తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలని నివారించడమే లక్షంగా కేంద్ర మోటారు వాహన చట్టాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు ప్రకటించింది. ఒక వ్యక్తిపై సంవత్సరంలో ఐదు కంటే ఎక్కువ సార్లు చలాన్లు ఉంటే అతని లైసెన్సును రద్దు చేసే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా కేరళ ప్రభుత్వం వాహన చట్టంలో కీలక మార్పులు చేసింది. వాహనానికి చలాన్లు పడ్డ 45 రోజుల్లోపు వాటిని చెల్లించకుంటే సదరు వాహనాలను జప్తు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. వెహికిల్‌పై చలాన్ పడ్డ సమయంలో దానిని వేరే వారు నడుపుతున్నట్లయితే దానిని నిరూపించాల్సిన బాధ్యత సదరు వాహన యజమానిపై ఉంటుందని తెలిపింది.
వెహికిల్‌కు సంబంధించిన పెండింగ్ చలాన్లు చెల్లించాలు పరివాహన్ అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారానే చెల్లించాలని తెలిపింది. అదేవిధంగా పెండింగ్ చలాన్లపై ఎవైనా ఫిర్యాదులుంటే సదరు వాహనదారుడు కోర్టును సంప్రదించవచ్చని పేర్కొంది.


