.గత కొంతకాలంగా శశిథరూర్‌కు కాంగ్రెస్ అధిష్టానాకి మధ్య పొసగడం లేదు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి శశిథరూర్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరేమనుకున్నా తాను బీజేపీలో చేరేది లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ థరూర్ చెబుతూ వస్తున్నారు. -
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబో.. అప్పుడే లీక్ చేశారుగా!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం రిలీజ్ కాలేదు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కావొచ్చని టాక్ వినిపిస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే చిరంజీవి విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో మూవీ రానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించనుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ఓ సీన్ షూట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నీటిలో పడవపై మెగాస్టార్, నయనతార కూర్చుని ఉండగా.. పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట లీక్ కావడంతో హల్చల్ చేస్తోంది. కేరళలోని అలప్పుజలో చిరంజీవి, నయనతారలపై పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమాను మెగా157 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వు రివర్స్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణ యం తీసుకుంది. ఏడాది క్రితం తాము స్వయంగా ఇచ్చిన ఉత్తర్వునే మార్చేసింది. 13 ఏళ్ల బాలుడి మానసిక పరిస్థితిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అతడిని తల్లికే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ బాలుడిని తండ్రి కస్టడీకి అప్పగిస్తూ 2024 ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వును న్యాయస్థానం మార్చింది. కేరళకు చెందిన యువతి, యువకుడికి 2011లో వివాహం జరిగింది. వారికి 2012లో కుమారుడు జన్మించాడు. తర్వాత కాపురంలో విభేదాలు తలెత్తడంలో వేర్వేరుగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుమారుడు తల్లి వద్దే ఉండేలా, తండ్రి నెలకు రెండు రోజులు చూసేలా ఒప్పందం కుదిరింది. 2015లో వారికి విడాకులు మంజూరయ్యాయి. యువతి మళ్లీ పెళ్లిచేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. మొ దటి భర్త నాలుగేళ్లుగా ఆమె మొదటి కుమారుడిని చూడడానికి రాలేదు. తాను మలే షియా వెళ్లిపోతున్నానని, మొదటి బిడ్డను కూడా తీసుకెళ్తానని, ఇందుకు అంగీకరిస్తూ సంతకం చేయాలని మొదటి భర్తను 2019 లో కోరింది. అందుకు అతడు నిరాకరించా డు. ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డను తనకే అప్పగించాలని కోరాడు. కానీ, బిడ్డను తల్లికే అప్పగిస్తూ 2022లో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ మొదటి భర్త కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బిడ్డను తండ్రి కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గత ఏడాది విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పును సమరి్థంచింది. కుమారుడు తండ్రి వద్దే ఉండొచ్చని ఉత్తర్వు జారీ చేసింది. దాంతో ఈ ఉత్వర్వును పునఃసమీక్షించాలని కోరుతూ తల్లి మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వును రివర్స్ చేస్తున్నట్లు తేల్చిచెప్పింది. కుమారుడు తల్లి కస్టడీలోనే ఉండొచ్చని తేల్చిచెప్పింది. ఈ సమయంలో అతడికి తల్లి అవసరం చాలా ఉందని అభిప్రాయపడింది. చిన్న వయసులో బిడ్డకు తల్లే అసలైన సంరక్షురాలు అని న్యాయస్థానం పేర్కొంది. -
‘నిమిషకు న్యాయపరమైన సాయం అందిస్తున్నాం’
న్యూఢిల్లీ: యెమెన్‌లో చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడ్డ కేరళ నర్సు నిమిష కేసు అంశానికి సంబంధించి భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిష కేసులో అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ప్రయత్నాలే వల్లే నిమిష మరణశిక్ష వాయిదా పడిందని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. నిమిష తరఫున లాయర్‌ను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. సదరు లాయర్ ఆ ఫ్యామిలీతో రెగ్యులర్‌గా ఫాలో చేస్తూ అందుబాటులో అవసరమైన సలహాలు ఇస్తున్నారన్నారు. అలాగే యెమెన్ అధికారులతో కూడా లాయర్ టచ్‌లో ఉంటూ కేసుకు సంబంధించిన విషయాల్ని చూసుకంటున్నారని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.కాగా, యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం(జూలై 16వ తేదీ) మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. -
Nimisha Priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ
-
నిమిషా ప్రియను క్షమించలేం
సనా: తన సోదరుడు తలాల్ అబ్దో మెహదీని దారుణంగా హత్య చేసిన కేరళ నర్స్ నిమిషా ప్రియను క్షమించలేమని అబ్దెల్ ఫతాహ్ మెహదీ తేల్చిచెప్పారు. ఆమె నుంచి క్షమాపణ గానీ, నష్టపరిహారం(బ్లడ్ మనీ) గానీ తాము కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని అన్నారు. యెమెన్‌లో నిమిష తల్లి ప్రేమకుమారియెమెన్లో మాజీ వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మెహదీని 2017లో విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు నిమిషా ప్రియకు స్థానిక కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆమెకు బుధ వారం శిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి నిమి షంలో వాయిదా పడింది. బాధితుడి సోదరుడు అబ్దెల్ ఫతాహ్ మెహదీ బీబీసీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఖిసాస్’ తప్ప ఇంకేమీ కోరుకోవడం లేదని చెప్పారు. షరియా చట్టం ప్రకారం తమకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సోదరుడిని చంపినందుకు నిమిషా ప్రియను ఉరి తీయాల్సిందేనని, అంతకుమించి ఇంకేదీ అక్కర్లే దని వెల్లడించారు. -
హైబ్రీడ్ డ్యాన్స్ స్టైల్ ..! వేరెలెవెల్..
కేరళలోని సంప్రదాయ శాస్త్రీయ నృత్యం మోహినీయాట్టం, మోడ్రన్ ర్యాప్ ట్రాక్‌ను మిక్స్ చేసి సోషల్ మీడియా సెన్షెషన్గా మారింది శ్వేత వారియర్. ఎనిమిదిమంది డ్యాన్సర్లతో కలసి ఈ వినూత్న నృత్యం చేసింది. ‘రన్ ఇన్ అప్ ర్యాప్ చూసిన తరువాత కొత్తగా ఏదైనా చేయాలనిపించింది’ అని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసింది శ్వేత.ఈ డ్యాన్స్ వీడియోకు 13 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘రెఫ్రెషింగ్’ ‘ఇన్నోవేటివ్’ ‘పవర్ఫుల్’ అని స్పందించారు నెటిజనులు. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన శ్వేత వారియర్ కొత్త డ్యాన్స్ స్టైల్స్‌ను క్రియేట్ చేయడంలో పేరు తెచ్చుకుంది. మూడు సంవత్సరాల వయసు నుంచే తల్లి దగ్గర భరతనాట్యంలో శిక్షణ పొందింది. భరత నాట్యం, అర్బన్ స్ట్రీట్ స్టైల్స్‌ను మిక్స్ చేసి సృష్టించిన ‘స్ట్రీట్ వో క్లాసికల్’ సూపర్‌హిట్ అయింది.రకరకాల ‘హైబ్రీడ్ డాన్స్ స్టైల్స్’తో డాన్సర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్వేత వారియర్. సోనీ టీవి ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’లో రన్నర్–అప్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Swetha Warrier (@shweta_warrier) (చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..) -
‘ట్రాన్స్’మిషన్ పుస్తకంలో పాఠమైంది!
కేరళ విద్యావ్యవస్థలో అభ్యుదయం వెల్లివిరుస్తుంటుంది. జెండర్ వివక్ష లేని సమాజం కోసం బాల్యం నుంచే పాఠాలు బోధిస్తుంటుంది. ఒకప్పుడు పాఠ్యపుస్తకాలలో కుటుంబ ముఖచిత్రంలో అమ్మతోపాటు నాన్న కూడా ఇంటి పనులు చేయడాన్ని ప్రచురించింది. తాజాగా ఇప్పుడు ఓ ట్రాన్స్‌జెండర్ జీవితగాధను పాఠ్యాంశంగా తీసుకుంది. ఎనిమిదవ తరగతి ఆర్ట్స్ టెక్ట్స్ బుక్‌లో ట్రాన్స్ ఆర్టిస్ట్ నేఘా ఎస్ విజయగాధను చేర్చింది. అంతరించి పోవాలి!ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కొత్త కరికులమ్‌లో నాటకరంగం, శిల్పకళ, సంగీతం, సినిమా, నాట్యరంగాలను చేర్చింది. ఆయా రంగాల్లో ప్రముఖుల గురించిన పాఠాలను పాఠ్యపుస్తకాలలో ప్రచురించింది. ఈ క్రమంలో సినీ నటి నేఘా ఎస్ గురించిన పాఠానికి చోటు కల్పించింది ఎస్సీఈఆర్టీ. మలయాళ నటి నేఘా ఎస్... 2022లో నటించిన ‘అంతరం’ సినిమాకు గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్మ్ అవార్డు అందుకున్నారు. ఒక ట్రాన్స్ ఉమన్‌కు ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి. పాఠ్యపుస్తకంలో తన జీవిత పాఠం గురించి తెలుసుకున్న నేఘా ఎస్ భావోద్వేగాలకు లోనయ్యారు. ‘టెక్ట్స్బుక్లో పాఠాన్ని చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయి.సమాజం ఇన్నేళ్ల వరకు నన్ను నా పేరుతో గుర్తించనే లేదు. అలాంటిది 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఓ పాఠంలో నా పేరు ఉండడం నన్ను కదిలించింది’ అన్నారామె. సమాజం వేరుగా చూసిన వారిని సమాజంలో భాగంగా చూపించడానికి ఆ రాష్ట్ర విద్యావ్యవస్థ చేసిన ప్రయత్నం గొప్పది. ఆమె సొంతూరు తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తీయన్నపురం. కేరళలో నటిగా పురస్కారం అందుకునే వరకు తన సొంత రాష్ట్రం కూడా తనను గుర్తించలేదని, పురస్కారం సందర్భంగా మీడియా కవరేజ్ తర్వాత తనను తన రాష్ట్రం స్వాగతించిందని, అయినప్పటికీ తమిళరాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం తనకు గుర్తింపు రాలేదన్నారామె.విద్యార్థుల్లో జెండర్ అవేర్నెస్ కోసం ఆమె అనేక ప్రభుత్వ స్కూళ్లలో క్లాసులు తీసుకున్నారు. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజంలో నెలకొని ఉన్న తక్కువ భావనను తొలగించడానికి ఈ పాఠం ఒక మంచి ప్రయత్నం. అయితే ప్రపంచంలో కరడుగట్టి ఉన్న అంతరం తొలగిపోవడానికి ఇది సరిపోదు. అంతరించిపోయే వరకు ఇంకా చాలా చేయాలంటూ ‘నా జీవిత పాఠం చదివిన విద్యార్థులు తమను తాము శక్తిమంతంగా తీర్చిదిద్దుకోగలగాలి’ అని ఆశాభావం వ్యక్తం చేశారామె. -
కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట
-
నిమిష మరణశిక్ష వాయిదా
యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్‌కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంతో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం.నిమిష శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్‌లో ‘‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ సభ్యుడు శ్యామూల్ జోరెమ్ భాస్కరన్ ధృవీకరించారు. అయితే.. బాధిత కుటుంబం బ్లడ్‌మనీ(పరిహారం సొమ్ము)కుగానీ, శిక్షరద్దుకుగానీ అంగకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని అంటున్నారాయన.కేరళకు చెందిన ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహ్దీ కుటుంబంతో మతపెద్దలు ఉత్తర యెమెన్‌లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడడం గమనార్హం. మరోవైపు.. నిమిషా ప్రియ విషయంలో భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంఈఏ అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హౌతీ నియంత్రణలోని యెమెన్‌తో భారతకు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. ఈ తరుణంలో తామ చేయగలిగినదంతా చేశామని, ఇంతకు మించి చేయలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే.. నిమిష కేసును బాధాకరంగా పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అనధికారిక మార్గాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చినా.. కేంద్రం యెమెన్ న్యాయవిభాగానికి విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భర్తతో నిమిషఇంకోవైపు క్షమాభిక్షపైగానీ, బ్లడ్‌మనీపైగానీ చర్చించేందుకు సైతం తలాల్ కుటుంబం ఇంతకాలం ముందుకు రాలేదు. అయితే తాజా భేటీలో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యలు మొదటిసారి పాల్గొన్నట్లు తెలస్తోంది. ఈ పురోగతితో నిమిష శిక్ష రద్దయ్యే అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి. -
నిమిష కేసు: చేతులెత్తేసిన కేంద్రం! అంతా మంచి జరగాలంటూ..
కేరళ నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం చేతులెత్తేసింది. యెమెన్‌లో ఈ నెల 16వ తేదీన ఆమె మరణ శిక్ష అమలు కానుంది. అయితే కేంద్రం తక్షణ జోక్యం చేసుకుని.. నిమిష శిక్షను తప్పించేలా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. ఈ కేసులో ఎలా ఆర్డర్ పాస్ చేయాలి, ఎవరు ఫాలో అవుతారని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆరా తీసింది. అయితే తాము (కేంద్రం) చేయగలిగినదంతా చేశామని, యెమెన్‌తో భారత్‌కు సత్సంబంధాలు అంతగా లేవని, అయినా కూడా అక్కడి ప్రాసిక్యూటర్‌కు మరణశిక్షను వాయిదా వేయాలని రాశామని, బ్లడ్‌మనీ చివరి అవకాశమని, ఆ చర్చలంతా ప్రైవేట్ వ్యవహారమని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదని, అంతా మంచి జరగాలని ప్రార్థిస్తున్నామని అటార్నీ జనరల్ వెంకటరమణి ధర్మాసనానికి స్పష్టం చేశారు. దీంతో జస్టిస్ సందీప్ మెహతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ప్రాణాలు పోతే గనుక చాలా బాధాకరమని అన్నారాయన. అయితే అనధికారిక మార్గాలు ఏమైనా ఉన్నాయో పరిశీలన చేసి వెంటనే సంప్రదించాలని ఆయన ఏజీకి సూచిస్తూ.. ఈ పిటిషన్లో విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. యెమెన్‌లో ఓ వ్యక్తిని చంపిన కేసులో నిమిషా ప్రియాకు 2017లో మరణశిక్ష పడింది. యెమెన్‌లో తాను తీవ్ర చిత్రహింసలకు గురయ్యానని, తన వ్యాపార భాగస్వామి(బాధితుడి) తన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు అతనికి మత్తు మందు ఇచ్చానని నిమిష చెబుతోంది. అయితే మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో అతను మరణించాడని తేలింది. ఈ కేసులో చివరగా మిగిలిన ఆశ బ్లడ్‌మనీ ఒక్కటే. షరీయత్ చట్టం ప్రకారం ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమాపణ దక్కే అవకాశం ఉంది. అయితే.. బాధితుడి కుటుంబానికి $1 మిలియన్ (రూ. 8.3 కోట్లు) చెల్లించేందుకు నిమిష కుటుంబం అంగీకరించింది. కానీ అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరణశిక్ష అమలుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో నిమిషాకు అంతర్జాతీయ మద్దతు కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
Kerala: మళ్లీ ‘నిఫా’ కలకలం.. అంతటా అప్రమత్తం
పాలక్కాడ్: కేరళలో నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ‘నిఫా’ అనుమానిత మరణం నమోదైంది. ఈ నేపధ్యంలో ఈ వైరస్ ప్రభావం కలిగినవిగా భావిస్తున్న ఆరు జిల్లాల్లోని వైద్యాధికారులు మరింత అప్రమత్తయయ్యారు. నిఫా రెండవ మరణం విషయంలో పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తుది నిర్ధారణ చేయనుంది.జూలై 12న పాలక్కాడ్ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి నిపా వైరస్ కారణంగా మరణించాడనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ వైరస్‌తో కేరళలో మరణించినవారి సంఖ్య రెండుకు చేరింది. బాధితుడు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. మంజేరి మెడికల్ కాలేజీలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, నిపా పాజిటివ్‌గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో వెంటనే అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్, ఫీల్డ్ సర్వైలెన్స్‌ను ముమ్మరం చేసింది.మృతునితో సంబంధం కలిగిన 46 మంది జాబితాను సిద్ధం చేశారు. మృతుడు గతంలో తిరిగిన ప్రాంతాలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్,మొబైల్ టవర్ డేటా సాయం తీసుకున్నారు. ప్రాంతీయ వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, పరిస్థితులను పర్యవేక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని డేటాలను సేకరిస్తున్నామని వీణా జార్జ్ తెలిపారు. కాగా పాలక్కాడ్, మలప్పురం జిల్లాల ప్రజలు అనవసరమైన సందర్శనలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు. ఆస్పత్రులలోని వైద్య సిబ్బంది, రోగులు, సందర్శకులు మాస్క్‌లు ధరించాలని సూచించారు. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్ తదితర ఆరు జిల్లాల్లోని ఆసుపత్రులకు నిపా అప్రమత్తతపై అధికారుల నుంచి హెచ్చరికలు అందాయి. -
కేరళలో బుజ్జగింపు రాజకీయాలు
తిరువనంతపురం: కేరళలోని అధికార సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రెండు పక్షాలు రాష్ట్రంలో అవినీతిని, బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నా యన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి దేశ వ్యతిరేక శక్తులకు కేరళను సురక్షితమైన ప్రాంతంగా మార్చాయని మండిపడ్డారు. శనివారం ఆయన తిరువనంతపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగించారు. పీఎఫ్ఐ అనుబంధ సంస్థలను కేంద్రం 2022లో చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించింది. కేరళలో పీఎఫ్ఐ సంస్థపై నిషేధం విధించే అధికారం ఉన్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఆ సంస్థ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ సందర్భంగా వామపక్ష ప్రభుత్వాన్ని అమిత్ షా ప్రశ్నించారు. ‘రాష్ట్రాభివృద్ధి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏతో మాత్రమే సాధ్యం. దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు. వికసిత్ కేరళమ్ మాత్రమే వికసిత్ భారత్‌కు మార్గమని చెప్పారు. అందుకే, బీజేపీ లక్ష్యం ఇక నుంచి వికసిత్ కేరళమ్’ అని ఆయన పేర్కొన్నారు. కేరళలో పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఉండటం కంటే రాష్ట్రాన్ని వికసిత్కు కేంద్రంగా మార్చడం ముఖ్యమైన విషయమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వికసిత్ కేరళమ్ మిషన్ లోగోను ఆవిష్కరించారు. బీజేపీ, సీపీఎంలకు పార్టీ కేడర్ ఉన్నప్పటికీ ప్రధానమైన తేడా ఒకటుందని చెబుతూ ఆయన..బీజేపీ కేడర్ రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తే, సీపీఎం కేడర్ అభివృద్ధి కోసమే పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ షా బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యాలయం మరార్జీ భవన్‌ను ప్రారంభించారు. -
బెంచీల ఐడియా భలే!
ఇది ఇట్లాగే ఉండాలి.. అది అట్లాగే ఉండాలని అందరూ అనుకుంటే..మనిషి, సమాజపు ప్రగతి కూడా అక్కడికక్కడే స్తంభిస్తుంది!అయితే.. ఎవరో ఒకరు.. ఎప్పుడో అపుడు..యథాతథ స్థితిని ప్రశ్నిస్తారు.. ముందడుగు వేస్తూంటారు.చరిత్ర తెరచి చూస్తే ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు..వర్తమానంలో కనిపిస్తున్న తాజా ఉదాహరణ ఇది..మీ క్లాస్ రూమ్‌లో బెంచీలుండేవా? ఉంటే.. అవన్నీ వరుసల్లోనే ఉండి ఉంటాయి. ముందు వరుసలో కూర్చున్న విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేది శ్రద్ధగా వినే అవకాశం దొరికేది. వెనుక వరుసల వారు తమదైన ఆకతాయి పనులు చేసేందుకు... అప్పుడప్పుడూ టీచర్ల ఆగ్రహానికి గురయ్యే ఇబ్బంది కూడా ఏర్పడేది. టీచర్లు చెప్పేది వినలేక.. అర్థం కాక వెనుక బెంచీల వాళ్లు ఆకతాయిలుగా మారిన సందర్భాలూ ఉండే ఉంటాయి. ఇది యథాతథ స్థితి.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలోని దాదాపు ప్రతి పాఠశాలలోనూ బెంచీలు ఇలాగే వరుసల్లోనే ఉండి ఉంటాయి. అయితే మళయాళం సినిమా ఒకటి ఈ యథాతథ స్థితిని సవాలు చేసింది. ‘‘బెంచీలన్నీ ఇలా వరుసల్లోనే ఎందుకు ఉండాలి’’ అని ప్రశ్నించింది. బదులుగా చతురస్రపు గదిలో గోడల వెంట ‘సీ’ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేసి తన సినిమాలో చూపింది. విద్యార్థులందరి దృష్టి టీచర్లపై ఉండేందుకు అవకాశం ఏర్పడిందన్నమాట. ఉపాధ్యాయులు కూడా అందరి దృష్టి పాఠాలపైనే ఉండేలా చూసుకునేందుకూ వీలేర్పడింది.భలే ఉందే ఈ ఐడియా అనుకున్నారు కేరళలోని కొందరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఒట్టిగా అనుకోవడం ఎందుకు మనమూ అలా వాడేస్తే పోలా అన్నారు ఇంకొందరు.. ఇది ఒక ట్రెండ్‌కు దారి తీసింది. ప్రస్తుతం కేరళలోని పలు పాఠశాలల్లో ఇప్పుడు కుర్చీల అమరిక ‘సీ’ ఆకారంలోకి మారిపోయాయి. కొసమెరుపు ఏమిటంటే... చాలా ఆడిటోరియమ్స్లో, యూనివర్శిటీల్లో.. మరీ ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో తరగతి గదుల కూర్పు ఇదే విధంగా ఉండటం!.No more frontbenchers vs backbenchers?In most classrooms, your seat says it all—frontbenchers shine, backbenchers get sidelined.But what if a film could help us unlearn the narrative? In Kerala, it just did.A Malayalam movie scene sparked a real-life shift, replacing rigid… pic.twitter.com/LU7YEogMWG— The Better India (@thebetterindia) July 11, 2025అందరినీ కలుపుకుపోతూ...‘‘ఆ.. ఏమంది.. వరుసగా ఉన్న బెంచీలను చుట్టూ పెట్టేశారు. అంతే కదా? దీంతో ఏమవుతుంది?’’ అని చాలామంది అనుకోవచ్చు కానీ.. ఈ డిజైన్ మార్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులతో మసిలే విధానం, వారి ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యాలపై ప్రభావం చూపుతాయి. పాఠం చెబుతున్న సమయంలో టీచర్‌ను నేరుగా చూడగలగడం వల్ల విద్యార్థులు వారితో మాట్లాడేందుకు అవకాశం ఎక్కువవుతుంది. ఇది ఏకాగ్రత ఎక్కువవుతుంది. బోధనలో విద్యార్థులూ భాగస్వాములవుతారు. వరుస బెంచీల్లో కూర్చొన్నప్పుడే వెనుక ఉన్న వారితో కలుపుగోలుగా ఉండొచ్చు. క్లాసులో ఏదైనా యాక్టివిటీ చేయాలంటే సులువుగా ఉంటుంది. విద్యార్థులందరినీ కలుపుకుని పాఠం చెప్పేందుకు టీచర్లకు వెసలుబాటు ఏర్పడుతుంది.-గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
అలాంటి ఇలాంటి ప్రేమకథ కాదు..!
ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం అత్యంత సర్వసాధారణం. 70 ఏళ్లు పైబడ్డాక ప్రేమ అంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఈ వృద్ధ జట ఆ వయసులో ప్రేమలో పడి, పెళ్లిచేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా ప్రేమకు వయసు అడ్డంకికాదు అంటే ఇదే అంటూ ఆ వృద్ధ దంపతులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన కేరళలోని త్రిశూర్‌లో చోటుచేసుకుంది. వారే విజయరాఘవన్(79), సులోచన(75). ఈ ఇద్దరి నడుమ ప్రేమ ప్రభుత్వం నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో చిగురించింది. విజయ రాఘవన్ ఈ ఆశ్రమంలోకి 2019లో రాగా, సులోచన 2024లో వచ్చారు. ఇరువు వృద్ధాశ్రమ కారిడార్‌లో కలుసుకుని మాట్లాడుకునే వారు. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారి పెళ్లిపీటలు ఎక్కేంత వకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆనందకర వేడుక కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్. బిందు, నగర మేయర్ ఎం.కె. వర్గీస్ సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. ఆ దంపతులు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా ఆ వృద్ధ దంపతుల ప్రేమకు ఫిదా అవుతూ..నిజమైన ప్రేమకు వయోభేదం ఉండదు..అది అవుధులు లేనిది అంటూ ఆ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: ‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..! ఏకంగా ప్రధాని మోదీ..) -
నిమిష ప్రియ కేసుపై నమోదైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం అంగీకారం
-
‘వత్సల’ ఇక లేదు : కన్నీటి సంద్రంలో వన్య ప్రేమికులు, సీఎం సంతాపం
ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు వత్సల ఇకలేదు. 100 సంవత్సరాలకు జీవించిన ఆడ ఏనుడు వత్సల. పన్నా టైగర్ రిజర్వ్ మదర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వత్సల హినౌటా ఎలిఫెంట్ క్యాంప్ సమీపంలో బుధవారం తుది శ్వాస విడిచింది. అటవీ కాలువ దగ్గర పడిపోయిన వత్సలను గమనించిన అటవీ సిబ్బంది, పశువైద్యులు తక్షణమే వైద్య సాయం అందించినప్పటికీ ఏనుగు ఫలితం లేకపోయింది. వయోభారంతో ఇప్పటికే బాధపడుతున్న వత్సల కన్నమూసిందని అధికారులు ప్రకటించారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. వత్సల చనిపోలేదు - అది అడవితో ఐక్యమైంది అంటూ పలువురు వన్య ప్రేమికులు, అటవీశాఖ అధికారులు దానికి నివాళులర్పించారు. వత్సల మరణం ఒక జంతువును కోల్పోవడం కంటే ఎక్కువ. ఇది ఒక శతాబ్దం పాటు కాపలాగా ఉన్న చెట్టు కూలిపోవడం లాంటిదని సంతాపం తెలిపారు.వత్సల మరణం గురించి వార్త తెలియగానే పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది, సమీప గ్రామాల స్థానికులు, దేశవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ఔత్సాహికులు దుఃఖం వ్యక్తం చేశారు. శోకతప్త హృదయంలో వత్సల మృతదేహాన్ని హినౌటాలో దహనం చేశారు. ఒకప్పుడు రాణిలా తిరుగాడిన ప్రదేశంలో ఇప్పుడిక దాని జ్ఞాపకాలే మిగిలాయి. సోషల్ మీడియాలో RIP Vatsala హ్యాష్ట్యాగ్వైరల్గా మారింది. ఇదీ చదవండి : Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! కేరళ- మధ్యప్రదేశ్కేరళలోని నిలంబూర్ ఫారెస్ట్ డివిజన్లోని కేరళలోని దట్టమైన నీలాంబూర్ అడవిలో జన్మించిన వత్సల తొలుత అటవీ ఉత్పత్తులను రవాణా చేస్తూ, దుంగల కంటే చాలా బరువైన భారాన్ని మోస్తూ గడిపింది. 50 ఏళ్లు నిండిన వయసులో 1972లో మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ఆ తర్వాత 1993లో బోరి నుంచి పన్నా టైగర్ రిజర్వ్‌కు తరలించారు. అలా అప్పటి నుంచి పన్నా అభయారణ్యమే వత్సలకు నిలయంగా మారింది.Bidding a heartfelt farewell to #Vatsala, the world’s oldest known Asiatic elephant at 109 years, who passed away in Madhya Pradesh’s Panna Tiger Reserve. A gentle matriarch, Vatsala was a beloved guardian of her herd and was the soul of the reserve. She will be missed. pic.twitter.com/IrjZA32zIT— Parimal Nathwani (@mpparimal) July 9, 2025 ‘‘వత్సల మాకు గర్వకారణం" అని ఫీల్డ్ డైరెక్టర్ అంజనా సుచిత టిర్కీ చెప్పారు. "మందను గౌరవంగా నడిపించింది. ప్రసవాల సమయంలో, అనుభవజ్ఞురాలైన మంత్రసానిలా దగ్గరుండి సాయం చేసింది. బలాన్ని, ప్రశాంతతను ఇచ్చింది. వత్సల పెద్దది మాత్రమే కాదు - ఆమె మా ఏనుగు కుటుంబానికి ఆత్మ." పెద్ద ఆడ ఏనుగుగా,సహజంగా మందను నడిపించింది, పిల్ల ఏనుగులను పోషించింది అన్నారు.ఇదీ చదవండి: ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ : పిల్ల గుంపు వీడియో వైరల్ వత్సల మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “వత్సల రాష్ట్ర ప్రజలకు ఒక భావోద్వేగంగా మారింది. పలు తరాలకు స్నేహితురాలిగా, పిల్ల ఏనుగులకు అమ్మమ్మగా అభయారణ్యంలో ఎంతో ప్రేమగా మెలిగింది” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. వత్సల మరణం పన్నా టైగర్ రిజర్వ్‌కి తీరని లోటనిప్రముఖ పర్యావరణవేత్త రాజేష్ దీక్షిత్ సంతాపం తెలిపారు.2003 -2008లో, రామ్ బహదూర్ అనే మగ ఏనుగు చేసిన రెండు హింసాత్మక దాడుల నుండి వత్సల సురక్షితంగా బయటపడింది. ప్రేగులను చీల్చి,లోతైన గాయా లైన రెండు సందర్భాల్లో, ఆమె వీపును కుట్టినది వన్యప్రాణి పశువైద్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్ గుప్తా - 2003లో 200 కుట్లు, తొమ్మిది నెలల చికిత్సచేశారు. అయినా వత్సల ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. 2020లో, వత్సల కంటిశుక్లం కారణంగా పూర్తిగా అంధురాలైంది. అయినప్పటికీ, ఆమె అటవీ బాటలలో నడవడం కొనసాగించింది. జీర్ణ సమస్యలు, పూర్తి అంధత్వంతో కారణంగా దానికి వైద్యులు గంజి తినిపించేవారు. 1972లో కేరళలో ఆమెను బంధించిన సమయంలో కనిపించని పత్రాల కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఆమె ఖచ్చితమైన వయస్సు అధికారికంగా నిర్ధారించబడలేదు, అయినప్పటికీ, ఆమె పక్కన నడిచిన వారికి, గిన్నిస్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. ఆమె గడిపిన జీవితం - మరియు ఆమె తాకిన జీవితాలు ముఖ్యమైనవి.1972లో కేరళలో ఆమెను బంధించిన సమయంలో కనిపించని పత్రాల కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చూసినప్పటికీ, వయస్సు అధికారికంగా నిర్ధారణ లేని కారణంగా అది మిస్ అయింది. అయితేనేం.. వత్సలకు గిన్నిస్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. గడిపిన జీవితం చాలా ముఖ్యమైంది అంటూ కొనియాడారు అటవీ అధికారులు. -
Bharat Bandh Updates: ఢిల్లీ నుండి కేరళ వరకు..
న్యూఢిల్లీ: నేడు(బుధవారం) కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రాజధాని ఢిల్లీ నుండి దక్షిణాది రాష్ట్రం కేరళ వరకు పలు ట్రేడ్ యూనియన్లతో సంబంధం కలిగిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చిన తమ నిరసన తెలియజేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో పలు ట్రేడ్ యూనియన్ల నేతలు, కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేరళ, తమిళనాడులలో కూడా ట్రేడ్ యూనియన్ కార్మికులు నిరసనల్లో పాల్గొన్నారు. దేశంలోని 10 కేంద్ర ట్రేడ్ యూనియన్లు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. ఈ బంద్‌లో మొత్తం 25 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని వివిధ యూనియన్లు చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలు.. కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తూ, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. #WATCH | Kozhikode, Kerala | Effects of 'Bharat Bandh' called by a joint forum of 10 central trade unions, alleging the central govt of pushing "pro-corporate" policies. pic.twitter.com/AesjtEoO9O— ANI (@ANI) July 9, 2025కేరళలోని కోజికోడ్‌లో భారత్ బంద్ ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. యూపీలోని సాహిబాబాద్, ఘజియాబాద్‌లోని లింక్ రోడ్లో కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఢిల్లీలోని జిల్మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ట్రేడ్ యూనియన్లు బంద్ చేపట్టాయి. కోల్‌కతాలో వామపక్ష పార్టీల యూనియన్ భారత్ బంద్‌లో భాగంగా పాదయాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను బలహీనపరిచే ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతున్నదని వారు ఆరోపిస్తున్నారు. పలు ప్రభుత్వ విభాగాలు యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులుగా, పదవీ విరమణ చేసిన వారిని తిరిగి నియమించుకుంటున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. తమిళనాడులోని తూత్తుకుడిలో కార్మిక సంఘం ప్రతినిధి సఖాయం మాట్లాడుతూ, తూత్తుకుడి కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఒక రోజు సమ్మె చేశారని అన్నారు. అయినా దీనిపై ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. కాగా భారత్ బంద్‌లో భాగంగా కోల్‌కతాలోని జాదవ్‌పూర్ రైల్వే స్టేషన్లో వామపక్ష సంఘం రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించింది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతున్నదని తెలిపింది. బీహార్‌లో 10 కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక నిరసనలకు పిలుపునిచ్చింది. -
శ్రీనారాయణపురం జలపాతాలు : మర్చిపోలేని అనూభూతిని ఇచ్చే పర్యాటక ప్రదేశం..!
-
ఆనంద్ మహీంద్ర మనసు దోచిన పల్లె, అందమైన వీడియో
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తాజాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తరచూ అనేక శాస్త్ర, వైజ్ఞానిక అంశాలను తన అభిమానులతో పంచుకునే ఇపుడు ఆయన ప్రకృతికి సంబంధించిన విషయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోని కడమక్కుడి (Kadamakkudy) గ్రామంపై ఆయన ప్రశంసలు కురపించారు. ఈ భూమి మీద అత్యంత అందమైన గ్రామాల జాబితాలో ఇది తరచూ నిలుస్తుందని ట్వీట్ చేశారు. సండే వండర్ అంటూ ఈ అందమైన గ్రామం గురించి ప్రస్తావించారు. దీనికి సంబంధించి అందమైన వీడియోను షేర్ చేశారు. అంతేకాదు కడమక్కుడి సందర్శనను తన ‘బకెట్ లిస్ట్’లో ఉందని, ఈ ఏడాది డిసెంబర్లో వ్యాపార పర్యటన నిమిత్తం తాను కొచ్చికి వెళ్తున్నానని తెలిపారు.ఈ క్రమంలోనే కొచ్చి నుంచి ఈ గ్రామం కేవలం అరగంట దూరంలో ఉందన్నారు. పల్లెకు సంబంధించిన అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన వీడియోనూ పోస్ట్ చేశారు.Kadamakkudy in Kerala. Often listed amongst the most beautiful villages on earth…On my bucket list for this December, since I’m scheduled to be on a business trip to Kochi, which is just a half hour away…#SundayWanderer pic.twitter.com/cQccgPHrv9— anand mahindra (@anandmahindra) July 6, 2025 కాగా జాతీయ రహదారి 66 కి సమీపంలో, కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉంటుంది కడమక్కుడి అనేగ్రామం.కేరళ సంప్రదాయ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా మనోహరమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చని పంటపొలాలు, కనువిందు చేసే బ్యాక్ వాటర్స్‌తో అలరారుతూ ఉంటుంది. కడమక్కుడిని సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్, మార్చి గా చెబుతారు. ఈ సమయంలో వాతావరణం పొడిగా ఉంటుంది కానీ ఆహ్లాదకరంగా ఉంటుంది.ప్రత్యేకతలు14 చిన్న చిన్న దీవులతో కూడిన సుందరమైన ద్వీపసమూహం.కడమక్కుడి సమీపంలోనే శతాబ్దాల చరిత్ర కలిగిన సెయింట్ జార్జ్ ఫోరెన్ చర్చి, వల్లర్పదం బసిలికా, మంగళవనం పక్షుల అభయారణ్యం వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి.సుస్థిర వ్యవసాయం,చేపలు పట్టడం , వ్యవసాయంలో మునిగిపోయిన స్థానికులకు జీవనోపాధి పర్యావరణ వ్యవస్థను రక్షించి, పోషించే మడ అడవులుఅరుదైన వలస పక్షులను చూడాలనుకునేవారికి నిజంగా ఇది స్వర్గధామం -
ఆ అధికారిణి ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే..! భారీ కింగ్ కోబ్రానే..
మనం సాదాసీదాగా చూసే పాములు వాటి తీరుతెన్నులపై ఓ అవగాహన ఉంటుంది. అదే భారీ కింగ్ కోబ్రా.. ఎంత చురుగ్గా కదులుతుందో తెలిసిందే. కనిపిస్తేనే హడలిపోయి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అలాంటిది ఆ కోబ్రానే ఓ అటవీ అధికారిణి ఏ మ్రాతం భయం, బెరుకు లేకుండా పట్టుకున్న విధానం చూస్తే..వామ్మో అనిపిస్తుంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా షేర్ చేయడంతో నెట్టింట ఈ ఘటన వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పరత్తిపల్లి రేంజ్‌కు చెందిన అధికారి జీఎస్ రోష్ని ఒక చిన్న కాలువ ప్రవాహం వద్ద భారీ కింగ్ కోబ్రా సంచరించడాన్ని చూశారు. వెంటనే పాములను పట్టే స్టిక్‌ని ఉపయోగించి ఆ కోబ్రాని పట్టే ప్రయత్నం చేశారు. ఆ కోబ్రా దగ్గర దగ్గర 16 అడుగుల భారీ పాము అది. అత్యంత విషపూరితమైన ఈ పాముని పట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఆమె చాలా చాకచక్యంగా పట్టుకుని ఒక సంచిలో బంధించి మనుషుల సంచరానికి దూరంగా ఒక అటవీ ప్రదేశంలో వదిలేశారు. కేరళ అటవీ అధికారిణి రోష్ని ఇప్పటి వరకు సుమారు 800పైనే పాములను పట్టుకున్నారట. కానీ రోష్నికి ఇలా కింగ్ కోబ్రాను పట్టుకోవడం మాత్రం ఇదే తొలిసారి అని ఆ ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ పోస్ట్‌లో పేర్కొన్నారు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ నందా. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె అంకితభావానికి ప్రశంసిస్తూ..ఐఏఎస్ ఆఫీసర్లకు అటవీ అధికారులు ఏ మాత్రం తీసిపోరని, వారికంటే ఎక్కువ గౌరవాన్ని పొందేందుకు అర్హులని పోస్టుల పెట్టారు. My salutations to the green queens & the bravery shown by them in wild🙏Beat FO G S Roshni, part of Rapid Response Team of Kerala FD rescuing a 16 feet king cobra.This was the 1st time she was tackling a king cobra though she is credited to have rescued more than 800 snakes… pic.twitter.com/E0a8JGqO4c— Susanta Nanda IFS (Retd) (@susantananda3) July 7, 2025 (చదవండి: ట్రెండ్ 'షేరెంటింగ్'! పిల్లల ఫోటోలు ఆన్లైన్లో షేర్ చేస్తున్నారా..?) -
కేరళ శారీలో పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారన్న అరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా విచారణలో ఆమె నడిపిన అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యాటకరంగ ప్రోత్సహక ప్రచారంలో అతిథిగా భాగస్వామ్యం వహించారని, ఈ సందర్భంగా ఆమె కేరళను సందర్శించారని వెల్లడయ్యింది. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు వచ్చిన సమాధానంలో జ్యోతి మల్హోత్రాతో ముడిపడిన ఒక అంశం వెలుగు చూసింది. దక్షిణాదిని పర్యాటకంపరంగా ప్రోత్సహించేందుకు అతిథులుగా ఎంపిక చేసిన 41 మంది ఇన్‌ఫ్లుయెన్లర్లలో జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారని తేలింది. వీరి పర్యటనకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చిందని, వారి ప్రయాణం, వసతి, ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిదని సమాచారం. అలాగే వీడియోలను చిత్రీకరించడంలో వారికి సహాయం చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీని కూడా ప్రభుత్వం నియమించింది.జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం సహకరించిందన్న విషయం బయటపడిన దరిమిలా ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేరళ ప్రభుత్వం సరైన వెరిఫికేషన్ లేకుండా విదేశీ గూఢచారులను ఆహ్వానించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీటిపై కేరళ పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందిస్తూ కేరళకు ఇతర ఇన్‌ఫ్లుయెన్లర్లతో పాటు జ్యోతిని ఆహ్వానించారని అన్నారు. ఇది కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమన్నారు. ఇది పారదర్శకంగా, మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమమని, గూఢచారులని ముందుగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదని అన్నారు.కేరళలో జ్యోతి మల్హోత్రా కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పుజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించారు. వీటికి సంబంధించిన వ్లాగ్‌లను ఆమె తన యూట్యూబ్ ఛానల్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో షేర్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత గత మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ను సందర్శించారని పోలీసుల విచారణలో తేలింది.జరిగింది ఇదే.. జ్యోతి మల్హోత్రా.. హర్యానాకు చెందిన 33 ఏళ్ల యూట్యూబ్ వ్లాగర్, "Travel with Jo" అనే ఛానెల్ ద్వారా పలు దేశాల్లోని ప్రయాణ అనుభవాలను పంచుకుంటూ ప్రజాదరణ పొందారు. అయితే, 2025 మేలో ఆమెపై పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.2023లో ఆమె మొదటిసారిగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు "దానిష్" అనే పాక్ అధికారి పరిచయం అయ్యాడు. అదే సమయంలో ఆమె పాక్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్యకాలంలో ఆమె కనీసం మూడు సార్లు పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. లాహోర్, కటాస్ రాజ్ ఆలయం వంటి ప్రదేశాల్లో ఆమె తీసిన వీడియోలు ఇప్పుడు దర్యాప్తులో భాగంగా పరిశీలించబడుతున్నాయి. 2024–2025లో కేరళ టూరిజం శాఖ ఆమెను అధికారికంగా ఆహ్వానించి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టూరిజం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఆమె ప్రయాణ ఖర్చులు, వసతి, షెడ్యూల్ అన్నీ ప్రభుత్వమే భరించింది. ఆమె "కేరళ సారీ" ధరించి తేయ్యం ప్రదర్శనలో పాల్గొన్న వీడియో వైరల్ అయింది. 2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె పాకిస్తాన్లో కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు అక్కడ సాయుధ రక్షణ ఉండటం గమనార్హం. ఇది ఆమెపై ఉన్న అనుమానాలను మరింత బలపరిచింది. దర్యాప్తులో భాగంగా.. ఆమె యూట్యూబ్ ఛానెల్లోని పాక్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వీడియోలన్నీంటిని ఏజెన్సీలు పరిశీలించాయి. డిలీట్ చేసిన డాటాను సైతం రికవరీ చేసి గుట్టును తేల్చే ప్రయత్నంలో ఉన్నాయి. 2025 మే 16న హర్యానాలోని హిసార్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై Official Secrets Act, 1923 కింద కేసు నమోదు చేశారు. జూన్ 12న బెయిల్ అభ్యర్థన తిరస్కరించబడింది. జూన్ 23న న్యాయస్థానం ఆమె న్యాయ హిరాసతను మరో రెండు వారాలు పొడిగించింది. తదుపరి విచారణ జూలై 7న(ఇవాళ) జరగనుంది. పాక్‌కు భారత రహస్యాలను చేరవేశారనే అభియోగాల కింద జ్యోతితో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో మరో 12 మందిని అరెస్ట్ చేశారు. -
కేరళలో బ్రిటిష్ ఎఫ్ 35 జెట్ ఎపిసోడ్.. మరో కీలక మలుపు
తిరువనంతపురం: అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35 ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో మరో కీలక మలుపు తిరిగింది. బ్రిటన్‌కు చెందిన ఆధునాతన స్టెల్త్ యుద్ధ విమానం F-35Bను రిపేర్ చేసేందుకు 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.నిపుణుల బృందం.. ఆర్ఏఎఫ్ జెడ్ఎం 417 , ఏయిర్‌బస్ A400M అట్లాస్ విమానంలో దిగారు. ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాకపోతే, దానిని విడిభాగాలుగా విడదీసి, C-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో యూకేకి ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ జెట్‌ను ఎయిర్‌పోర్ట్‌లోని ఒక ప్రత్యేక హ్యాంగర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.బ్రిటన్‌కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు.అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. -
యూపీ, కేరళ విద్యార్థులతో శుభాంశు మాటామంతీ
లక్నో/తిరువనంతపురం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి కేరళ, ఉత్తరప్రదేశ్ పాఠశాల విద్యార్థులు అత్యంత అరుదైన, మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందారు. భారరహిత స్థితిలో స్వేచ్ఛగా గాల్లో కదలాడుతూ బంతితో ఆడుకుంటున్న శుక్లాను చూసి ఆ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టరాని ఆనందంతో పదే పదే ప్రశ్నలు సంధించారు. వాళ్ల ప్రశ్నలకు శుక్లా వివరణాత్మక సమాధాలిచ్చారు. ‘‘ ఆయన అలా శూన్యస్థితిలో చక్కర్లు కొడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఐఎస్ఎస్లో ఎలా గాల్లో ఈదినట్లుగా ముందుకు కదలాలో ఆయన స్వయంగా కదిలి చూపించారు’’ అని కోజికోఢ్లోని నయార్కుళి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంఘవి చెప్పారు. శుక్లా సొంతూరు లక్నోలో, తిరునంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోని విద్యార్థులూ ఆయనతో మాట్లాడారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?. అలా కదులుతూ ఉంటే నిద్రపోవడమెలా?. హఠాత్తుగా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ ఉండరుగా. అప్పుడెలా?. ఇక్కడి నుంచి ఐఎస్ఎస్కు వెళ్లాక ఎంతకాలానికి అక్కడి వాతావరణానికి అలవాటుపడతారు?. తిరిగొస్తే ఇక్కడ మామూలుగా మారడానికి ఎంత టైమ్ పడుతుంది?.. ఇలా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు. ‘‘ ఐఎస్ఎస్లో నిద్రపోవడం ఒక సరదా పని. ఇక్కడ నేల, పైకప్పు రెండూ ఉండవు. అందుకే కొందరు గోడలకు, కొందరు సీలింగ్‌కు అతుక్కుని నిద్రిస్తూ కనిపిస్తారు. కదలకుండా పడుకోవాలంటే నిద్రపోయే స్లీపింగ్ బ్యాగ్‌ను దేనికైనా కట్టేసుకోవాల్సిందే’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. దీంతో విద్యార్థులు విరగబడి నవ్వారు. ‘‘ ఇక్కడి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో మెరుగ్గా ఉన్నా. భారరహిత స్థితికి అలవాటు పడటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. తిరిగి భూమి మీదకొచ్చాక గురుత్వాకర్షణ స్థితికి మారడం కూడా ఒక సవాలే’’ అని శుక్లా అన్నారు. ‘‘ ఒంటరిగా ఉన్నామని ఫీల్ అయితే వెంటనే కుటుంబసభ్యులు, స్నేహితులతో వర్చువల్‌గా మాట్లాడి మనసును తేలికచేసుకుంటాం. తరచూ వ్యాయామం చేస్తాం. ప్రయోగాలు సరేసరి’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు. ఇస్రో వారి విద్యార్థి సంవాద్ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములతో విద్యార్థుల మాటామంతీ పోగ్రామ్‌ను నిర్వహించారు. ‘‘ ఎప్పుడైనా కొన్ని నిమిషాలు తీరిక సమయం దొరికితే వెంటనే కిటికీల వద్దకు వెళ్లి అంతరిక్ష నుంచి మన పుడమిని చూడటం ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుందని ఆయన నాతో చెప్పారు’’ అని ఒక విద్యార్థి ‘పీటీఐ వీడియోస్’తో చెప్పింది. -
F-35 Row: రిపేర్ కుదరదు, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్!
అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35(F-35 fighter) ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. 20 రోజుల తర్వాత మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్నే పరిశీలిస్తున్నట్లు సమాచారం.బ్రిటన్‌కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు. అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. ఈలోపు.. సుమారు 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు మరమ్మతుల కోసం కేరళకు వచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని విడదీసి ఆ భాగాల్ని తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులకుగానూ.. విమానం పార్కింగ్, హ్యాంగర్ ఛార్జీలను చెల్లించాలని UK ప్రభుత్వం నిర్ణయించింది. భారత వైమానిక దళం, నౌకాదళం, తిరువనంతపురం విమానాశ్రయ అధికారుల సహకారానికి UK హై కమిషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.మీమ్స్ వైరల్తిరువనంతపురంలో నిలిచిపోయిన బ్రిటన్ ఎఫ్-35బీ యుద్ధ విమానం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. OLXలో 4 కోట్లకే అమ్మకానికి! అని ఓ యూజర్ చమత్కరించారు. ఇది స్టెల్త్ కాదు... స్టక్! అంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశారు. బ్రిటన్ టెక్నాలజీ.. చివరకు భారతీయ భూభాగంలో ఓడింది అంటూ ఓ మీమ్ దేశభక్తి టచ్‌తో వైరల్ అయ్యింది. ఇది ఫైటర్ జెట్ కాదు... పార్కింగ్ జెట్ అంటూ మరో యూజర్ ఎద్దేవా చేశారు. ఇది టూమచ్ గురూ.. F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్‌లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.పార్కింగ్ ఫీజు ఎంత చెల్లిస్తారంటే.. తిరువనంతపురం ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు ₹40–60 లక్షలు, అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. -
కేరళలో విషాదం.. కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం ఆసుపత్రిలోని 14వ వార్డుకు ఆనుకుని ఉన్న భవనం ఉదయం 11 గంటల ప్రాంతంలో కూలిపోయింది.తక్షణమే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా దాదాపు వంద మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పరిశీలించారు.అధికారులు ఈ భవనం వాడుకలో లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, భవనం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఆసుపత్రిలో రోగులు ఆ టాయిలెట్లను ఉపయోగించారంటూ కొందరు తెలిపారు. -
Indias 10 richest temples: రూ. 3 లక్షల కోట్లతో టాప్‌లో ఏది?
ఎంతో పవిత్రమైన, సాంస్కృతిక వారసత్వాన్ని చాటు దేవాలయాలకు నిలయం భారతదేశం. కోట్లాదిమంది భక్తులు సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు తమను సర్వ పాపాలనుంచి, ఆపదలనుంచి కాపాడతాడని విశ్వసిస్తారు. అనేకమంది భక్తులు తమ ఆరాధ్య దైవం పేరుతో లక్షలాది కానుకలను విరాళాలుగా ఇస్తుంటారు. అలా అత్యంత ఘనమైన సంపదతో అలరారే దేశంలోని టాప్ పది దేవాలయాలను పరిశీలిద్దాం.ప్రపంచం నలుమూలల నుండి ప్రతీ ఏడాది లక్షలాది భక్తులు, పర్యాటకులను అద్భుతమైన దేవాలయాలను సందర్శిస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. ఇందులో నగదు విరాళాలు, బంగారం, వెండి లాంటి విలువైన ఆస్తులు ఇందులో ఉంటాయి. వీటిని అనేక సామాజిక కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను వినియోగిస్తాయి సంబంధిత ఆలయట్రస్టులు. ఈ దేవాలయాల సంపద అమూలమ్యైన భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబించడమే కాకుండా, భారతదేశ సాంస్కృతిక, సామాజిక , ఆర్థిక నిర్మాణంలో వాటి పాత్రకు నిదర్శనం కూడా.భారతదేశంలోని 10 అత్యంత ధనిక దేవాలయాలుఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయంసుందరమైన తిరుమల కొండలలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక మతపరమైన ప్రదేశాలలో ఒకటి. దీని విలువ రూ. 3 లక్షల కోట్లు అని అంచనా. ప్రతిరోజూ దాదాపు 50వేల మంది భక్తులు సందర్శిస్తారు . ఈ ఆలయం విరాళాలు, బంగారం , ఇతర కానుకల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు రూ. 1,400 కోట్లు ఆర్జిస్తుంది.కేరళలోని తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా ప్రసిద్ధి చెందిన పద్మనాభస్వామి ఆలయంలో రూ.1.2 లక్షల కోట్ల విలువైన సంపద దీని సొంతం.బంగారు ఆభరణాలు, వజ్రాలు, పురాతన వెండి , పచ్చలు ఉన్నాయి. 2015లో, గొప్ప ఖజానాను గుర్తించడం ఇప్పటికే ఉన్న భారీ నిధికి మరింత తోడైంది.గురువాయూర్ దేవస్వం, కేరళలోని గురువాయూర్విష్ణువు కొలువై ఉండే ఈ పురాతన ఆలయం సంపదకూడా చాలా ఎక్కువ.. దీనికి రూ.1,737.04 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 271.05 ఎకరాల భూమిని కలిగి ఉందని తెలుస్తోంది. ఈ ఆలయంలో బంగారం, వెండి ,విలువైన స్టోన్స్‌కు సంబంధించి పెద్ద నిధి కూడా ఉంది. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంసముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉన్న పవిత్ర దుర్గాదేవి ఆలయం భారతదేశంలోని అత్యంత సంపన్నమైన వాటిలో ఒకటి. 2000-2020 వరకు, దీనికి 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి. రూ. 2,000 కోట్లకు పైగా నగదు విరాళాలుగా వచ్చాయి.మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయందేశంలో అత్యధికంగా సందర్శించే ఆలయాలలో ఒకటి షిర్డీ సాయినాథునికి ఆలయం. రోజుకు దాదాపు 25,000 మంది భక్తులను ఆకర్షిస్తుంది. ముంబై నుండి దాదాపు 296 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని 1922లో నెలకొల్పారు. 2022లో రూ. 400 కోట్లకు పైగా విరాళాలు అందుకుంది. ఇది రెండు ఆసుపత్రులను కూడా నిర్వహిస్తుంది. ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులకు ఉచిత భోజనాన్ని అందిస్తుంది.అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం ( గోల్డెన్ టెంపుల్)బంగారం తాపడం చేసిన అద్భుతమైన దేవాలయం స్వర్ణ దేవాలయం. గొప్ప వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన సిక్కు మతం ఆధ్యాత్మిక హృదయంగా భావిస్తారు. 1581లో నిర్మించబడిన ఇది ప్రతి సంవత్సరం దాదాపు రూ. 500 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.మధుర మీనాక్షి ఆలయంతమిళనాడులో మధురైలో ఉన్న ఈ ఆలయం దాని అద్భుతమైన డిజైన్ , పండుగ వాతావరణానికి ప్రశంసలు అందుకుంది. ఇక్కడకొలువుదీరిన మీనాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇది రోజుకు 20వేల మందికి పైగా భక్తులువస్తారు. ప్రతి సంవత్సరం రూ. 60 మిలియన్లు సంపాదిస్తుందని అంచనా.సిద్ధివినాయక ఆలయం, ముంబైముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రసిద్ధ గణేష్ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకటి, దీని విలువ రూ. 125 కోట్ల అంచనా. దీనికి ప్రతిరోజూ రూ. 30 లక్షల విలువైన కానుకలు అందుతాయి.ఇక్కడ విగ్రహం 4 కిలోల బంగారంతో అలంకరించి ఉంటుంది.గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంభారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన శివాలయాలలో ఒకటైన సోమనాథ్ 12 జ్యోతిర్లింగాలలో ఇది మొదటిదిగా భావిస్తారు. ఈ ఆలయం గర్భగుడిలో 130 కిలోల బంగారం, దాని శిఖరంపై అదనంగా 150 కిలోలు ఉన్నాయట.ఒడిశాలోని పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయంఒడిశా ఆధ్యాత్మిక వారసత్వానికి మూలస్తంభమైన 11వ శతాబ్దపు ఆలయం జగన్నాథ ఆలయం. చార్ ధామ్ యాత్రలో కీలకమైంది కూడా. . దీని విలువ దాదాపు రూ. 150 కోట్లు . దీంతోపాటు దాదాపు 30వేల ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు ఇటీవల నిర్మితమైన, బాగా ప్రాచుర్యం పొందిన, అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటి అయోధ్యలోని రామమందిరం. -
kerala: స్కూళ్లలో ‘జుంబా’ వార్.. ఆరోగ్యానికే అంటున్న విద్యాశాఖ
తిరువనంతపురం: పాఠశాల విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించడానికి, వారు మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపకుండా ఉండేందుకు కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జుంబా శిక్షణను అందిస్తోంది. అయితే ప్రభుత్వం సదుద్దేశంతో ప్రారంభించిన ఈ శిక్షణపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేరళలోని పాఠశాలల్లో జుంబా ఫిట్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడంపై రాష్ట్రంలోని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు పాఠశాలల్లోని విద్యార్థులకు జంబాలో శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధమంటూ కేరళ సున్నీ యువజన సంఘం (ఎస్వైఎస్) రాష్ట్ర కార్యదర్శి అబ్దుస్సమద్ పూక్కొట్టూర్ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి టికె అష్రఫ్ కూడా దీనిని వ్యతిరేకించారు. బాలురు, బాలికలు పొట్టి దుస్తులు ధరించి సంగీతానికి అనుణంగా గెంతులు వేయడం ఏమిటి? ఇది నృత్యం చేసే సంస్కృతి కాదని, ఇటువంటి పాఠశాలలో తన కుమారుడిని తాను జాయిన్ చేయనని అన్నారు. ఉపాధ్యాయునిగా తాను ఈ తరహా నృత్యాన్ని పాఠశాలలో అమలు చేయనివ్వనని, దీనికి ప్రతిగా ఏ చర్య తీసుకున్నా, తాను సిద్ధమేనని ఆయన అన్నారు. ముస్లిం సంఘాల నుండి ఎదురవుతున్న విమర్శల మధ్య కేరళ విద్యా శాఖ.. జుంబా నృత్యం అనేది మానసిక, శారీరక శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని పేర్కొంది. మనం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇది 2025. మనం ఆదిమ కాలంలో జీవించడం లేదు. ప్రతి ఒక్కరూ కాలానికి అనుగుణంగా నడుచుకోవాలని కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నిందితులతో టీఎంసీ దోస్తీ?.. ఫొటోతో బీజేపీ ఆరోపణ -
Anju టెర్రస్ గార్డెన్లో తోపు : 600కు పైగా గులాబీలు
మడిసన్నాక కాపింత కళాపోషనుండాల అన్నట్టు గట్టిగా అనుకోవాలే కానీ చారెడు మట్టినేల లేకున్నా కోరుకున్న పంట పండించవచ్చని నిరూపించింది కేరళకు చెందిన అంజు కార్తీక (Anju Karthika). తన ఇంటి మిద్దె తోటలో ఆమె 600 రకాల గులాబీలను విరబూయించి రోజాపూల ప్రేమికుల గుండెలను గులాబీ సౌరభాలతో నింపేసింది. కేరళలోని కయాంకుళానికి చెందిన యాభై రెండు సంవవత్సరాల అంజు కార్తీకకు చిన్నప్పటినుంచి పువ్వులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ గులాబీలంటే ప్రాణం. స్కూల్లో చదివేటప్పుడే ఆమెలో గులాబీలపైన ప్రేమ బీజం నాటుకుని మొలకెత్తింది. అది ఆమెతోపాటే పెరిగి పెద్దదై కొమ్మలు రెమ్మలుగా విస్తరించింది. ఆమెకు పూలంటే ఉన్న మక్కువ మట్టిగా... ఆమె కృషి, పట్టుదలలే నీరు, ఎరువులుగా మారి ఆమె కోరుకున్నన్ని రకాల గులాబీ బాలలయ్యాయి. కార్తీకకు పదవ తరగతి విద్యార్థినిగా ఉన్నప్పటినుంచే స్నేహితుల తోటల నుంచి గులాబీల అంట్లు తీసుకొచ్చి తన ఇంటిలో వాటిని పెంచే ప్రయత్నాలు చేసేది. తోటి వారందరూ ఆటపాటలలో బిజీగా ఉన్నప్పుడు ఆమె నిశ్శబ్దంగా తన మొక్కల ప్రపంచంలో పడి వాటిని పెంచడంలో విసుగూ విరామం లేకుండా గంటలు గంటలు గడిపేది. తాను అంటుకట్టిన గులాబీ అందమైన మొగ్గ తొడిగినప్పుడు ఆమె గుండెల్లో ఆనందం ఉప్పొంగేది. గులాబీల పెంపకం పట్ల గల ఆమె అభిరుచి ఆమె టీనేజ్ దాటిన తరువాత వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. 2013లో ఆమె బ్రెజిల్, థాయిలాండ్‌లలో పెరిగే టేబుల్ గులాబీ రకాల గురించి తెలుసుకున్నటినుంచి మరింతగా వికసించింది. 15 రకాల గులాబీ మొక్కలను సేకరించి తన టెర్రస్‌పై రకరకాల కంటైనర్లలో పెంచడం ప్రారంభించింది. వాటి పోషణలో... సంరక్షణలో ఆమె కృషి ఫలించింది. ఈ వాతావరణంలో కూడా అక్కడి గులాబీ రకాలు అభివృద్ధి చెంది రోజుకో రకం మొక్క, పూటకో రకం పువ్వు అన్నట్టు విచ్చుకోనారంభించాయి. ఆమె సేకరించి పెంచుతున్న గులాబీల సౌరభాలు క్రమేణా కేరళ దాటి పొరుగు రాష్ట్రాలకు, అక్కడినుంచి విదేశాలకు కూడా చేరాయి. అలా ఒక ప్రయోగం ఫలించగానే మరో ప్రయోగం చేస్తూ వచ్చింది. చెన్నై, పూణెలలోని రకరకాల నర్సరీల నుంచి కొత్తరకాల గులాబీ అంట్లను తెప్పించేది. పరాగ సంపర్కాన్ని ఉపయోగించి ఆమె అంటుకట్టిన గులాబీ రకాలు మావిచిగురు, నారింజ, వంకాయ రంగు, ఊదా రంగు.. ఇంకా రకరకాల రంగులలో రూపాలలో ఊపిరి పోసుకుని వివిధ రకాల ఆకృతులలో విచ్చుకోసాగాయి. ఆమె తన ఇంటి మిద్దెనే ప్రయోగశాలగా మార్చుకుని చేసిన వినూత్న ప్రయోగాలు ఆమెకు ఆదాయ మార్గాలుగా కూడా మారాయి. చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు? ఫేస్బుక్లో ఆమె తాను పెంచుతున్న గులాబీ రకాలను అందమైన ఫొటోలు తీసి పోస్ట్ చేసేది. వాటిని చూసి మైమరచి పోయిన ఆమె స్నేహితులు, బంధువులు తమకు కావాలంటే తమకు కావాలంటూ ఆమెకు ఆర్డర్లు పంపసాగారు. అలా అందుకున్న ఆర్డర్ల ద్వారా ఆమె రోజుకు కొన్ని వేల రూపాయల ఆదాయాన్ని కళ్ల జూసేది. ప్రస్తుతం ఆమె మిద్దెతోటలో లేని గులాబీ రకం లేదంటే అతిశయోక్తి కాదు. ఏవిధమైన ఏజెంట్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకుండానే ఆమె తన నోటిమాటలు, ఫేస్బుక్ సమూహాల ద్వారా అడిగిన వారికి లేదనకుండా గులాబీ అంట్లను పంపుతూ వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. చేయాలనే సంకల్పం, దానిని నెరవేర్చుకునేందుకు కావలసిన శ్రద్ధ, అంకిత భావం, పట్టుదల ఉంటే చాలు.. దేనినైనా సాధించి చూపవచ్చుననేందుకు నిదర్శనం అంజు కార్తీక గులాబీ తోట. ఇదీ చదవండి: రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్ గోయెంకా విమర్శలు -
13 రోజులైనా కేరళలోనే యూకే యుద్ధ విమానం
త్రివేండ్రం: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయిన బ్రిటన్ నేవీ యుద్ధ విమానం ఎఫ్–35 గత 13 రోజులుగా అక్కడే ఉంది. టేకాఫ్ ప్రయత్నాలు విఫలం కావడంతో రాయల్ బ్రిటీష్ నేవీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైడ్రాలిక్ స్నాగ్ కారణంగా ఉండిపోయిన ఎఫ్–35బీ యుద్ధనౌకను తరలించడం కోసం యూకే నుంచి ప్రత్యేక టో వాహనం వస్తోంది. 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు, నిపుణుల బృందం కూడా కేరళకు బయల్దేరింది. ఫైటర్ జెట్‌ను భారత్‌లోనే మరమ్మతు చేయనున్నట్లు సమాచారం. యుద్ధవిమానం పార్కింగ్ కోసం బ్రిటన్ భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సరిపడా ఇంధనం లేకపోవడంతో పాటు వాతావరణం అనుకూలించక విమాన వాహన నౌక తిరిగి రాకపోవడంతో ఎఫ్–35బి జూన్ 14న తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవడం తెలిసిందే. సురక్షిత ల్యాండింగ్‌కు భారత వైమానిక దళం వీలు కల్పించింది. ఇంధనం నింపడంతో పాటు అన్నిరకాల మద్దతు అందించింది. కానీ హైడ్రాలిక్ వైఫల్యంతో జెట్ ఎగరలేకపోయింది. దాన్ని సరిచేయడానికి రాయల్ నేవీ టెక్నీషియన్ల చిన్న బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం ప్రస్తుతం సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) రక్షణలో బే 4 వద్ద ఉంది. ‘‘తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎఫ్–35బీని వీలైనంత త్వరగా మరమ్మతు చేయడానికి యూకే కృషి చేస్తోంది. భారత అధికారుల నిరంతర మద్దతుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’అని భారత్‌లోని బ్రిటిష్ హైకమిషన్ పేర్కొంది. నిపుణుల బృందం మరమ్మత్తు ప్రయత్నాలు కూడా విఫలమైతే జెట్‌ను యూకేకి విమాన మార్గంలో తరలించడమే చివరి మార్గమని చెబుతున్నారు. జోరుగా మీమ్స్ బ్రిటన్ యుద్ధ విమానం రెండువారాలుగా కేరళలోనే ఉండటంపై ఆన్లైన్లో జోరుగా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. 11 కోట్ల డాలర్ల విలువైన జెట్‌ను కేవలం 4 కోట్లకే ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచినట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రెండు వారాలుగా ఇక్కడే ఉంటున్నందున ఆ జెట్‌కు భారత పౌరసత్వానికి అర్హత వచ్చిందని కొందరు చమత్కరించారు. ‘‘బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయబట్టి సరిపోయింది. మరెక్కడైనా అయితే దొంగతనానికి గురయ్యేది’’అంటూ మీమ్స్ వైరలవుతున్నాయి. -
Arya Rajendran: మమ్దానీ మెచ్చిన మన మేయర్
జోహ్రాన్ మమ్దానీ.. ప్రపంచం మొత్తం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన భారత సంతతి వ్యక్తి. న్యూయార్క్ నగర మేయర్ పదవి రేసులో అభ్యర్థిగా నిలబడిన ఈ 33 ఏళ్ల యువ నాయకుడి ప్రచార శైలి, ఎన్నికల హామీల గురించే అక్కడి జనం చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఓ యువ నేత గురించి ఆయన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్య రాజేంద్రన్.. ఈ పేరు గుర్తుందా?. కేవలం 21 ఏళ్ల వయసులో తిరువనంతపురం మేయర్ పదవి చేపట్టారు. తద్వారా దేశంలోనే అత్యంత చిన్నవయసులో మేయర్‌గా ఎన్నికైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ టైంలో తన సోషల్ మీడియా ఖాతాలో మమ్దానీ ఈ విషయాన్ని ప్రస్తావించడం ఇప్పుడు హైలైట్ అవుతోంది. న్యూయార్క్‌కు ఎలాంటి మేయర్ అవసరం?.. రాజేంద్రన్ లాంటి నేత అవసరం అంటూ పోస్ట్ చేశారాయన. డెమొక్రటిక్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా మమ్దానీ ఎన్నికైన తరుణంలో ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. them: so what kind of mayor does nyc need right now?me: https://t.co/XEuvK6VvOc— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) December 27, 2020👉1999 జనవరి 12వ తేదీన జన్మించిన ఆర్య రాజేంద్రన్.. తిరువంతపురం కార్పొరేషన్ మేయర్. నెమోం అసెంబ్లీ నియోజకవర్గం ముడవన్ముగల్ వార్డు నుంచి ఆమె ఎన్నికయ్యారు. ఆమె కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) – CPI(M)లో ఉన్నారు. కిందటి ఏడాది తిరువనంతపురం జిల్లా కమిటీకి కూడా ఎన్నికయ్యారు. ఈమె భర్త కేరళ అసెంబ్లీకి చిన్న వయసులో ఎన్నికైన శాసన సభ్యుడు కేఎం సచిన్ దేవ్. 2023లో ఆమె నెల వయసున్న చంటి బిడ్డతో కార్యాలయంలో పని చేసిన వీడియో బాగా వైరల్ కావడంతో.. ఆమెపై ప్రశంసలు కురిశాయి. అదే సమయంలో.. కిందటి ఏడాది ఓ బస్సు డ్రైవర్‌తో ఆమెకు జరిగిన వాగ్వాదం తీవ్ర విమర్శలకు దారి తీసింది కూడా. ఇక.. న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ చేస్తున్న భారతీయ మూలాల జోహ్రాన్ మమ్దానీ 2020లో ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైది. “న్యూయార్క్‌కు అవసరమైన మేయర్ ఎవరు?”అంటూ ఆమెను ఉదాహరణగా చూపించారు. ఆర్య మేయర్‌గా వేస్టేజ్ మెనేజ్మెంట్తోపాటు ఆరోగ్య సేవల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 24/7 ఆరోగ్య కేంద్రాలు, శాస్త్రీయ వ్యర్థాల పారవేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.👉33 ఏళ్ల వయసున్న జోహ్రాన్ మమ్దానీ.. న్యూయార్క్ మేయర్ పదవి రేసులో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో ఈయన జన్మించాడు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్ రమా దువాజీ(rama duwaji). న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారంలో.. ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్రాసరి స్టోర్లు లాంటి హామీలతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడీయన. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలు కూడా ఉన్నాయి. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు. అంతేకాదు.. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న నేత అంటూ ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే జోహ్రాన్ మమ్దానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాను డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడాయన. నవంబర్‌లో న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఆ ఎన్నికల్లో గెలిస్తే.. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మొదటి ముస్లిం, భారతీయ-అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. -
కేరళలో విషాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన పాత భవనం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. తాజాగా.. త్రిస్సూర్ సమీపంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 27 మంది భవనంలో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇప్పటికే 14 మంది బయటకు తీసుకొచ్చింది. తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. శుక్రవారం ఉదయం కొడకర ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి ముగ్గురు మరణించారు. భవనం పాతదని, అందులో వలస కార్మికులు నివసిస్తున్నారని సమాచారం. మరణించిన ముగ్గురూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులేనని అధికారులు ప్రకటించారు. మృతులు:రాహుల్ (19) – ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిరుపెల్ (21) – మృతదేహంగా వెలికితీశారుఅలీమ్ (30) – శవంగా గుర్తింపుసుమారు 40 ఏళ్ల భవనం కావడం, లాటరైట్ ఇటుకలతో నిర్మించబడడంతో భారీ వర్షాలకు కూలి ఉంటుందని అధికారులు పప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ బిడ్డింగ్ పక్కనే కొడకర పంచాయతీ కార్యాలయం ఉన్నప్పటికీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఫైర్, రెస్క్యూ బృందాలు జేసీబీలు, భారీ యంత్రాలు ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
చల్లటి చిరుజల్లుల్లో చూడాల్సిన కమనీయక పర్యాటక ప్రదేశాలివే..!
-
హేమ కమిటీ రిపోర్టుపై సిట్ సంచలన నిర్ణయం
తిరువనంతపురం: కేరళలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయమై సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నమోదైన 35 కేసులను మూసి వేస్తున్నట్లు సిట్ తాజాగా కేరళ హైకోర్టుకు తెలిపింది. అయితే, ఆ కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు బాధితులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిని క్లోజ్ చేస్తున్నట్టు సిట్ స్పష్టం చేసింది.మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జస్టిస్ హేమా కమిటీ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిపోర్ట్ దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటైంది. అనంతరం, సిట్.. ఆయా కేసులఫై దర్యాప్తు చేపట్టినప్పటికీ బాధితులు ఎవరూ వాంగ్మూలం ఇచ్చేందుకు మాత్రం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసులన్నింటినీ మూసివేస్తున్నామని న్యాయస్థానానికి తెలియజేసింది. దీంతో, సిట్ నివేదికపై దర్యాప్తు జరిపిన న్యాయస్థానం.. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. ఆయా కేసులను మూసివేయమని ఆదేశించింది.కమిటీ సంచలన నివేదిక..ఇదిలా ఉండగా.. మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. ‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు... చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది. రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్ హేమ.ఇదీ నేపథ్యం..దాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు.విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు.ఎదురు ప్రశ్నించకూడదు..‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది.అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ‘ఫేవర్’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.ఆ 15 మంది..కొంతమంది హీరోలు.. మరికొంతమంది దర్శకులు.. ఇంకొందరు నిర్మాతలు.. ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది. -
అర ఎకరం భూమి లేకుండానే డ్రాగన్ పంట..!
ఉపాధ్యాయురాలిగా పనిచేసే రెమబాయి రిటైర్ అయ్యారు. అదే సమయంలో తల్లి చనిపోయారు. ఏదో శూన్యం ఆవరించినట్లు అనిపించింది. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టారు కేరళలోని కొల్లమ్‌కు చెందిన రెమబాయి. ఆమెకు అర ఎకరం కూడా వ్యవసాయ భూమి లేదు. ఇంటి టెర్రస్‌నే సాగుభూమిగా మార్చుకున్నారు. ‘వ్యవసాయ భూముల్లో కాకుండా టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్స్ పండించడం చాలా కష్టం’ అనే మాటను సవాలుగా తీసుకున్నాకే సాయిల్లెస్ ప్లాంటింగ్ మెథడ్‌తో ముందుకు వెళ్లారు. కూరగాయల వ్యర్థాలు, ఎండుటాకులు... మొదలైన వాటితో సేంద్రియ ఎరువులు స్వయంగా తయారు చేసుకున్నారు.డ్రాగన్ ఫ్రూట్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి అప్పుడెప్పుడో విన్న రెమబాయి వాటిని పండించాలనుకున్నారు. రిటైర్మెంట్ తరువాత తన కలను నిజం చేసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ల ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు అర్జించడం విశేషం! డ్రాగన్ ఫ్రూట్ సాగులో తన అనుభవాలను పంచుకోవడానికి ‘జెసీ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు రెమబాయి.ఆమె విజయ రహస్యం ఏమిటి?‘నా వయసు 58 సంవత్సరాలు. అయితే ఎప్పుడూ 20 ఏళ్ల వయసులాగే ఫీలవుతాను’ అంటూ తన విజయ రహస్యాన్ని చెప్పకనే చెప్పారు రెమబాయి. (చదవండి: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..! సుందర్ పిచాయ్‌కి కలిగిన సందేహం) -
Shashi Tharoor: కాంగ్రెస్-శశిథరూర్ విభేదాల్లో ట్విస్ట్
తిరువనంతపురం: కాంగ్రెస్ వర్సెస్ ఆ పార్టీ కేరళ ఎంపీ శశి థరూర్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకు నీలంబూర్ బై పోల్ ఎలక్షన్ ప్రచారం వేదికగా మారింది. మలయాళ సినీ ప్రముఖుడు ఆర్యదన్ షౌకత్ నీలంబూర్ బై ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేశారు. ఆ ఎన్నిక కోసం కేరళ కాంగ్రెస్ యూనిట్ స్టార్ క్యాంపెయినర్ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఎంపీ శశిథరూర్ పేరు సైతం ఉందని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ చెబుతున్నారు.కానీ స్టార్ క్యాంపెయినర్ జాబితా గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీ శశిథరూర్ చెప్పడం విశేషం. పార్టీ నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఎవరూ అడిగింది లేదు. ఎన్నికల ప్రచారం, స్టార్ క్యాంపెయినర్ జాబితా గురించి నాకు ఫోన్ చేసింది లేదు. అయినప్పటికీ, ఆర్యధన్ షౌకత్ తరుఫున పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సమయంలో ఎక్కువ భాగం విదేశాలలో అధికారిక దౌత్య పర్యటనలో ఉన్నాను’ అని చెప్పారు. అయితే, శశిథరూర్ పై వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే సన్నీ జోసెఫ్ ఘాటుగా స్పందించారు. ‘నీలంబూర్ ఉప ఎన్నికలో భాగంగా ఆర్యదన్ షౌకత్ తరుఫున ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేశాం. ఆ జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాం. శశిథరూర్ ఆయన ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఎక్కువ శాతం విదేశాల్లో తిరుగుతుంటారు. లేదంటే ఢిల్లీలో ఉంటారు. కేరళ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేనని ముగించారు. గురువారం శశిథరూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించారు. ఆ విభేదాలేంటి? అనే అంశాన్ని దాట వేశారు.పహల్గాం ఉగ్రదాడి అనంతరం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు భారత్ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాల ఎదుట పాక్‌ను దోషిగా నిలబెట్టేలా కేంద్రం అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో అనూహ్యంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు స్థానం కల్పించింది. నాటి నుంచి కాంగ్రెస్-ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందం విదేశీ పర్యటన సమయంలో శశిథరూర్ ప్రధాని మోదీని ఆకాశానికెత్తారు. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిందంటూ ప్రశంసలు కురిపించారు. శశిథరూర్ చేసిన ఆ వ్యాఖ్యలే కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. అంతర్ఘతంగా శశిథరూర్‌ను తీరును పార్టీ పెద్దల ఎదుట తప్పుబట్టినట్లు సమాచారం. తాజాగా, కేరళలో జరిగిన ఉప ఎన్నికకు శశిథరూర్‌కు ఎటువంటి ఆహ్వానం అందకపోవడం గమనార్హం."I wasn't invited by party (for Nilambur by-election campaign). Yes, there are some differences b/w me & leadership. Those can be sorted out in closed-door conversations. So far, no one has reached out to me. When nation needs my service, I am always ready."- .@ShashiTharoor pic.twitter.com/NPzj89NJdr— BhikuMhatre (@MumbaichaDon) June 19, 2025 -
BCCI: బీసీసీఐకి ‘భారీ’ షాక్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి గట్టి షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగమైన ఒకప్పటి ఫ్రాంఛైజీ కొచ్చి టస్కర్స్ కేరళకు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. కాగా ఐపీఎల్లో ఒక సీజన్ తర్వాత తగిన కారణాలు లేకుండా తమ జట్టును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కొచ్చి టస్కర్స్ కేరళ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో బీసీసీఐదే తప్పని తేల్చింది. అదే విధంగా.. కొచ్చి యాజమాన్యానికి రూ. 538 కోట్లు చెల్లించాలని ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎనిమిదో స్థానంలోకాగా ఐపీఎల్- 2011 సీజన్లో మాత్రమే ఆడిన టస్కర్స్ టీమ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే జట్టు మేనేజ్మెంట్ నిబంధనలు ఉల్లంఘించిందని, సరైన సమయంలో బ్యాంక్ గ్యారంటీ చెల్లించలేదని పేర్కొంటూ కొచ్చి టీమ్‌ను బీసీసీఐ లీగ్ నుంచి తప్పించింది.ఈ విషయంపై... టీమ్‌లో భాగస్వాములైన కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (కేసీపీఎల్), రెండేవూ స్పోర్ట్స్ వరల్డ్ (ఆర్ఎస్డబ్ల్యూ) కోర్టుకెక్కాయి. చివరకు 2015లో కోర్టు ఆర్బిట్రేటర్ కొచ్చికి అనుకూలంగా తీర్పునిస్తూ రూ. 538 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అయితే, ఆర్బిట్రేటర్ నిర్ణయాన్ని బోర్డు హైకోర్టులో సవాల్ చేయగా...ఇప్పుడు అదే తీర్పునకు హైకోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం కేసీపీఎల్కు రూ.385.50 కోట్లు, ఆర్ఎస్డబ్ల్యూకు రూ.153.34 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. దీనిపై మళ్లీ అప్పీల్ చేసేందుకు బీసీసీఐకి ఆరు వారాల గడువు ఉంది. ప్రస్తుతం పదికాగా ఐపీఎల్లో ప్రస్తుతం పది జట్లు ఉన్నాయి. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ క్యాష్ రిచ్ లీగ్‌లో కొనసాగుతున్నాయి. వీటిలో ముంబై, చెన్నై అత్యధికంగా ఐదేసి సార్లు టైటిల్ గెలవగా.. కోల్‌కతా మూడుసార్లు ట్రోఫీని ముద్దాడింది. ఇక 2008 నాటి తొలి సీజన్లో రాజస్తాన్ చాంపియన్‌గా నిలవగా.. సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి టైటిల్ అందుకున్నాయి. తాజాగా ఐపీఎల్-2025లో విజేతగా నిలిచి బెంగళూరు జట్టు కూడా చాంపియన్ల జాబితాలో చేరింది. ఇక కొచ్చి టస్కర్స్‌తో పాటు దక్కన్ చార్జర్స్, గుజరాత్ లయన్స్ కూడా ఇప్పుడు ఉనికిలో లేవు. వీటిలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ దక్కన్ చార్జర్స్ కూడా ఓసారి టైటిల్ గెలిచింది.చదవండి: ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు -
Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు
Air India plane crash అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమానం 171 ప్రమాదంలో ఘోర ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాంలో విమాన ప్రయాణికులతోపాటు, అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత వైద్య విద్యార్థులు ,వైద్యుల కుటుంబాలను ఆదుకోవడానికి యుఏఈలో ఉండే భారతీయ డాక్టర్ షంషీర్ వాయాలిల్ (Indian doctor Shamshir Vayalil) ముందుకొచ్చారు. సుమారు రూ. 6కోట్ల (2.5 మిలియన్ దిర్హామ్ సహాయాన్ని ప్రకటించారు..కేరళకు చెందిన వైద్యుడు బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ , VPS హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ వాయలిల్ మానవ్, ఆర్యన్, రాకేష్ , జైప్రకాష్లను "భవిష్యత్ ఫ్రంట్‌లైన్ హీరోలు" అంటూ వారికి నివాళి అర్పించారు. స్వయంగా మెడికల్ హాస్టల్లో చదువుకున్న ఆయన వైద్య విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. భోజనం తింటున్న సమయంలో హాస్టల్లో జరిగిన ప్రమాదంలపై ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఈ నేపథ్యంలో యువ వైద్యుల కుటుంబాలకు అండగా నిలబడానికి నిర్ణయించుకున్నారు. అబుదాబి నుంచే ఆయన ఈ సాయాన్ని ప్రకటించారు. దీన్ని మరణించిన నలుగురు విద్యార్థుల కుటుంబాలలో ఒక్కొక్కరికి రూ. కోటి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, సన్నిహితులను కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు రూ. 20 లక్షల అందించనున్నారు. బీజే మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా డా. షంషీర్ ప్రకటించిన సాయం త్వరలోనే అందనుంది.They were future frontline heroes.Manav, Aaryan, Rakesh, and Jaiprakash were preparing to save lives, not lose their own. The AI171 crash took them from us. Pledging ₹6 crore to support their families and others affected.#AirIndia171 #AI171 #BJMedicalCollege pic.twitter.com/Jh0vivpstJ— Dr. Shamsheer Vayalil (@drshamsheervp) June 16, 2025ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను చూసినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారట. తాను హాస్ట్‌లో ఉంటూ చదువుతకుంటూ రోజులను తలచుకున్న ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారట. వాయలిల్ తాను చదువుకునే రోజుల్లో మంగళూరు (Mangalore)లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ, చెన్నై(Chennai)లోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ హాస్టళ్లలో ఉన్నారట. స్వయంగా వాయలిల్ అల్లుడు, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ యజమాని M.A. యూసుఫ్ అలీ తెలిపారు. మరోవైపు బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కూడా అయిన వాయలిల్ తన దాతృత్వాన్ని చాటుకోవడం ఇదే మొదటి సారి కాదు 2010లో, మంగళూరు విమాన ప్రమాదం తర్వాత, బుర్జీల్ హోల్డింగ్స్‌లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పించారు.ఇదీ చదవండి: Cancer Risk ఈ ఫుడ్స్‌తో ముప్పే..!డాక్టర్ వార్నింగ్కాగా లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 ,జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అతుల్య హాస్టల్ కాంప్లెక్స్‌లో కూలిపోయింది. ఈఘటనలో మెడికల్ కాలేజీ (BJMC) మెస్ భవనంలో భోజనం చేస్తుండగా మరణించిన వారి సంఖ్యను BJMC జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JDA) ధృవీకరించింది . ప్రమాదంలో మరో 20 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపింది. వారిలో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగిలిన చికిత్స పొందుతున్నారని DA అధ్యక్షుడు డాక్టర్ ధవల్ గమేటి తెలిపారు. విద్యార్థుల ప్రాణనష్టంతో పాటు, "అతుల్యం" నివాస గృహాలలో నివసిస్తున్న సూపర్-స్పెషాలిటీ వైద్యుల నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక నివాస వైద్యుడి భార్య గాయపడి చికిత్స పొందుతోంది. -
పాలక్కాడ్ అందాలు.. కమనీయ పర్యాటక ప్రదేశాలివే..!
-
విద్యార్థులతో గుంజిళ్లు.. టీచర్‌కు సర్కార్ నోటీసు
తిరువనంతపురం: విద్యార్థినుల చేత గుంజిళ్లు తీయించినందుకు ప్రభుత్వం ఉపాధ్యాయురాలికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన కేరళలోని కాటన్హిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాల ముగిసిన అనంతరం జాతీయ గీతం ఆలపిస్తారు. కార్యక్రమం జరుగుతుండగానే కొందరు విద్యార్థినులు తరగతి గదినుంచి బయటికి వెళ్లిపోయారు. అది చూసిన టీచర్ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జాతీయగీతం పాడుతుండగా వెళ్లిపోయిన విద్యార్థినులను గుంజిళ్లు తీయించారు. దీంతో ఆయా విద్యార్థినులు స్కూల్ బస్సును మిస్సయ్యారు. తమ పిల్లలు రోజూకంటే ఆలస్యంగా ఇంటికి రావడంతో వారిని ప్రశ్నించిన తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఇది విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో ఎలాంటి వివరణ లేకుండానే విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి ఆదివారం ఉపాద్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. జిల్లా విద్యాశాఖాధికారి నివేదిక మేరకు.. నోటీసులు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. -
డివోర్సీ క్యాంప్స్
విడాకులు తీసుకున్న స్త్రీల గురించి వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. తప్పు ఎవరిదైనా వీరినే సందేహంగా చూస్తారు. విడాకుల తర్వాతి జీవితం పురుషుడికి ఉన్నంత సులువుగా స్త్రీకి లేదు. వారికంటూ స్నేహబృందం కష్టమే. అందుకే కేరళకు చెందిన రాఫియా తాజాగా నిర్వహించిన ‘డివోర్సీ క్యాంప్’ అందరి దృష్టినీ ఆకర్షించింది. విడాకులు పొందిన స్త్రీల బృందం రెండు రోజులపాటు స్నేహితులుగా మారి తమ మనోభావాలు పంచుకోవడమే ఈ క్యాంప్స్ లక్ష్యం. మొదటిది సక్సెస్ కావడంతో రాబోయే రెండు నెలల్లో మరో నాలుగు క్యాంప్స్ నిర్వహించనుంది రాఫియా.‘మేము కలిసేది మా బాధలు, పాత కథలు చెప్పుకుని ఏడ్వడానికి కాదు. మేము మర్చి పోయిన నవ్వును తిరిగి పొందడానికి’ అంటుంది రాఫియా అఫి. 30 ఏళ్ల ఈ డివోర్సీది కేరళలోని ఇడుక్కి. వారం క్రితం ఈమె పదిహేను మంది డివోర్సీ మహిళలతో ఇడుక్కీకి సమీపంలో ఉండే వాగమాన్ అనే అందమైనచోట రెండు రోజుల ‘డివోర్సీ క్యాంప్’ నిర్వహించింది. బహుశా దేశంలో ఇలాంటి మాట వాడుతూ స్త్రీల బృందం కలవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ పదిహేనుమందిలో ఎక్కువమంది విడాకులు పొందినవారు... మిగిలిన వారు పొందేందుకు పోరాటం చేస్తున్నవారు. వీరిలో ఒకరిద్దరు తమ పిల్లలతో వచ్చారు కూడా. మాకంటూ స్పేస్ కావాలి‘సమాజంలో విడాకులను ఇప్పటికీ వ్యక్తిగత వైఫల్యంగా చూస్తారు. విడాకులు పొందిన స్త్రీని చూస్తూ ఆమెకు చేతగాక కాపురాన్ని పాడు చేసుకుందని భావిస్తారు. కుటుంబ సభ్యులు మొదలు అందరూ సానుభూతిగా చూస్తుంటారు. వివాహం లో ఉన్నప్పుడు ఉన్న స్నేహాలన్నీ చెదిరి పోతాయి. విడాకుల వల్ల స్త్రీకి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టమున్నా ఇలాంటి పరిస్థితుల వల్ల ఎంతో ఒత్తిడి ఉంటుంది. మమ్మల్ని జడ్జ్ చేయని విధంగా మాకంటూ మేము ఒక స్పేస్‌ను హాయిగా గడిపేలా ఈ డివోర్సీ క్యాంప్ ఉపయోగపడుతోంది’ అంది రాఫియా.బ్రేక్ ఫ్రీ స్టోరీస్రాఫియాకు ఇన్‌స్టాలో ‘కుక్ ఈట్ బర్న్’ అనే అకౌంట్ ఉంది. అందులో ఆమె సరదా వీడియోలు పెట్టేది. ‘కాని నా విడాకుల గురించి మాట్లాడటానికి సందేహించిదాన్ని. విడాకులు పొంది తర్వాతి జీవితం విషయంలో లోలోపల ఆందోళనగా ఉన్నదాన్ని నేనొక్కదాన్నే అనుకున్నాను. నా ఇన్‌స్టాలో నా విడాకుల గురించి మాట్లాడటం మొదలుపెటాక నేనే కాదు.. నాలా ఉన్న స్త్రీలు ఎందరో ఉన్నారని వారి రెస్పాన్స్‌ను బట్టి అర్థమైంది. కేరళలో విడాకులు పొందిన స్త్రీలతో ‘బ్రేక్ ఫ్రీ స్టోరీస్’ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ పెడితే మానసిక ఓదార్పు మాత్రమే గాక లీగల్ సమస్యలకు ఇతరత్రా ఇష్యూస్‌కు ఒక స పోర్ట్ ఉంటుందని ప్రయత్నించాను. కొద్దిరోజుల్లోనే వందమంది మహిళలు చేరారు. వారిలో కొంతమందితో క్యాంప్ నిర్వహించాలని అనుకున్నాను. మొదటి ప్రయత్నంగా వాగమాన్ లో రెండురోజుల క్యాంప్ ఉందని చె΄్పాను. పదిహేను మంది వచ్చారు’ అని తెలిపింది రాఫియా.క్షణాల్లో ఆత్మబంధువులుడివోర్సీ క్యాంప్‌కు వచ్చిన పదిహేను మంది మహిళలు అంతకు ముందు ఎటువంటి పరిచయం లేని వాళ్లు. కాని కలిసీ కలవగానే వీరంతా స్నేహితులై పోయారు. ఎడతెగని మాటలు... నవ్వులు... కొన్ని కన్నీళ్లు... ఆటలు... నృత్యాలు... ప్రకృతి తుళ్లిపడే కేరింతలు... మేమందరం ఒకేలాంటి సమస్యలో ఉన్నవాళ్లం అన్న భావన వారిని ఒక్కటి చేసి మానసిక బలం ఇచ్చింది. ‘వీరిలో చాలామందికి సొంత కుటుంబ సభ్యుల నుంచీ స పోర్ట్ లేదు. విడాకుల సమయంలో స్త్రీలకు ఇతరుల మద్దతు లేకున్నా తల్లిదండ్రుల మద్దతు తప్పనిసరి. అదృష్టవశాత్తు నాకు ఉంది’ అని తెలిపింది రాఫియా. ‘‘ఈ క్యాంప్‌లో అందరం కలిసి అనుకున్నమాట– విడాకుల తర్వాత కూడా మంచి జీవితాన్ని సాధించవచ్చుననే’’ అంది రాఫియా. ఇకపై నిర్వహించబోయే డివోర్సీ క్యాంపుల్లో థెరపీ, లీగల్ అడ్వయిజ్, ఫైనాన్షియల్ స పోర్ట్, సమాజాన్ని ఎదుర్కోవాల్సిన తీరు గురించి ఎక్స్‌పర్ట్‌లతో కౌన్సిలింగ్స్ ఉంటాయని చెబుతోంది రాఫియా. ఆశ్చర్యం ఏమిటంటే ఈ క్యాంప్ అయిన వెంటనే రాఫియా ఫోన్ ఎడతెగక మోగుతోంది. అలెప్పీ, వాయనాడ్లాంటి చోట్ల ఆమె ఈ క్యాంప్‌లను ΄్లాన్ చేసింది. అక్కడికి ఇప్పటికే వచ్చేవారు సిద్ధమయ్యారు కూడా.కొసమెరుపు: విడాకులు పొందిన, పొందే క్రమంలో ఉన్న పురుషులు కూడా ఆమెకు ఫోన్ చేస్తున్నారు... ఇలాంటి క్యాంపులు నిర్వహించమని. ‘ఆ సంగతి కూడా ఆలోచిస్తాను’ అంటోంది రాఫియా. -
50 ఏళ్ల పగ!!
ఒక మనిషిని బతికించేంది గాలి, నీరు,నిద్ర, అన్నం, ఆకలేకాదు.. పగ పగ కూడా బతికిస్తుంది అంటూ ఓ పవర్ఫుల్ తెలుగు సినిమా డైలాగ్ ఉంది. అలాంటి పగతోనే ఏకంగా 50 ఏళ్లు రగిలిపోయిన ఓ వ్యక్తి.. తన తోటి స్నేహితుడిపై దాడికి పాల్పడ్డాడు.కేరళ కాసర్గాడ్లో 62 ఏళ్ల ఓ వ్యక్తిపై దాడి చేసినందుకు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వాళ్లు చెప్పిన విషయం విని షాక్ తిన్నారు. ఎందుకంటే.. అది 50 ఏళ్ల కిందటి గొడవ ఫలితం అని.నాలుగో తరగతి చదువుతున్నప్పుడు వీజే బాబు, బాలకృష్ణన్-మాథ్యూ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే టీచర్ల జోక్యంతో ఆ వివాదం అప్పుడే సమసిపోయింది. కానీ, బాలకృష్ణన్ అది మనసులో పెట్టుకుని యాభై ఏళ్లు గడిపారు. తాజాగా.. ఆ స్కూల్ విద్యార్థుల రీయూనియన్ జరిగింది. ఈ సందర్భంగా.. ఇద్దరూ కలుసుకున్నారు. అయితే బాలకృష్ణన్ పాత గొడవను మనసులో పెట్టుకుని మాథ్యూ సాయంతో వీజే బాబుపై దాడికి పాల్పడ్డాడు.బాలకృష్ణన్ కాలర్ పట్టుకుంటే.. మాథ్యూ వీజే బాబు ముఖంపై పిడిగుద్దులు గుప్పించి, రాళ్లతో దాడికి పాల్పడ్డాడట. ప్రస్తుతం బాబు కన్నూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీజే బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
కేరళ సమీపంలో నౌకలో అగ్నిప్రమాదం
కొచ్చి: సింగపూర్ జెండాతో శ్రీలంక నుంచి ముంబైకి బయల్దేరిన విదేశీ కంటైనర్ సరకు రవాణా నౌక కేరళ సమీప సముద్రజలాల్లో అగ్నిప్రమాదానికి గురైంది. 22 మంది సిబ్బంది ఉన్న ఈ నౌక నుంచి 18 మందిని భారత తీర గస్తీ బలగాలు కాపాడాయి. 270 మీటర్ల పొడవైన ఎంవీ వాన్ హాయ్503 పేరు గల ఈ నౌకలో నలుగురి జాడ గల్లంతయింది. కేరళలోని కన్నూర్ జిల్లాలోని అఝిక్కల్ పట్టణ తీరం నుంచి 44 నాటికల్ మైళ్ల దూరంలో సోమవారం ఉదయం 9.20 గంటలకు ఈ దుర్ఘటన సంభవించింది. విషయం తెల్సిన వెంటనే భారత గస్తీ బలగాలు రంగంలోకి దిగి 18 మంది సిబ్బందిని కాపాడాయి. నౌకలో ఎనిమిది మంది చైనా, ఆరుగు తైవాన్, ఐదుగురు మయన్మార్, ముగ్గురు ఇండోనేసియాకు చెందిన సిబ్బంది ఉండగా వారిలో 18 మందిని రక్షించగాలిగారు. వీరిని ఐఎన్ఎస్ సూరత్ నౌకలో మంగళూరు పోర్ట్‌కు తీసుకొచ్చారు. షెడ్యూల్ ప్రకారం నౌక జూన్10వ తేదీకల్లా ముంబైలోని నవాషేవా ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ప్రమాదానికి గురైంది. గత 30 రోజుల్లో కేరళ సమీపంలో సరకు రవాణానౌక ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. మే 24న లైబీరియా జెండాతో వెళ్తున్న కార్గో నౌక తీరానికి 14.6 మైళ్లదూరంలో మునిగిపోయింది. -
Covid: 5 వేలు దాటిన కోవిడ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేలు దాటింది. గత 24 గంటల్లో నాలుగు కోవిడ్ మరణాలు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలతో ప్రకటించింది.నిన్న కోవిడ్ కేసుల సంఖ్య 4,866 ఉండగా.. గత 24 గంటల్లో 500 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కి చేరింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశం మొత్తం మీది కేరళలోనే ఏకంగా 1, 679 కేసులు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లోనే అక్కడ 192 కొత్త కేసులు బయటపడ్డాయి.తాజాగా నాలుగు కోవిడ్ మరణాలు సంభవించగా.. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించారు. పంజాబ్, కర్ణాటకలో ఒకరి చొప్పున కోవిడ్‌తో మరణించారు. అయితే.. వైరస్ ప్రభావం మునుపటి స్థాయి తీవ్రతతో లేదని.. జలుబు, జ్వరం, నొప్పులతో మూడు, నాలుగు రోజుల్లో పేషెంట్లు కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఫంక్షన్లలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇక కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డుల్లో పడకల సంఖ్య పెంచుతున్నారు. జులై 2024 నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సుమారు 73 దేశాల్లో 11 శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే కరోనా వైరస్ ఒమిక్రాన్ ఎన్బీ.1.8.1 వేరియెంట్ వైరస్ వ్యాప్తికి కారణమని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. -
సంజూ శాంసన్ ఉదారత
టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ ఉదారత చాటుకున్నాడు. తన ఫౌండేషన్ (SSF) తరఫున రానున్న విద్యా సంవత్సరం కోసం 100 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు, బూట్లు డొనేట్ చేశాడు. తన తల్లి లిజి శాంసన్ ఆథ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కూల్ సామాగ్రిని ప్రదానం చేయించాడు. పేద విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంజూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్రికెట్ అభిమానులు అభినందిస్తున్నారు. సంజూ గతంలో కూడా తన ఫౌండేషన్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాడు. 🚨 A LOVELY GESTURE BY SANJU SAMSON 🚨- Sanju Samson Foundation has donated school bags & shoes to 100 students as they start their new academic year. 🫡 pic.twitter.com/o7kMc2zCSM— Johns. (@CricCrazyJohns) June 5, 2025ఇదిలా ఉంటే, సంజూ శాంసన్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్లో రాయల్స్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో సంజూ వ్యక్తిగతంగానూ ఆకట్టుకోలేకపోయాడు. గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను.. ఆడిన మ్యాచ్‌ల్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాడు.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టులో సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు. యువ వికెట్కీపర్లు రిషబ్ పంత్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్ ఈ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించారు. పంత్, రాహుల్ జట్టులో పాతుకుపోయిన నేపథ్యంలో సంజూ టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసిందనే చెప్పుకోవాలి. ఈ కేరళ వికెట్‌కీపర్ బ్యాటర్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. -
భారత్‌లో నాలుగువేలకు పైగా కోవిడ్ కేసులు.. ఐదుగురి మృతి
న్యూఢిల్లీ: కోవిడ్-19 భారత్‌లో అంతకంతకూ విజృంభిస్తోంది. కోవిడ్ ప్రస్తుతం పాండమిక్ కాదు.. ఎండమిక్ అని ఆరోగ్య సంస్థలు చెబుతున్నప్పటికీ ఆ మహమ్మారి విజృంభిస్తున్న తీరును చూస్తే జనాల్లో ఆందోళన కలుగుతోంది. ఈరోజు(మంగళవారం, జూన్ 3) భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. ప్రస్తుతం భారత్ నాలుగు వేల ఇరవై ఆరు కేసులు ఉన్నట్లు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. తాజాగా ఐదుగురు కోవిడ్‌తో మృతి చెందినట్లు స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ఇద్దరు, తమిళనాడు, యూపీ, కేరళలలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. కేరళలో అత్యధికంగా 1416 కేసులు నమోదు కాగా, అటు తర్వాత అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో 494 కేసులు నమోదయ్యాయి ఇక గుజరాత్లో 397, ఢిల్లీలో 393 కేసులు, తమిళనాడులో 215 కేసులు ఉన్నాయి. ఇక ఏపీలో 28 కేసులో వెలుగు చూడగా, తెలంగాణలో 4 కోవిడ్ కేసులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో, హర్యానా, తమిళనాడు, గుజరాత్‌లలో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. అయితే భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుదలకు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్ కోరలు ఇంకా సజీవంగా ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ సోకిన వారిలో కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. -
కేరళ రైతు శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కారం ‘విత్తన బిళ్లలు’
కేరళలోని వయనాడ్ జిల్లా అంబలవాయల్‌కు చెందిన అజి థామస్ (AjiThomas) కూరగాయలు, అరటి, రబ్బరుతో పాటు వరిని పండిస్తారు. రైతులు తగిన ఆదాయం లేక వరి సాగు మానుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో బయో స్లర్రీతో వరి విత్తనాల ‘పెల్లెటైజేషన్’ (pelleting technique ) పద్ధతిని ఆయన అభివృద్ధి చేశారు. విత్తనం చుట్లూ మట్టిని లేపనం చేస్తే వాటిని విత్తన గుళికలు అనొచ్చు. ఇది అలా కాదు. నాలుగు పలకలుగా ఉండే పేడ తదితర పోషకాలతో కూడిన బిళ్లలో వరి విత్తనం పెంచి, నాట్లేస్తారు. కాబట్టి ‘విత్తన బిళ్లలు’ అని చెప్పుకుందాం. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసి బయో స్లర్రీలోని సూక్ష్మజీవులు పొలం మట్టిలోని పోషకాలను విచ్ఛిన్నం చేసి వరి మొక్కలకు అందించటంతో రెట్టింపు దిగుబడి వస్తున్నదని వారు తెలిపారు. ఈ పద్ధతిలో హెక్టారుకు 5.5–6 టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని, వయనాడ్ ప్రాంతంలో సాధారణ పద్ధతిలో వచ్చే ధాన్యం దిగుబడితో పోల్చితే రెట్టింపని థామస్ తెలిపారు. కూలీల ఖర్చు 25 శాతానికి తగ్గింది. ప్రతి కుదురుకు 50–60 పిలకలు వస్తున్నాయి. కంకి పొడవు పెరిగింది. ఎకరానికి వరి విత్తనాల అవసరం 30–50 కిలోల నుంచి 2.5–5 కిలోలకు తగ్గింది. పంట 15–20 రోజులు ముందే కోతకు వస్తోందని అజి థామస్ తెలిపారు. ఇదీ చదవండి: అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీవిత్తన బిళ్లల తయారీ ఖర్చు ఎంత?హెక్టారుకు సరిపడా వరి విత్తన బిళ్లల తయారీకి 12–14 కిలోల బయో–స్లర్రీ అవసరం. దీనికి హెక్టారుకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇది సాధారణ రసాయనిక సాగు పద్ధతిలో ఎరువులు, ఇతర ఉత్పాదకాల సగటు ఖర్చు కంటే రెట్టింపు. అయినప్పటికీ, కూలీల అవసరం/ఖర్చు, విత్తనాల ఖర్చు తగ్గి ధాన్యం దిగుబడి రెట్టింపు కావటంతో ఈ పద్ధతిలో వరి సాగు లాభదాయకంగా మారిందని థామస్ వివరించారు.ఇదీ చదవండి: ‘చెదలు’తో విసిగిపోయారా? మహిళా రైతు ఐడియా! ప్రభుత్వ ప్రోత్సాహంకేరళ ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మ) ఈ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. దీంతో, ఈ పద్ధతి కేరళలో రైతుల ఆదరణ పొందుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అజి థామస్ చెబుతున్నారు. ‘విత్తన బిళ్ల’ అంటే? తయారీ ఎలా?వరి విత్తనాలను ట్రేలలోని చిన్న చిన్న చతురస్త్రాకారపు గదుల్లో బయో స్లర్రీని నింపి, అందులో వరి విత్తనం పెట్టి, మొలకెత్తిస్తారు. ఆ తర్వాత పొలంలో నాట్లు వేసే పద్ధతి ఇది. ఆవుపేడ, పులియబెట్టిన ఆకుల ద్రావణం, పంచగవ్య, ద్రవ జీవామృతంతో పాటు సూడోమోనాస్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులు కలిపి బయో–స్లర్రీ మిశ్రమాన్ని తయారు చేస్తారు. బల్ల మీద ఉంచిన స్టెయిన్లెస్ స్టీల్ ట్రేలో లేదా సాధారణ బోలు రబ్బరు మ్యాట్‌లో 1–1.5 అంగుళాల లోతు/పొడవు/వెడల్పుతో నలుచదరంగా ఉండే గుంతల్లో బయో స్లర్రీని పోసి, అందులో వరి విత్తనాలను గుచ్చుతారు. ఒక రోజులో ఆ స్లర్రీ గట్టిపడి విత్తన బిళ్లలు తయారవుతాయి. ఆ తర్వాత ట్రే నుంచి విత్తనంతో కూడిన ఆ బిళ్లలను బయటకు తీసి 12 గంటలు ఎండబెడతారు. ఆ తర్వాత వాటిపై నీరు చిలకరిస్తారు. 3 రోజుల్లో వరి మొలకలు బయటకు వచ్చి, తగినంత ఎత్తు పెరిగిన తర్వాత, ఆ బిళ్లతో కూడిన వరి నారును దమ్ము చేసిన పొలాల్లో మనుషులతో వరుసలుగా నాటుతారు. వరుసల మధ్య 25 సెం.మీ. (పది అంగుళాలు) దూరం పెడుతున్నారు. ఎకరానికి ఇట్లాంటి వరి నారు బిళ్లలు 64 వేలు అవసరమవుతాయి. ఇదే ప్యాడీ సీడ్ పెల్లెటైజేషన్ పద్ధతిచదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది -
270 ఏళ్ల తర్వాత... మహా కుంభాభిషేకం
తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం 270 సంవత్సరాల తర్వాత అరుదైన భిమహా కుంభాభిషేక వేడుకలకు సిద్ధమైంది. పురాతనమైన ఈ ఆలయం పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ నెల 8వ తేదీన జరిగే మహా కుంభాభిషేకం ముఖ్య ఉద్దేశం ఆలయ పవిత్రను ప్రతిష్ఠాపించడం, ఆధ్యాతి్మక శక్తిని బలోపేతం చేయడమే అని అధికారులు వివరించారు. ఇలాంటి పవిత్ర క్రతువులు 270 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. -
భద్ర హరి పాట శాలలో తొలకరి
జూన్ 2న కేరళలో బడులు తెరుచుకోనున్నాయి. ఒకటో క్లాసులో చేరే పిల్లల కోసం అన్ని స్కూళ్లలో ‘ప్రవేశోత్సవం’ చేయడం కేరళ విద్యాశాఖకు ఆనవాయితీ. అయితే ఈసారి ఆ ఉత్సవానికి పాట రాయించాలనుకున్నారు. ప్రకటన ఇస్తే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భద్ర హరి రాసింది. ఎంపికైన ఆ పాట అన్ని స్కూళ్లలో స్వాగత గీతం కానుంది.కేరళ ప్రభుత్వం పాఠశాల విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఈ ఉదంతం చెబుతోంది. అక్కడ జూన్ 2 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఆ వేళ విద్యార్థులను ఉత్సాహ పరిచేందుకు, కొత్త విద్యార్థులను స్కూల్లో చేరేలాప్రోత్సహించేందుకు ‘ప్రవేశోత్సవం’ నిర్వహిస్తారు. ఇది ప్రతి ఏట కేరళ విద్యాశాఖ నిర్వహించే వేడుక. కాని ఈసారి స్వాగత గీతాన్ని తయారు చేసి పిల్లలకు వినిపించాలని సంకల్పించారు. గత సెప్టెంబర్‌లో పాటను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనను అదూర్‌లో జూనియర్ ఇంటర్ చదువుతున్న భద్రహరి చూడటంతో మన కథ మొదలవుతుంది.రెండు రోజుల్లో పాట రాసిందిభద్రహరి ఐదో క్లాస్ నుంచి కవిత్వం రాస్తోంది. వాళ్ల నాన్న హరీంద్రనాథ్ అదూర్‌లో డిప్యూటీ తాసిల్దార్‌గా పని చేస్తున్నారు. అమ్మ సుమ టీచర్. పదో తరగతిలో ఉండగా ‘ధనుర్మాస పౌర్ణమి’ పేరుతో కవితా సంకలనాన్ని వెలువరించిన భద్రహరి కేరళ ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే ‘కళా ఉత్సవం’లో కవిత్వం రాసి బహుమతులు పొందింది. ప్రభుత్వ ప్రకటన చూశాక బడికి వచ్చే పిల్లల కోసం పాట రాయాలనుకుంది. ‘మజా మేఘంగళ్’... పల్లవితో మొదలెట్టి రెండు రోజుల్లో పాట పూర్తి చేసింది. ‘నేను పదేళ్ల క్రితం మొదటిసారి బడికి వెళ్లడం గుర్తుకొచ్చింది ఈ పాట రాసేప్పుడు. కేరళలో చినుకులు మొదలైన వేళే బడులు తెరుచుకుంటాయి. పిల్లలు రంగురంగుల రెయిన్ కోట్లలో బడికి వస్తారు. కొందరు గొడుగులు తెస్తారు. మొదటిసారి చేరే పిల్లలు తల్లిదండ్రుల చేయి పట్టుకుని మొదటి అడుగు వేస్తారు. అదంతా నా మొదటి చరణంలో రాశాను. రెండో చరణంలో కేరళలో జరుగుతున్న శాస్త్ర, సాంకేతిక పురోగతిని చె΄్పాను. మూడో చరణంలో వ్యవసాయంలోను, సాంస్కృతికంగాను కేరళ ఘనతను చాటాను’ అని తెలిపింది భద్రహరి.ముఖ్యమంత్రితో కలిసి...పాట రాశాక భద్రహరికి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే వారం రోజుల క్రితం ఆమెకు విద్యాశాఖ నుంచి ఫోన్ వచ్చింది ‘మీ పాట స్వాగత గీతంగా ఎంపికైంది’ అంటూ. ‘ఆ రోజున నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అంది భద్రహరి. ‘నేను రాసిన పాటకు నేనే ట్యూన్ కట్టి మొదట మా అమ్మానాన్నలకు వినిపించాను. వారు చాలా బాగుందని అన్నారు. అయితే ప్రభుత్వ కోరిక మేరకు సంగీత దర్శకుడు అల్ఫాన్స్ జోసఫ్ ఆ పాటకు తన ట్యూన్ కట్టి పాడారు. పాట చాలా బాగా వచ్చి వైరల్ అయ్యింది. జూన్ రెండున ముఖ్యమంత్రి విజయన్ కలవూర్లో జరిగే ప్రవేశోత్సవంలో ఈ పాటను ఆవిష్కరిస్తారు. ఆ వేడుకకు ఆయనతో పాటు పాల్గొనమని నాకు ఆహ్వానం అందింది’ అంది భద్రహరి.ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అందరూ ఎం.పి.సి, బై.పిసిల వైపే ఇంకా మొగ్గుతున్నా పదో క్లాస్‌లో టాప్ మార్కులతో పాసైన భద్రహరి ఇంటర్లో ఆర్ట్స్ తీసుకుంది. మలయాళ భాషలో పై చదువు చదివి లెక్చరర్ కావాలనుకుంటోంది. కవయిత్రిగా గుర్తింపు పొందాలనుకుంటోంది. సమాజం కవిత్వానికి విలువ ఇవ్వకపోయినా పిల్లలకు తెలుసు కవిత్వం ఎంత గొప్పదో. దానిని ఎలా గౌరవించాలో. భద్రహరి వంటి విద్యార్థులే నిజమైన సాహిత్య, సాంస్కృతిక పరిరక్షకులు. -
భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం
తిరువనంతపురం: అత్యంత భారీ వర్షాలు, విపరీతమైన వేగంతో కూడిన ఈదురు గాలులు కేరళ(Kerala)ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ బీభత్సం కొనసాగుతున్న సమయంలోనే రాబోయే మూడు గంటల్లో కేరళలోని 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందంటా వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే మూడు గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు, కొన్ని ప్రదేశాలలో 60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. తిరువనంతపురం(Thiruvananthapuram), కొల్లం, పతనంతిట్ట, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు చెట్లు పడిపోయే అవకాశం ఉందని, విద్యుత్ వైర్లు తెగిపడవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రమాదకరమైన విద్యుత్ లైన్లు గమనిస్తే ఈ విషయాన్ని విద్యుత్‌శాఖ సిబ్బందికి తెలియజేయాలని అధికారులు కోరారు.ఇది కూడా చదవండి: ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ -
31న వేలల్లోఉద్యోగుల రిటైర్మెంట్.. కేరళలో ప్రతీయేటా ఎందుకిలా?
తిరువనంతపురం: ఈ ఏడాది మే 31న కేరళలో మరో ఆసక్తికర రికార్డు నమోదు కానుంది. ఏకంగా 10 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఒకే రోజున (మే 31) పదవీ విరమణ(Retirement) చేయనున్నారు. గత ఏడాది(2024)లో ఇదే రోజున 10వేల 560మంది రిటైర్ అయ్యారు. 2023లోనూ మే 31న 11 వేల 800 మంది పదవీ విరమణ చేశారు. దీనివెనుక ప్రత్యేక కారణముంది.దేశంలోని పర్యాటక ప్రాంతాల పరంగా కేరళ ముందుంటుంది. ఆకట్టుకునే ప్రదేశాలు, అలరించే కళలు కేరళ సొంతం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వీటితో పాటు కేరళ అనగానే ఒక అంశం చర్చల్లోకి వస్తుంది. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ. కేరళలో ప్రతీయేటా మే 31న ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేస్తుంటారు. ఇదే కోవలో ఈ ఏడాది(2025) మే 31న 10 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు.ఈ ఏడాది పదవీ విరమణ చేయబోతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో వైద్యులు, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, డ్రైవర్లు, అటెండర్లు ఉన్నారు. వీరంతా రాష్ట్ర సచివాలయం(State Secretariat)తో సహా పలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేరళలోని ప్రభుత్వ ఉద్యోగులు 56 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. మే నెలలో పుట్టిన తేదీ కలిగినవారు, 56 సంవత్సరాల వయస్సు వచ్చిన వారంతా మే 31న పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఏటా మే నెలలో ఇంత పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేయడం వెనుక ప్రత్యేక కారణముంది.గతంలో తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన తేదీని వారు పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి వెళ్లిన రోజున నమోదు చేసేవారు. సాధారణంగా పాఠశాలల్లో అడ్మిషన్లు జూన్‌లో ప్రారంభమవుతాయి. గతంలో పాఠశాలల్లో ప్రవేశాలకు ఎటువంటి అధికారిక జనన ధృవీకరణ పత్రాన్ని అడిగేవారు కాదు. దీంతో పలువురు విద్యార్థుల పుట్టిన తేదీ జూన్ నెలలోనే ఉండేది. ఈ కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నవారి పదవీ విరమణ మే నెలలోనే జరుగుతుంది. మరోవైపు గతంలో పుట్టిన తేదీని సరిచేయాల్సిన అవసరం ఉండేదికాదు. అయితే ఇప్పుడు నిబంధనలు మారాయి. ప్రతీ ఆస్పత్రిలో శిశువు జననాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత తల్లిదండ్రులు తమ పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని సంబంధిత అధికారిక కార్యాలయం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. -
చిన్న వయసులోనే పెళ్లి, బాధ్యతలు: పట్టుదలతో IAS అధికారిగా
మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అధిగమించి ఉన్నత స్థాయి నైపుణ్యాలతో రాణిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సంవత్సరాలుగా, పౌర సేవలలో మహిళా అధికారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాంటి వారిలో ఒకరు మిన్ను జోషి. ఒక బిడ్డకు తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగి పోయిన ఆమె నేడు ఆమె కేవలం శ్రద్ధగల అధికారి మాత్రమే కాదు, ఆమె మొత్తం కుటుంబం గర్వించదగిన వ్యక్తిగా ఎదిగింది. సంకల్పం ఉంటే ఒక స్త్రీ తన ఇంటి బాధ్యతలను పోషిస్తూనే తన కలలను ఎలా సాకారం చేసుకోవచ్చో నిరూపించింది.ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు తమ దృఢ సంకల్పం, ఆకాంక్ష శ్రద్ధతో ఉన్నత శిఖరాల అధిరోహిస్తున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విజయగాథ. కుటుంబం ఇచ్చిన మద్దతుతో, ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంది.భారతదేశంలోని అత్యంత కఠినమైన సివిల్స్‌లో సత్తా చాటినమిన్ను జోషి సక్సెస్ జర్నీని పరిశీలిద్దాం. చదవండి: ట్విటర్ గాలం : ఇండో-అమెరికన్ , యూట్యూబ్ సీఈవోకి గూగుల్ భారీ ఆఫర్కేరళలోని పతనంతిట్ట అనే చిన్న గ్రామంలో మిన్ను జోషి పుట్టింది. మిన్ను తండ్రి పోలీసు. మిన్నుకి 21 ఏళ్ల వయస్సులోనే వివాహం అయింది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్యగా, కోడలిగా, తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయినా తన కలను సాకారం కోసం తనను తాను సంసిద్ధం చేసుకుంది. దివంగత తండ్రి కలను సాకారం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్పోలీసుగా గౌరవ స్థానంలో ఉన్న తండ్రిని చూసి తాను కూడా మరింత ఉన్నతంగా ఎదగాలని కలకనింది. అయితే, ఎంతో ప్రేమించిన తండ్రి అకాల మరణం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. 2012లో 'డై-ఇన్-హార్నెస్' పథకం ద్వారా ఆమె కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో క్లరికల్ పదవిని పొందింది. అయినా ‘ఐఏఎస్’ డ్రీమ్‌ను విడిచిపెట్టలేదు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన 26 సంవత్సరాల వయస్సులో, ఆమె ఐఎఎస్ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించింది. ఇది కేవలం తన కలకోసం మాత్రం కాదని, మరణించిన తండ్రి సేవకు కొనసాగింపు అని భావించింది. 2015లో శంకర్ ఐఏఎస్ అకాడమీలో చేరిం కష్టపడింది. రెండేళ్ల తరువాత మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. అయితే, ఆమె ఇంటర్వ్యూలలో విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరుత్సాహపడలేదు. చివరికి తొలి ఆరు ప్రయత్నాలు, సుదీర్ఘమైన అధ్యయన సెషన్ల తర్వాత, సివిల్ సర్వీసెస్ పరీక్షలో 150 ఆల్ ఇండియా ర్యాంక్‌ను సాధించి తానేంటో నిరూపించుకుంది.చదవండి: ‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్ లుక్ : స్పిరిట్‌పై ఫ్యాన్ కామెంట్ వైరల్ -
Covid: దేశంలో కోరలు చాస్తున్నకోవిడ్ అత్యధిక కేసులు ఈ ప్రాంతంలోనే
-
గొడుగుల తయారీలో ఆత్మనిర్భర్ భారత్
గొడుగుల తయారీలో చైనా కంపెనీల ఉత్పత్తులపై ఆధారపడడాన్ని తగ్గిస్తూ దేశీయ వస్తువులను ఉపయోగించేలా, ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం ఇచ్చేలా కేరళ అంబ్రెల్లా మ్యానుఫ్యాక్చరర్స్(కేయూఎం) చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా పోపీ, జాన్స్, కొలంబో వంటి బ్రాండ్లు చైనా ముడి పదార్థాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయి.అయితే గొడుగుల తయారీలో ఉపయోగించే ‘టాఫెటా ఫ్యాబ్రిక్’ను ఇప్పటికీ తైవాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి భారత్‌లో ప్రత్యామ్నాయం ఇంకా లేకపోవడమే ఇందుకు కారణం. కేరళ గొడుగు తయారీదారులు చౌకైన చైనా దిగుమతుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ‘అండర్ ఇన్వాయిసింగ్’, ‘డంపింగ్’ను కట్టడి చేయాలని దేశీయ తయారీదారులు వాదిస్తున్నారు.అండర్ ఇన్ వాయిసింగ్లో భాగంగా వస్తువులు లేదా సేవల వాస్తవ విలువ కంటే ఇన్వాయిస్లపై ఉద్దేశపూర్వకంగా తక్కువ విలువను చూపుతారు. దాంతో పన్నులు, కస్టమ్స్ సుంకాలు లేదా నియంత్రణ పర్యవేక్షణను తప్పించుకోవడానికి వీలవుతుంది.ఒక కంపెనీ తమ దేశీయ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు లేదా ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు వస్తువులను ఎగుమతి చేసినప్పుడు డంపింగ్ సమస్యలు ఎదురవుతాయి. మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకోవడానికి లేదా విదేశీ మార్కెట్లో పోటీ లేకుండా చేయడానికి కంపెనీలు ఇలా చేస్తూంటాయి.ఇదీ చదవండి: సెబీ బోర్డు సమావేశంలో కీలక మార్పులు?ఈ సమస్యలను కట్టడి చేసేలా ఫినిష్డ్ గొడుగులపై కనీస దిగుమతి ధర (ఎంఐపీ) విధించాలని దేశీయ తయారీదారలు కోరుతున్నారు. కార్టూన్ డిజైన్లు, మెరిసే లైట్లు, కొత్త డిజైన్లలో గొడుగులు తయారు చేస్తూ పరిశ్రమ ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం మద్దతుతో భారత్ గొడుగులకు సంబంధించి ప్రపంచ సరఫరాదారుగా మారగలదని తయారీదారులు నమ్ముతున్నారు. ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలోని ఎగుమతి మార్కెట్లను టార్గెట్ చేస్తున్నారు. -
కేరళ లో 273.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
-
కొచ్చి తీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక
కొచ్చి: కేరళలోని కొచ్చి తీరంలో శనివారం బోల్తాపడిన లైబీరియా కార్గోషిప్ ఆదివారం పూర్తిగా మునిగిపోయినట్లు భారత కోస్ట్ గార్డ్ ప్రకటించింది. నౌకలో 27 మంది సిబ్బంది ఉండగా.. ఇండియన్ కోస్ట్‌గార్డ్ 24 మందిని రక్షించింది. నేవీ షిప్ ఐఎన్ సుజాత మరో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నౌకలో భారీగా రసాయనాలు ఉన్నాయని, అవి సముద్రంలో లీకై, వేగంగా విస్తరిస్తుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. రసాయనాల లీకేజీని అరికట్టడానికి కోస్ట్‌గార్డ్ కృషి చేస్తోంది. సురక్షితంగా బయటపడ్డ సిబ్బంది.. లైబీరియాకు చెందిన ఎమ్ఎస్సీ ఈఎల్‌ఎస్‌ఏ 3 శనివారం సాయంత్రం వంగిపోవడంతో ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్ 24 మంది సిబ్బందిని రక్షించింది. 24 మంది సిబ్బందిలో ఒక రష్యన్ (ది మాస్టర్), 20 మంది ఫిలిప్పీన్స్, ఇద్దరు ఉక్రేనియన్లు, ఒక జార్జియన్ జాతీయుడు ఉన్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి ముగ్గురు సీనియర్ సిబ్బంది ఓడలోనే ఉండిపోయారు. అయితే.. ఆదివారం తెల్లవారుజాము సమయానికి అది పూర్తిగా బోల్తా పడటంతో ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ సుజాత ఆ ముగ్గురిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు... బోల్తా పడిన ఓడలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 640 ఇతర కంటైనర్లు ఉన్నా యి. వీటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్‌ఆయిల్, కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి. ఓడ మునిగిపోయిన తరువాత రసాయనాలు లీకయ్యా యి. ఇవి సముద్రపు నీటితో కలిసి అత్యంత ప్రమాదకరమైన ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుందని కోస్ట్‌గార్డ్ హెచ్చరించింది. మ్యాపింగ్ సాంకేతికతతో చమురు లీకేజీని అంచనా వేస్తున్నారు. లీక్ అయిన ఇంధనం గంటకు దాదాపు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని గుర్తించింది. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు కావడంతో.. చము రును విచ్ఛిన్నం చేయడానికి వైమానిక డోరి్నయర్ విమానాలు డిస్పర్సెంట్‌ను స్ప్రే చేస్తున్నాయి. కేఎస్డీఎంఏ హెచ్చరికలు.. కేరళలోని సముద్ర తీరం జీవవైవిధ్యానికి నిలయం. పర్యాటకానికి ప్రధాన ఆకర్షణ. ఈ రెండింటికి ఎలాంటి విఘాతం కలగకుండా కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్డీఎంఏ) చర్యలు తీసుకుంటోంది. కంటైనర్లు చమురుతో సహా సరుకు ఒడ్డుకు కొట్టుకువచ్చే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో చమురు పొరలు కనిపించవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఒడ్డుకు కొట్టుకువచ్చే కార్గో కంటైనర్లు లేదా చమురును తాకవద్దని సూచించింది. ఒడ్డున కంటైనర్లు లేదా చమురు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రకటించింది. -
తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో గల తాజ్ మహల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్డీఎక్స్తో తాజ్‌మహల్‌ను పేల్చివేస్తామని కేరళ నుంచి ఈ మెయిల్ అందిన దరిమిలా సంబంధిత అధికారులు తాజ్ మహల్(Taj Mahal) వద్ద హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా సంస్థలు అప్రమత్తమై, నిఘాను మరింత ముమ్మరం చేశాయి.బాంబు బెదిరింపు ఈ ఇమెయిల్ అందిన వెంటనే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్), తాజ్ భద్రతా పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, డాగ్ స్క్వాడ్, టూరిజం పోలీసులు, భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ)అధికారులు దాదాపు మూడు గంటల పాటు తాజ్ మహల్ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదు. తాజ్ మహల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, ఢిల్లీ పోలీసులకు(Delhi Police) గుర్తు తెలియని మెయిల్ ఐడి నుండి బెదిరింపు మెయిల్ అందింది. తాజ్ మహల్‌ను ఆర్డీఎక్స్తో పేల్చివేస్తామని దానిలో హెచ్చరించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈమెయిల్ నకిలీదని తేలింది. దీనిపై సైబర్ సెల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జూన్ 19న -
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
COVID-19: తేలికపాటివిగా అత్యధిక కేసులు.. గృహ సంరక్షణలో చికిత్స
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కోవిడ్-19 కేసుల్లో అత్యధిక భాగం స్వల్ప లక్షణాలు కలిగినవేనని, బాధితులు గృహ సంరక్షణలో చికిత్స పొందుతున్నారని ఉన్నతవైద్యాధికార వర్గాలు తెలిపాయి. కోవిడ్-19(COVID-19) కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం ఆరోగ్య పరిశోధన శాఖ కార్యదర్శి (డీహెచ్ఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డీసీహెచ్ఎస్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) డైరెక్టర్ జనరల్‌తో సమీక్షించారు.కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధిక భాగం తేలికపాటివి, గృహ సంరక్షణలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇటీవల సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు సంబంధించి ఈ సమీక్షలో చర్చించారు. కేసుల విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Ministry of Health) అప్రమత్తంగా ఉందని, బహుళ ఏజెన్సీల ద్వారా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో కొత్తగా కోవిడ్-19 వేరియంట్ ఎన్బీ.1.8.1కు చెందిన ఒక కేసు, ఎల్‌ఎప్.7కి చెందిన నాలుగు కేసులను గుర్తించారు.తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 సబ్వేరియంట్లను ‘వేరియంట్స్ అండర్ మానిటరింగ్’ (వీయూఎం)లుగా వర్గీకరించింది. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ) లేదా వేరియంట్స్ ఆఫ్ ఇంటరెస్ట్ (వీఓఐ)గా పేర్కొంది. చైనా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమైన వేరియంట్లు ఇవేనని వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం అత్యంత సాధారణ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తిలో ఉంది. తరువాత బీఏ.2 (26శాతం), ఇతర ఓమిక్రాన్ సబ్‌లైనేజ్‌లు (20శాతం) ఉన్నాయి.మే 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, తెలంగాణలో ఒకటి నిర్ధారితమయ్యాయి. బెంగళూరులో తొమ్మిది నెలల చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. కేరళలో మే నెలలోనే 273 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో తీవ్రమైన డయాబెటిస్తో బాధపడుతున్న కోవిడ్-19 రోగి అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. తాజాగా ముంబైలో ఎనిమిది కొత్త వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.ఇది కూడా చదవండి: ఇస్రో రాకెట్ 7 నిమిషాల్లోనే విఫలం.. పరిశీలనకు కమిటీ -
కేరళను తాకిన నైరుతి
సాక్షి, విశాఖపట్నం: మే చివరి వారంలో భానుడు భగ్గుమనలేదు... రోహిణి కార్తెలో రోళ్లు పగలనివ్వలేదు. ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు పలకరిస్తూ.. వేసవి ప్రతాపానికి మే నెలలోనే తెర వేశాయి. 2009 తర్వాత తొలిసారిగా నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళని తాకాయి. శనివారం మధ్యాహ్నం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) ప్రకటించింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళకు వస్తాయని, కానీ ఈసారి 8 రోజుల ముందుగానే ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది.ఈ నెల 26 నాటికి రాయలసీమలో ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ నెల 29 నాటికల్లా రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయి. మరోవైపు ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా తేలికపాటి వానలు, అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
కేరళ చేరిన నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. శనివారం ఉదయం కేరళ భూభాగంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నాయని, లక్షదీవులతో పాటు కేరళ రాష్ట్రంలోకి పూర్తిగా ప్రవేశించేందుకు అత్యంత తక్కువ సమయం పడుతుందని వివరించింది. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా రుతుపవనాలు తాకాయి. నైరుతి రుతుపవనాలు ముందుగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దేశమంతటా విస్తరిస్తాయి. ఈ సీజన్లో రుతుపవనాలు వాతావరణ శాఖ అంచనాల కంటే మూడురోజులు ముందుగానే భారత ప్రధాన భూభాగాన్ని తాకటం విశేషం. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 30న కేరళను తాకగా... ఈసారి ఆరు రోజుల ముందే ప్రవేశించాయి. రానున్న రెండురోజుల్లో రుతుపవనాలు మధ్య అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవాలో పూర్తి భూభాగం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతోపాటు సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కింలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈసారి వర్షాకాలంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మూడురోజుల్లో రాష్ట్రంలోకి.. రానున్న మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళను తాకిన తర్వాత సగటున నాలుగు నుంచి ఆరు రోజుల మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండడంతో మూడు రోజులలోపే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ 3వ తేదీన రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించగా... ఈసారి మే నెలలోనే ప్రవేశించడం గమనార్హం. 27న బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం రైతాంగంలో ఉత్సాహాన్ని నింపుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫానులపైనే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆరోజుకల్లా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఈ అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని, చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం రెండ్రోజుల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ముందస్తు అంచనాలు వెల్లడించాయి. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ – గోవా తీర ప్రాంతం సమీపంలో కొనసాగిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం శనివారం ఉదయం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో రత్నగిరికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. క్రమంగా తూర్పు దిశలో కదిలి శనివారం రాత్రికల్లా దక్షిణ కొంకణ్ తీరంలో రత్నగిరి, దాపోలి మధ్యలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి. -
చల్లని కబురు.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
తిరువనంతపురం: దేశంలో రైతులకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కన్నా 8 రోజులు ముందుగానే ఈ రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రుతు పవనాల ఎఫెక్ట్‌తో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, నైరుతి రుతుపవనాలు రాకతో ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో, మున్సిపల్ శాఖ సిబ్బంది రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగిస్తున్నారు. Southwest Monsoon has set in over Kerala today, the 24th May, 2025, against the normal date of 1st June. Thus, southwest monsoon has set in over Kerala 8 days before the normal date: IMD pic.twitter.com/sstbHe0TnM— ANI (@ANI) May 24, 2025Heavy Rains in Trivendrum #keralarains pic.twitter.com/bVo8o4hFYe— MasRainman (@MasRainman) May 24, 2025மழை அழகு.மழைக்கால தொடக்கத்தில் கேரளாவில் பயணிப்பதும் அழகோ அழகு.இடைவிடாத மழை.#KeralaRains#Kerala#Keralam#KeralaNews#keralatourism#മനോഹരമായ_മഴ pic.twitter.com/GCLRG1oGlS— இரா.கந்தசாமி - R.Kandasamy (@mrkandasamy) May 24, 2025Welcome South West Monsoon 2025!#Trivandrum Airport 96mmTrivandrum city 87mm#Mangalore 84mmHonnavar 58mmKarwar 49mmKannur 54mmKozhikode 63mmKottayam 41mm#Kochi 76mm#Monsoon #KeralaRains #KarnatakaRains pic.twitter.com/VeQDWN5jOf— Natarajan Ganesan (@natarajan88) May 24, 2025 -
ప్రకృతి దాచిన అందమైన క్రికెట్ స్టేడియం
కొన్నింటిని ప్రకృతి సహజసిద్ధంగా చక్కటి ఆకృతిని ఏర్పరస్తుంది. చూస్తే.. కళ్లుతిప్పుకోలేనంత అందంగా ఉంటాయి. అలాంటి సుందరమైన క్రికెట్ స్టేడియం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా దీన్ని నెటిజన్లు ప్రకృతి దాచిన క్రికెట్ మైదానంగా అభివర్ణిస్తున్నారు. అదెక్కడ ఉందంటే..కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వరందరప్పల్లిలో ఉంది. దీన్ని పాలప్పిల్లి క్రికెట్ మైదానం అంటారు. సాధారణంగా స్టేడియంలు పచ్చిక బయళ్లకు దూరంగా ఉంటాయి. కానీ ఇది ప్రకృతితో అల్లుకుపోయినట్లుగా రహస్యంగా ఉంది. ప్రకృతి అందాలకు నెలవైనా కేరళను తరుచుగా 'దేవుని స్వంత దేశం'గా వర్ణిస్తారు కవులు. అందుకు తగ్గట్టు పచ్చని చెట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న క్రికెట్ మైదానం ఆ వర్ణనకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఈ మైదానం దశాబ్దాల కాలం నాటిదట. దీనిని మొదట హారిసన్ మలయాళం కంపెనీ తన తోటల కార్మికులకు వినోద స్థలాన్ని అందించడానికి సృష్టించింది. అప్పటి నుంచి ఇది ఉద్యోగులకు మాత్రమే కాకుండా స్థానికులకు ఆటవిడుపు స్థలంగా మారింది. అయితే దట్టమైన చెట్లతో కప్పబడి మారుమూల ప్రాంతంలో ఉండటంతోనే బయటి ప్రపంచానికి అంతగా తెలియదని అంటున్నారు స్థానికులు. అయితే అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీజిత్ ఎస్ "ఇది అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ కాదు" అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sreejith S (@notonthemap) (చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!) -
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇంత ప్రమాదకరమైనదా..? పాపం ఆ వ్యక్తి..
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో లుక్ మార్చుకోవాలనుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు కొందరు. అనుభవజ్ఞులైన నిపుణుల సమక్షంలో చేయించకోకపోతే జీవితాలే అల్లకల్లోలమవుతాయనే ఉదంతాలు ఎన్నో జరిగాయి. అందులోనూ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్.. ఏదైనా తేడాకొడితే..నేరుగా మన బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుంది. కోలుకుంటామా లేదా అనేది చెప్పడం కూడా కష్టమే. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు కేరళలోని ఎర్నాకుళంకి చెందిన సనీల్. అందంగా ఉండాలని చేయించుకున్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అతడి జీవితాన్ని ఎంతలా నరకప్రాయంగా చేసిందో వింటే..నోటమాట రాదు. ఇంత ప్రమాదరకరమైనదా.. ?హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనిపిస్తుంది.49 ఏళ్ల సనీల్ తన లుక్ అందంగా మార్చుకోవాలనుకుని కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లోని ఇన్సైట్ డెర్మా క్లినిక్‌ని సంప్రదించాడు. ఆ ఆస్పత్రి గురించి పూర్తిగా తెలుసుకునే యత్నం చేయకుండానే కేవలం ప్రకటనల ఆధారంగా సంప్రదించాడు. అయితే అక్కడ వైద్యులు అతడిని పరిశీలించి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఎప్పుడు చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. అలా అతడికి సదరు ఆస్పత్రి వైద్యులు చేద్దాం అనుకున్నా..నాలుగుసార్లు అనుకోని అవాంతరాలతో వాయిదా పడింది. అప్పుడైనా ఇలా ఎందుకు జరగుతుందని ఆలోచించినా బావుండేదేమో అంటున్నాడు సనీల్ బాధగా. చివరికి ఫిబ్రవరి 2025లో ఒకరోజు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సమయాత్తమయ్యాడు. రెండు రోజుల అనంతరం డిశ్చార్జ్ అయినా తర్వాత నుంచి ఇన్ఫెక్షన్ల బారినపడ్డాడు. మార్చి 1 నాటికి, అతడి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. తలపై పసుపు రంగుమచ్చలు, ఒక విధమైన స్రావాలు కారడం మొదలైంది. అయితే సదరు క్లినిక్ ఇవన్నీ సాధారణ సమస్యలే అని, ఆస్పత్రికి రావాల్సిందిగా తెలిపారు సనీల్కి. దీంతో ఆస్పత్రికి వచ్చినా..పరిస్థితి మెరుగుపడలేదు కదా..మరింతగా పరిస్థితి దిగజారిపోయింది. నొప్పి తగ్గించే స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్ మందులు ఇచ్చారు. దాంతో సనీల్ శరీరంలో బీపీ, చక్కెరస్థాయిలు ప్రమాదకర స్థాయిలో అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ నరకయాతన భరించలేక అక్కడే సమీపంలో ఉన్న సనీల్ లౌర్డ్స్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నవ్య మేరీ కురియన్ వెంటనే అతన్ని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చాకో సిరియాక్ వద్దకు పంపారు. అక్కడ ఆయన సనీల్ పరిస్థితిని చూసి..మాంసం తినే ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారినపడ్డట్లు నిర్థారించారు. తక్షణమే సనీల్ని సర్జరీకి సిద్ధం కావాలని చెప్పారు. అలా సనీల్ ఇప్పటివరకు పదమూడు సర్జరీలకు పైగా చేయించుకున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ని నెక్రోటైజింగ్ ఫాసిటిస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. దీనికి శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, అత్యవసర శస్త్ర చికిత్స వంటి వాటితో పోరాడటమే ఏకైక మార్గం. ఈ ఇన్ఫెక్షన్ ఎముక కనిపించేంత వరకు కణజాలాన్ని తినేస్తుందట. తన తలలో ఒక రంధ్ర ఏర్పడిందని..ప్రస్తుతం తనకు ఇంకా చికిత్స కొనసాగుతుందని అన్నారు. అంతేగాదు ఆ ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతమంతా..ఒక విధమైన స్రావాలు కారడంతో వాక్యూమ్-అసిస్టెడ్ డ్రైనేజ్ పంప్‌ను అమర్చారు. ఆయన ఎక్కడకు వెళ్లినా.. దాన్ని కూడా తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను ఆర్థికంగా, మానసికంగా వేదనకు గురయ్యేలా చేసిన సదరు క్లినిక్‌పై ఫిర్యాదు చేయడమే గాక మూతపడేలా చేశాడు. అలాగే అందుకు బాధ్యులైన సదరు వైద్యులకు శిక్ష పడేదాక వదలనని, తనలా మరెవరూ ఇలాంటి బాధను అనుభవించకూడదని కన్నీటి పర్యంతమయ్యాడు సనీల్. అతడిగాథ వింటే..అందానికి సంబంధించిన శస్త్రచికిత్సల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో చెప్పడమే గాక మనోగత అందానికే ప్రాధాన్యం ఇవ్వాలనే విషయం చెప్పకనే చెబుతోంది.(చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..) -
మూగ జీవే..కానీ ఎంత అద్బుతంగా వీడ్కోలు చెప్పింది..!
విశ్వాసానికి పేరుగాంచిన కుక్కలు మనుషులతో ఎంతో అద్భుతంగా బంధాన్ని ఏర్పరుచుకుంటాయో తెలిసిందే. తమ యజామాని పట్ల ఎంతలా విధేయతతో ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటికి మన మాటలు అర్థం కాకపోయినా..మనకేం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అన్నది ఇట్టే పసిగట్టేస్తాయి. మూగజీవే అయినా..ఎంత అందంగా భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయో అనేందుకు ఉదహారణే ఈ అగ్నిమాపక స్టేషన్లో జరిగిన ఘటనే. ఇది తన అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఒక అధికారి రిటైర్ అవ్వుతుంటే..అది కూడా ఎంత అద్భుతంగా వీడ్కోలు చెప్పిందో చూస్తే..ఆశ్యర్యంగా అనిపిస్తుంది. ఈ ఘటన కేరళ అగ్నిమాపకదళ స్టేషన్లో చోటు చేసుకుంది. ఆ స్టేషన్‌లోని అగ్నిమాపక అధికారి షాజు పదవీవిరమణ చేస్తున్నరోజు కావడంతో..తోటి సహచర సిబ్బంది అంతా ఆయనకు చక్కగా వీడ్కోలు పలికారు. ఆ తర్వాత అదే స్టేషన్లో ఉండే రాజు అనే కుక్కకూడా ఆయన పక్కకు వచ్చి నిలబడి మూగగా వీడ్కోలు చెబుతోంది. నోటితో భావాన్ని వ్యక్తం చేయలేకపోయినా..అది నిశబ్దంగా వీడ్కోలు చెప్పే తీరు అమోఘం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) (చదవండి: 'టాకింగ్ ట్రీ'..ఈ టెక్నాలజీతో నేరుగా మొక్కతో మాట్లాడేయొచ్చు..!) -
మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు!
న్యూఢిల్లీ: రైతాంగానికి శుభవార్త. నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళకు చేరుకొనే అవకాశం ఉందని భారత వాతవరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. పరిస్థితులు అందుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ నెల 27వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ గతంలో ప్రకటించింది. కానీ, అంతకంటే రెండు రోజుల ముందే రానున్నాయని మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి తాజాగా అంచనా వేసింది. అదే జరిగితే 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు త్వరగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది.2009లో మే 23న కేరళలో అడుగుపెట్టాయి. సాధారణంగా ఈ రుతుపవనాలు ప్రతిఏటా జూన్ 1వ తేదీ కల్లా కేరళలో ప్రవేశిస్తాయి. జూన్ 8 నాటికి దేశమంతటా వ్యాపిస్తాయి. సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాల ప్రభావం తగ్గడం మొదలవుతుంది. అక్టోబర్ 15 కల్లా పూర్తిగా తగ్గిపోతుంది. అయితే, ఈసారి దాదాపు ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తుండడంవిశేషం. 2018లో మే 29, 2019లో జూన్ 8, 2020లో జూన్ 1, 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న రుతుపవనాలు కేరళలో అడుగుపెట్టాయి.ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. ఎల్–నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు లేవని తెలియజేసింది. భారత్‌లో వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా జలాశయాలు నిండడానికి, విద్యుత్ ఉత్పత్తికి ఇవి దోహదపడుతుంటాయి. దేశంలో 42.3 శాతం జనాభాకు వ్యవసాయ రంగమే ఆధారం. దేశజీడీపీలో ఈ రంగం వాటా 18.2%నైరుతి రుతుపవనాల రాక కంటే ముందు దేశంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాదిన ఈ పరిణామం కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మరో రెండు రోజుల్లో తుపానుగా మారనుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనవల్ల నైరుతి రుతుపవనాలు కేరళ దిశగా వేగంగా ముందుకు కదులుతాయని అంటున్నారు. ఉత్తర కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్, కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, పాలక్కాడ్, మలప్పురం, త్రిసూర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. -
వామ్మో.. తృటిలో తప్పింది : లేదంటే నుజ్జు.. నుజ్జేగా!
మనం వాహనాన్ని ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నామన్నది ఎంత ముఖ్యమో అవతలి వాళ్లు ఎలా వస్తున్నా రన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఎవరో చేసిన పొరబాటుకు మనం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ సమీపంలో జరిగిన సంఘటన చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఒక మహిళ అద్భుతంగా తప్పించుకుంది. కేరళోని కోజికోడ్ మెడికల్ కాలేజీకి వెళ్లే రోడ్డు వాలులో ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయింది. దీంతో వెనక్కి దూసుకొస్తోంది. దాని వెనక స్వల్ప దూరంలోనే స్కూటర్ వస్తోంది. అయితే సమయస్ఫూర్తిగా వ్యవహరించి స్కూటర్ నడుపుతున్న మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అదృష్టవశాత్తూ ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. బ్రేక్ ఫెయిల్యూర్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.केरल के कोझिकोड का ये वीडियो आपको विचलित कर देगा, मौत आई और छूकर निकल गई। ढलान होने की वजह से ट्रक पीछे लुढ़क गया और स्कूटी सवार महिला पीछे थी, वो ट्रक की चपेट में आ गई। महिला का बचना किसी चमत्कार से कम नहीं था। pic.twitter.com/QvSjORDb0g— Ajit Singh Rathi (@AjitSinghRathi) May 16, 2025ఈమెను ఓజాయాది నివాసి అశ్వతిగా గుర్తించారు. ట్రక్కు ఆమె స్కూటర్‌ను ఢీకొట్టి, ఆమెను రోడ్డుపైకి బలంగా విసిరివేసింది. దీంతో రెప్ప పాటులో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో లారీ స్కూటీని నుజ్జు నుజ్జు చేస్తూ వెనక ఉన్న చెట్టుకు గుద్దుకోని అగింది. సీసీటీవీలో రికార్డుల ప్రకారం పెరింగళం పట్టణం , మెడికల్ కాలేజీ మధ్య ఎత్తుపైకి వెళ్లే ప్రాంతంలోని సిడబ్ల్యుఆర్డిఎం సమీపంలో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగిందీ ఈ సంఘటన. ఇది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని కొందరు, మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిందని కొందరు, వామ్మో, ఇలా కూడా జరుగుతుందా? డ్రైవింగ్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి బ్రో... అని మరికొందరు కమెంట్స్ చేశారు. ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు! -
చీకటి వెలుగులు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఎన్నో మతాలు ఉన్నాయి. ఎన్నో ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. ఆలయాల తొలి ఆనవాళ్లు క్రీస్తుపూర్వం పన్నెండువేల ఏళ్లనాటివి. దాదాపు అన్ని మతాలూ దైవభక్తిని ప్రబోధించేవే! జ్ఞానమార్గాన్ని బోధించిన మతాలు లేకపోలేదు గాని, జనాలను భక్తిపారవశ్యం ఆకట్టుకున్నంతగా జ్ఞానం ఆకట్టుకున్న దాఖలాలు తక్కువ. భాషలు పుట్టి, లిపులు ఏర్పడి, సమాచారాన్ని శిలల మీద, మట్టి పలకల మీద, లోహపు రేకుల మీద, ఆకుల మీద నిక్షిప్తం చేయడం మొదలుపెట్టిన తర్వాత గాని ప్రపంచంలో జ్ఞానవ్యాప్తి మొదలు కాలేదు. మనుషులకు అక్షరజ్ఞానం అబ్బిన తర్వాత తమకు తెలిసిన సమాచారాన్ని తమకు దొరికిన సాధనాలను ఉపయోగించుకుంటూ లిఖితపూర్వకంగా నిక్షిప్తం చేయడం మొదలుపెట్టారు. చరిత్రలో తొలినాటి రచనల ఆనవాళ్లు క్రీస్తుపూర్వం నాలుగో సహస్రాబ్ది నాటివి.మానవాళి జ్ఞానయానానికి అవి తొలి మైలురాళ్లు. భక్తిపారవశ్యం ఒకవైపు, జ్ఞానయానం మరోవైపు మానవాళి మనుగడను ఆది నుంచి నిర్దేశిస్తూనే ఉన్నాయి. సామాజిక, తాత్త్విక, శాస్త్ర, సాంకేతిక పురోగతికి ఎందరో జ్ఞానులు బాటలు వేశారు. లోకమంతటా తమ జ్ఞానకాంతులను ప్రసరించారు. వినువీథిలో ఒకవైపు సూర్యుడు సహా అసంఖ్యాక నక్షత్రాలు నిరంతరం వెలుగులను వెదజల్లుతున్నా, మరోవైపు చీకటి నిండిన కృష్ణబిలాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ లోకంలో ఒకవైపు జ్ఞానులు ప్రసరించిన జ్ఞానకాంతులు ఉన్నా, మరోవైపు మౌఢ్యాంధకారం కూడా అంతే గాఢంగా ఉంది. మానవాళిలో మౌఢ్య నిర్మూలనమనేది ఇప్పటికీ నెరవేరని కలగానే మిగిలింది. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని గురజాడ ఆకాంక్షించారు. ఇప్పటి పరిస్థితులను గమనిస్తే, ఆయన ఆకాంక్ష నెరవేరడానికి ఇంకెన్ని యుగాలు పడుతుందో చెప్పడం కష్టం. ఆరాధించే వాటికి ఆలయాలను నిర్మించుకోవడం అనాది సంస్కృతి. దేవాలయాలను, ప్రార్థనాలయాలను నిర్మించుకున్న మనుషులు అక్కడితో ఆగిపోలేదు. ఆరాధ్య నటీనటులకు, నాయకులకు సైతం ఆలయాలను నిర్మించే స్థాయికి పరిణామం చెందారు. ప్రపంచంలో మౌఢ్యం శ్రుతిమించి మితిమీరిన కాలాల్లో సమాజాన్ని సంస్కరించడానికి ఎందరో సంస్కర్తలు ప్రయత్నించారు. జ్ఞానకాంతులతోనే మౌఢ్యాంధకారం పటాపంచలవుతుందని గ్రహించి, జ్ఞానవ్యాప్తికి కృషి చేశారు. ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానసంపదను అందించడానికి గ్రంథాలయాలను నెలకొల్పారు. ప్రపంచంలోని తొలి గ్రంథాలయం క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్దిలో ఏర్పడింది. ఇప్పటి సిరియాలోని టెల్ మార్దిక్ గ్రామంలో ఉందది. ‘ది రాయల్ లైబ్రరీ ఆఫ్ ఎబ్లా’ అనే ఈ గ్రంథాలయం తొలి జ్ఞాననిధి. ఇందులో ఇరవైవేల మట్టిపలకలపై ఉన్న రాతలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇది ద్విభాషా గ్రంథాలయం కావడం ఇంకో విశేషం. సుమేరియన్, ఎబ్లాౖయెట్ భాషలలో చిత్రలిపిలో రాసిన రాతలు ఆనాటి సామాజిక, వాణిజ్య, విద్యాపరమైన పరిస్థితులకు సాక్షీభూతంగా నిలిచి ఉన్నాయి. ఈ మట్టిపలకల్లో కొన్ని ఇప్పుడు సిరియాలోని డెమాస్కస్, అలెప్పో తదితర నగరాల్లోని మ్యూజియంలలో ఉన్నాయి. ప్రాచీనకాలంలో మన ఉపఖండ భూభాగంలోనూ నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలు ఉండేవి. ఇప్పుడు వాటి శిథిలావశేషాలు తప్ప ఆనాటి జ్ఞానసంపద ఏదీ మిగిలి లేదు. పురాతన గ్రంథాలయాలు ఏర్పడిన కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా మూఢాచారాలు కూడా విస్తృతంగా ఉండేవి. ఆ తర్వాత కాలంలో చాలా మార్పులు జరిగాయి. జాన్ గూటెన్‌బర్గ్ రూపొందించిన ముద్రణ యంత్రం పుస్తకాల రూపురేఖలను మార్చేసింది. ఆధునిక పుస్తకాలకు అంకురారోపణ చేసింది. పారిశ్రామిక విప్లవ కాలంలో పుస్తకాల ముద్రణ పెరగడం మొదలైంది. వలస పాలనలు మొదలవడంతో ప్రజలకు బహుభాషా పరిచయం ఏర్పడి, సమాచార ఆదాన ప్రదానాలు ఊపందుకున్నాయి. బ్రిటిష్ హయాంలో మన దేశంలో నాటి కలకత్తా నగరంలో ‘ఏషియాటిక్ సొసైటీ లైబ్రరీ’ పేరుతో తొలి ఆధునిక గ్రంథాలయం 1781లో ఏర్పడింది. అప్పటికి సతీసహగమన దురాచారంపై ఇంకా నిషేధం విధించలేదు. మన తెలుగునేల మీద 1886లో తొలి ఆధునిక గ్రంథా లయాన్ని విశాఖపట్నంలో మంతిన సూర్యనారాయణమూర్తి నెలకొల్పారు. అప్పటికి కన్యాశుల్కం దురాచారం తీవ్రంగా ఉండేది. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అయ్యంకి వెంకటరమణయ్య నేతృత్వంలో గ్రంథాలయోద్యమం కూడా మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అనేక మార్పులు జరిగాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. ప్రజల్లో అక్షరాస్యత పెరిగింది. పత్రికలు, అధునాతన ప్రసార మాధ్యమాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అయినా, జనాల్లో మౌఢ్యం పూర్తిగా అంతరించలేదు. ఇప్పటికీ మన దేశంలో గ్రంథాలయాల కంటే దేవాలయాలు, ప్రార్థనాలయాలే ఎక్కువ. వైజ్ఞానికాభివృద్ధి ఫలితంగా అందివచ్చిన సాంకేతికత సాధనాలను కూడా వ్యర్థవినోదానికి వినియోగించుకోవడంలో మన జనాలు అపార ప్రజ్ఞాధురీణులు. మౌఢ్య ప్రాబల్యం ఎంతగా పెరుగుతున్నా, జ్ఞానారాధకులు అంతరించిపోలేదు. అందుకు నిదర్శనమే కేరళలోని కాసర్గోడ్ జిల్లా కంబళూరులో వెలసిన పుస్తకాలయం. పుస్తకమే ఇందులోని దేవత. పుస్తకాలే ప్రసాదం. ‘జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అనే ఆకాంక్షను వెలిగించడానికి ఇదొక ఆశాదీపం. -
కేరళ అనంతపద్మనాభ ఆలయంలో బంగారం చోరీ!
కేరళలోని ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయంలో తక్కువ మొత్తంలో సుమారు 100 గ్రాముల మేర బంగారం చోరీకి గురైనట్లు వార్తలు వచ్చాయి. బంగారం పూత నిమిత్తం ఆలయంలో ఉంచిన సుమారు 12 పవనాల (కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో బంగారాన్ని పవనాల్లో కొలుస్తారు. ఒక్కో పవనం 8 గ్రాములకు సమానం) బంగారం కనిపించకుండా పోయిందని ఆయా వార్తా నివేదికల్లో పేర్కొన్నారు.ఆ బంగారాన్ని ఎత్తుకెళ్లారో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పినట్లుగా ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక పేర్కొంది. చివరిసారిగా రెండు రోజుల క్రితం గోల్డ్ ప్లేటింగ్ పనులు జరిగాయి. ఆ తర్వాత మిగిలిన బంగారాన్ని లాకర్లో భద్రపరిచి మళ్లీ పని నిమిత్తం బంగారాన్ని బయటకు తీసుకెళ్లగా సుమారు 12 పవనాల పసిడి మాయమైంది. ఈ మేరకు ఫిర్యాదు నమోదైనట్లు ఫోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే ఆలయంలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల భద్రతా లోపం ఉందని, ఈ చోరీ వెనుక ఆలయంలోని వ్యక్తుల హస్తం ఉండొచ్చని మరికొన్ని వార్తా సంస్థలు నివేదించాయి.గతంలో కూడా ఈ ఆలయంలో బంగారం చోరీకి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. 2015లో సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక ఆడిట్ రిపోర్టులో, ఆలయంలోని నిధుల నుండి 266 కిలోల బంగారం కనిపించకుండా పోయినట్లు తెలిపారు. ఈ బంగారం ఆలయ అలంకరణ కోసం బయటకు తీసినప్పుడు మాయమైనట్లు రిపోర్టు పేర్కొంది. అయితే ఎవరినీ నేరంగా బాధ్యులుగా నిర్ధారించలేదు.2017లో ఆలయంలో రూ. 189 కోట్ల విలువైన బంగారం, ఎనిమిది పురాతన వజ్రాలు కనిపించకుండా పోయినట్లు సుప్రీం కోర్టుకు తెలియజేశారు. ఈ ఘటనలపై కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇక 2024 అక్టోబరులో ఆలయంలో ప్రసాదం కోసం ఉపయోగించే ఒక ఇత్తడి పాత్ర మాయమైనట్లు వార్తలు వచ్చాయి.ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ దేవాలయం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ అనంత పద్మనాభస్వామి ఆలయం. ఈ ఆలయ సంపద రూ. 1.5 లక్షల కోట్ల విలువైనదిగా అంచనా. 2011లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆలయ నేలమాళిగల్లోని ఆరు గదులలో ఐదింటిని తెరిచారు. వీటిలో అపారమైన బంగారం, వజ్రాలు, రత్నాలు బయటపడ్డాయి. అయితే, ఒక గదిని మాత్రం ఇప్పటివరకు తెరవలేదు. దీని వెనుక సాంకేతిక, మతపరమైన కారణాలు ఉన్నాయని చెబుతారు. -
27న కేరళకు నైరుతి
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించనున్నాయి. సాధారణంగానే జూన్ ఒకటో తేదీన నైరుతి కేరళలోకి ప్రవేశిస్తాయి. అంతకంటే ముందుగా మే 27వ తేదీనే కేరళను తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం తెలిపింది. అదే జరిగితే 2009 తర్వాత మొదటిసారిగా రుతు పవనాలు మేలోనే వచ్చినట్లవుతుందని పేర్కొంది. 2009లో చాలా ముందుగా అంటే మే 23వ తేదీనే భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. సాధారణంగా జూలై 8వ తేదీకల్లా దేశం మొత్తానికి రుతుపవ నాలు వ్యాప్తి చెందుతాయి.తిరిగి సెప్టెంబరు 17వ తేదీన వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15కల్లా ముగుస్తుంది. గతేడాది మే 30న, అంతకు ముందు 2023లో జూన్ 8న కేరళను రుతుపవనాలు తాకాయి. అయితే, రుతు పవనాలు ప్రవేశించడానికి, ఈ సీజన్లో దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతానికి ఎటువంటి సంబంధం లేదని ఐఎండీ అధికారులు తెలిపారు.రుతుపవనాలు కేరళలోకి సాధారణం కంటే ముందుగా గానీ లేక ఆలస్యంగా గానీ తాకాయంటే దేశవ్యాప్తంగా అవి విస్తరిస్తాయని చెప్పలేమని అన్నారు. స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక పరిస్థితులపై రుతు పవనాల వైఖరి ఆధారపడి ఉంటుందని వివరించారు. 2025 రుతుపవన సీజన్లో మొత్తమ్మీద సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసింది. దేశంలో వ్యవసాయరంగానికి రుతుపవనాలే కీలకం. -
సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..
ఇటీవల కాలంలో అందంగా, నాజుగ్గా ఉండేందుకే అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు అతివలు. అందుకోసం ఎలాంటి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకునేందుకైనా వెనకాడటం లేదు. అలాంటి సౌందర్య చికిత్స చేయించుకునే ఓ మహిళ వేళ్లను కోల్పోయింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లుగా.. పాపం ఆ మహిళకు తీవ్ర బాధనే మిగిల్చింది ఆ కాస్మెటిక్ సర్జరీ.అసలేం జరిగిందంటే..తిరువనంతపురం జిల్లా, కజకూట్టం సమీపంలోని తంపురాన్ముక్కులోని కాస్మెటిక్ హాస్పిటల్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తిరువనంతపురంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంఎస్ నీతు రెండు నెలల క్రితం ఫిబ్రవరి 22న క్లినిక్‌లో కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. ప్రసవం తర్వాత సాధారణంగా పొట్ట ఒదులుగా బెల్లీ పొట్టలా మారుతుంది కొదరికి. ఇక్కడ నీతుకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో.. ఉదర కొవ్వు తీయించుకునే కాస్మెటిక్ సర్జరీ లైపోసక్షన్ని చేయించుకుంది. సర్జరీ జరిగిన మరుసటి రోజే నీతూని డిశ్చార్జ్ చేసి పంపించేశారు వైద్యులు. ఆ తర్వాత నుంచి ఆమెకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఒకటే తలతిప్పడం..తీవ్ర బలహీనత, నీరసం వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి. వైద్యులను సంప్రదిస్తే..జావా, ఓట్మీల్ వంటివి తీసుకోవాలని సూచించారు. అయితే ఆమె పరిస్థితి మెరుగవ్వక పోగా, అంతకంతకు విషమించడం మొదలైంది. దీంతో హుటాహుటినా సదరు కాస్మెటిక్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె పరిస్థితి చూసి..పది యూనిట్ల రక్తం కూడా ఎక్కించారు. అయినా ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో..మరొక ఆస్పత్రికి రిఫర్ చేశారు వైద్యులు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అక్కడ సుమారు 22 రోజుల అనంతరం కోలుకుంది. నీతు చేయించుకున్న లైపోసక్షన్ తీవ్ర ఇన్ఫెక్షన్ సమస్యలు కలిగించి..పరిస్థితి దిగజారిపోయేలా చేసిందని చెప్పారు వైద్యులు. అంతేగాదు ఆమెకు త్వరితగతిన నయం అయ్యేలా ఎడమ పాదం ఐదు వేళ్లు, ఎడమ చేతి నాలుగు వేళ్లను తొలగించినట్లు తెలిపారు వైద్యులు. దీంతో కుటుంబ సభ్యులు సదరు కాస్మెటిక్సర్జరీ నిర్లక్ష్యం కారణంగానే నీతుకి ఈ పరిస్థితి ఎదురైందంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే ఆమెకు సర్జరీ చేసిన డాక్టర్ షెనాల్ శశాంకన్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగింది. ఇక విచారణలో సదరు కాస్మెటిక్ ఆస్పత్రి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండానే ఈ క్లినిక్ నిర్వహిస్తుందని తేలింది. దీంతో ఆ క్లినిక్‌ని మూసివేసేలా నోటీసులు జారీ చేశారు. కాగా, గతంలో కొందరు ఇలాంటి సౌందర్య చికిత్సలు చేయించుకుని ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చాలానే వెలుగు చూశాయి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: యుద్ధ చర్య కాదు..! ఆపరేషన్ సిందూర్‌పై పాక్ వ్యక్తి ప్రశంసల జల్లు) -
సివిల్స్‌లో ఇల్లాలి అపూర్వ విజయం..! వైకల్యాన్ని జయించి..
ఇరవైలలో సివిల్స్‌కు శ్రీకారం చుట్టడం సాధారణ విషయం. కేరళకు చెందిన నిశా మాత్రం 35వ యేట ప్రిపరేషన్ మొదలు పెట్టింది. వినికిడి సమస్య ఉన్న నిశా ఏడవ ప్రయత్నంలో, 40 సంవత్సరాల వయసులో సివిల్స్‌లో విజయం సాధించింది. తిరువనంతపురంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేసేది నిసా ఉన్నిరాజన్. నందన (11), తన్వీ(7) ఆమె కుమార్తెలు. భర్త అరుణ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 35 ఏళ్ల వయసులో సివిల్స్‌కు సిద్ధం అవుతున్నప్పుడు... ‘ఈ వయసులో కష్టం’ ‘ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సివిల్స్‌లో సక్సెస్ కావడం కష్టం’... ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. భర్త అరుణ్ మాత్రం ప్రోత్సహించాడు.వినికిడి సమస్య వల్ల సివిల్స్ ప్రిపరేషన్లో నిసాకు సమస్యలు ఎదురయ్యేవి. సబ్జెక్ట్‌కు సంబంధించిన ఆడియోలు వినడం కష్టం అయ్యేది. ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరోవైపు ప్రిపరేషన్ కోసం టైమ్ కేటాయించుకునేది. ‘వినికిడి సమస్య ఉన్న నువ్వు సివిల్స్‌కు ఎలా ప్రిపేరవుతావు!’లాంటి ఎగతాళి మాటలు వినాల్సి వచ్చేది.ఆమె కష్టం వృథా పోలేదు. నలభై ఏళ్ల వయసులో యూపీఎస్సీ–2024 పరీక్షలో 1000వ ర్యాంక్ సాధించింది. 40 శాతం వినికిడి లోపం ఉన్న నిశా తన వైకల్యాన్ని ఎదుర్కొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే విజయం సాధించింది.కొట్టాయం డిప్యూటీ కలెక్టర్ రంజిత్ నుంచి నిశా స్ఫూర్తి పొందింది. వినికిడి సమస్య ఉన్న రంజిత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సివిల్స్‌లో విజయం సాధించాడు. ‘మీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నా కుమార్తెలకు నిరూపించి చూపాలనుకున్నాను. మనకు ఉన్నది ఒకే జీవితం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోవద్దు’ అంటుంది నిశా. (చదవండి: చిన్నారులకు వంశవృక్షం తెలియాలి..! కనీసం ఓ మూడు తరాలు..) -
శశిథరూర్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక..
'ఈ సమావేశం తర్వాత కొంతమందికి నిద్రపట్టదు' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో శుక్రవారం పర్యటించిన మోదీ మాటల తూటాలతో ప్రత్యర్థులపై సూటిగా గురిపెట్టారు. సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ భుజాలపైనుంచి ప్రతిపక్ష ఇండియా కూటమిపై తుపాకీ ఎక్కుపెట్టారు. 'మీ పార్టీకి చెందిన సీనియర్ నేత మా పక్కన నిలబడ్డారు చూడండి' అన్నట్టుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.వారికి నిద్ర పట్టకపోవచ్చు..తిరువనంతపురం సమీపంలో నిర్మించిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు స్థానిక ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి (పినరయి విజయన్)కి నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు INDIA కూటమికి బలమైన స్తంభం, శశి థరూర్ (Shashi Tharoor) కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు మీరు నాతో పాటు వేదిక పంచుకున్నారు. మీరు ఇక్కడ ఉండడం కొందరికి రుచించకపోవచ్చు. వారికి నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుతుంద"ని వ్యాఖ్యానించారు.గ్యాప్ పెరిగింది..తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శశిథరూర్.. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (INDIA) కూటమిలో కీలక నేతగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఆయనకు మధ్య దూరం పెరిగింది. పినరయి విజయన్ (Pinarayi Vijayan) సర్కారు తీసుకొచ్చిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్ టేప్ కోత విధానాలపై కొద్ది రోజుల క్రితం శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్‌కు బద్దశత్రువైన ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ అమెరికా పర్యటన, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో శశిథరూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ దూరం పెట్టింది. పార్టీకి తన అవసరం లేకపోతే స్పష్టంగా చెప్పాలని, తన దారి తాను చూసుకుంటానని గత ఫిబ్రవరిలో అధిష్టానాన్ని అడిగారు. ఈ నేపథ్యంలో థరూర్ బీజేపీలో చేరతారని ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే తాను పార్టీ మారబోనని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు.చదవండి: ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం.. మల్లిఖార్జున ఖర్గేపతాక శీర్షికలకు మోదీ వ్యాఖ్యలుతాజాగా థరూర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పతాక శీర్షికలకు ఎక్కాయి. శశిథరూర్ భుజాల పైనుంచి ప్రతిపక్ష ఇండియా కూటమిపైకి మోదీ తుపాకీ ఎక్కుపెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా కూటమిని డిఫెన్స్‌లో పడేసేందుకే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మరోవైపు కేరళలో పాగా వేసేందుకు కాషాయ పార్టీ ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ వ్యాఖ్యలపై ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
‘శశి థరూర్ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’
తిరువనంతపురం: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఓడరేవును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఇవాళ శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు. కొందరికి ఇది నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది’’ అంటూ మోదీ చురకలు అంటించారు. కేరళ సీఎం విజయన్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని.. శశి థరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా.. నా నియోజకవర్గానికి వచ్చిన మోదీని సాదరంగా స్వాగతించా’’ అంటూ శశి థరూర్ ట్వీట్ కూడా చేశారు.శశిథరూర్ గత కొన్ని నెలలుగా తన సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న తెలిసిందే. ఇటీవల ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ కూడా ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ ఆయన ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా, భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు.. సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. -
సన్నీ థామస్ కన్నుమూత.. అభినవ్ బింద్రా భావోద్వేగం
కొచ్చి: జాతీయ షూటింగ్ మాజీ కోచ్ సన్నీ థామస్ కన్నుమూశారు. రెండు దశాబ్దాలకు పైగా భారత షూటర్ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ థామస్ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. కేరళలోని కొట్టాయాంకు చెందిన 84 ఏళ్ల సన్నీ థామస్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1993 నుంచి 2012 వరకు భారత జాతీయ షూటింగ్ కోచ్‌గా వ్యవహరించిన థామస్... దేశానికి ఎన్నో మరపురాని విజయాలు అందించారు.‘ద్రోణాచార్య’ అవార్డుఇక.. 2001లో ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న థామస్ శిక్షణలో రాటు దేలిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ ‘డబుల్ ట్రాప్’లో రజత పతకం నెగ్గాడు. ఒలింపిక్స్ షూటింగ్లో మన దేశానికి ఇదే తొలి పతకం కాగా... ఆ తర్వాత కూడా ఆయన శిష్యులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన సమయంలోనూ థామస్ జాతీయ కోచ్‌గా ఉన్నారు.‘ప్రొఫెసర్ థామస్ మరణం భారత షూటింగ్‌కు తీరని లోటు. భారత షూటింగ్‌కు ఆయన దిక్సూచి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మన షూటర్లు పతకాలు సాధిస్తున్నారంటే దీని వెనక ఆయన కృషి ఎంతో ఉంది’ అని జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు కాళికేశ్ నారాయణ్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అభినవ్ బింద్రా భావోద్వేగంమరోవైపు తన గురువు మృతిపై అభినవ్ బింద్రా తీవ్ర సంతాపం వ్యక్తం చేశాడు. ‘ఆయన కేవలం కోచ్ మాత్రమే కాదు. మెంటార్, గైడ్... అంతకన్నా ఎక్కువే. భారత షూటర్లకు ప్రొఫెసర్ థామస్ మార్గదర్శి. ఆయన అంకితభావం వల్లే దేశంలో షూటింగ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. నా కెరీర్లో ఆయన పాత్ర ఎంతో కీలకమైంది’ అని బింద్రా పేర్కొన్నాడు.కాగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన విజయ్ కుమార్ కూడా ఆయన శిష్యుడే. హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్, జస్పాల్ రాణా, సమరేశ్ జంగ్ వంటి ఎందరో అంతర్జాతీయ షూటర్లను దేశానికి అందించిన ప్రొఫెసర్ థామస్... తన కెరీర్లో జాతీయ చాంపియన్‌గానూ నిలిచారు. -
భయానక అనుభవం.. ఉగ్ర దాడి నుంచి ఆ బృందం ఎలా తప్పించుకుందంటే?
శ్రీనగర్: అందాల కశ్మీరంలో పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. వారిపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యూఏఈ. మరో ఇద్దరు స్థానికులు కాగా మిగతావారు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందినవారు. వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ బృందం ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకుంది.కేరళ నుంచి చిన్నారి సహా దాదాపు 23 మంది కశ్మీర్ పర్యటనకు వచ్చారు. వాళ్లంతా బైసరన్ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లారు. అయితే, టూరిస్ట్ స్పాట్‌కు వెళ్లాలంటే గుర్రంపైన వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వారు గుర్రపు స్వారీ ఖరీదు అధికంగా ఉండటంతో వేరే ప్రదేశానికి ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లిపోయారు. దీంతో ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో పడ్డారు.వేరే ప్రదేశానికి వెళ్తున్న టైంలో తమకు కొన్ని భారీ శబ్దాలు వినిపించాయని.. దుకాణాలు మూసివేస్తున్నారని.. ప్రజలు కూడా పారిపోతున్నారని ఆ పర్యాటకులు వివరించారు. అక్కడ ఏం జరుగుతోందో తమకు అర్థంకాలేదన్నారు. మేము అందమైన ప్రదేశానికి తీసుకెళ్లమని తమ గైడ్‌ను అడిగామని.. బతికి ఉండాలనుకుంటున్నారా..? లేదా..? అని. ట్యాక్సీ అతను సరాసరి తామున్న హోటల్ వద్దకు తీసుకెళ్లాడన్నారు. టీవీలో వార్తలు చూసిన తర్వాత అక్కడ ఉగ్రదాడి జరిందని.. గుర్రపు స్వారీకి వెళ్లి ఉంటే తమ పరిస్థితి ఎలా ఉండేందోనంటూ భయంకరమైన అనుభవాన్ని వివరించారు. -
‘మా వాళ్లు 575 మంది ఇంకా కశ్మీర్ లోనే..’
తిరువనంతపురం: తమ రాష్ట్రానికి చెందిన 575 మంది ఇంకా కశ్మీర్ లోనే ఉన్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ వెళ్లిన వారు ఇంకా అక్కడే ఉన్నారన్నారు. వారు తిరిగి వచ్చే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన ఆయన వెల్లడించారు. వీరంతా కశ్మీర్ నుంచి ఢిల్లీ చేరేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. టికెట్లు బుకింగ్ చేసి వారిని ఢిల్లీ మీదుగా కేరళకు రప్పించే యత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే వారికి అవసరమైన ఆహారం తదితర వాటిని ప్రభుత్వం నుంచి తమ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నట్లు సీఎం విజయన్ తెలిపారు. ఇది దేశంపై జరిగిన దాడి అని, మనమంతా కలిసి కట్టుగా ఉండాల్సిన సమయమని విజయన్ పేర్కొన్నారు. మరొక పెహల్గామ్ ఉగ్రదాడి జరగ్గకుంటా దేశమంతా ఐక్యం కావాలన్నారు.రెండు రోజుల క్రితం కశ్మీర్ ప్రాంతమైన పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలు.. టూరిస్టులను తిరిగి వెనక్కి పంపించే ఏర్పాట్లును కూడా పర్యవేక్షిస్తోంది. దీనిలో భాగంగా తమ రాష్ట్ర పౌరులు ఎంతమంది అక్కడికి వెళ్లారనే దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ వాసులు 575 అక్కడే చిక్కుకుపోయిన క్రమంలో వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించే యత్నాలు చేస్తోంది ప్రభుత్వం. -
ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి
విదేశాల్లో చిక్కుకుపోయిన వ్యక్తి నాలుగు దశాబ్దాల తరువాత తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. చక్కటి ఉద్యోగం,మంచి జీతం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనలో పొట్టచేత పట్టుకొని వెళ్లాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 ఏళ్లు అక్కడే ఉండిపోయాడు. చివరికి అక్కడినుంచి ఎలా బైటపడ్డాడు? కుటుంబాన్ని ఎలా కలుసుకున్నాడు? ఈ హృదయ విదారక గాథకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం రండి!కేరళలోని త్రివేండ్రంలోని పౌడికోణం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న గోపాలన్ గల్ఫ్ దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి, కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. ఎంతో మంది వలస కార్మికుల మాదిరిగానే ఎన్నో ఆశలతో ఇల్లు వదిలాడు. 1983 ఆగస్టు 16న బహ్రెయిన్‌కు వెళ్లాడు. కానీ విధి రాత మరోలా ఉంది. ఏమైందంటే..గోపాలన్ బహ్రెయిన్‌కు చేరుకున్నాడో లేదో, అతని యజమాని అకాల మరణం చెందాడు. గోపాలన్ పాస్‌పోర్ట్ పోయింది. దీంతో గోపాలన్ అయోమయంలో పడిపోయాడు. ఇమ్మిగ్రేషన్ చిక్కులతో బహ్రెయిన్‌లో చిక్కుకు పోయాడు. నాలుగు గోడల మధ్య మౌనంగా రోదిస్తూ ఉండిపోయాడు.అయితే భారతదేశం, విదేశాలలో అన్యాయాన్నిఎదుర్కొంటున్న భారతీయుల కోసం పోరాడే రిటైర్డ్ న్యాయ మూర్తులు, న్యాయవాదులు , జర్నలిస్టులతో కూడిన ప్రవాసీ లీగల్ సెల్ (PLC) అనే NGO ద్వారా అతని పాలిట వరంగా అవతరించింది. గోపాలన్ విషయం తెలుసుకుని అతనికి సాయపడింది. పీఎల్సీ బహ్రెయిన్ చాప్టర్ ప్రెసిడెంట్ సుధీర్ తిరునిలత్, తన బృందంతో కలిసి బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని, అష్టకష్టాలు పడి చివరికి 74 ఏళ్ల వయసులో గోపాలన్ తిరిగి వచ్చేలా చేశారు.ఫలించిన తల్లి ఎదురు చూపులు గోపాలన్ చివరకు 95 ఏళ్ల తల్లిని చూడటానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అలా కొడుకు కోసం ఆమె చూసిన ఎదురు చూపులు ఫలించాయి. ఒట్టి చేతులతో కేవలం ఎన్నో జ్ఞాపకాలు, మరెంతో కన్నీళ్లభారంతో స్వదేశానికి పయనమయ్యాడు. కుటుంబంతో తిరిగి కలవాలనే కలతో విమాన మెక్కిన రోజు అతని జీవితంలో మరపురాని రోజుగా మిగిలిపోయింది. కాసింత దయ, మానవత్వం, న్యాయం, అవిశ్రాంత పోరాటం ఫలితంగా వచ్చిన ఫలితమిది. ఎంతోమంది వలసదారులకు ఆశలకు ప్రాణంపోసిన ఉదంతమిది. ‘స్వాగతం గోపాలన్, ఇంటికి స్వాగతం’ అంటూ పీఎల్సీ తన ఫేస్బుక్లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. -
Kerala Tour అరేబియా తీరం, హౌస్‌బోట్ విహారం
టెక్నాలజీతో రూపుదిద్దుకున్న రామాయణ ఘట్టం ఉంది.అరేబియా తీరాన కొలువుదీరిన అతిపెద్ద గంగాధరుడున్నాడు.అనంత సంపన్నుడు అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. భారతీయ మూర్తులకు పశ్చిమ రంగులద్దిన రవివర్మ ఉన్నాడు.కేరళ సిగ్నేచర్ హౌస్‌బోట్ విహారం ఉంది... కథకళి...కలరిపయట్టు విన్యాసాలూ ఉన్నాయి.టీ తోటలు... మట్టుపెట్టి డ్యామ్ బ్యాక్ వాటర్స్...ఇవే కాదు... ఇంకా చాలా చూపిస్తోంది ఐఆర్సీటీసీ. మొదటి రోజుత్రివేండ్రమ్ ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్, కొకువెలి రైల్వేస్టేషన్ల నుంచి పికప్ చేసుకుని బస చేయాల్సిన హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్ త్రివేండ్రమ్ లేదా కోవళమ్‌లలో ఉంటుంది. సాయంత్రం కోవళం బీచ్, అళిమల శివుని విగ్రహాన్ని దర్శించుకుని విశ్రాంతి తీసుకోవడమే. రెండో రోజుఉదయం త్రివేండ్రమ్‌లోని పద్మనాభస్వామి ఆలయ దర్శనం. జటాయు ఎర్త్ సెంటర్‌ని చూసిన తర్వాత ప్రయాణం కుమర్‌కోమ్ వైపు సాగుతుంది. ఈ ప్యాకేజ్ పేరుతో ఉన్న హౌస్‌బోట్ విహారం ఇక్కడ మొదలవుతుంది. కుమర్‌కోమ్ లేదా అలెప్పీలో క్రూయిజ్‌లోకి మారాలి. రాత్రి భోజనం, బస, ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అన్నీ హౌస్‌బోట్‌లోనే.తెరవని ఆరవ గదిత్రివేండ్రమ్... ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అనంత పద్మనాభ స్వామి వల్ల ఈ పేరు విశ్వవ్యాప్తంగా ప్రచారం సంతరించుకుంది. ఈ నగరానికి ఆ పేరు వచ్చింది కూడా అనంత పద్మనాభ స్వామి వల్లనే. తిరు అనంత పురం... క్రమంగా మలయాళీల వ్యవహారంలో తిరువనంతపురం అయింది. బ్రిటిష్ వారి వ్యవహారంలో త్రివేండ్రమ్‌గా మారింది. ఇక్కడ పద్మనాభ స్వామి ఆలయంలో తెరవని ఆరో గది ఇప్పటికీ ఆసక్తికరమే. నాగబంధంతో మూసిన ఆ గదిని తెరవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పద్మనాభ స్వామి ఆలయ దర్శనంలో ఈ గదిని తప్పనిసరిగా చూడాలి. ఇక త్రివేండ్రమ్ అనగానే గుర్తొచ్చే మరో పేరు రాజా రవి వర్మ. భారతీయ దేవతల చిత్రాలకు కొత్తరంగులద్దిన ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన రవివర్మ నివాసాన్ని కూడా చూడవచ్చు.జటాయు ఎర్త్ సెంటర్... ఇది ఒక థీమ్ పార్క్. జటాయు పక్షి ఆకారంలో నిర్మించారు. రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో రావణుడితో పోరాడి ప్రాణాలు వదిలిన పక్షి జటాయు. ఆ పక్షి రావణుడితో యుద్ధం చేసి నేలకొరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ పార్క్‌ను పశ్చిమ కనుమల్లో ఓ కొండ మీద 65 ఎకరాల్లో నిర్మించారు. ఈ కొండమీదకు వెళ్లడానికి ఎనిమిది వందలకు పైగా మెట్లెక్కాలి. కేబుల్‌కార్ కూడా ఉంది. ఆరోగ్యవంతులు ఎక్కగలిగిన కొండే అయినప్పటికీ బయటి ప్రదేశాల నుంచి పర్యటన కోసం వచ్చిన వాళ్లు టైమ్ వేస్ట్ చేసుకోకుండా పశ్చిమ కనుమల సౌందర్యాన్ని వీక్షిస్తూ కేబుల్ కార్లో వెళ్లడమే మంచిది. వెకేషన్ కోసం వెళ్లి నాలుగైదు రోజులు బస చేసేవాళ్లు ఒక రోజు కొండ ఎక్కడాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్యాస్టిక్‌ని అనుమతించరు.మూడో రోజుఅలెప్పీ నుంచి మునార్‌కు ప్రయాణం. రోడ్డు మార్గాన మునార్‌కు చేరాలి. మధ్యలో పునర్జనిలో కేరళ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించాలి. రాత్రి బస మునార్‌లో.కలరిపయట్టు... కథకళి చూద్దాం!పునర్జని ట్రెడిషనల్ విలేజ్... కేరళ సంప్రదాయ కళల ప్రదర్శన వేదిక. అలాగే ఆయుర్వేద చికిత్సల నిలయం కూడా. మునార్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రోజూ సాయంత్రం ఆరు గంటలకు కథకళి నాట్యం, కలరిపయట్టు యుద్ధకళా విన్యాసాలను ప్రదర్శిస్తారు. రిలాక్సేషన్ థెరపీలు ఐదు నుంచి పదిహేను వేలు చార్జ్ చేస్తారు. అవి ఈ ప్యాకేజ్‌లో వర్తించవు. నాలుగో రోజురోజంతా మునార్‌లోనే. ఎరవికులమ్ నేషనల్ పార్క్ పర్యటన, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్, ఎఖో పాయింట్, కుందల డ్యామ్ లేక్‌లో విహరించిన తర్వాత రాత్రి బస మునార్‌లోనే.మునార్ టీ తోటల మధ్య విహారం, ఝుమ్మనే వాటర్ ఫాల్స్ ను దూరం నుంచే చూస్తూ ముందుకు సాగిపోవడంతోపాటు టీ మ్యూజియం సందర్శన బాగుంటుంది. మట్టుపెట్టి డ్యామ్, రిజర్వాయర్ చుట్టూ విస్తరించిన టీ తోటల దృశ్యం కనువిందు చేస్తుంది. ఎరవికులమ్ నేషనల్ పార్క్ విజిట్ మరిచిపోలేని అనుభూతి. నీలగిరుల్లో పన్నెండేళ్లకోసారి పూచే నీలకురింజి పువ్వు దట్టంగా పూసేది ఇక్కడే. నీలకురింజి మళ్లీ పూసేది 2030లో. కానీ ఎక్కడో ఓ చోట ఒకటి రెండు గుత్తులు కనిపిస్తాయి. గైడ్లు వాటిని చూపించి కొండ మొత్తం పూసినప్పుడు దృశ్యం ఎలా ఉంటుందో ఫొటోలు చూపిస్తారు. అయిదో రోజుమునార్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కొచ్చి వైపు సాగిపోవాలి. కొచ్చిలో హోటల్ చెక్ ఇన్. మెరైన్ డ్రైవ్‌ను ఎంజాయ్ చేసిన తర్వాత షాపింగ్ తర్వాత నైట్ స్టే.కొచ్చిలో షాపింగ్ చేయడం మొదలు పెడితే మన లగేజ్ పెరిగిపోతుంది. లవంగాలు, యాలకులు, మిరియాల వంటివి చక్కటి ఘాటు వాసనతో స్వచ్ఛంగా ఉంటాయి. టూర్ గుర్తుగా కేరళ చీర ఒక్కటైనా కొనుక్కోవాలి. అవి బాగా మన్నుతాయి కూడా! స్థానిక హస్తకళాకృతులకు కొదవే ఉండదు. కోకోనట్ కాయిర్‌తో చేసిన గృహోపకరణాలు కూడా బాగుంటాయి. కథకళి సావనీర్లు తెచ్చుకోవచ్చు. ఆయుర్వేద తైలాల పేరుతో దొరికేవన్నీ స్వచ్ఛమైనవి కాదు, నకిలీలు కూడా ఉంటాయి. వీటిని గవర్నమెంట్ ఆథరైజ్డ్ స్టోర్లలో మాత్రమే కొనాలి. షాపింగ్ చేసేటప్పుడు ఫ్లయిట్లో లగేజ్ బరువు పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. వెళ్లేటప్పుడు ఫ్లయిట్, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తే లగేజ్ బరువు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. ఆరో రోజుకొచ్చిలో హోటల్ చెక్ అవుట్ చేసి, కొచ్చి లోని డచ్ ప్యాలెస్ సందర్శనం. యూదుల సినగోగ్ (ధార్మిక సమావేశ మందిరం), సర్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రాజ్ బాసిలికా పర్యటన తర్వాత కొచ్చి ఎయిర్ పోర్ట్ లేదా ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడంతో టూర్ పూర్తవుతుంది. కొచ్చి, ఎర్నాకుళం మన హైదరాబాద్– సికింద్రాబాద్ వంటి జంట నగరాలు. ఎయిర్΄ోర్టు కొచ్చిలో ఉంది, రైల్వే స్టేషన్ ఎర్నాకుళంలో ఉంది.వాస్కోడిగామా రాక ఫలితం!డచ్ ప్యాలెస్... అనగానే పాశ్చాత్య నిర్మాణశైలిని ఊహిస్తాం. కానీ ఇది పూర్తిగా కేరళ సంప్రదాయ నాలుకేట్టు నిర్మాణశైలిలో ఉంటుంది. పోర్చుగీసు వాళ్లు నిర్మించడం వల్ల డచ్ ప్యాలెస్‌గా అనే పేరు వచ్చింది. ఇది కొచ్చి నగరానికి సమీపంలోని మత్తన్ చెర్రి అనే ప్రదేశంలో ఉండడంతో స్థానికులు మత్తన్‌చెర్రి ప్యాలెస్ అనే పిలుస్తారు. వాస్కోడిగామా మనదేశంలో కేరళతీరం, కొచ్చి రాజ్యం, కప్పడ్ దగ్గర ప్రవేశించాడు. కొచ్చి రాజు అతడికి సాదర స్వాగతం పలికాడు. మనదేశం బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లడానికి దారులు వేసిన ఒక కారణం ఇది. ఈ ప్యాలెస్ భవనాల సముదాయం హెరిటేజ్ సైట్ల జాబితా కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ ప్యాలెస్ లోపల నాటి చిత్రరీతుల ప్రదర్శన ఉంది.యూదులు వచ్చారు!మత్తన్‌చెర్రిలో డచ్ ప్యాలెస్ పక్కనే యూదు మతస్థుల ధార్మిక సమావేశ మందిరం సినగోగ్ కూడా ఉంది. ఇది కూడా డచ్ ప్యాలెస్ నాటి 16వ శతాబ్దం నాటి నిర్మాణమే. పశ్చిమం నుంచి మనదేశానికి అరేబియా సముద్రం మీదుగా జలమార్గాన్ని కనుక్కున్న తర్వాత పాశ్చాత్య దేశాలతో వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. వర్తకులు, నౌకాయాన ఉద్యోగులు తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకోవడం మొదలైంది. అలా స్పెయిన్, పోర్చుగల్ నుంచి వచ్చిన వారిలో కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు. ఆ కాలనీలు క్రమంగా వారి మత విశ్వాసాలను కొనసాగించడానికి మందిరాలు కట్టుకున్నారు. అలాంటిదే ఇది కూడా. ఈ సినగోగ్ క్రిస్టల్ షాండ్లియర్లతో అందంగా ఉంటుంది. తమ మత సంప్రదాయాలను గౌరవిస్తూ భారతదేశంలో భారతీయులుగా మమేకమయ్యారు. ‘వింగ్స్ ఆఫ్ జటాయు విత్ హౌస్‌బోట్’... ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజ్. ఇందులో త్రివేండ్రమ్, అలెప్పీ, మునార్, కొచ్చి ప్రదేశాలు కవర్ అవుతాయి. నీలగిరి తార్కు ప్రసూతి సమయం కావడంతో మునార్‌లోని ఎరవికులమ్ నేషనల్ పార్క్‌ను ఏప్రిల్ 1 వరకు క్లోజ్ చేశారు. ప్రస్తుతం పర్యాటకులను అనుమతిస్తున్నారు. కాబట్టి ‘వింగ్స్ ఆఫ్ జటాయు విత్ హౌస్‌బోట్’ టూర్‌కి ఇది అనువైన సమయం.కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి దాదాపుగా 57 వేల రూపాయలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 30 వేలవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. పిల్లలకు విడిగా బెడ్ తీసుకుంటే తొమ్మిది వేలు, బెడ్ తీసుకోకపోతే దాదాపుగా ఐదు వేల ఐదు వందలు. టూర్లో ఏసీ వాహనంలో ప్రయాణం, ట్రావెల్ ఇన్సూ్యరెన్స్, మార్గమధ్యంలో టోల్ ఫీజులు, పార్కింగ్ ఫీజులు, ప్యాకేజ్‌లో చెప్పిన ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు, హోటల్ గది బస, హౌస్‌బోట్‌లో బస, నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, హౌస్‌బోట్‌లో లంచ్, డిన్నర్ ఈ ప్యాకేజ్‌లో ఉంటాయి.ప్యాకేజ్‌లో మన ప్రదేశం నుంచి త్రివేండ్రమ్‌కు చేరడం, కొచ్చి లేదా ఎర్నాకుళం నుంచి ఇంటికి రావడానికి అయ్యే రైలు లేదా విమాన ఖర్చులు వర్తించవు. త్రివేండ్రమ్‌లో రిసీవ్ చేసుకోవడం నుంచి కొచ్చిలో వీడ్కోలు పలకడం వరకే ఈ ప్యాకేజ్. ఇటీవల పర్యాటకులు యూ ట్యూబ్ వీడియోల కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా హౌస్‌బోట్ ప్రయాణంలో నిర్వహకుల సూచనలను విధిగా పాటించాలి.ఈ టూర్‌లోని పర్యాటక ప్రదేశాల్లో మునార్ టీ మ్యూజియానికి సోమవారం సెలవు, కొచ్చిలోని డచ్ ప్యాలెస్ శుక్రవారం, యూదుల సినగోగ్‌కి శనివారం సెలవు. వీటిలో ఒకటి – రెండు మిస్ కాక తప్పదు. విమానాశ్రయంలో దేవుని ఊరేగింపు!త్రివేండ్రమ్ చేరడానికి విమానంలో వెళ్లడం వల్ల బోనస్ థ్రిల్ ఉంటుంది. పద్మనాభస్వామి ఊరేగింపు కోసం విమానాలు ల్యాండింగ్ ఆపేస్తారు. ఏడాదికి రెండు దఫాలు ఈ విచిత్రం చోటు చేసుకుంటుంది. ఏప్రిల్ నెలలో పైన్కుని పండుగ సందర్భంగా జరిగే పది రోజుల వేడుకలో చివరి రోజు ఆరట్టు (సముద్రస్నానం) కోసం పద్మనాభ స్వామి ఊరేగింపు ఆలయం నుంచి షంగుముగమ్ బీచ్ వరకు ఆరు కిలోమీటర్ల దూరం సాగుతుంది. అలాగే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో అల్పఱి పండుగ వేడుకల సందర్భంగా కూడా రన్‌వేని మూసివేస్తారు. ఎందుకంటే విమానాశ్రయం రన్‌వే ఈ దారిలోనే ఉంది. విమానాశ్రయాన్ని నిర్మించేటప్పుడే (1932 ) ప్రభుత్వం విధించిన నియమం ఇది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు ఇక్కడ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకోవు. పండుగకు రెండు నెలల ముందే ఆలయ ట్రస్ట్ బోర్డు వేడుకల షెడ్యూల్‌ను ఎయిర్పోర్ట్ అథారిటీకి తెలియచేస్తుంది. ఆ మేరకు ఏ తేదీన ఏ సమయంలో ఎయిర్΄ోర్ట్ రన్‌వేను మూసివేయనున్నారనే సమాచారం అక్కడ రాకపోకలు సాగించే విమానాల సంస్థలకు అందుతుంది. ఇది ప్రపంచవింత కాదు కానీ విచిత్రం. -వాకా మంజులా రెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘ఇంగ్లీష్ పుస్తకాలకు హిందీ పేర్లేంటి?’: కేరళ మంత్రి ఫైర్
తిరువనంతపురం: దక్షిణాదికి చెందిన తమిళనాడులో హిందీ వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కేరళలోనూ ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. అయితే దీనిని భాషా వివక్ష చర్యగా కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి(Kerala Education Minister V Sivankutty) అభివర్ణించారు. ఇప్పడు అతని మాటలకు అన్నివైపుల నుంచి మద్దతు లభిస్తోంది.వివరాల్లోకి వెళితే కేరళ విద్యా మంత్రి వి. శివన్కుట్టి.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కు చెందిన ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలకు హిందీ పేర్లు(Hindi names) పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇది సాధారణ తర్కానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ చర్యను భాషా వివక్షగా శివన్కుట్టి అభివర్ణించారు. ఆంగ్లమాధ్యమ పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టడమనేది దేశంలోని సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధమని శివన్కుట్టి పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే విద్యార్థులు సహజంగానే ఆంగ్ల పదజాలానికి అలవాటుపడి ఉంటారని, అయితే పుస్తకాలపై హిందీ పేర్లను ప్రవేశపెట్టడం వలన వారిపై అనవసరమైన ఒత్తిడి ఏర్పడుతుందని అన్నారు.ఎన్సీఈఆర్టీ(NCERT) నిర్ణయం విద్యార్థులలో గందరగోళానికి దారితీస్తుందని, వారి అభ్యాస ప్రక్రియపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం విద్యాపరమైన సమస్యగా మాత్రమే కాకుండా, దేశంలోని భాషా వైవిధ్యానికి ఏర్పడిన ముప్పుగా చూడాలన్నారు. ఒక భాషకు ఇతర భాషల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను తగ్గిస్తోందని ఆయన ఆరోపించారు. ఇది దేశంలోని సాంస్కృతిక సమతుల్యతను దెబ్బతీస్తుందని శివన్కుట్టి అభిప్రాయపడ్డారు. కేరళ ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదని, ఈ నిర్ణయాన్ని ఎన్సీఈఆర్టీ పునఃపరిశీలించాలని కోరారు. దీనిపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయాలని, భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి కలిసి రావాలని శివన్కుట్టి పిలుపునిచ్చారు. కాగా ఈ వివాదం జాతీయ స్థాయిలో భాషా విధానాలపై చర్చను రేకెత్తించే అవకాశం ఉంది. ప్రత్యేకించి విద్యా రంగంలో ప్రాంతీయ భాషలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంపై ఈ అంశం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.ఇది కూడా చదవండి: ట్రంప్ టార్గెట్: ఇక ఔషధాలు, సెమీకండక్టర్ల వంతు -
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. థియేటర్లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్!
సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు హడావుడి చేస్తుంటారు. ఇక అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా అంతా ఇంతా కాదు. కటౌట్స్, డ్యాన్స్‌లు, డైలాగ్స్‌తో ఊగిపోతుంటారు. ముఖ్యంగా థియేటర్ల వద్ద అభిమాన సంఘాలు రచ్చ రచ్చ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇవీ కాస్తా శృతి మించి గొడవలు కూడా జరుగుతుంటాయి.అయితే తాజాగా కేరళలోని ఓ థియేటర్లో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇటీవల కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన కొందరు ఫ్యాన్స్.. విజయ్, విజయ్ అంటూ కేకలు వేశారు. దీంతో అక్కడే అజిత్ అభిమానులు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌లోని ఓ థియేటర్లో జరిగినట్లు సమాచారం.కాగా.. అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. అర్జున్ దాస్ విలన్‌గా మెప్పించారు. సిమ్రాన్ ముఖ్య అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. கேரளாவில் தியேட்டர் ஒன்றில் Good Bad Ugly படம் ஓடிக்கொண்டிருக்கும்போது TVK, Tvk இன்று கோஷமிட்ட விஜய் ரசிகர்கள், விஜய் ரசிகர்களை வெளுத்து வாங்கிய அஜித் ரசிகர்கள் #GoodBadUgly #Ajithkumar #TvkVijay #Kerala pic.twitter.com/BjLMRZWOgG— VSV Cinemas (@vsvcinecreation) April 12, 2025 -
Vishu 2025 విషు అంటే ఏంటి? విషుకణి గురించి తెలుసా?
మలయాళీలు సంవత్సరాదిని విషుగా వ్యవహరిస్తారు. కేరళ, కర్ణాటకలోని తుళునాడు ప్రాంతం, పుదుచ్చేరిలోని మాహే జిల్లా, తమిళనాడులోని అనేక జిల్లాల్లో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీ లు జరుపుకునే ఉగాది పండుగ విషు. విషును మలయాళ నెల మేడం మొదటి రోజున జరుపుకుంటారు, ఇది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్లో ఏప్రిల్ 14 లేదా 15న వస్తుంది. అధికారిక మలయాళ క్యాలెండర్ (కొల్లం ఎరా) చింగం నెలతో ప్రారంభమైనప్పటికీ, ఇది కేరళలో సాంప్రదాయ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది.సూర్యుడు మేడం రాశి (మేష రాశి)లోకి మారడాన్ని విషు సూచిస్తుంది. సంస్కృతంలో విషు అంటే సమానం, అంటే పగలు మరియు రాత్రి సమాన సంఖ్యలో ఉండే రోజు లేదా విషువత్తు అని అర్థం. ఇది విష్ణువుకు అంకితమైన కాలమని, భావిస్తారు, అందుకే విష్ణువు ,శ్రీకృష్ణుడిని పూజిస్తారు.ఈ పండుగకు విష్ణు దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తులకు 'విషు కంజి' లేదా గంజిని ప్రసాదంగా అందిస్తారు. ఇందులో పాపడ్, ఊరగాయ, యాలుక, పచ్చి అరటి,బూడిద గుమ్మడికాయతో చేసిన 'అస్త్రం' అనేది ఉంటుంది. ఇంకా విషు ప్రసాదాల్లో 'కైనీట్టం' ముఖ్యం.విషు అంటే పునరుద్ధరణ, ఆశకు చిహ్నం కూడా. పండుగ ముందురోజు రాత్రి ఇంట్లోని మహిళల్లో పెద్దవయస్కురాలు పచ్చి బియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు వన్నెలో ఉండే దోసకాయలు, అరటిపళ్లు, తమలపాకులు, అద్దం వీటన్నిటినీ ‘విషుకణి’ అనే ప్రత్యేక పాత్రలో ఉంచి దైవపూజ నిర్వహిస్తుంది. మర్నాడు ఆమె ముందుగాలేచి వయసుల వారీగా ఇంట్లో అందరినీ నిద్రలేపి, వారి కళ్లు మూసి విష్ణువు ఫోటోలు పువ్వులు, పండ్లు , కూరగాయలు, బట్టలు, బంగారు నాణేలు, దీపంతో నిండిన పాత్ర దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు కళ్లు తెరవమంటుంది. ఉదయాన్నే లేవగానే మంగళకరమైన విషుకణిని చూస్తే అంతా శుభమే జరుగుతుందని వారి నమ్మకం. ఈ విష్ణుకణిని శ్రేయస్సు , అదృష్టానికి ప్రతీకగా విశ్వసిస్తారు.సాద్య ప్రత్యేకతే వేరేవిషు కైనెట్టం : పెద్దలు చిన్న కుటుంబ సభ్యులకు సౌభాగ్యం, సౌభాగ్యం కోసం ఆశీర్వచనాలుగా డబ్బు ఇస్తారు.విషు సాద్య : సాద్య అంటే అవియల్, తోరన్, రసం, పాయసం వంటి 20–30 వంటకాలను వడ్డించే గొప్ప శాఖాహార విందు. అరటి ఆకులపై వీటిని వడ్డించే శాఖాహార విందే ఈ పండుగ ప్రత్యేకత. ఇందులో మాంబళ పులిసేరి (మామిడి కూర) వంటి వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి.బాణాసంచా: బాణసంచా కాల్చడం ఒక ప్రసిద్ధ సంప్రదాయం, ఇది వేడుకలకు ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని జోడిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉట్టికొట్టే సంప్రదాయం కూడా ఉంది. సంప్రదాయ వస్త్రధారణ: ప్రజలు కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. మళయాళీల చీరకట్టు, పువ్వులకు వారిచ్చే ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంటుంది. ప్రేమానుబంధం: తెలుగువారు ఉగాదిని ఎలా జరుపుకుంటారో అలాగే మళయాళీలు విషును బంధుమిత్ర సపరివార సమేతంగా జరుపుకుంటారు.చిన్నవారికి కానుకలిచ్చి సంబరపడతారు.సాంస్కృతిక వైవిధ్యం: పంజాబ్ లో బైసాఖి, తమిళనాడులో పుత్తాండు వంటి పండుగలను ఒకే సమయంలో జరుపుకుంటారు. -
మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. ఇటువంటి విషాద ఘటనలు దేశంలో గతంలోనూ చోటుచేసుకున్నాయి. బాణసంచా తయారీలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగానే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో భారత్‌లో చోటుచేసుకున్న 10 భారీ అగ్ని ప్రమాదాలివే..1. దబ్వాలి, హర్యానా 1995, డిసెంబర్ 24న హర్యానాలోని దబ్వాలిలో డీఏవీ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెదురు బొంగుల వేదికపై అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 400 మంది మృతిచెందారు. 160 మంది గాయపడ్డారు.2. బరిపద, ఒడిశా 1997, ఫిబ్రవరి 23న ఒడిశాలోని బరిపదలో ఒక మతపరమైన సమావేశంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 176 మంది మరణించారు. ఇది ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.3. ఉపహార్, ఢిల్లీ 1997 జూన్ 13న ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్లో ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 60 మంది మరణించారు. 103 మంది గాయపడ్డారు. థియేటర్లో సరైన ఎగ్జిట్ ద్వారాలు లేకపోవడం, భద్రతా నిబంధనలను పాటించకపోవడం ప్రమాద తీవ్రతను మరింతగా పెంచాయి.4. కుంభకోణం, తమిళనాడు 2004,జూలై 16న తమిళనాడులోని కుంభకోణంలో ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల అగ్ని అంతటా వేగంగా వ్యాపించింది. ఈ ఘటనలో 94 మంది పాఠశాల విద్యార్థులు మృతిచెందారు.5. శ్రీరంగం, తమిళనాడు 2004, జనవరి 23న తమిళనాడులోని శ్రీరంగంలో గల పద్మప్రియ మ్యారేజ్ హాల్లో వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వీడియో కెమెరాకు సంబంధించిన ఎలక్ట్రిక్ వైర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 57 మంది అతిథులతో పాటు వరుడు కూడా మృతి చెందాడు..6. మీరట్, ఉత్తరప్రదేశ్ 2006, ఏప్రిల్ 10న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నిర్వహించిన ‘బ్రాండ్ ఇండియా’ కన్స్యూమర్ గూడ్స్ ఫెయిర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 65 మంది మృతిచెందారు. 150 మందికి పైగా జనం గాయపడ్డారు.7. జైపూర్, రాజస్థాన్ 2009 అక్టోబర్ 29న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆయిల్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు ట్యాంకుల మధ్య ఇంధన బదిలీ సమయంలో సుమారు 1,000 టన్నుల పెట్రోల్ లీక్ అయి, ఆవిరి మేఘం ఏర్పడి పేలుడుకు దారితీసింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారు. ఈ ఘటన తరువాత ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.8. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ 2010, మార్చి 21న కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో ఉన్న చారిత్రాత్మక స్టీఫెన్ కోర్ట్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 43 మంది మృతిచెందారు. భవనంలో అగ్ని రక్షణ వ్యవస్థలు లేకపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడింది.9. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ 2011 డిసెంబర్ 9న కోల్‌కతాలోని ధాకూరియాలోని ఎఎంఆర్ఐ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. బేస్మెంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మండే పదార్థాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో ఊపిరాడక 105 మంది మృతిచెందారు.10. పరవూర్ , కేరళ 2016, ఏప్రిల్ 10న కేరళలోని కొల్లం జిల్లాలోగల పరవూర్ పుట్టింగల్ దేవీ ఆలయంలో మీన-భరణి ఉత్సవం ముగింపు సందర్భంగా బాణసంచా పేలుడు కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 114 మంది మృతిచెందారు. దాదాపు 400 మంది గాయపడ్డారు. ఇది కేరళలో జరిగిన అత్యంత ఘోరమైన బాణసంచా పేలుడు ప్రమాదంగా నిలిచింది.ఇది కూడా చదవండి: ‘నాడు 74.. నేడు 150’.. హిసార్- అయోధ్య విమాన ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ -
రూ.4 కోట్ల కారు.. ₹46 లక్షల నెంబర్ ప్లేట్
భారతదేశంలో ఖరీదైన లంబోర్ఘిని కార్లను ఉపయోగించే వారి సంఖ్య నానాటికి ఎక్కువవుతోంది. ఇటీవల కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త సరికొత్త ఉరుస్ పెర్ఫార్మాంటే కొనుగోలు చేశారు. కాగా ఈ కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 46 లక్షలు ఖర్చు చేశారు.లంబోర్గిని ఉరుస్ కొనుగోలు చేసిన వేణు గోపాలకృష్ణన్.. మోటారు వాహనాల శాఖ (MVD) నిర్వహించిన ఆన్లైన్ వేలంలో KL07 DG 0007 అనే ఫ్యాన్సీ నెంబర్ కోసం 45.99 లక్షల రూపాయలు వెచ్చించారు. కేరళలో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నోటిఫైడ్ ఫ్యాన్సీ వెహికల్ నెంబర్‌గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది.వేణు గోపాలకృష్ణన్ కొనుగోలు చేసిన లంబోర్గిని ఉరుస్ ధర రూ. 4 కోట్లు. దీనిని ఆయన బెంగళూరులోని లంబోర్గిని డీలర్షిప్ నుంచి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: Delhi EV Policy 2.0: పెట్రోల్ బైకులు, సీఎన్జీ ఆటోలు బ్యాన్!ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ లంబోర్ఘిని భారతదేశంలోని పరిమిత నగరాల్లో మాత్రమే డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. అతను బహుశా SUVని బుక్ చేసుకుని, ముందుగానే అన్ని కస్టమైజేషన్లను చేసి ఉండవచ్చు. ఈ వీడియోలో యజమాని, అతని కుటుంబం డెలివరీ తీసుకోవడానికి డీలర్‌షిప్‌ను సందర్శించారు.లంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మాంటే 4.0 లీటర్, ట్విన్ టర్బో వీ8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 666 పీఎస్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు.. మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని కొనుగోలు చేస్తుంటారు. View this post on Instagram A post shared by Flywheel Official (@flywheel_official) -
చలనమే విజయం
ఆదివాసీ మహిళలకు ఆధార్ కార్డ్ ఉంటుందో లేదో. మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా? వారు ఒక టూ వీలర్ కలిగి డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే కొండ మిట్టల దారుల్లో మైళ్ల కొద్దీ నడక నుంచి విముక్తి అవుతారు. ఉపాధికి మార్గాలు వెతుకుతారు. సమయం సద్వినియోగం చేసుకుంటారు. కాని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వారికి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు సమకూర్చే ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయోగానీ కేరళలో జరుగుతున్నాయి. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన్యంప్రాంతాలలో కూడా చేయగలరేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. సరిగా చెప్పాలంటే మంచి పని ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. గిరిజన గూడేలు అడవుల్లో, కొండల్లో ఉంటాయి. వారు బాహ్య ప్రపంచంతో తెగిపోయి ఉన్నట్టుగా భావిస్తారు. దానికి కారణం ఆ గూడేలకు దారులు ఉండవు. ఉన్నా సరిగా ఉండవు. నాలుగు చక్రాల వాహనాలు తిరిగేలా కొన్ని దారులు మాత్రమే ఉంటాయి. అందుకే వీరు ఎక్కువగా కాలి నడక మీద ఆధార పడతారు. రోజులో ఎక్కువ సమయాన్ని వీరు నడకకోసమే వెచ్చించాల్సి ఉంటుంది. హైవే మీద కూడా వీరు అలవాటు కొద్దీ నడిచే వెళుతుంటారు.. లేదా డబ్బు లేక కూడా. అలా నడుస్తున్నవారిలో మహిళలను చూసి వీరి ట్రాఫిక్ నియమాలను తెలుపుదాం అనుకున్నారు ‘దేవికులం’ అనే టౌన్‌కు చెందిన సబ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు అధికారులు. ఈ ఊరు కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. దేవికులం చుట్టుపక్కల దాదాపు 25 గిరిజన గూడేలు ఉన్నాయి. ఈ గూడేలలోని మహిళలకు టూ వీలర్స్ లేవు. ఒకవేళ కొనగలిగినా వీరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. అందుకే అధికారులు కేవలం రోడ్ సేఫ్టీ గురించి చెప్పాలనుకున్నారు.టెస్ట్ పాసైన మహిళగత సంవత్సరం అధికారులు గిరిజన మహిళలను పిలిచి రోడ్డు జాగ్రత్తలు వివరిస్తున్నప్పుడు సుగంతి అనే గిరిజన మహిళ ‘సార్ నేను డ్రైవింగ్ నేర్చుకోగలనా’ అని అడిగింది. అధికారులు వెంటనే సమాధానం చెప్పలేక పోయారు. ఎందుకంటే కేరళలో డ్రైవింగ్ లైసెన్సు మన రాష్ట్రాల్లో కొన్నిచోట్ల జరిగినట్టుగా పరీక్షలు పాస్ కాకుండా పొందలేరు. పరీక్ష రాయాల్సిందే. గిరిజన మహిళ రాయగలదా అనుకున్నారు. ‘మా ఆశ్చర్యం కొద్ది ఆమె డ్రైవింగ్ నేర్చుకోవడమే కాదు పరీక్ష పాసై లైసెన్సు పొందింది’ అన్నారు ఆర్టిఏ అధికారులు. అప్పుడే వారికి ఆలోచన వచ్చింది... గిరిజన స్త్రీలకు డ్రైవింగ్ నేర్పాలని.మా జీవితాలు మారాయిడ్రైవింగ్ లైసెన్స్ పొంది కొత్తదో సెకండ్ హ్యాండ్‌తో ఒక టూ వీలర్‌ను ఏర్పాటు చేసుకున్నాక ఇక్కడ చాలామంది గిరిజన స్త్రీల జీవనం మారింది. ‘మేం పని కోసం వెళ్లగలుగుతున్నాం. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతున్నాం’ అని వారు అంటున్నారు. టూ వీలర్ నడపడానికి సౌకర్యవంతమైన డ్రస్సులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ‘గిరిజన నియమాలు అందుకు ఒప్పుకోవు. కాని గూడెం పెద్దలు పరిస్థితి అర్థం చేసుకుని అనుమతి ఇస్తున్నారు’ అంటున్నారు మహిళలు. చీర కాకుండా పంజాబీ డ్రస్సుల వంటివి జీవితంలో మొదటిసారి టూవీలర్లు నడపడానికే వీరు ధరిస్తున్నారు. ‘మాలో కొందరికి టూవీలర్ నడపడం వచ్చినా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలో తెలియక భయం భయంగా బండ్లు నడుపుతూ బతికేవాళ్లం. ఇప్పుడు లైసెన్సులు ఇవ్వడం వల్ల మా భయం పోయింది. మేము ధైర్యంగా టౌన్లకు వెళ్లి సరుకులు అమ్ముతాం’ అంటున్నారు. ‘స్వప్నం’ ఉన్న గిరిజన మహిళలు ఎందరో. వారికీ చలనంప్రాప్తమవ్వాలి. ‘కనావు’...అంటే ‘స్వప్నం’దేవకులం ఆర్.టి.ఓ. అధికారులు గిరిజన మహిళల కోసం ‘కనావు’ అనే కార్యక్రమం రూపొందించారు. కనావు అంటే స్వప్నం. డ్రైవింగ్ నేర్చుకొని, స్వీయ చలనం కలిగి తమ కలలు సాధించుకోవాలనే స్ఫూర్తిని ఇస్తూ ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో డ్రైవింగ్ అవసరాన్ని చెప్పే కౌన్సెలింగ్, గూడెం పెద్దలు ఇందుకు అభ్యంతరం పెట్టకుండా వారి అనుమతి తీసుకొవడం, ఉచిత మెడికల్ ఎగ్జామినేషన్, టూ వీలర్ కొనుక్కునేందుకు ఫండ్ పొందే మార్గాలు... ఇవన్నీ ఉంటాయి. మహిళలు నడపడానికి అనువైన తేలికపాటి టూవీలర్ డ్రైవింగ్‌ను దేవకులం చుట్టుపక్కల ఉన్న గూడేల్లోని మహిళలకు నేర్పించసాగారు. ఇప్పటికి చాలామంది స్త్రీలు ఈ లైసెన్సులు పొందారు. కొందరు వాహనాలు సమకూర్చుకున్నారు. సొంత వాహనం మీద సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం అంటే ఏమిటో వారి అనుభవంలోకి వచ్చాక పెదాల మీద వచ్చిన చిరునవ్వు చూడదగ్గది. -
పెట్రోల్ బంకుల్లో ఫ్రీ సేవలు.. నో అన్నారో ఈమెలా చేయండి
డబ్బులు పెట్టి సేవలు పొందే వినియోగదారులకు తమ హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండాలి. మొహమాటానికో.. అనవసరమైన గొడవలు ఎందుకనో చాలామంది చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి గప్‌చుప్‌గా ఉంటారు. కానీ, ఇక్కడో టీచరమ్మ అలా మౌనంగా ఉండిపోలేదు. తన హక్కుల గురించి తెలుసు కాబట్టి గట్టిగా నిలదీసింది. తనకు ఎదురైన ఇబ్బందిపై ఏకంగా పోరాటం చేసి ఓ పెట్రోల్ బంక్ ఓనర్‌కు గుణపాఠం చెప్పింది. పతనంతిట్ట(Pathanamthitta) జిల్లా వినియోగదారుల ఫోరం తాజాగా ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ఓ మహిళను టాయిలెట్ సౌకర్యం వినియోగించుకోకుండా అడ్డుకున్న పెట్రోల్ బంక్‌కు రూ.1,50,000 జరిమానా విధించింది. పైగా ఆమె కోర్టు ఖర్చులకు మరో రూ.15 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రమాణాలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. వినియోగదారులకు తాగు నీటిని, స్వచ్ఛమైన బాత్రూంల సేవలను పెట్రోల్ బంకులు అందించాల్సి ఉంది. అయితే ఈ కేసులో ఆ ఉల్లంఘన జరిగినందుకే జరిమానా విధిస్తున్నట్లు వినియోగదారుల ఫోరం బెంచ్ స్పష్టం చేసిందని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ఇబ్బందిపడ్డ జయకుమారిమాతృభూమి న్యూస్ కథనం ప్రకారం.. పతనంతిట్టకు చెందిన జయకుమారి(Jayakumari) ఓ టీచర్. 2024 మే 8న రాత్రి 11 గంటల సమయంలో ఆమె తన కారులో వెళ్తున్నారు. కోజికోడ్ జిల్లా పయ్యోలిలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకున్నారు. అయితే అత్యవసరంగా ఆమె అక్కడి టాయిలెట్ సౌకర్యం వినియోగించుకోవాలనుకున్నారు. కానీ, దానికి తాళం వేసి ఉంది. దానిని తెరవాలని ఆమె సిబ్బందిని కోరగా.. అది రిపేర్‌లో ఉందని, బంక్ ఓనర్ తాళం వేసుకుని వెళ్లిపోయారని సిబ్బంది నిమిషానికో మాట చెప్పారు. దీంతో ఆ బాత్రూంను ఎలాగైనా తెరిపించాలని ఆమె ప్రయత్నించగా.. వాళ్లు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమె పయ్యోలి పోలీసులను ఆశ్రయించి మరీ బలవంతంగా ఆ బాత్రూంను తెరిపించి వినియోగించుకున్నారు. అయితే తనను చాలా సేపు ఇబ్బంది పెట్టి మానసిక క్షోభకు గురిచేసిన ఆ బంక్ వాళ్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆమె అనుకుంది. ఆలస్యం చేయకుండా పతనంతిట్ట జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. ఈ క్రమంలో పది నెలల విచారణ తర్వాత ఆమెకు పరిహారం చెల్లించాలని బంక్ ఓనర్‌ను ఫోరం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఫిల్లింగ్ స్టేషన్లలో మంచి నీరు, బాత్రూం సౌకర్యాలతో పాటు టైర్లలో ఉచితంగా గాలి నింపడం, ఫస్ట్ ఎయిడ్ కిట్లను కచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలేవీ పాటించకపోతే.. వినియోగదారుడు జయకుమారి టీచర్‌లానే కన్జూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించవచ్చు. -
మూఢాచారాలతో ప్రసవానికి యత్నం.. గర్భిణి మృతి
మలప్పురం: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నాటికీ మూఢాచారాలు కొనసాగుతున్నాయి. ఒక్కోసారి ఇవి వికటించి, మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. కేరళ(Kerala)లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్లికుండా ఇంటిలోనే పురుడు పోసుకునేందుకు ప్రయత్నించిన 34 ఏళ్ల మహిళ ప్రసవ సమయంలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.కేరళలోని మలప్పురం జిల్లా(Malappuram district)లో ఈస్ట్ కోడూర్ ప్రాంతానికి చెందిన అస్మా(34)కు ఇంటిలోనే ప్రసవం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మృతి చెందింది. ఆమె తన ఐదవ సంతానానికి జన్మనిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అస్మా ఎర్నాకుళం జిల్లాలోని పెరుంబావూర్‌కు చెందినది. అయితే ఆమె భర్త సిరాజుద్దీన్‌తో కలిసి మలప్పురంలోని ఒక అద్దె ఇంట్లో ఉంటోంది. ప్రసవ సమయంలో ఆమెకు వైద్య సహాయం అందకపోవడంతోనే ఈ విషాదం చోటుచేసుకున్నదని తెలుస్తోంది. అస్మా భర్త సిరాజుద్దీన్ మత సాంప్రదాయాలను పాటిస్తుంటాడు. ఈ నేపధ్యంలోనే మూఢాచారాలను ఆశ్రయించే ఆయన భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఘటన తర్వాత సిరాజుద్దీన్ తన భార్య మృతదేహాన్ని పెరుంబావూర్‌కు తీసుకెళ్లి, అక్కడ సమాధి చేయడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెరుంబావూర్ పోలీసులు(Perumbavoor Police) వెంటనే రంగంలోకి దిగి, ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తాలూకా ఆస్పత్రికి తరలించారు. కాగా అస్మాకు జన్మించిన నవజాత శిశువు (బాలుడు) ప్రస్తుతం పెరుంబావూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అస్మా మరణంచడానికి గల కారణాలను, ఆమెకు సరైన వైద్య సదుపాయాలు ఎందుకు అందలేదనే అంశంపై విచారిస్తున్నారు. ఈ దుర్ఘటన కేరళలో ఇంటి వద్ద జరిగే ప్రసవాల సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో సరైన వైద్యవ్యవస్థ ఉన్నప్పటికీ, మలప్పురం జిల్లాలో ఇంటి వద్ద ప్రసవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో (2019-2024) కేరళలో 2,931 ఇంటి ప్రసవాలు నమోదయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. వీటిలో మలప్పురం జిల్లాలోనే 1,244 కేసులు ఉన్నాయి. 18 నవజాత శిశువుల మరణాలు కూడా జిల్లాలో సంభవించాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా -
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబి ఎన్నిక
మదురై: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన సీనియర్ నేత మరియమ్ అలెగ్జాండర్(ఎంఏ) బేబి ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో ఆదివారం జరిగిన సీపీఎం 24వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఈ ఎన్నిక జరిగింది. కొందరు నేతలు ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ ధవాలేను ఈ పదవికి బలపరిచారు. మెజారిటీ సభ్యుల మద్దతుతో బేబి ఎన్నికైనట్లు ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన 18 మందితో కూడిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి పొలిట్ బ్యూరో ఎంఏ బేబిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. అదేవిధంగా, 85 మందితో కూడిన సెంట్రల్ కమిటీలోకి 20 శాతం మంది మహిళలను తీసుకున్నట్లు ఆ పార్టీ ‘ఎక్స్’లో తెలిపింది. 2023 సెప్టెంబర్‌లో అనారోగ్య కారణాలతో సీతారాం ఏచూరి కన్నుమూయడంతో ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీ అయింది. అప్పటి నుంచి ప్రకాశ్ కారత్ తాత్కాలిక సమన్వయకర్తగా ఆ బాధ్య తలను నిర్వర్తిస్తున్నారు. కాగా, పొలిట్ బ్యూరో నుంచి సీనియర్ నేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్ వైదొలిగారు. వీరిద్దరితోపాటు మణిక్ సర్కార్‌ను పార్టీ కేంద్ర కమిటీకి ప్రత్యేక ఆహ్వాని తులుగా ప్రకటించినట్లు సమాచారం.విద్యార్థి దశ నుంచే..కేరళలోని ప్రక్కులంలో 1954లో జన్మించిన ఎంఏ బేబి విద్యార్థి దశలోనే సీపీఎం పట్ల ఆ కర్షితుడయ్యారు. కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యుడయ్యారు. కొల్లమ్‌లోని ఎస్ఎన్ కాలేజీలో బీఏలో చేరినా చదువు కొనసాగించలేకపో యారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్‌ఐల్లో పలు పదవులు చేపట్టారు. 1986–98 మధ్య కాలంలో రాజ్యసభ ఎంపీగా, 2006–16 మధ్య ఎమ్మెల్యేగా కొనసా గారు. కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. -
మీరు ఉద్యోగం సరిగా చేయడం లేదు.. ‘కుక్కలా నడవండి’ అంటూ..
తిరువనంతపురం: కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారికి అప్పగించిన టార్గెట్స్ రీచ్ కాకపోవడంతో వారికి వేధింపులకు గురిచేశారు. శునకాల మాదిరిగా మోకాళ్లపై నడవాలని, నేలపై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. కేరళలో కలూరులోని ఓ ప్రైవేటు మార్కెటింగ్ సంస్థకు రాష్ట్రంలో పలుచోట్ల బ్రాంచ్ ఉన్నాయి. ఈ ఘటన మాత్రం పెరుంబవూర్ బ్రాంచీలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే, సదరు మార్కెటింగ్ కంపెనీల్లో వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, సంస్థలో ఉద్యోగులకు యాజమాన్యం టార్గెట్స్ నిర్ధేశించింది. కచ్చితంగా టార్గెట్స్ రీచ్ కావాలనే నియమం విధించారు. దీంతో, టార్గెట్ పూర్తి చేయని ఉద్యోగులను సదరు సంస్థ వేధింపులకు గురిచేసింది.ఉద్యోగులను శునకాల మాదిరిగా మోకాళ్లపై నడవాలని, నేలపై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా.. అతడిని మరో వ్యక్తి మోకాళ్లపై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ.. నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తిచేయని ఉద్యోగులపై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.100% literate State Kerala: Shocking video claiming to be of Employees of a company getting punished for missing Sales Targets goes viral....allegedly they were forced to Crawl, Lick spit & Bark like dogs. pic.twitter.com/0nnHje5oNO— Megh Updates 🚨™ (@MeghUpdates) April 5, 2025ఇక, దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ అమానవీయ ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని కార్మికశాఖ మంత్రి వీ శివన్కుట్టి వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే, యజమాని మాత్రం ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలిసింది. దీనిపై ఉద్యోగులు ఇప్పటివరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం. -
కేరళ సీఎం కుమార్తెకు షాకిచ్చిన కేంద్రం.. అదే జరిగితే పదేళ్ల జైలుశిక్ష!
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్‌కు ఉహించని షాక్ తగిలింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.వివరాల ప్రకారం.. సీఎం విజయన్ కుమార్తె వీణా విజయన్ చిక్కుల్లో పడ్డారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి అక్రమ రీతిలో డబ్బులు బదిలీ అయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో న్యాయ విచారణ చేపట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా కేసు విచారణకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందే.. కొచ్చిలోని ఆర్థిక నేరాలను పరిశీలించే ప్రత్యేక కోర్టులో ఈ కేసు ఫైల్ అయ్యింది. ఈ సందర్బంగా 160 పేజీల ఛార్జ్‌షీట్ రూపొందించారు.SFIO files chargesheet against Veena Vijayan, daughter of Kerala CM, and others in a Rs 2.7 crore CMRL payoff case. Charges include financial fraud under Section 447 of the Companies Act. pic.twitter.com/ymiOSZFFox— HKupdate (@HKupdate) April 3, 2025రుజువైతే పదేళ్ల జైలుశిక్ష.. సీఎంఆర్ఎల్, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ మద్య అక్రమ రీతిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానించారు. 2017 నుంచి 2020 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన కంపెనీ సుమారు 1.72 కోట్లు బదిలీ అయ్యాయి. దీంతో ఈకేసులో విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎఫ్ఐఓ తన ఛార్జ్‌షీట్‌లో వీణా విజయన్‌తో పాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిథర్ కార్తా, మరో 25 మంది నిందితుల పేర్లను చేర్చింది. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కంపెనీస్ యాక్టు ప్రకారం ఆ శిక్ష ఉంటుంది. దీంతో పాటు పెనాల్టీ విధిస్తారు.ప్రతిపక్షాలు ఫైర్..మరోవైపు.. ఈ పరిణామాలపై ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా సతీశన్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి కుమార్తె వీణా విజయన్ను కేసులో నిందితురాలిగా చేర్చడం చాలా తీవ్రమైన విషయం. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఛార్జ్ షీట్ ఆమెపై ఆరోపణను బలపరుస్తోంది. ముఖ్యమంత్రి కుమార్తె పదేళ్ల వరకు జైలు శిక్ష విధించదగిన నేరం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. విజయన్ ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడం సముచితం కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తన కుమార్తె విచారణను ఎదుర్కొనడాన్ని ఆయన ఎలా సమర్థించగలరు?’ అంటూ ప్రశ్నించారు. -
నలుపు అంటే శక్తి
నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్‌పై ఫేస్బుక్లో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్‌గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్‌గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. వారి కామెంట్స్‌లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్బుక్ పోస్ట్‌లో పెట్టారు శారద. ఆ పోస్ట్‌పై మొదట్లో కొందరి కామెంట్స్ చూసిన తరువాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ‘మీ పోస్ట్ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్ చేశారు. రీ–షేర్ చేసిన తరువాత ఆమె పోస్ట్‌కు మద్దతుగా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ -
'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణ వివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై..
జాతి వివక్షకు మించిన అతిపెద్ద రోగం వర్ణ వివక్ష. మనుషులంతా ఒకేలా ఉంటే ఏముంది ఘనత అని పెద్దలు అంటుంటారు. కానీ కొందరికి అవేం పట్టవు. ఒక మనిషి తన శరీర రంగుని బట్టి.. చిన్నబుచ్చేలా మాట్లేడుస్తుంటారు చాలామంది. అవతలి వ్యక్తి ఎంత పెద్ద విద్యావేత్త లేదా అధికారి అన్న స్ప్రుహ ఉండదు. కేవలం శరీర వర్ణం నల్లగా ఉంటేనే..అతడు/ఆమెని ఏమైనా అనే అవకాశం వచ్చేస్తుందా..? లేక నలుపు రంగు అంటేనే లోకువ అనేది ఎవ్వరికీ అర్థంకానీ బాధని రగిల్చే సున్నితమైన అంశం. ఆ వ్యాఖ్యలన్నింటికి కేరళ సీనియర్ బ్యూరోక్రాట్ చాలా శక్తిమంతమైన రిప్లై ఇచ్చారు. ఇప్పుడది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారడమే గాక శెభాష్ మేడమ్ బాగా చెప్పారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె చెప్పిన తీరు చూస్తే నలుపులో ఇంత అందం దాగుందా అనిపిస్తుంది. మరి అదేంటో చూసేద్దామా..!కేరళ ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ తన వంటి రంగు(నల్లటి రంగును )పై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు చాలా స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చారు. చెప్పాలంటే ఆ వ్యాఖ్యాలను తిప్పి కొట్టేలా కంటే ఆలోచింప చేసేలా నల్లనిదనంలోని అందాన్ని వెలికితెచ్చారామె. మరోమారు నల్లటి రంగు అని అవహేళన చేసే సాహసమే చేయనీకుండా చాలా చక్కగా పోస్ట్‌లో రిప్లై ఇచ్చారు. ఆమెపై చేసిన వ్యాఖ్య ఏంటి..?, ఏం చెప్పారామె అంటే..1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శారద మురళీధరన్ ఆమె ప్రస్తుతం కేరళలో చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరూ ఆమె పనితీరుని భర్త (మాజీ కేరళ ప్రధాన కార్యదర్శి వి వేణు) రంగుతో పోలుస్తూ..ఆమె భర్త ఒంటి రంగు తెలుపులా నల్లగా ఉందని వెటకారంగా పోస్టులు పెట్టారు. ఆమె వాటిని చూసి వెంటనే ఆ పోస్టులని డిలీట్ చేసేశారు. అయితే కొందరూ శ్రేయోభిలాషుల విజ్ఞప్తి మేరకు దీనిపై మాట్లాడుతున్నా అంటూ ఆ పోస్టులను రీ పోస్ట్ చేస్తూ.. రాసుకొచ్చారు. శారద మురళీధరన్ పోస్ట్‌లో.." నా నల్లదనాన్ని సొంత చేసుకునేందుకు మాట్లాడుతున్నా.. చీకటి హదయం నలుపు రంగు. సాయంత్రానికి సంకేతం. వర్షం వాగ్దానం(నల్లిని మేఘాలే వర్షం రాక). అదికేవలం రంగు మాత్రమే కాదు. అనారోగ్యానికి, చెడుకి సంకేతంగా కూడా భావిస్తారు. అసలు అది లేకపోతే ఎలా గుర్తించగలరు మంచిని. నలుపు అనగానే చులకన భావం వచ్చేస్తోంది. ఈ నల్లని రంగు విశ్వం సర్వవ్యాప్త సత్యం. అందుండబట్టే అంతరిక్షం, నక్షత్రాలు అన్న వాటి గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది. ఇది అత్యంత శక్తిమంతమైన కలర్. ఏ రంగునైనా తనలో ఇముడ్చుకోగలదు. ఆఫీస్ దుస్తుల నుంచి ఇంటికి వెళ్లాక వేసుకునే క్యాజువల్ వరకు అన్నింట్లో ఈ నలుపు తప్పక ఉంటుంది. ఆఖరికి కంటి పాపకూడా నలుపు ఉంటేనేగా చూసేది. అలాంటి నలుపైపై ఎందుకింత అక్కసు, చులకనభావం అని నిలదీశారు. తాను కూడా ఒకప్పుడూ ఈ నలుపుని తక్కువగానే చూశా అంటూ తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్ల వయసులో అమ్మా నేను తెల్లగా పుడతాను కదా మళ్లీ నీ గర్భంలోకి వెళ్లితే అని అంటుండేదాన్నిఅలా 50 ఏళ్లు నా ఒంటి రంగు మంచిది కాదనే భావనలోనే బతికేశా. కానీ ఆ నలుపులోని అందాన్ని గుర్తించడంలో నా పిల్లలే సాయం చేశారు. వాళ్లు తమ నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నలుపులో ఉన్న అద్భుతాన్ని, అందాన్ని నాకు కళ్లకు కట్టినట్లు చూపించాక గానీ నేను గుర్తించలేదు నలుపు ఇంత అందంగా ఉంటుందని" అని పోస్టులో రాసుకొచ్చారామె.రంగు తక్కువ అనేభావం మాయం..సీనియర్ బ్యూరోక్రాట్ మురళీధరన్ పోస్టులో రాసిన ప్రతి మాట మనస్సుని హత్తుకునేలా ఉంది. అని కేరళ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు సతీశన్ అన్నారు. తన తల్లి కూడా నలుపురంగులోనే ఉందని, ఇది చర్చకు రావాలని కోరుకున్నా అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.కాగా, శారద మురళీధరన్ తన భర్త వి. వేణు పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో గతేడాది ఆగస్టు 31న ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆమె నియామకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే కేరళ చరిత్రలోనే తొలిసారిగా భర్త నుంచి ఆమె ఛీప్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకారించారామె. ఇక ఆమె గతంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ రూరల్ లైవ్లిహుడ్స్ మిషన్‌లో సీఓఓగా, కుటుంబంశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక పాత్రల్లో పనిచేశారు.(చదవండి: ఉషా వాన్స్ నటి దీపికా పదుకునే స్టైల్‌ని రీక్రియేట్ చేశారా..? వివాదాస్పదంగా ఇవాంకా పోస్ట్) -
వండర్స్ ఆఫ్ వయనాడ్: కొండ కోనల్లో పడవ ప్రయాణం..!
పాత రాతియుగాన్ని చదువుకున్నాం... శిలాయుగాన్ని కూడా తెలుసుకున్నాం. ఆ కాలంలో ఏమేమి ఉన్నాయి? బ్రహ్మ కట్టిన తిరునెల్లి ఆలయం ఉంది. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాటిని చూడాలంటే... అరక్కల్... అంబల్వాయల్ మ్యూజియాలకు కళ్లప్పగించాలి. ఎడక్కల్ గుహల్లో ఎనిమిదివేల ఏళ్ల నాటి బొమ్మలను తాకి చూడాలి. మోడరన్ హిస్టరీ చెప్పిన పాఠాలకు ఆనవాళ్లుగా... ఏమేమి ఉన్నాయి? డచ్ కట్టడాలు... పోర్చుగీసు నిర్మాణాలు... బ్రిటిష్ కాలపు టెలిఫోన్లు. వాటిని చూడాలంటే ఏం చేయాలి?... వయనాడుకు ప్రయాణమవ్వాలి. ఎరుపెక్కిన కళ్లతో కప్పడ్ బీచ్‌లో వాస్కోడిగామా స్మారకాన్ని చూడాలి. గాంధీజీ జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించిన కాల్పెట్టలో బస చేయాలి. ఫారెస్ట్‌కు అర్థవంతమైన నిర్వచనం చెప్తున్న కురువద్వీపంలో అడుగుపెట్టాలి. పూకోద్ సరస్సులో కలువల మధ్య పడవ ప్రయాణం చేయాలి. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని గౌరవిస్తూ ముందుకుసాగాలి. ‘వండర్స్ ఆఫ్ వయనాడ్’ ఐఆర్సీటీసీ ప్యాకేజ్ సిద్ధంగా ఉంది.సెలవులు వస్తున్నాయి... కేరళలో పర్యటనకు ప్లాన్ చేసుకోండి.మొదటి రోజు..ఉదయం ఆరుగంటల సమయంలో 12789 నంబరు కాచిగూడ–మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.రెండోరోజుఉదయం ఆరు గంటల సమయంలో రైలు కన్నూరుకు చేరుతుంది. రైలు దిగి రైల్వే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన హోటల్‌కు చేరుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఉపహారం తిన్న తర్వాత సైట్ సీయింగ్‌కి బయలుదేరాలి. ఏంజిలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం చూసుకున్న తర్వాత ప్రయాణం వయనాడు వైపు సాగుతుంది. దారిలో అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ వయనాడు, కాల్పెట్టలోని హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. రాత్రి బస అక్కడే.ఇక్కడికి గాంధీజీ వచ్చాడు!కన్నూర్ కోట (సెయింట్ ఏంజిలో ఫోర్ట్) పోర్చుగీసు, డచ్‌వాళ్ల పాలన సాగించిన ప్రదేశం. అరక్కల్ మ్యూజియం కన్నూరు సిటీకి మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. అరక్కల్ రాజవంశం నివసించిన ప్యాలెస్ అది. వాళ్లు ఉపయోగించిన ఫర్నిచర్ డిజైన్లు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్‌గా సంపన్నవర్గాల ఇళ్లలో కనిపిస్తున్నాయి. బ్రిటిష్పాలన కాలంనాటి టెలిఫోన్ కూడా ఉంది. రాత్రి బస చేస్తున్న కాల్పెట్ట అందమైన హిల్‌స్టేషన్. దట్టమైన అటవీ ప్రదేశం కూడా. కేరళలో భారత జాతీయోద్యమం పురుడుపోసుకున్న ప్రదేశం ఇది. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తినింపడానికి గాంధీజీ 1934లో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. మూడోరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సైట్ సీయింగ్‌కి బయలుదేరాలి. కురువ ద్వీప్, తిరునెల్లి ఆలయం, బాణాసుర సాగర్ డ్యామ్ చూసుకుని హోటల్‌కి చేరాలి. ఆ రాత్రి బస కూడా కాల్పెట్టలోనే.బ్రహ్మ కట్టిన ఆలయంకురువద్వీపంలో విహారం మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుంది. కబిని నది ఉపనదుల ప్రవాహం మధ్యలో ఏర్పడిన వెయ్యి ఎకరాల దీవి ఇది. పచ్చదనాన్ని పుష్పగుచ్ఛంగా ఒకచోట రాశి΄ోసినట్లుంటుంది. ఇక్కడ అరుదైన పక్షులు కనిపిస్తాయి. తిరునెల్లి ఆలయం ఓ విశిష్టత. దీని గురించి చారిత్రక ఆధారాలేవీ దొరకట్లేదు. పౌరాణిక ఆధారాల ప్రకారం వేదవ్యాసుడు రాసిన పురాణాల్లో విష్ణువు కోసం బ్రహ్మ భూమ్మీద నిర్మించిన ఆలయం అని తెలుస్తోంది. లొకేషన్ సెలెక్ట్ చేయడానికి బ్రహ్మదేవుడు తన వాహనం హంస మీద భూమండలం అంతా పర్యటిస్తూ ఈ ప్రదేశాన్ని చూసి ముచ్చటపడ్డాడని, ఇక్కడే ఆలయాన్ని నిర్మించాడని, ఈ కొండకు బ్రహ్మగిరి అనే పేరు రావడానికి కారణం అదేనని చెబుతారు. ఆలయాన్ని నిర్మించే వరకు తనతో తెచ్చిన విగ్రహాన్ని ఉసిరి చెట్టులో దాచడంతో ఈ ఆలయానికి నెల్లి అనే పేరుతో తిరునెల్లి ఆలయం అనే పేరు వచ్చింది. పది–పదకొండు శతాబ్దాల్లో చేరరాజు భాస్కర రవివర్మ పాలించిన నాటికే ఇది గొప్ప యాత్రాస్థలంగా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ప్రాచీన కాలం నాటి గ్రామాల ఆనవాళ్లను కూడా చూడవచ్చు. ఆ తర్వాత చూడాల్సిన బాణాసుర సాగర్ డ్యామ్ రెండువేల అడుగుల పొడవుతో దేశంలోనే అతి పెద్ద ఎర్త్‌డ్యామ్. జల విద్యుత్ తయారీ కేంద్రాన్ని కూడా చూడవచ్చు. నాల్గోరోజుబ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంబలవాయల్ హెరిటేజ్ మ్యూజియం, సూచిపారా జలపాతం, ఎడక్కల్ గుహలు, పూకోద్ సరస్సులో విహారం తర్వాత తిరిగి హోటల్‌కు చేరాలి. ఆ రాత్రి బస కూడా కాల్పెట్టలోనే.రాతియుగాన్ని చూసొద్దామా!ఇది వయనాడ్ హెరిటేజ్ మ్యూజియం, అంబలవాయల్ అనే ప్రదేశంలో ఉండడంతో ఆ పేరు వచ్చింది. ఇందులో రాతియుగం నాటి పదునైన రాతి ఆయుధాలు, 14 నుంచి 16వ శతాబ్దం నాటి శిల్పాలు, మృణ్మయపాత్రలు, టెర్రకోట శిల్పాలు ఉంటాయి. ఇక ఎడక్కల్ గుహలు కాల్పెట్టకు 25 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. వీటి వింత ఏమిటంటే... ఇవి నేలమీద విస్తరించిన గుహలు కావు. ఎవరూ పనిగట్టుకుని తొలిచినవీ కాదు. దాదాపు నాలుగు వేల అడుగుల ఎత్తులో సహజంగా ఏర్పడిన గుహలు. ఈ గుహల్లో కనిపించే బొమ్మలు క్రీస్తు పూర్వం ఆరువేల ఏళ్ల నాటివని అంచనా. ఈ రోజు చివరగా పూకోద్ సరస్సులో పడవ విహారంతో సేదదీరడమే. ఈ సరస్సు దాదాపు ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో కొండల మీద ఏడెనిమిది ఎకరాల్లో విస్తరించి ఉంది. వర్షపునీరు కొండ కోనల నుంచి ఇక్కడికి చేరుతుంది. సరస్సు నిండిన తర్వాత నీరు కిందకు ప్రవహించి పనమారమ్ నదిగా మారుతుంది. ఈ నది కబిని నదిలో కలుస్తుంది. ఈ సరస్సులో కలువలు విరివిగా ఉంటాయి. అందుకే దీనికి పూలతీరం అనే అర్థంలో పూకోద్ అనే పేరు వచ్చింది. ఐదోరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ పూర్తయిన తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ప్రయాణం కోళికోద్ వైపు సాగుతుంది. దారిలో కప్పడ్ బీచ్ విహారం. సాయంత్రం ఎస్ఎమ్ స్ట్రీట్‌లో షాపింగ్ కోసం సమయం ఉంటుంది. షాపింగ్ తర్వాత కోళికోద్ రైల్వే స్టేషన్‌కి వెళ్లి రైలెక్కాలి. 12790 నంబరు మంగళూరు సెంట్రల్ – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11.35 నిమిషాలకు బయలు దేరుతుంది. 24 గంటల తర్వాత ఆరవ రోజు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుతుంది.వాస్కోడిగామా అడుగుపెట్టాడు!కప్పడ్ బీచ్ అంటే ΄ోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మన దేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించి మన నేల మీద పాదం మోపిన ప్రదేశం. ఇది 1498లో జరిగింది. భారతీయుల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించడానికి గాంధీజీ 1934లో కాల్పెట్టలో అడుగుపెట్టడానికి కారణమైన సంఘటన అన్నమాట. కష్టంగా అయినా నిష్టూరంగా అయినా ఈ ప్రదేశాన్ని చూడాల్సిందే, వదిలేయడానికి వీల్లేదు. గుడ్లు పెట్టి పిల్లలను పొదగడానికి ఇక్కడికి వచ్చే తాబేళ్లను చూడడానికైనా కప్పడ్ బీచ్‌ని కవర్ చేయాలి. అలాగే సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా సముద్రతీరాన గడపడానికి ఇది మంచి ప్రదేశం. ఇక చివరగా కోళికోద్ పట్టణంలోని ఎస్ఎమ్ స్ట్రీట్‌లో షాపింగ్ కోసం సమయం ఇస్తారు. వాహనం దిగి మార్కెట్ అంతటా కాలి నడకన తిరగాలి. ఏం కొన్నా కొనక΄ోయినా కోళికోద్ హల్వా తప్పకుండా రుచి చూడాలి. బంధువులు, స్నేహితుల కోసం ఇంటికి తెచ్చుకోవాలి. దీంతో ఈ టూర్ తీపి జ్ఞాపకపు రుచి కలకాలం గుర్తుంటుంది.వండర్స్ ఆఫ్ వయనాడ్ (ఎస్హెచ్ఆర్ 098) ప్యాకేజ్‌లో...ఇవి ఉంటాయిస్టాండర్డ్ ప్యాకేజ్‌లో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణం. కంఫర్ట్ ప్యాకేజ్‌లో థర్డ్ ఏసీలో ప్రయాణం. రైలు దిగిన తరవాత లోకల్ జర్నీ ఏసీ వాహనంలో ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్. టోల్ ఫీజ్, పార్కింగ్ ఫీజులు ప్యాకేజ్‌లోనే. రాత్రి బస చేసిన హోటల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది.ఇవి వర్తించవుమధ్యాహ్నం, రాత్రి భోజనాలు. రైలు ప్రయాణంలో భోజనాలు, సైట్ సీయింగ్ ప్రదేశాల ఎంట్రీ టికెట్ చార్జ్‌లు, బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి రిక్రియేషనల్ టికెట్ ఫీజులు, గైడ్ చార్జ్‌లు, ఇతర సర్వీసులు పర్యాటకులే భరించాలి. కొన్ని ప్రైవేట్ టూర్ ప్యాకేజ్‌లు ట్రీ హౌస్‌లో రాత్రి బస ఏర్పాటు చేస్తున్నాయి.వండర్స్ ఆఫ్ వయనాడ్ టికెట్ ధరలిలాసింగిల్ ఆక్యుపెన్సీలో (ఒక్కొక్కరికి ఒక్కో గది) కంఫర్ట్ ప్యాకేజ్ 37, 640 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్‌కి 34, 840 రూపాయలు.డబుల్ ఆక్యుపెన్సీలో (ఇద్దరికి ఒక గది) ఒక్కొక్కరికి కంఫర్ట్ ప్యాకేజ్ 21,220 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్‌లో 18,430 రూపాయలు.ట్రిపుల్ ఆక్యుపెన్సీలో (ముగ్గురికి ఒక గది) ఒక్కొక్కరికి కంఫర్ట్ ప్యాకేజ్ 17,740 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్‌లో 14,950 రూపాయలు. (చదవండి: ఏకంగా ఆన్లైన్లోనే మట్టిని అమ్మేస్తున్నారు..!) -
కేరళ బీజేపీ చీఫ్‌గా రాజీవ్ చంద్రశేఖర్!
తిరువనంతపురం: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(60) కేరళ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులు కానున్నారు. ఈ పోస్టు కోసం ఆయనొక్కరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం జరిగే పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడనుంది. పార్టీ కేంద్ర పరిశీలకుడిగా సమావేశానికి హాజరుకానున్న ప్రహ్లాద్ జోషి ఈ నియామకాన్ని ధ్రువీకరించనున్నారు. పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్ష పదవి కోసం ఆదివారం రాజధాని తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయంలో రాజీవ్ చంద్ర శేఖర్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. -
వయసు 60..టైలరింగ్‌తో పొట్టపోసుకునే మహిళ ఏకంగా ఎవరెస్టునే..!
ఆమె వయసు 60... ఊరు కేరళ. టైలరింగ్‌తో పొట్ట పోసుకునే సగటు స్త్రీ. కాని ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు ఎలాగైనా చేరాలని పట్టుదల. ట్రైనింగ్ లేదు... బృందాలతో కలవడం లేదు. కేవలం యూట్యూబ్‌ను గురువుగా పెట్టుకుంది. అడుగులో అడుగు వేస్తూ వయసును లెక్కచేయక గమ్యం చేరుకుంది.చిన్న మనుషులూ పెద్ద కలలు కనొచ్చు. వసంతి చెరువీట్టిల్ స్ఫూర్తి గాథ.‘అది ఆనందమో దుఃఖమో తెలియదు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి, కేరళ సంప్రదాయ చీరలో నేను నిలుచుంటే రివ్వుమనే చల్లగాలిలో అందరూ చప్పట్లు కొడుతుంటే కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి‘ అంటుంది వసంతి చెరువీట్టిల్.సమున్నతంగా శ్వేత కిరీటాలతో నిలుచుని ఉండే హిమాలయాలను పలకరించడానికి కేరళలోని కన్నూరు నుంచి ఈమె బయలుదేరినప్పుడు తోడు ఎవరూ లేరు తనకు తాను తప్ప. భర్త చనిపోయాక ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసి వారి జీవితానికి దారి చూపించాక ఈ ప్రపంచాన్ని చూడాలని చిన్న ఆశ కలిగింది వసంతికి. చేసే పని టైలరింగ్. ఆదాయం కొద్దిగా. కాని అందులోనే దాచి ఎంత వీలైతే అంత తిరిగి చూడాలనుకుంది. తన చుట్టూ ఉన్నది తనలాంటి వారే కాబట్టి ‘అమ్మో అంత ఖర్చా? మేము నీతో రాము’ అన్నారు. ‘వెళితే నువ్వొక్కదానివే వెళ్లు’ అన్నారు. ‘వెళ్లలేనా?’ అనుకుంది వసంతి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు బ్రేక్ వేస్తారు. కాని వసంతి ఇద్దరు కొడుకులూ వెళ్లిరామ్మా అన్నారు. అలా ఆమె మొదట థాయ్‌ల్యాండ్ తిరిగి వచ్చింది ఒక్కత్తే. ఆ తర్వాత హిమాలయాలు కనీసం బేస్ క్యాంప్ అయినా చూడాలనుకుంది.యూట్యూబే ట్రెయినర్‌గా...ఎవరెస్ట్ అధిరోహించడంలో రెండు దశలు. ఒకటి బేస్ క్యాంప్‌కు చేరుకోవడం. రెండు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. ఎవరెస్ట్ శిఖరం పై చేరడం చాలా కష్టం కాబట్టి కనీసం బేస్ క్యాంప్ అయినా చేరాలనుకుంటారు. అయితే సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తున ఉన్న బేస్‌క్యాంప్ వరకూ వెళ్లడం కూడా సామాన్యమైన విషయం కాదు. 7 నుంచి 9 రోజులు పడుతుంది. ఇందుకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజులు ట్రెకింగ్ బూట్లతో నడవగలగడం ఇవన్నీ సాధన చేయాలి. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న వసంతి కేవలం యూట్యూబ్‌లో చూసి ఇవన్నీ నేర్చుకుంది. రోజూ వ్యాయామం చేసింది. నాలుగు గంటల పాటు వాకింగ్ చేసింది. ట్రెకింగ్ షూస్ వేసుకుని నడిచింది. హిమాలయాల్లో కమ్యూనికేషన్ ఇబ్బంది రాకుండా కాస్తో కూస్తో హిందీ కూడా నేర్చుకుంది. ఆ తర్వాత అందరికీ చెప్తే విస్తుపోయారు. చివరకు అభినందనలు తెలిపి సాగనంపారు.ప్రతికూలతలునేపాల్లోని లుల్కా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి దశల వారీగా బేస్‌క్యాంప్ వెళ్లాలనుకుంది వసంతి. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఆమె ఎక్కాల్సిన లుల్కా విమానం ఎగరలేదు. దాంతో చిక్కుబడిపోయింది. అప్పుడు ఒక జర్మన్ జంట లుల్కా నుంచి కాకుండా సుర్కె నుంచి వెళదామని సాయం చేశారు. ఫిబ్రవరి 15న సుర్కె నుంచి ఆమె ట్రెకింగ్ మొదలైంది. ఏమాత్రం అనువుగా లేని కాలిబాట దారుల్లో ఆమె ప్రతి ఐదు నిమిషాలకు దీర్ఘశ్వాస తీసుకుంటూ రోజుకు 7 గంటలు నడిచి విశ్రాంతి తీసుకుంటూ మొత్తం 9 రోజులు నడిచి చివరకు బేస్ క్యాంప్‌కు చేరుకోగలిగింది.నా సంప్రదాయం నా గౌరవంవసంతి తనతో పాటు కేరళ సంప్రదాయ చీర తెచ్చుకుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చేరాక దానిని కట్టుకుని ఫొటో దిగింది. తన సంప్రదాయ ఘనత చాటింది. వసంతిని ఇప్పుడు కేరళ మాత్రమే కాదు నెరవేరని ఆకాంక్షలు గల స్త్రీలందరూ అబ్బురంగా చూస్తున్నారు. (చదవండి: ఏడు పదుల వయసులో ఫిట్‌గా మోదీ..! ఆరోగ్య రహస్యం ఇదే..) -
పేరు ఏదైతేనేం... అంతా అణచివేతే!
దేశంలో, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో, ఉన్న పాలన స్వభావాన్ని ఎలా నిర్వచించాలి, దాన్ని ‘ఫాసిజం’ అనాలా, ‘నయా ఫాసిజం’ అనాలా, ‘నయా ఫాసిజం లక్షణాలు’ అనాలా అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నదని ప్రచార సాధనాలలో వార్తలూ, వ్యాఖ్యలూ వస్తున్నాయి. ఆ పార్టీకే చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం తన విధానాల ద్వారా, ఆచరణ ద్వారా, బహుశా మౌనం ద్వారా కూడా ఆ చర్చను మరొక స్థాయికి తీసుకు పోదలచుకున్నట్టున్నారు. కార్పొరేట్ ప్రయోజనాల పరిరక్షణ, ప్రజల సామూహిక ఆందో ళనల అణచివేత, వ్యక్తిగత ఆందోళనల పట్ల మౌనం అనే మూడు విషయాలలో ఆయన ప్రభుత్వం, ఏ పేరు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం చేయదలచిన, చేస్తున్న పనులనే చేసి చూపిస్తున్నది.కేరళలోని వియ్యూర్ సెంట్రల్ జైలులో టి. ఆర్. రూపేష్ అనే మావోయిస్టు ఖైదీ ఉన్నారు. కేరళ మావోయిస్టు పార్టీ నాయకులలో ఒకరైన ఆయనను, ఆయన సహచరి షైనా, మరొక ముగ్గురు అనుచరులతో సహా 2015 మేలో తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్టు చేశారు. అంతకు ముందువీ, ఈ పదకొండేళ్లలో పెట్టినవీ కలిసి ఆయన మీద మొత్తం 43 కేసులున్నాయి. అందులో ఒక కేసు విచారణ జరిగి, ఆయన నిర్దోషిగా తీర్పు వెలువడింది. పదమూడు కేసులు డిశ్చార్జి అయ్యాయి.ఒక కేసులో శిక్ష పడి, శిక్షాకాలం ముగిసిపోతుండగా, విడుదల కాకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం పదకొండేళ్ల కిందటి కేసు తవ్వి తీసింది. జైలు అధికారులు ఇవ్వవలసిన రెమిషన్ ఇవ్వకుండా ఉండిపోయారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ మహత్కార్యమే గాని ఇప్పుడిక్కడ చర్చ అది కాదు. రూపేష్ జైలుకు వెళ్లక ముందే కవిగా, రచ యితగా గుర్తింపు పొందారు. అజ్ఞాతవాసంలో ఉండగానే, 2013లో వెలువడిన ఆయన మొదటి నవల ‘వసంత్తిలె పూమరంగళ్’ (వసంతకాలపు పూలచెట్లు) మలయాళ సాహిత్య లోకంలో విస్తృత చర్చకు దారి తీసింది. అంతకు ముందు న్యాయ శాస్త్ర పట్టభద్రుడైన రూపేష్ గత పదేళ్ల జైలు జీవితంలో చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, తత్వశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. జైలు రేడియో నడుపుతున్నారు. బాడ్మింటన్ క్రీడా కారుడిగా పేరు తెచ్చుకున్నారు. వీటితో పాటే, జైలులో ఆయన తన రెండో నవల రాశారు. ‘బంధితారుడె ఒర్మక్కురిప్పుగళ్’ (ఖైదీల జ్ఞాపకాలు) అనే ఈ నవల ప్రచురణను అనుమతించమని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 130 పేజీలు గల ఈ నవల ఇతివృత్తం ఒక కవి–రాజకీయ కార్యకర్త జైలు జీవితం. జైళ్ల నిర్వహణ రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఒక ఖైదీకి ఉన్న ఈ రాజ్యాంగ బద్ధ హక్కును గౌరవించి అనుమతి ఇచ్చే అధికారం ఉంది. జైలులో ఉన్న ఖైదీకి తన రచనను ప్రచురించుకునే హక్కు ఉందని సుప్రీం కోర్టు ఇచ్చిన ఎన్నో తీర్పులు చెబుతున్నాయి. కాని రూపేష్ లిఖితపూర్వక దరఖాస్తుకు వియ్యూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నెల గడిచినా అధికారిక జవాబు ఇవ్వలేదు. దరఖాస్తును పై అధికారులకు పంపామని, జవాబు కోసం వేచి చూస్తున్నామని తాత్సారం చేశాడు. నవలలో జైలుకు, యూఏపీఏ, కోర్టు ప్రస్తావనలు ఉన్నాయి గనుక అనుమతి ఇవ్వబోమని నోటిమాటగా చెప్పాడు. తన నవల ప్రచురణకు అనుమతించకపోతే, ఎమర్జెన్సీలో క్యాలికట్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి రాజన్ హత్య చేయబడిన మార్చ్ 2న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభిస్తానని రూపేష్ అధికారులకు తెలియజేశారు. మిత్రుల సలహా మేరకు దాన్ని ఒక్కరోజు నిరాహారదీక్షగా మార్చారు. అప్పటికే నవల డీటీపీ ప్రతి చదివిన కె. సచ్చిదానందన్, అశోకన్ చారువిల్,ఎన్. ఇ. సుధీర్ వంటి మలయాళ సాహిత్య ప్రముఖులెందరో ఆ నవల కళాత్మక విలువను ప్రశంసిస్తూ, ప్రచురణను అడ్డుకోవడం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి తగదని ప్రకటించారు. ‘సృజనాత్మకత నేరం కాదు’ అనే శీర్షికతో సామాజిక మాధ్యమాలలో, ఇతర ప్రచార సాధనాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది. ముఖ్య మంత్రికి బహిరంగ లేఖలు వెలువడుతున్నాయి. ఒక ఖైదీ రచన ప్రచురణను ఫాసిస్టు, నయా ఫాసిస్టు, నయా ఫాసిస్టు లక్షణాలు గల ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం సులభమే. కాని ఆ పని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రభుత్వం చేయడమే ఆశ్చర్యకరం, విషాద కరం. అదే ప్రభుత్వపు మరి రెండు విధానాలు కూడా ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైనవి. కేరళలోని ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ – ఏఎస్హెచ్ఏ) సిబ్బందిలో అత్యధికులు ఈ సోమవారానికి ముప్పై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నప్పటికీ తమను ఉద్యోగులుగా కాక వాలంటీర్లుగా గుర్తించడం మానేయాలని, అధికారపక్షం ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు గౌరవ వేతనాన్ని రూ. 7,000 నుంచి రూ. 21,000కు పెంచాలని, ఉద్యోగ విరమణానంతర సౌకర్యాలు కల్పించాలని ప్రధాన డిమాండ్లతో, మరెన్నో డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతున్నది. అనేక రాష్ట్రాలలో ఇవే డిమాండ్ల మీద సీపీఎం కార్మిక సంఘం సీఐటీయూ ఆందోళనలు నిర్వ హిస్తున్నది. కాని కేరళలో సీఐటీయూ కాక మరొక సంఘం ఈ ఆందోళనను నిర్వహిస్తున్నందువల్లనేమో ప్రభుత్వం ఆందోళన కారులతో చర్చలకు కూడా సిద్ధపడడం లేదు. గౌతమ్ అదానీ కంపెనీల మీద విదేశాలలోనూ, దేశంలోనూ లెక్కలేనన్ని విమర్శలు వస్తుండగా, కేరళ ముఖ్యమంత్రి మాత్రం అదానీ మీద పొగడ్తలు కుమ్మరించడంలో దేశ ప్రధానితో పోటీ పడుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా అన్నట్టు, కొద్ది వారాల కిందనే కొచ్చిలో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్‌లో కరణ్ అదానీ అదే స్థాయిలో నరేంద్ర మోదీ, పినరయి విజయన్లు ఇద్దరినీ ఒకే ఊపులో పొగడ్తల్లో ముంచెత్తాడు. ఏది ఫాసిజం? ఏది నయా ఫాసిజం? ఏవి నయా ఫాసిస్టు లక్షణాలు? ఓ మహాత్మా! ఓ మహర్షీ!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పందెం గెలిచిన బాలు.. ఇక కృష్ణయ్య బాధ్యత తనదే
మడుగులో నీటికోసం దిగిన తనను మొసలి అమాంతం పట్టుకుని లోపలి ఈడ్చుకెళ్ళిపోతూ తనను హరించేస్తున్న తరుణంలో కన్నీటి పర్యంతమవుతూనే సర్వ శక్తులు ఒడ్డుతూ పోరాడుతోంది. మరోవైపు మొసలికి స్థానబలం ఎక్కువగా ఉండే మడుగులో దాన్ని ఓడించడం గజేంద్రుడికి సాధ్యం కావడం లేదు... దీంతోమొసలితో పోరాడలేక.. దాన్ని ఓడించలేక.. తనను తానూ కాపాడుకోలేక ఆ గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదు అని అర్థం చేసుకుని తనను రక్షించేది ఈ భూలోకంలో శ్రీహరి ఒక్కడేనని అర్థం చేసుకుని విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఈ విధంగా మ్రెక్కింది.కలఁ డందురు దీనులయెడఁ,గలఁ డందురు పరమయోగి గణములపాలంగలఁ డందు రన్ని దిశలను,గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడోఅని ప్రార్థించగా ఆ క్షణాన శ్రీదేవితో పాలసముద్రంలో శేషతల్పం మీద పయనిస్తున్న శ్రీహరి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఉన్న ఫలాన భూలోకానివచ్చి సుదర్శన చక్రంతో మొసలి కంఠాన్ని ఖండించి గజేంద్రుడిని కాపాడాడు. అప్పట్నుంచి గజేంద్రుడు శ్రీ హరి సేవలో ఉంటూ పునీతుడైనాడు. ఇక దక్షిణభారత దేశంలోనే ప్రముఖమైన గురువాయూర్ కృష్ణ మందిరంలో సోమవారం మొదలైన ప్రత్యేక ఉత్సవాలకు రంగం సిద్ధం చేసారు. గురువాయూర్ అంటేనే ఏనుగులకు ప్రసిద్ధి.. సువిశాలమైన కృష్ణ మందిరంలో అంతెత్తున గజరాజులు ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఉత్సవాల సందర్భంగా కృష్ణయ్యను మోసే బాధ్యత కూడా ఆ గజరాజులదే.. కృష్ణయ్య సదరు గజరాజుపై అధిరోహించి ఊరేగింపుగా వెళ్తారు. అయితే ఆలయంలో అన్నీ ఉత్తమోత్తమ జాతికి చెందిన గజరాజులే .. అందులో ఎవరికీ ఈ మహాద్భాగ్యం దక్కుతుంది.. అందుకే ఏటా మాదిరిగానే ఆలయంలో ఒక పోటీ పెట్టారు.దేవి, దేవదాస్, చెంతమరాక్షన్, నందన్.. బాలు అనే కరిరాజుల మధ్య పరుగుపందెం నిర్వహించారు. మొత్తం 12 ఏనుగులను ఈ పోటీకి పరిశీలించగా అందులో బాలుతోబాటు ఐదు ఏనుగులను మాత్రమే ఫైనల్ పోటీకి నిలిపారు. ముందుగా వాటిని స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయించి వాటి కంఠాన గణగణమని మోగే గంటలను అలంకరించి ముందుగా దేనికి సంబంధించిన మావటి దాను ముందుగా ఉరుకుతుంటే వారివెనుకనే కరిరాజులు పరుగెత్తాయి. ఈ పందెం చూసేవాళ్లకు కన్నులపంట కాగా వినేవాళ్లకు వీనులవిందు అవుతుంది. ఈ పందెంలో బాలు అనే గజరాజు విజయం సాధించాడు. విజయం తర్వాత, బాలు ఒలింపిక్ పతకం సాధించిన విజేత మాదిరి అందర్నీ విజయగర్వంతో పరికించి చూసి.. తొండం అభివాదం చేసాడు. తరువాత తూర్పు గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించి, గురువాయురప్పన్కు భక్తితో ఏడు ప్రదక్షిణాలు చేసాడు. ఆ తరువాత ఈ ఉత్సవాల్లో స్వామిని మోసే బాధ్యత ఈ బాలుకు మాత్రమే దక్కుతుందన్నమాట..ఈ సందర్భంగా నిర్వహించే పోటీలకు ముందు గజరాజులు వెటర్నరీ డాక్టర్లు ఫిట్నెస్ పరీక్షలు చేస్తారు. అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడే కాసిన్ని ఏనుగులను రంగంలోకి దించి పూర్తి భద్రతనడుమ ఈ పరుగుపందెం నిర్వహిస్తారు. జనం అల్లరికి ఏనుగులు బెదిరిపోయి జనంలోకి వెళ్లే ఇంకేదైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ పోటీలు నిర్వహిస్తారు.. :::సిమ్మాదిరప్పన్న -
చేప కొరికితే అంతలానా..! పాపం అతడికి ఏకంగా..
కుక్క లేదా ఇతర జంతువులు కొరికితే వెంటనే భయపడతాం, ఇంజెక్షన్లు చేయించుకుంటారు. అదే చేప, పీత లాంటివి అనగానే కొందరూ లైట్ తీసుకుంటారు. ఎందుకంటే అవి విషపూరితం కాదనే ఫీలింగ్. అలానే ఈ వ్యక్తి కూడా చేపే కదే అని చాలా లైట్ తీసుకున్నాడు. చివరికి అది అతడి ఊహించిన బాధనే మిగిల్చింది. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదని వాపోతున్నాడు. ఇంతకీ అతడికి ఏం జరిగిందంటే..కేరళలోని కన్నూర్ జిల్లాలోని థలస్సెరీ ప్రాంతానికి చెందిన టి.రాజేష్ అనే రైతు తన ఇంటికి సమీపంలో ఉన్న చిన్న నీటిగుంటని క్లీన్ చేశాడు. సరిగ్గా ఆ సమయంలో కడు అనే జాతికి చెందిన చేప(క్యాట్ ఫిష్ జాతికి చెందింది) అతడి వేలిని కొరికింది. దాంతో అతడు స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. నయం అయిపోతుందిలే అని ధీమాగా ఉన్నాడు. అంత సీరియస్‌గా పట్టించుకోలేదు. కానీ రానురాను భాధ ఎక్కవై చెయ్యి కదిలించాలంటేనే నొప్పితో విలవిల్లాడిపోయే పరిస్థితికి దిగజారిపోయింది. ఇక ఆ బాధకు తాళ్లలేక దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అక్కడ వైద్యులు అతడికి ఎందువల్ల ఇలాంటి పరిస్థి వచ్చిందన్నది అంచనా వేయలేకపోయారు. దాంతో ఆ వైద్యులు కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. బేబీ మెమోరియల్ వైద్యులు రాజేష్‌కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. చేతి వేళ్లను తొలగించకపోతే ఆ బ్యాక్టీరియా పైకి పాకి.. మరింత ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని చేతివేళ్లను తొలగించారు వైద్యులు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆ ఇన్ఫెక్షన్ అరచేయి అంతా వ్యాపించేసింది. దీంతో వైద్యులు పూర్తిగా ఆ అరచేతి మొత్తాన్ని తొలగించారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..బురద నీటిలో నివశించే క్లోస్ట్రడియం పెర్ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియ వల్ల ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించి కణాలపై దాడి చేసి..ఇన్ఫెక్షన్ని మెదడు వరకు వ్యాప్తి చేసి ప్రాణాంతకంగా మారుస్తుంది. ఇక్కడ ఈ రైతు రాజేష్ కేసులో ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి అరచేతిని తొలగించడం తప్పమరో అవకాశం లేదు. బురదలో ఉండే ఆ చేప కారణంగానే ఈ బ్యాక్టీరియా శరీరం లోపలికి ప్రవేశించిందని చెప్పుకొచ్చారు వైద్యులు. (చదవండి: ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే..! హెచ్చరిస్తున్న న్యూట్రిషన్లు) -
మహాత్మా గాంధీ మునిమనవడు వివాదాస్పద వ్యాఖ్యలు
తిరువనంతపురం : స్వాతంత్య్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీని అరెస్ట్ చేయాలని అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ డిమాండ్ చేస్తుంది. అరెస్ట్‌తో సరిపెట్టడం కాదు. తప్పని సరిగా తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని భీష్మిస్తున్నాయి.తుషార్ గాంధీ ఇటీవల కేరళ రాజధాని తిరువనంతపురంలోని నెయ్యంట్టికరలో గాంధీ సిద్ధాంతవాది పి.గోపీనాథన్ నాయకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ సమాజానికి ప్రమాదకరం, శత్రులని అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ నిలువెల్లా విషం నింపుకుందని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. స్థానిక బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు తుషార్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు.అయితే,ఇదే అంశంపై తుషార్ గాంధీ ప్రస్తావించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడుతున్నట్లు చెప్పారు. చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడం, క్షమాపణలు చెప్పబోమని అన్నారు. ఈ సంఘటన నా సంకల్పాన్ని మరింత బలపరచిందన్నారు. -
థరూర్ సీపీఎంలో చేరబోరు: కారత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సీపీఎం పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ తాత్కాలిక సమన్వయకర్త ప్రకాశ్ కారత్ తోసిపుచ్చారు. ఆయన పార్టీ వీడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదన్నారు. కేవలం కేరళలో స్టార్టప్‌లు సాధిస్తున్న గణనీయమైన ప్రగతి గురించి మాత్రమే మాట్లాడారని చెప్పుకొచ్చారు. శశిథరూర్ సాధారణ వ్యక్తి కాదని ప్రశంసించిన కారత్.. ఆయన నిక్కచ్చి అభిప్రాయాలు కొన్నిసార్లు కాంగ్రెస్‌కు అసౌకర్యాన్ని కలిగిస్తాయన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాధిస్తున్న పారిశ్రామికాభివృద్ధిని ప్రశంసిస్తూ థరూర్ గత నెలలో ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. ఇది రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ దానిపై ప్రశ్నల వర్షం కురిపించగా.. సీపీఎం వ్యాసాన్ని స్వాగతించింది. అయితే తాను ప్రభుత్వాన్ని ప్రశంసించలేదని, కేవలం స్టార్టప్ రంగంలో రాష్ట్ర ప్రగతిని ఎత్తి చూపానని థరూర్ స్పష్టం చేశారు. ఆ తరువాత మలయాళంలో ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేరళలో పార్టీ నాయకత్వ బాధ్యతలకు తాను అర్హుడినని ప్రకటించారు. సంసిద్ధతను సైతం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని కలవరపరిచింది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ థరూర్ మీడియాపై మండిపడ్డారు. -
ఆ ఏనుగు హెయిర్ స్టైల్ వేరేలెవెల్..!
ఫ్యాషన్ అంటే కేవలం మనుషుల మాత్రమేనా మేము కూడా తీసికిపోం అంటున్నాయి జంతువులు. ట్రెండీ ఫ్యాషన్‌ని మనుషులే కాదు జంతువుల కూడా ఫాలోఅవుతాయని ఈ వైరల్ వీడియోని చూశాక ఒప్పుకుంటారు. ఆ వీడియోలోని ఏనుగు స్టైల్ చూస్తే..వేరేలేవెల్ అని అంగీకరిస్తారు. మరీ ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..తమిళనాడులో మన్నార్గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఏనుగు విలక్షణమైన హెయిర్‌స్టైల్‌తో చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఏనుగు పేరు సెంగమాలం. ఆ ఏనుగుకి సంబంధించిన వీడియోని ఇండియా కల్చరల్ హబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సెంగమాలం ఏనుగు మనుషుల జుట్టు మాదిరిగా 'బాబ్‌కట్ హెయిర్ స్టైల్'లో ఉంటుంది. చూస్తే మనుషుల హెయిర్‌స్టైల్ మాదిరిగానే ఉంటుంది ఆ ఏనుగు హెయిర్. అంతేగాదండోయ్ ఆ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ ఏనుగే ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. అయితే ఇంతలా ఏనుగు జుట్టు పట్ల కేర్ తీసుకుంటున్న దాని సంరక్షకుడిని మెచ్చుకోవాల్సిందే. ఈ మేరకు ఆ ఏనుగు సంరక్షకుడు ఎస్ రాజగోపాల్ మాట్లాడుతూ..ఈ సెంగమాలం జుట్టుని వేసవికాలంలో రోజుకి మూడుసార్లు, ఇతర సీజన్లలో కనీసం రోజుకి ఒకసారైనా.. కడుగుతామని చెబుతున్నారు. 2003లో ఆ ఏనుగుని కేరళ నుంచి తీసుకవచ్చారట. అప్పటి నుంచి ఈ ఆలయంలోనే నివాసిస్తోందట. దేవుని కైంకర్యాలకు ఈ ఏనుగుని వినియోగిస్తామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. మే నెలలో ఈ ఏనుగుకి చల్లదనం కల్పించడం కోసం ప్రత్యేకంగా దాదాపు రూ. 45 వేలు ఖరీదు చేసే షవర్‌ని కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!) -
బరువు తగ్గాలని ఆ డైటింగ్ : చివరికి ప్రాణమే పోయింది!
బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా పొరబాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అసలు బరువు తగ్గడం అవసరమా? తగ్గితే ఎన్ని కిలోలు తగ్గాలి? ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనేది నిర్ణయించుకోవడం అవసరం. ఇందుకు వైద్యుల సలహాలు, నిపుణుల సూచనలు చాలా ముఖ్యం. అలాకాకుండా బరువు పెరుగుతామనే భయంతో ఆన్లైన్లో చూసో, లేదా మరెవరో చెప్పారనో ఏ డైట్ బడితే అది ఫాలో కావడం అనర్థం. ఒక్కోసారి ఇది ప్రాణాలు కూడా పోవచ్చు. కేరళలో కన్నూరులో చోటు చేసుకున్న ఘటన ఇలాంటి ఆందోళనలనే రేకెత్తిస్తోంది. కొన్ని రకాల రుగ్మతల వల్ల కూడా భయం పెరిగిపోతామనే భయం పట్టుకుంటుందని మీకు తెలుసా? రండి తెలుసుకుందాం! కేరళలోని కన్నూర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తీవ్రమైన ఆహార నియంత్రణలు పాటించేది. యూట్యూబ్‌లో చూసి దాదాపు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. కేవలం నీటినే తీసుకునేది. చివరికి తీవ్రమైన దీర్ఘకాలిక ఆకలి కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయింది. మృతురాల్ని కూతుపరంబ నివాసి శ్రీనందగా గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో తలస్సేరిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలు కోల్పోయింది. ఆమె గతంలో కూడి ఇలాంటి సమస్యలతో కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరిందట. వైద్యుడు డాక్టర్ నాగేష్ ప్రభు ప్రకారం, శ్రీనంద అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మతతో బాధపడుతోంది. దీని వలన రోగి బరువు పెరుగుతారనే భయం ఉంటుంది. ఆరు నెలల కింత నుంచి ఆకలితోనే ఉంటోందని ఆయన తెలిపారు. సోడియం , చక్కెర స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి సమస్యలకు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాధి తీవ్రత గురించి తెలుసు కోవాలన్నారు. పశ్చిమ దేశాల్లో ఎక్కువగా కనిపించే అనోరెక్సియా నెర్వోసా కేరళలో కనిపించడం ఇది చాలా అరుదు అని కూడా ఆయన చెప్పారు. అనోరెక్సియా నెర్వోసా అంటే..?డా. నగేష్ అందించిన వివరాల ప్రకారం అనోరెక్సియానెర్వోసాతో బాధపడేవారిలో కాలక్రమేణా ఆకలి అనే అనుభూతిని కోల్పోతారు. దీనికి కారణాలపై స్పష్టత లేదు. అయితే మానసిక ఆరోగ్యం, జన్యు మార్పులు, పర్యావరణం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతుంది. అన్ని వయసులు, జాతులు, శరీర రకాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.మానసిక చికిత్సఅనోరెక్సియా నెర్వోసా ఒక మానసిక పరిస్థితి. దీని లక్షణాలను బట్టి మానసిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, పోషకాహార కౌన్సెలింగ్, వారానికి ఒకసారి మానసిక కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. సకాలంలో చికిత్స చేస్తే నయమవుతుంది. అయితే, ఇలాంటివి రుగ్మతలు రాత్రికి రాత్రే నయం కావు. కోలుకోవడానికి సమయం చాలా పట్టవచ్చు. వైద్యులను సలహాలను తప్పక పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాల్సి ఉంటుంది. -
ఉడ్తా కేరళ!
అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు బానిసలవుతున్న పరిస్థితి! మాదకద్రవ్యాల వాడకంలో పంజాబ్‌ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూర్‌లో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు! సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు ఉదాహరణ మాత్రమే.కేరళలో ఏ మూలన చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం,1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్‌లో నమోదైంది 9,734 కేసులే! ‘‘సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయమొచి్చంది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయి’’ అని కేరళ హైకోర్టు జస్టిస్ వీజీ అరుణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.330 శాతం అధికం 2021 నుంచి చూస్తే మూడేళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330 శాతం పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తుపదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో రెండుసార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఎన్నెన్ని విషాదాలో...! డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు..→ కాలికట్ జిల్లాలో మత్తుకు బానిసైన పాతికేళ్ల ఆశిఖ్ తన తల్లినే నరికి చంపాడు. పైగా ‘నాకు జన్మనిచి్చనందుకు శిక్షించా’ అంటూ డ్రగ్స్ మత్తు లో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మా రింది.→ త్రిసూర్‌లో మరో పాతికేళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిసూర్‌లోనే 14, 16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటూ హల్చల్ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.→ తమ అబ్బాయి డ్రగ్స్ వ్యసనాన్ని వదిలించలేకపోతున్నామంటూ పథినంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది.→ డ్రగ్స్ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడుతో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు మందలించిన తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్ కొనేందుకు డబ్బివ్వలేదని తల్లినే చితకబాదాడు.→ డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి, విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్లనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు డ్రగ్స్‌ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్ గ్రూప్‌ల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్ సరఫరా చేసే హాట్స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషి‹Ù, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్నా మిథేలిన్ డైఆక్సీ మిథాఫెటమైన్ (ఎండీఎంఏ) వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65 శాతం పెరిగింది. ఎండీఎంఏ, మెథ్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్రతీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్‌వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు.నాలుగేళ్లలో 93,599 అరెస్టులు! కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్టు సీఎం విజయన్ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.క్యాండీలు, ఐస్క్రీంల రూపంలో... సింథటిక్ డ్రగ్స్ వాడేవారిలో సమాజంలోని అన్నివర్గాల వారూ ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్క్రీంల దాకా నానారకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యాసంస్థలే అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.సూపర్‌బైక్‌లపై డెలివరీ... స్మార్ట్ ఫోన్లో, వాట్సాప్ గ్రూప్‌లోనూ మెసేజ్ చేస్తే పావుగంటలోపే సూపర్ బైక్‌లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు/నకిలీ నంబర్ ప్లేట్లున్న సూపర్‌బైక్‌లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు, వేగంగా సరకు డెలివరీకి రాత్రిళ్లు ఈ బైక్‌లను వాడుతున్నట్టు ఎక్సయిజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18–24 ఏళ్ల వారినే డెలీవరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్‌కు రూ.1,000, రోజంతా డెలీవరీ చేస్తే రూ.4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు. టీనేజర్లనే డ్రగ్స్ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పోకిరీలతో పరిచయాలు కాకుండా తల్లిదండ్రులే తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి– రిటైర్డ్ ఎస్పీ కేజీ సిమాన్ కేరళలో పదేళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు– కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‘‘అత్యధిక అక్షరాస్యతా రేటు, ఉన్నత విద్యార్హతలున్నా ఉపాధి లేక కేరళలో యువత నైరాశ్యంతో డ్రగ్స్ బారిన పడుతోంది’’ – ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆసియా–పసిఫిక్ రీజియన్ మాజీ సలహాదారు జి.ప్రమోద్‌కుమార్– సాక్షి, నేషనల్ డెస్క్ -
దైవ భూమిలో ఇటువంటి ఏనుగుల గురించి తెలుసా? (ఫొటోలు)
-
‘కార్బన్ పాజిటివ్’ పొలం!
లిస్సిమోల్ జె. వడక్కూట్.. దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిన డైనమిక్ వ్యవసాయ అధికారిణి. కేరళ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో సహాయ సంచాలకురాలిగా గత 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కొచ్చిన్ నగరానికి సమీపంలో అలువి అనే చోట వందేళ్లకు ముందే ఏర్పాటైన ప్రభుత్వ వరి విత్తనోత్పత్తి క్షేత్రం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం లిస్సిమోల్ ఈ క్షేత్రం బాధ్యతలు తీసుకునేటప్పటికి దేశంలో ఎవరికీ దీని గురించి తెలీదు. అయితే, ఆమె అకుంఠిత దీక్షతో పనిచేసి ఈ క్షేత్రానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. దేశంలోనే తొలి ‘కార్బన్ న్యూట్రల్’ వరి క్షేత్రంగా అలువి సీడ్ ఫామ్‌కు గుర్తింపు దక్కింది. 5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. వరి (ఇక్కడ పండించే వరి రకాల్లో అత్యధికం దేశీ రకాలే)తో పాటు అనేక ఇతర పంటలను సాగుచేస్తూ.. ఒక ఆదర్శ సమీకృత వ్యవసాయ క్షేత్రంగా లిస్సిమోల్ ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. ‘కార్బన్ న్యూట్రల్’ అంటే?నీటిని నిల్వ గట్టి వరి పంటను సాగు చేస్తే కర్బన ఉద్గారాలు భారీగానే వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఉద్గారాలతో పాటు... నీటిని నిల్వగట్టడం వల్ల మిథేన్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంటుంది. అటువంటి పొలం నుంచి విడుదలయ్యే ఉద్గారాలను అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించటం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించటం మాత్రమే కాకుండా.. అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరించే స్థాయికి ఈ ఫామ్‌ను అభివృద్ధి చేయటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. 2022 డిసెంబర్లో అలువ ఫామ్‌ను ప్రభుత్వం కార్బన్ న్యూట్రల్ ఫామ్‌గా ప్రకటించింది.170 టన్నుల కర్బనం మిగులు!కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ‘కాలేజ్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్’ (ఇలాంటి కాలేజీ ఒకటి దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాటేమో గానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు) ప్రయోగాలు చేసి ఉద్గారాలను శాస్త్రీయంగా లెక్కగట్టింది. తురుత్ ద్వీప ప్రాంతంలో గల ఈ ఫామ్ 43 టన్నుల కర్బనాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తుండగా, 213 టన్నుల కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరిస్తోందని ఈ ప్రయోగాల్లో తేలింది. అంటే.. ఈ క్షేత్రం 170 టన్నుల కార్బన్ క్రెడిట్లను సంపాయించిందన్న మాట. ఇది నిజానికి ‘కార్బన్ పాజిటివ్’ క్షేత్రం!కేరళ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 13 విత్తనోత్పత్తి క్షేత్రాలు నడుస్తున్నాయి. వీటన్నిటినీ కార్బన్ న్యూట్రల్ ఫామ్స్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం చేరుకోవటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. అంతేకాదు, రాష్ట్రంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్బన్ న్యూట్రల్ ప్రదర్శనా క్షేత్రాలను నిర్మించే ప్రయత్నమూ జరుగుతోంది.ఇదీ సమీకృత సేంద్రియ సేద్యం5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో 3 హెక్టార్లలో వరితో పాటు.. ఒక హెక్టారులో చిరుధాన్యాలు, చియా గింజలు, కొబ్బరి, అరటి, దుంప పంటలు, జాపత్రి, కూరగాయలు, ΄్యాషన్ ఫ్రూట్ తదితర పంటలను సాగు చేస్తున్నారు. 2012 నాటికే ఎన్‌పిఓపి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చింది. 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాసర్గోడ్ కల్లన్ రకం దేశీ ఆవులు 9, మలబార్ మేకలు 16, కుట్టనాడన్ బాతులు వంద, నాటు కోళ్లు, గిన్నె కోళ్లు కలిపి 50తో పాటు బ్యాచ్‌కి 5 వేల గిఫ్ట్ తిలాపియా చేపలను సైతం ఈ సమీకృత క్షేత్రంలో పెంచుతున్నారు. దేశీ వరి రకాలు (జపాన్ వైలెట్, రక్తశాలి, గోల్డెన్ నవార, వెల్లతొండి, వదక్కన్ వెల్లారి కైమ, జైవ, మనురత్న..), అధికోత్పత్తినిచ్చే వరి వంగడాల విత్తనోత్పత్తిని చేపట్టడంతో పాటు లైవ్ రైస్ మ్యూజియంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. పంచగవ్య, జీవామృతం వంటి ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ ద్రావణాలతో పాటు చీడపీడలను అరికట్టే కషాయాలను తయారు చేసుకొని పంటలకు వాడటమే కాకుండా రైతులకు విక్రయిస్తున్నారు. వామ్, వర్మీ కం΄ోస్టు, వర్మీవాష్‌ను తయారు చేస్తున్నారు. రెడువీద్ వంటి మిత్రపురుగులను సైతం పెంచుతున్నారు. తేనెటీగల పెంపకం కూడా ఉంది. పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ క్షేత్రం నిజంగా విలక్షణమైనదే. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. వరి పొలంలో అనేక సమస్యల పరిష్కారానికి బాతులను ఉపయోగించటం. కలుపు నివారణ, చీడపీడల నియంత్రణతో పాటు భూసారం పెంపొందించడానికి కూడా బాతులు ఉపయోగపడుతున్నాయని లెస్సిమోల్ తెలిపారు. ఇక్కడ అనుసరించే ప్రతి పనినీ శాస్త్రీయంగా రికార్డు చేసి, అధ్యయనం చేసి గణాంకాలను రూపొందించారు. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని అన్ని హంగులతో సక్రమంగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ క్షేత్రం కళ్లకు కడుతున్నదనటంలో అతిశయోక్తి లేదు! దేశం నేర్చుకోదగ్గ పాఠాలు2012 నుంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఈ క్షేత్రంలో అనుసరిస్తూ పదేళ్లలో ఈ మైలురాయిని దాటాం. హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించే విధంగా వ్యవసాయ పనులను సమూలంగా మార్చాం. ఇలా చేయాల్సిన అవసరం ఏమిటో రైతులు, స్థానిక ప్రజలకు అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాం. దేశం యావత్తూ నేర్చుకోదగిన పర్యావరణ హిత సేద్య పాఠాలకు మా క్షేత్రం కేంద్ర బిందువైంది. – లిస్సిమోల్ జె. వడక్కూట్, సహాయ సంచాలకురాలు, స్టేట్ సీడ్ ఫామ్ అలువి, ఎర్నాకులం జిల్లా పంచాయత్, కేరళ -
విదర్భ తీన్మార్...
సీజన్ ఆసాంతం నిలకడ కొనసాగించిన విదర్భ జట్టు... తుదిపోరులోనూ అదే జోరు కనబరుస్తూ చాంపియన్‌గా ఆవతరించింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా... పరాజయమే ఎరగకుండా మూడోసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. అసమాన పోరాటంతో తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నిలో ఫైనల్ చేరిన కేరళ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా... దేశవాళీ టోర్నీ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు విజేతగా నిలిచింది. కేరళతో జరిగిన తుదిపోరు ‘డ్రా’గా ముగియడంతో... 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన విదర్భ జట్టుకు ట్రోఫీ దక్కింది. రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు చాంపియన్‌గా అవతరించడం ఇది మూడోసారి. 2017–18, 2018–19 సీజన్లలో వరుసగా ట్రోఫీ చేజిక్కించుకున్న విదర్భ జట్టు... మళ్లీ ఆరేళ్ల తర్వాత టైటిల్ దక్కించుకుంది. తాజా సీజన్లో ఫైనల్‌తో కలిపి మొత్తం 10 మ్యాచ్‌లాడిన విదర్భ... పరాజయం లేకుండా ట్రోఫీ కైవసం చేసుకోవడం విశేషం. సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చాంపియన్ విదర్భ జట్టుకు రూ. 5 కోట్లు... రన్నరప్ కేరళ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. సొంత మైదానంలో జరిగిన తుదిపోరులో ఓవర్‌నైట్ స్కోరు 249/4తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు... 143.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (295 బంతుల్లో 135; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు మరో 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగినా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (108 బంతుల్లో 25), దర్శన్ నల్కండే (98 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్షయ్ కర్నెవర్ (70 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. ఫలితంగా విదర్భ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 37 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా విదర్భ జట్టు 412 పరుగుల ముందంజలో నిలిచింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు టీ విరామం కంటే ముందే ‘డ్రా’కు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన విదర్భ బ్యాటర్ దానిశ్ మాలేవర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 379; కేరళ తొలి ఇన్నింగ్స్: 342; విదర్భ రెండో ఇన్నింగ్స్: పార్థ్ రేఖడే (బి) జలజ్ సక్సేనా 1; ధ్రువ్ షోరే (సి) అజహరుద్దీన్ (బి) ని«దీశ్ 5; దానిశ్ మాలేవర్ (సి) సచిన్ బేబీ (బి) అక్షయ్ చంద్రన్ 73; కరుణ్ నాయర్ (స్టంప్డ్) అజహరుద్దీన్ (బి) ఆదిత్య 135; యశ్ రాథోడ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య సర్వతే 24; అక్షయ్ వాడ్కర్ (బి) ఆదిత్య 25; హర్ష్ దూబే (ఎల్బీడబ్ల్యూ) అధన్ టామ్ 4; అక్షయ్ కర్నెవర్ (బి) బాసిల్ 30; దర్శన్ నల్కండే (నాటౌట్) 51; నచికేత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య 3; యశ్ ఠాకూర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (143.5 ఓవర్లలో 9 వికెట్లకు) 375. వికెట్ల పతనం: 1–5, 2–7, 3–189, 4–238, 5–259, 6–279, 7–283, 8–331, 9–346, బౌలింగ్: ని«దీశ్ 15–3–48–1; జలజ్ సక్సేనా 50–11–109–1; అధన్ టామ్ 14–0–57–1; ఆదిత్య సర్వతే 44.5–12–96–4; బాసిల్ 7–2–18–1; అక్షయ్ చంద్రన్ 13–2–33–1.వీసీఏ నజరానా రూ. 3 కోట్లు మూడోసారి రంజీ టైటిల్ నెగ్గిన తమ జట్టుకు విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. టీమ్ మొత్తానికి రూ. 3 కోట్లు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపింది. ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసి రికార్డు నెలకొలి్పన హర్ష్ దూబేకు రూ. 25 లక్షలు... నాలుగు సెంచరీలతో అదరగొట్టిన కరుణ్ నాయర్‌కు రూ. 10 లక్షలు... ఈ రంజీ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన యశ్ రాథోడ్‌కు రూ. 10 లక్షలు... హెడ్ కోచ్ ఉస్మాన్ ఘనీకి రూ. 15 లక్షలు... అసిస్టెంట్ కోచ్ అతుల్ రనాడేకు రూ. 5 లక్షలు... ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నితిన్ ఖురానాకు రూ. 5 లక్షలు... స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ యువరాజ్ సింగ్ దసోంధికి రూ. 5 లక్షలు... వీడియో ఎనలిస్ట్ అమిత్ మాణిక్‌రావుకు రూ. 5 లక్షలు ప్రకటించారు. గతేడాది మేం ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఈసారి అలాంటి తప్పు చేయకూడదని ముందే అనుకున్నాం. ప్రతి ఒక్కరు తమ ఆటతీరును మెరుగు పర్చుకున్నారు. దాని ఫలితమే ఈ విజయం. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తొలి పది మందిలో నలుగురు విదర్భ ఆటగాళ్లు ఉన్నారు. సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన హర్ష్, అత్యధిక పరుగులు చేసిన యశ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ హోదాలో ఈసారి రంజీ ట్రోఫీ అందుకున్న క్షణాలు అద్భుతంగా అనిపించాయి. –అక్షయ్ వాడ్కర్, విదర్భ కెప్టెన్ -
కరుణ్ నాయర్ సూపర్ సెంచరీ.. రంజీ ఛాంపియన్‌గా విదర్భ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy 2024-25) ఎడిషన్ ఛాంపియన్‌గా విదర్భ (Vidarbha) అవతరించింది. కేరళతో (Kerala) జరిగిన ఫైనల్ డ్రాగా ముగిసినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విదర్భ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 37 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ స్కోర్‌ను క్రాస్ చేయలేకపోవడంతో తొలి సారి రంజీ ఫైనల్‌కు చేరిన కేరళ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.VIDARBHA LIFTS THE RANJI TROPHY. 🏆- 3rd Ranji title in the last 7 years. 🔥pic.twitter.com/cKclAW94XJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2025విదర్భ రంజీల్లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. విదర్భ 2017-18, 2018-19 ఎడిషన్లలో వరుసగా రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. గత ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరిన విదర్భ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత సీజన్ ఫైనల్లో విదర్భ ముంబై చేతిలో ఓడింది.VIDARBHA HAS WON 3 RANJI TROPHY TITLES IN JUST 7 YEARS 🤯- New force of Indian Domestic Cricket. pic.twitter.com/grTjVqWxLd— Johns. (@CricCrazyJohns) March 2, 2025మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో విదర్భ రెండు ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేయగా.. కేరళ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది.యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (86) సెంచరీకి చేరువలో రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా విదర్భ 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కేరళ ఇన్నింగ్స్‌లో ఆదిత్య సర్వటే (79), సచిన్ బేబి (98) సత్తా చాటగా.. అహ్మద్ ఇమ్రాన్ (37), మహ్మద్ అజాహరుద్దీన్ (34), సల్మాన్ నిజర్ (21), జలజ్ సక్సేనా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ (0), ఏడెన్ యాపిల్ టామ్ (10), నిధీశ్ (1) నిరాశపరిచారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, పార్థ్ రేఖడే, హర్ష్ దూబే తలో 3 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.సూపర్ సెంచరీతో మెరిసిన కరుణ్37 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ అయిన కరుణ్ నాయర్ ఈ ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో (135) మెరిశాడు. కరుణ్‌కు ఈ రంజీ సీజన్లో ఇది నాలుగో సెంచరీ. ఓవరాల్‌గా ఈ దేశవాలీ సీజన్లో 9వది. ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఐదు సెంచరీలు చేశాడు.రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించిన మలేవార్తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దనిశ్ మలేవార్ (73) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ద సెంచరీతో రాణించాడు. ఐదో రోజు ఆట చివరి సెషన్లో దర్శన నల్కండే (51 నాటౌట్) కేరళ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కేరళ బౌలర్లలో ఆదిత్య సర్వటే 4 వికెట్లు తీయగా.. నిధీశ్, జలజ్, యాపిల్ టామ్, బాసిల్, అక్షయ్ చంద్రన్ తలో వికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా హర్ష్ దూబేఈ రంజీ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు తీసిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబేకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీమెంట్ అవార్డు లభించింది. ఈ ప్రదర్శనతో హర్ష్ ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో హర్ష్ 7 ఐదు వికెట్ల ప్రదర్శనలు.. 3 నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన దనిశ్ మలేవార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
‘నేను లేకుండా ఆమె ఒంటరిగా బ్రతకలేదు..’!
తిరువనంతపురం: కేరళలో ప్రియురాలితో సహా, నలుగురు కుటుంబ సభ్యుల్ని అతి దారుణంగా హత్య చేసిన ‘సైకో కిల్లర్’ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల అఫాన్ నుంచి కీలక వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు.ఈ హత్యలు అనంతరం వెంజరామూడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన అఫాన్.. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు. పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఇదంతా పోలీసులకు సరెండర్ అయిన తర్వాత జరగ, ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ నిందితుడి నుంచి స్టేట్ మెంట్ లు తీసుకుంటున్నారు పోలీసులు. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో ప్రశ్నించగా, తన గర్ల్ ఫ్రెండ్ ను ఎందుకు హత్య చేశాడో వెల్లడించాడు.ఒంటరిగా ఉండలేను అన్నందుకే..తన ప్రేయసిని చంపడానికి ‘నేను లేకుండా ఆమె ఒంటరిగా బ్రతకలేదు’’ అనే ఉద్దేశంతోనే హత్య చేయాల్సి వచ్చిందని నిందితుడు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబాన్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే దానికి సదరు నిందితుడు సమాధానం చెప్పాడు. తన కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుందని, అందుకు తానే హత్య చేయాలనుకున్నానని పోలీసులు పేర్కొన్నారు.అయితే అతని స్టేట్ మెంట్ ను ఇంకా పూర్తిగా నమ్మలేమని, విచారణ జరుగుతుందన్నారు పోలీసులు. అతను చెప్పేదాంట్లో నిజమెంతో ఇంకా దర్యాప్తు చేస్తే కానీ తెలియదన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారన్నారు. అతని బ్లడ్ శాంపిల్స్ ను మెడికల్ టెస్టు కోసం పంపామన్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ కోరతామని, ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు కోసం అతన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు.రూ. 65 లక్షల అప్పు.. ఆపై హత్యలకు ప్లానింగ్ఈ హత్యలకు ముందు 14 మంది రూ. 65 లక్షల వరకూ అప్పు తీసుకున్నాడు. అనంతరం తాను హత్యలు చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. నిందితుడి కుటుంబ సభ్యుల్లో ఒకరైన 88 ఏళ్ల బామ్మతో పాటు, 13 ఏళ్ల తమ్ముడిని, వరుసకు అత్తయ్య ఆమెను, ఆమె భర్తను, గర్ల్ ఫ్రెండ్ ను హత్య చేశాడు. -
తొమ్మిది సెంచరీలు.. సిగ్గుతో తలదించుకోండి!.. వీడియో వైరల్
విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) మరోసారి శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఎలైట్ 2024-25 సీజన్ ఫైనల్లో భాగంగా కేరళపై సెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా అతడు సెలబ్రేట్ చేసుకున్న విధానం నెటిజన్లను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భీకర ఫామ్‌లో ఉన్న ఆటగాడి పట్ల వివక్ష చూపిస్తున్న టీమిండియా సెలక్టర్లు సిగ్గుతో తలదించుకోవాలంటూ అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా దేశవాళీ క్రికెట్ తాజా ఎడిషన్‌లో ఫార్మాట్లకు అతీతంగా కరుణ్ నాయర్ దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ(Vidarbha) కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం ఎనిమిది ఇన్నింగ్స్‌లోనే 779 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు శతకాలు ఉండటం విశేషం.ఈ నేపథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టులో కరుణ్ నాయర్‌కు స్థానం దక్కాలని భారత మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడి అత్యద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు.ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న వాళ్లను జట్టులోకి తీసుకోలేమని వ్యాఖ్యానించాడు. అతడు ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రస్తుత జట్టులో చోటు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడు.23వ శతకంఈ క్రమంలో నిరాశకు గురైనప్పటికీ కరుణ్ నాయర్ ఆ ప్రభావాన్ని తన ఆట మీద పడనీయలేదు. రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై శతకం(122) బాదిన అతడు.. తాజాగా ఫైనల్లోనూ సెంచరీతో మెరిశాడు. నాగ్‌పూర్ వేదికగా కేరళ జట్టుతో జరుగుతున్న తుదిపోరులో నాలుగో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్.. 184 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి ఇది 23వ శతకం.సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!ఈ నేపథ్యంలో హెల్మెట్ తీసి బ్యాట్‌ను ఆకాశం వైపు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్న కరుణ్ నాయర్... ఆ తర్వాత బ్యాట్, హెల్మెట్‌ను కింద పెట్టేసి.. తన చేతి వేళ్లలో తొమ్మిదింటిని ఎత్తి చూపాడు. దేశీ తాజా సీజన్లో తాను తొమ్మిది సెంచరీలు సాధించానని.. ఇకనైనా టీమిండియాలో చోట ఇవ్వండి అన్నట్లుగా సెలక్టర్లకు సందేశం పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ ఇప్పటి వరకు కేవలం ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ సాయంతో 374 పరుగులు చేసిన అతడు.. వన్డేల్లో 46 రన్స్ చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. కేరళతో శనివారం నాటి ఆట ముగిసే సరికి కరుణ్ నాయర్ 280 బంతులు ఎదుర్కొని 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో రోజు ఆట పూర్తయ్యే సరికి కేరళ కంటే 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం 💯 for Karun Nair 👏A splendid knock on the big stage under pressure 💪It's his 9⃣th 1⃣0⃣0⃣ in all formats combined this season, and the celebration says it all👌🙌#RanjiTrophy | @IDFCFIRSTBank | #FinalScorecard ▶️ https://t.co/up5GVaflpp pic.twitter.com/9MvZSHKKMY— BCCI Domestic (@BCCIdomestic) March 1, 2025 -
Ranji Trophy Final: చరిత్ర సృష్టించిన దూబే.. విదర్భకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
రంజీ క్రికెట్లో (Ranji Trohy) విదర్భ (Vidarbha) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే (Harsh Dubey) చరిత్ర సృష్టించాడు. ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు (69 వికెట్లు) తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బీహార్ బౌలర్ అషుతోష్ అమన్ పేరిట ఉండింది. అమన్ 2018-19 ఎడిషన్‌లో 68 వికెట్లు తీశాడు. ప్రస్తుత రంజీ ఎడిషన్ (2024-25) ఫైనల్లో (కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో) హర్ష్, అమన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఎడిషన్‌లో హర్ష్ 19 ఇన్నింగ్స్‌ల్లో 16 సగటున 69 వికెట్లు తీశాడు.రంజీ ట్రోఫీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..హర్ష్ దూబే (విదర్భ)- 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (2024-25)ఆషుతోష్ అమన్ (బీహార్)- 8 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు (2018-19)జయదేవ్ ఉనద్కత్ (సౌరాష్ట్ర)- 10 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు (2019-20)ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హర్ష్ సహా విదర్భ బౌలర్లు రాణించడంతో విదర్భ కేరళపై కీలకమైన తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో విదర్భ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అతనికి కరుణ్ నాయర్ (86) సహకరించాడు.విదర్భ ఇన్నింగ్స్‌లో మలేవార్, కరుణ్ నాయర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటై, విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 37 పరుగులు వెనుకపడింది. కేరళ ఇన్నింగ్స్‌కు ఆదిత్య సర్వటే (79), కెప్టెన్ సచిన్ బేబి (98) జీవం పోశారు. వీరిద్దరూ అహ్మద్ ఇమ్రాన్ (37), సల్మాన్ నిజర్ (21), మహ్మద్ అజారుద్దీన్ (34), జలజ్ సక్సేనాతో (28) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఓ దశలో (సచిన్ క్రీజ్‌లో ఉండగా) కేరళ విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేసేలా కనిపించింది. అయితే సచిన్ సెంచరీ ముందు అనవసర షాట్ ఆడి వ్యక్తిగతంగా నష్టపోవడంతో పాటు జట్టును కూడా ఇరకాటంలో పడేశాడు. సచిన్ ఔటయ్యాక కేరళ ఇన్నింగ్స్ ఒక్కసారిగా గతి తప్పింది. 18 పరుగుల వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోయింది. పార్థ్ రేఖడే సచిన్ సహా జలజ్ సక్సేనా, ఏడెన్ యపిల్ టామ్ వికెట్లు తీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో హర్ష్ కూడా 3 వికెట్లు తీశాడు. కీలకమైన ఆదిత్య సర్వటే, సల్మాన్ నిజర్, ఎండీ నిధీశ్ వికెట్లు పడగొట్టాడు. నిధీశ్ వికెట్‌తో హర్ష్ ఓ సింగిల్ రంజీ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.కీలకమైన తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించి విదర్భ కేరళపై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భనే విజేతగా నిలుస్తుంది. అలాగని కేరళకు దారులు మూసుకుపోలేదు. కేరళ విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసి, వారు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ జట్టు తమ తొలి రంజీ టైటిల్ కలను నెరవేర్చుకుంటుంది. ప్రస్తుతానికి కేరళపై విదర్భ ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. విదర్భ, కేరళ తమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంది. విదర్భ గత సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో భంగపడి టైటిల్ ఆశలను చేజార్చుకుంది. ఈసారి ఆ జట్టు ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. కాగా, ఈ సీజన్లో విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు చేరింది. -
అద్భుతమై ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. తృటిలో సెంచరీ మిస్
కేరళ, విదర్భ (Kerala Vs Vidarbha) జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ (Ranji Trophy Final) హోరాహోరీగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు ఇరు జట్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో విదర్భ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అతనికి కరుణ్ నాయర్ (86) సహకరించాడు. అనంతరం బరిలోకి దిగిన కేరళ విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సచిన్ బేబి (Sachin Baby) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేరళను తొలి ఇన్నింగ్స్ సాధించే దిశగా తీసుకెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 235 బంతులు ఎదుర్కొన్న సచిన్.. 10 బౌండరీల సాయంతో 98 పరుగులు చేశాడు. సచిన్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య సర్వటే (79) కేరళ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. సర్వటే.. అహ్మద్ ఇమ్రాన్ (37), సచిన్ బేబి సహకారంతో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అనంతరం సచిన్.. సల్మాన్ నిజర్ (21), మహ్మద్ అజహరుద్దీన్ (37), జలజ్ సక్సేనా (28 నాటౌట్) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.మూడో రోజు మూడో సెషన్ సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా, ఏడెన్ యాపిల్ టామ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేరళ ఇంకా 42 పరుగులు వెనుకపడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధిస్తే ఈ మ్యాచ్ డ్రా అయినా కేరళనే విజేతగా నిలుస్తుంది. కాబట్టి తొలి ఇన్నింగ్స్ లీడ్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి.ఇబ్బంది పెట్టిన నల్కండేఈ ఇన్నింగ్స్‌లో కేరళకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ను (0) దర్శన్ నల్కండే తెగ ఇబ్బంది పెట్టాడు. వీరిద్దరినీ నల్కండే 13 పరుగుల వ్యవధిలో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో నల్కండే ఈ రెండు వికెట్లతో పాటు మరో వికెట్ కూడా తీశాడు. సెమీఫైనల్లో సెంచరీ హీరో మహ్మద్ అజహరుద్దీన్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. విదర్భ బౌలర్లలో నల్కండేతో పాటు హర్ష్ దూబే (2), యశ్ ఠాకూర్ (1), పార్థ్ రేఖడే (1) వికెట్లు తీశారు.అంతకుముందు విదర్భ ఇన్నింగ్స్‌లో మలేవార్, కరుణ్ నాయర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు చేరింది. -
ఆ‘పాత’ నావ
ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు, చెక్క, తాళ్లు తదితరాలతో వీటిని తయారు చేసేవారు. అయినా ఇవి అత్యంత ప్రతికూల వాతావరణాలను కూడా తట్టుకుంటూ సదూర సముద్రయానాలకు ఎంతో అనువుగా ఉండేవి. ఈ భారతీయ నావలకు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా యమ గిరాకీ ఉండేదట. ఇంతటి చరిత్ర ఉన్న పురాతన భారతీయ నావకు వాయుసేన, కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పుడిలా ప్రాణం పోశాయి. వారి ఆలోచనలకు రూపమిస్తూ గోవాకు చెందిన నౌకా నిర్మాణ సంస్థ హోడీ ఇన్నొవేషన్స్ అచ్చం అలనాటి విధానంలోనే దీన్ని రూపొందించింది. బాబు శంకరన్ సారథ్యంలో కేరళకు చెందిన నిపుణులైన పనివాళ్లు అహోరాత్రాలు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. అప్పట్లో మాదిరిగానే ఈ నావను ముందుగా రెండు అర్ధ భాగాలుగా నిర్మించారు. తర్వాత కొబ్బరి నార నుంచి అల్లిన తాళ్ల సాయంతో ఒడుపుగా ఒక్కటిగా బిగించారు. సముద్ర జలాల్లో తడిసి పాడవకుండా నావ అడుగు, పక్క భాగాలకు అప్పటి పద్ధతుల్లోనే సార్డిన్ ఆయిల్ తదితరాలతో పూత పూశారు. మన్నిక కోసం టేకు, పనస వంటి చెక్కలు మాత్రమే వాడారు. ఈ తరహా భారతీయ నావల హవా క్రీస్తుశకం ఐదో శతాబ్ది దాకా ప్రపంచమంతటా నిరి్నరోధంగా సాగింది. ఆ ఘన వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఇదో ముందడుగని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆ‘పాత’నావకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. ఇది బుధవారం ఘనంగా జలప్రవేశం చేసింది. ఈ ఏడాది చివర్లో 15 మంది నేవీ అధికారులతో ప్రాచీన సముద్ర మార్గాల్లో ఈ నావ మస్కట్, ఇండొనేసియాలకు తొలి ప్రయాణం ప్రారంభించనుంది. దీన్ని నడిపే విధానం తదితరాలపై వారు ముందస్తు శిక్షణ కూడా పొందనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రంజీ ట్రోఫీ ఫైనల్.. విదర్భ భారీ స్కోర్.. పోరాడుతున్న కేరళ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్ ఫైనల్లో గతేడాది రన్నరప్ విదర్భ (Vidarbha), తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ (Kerala) తలపడుతున్నాయి. విదర్భలోని నాగ్‌పూర్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేరళ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (379) చేసింది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (86) అతనికి సహకరించాడు. దురదృష్టవశాత్తు కరుణ్ సెంచరీకి ముందు రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ (0) నిరాశపర్చగా.. ఆదిత్య సర్వటే (66 నాటౌట్), అహ్మద్ ఇమ్రాన్ (37) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసిన సర్వటే.. కెప్టెన్ సచిన్ బేబితో (7) కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 14 పరుగులకే ఇద్దరు కేరళ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపాడు. యశ్ ఠాకూర్ క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఇమ్రాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. కేరళ.. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 248 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. -
రంజీ ఫైనల్లో శతక్కొట్టిన యువ కెరటం
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్ ఫైనల్ (Ranji Final) మ్యాచ్ ఇవాళ (ఫిబ్రవరి 26) మొదలైంది. గతేడాది రన్నరప్ విదర్భ (Vidarbha).. తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళతో (Kerala) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో కేరళ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బౌలింగ్ చేసిన కేరళకు ఆదిలోనే ఫలితం లభించింది. ఆ జట్టు బౌలర్ నిధీశ్ మ్యాచ్ రెండో బంతికే విదర్భ ఓపెనర్ పార్థ్ రేఖడేను (0) ఔట్ చేశాడు. అనంతరం నిధీశ్ ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు. 11 పరుగుల స్కోర్ వద్ద నిధీశ్ దర్శన్ నల్కండేను (1) పెవిలియన్‌కు పంపాడు. మరికొద్ది సేపటికే విదర్భ మూడో వికెట్ కోల్పోయింది. ఈసారి ఏడెన్ యాపిల్ టామ్ కేరళకు సక్సెస్ అందించాడు. టామ్.. విదర్భ స్టార్ బ్యాటర్ ధృవ్ షోరేను (16) ఔట్ చేశాడు. ఫలితంగా విదర్భ 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.Danish Malewar in his last 13 innings 👏61, 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 104*(still batting)#RanjiTrophy2025pic.twitter.com/HmdjKiXaOm— CricTracker (@Cricketracker) February 26, 2025సెంచరీతో కదంతొక్కిన దనిశ్ మలేవార్ఈ దశలో 21 ఏళ్ల దనిశ్ మలేవార్ (Danish Malewar) సెంచరీతో కదంతొక్కి విదర్భను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. దనిశ్ 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. దనిశ్ తన సెంచరీ మార్కును సిక్సర్, బౌండరీతో అందుకున్నాడు. దనిశ్కు స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) సహకారం అందిస్తున్నాడు. కరుణ్ సైతం అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దనిశ్, కరుణ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 158 పరుగులు జోడించారు. 63 ఓవర్లు ముగిసే సరికి విదర్భ స్కోర్ 183/3గా ఉంది. దనిశ్ 116.. కరుణ్ 51 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.భీకర ఫామ్‌లో దనిశ్దనిశ్ ప్రస్తుత రంజీ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో దనిశ్ 13 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 600 పైచిలుకు పరుగులు చేశాడు. ఫైనల్లో సెంచరీతో మెరిసిన దనిశ్.. క్వార్టర్ ఫైనల్, సెమీస్‌లో అర్ద సెంచరీలతో రాణించాడు. దనిశ్ ఇదే సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆంధ్రతో జరిగిన అరంగ్రేటం మ్యాచ్‌లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం వరుసగా 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 118* పరుగులు స్కోర్ చేశాడు. -
కాంగ్రెస్‌కు నా అవసరం లేదనుకుంటే.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తీరు కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీలో చేరుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మరోసారి శశిథరూర్ ప్రశంసించారు. అలాగే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు కథనాలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు.తాజాగా శశిథరూర్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నన్ను వ్యతిరేకిస్తున్నారు. కానీ, నేను దేశం, కేరళ భవిష్యత్ కోసం మాట్లాడుతున్నాను. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నేను కాంగ్రెస్‌కు విధేయుడినే. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకానీ, పార్టీ మారే ఆలోచన నాకు లేదు. ప్రజల సేవ పట్ల నిబద్ధతతో ఉన్నాను. నేను రాజకీయాల్లోకి రా ముందే ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా పనిచేశాను. అనంతరం.. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని కోరిన తర్వాతే పార్టీలో చేరాను’ అని తెలిపారు.పార్టీకి నేను అవసరం అనుకుంటే నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతాను. పార్టీకి అవసరం లేదనుకుంటే నా ముందు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంతేకానీ ఇతర పార్టీల్లో చేరడంపై నేను ఆలోచించడం లేదు. పుస్తకాలు.. ప్రసంగాలు.. సదస్సుల కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఆహ్వానాలు.. ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నేను ప్రజాస్వామ్యవాదిగా ఉంటాను. మతతత్వాన్ని వ్యతిరేకిస్తాను. అలాగే, సామాజిక న్యాయాన్ని నమ్ముతాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త అయిన శశిథరూర్.. పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై ప్రశంసలు కురిపించడం కాంగ్రెస్ నాయకత్వానికి రుచించలేదు. కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్ టేప్ కోత విధానాలను శశిథరూర్ ఇటీవల ప్రశంసించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన, ట్రంప్‌తో భేటీ ఫలితాలను శశిథరూర్ కొనియాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
రంజీ రారాజు ఎవరో?
నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి జరగనున్న 2024–25 రంజీ ట్రోఫీ సీజన్ ఫైనల్లో కేరళతో రెండుసార్లు చాంపియన్ విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది ఫైనల్లో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన విదర్భ జట్టు... ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పు చేజిక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి రంజీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు అద్భుతాన్ని ఆశిస్తోంది. తాజా సీజన్లో ఇరు జట్లు నిలకడైన ప్రదర్శన కనబర్చగా... అక్షయ్ వాడ్కర్ సారథ్యంలోని విదర్భ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఫైనల్ చేరే క్రమంలో విదర్భ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలుపొందిన విదర్భ... క్వార్టర్ ఫైనల్లో తమిళనాడును చిత్తు చేసింది. ఇక డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో జరిగిన సెమీఫైనల్లో విజృంభించిన విదర్భ... స్టార్లతో కూడిన ముంబైకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో నిరుడు ఫైనల్లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో ఇది 90వ సీజన్ కాగా... విదర్భ జట్టుకిది నాలుగో ఫైనల్. గతంలో 2017–18, 2018–19 సీజన్లలో వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు... గతేడాది ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.అప్పటి నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో విదర్భ జట్టు నిలకడగా విజయాలు సాధిస్తోంది. ఈ సీజన్లో విజయ్ హజారే ట్రోఫీలో కూడా విదర్భ జట్టు ఫైనల్‌కు చేరింది. మరోవైపు తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించిన కేరళ సమష్టి కృషితోనే టైటిల్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. బ్యాటింగే బలంగా... తాజా సీజన్లో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసిన విదర్భ జట్టు... బ్యాటింగే ప్రధాన బలంగా ఫైనల్ బరిలోకి దిగనుంది. కెపె్టన్ అక్షయ్ వాడ్కర్, కరుణ్ నాయర్, అథర్వ తైడే, ధ్రువ్ షోరే, యశ్ రాథోడ్, దానిశ్ మాలేవర్‌తో విదర్భ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. 933 పరుగులు చేసిన యశ్ రాథోడ్ విదర్భ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. 5 సెంచరీలు, 3 అర్ధసెంచరీలతో విజృంభించిన యశ్... 58.13 సగటుతో ఈ పరుగులు రాబట్టడం విశేషం. సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో యశ్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్, కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు అతడు 48.14 సగటుతో 674 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అందులో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగుతున్న సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ 8 మ్యాచ్‌లాడి 45.85 సగటుతో 642 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉంది. దానిశ్ మాలేవర్ (557 పరుగులు), ధ్రువ్ షోరే (446 పరుగులు) కూడా రాణించారు. బ్యాటింగ్‌లో టాపార్డర్ సమష్టిగా కదంతొక్కుతుంటే... బౌలింగ్‌లో 22 ఏళ్ల హర్‡్ష దూబే సంచలన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 66 వికెట్లు పడగొట్టిన హర్‡్ష... ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు అశుతోశ్ అమన్ (2018–19 సీజన్లో 68 వికెట్లు; బిహార్) పేరిట ఉంది. హర్‡్షతో పాటు దర్శన్ నల్కండే, నచికేత్ భూటె, పార్థ్ రెఖడే బౌలింగ్‌లో కీలకం కానున్నారు. ఈ బౌలింగ్ దాడిని కాచుకుంటూ పరుగులు రాబట్టాలంటే కేరళ జట్టు శక్తికి మించి పోరాడక తప్పదు. సమష్టి కృషితో... స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... సమష్టి ప్రదర్శనతోనే కేరళ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో 3 మ్యాచ్‌లు గెలిచి మరో రెండు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న సచిన్ బేబీ సారథ్యంలోని కేరళ జట్టు... రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంతో నాకౌట్‌కు చేరింది. అయితే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లో మాత్రం కేరళ అసాధారణ పోరాటం కనబర్చింది. జమ్మూకశ్మీర్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసిన కేరళ... సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో గట్టెక్కింది. మిడిలార్డర్ బ్యాటర్లు సల్మాన్ నిజార్, మొహమ్మద్ అజహరుద్దీన్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. నిజార్ 86.71 సగటుతో 607 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అజహరుద్దీన్ 75.12 సగటుతో 601 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 4 అర్ధశతకాలు ఉన్నాయి. క్వార్టర్స్‌లో, సెమీస్‌లో ఈ జంట అసమాన పోరాటం వల్లే కేరళ జట్టు తుదిపోరుకు అర్హత సాధించింది. గంటలకు గంటలు క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లపై మానసికంగా పైచేయి సాధించడంలో అజహరుద్దీన్, నిజార్ది అందెవేసిన చేయి. వీరితో పాటు జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, రోహన్ కున్నుమ్మల్, అక్షయ్ చంద్రన్ కూడా కలిసికట్టుగా రాణిస్తే కేరళకు తిరుగుండదు. బౌలింగ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా తాజా సీజన్లో 38 వికెట్లు పడగొట్టాడు. ఆదిత్య సర్వతే (30 వికెట్లు) కూడా ఫామ్‌లో ఉన్నాడు. ని«దీశ్, బాసిల్ పేస్ బౌలింగ్ భారం మోయనున్నారు.విదర్భ ఫైనల్ చేరిందిలా... » ఆంధ్రపై 74 పరుగుల తేడాతో గెలుపు » పుదుచ్చేరిపై 120 పరుగుల తేడాతో విజయం » ఉత్తరాఖండ్‌పై 266 పరుగుల తేడాతో గెలుపు » హిమాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్88 పరుగులతో విజయం » గుజరాత్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » రాజస్తాన్‌పై 221 పరుగులతో గెలుపు » హైదరాబాద్‌పై 58 పరుగులతో విజయం » క్వార్టర్స్‌లో తమిళనాడుపై 198 పరుగులతో గెలుపు » సెమీస్‌లో ముంబైపై 80 పరుగులతో విజయం కేరళ ఫైనల్ చేరిందిలా... » పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం » కర్ణాటకతో మ్యాచ్ ‘డ్రా’ » బెంగాల్‌తో మ్యాచ్ ‘డ్రా’ » ఉత్తరప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 117 పరుగులతో గెలుపు » హరియాణాపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » మధ్యప్రదేశ్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » బీహార్‌పై ఇన్నింగ్స్ 169 పరుగులతో విజయం » క్వార్టర్స్‌లో జమ్ముకశ్మీర్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » సెమీస్‌లో గుజరాత్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం -
ప్రియురాలిని ఇంటికి తెచ్చి.. ఆపై ఇంట్లోవాళ్లని హతమార్చి!
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలి మీద దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. అతని తల్లి, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తిరువనంతపురం సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వెంజరమూడు(Venjaramoodu) పీఎస్‌కు సోమవారం సాయంత్రం ఓ యువకుడు వచ్చాడు. తాను తన కుటుంబ సభ్యులను చంపినట్లు చెబుతూ పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. అది నిజమేనని తేలడంతో షాక్‌కి గురయ్యారు. ఈలోపు ఆ యువకుడు తనతో తెచ్చుకున్న ఎలుకల మందు తాగి పీఎస్‌లోనే పడిపోయాడు. దీంతో.. అతన్ని చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.పెర్ములాలో నివాసం ఉంటున్న అఫన్(Afan).. స్థానికంగా బీఎస్సీ చదివే ఫర్సనాతో ప్రేమలో ఉన్నాడు. వాళ్ల ప్రేమకు ఫర్సనా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట ఆమెను అఫన్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఏం జరిగిందో తెలియదు.. సోమవారం తన ఇంట్లో తల్లి షమీ, సోదరుడు అఫ్సన్(13), ఫర్సనాపై దాడి చేశాడు. అక్కడి నుంచి బైక్ మీద ఎన్ఎన్ పురంలో ఉన్న మేనమామ లతీఫ్(69) ఇంటికి వెళ్లి ఆయన్ని, ఆయన భార్య షాహిదా(59)ను హతమార్చాడు. అక్కడి నుంచి పాంగోడ్లో ఉన్న బామ్మ సల్మా బీవీ దగ్గరకు వెళ్లి ఆమెను కూడా చంపేశాడు. 16 కిలోమీటర్ల పరిధిలోనే ఈ దారుణాలకు తెగబడ్డాడు. ఆపై నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అఫన్.. పక్కన దాడి కోసం బైక్‌పై వెళ్తు క్రమంలో రికార్డైన దృశ్యంఅఫన్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తల్లి షమీ, ప్రియురాలు ఫర్సనా తీవ్ర గాయాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరోవైపు.. ఆత్మహత్యాయత్నం చేసిన అఫన్ ఆస్పత్రిలోనూ హల్చల్ చేశాడు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగి చికిత్సకు నిరాకరించాడు. దీంతో.. పోలీసుల సాయంతో బేడీలు వేయించి మరి బలవంతంగా అతనికి చికిత్స అందించారు.అఫన్కు డ్రగ్స్ అలవాటు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మత్తులోనే అఫన్ ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. తిరువనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. మరోవైపు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని, మంగళవారం అఫన్ను విచారణ జరుపుతామని వెంజరమూడు పోలీసులు చెబుతున్నారు. -
ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. డైరీలో ఆమె ఫోన్ నంబర్!
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదుగానీ తల్లితో కలిసి విగతజీవులుగా మారిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణాలు కేరళలో (Kerala) కలకలం రేపాయి. వారు ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు అకాల మరణం చెందారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.అసలేం జరిగింది?కొచ్చిలోని ఎకాముఖ్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. మృతులు శాలిని విజయ్, మనీశ్ విజయ్, శకుంతలగా గుర్తించారు. శాలిని.. జార్ఖండ్ (Jharkhand) సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆమె సోదరుడు మనీశ్.. ఐఆర్ఎస్ అధికారి. కొచ్చిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో అడిషనల్ కమిషనర్ ఉద్యోగం చేస్తున్నాడు. లివింగ్ రూములో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని మనీశ్ చనిపోయాడు. మరో గదిలో శాలిని నిర్జీవంగా కనిపించారు. వీరి తల్లి శకుంతల మృతదేహం తెల్లని వస్త్రంలో చుట్టివుందని, పూలు చల్లిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.మనీశ్ డైరీలో చెల్లెలి ఫోన్ నంబర్మనీశ్, శాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శకుంతల మరణానికి గల కారణాలు అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ‘శకుంతల మరణం సహజమా, మరేదైనా కారణాలు ఉన్నాయనేది అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంద’ని త్రిక్కకరా ఏసీపీ పీవీ బేబీ తెలిపారు. మనీశ్ డైరీలో ఫిబ్రవరి 15న రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు. తమకు సంబంధించిన కొన్ని పత్రాలను దుబాయ్‌లో (Dubai) ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాలని కోరుతూ, ఆమె ఫోన్ నంబరు కూడా అందులో రాశారు.టాపర్‌గా నిలిచి.. కేసులో ఇరుక్కుని.. శాలిని.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) 2003లో నిర్వహించిన మొదటి సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ పోటీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్ష ద్వారా 64 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో 2022, జూలైలో జార్ఖండ్ హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. శాలినితో పాటు మిగతా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27న జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో శాలిని మరణించడం చర్చనీయాంశంగా మారింది.ప్రొఫెసర్ శకుంతల శకుంతల బొకారో (Bokaro) ప్రాంతానికి చెందిన వారని, వీరి కుటుంబం రాంచీలో 2013 వరకు అద్దె ఇంటిలో ఉందని తెలిసింది. శకుంతల కుటుంబ సభ్యులు భక్తిభావంతో మెలిగేవారని, తమతో స్నేహంగా ఉండేవారని పొరుగింటివారు వెల్లడించారు. బొకారోలో శకుంతల ప్రొఫెసర్‌గా పనిచేసేవారని తెలిపారు. ఆమె మరో కుమార్తె పెళ్లిచేసుకుని రాజస్థాన్‌లో స్థిరపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాంచీ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో కలిసినప్పుడు మనీశ్ అప్యాయంగా పలకరించాడని.. అతడితో పాటు శాలిని, శకుంతల మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కాగా వీరి ముగ్గురి మరణానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.చదవండి: వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయంఅన్నికోణాల్లోనూ దర్యాప్తుశాలినిపై సీబీఐ కేసు కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శకుంతల సహజంగా చనిపోయివుంటే ఆమె మరణాన్ని తట్టుకోలేక కూతురు, కొడుకు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు
కేరళ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహంగా అదానీ గ్రూప్ వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం, అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉండబోతున్నట్లు తెలిపింది. ‘ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ 2025’ సందర్భంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఈమేరకు ప్రకటన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సదస్సును ప్రారంభించారు.కీలక పెట్టుబడి రంగాలువిజింజం పోర్టు అభివృద్ధి: రూ.20,000 కోట్ల పెట్టుబడిలో గణనీయమైన భాగాన్ని విజింజం పోర్టు అభివృద్ధికి మళ్లించనున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటికే ఈ ప్రాజెక్టులో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. విజింజం పోర్టును దేశంలోనే మొదటి ట్రాన్స్ షిప్మెంట్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యాన్ని 45 లక్షల ప్రయాణికుల నుంచి 1.2 కోట్లకు పెంచేందుకు అదానీ గ్రూప్ రూ.5,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇది విమానాశ్రయం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది.కొచ్చి లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్ హబ్: కొచ్చిలో లాజిస్టిక్స్, ఈ-కామర్స్ హబ్‌ను ఏర్పాటు చేసి అదానీ గ్రూప్ ఈ రంగంలో కేరళ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. సమర్థవంతమైన సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను ఈ హబ్ సులభతరం చేస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఈ-కామర్స్ పరిశ్రమకు మద్దతు ఇస్తుంది.సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు: కొచ్చిలో తన సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని అదానీ గ్రూప్ ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఈ పెట్టుబడి నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలకు తోడ్పడుతుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: మస్క్, బెజోస్‌ను మించిన ‘బ్లాక్‌పాంథర్’ సంపదఅభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..కేరళ పురోగతికి అదానీ గ్రూప్ కట్టుబడి ఉందని కరణ్ అదానీ నొక్కిచెప్పారు. కేరళ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఈ వృద్ధిలో అదానీ గ్రూప్ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. సంస్థ ప్రకటించిన ఈ పెట్టుబడులు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని చెప్పారు. స్థానిక వ్యాపారాలను పెంచుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. -
కేరళ కల సాకారం.. కష్టానికి తోడైన అదృష్టం.. తొలిసారి రంజీ ఫైనల్లోకి ప్రవేశం
‘ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడి కేరళ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. 68 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... 352 మ్యాచ్‌ల పోరాటం అనంతరం కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న కేరళ జట్టు... తీవ్ర ఉత్కంఠ మధ్య మాజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించి తొలిసారి తుదిపోరుకు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్‌ను వెనక్కి నెట్టిన కేరళ... ఇప్పుడు సెమీఫైనల్లో గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఒక్క పరుగే కదా అని తేలికగా తీసుకుంటే ... ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యర్థికి రుచి చూపింది. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. సుదీర్ఘ కాలంగా రంజీ ట్రోఫీ ఆడుతున్న కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ముంబై, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ మాదిరిగా తమ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినా... నిలకడ కనబరుస్తున్నప్పటికీ ఆ జట్టు తుదిపోరుకు మాత్రం అర్హత సాధించలేదు. తాజా సీజన్లో అసాధారణ పోరాటాలు, అనూహ్య ఫలితాలతో ఎట్టకేలకు కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. జమ్మూ కశ్మీర్‌తో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన కేరళ జట్టు... సెమీస్‌లో మాజీ చాంపియన్ గుజరాత్‌పై 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ చిరకాల కల నెరవేర్చుకుంది.నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ చివరి రోజు కేరళ జట్టు అద్భుతమే చేసింది. చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు తుదిపోరుకు అర్హత సాధించాలంటే మరో 29 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఇన్నింగ్స్ కొనసాగించగా... కేరళ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయి మొండిగా పోరాడుతున్న గుజరాత్ బ్యాటర్లు జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్‌లను కేరళ బౌలర్ ఆదిత్య వెనక్కి పంపాడు. ఇంకేముంది మరో వికెట్ తీస్తే చాలు కేరళ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం ఖాయమే అనుకుంటే... ఆఖరి వికెట్‌కు అర్జాన్ నాగ్వస్వల్లా, ప్రియజీత్ సింగ్ జడేజా మొండిగా పోరాడారు.పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన ఈ జంటను చూస్తే ఇక మ్యాచ్ కేరళ చేజారినట్లే అనుకుంటున్న తరుణంలో అర్జాన్ కొట్టిన షాట్ కేరళకు కలిసొచ్చింది. ఆదిత్య వేసిన బంతిని అర్జాన్ బలంగా బాదే ప్రయత్నం చేశాడు. బంతి షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్‌కు తాకి గాల్లోకి లేచి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కెప్టెన్ సచిన్ బేబీ చేతిలో పడింది. అంతే కేరళ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. స్టార్లు లేకుండానే... స్టార్ ఆటగాడు సంజూ సామ్సన్ భారత జట్టులో ఉండగా... అనుభవజ్ఞులైన విష్ణు వినోద్, బాబా అపరాజిత్ వంటి వాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అయినా ఈ సీజన్లో కేరళ జట్టు స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా మిడిలార్డర్లో కెప్టెన్ సచిన్ బేబీతో పాటు సీనియర్ ప్లేయర్ జలజ్ సక్సేనా... యువ ఆటగాళ్లు మొహమ్మద్ అజహరుద్దీన్, సల్మాన్ నిజార్ అసమాన పోరాటం కనబర్చారు.జమ్మూ కశ్మీర్‌తో క్వార్టర్స్ పోరులో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు సల్మాన్, అజహరుద్దీన్ కనబర్చిన తెగువను ఎంత పొగిడినా తక్కువే. 40 ఓవర్లకు పైగా జమ్మూ బౌలర్లను కాచుకున్న ఈ జంట వికెట్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించి తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఒక్క పరుగు ఆధిక్యంతో సెమీఫైనల్‌కు చేరింది.తాజాగా గుజరాత్‌తో సెమీస్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో కేరళ బ్యాటర్లు అసాధరణ ప్రదర్శన కనబర్చారు. సచిన్ బేబీ 195 బంతుల్లో 69 పరుగులు, జలజ్ సక్సేనా 83 బంతుల్లో 30 పరుగులు, అజహరుద్దీన్ 341 బంతుల్లో 177 పరుగులు, సల్మాన్ నిజార్ 202 బంతుల్లో 52 పరుగులు చేసి గుజరాత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముందు నుంచే చక్కటి గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెట్టిన కేరళకు చివర్లో అదృష్టం కూడా తోడవడంతో చక్కటి విజయంతో తొలిసారి రంజీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ చరిత్రలో కేరళ జట్టు ఇప్పటి వరకు అత్యుత్తమంగా 2018–19 సీజన్లో సెమీఫైనల్‌కు చేరింది.నిరీక్షణకు తెరదించుతూ.. తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో కేరళ జట్టు 1957లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫుట్‌బాల్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ వాసులు... క్రికెట్‌ను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో కేరళ క్రికెట్లో అనూహ్య మార్పు వచ్చింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్ స్ఫూర్తితో మరెందరో ఆటగాళ్లు క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నారు.అందుకు తగ్గట్లే గత కొన్నేళ్లుగా కేరళలో క్రీడా మౌలిక వసతులు మరింత మెరుగు పడటంతో ప్రతిభావంతులు వెలుగులోకి రావడం మొదలైంది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. అందుకే శుక్రవారం సెమీస్‌లో కేరళ జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో ప్రసార మాధ్యమాల్లో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా లక్షల్లో పెరిగింది. ప్రతిష్టాత్మక టోర్నీలో కేరళ టీమ్ ఫైనల్‌కు చేరగానే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు... తామే గెలిచినంతగా లీనమైపోయి జట్టును అభినందనల్లో ముంచెత్తారు. మౌలిక వసతుల్లో భేష్.. సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే కేరళలో ఒకప్పుడు నిరంతరం అవుట్డోర్ ప్రాక్టీస్ చేయడం కూడా కష్టతరంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఫస్ట్‌క్లాస్ మైదానాలు అందుబాటులోకి వచ్చాయంటే కేరళ క్రికెట్లో ఎంత పురోగతి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కృషి వల్లే కేవలం పెద్ద నగరాల నుంచే కాకుండా... ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా రంజీ జట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నారు.‘ముంబై, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి ఇతర జట్లతో పోల్చుకుంటే... కేరళ జట్టు ఎంపిక విభిన్నంగా ఉండేది. పరిమితమైన వనరులు మాత్రమే ఉండటంతో అందుబాటులో ఉన్నవాళ్లనే ఎంపిక చేసేవాళ్లం. ముందు ఆ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో అకాడమీలను స్థాపించాం. కేవలం ప్లేయర్లకే కాకుండా కోచ్‌లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒకప్పుడు వర్షం వస్తే ప్రాక్టీస్ ఆగిపోయేది. ఇప్పుడు ఇండోర్‌లోనూ నెట్స్ ఏర్పాటు చేశాం.2005లో రాష్ట్రంలో ఒక్క మైదానంలో కూడా లేదు. ఇప్పుడు మొత్తం 17 ఫస్ట్‌క్లాస్ గ్రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలో లేనంతమంది బీసీసీఐ లెవల్1 కోచ్‌లు కేరళలో ఉన్నారు’ అని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు మాథ్యూ తెలిపారు.కేరళ క్రికెట్ సంఘం కృషి వల్లే స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని... సెమీఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న అజహరుద్దీన్ వెల్లడించాడు. పరస్పర సహకారం, సమష్టితత్వంతో ముందుకు సాగడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నాడు. ఈనెల 26 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తుది పోరులోనూ కేరళ విజయం సాధిస్తే 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన దక్షిణాది జట్టుగా నిలుస్తుంది... ఆల్ ద బెస్ట్ కేరళ..! -
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో హైడ్రామా
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) సెమీ ఫైనల్లో హైడ్రామా చోటు చేసుకుంది. గుజరాత్‌తో (Gujarat) జరుగుతున్న తొలి సెమీస్‌లో కేరళ (Kerala) 2 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. రంజీ రూల్స్ ప్రకారం.. మ్యాచ్‌లో ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. గుజరాత్, కేరళ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం కాబట్టి, కేరళ విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరుకుంటుంది.Drama in the Ranji Trophy semifinals🤯pic.twitter.com/o8Bykc8Q4P— CricTracker (@Cricketracker) February 21, 2025కాగా, ఈ మ్యాచ్‌లో గుజరాత్.. కేరళకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. కేరళపై లీడ్ సాధించేందుకు కేవలం మూడు పరుగులు అవసరమైన తరుణంలో గుజరాత్ ఆఖరి ఆటగాడు సగస్వల్లా ఔటయ్యాడు. నగస్వల్లా బౌలర్ ప్రతిభ కారణంగా ఔటై ఉంటే గుజరాత్ అంత ఫీల్ అయ్యేది కాదు. నగస్వల్లా కొట్టిన షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ సల్మాన్ నిజర్ హెల్మెట్‌కు తాకి స్లిప్స్‌లో ఉన్న సచిన్ బేబి చేతుల్లోకి వెళ్లింది. దీంతో నగస్వల్లా పెవిలియన్ ముఖం పట్టాడు. అప్పటివరకు బాగా ఆడిన నగస్వల్లా ఔట్ కావడంతో గుజరాత్ శిబిరంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. తాము ఫైనల్‌కు చేరలేమన్న విషయం తెలుసుకుని గుజరాత్ ఆటగాళ్లు కృంగిపోయారు. తృటిలో గుజరాత్‌కు ఫైనల్ బెర్త్ మిస్ అయ్యింది. ఈ సీజన్లో కేరళను లక్కీ జట్టుగా చెప్పాలి. క్వార్టర్ ఫైనల్లోనూ ఆ జట్టు ఇలాగే స్వల్ప ఆధిక్యంతో (ఒక్క పరుగు) సెమీస్‌కు చేరుకుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.స్కోర్ల విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో అదరగొట్టడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు. -
జైమీత్ పోరాటం
అహ్మదాబాద్: జైమీత్ పటేల్ (161 బంతుల్లో 74 బ్యాటింగ్; 2 ఫోర్లు), సిద్ధార్థ్ దేశాయ్ (134 బంతుల్లో 24 బ్యాటింగ్; 1 ఫోర్) మొండి పట్టుదలతో ఆడటంతో... గుజరాత్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరువైంది. కేరళతో జరుగుతున్న సెమీఫైనల్లో ఓవర్‌నైట్ స్కోరు 222/1తో గురువారం నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ జట్టు... ఆట ముగిసే సమయానికి 154 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. ఫలితం తేలడం కష్టమైన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టే ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమైంది. అంతకుముందు కేరళ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా... ప్రస్తుతం చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ మరో 29 పరుగులు చేస్తే కేరళ స్కోరును దాటేస్తుంది. ప్రియాంక్ పాంచాల్ (237 బంతుల్లో 148; 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ ఖాతాలో వేసుకోగా... మనన్ హింగ్రాజియా (127 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (43 బంతుల్లో 25; 3 ఫోర్లు), హేమంగ్ పటేల్ (41 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్ చింతన్ గాజా (2), విశాల్ జైస్వాల్ (14) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చివర్లో సిద్ధార్థ్ దేశాయ్‌తో కలిసి జైమీత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ పక్క పరుగులు సాధిస్తూనే... ఓవర్లు కరిగించాడు. ఈ జంట అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 220 బంతుల్లో 72 పరుగులు జోడించింది. ఓవరాల్‌గా గురువారం 83 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 207 పరుగులు చేసింది. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 4 వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: 457; గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బి) జలజ్ సక్సేనా 148; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జలజ్ సక్సేనా 33; ఉర్విల్ పటేల్ (స్టంప్డ్) అజహరుద్దీన్ (బి) జలజ్ సక్సేనా 25; హేమాంగ్ పటేల్ (సి) (సబ్) రోజర్ (బి) నిధీశ్ 27; జైమీత్ పటేల్ (బ్యాటింగ్) 74; చింతన్ గాజా (ఎల్బీడబ్ల్యూ) (బి) జలజ్ సక్సేనా 2; విశాల్ జైస్వాల్ (సి) బాసిల్ (బి) ఆదిత్య 14; సిద్ధార్థ్ దేశాయ్ (బ్యాటింగ్) 24; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (154 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 429. వికెట్ల పతనం: 1–131, 2–238, 3–277, 4–292, 5–320, 6–325, 7–357. బౌలింగ్: నిధీశ్ 23–4–86–1; జలజ్ సక్సేనా 61–12–137–4; బాసిల్ 22–1–59–1; ఆదిత్య సర్వతే 36–3–104–1; అక్షయ్ చంద్రన్ 11–0–31–0; ఇమ్రాన్ 1–0–3–0. -
గిరిజన పిల్లల కోసం ఆ టీచర్ ప్రాణాలనే..!
‘ఎవరైనా సరే బతకడానికి ఉద్యోగం చేస్తారు. చావడానికి కాదు’ అని ఎంతోమంది అన్నలక్ష్మితో అనేవారు. ఇంతకీ ఆమె చేస్తున్న ఉద్యోగం ఏమిటి? కేరళలోని చిన్నార్ అభయారణ్యంలో ఉన్న మారుమూల గిరిజన గ్రామం తయ్యన్నన్‌కుడిలోని ఏకైక అంగన్వాడీలో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.అన్నలక్ష్మి ఉద్యోగ జీవితం రిస్క్, సాహసంతో కూడుకున్నది. వారం రోజుల క్రితం అటవీమార్గంలో జనావాసాలకు వచ్చిన అడవి ఏనుగు నుంచి తృటిలో తప్పించుకుంది. కొన్ని రోజుల క్రితం అదే ఏనుగు ఒక గిరిజనుడిని తొక్కి చంపేసింది. అయినప్పటికీ అన్నలక్ష్మి ఎప్పుడూ భయపడలేదు.విద్యార్థుల దగ్గరికి వెళ్లడానికి గత పదిహేడు సంవత్సరాలుగా మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ లేని అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూనే ఉంది. ప్రయాణ మార్గంలో జంతువుల అడుగు జాడలు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అడవి ఏనుగులు వెంబడించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో పెద్ద పెద్ద రాళ్లు, చెట్ల వెనుక దాక్కొని తప్పించుకుంది.38 ఏళ్ల అన్నలక్ష్మి జీవితంలో అరణ్యం, గిరిజన తెగలు భాగం అయ్యాయి. స్థానిక ముత్తువన్ భాషను అనర్గళంగా మాట్లాడే అన్నలక్ష్మి గిరిజన ప్రజలకు ప్రియమైన ఉపాధ్యాయురాలు.‘పిల్లలు ఇంట్లో కంటే టీచర్ దగ్గర ఉండడానికే ఇష్టపడతారు’ అంటుంది ఒక గిరిజన తల్లి.‘ఉద్యోగ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల అమాయక ముఖాలను గుర్తు తెచ్చుకుంటే ఎంతో శక్తి వస్తుంది. నా వృత్తి జీవితానికి వారే వెలుగు’ అంటుంది అన్నలక్ష్మి. (చదవండి: మూడు నెలల తరువాత.... గ్రేహౌండ్స్ దొరికిందహో!)