2017 మణిమండపం పునర్నిర్మాణంలో ఉన్నికృష్ణన్ పొట్టి పాత్ర ఉందా? | Sabarimala Manimandapam Renovation And The Controversial Role Of Unnikrishnan Potti, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

2017 మణిమండపం పునర్నిర్మాణంలో ఉన్నికృష్ణన్ పొట్టి పాత్ర ఉందా?

Jan 19 2026 11:27 AM | Updated on Jan 19 2026 12:07 PM

Sabarimala Manimandapam Renovation and the Controversial Role of Unnikrishnan Potti

పతనంతిట్ట: శబరిమల బంగారం దొంగతనం కేసులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి, గతంలో శబరిమల ఆలయంలో స్పాన్సర్‌గా వ్యవహరించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అడ్వకేట్ కమిషనర్ హైకోర్టుకు సమర్పించిన పత్రాలలో ఈ వివరాలు బయటపడ్డాయి.

ద్వారపాలక ఫలకాలను ఏర్పాటు చేయడానికి ముందు, పొట్టి మాలమండపం (ప్రస్తుతం మణిమండపం) నిర్మాణానికి స్పాన్సర్‌గా  ఉన్నారని నివేదికలో తేటతెల్లమైంది. 2017లో మణిమండపంలోని స్తంభాలు, గంటలు పునర్నిర్మించబడ్డాయి. పవిత్రమైన పతినేట్టం పడి (పద్దెనిమిది మెట్లు) సమీపంలోని రెండు స్తంభాలు, గంటల పునరుద్ధరణలో ఆయన సహకారం అందించినట్లు సమాచారం.

ఉల్లాటన్ యోధునితో సంబంధం ఉన్న ఈ మండపం అసలు పేరు ‘మాల’ కాగా, మొదట మాలమండపం అని పిలిచేవారు. తరువాత దీనిని మణిమండపం అని పిలవడం ప్రారంభమైంది. ఈ ఏర్పాటుకు స్పాన్సర్ కోఆర్డినేటర్గా పరుమల అంతన్ ఆచారి వ్యవహరించారు. 

నివేదిక ప్రకారం, పొట్టి తన సొంత డబ్బు ఖర్చు చేయలేదు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు ఈ నిధులను అందించారని, స్పాన్సర్షిప్ కోసం అడ్వకేట్ కమిషనర్‌కు ఇమెయిల్ పంపినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. 

కాగా, శ్రీ అయ్యప్ప తిడంబులో చేసిన మార్పులపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారత జనాభా లెక్కల్లో ఇది పురాతన తిడంబుగా పరిగణించబడుతున్నప్పటికీ, ప్రస్తుతం కనిపిస్తున్నది కొత్తగా ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. దేవస్వం అధికారులకు ఈ మార్పుల గురించి సమాచారం ఉందా అనే అంశంపై భక్తులు సమాధానాలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement