తిరువనంతపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబల మేడుపై మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దాంతో శబరిమల స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిపోయింది.
శబరిమలలో ప్రతి ఏడాది దర్శనమిచ్చే మకరజ్యోతికి ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి వేళ శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడుపై మకరజ్యోతి దర్శనమివ్వనుంది. ఈ ఏడాది జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈరోజు సాయంత్రం 6:30 నుంచి 6:45 గంటల మధ్య మకరజ్యోతి కనిపించింది.

అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మకరజ్యోతిని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో చూసి చివరకు మకరజ్యోతిని దర్శించుకున్నారు. మరొకవైపు కోట్లాది మంది భక్తులు వివిధ మాధ్యమాల ద్వారా పరోక్షంగా వీక్షించారు.
#makarajyothy #MakaraSankranti pic.twitter.com/cAiW4lec1n
— Lokesh journo (@Lokeshpaila) January 14, 2021


