breaking news
Politics
-
Bihar Elections: గేదెనెక్కి ఒకరు.. సంకెళ్లతో మరొకరు.. తెగ నవ్విస్తున్న అభ్యర్థులు
పట్నా: బీహార్‌కు ఎన్నికల పండుగొచ్చింది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో చిత్రవిచిత్రాలు మీడియా కంటపడుతున్నాయి. నామినేషన్లకు వస్తున్న అభ్యర్థులు అందరినీ అకట్టకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు గేదెపై ఊరేగుతూ నామినేషన్ వేసేందుకు వస్తుండగా, మరికొందరు చేతులకు సంకెళ్లు వేసుకుని, మద్దతుదారులను వెంటేసుకుని వస్తున్నారు. गोपालगंज के बरौली में हथकड़ी में बंद धर्मेंद्र कुमार 'क्रांतिकारी' पुलिस की सुरक्षा में नामांकन करने पहुंचे. हथकड़ी हाथ में थी, आंखों में आंसू थे, और जुबान पर गाना था. लोगों की भीड़ जमा हो गई, कोई वीडियो बना रहा था, कोई लाइव चला रहा था.नेताजी बोले, “मैं साजिश का शिकार हूं, जनता… pic.twitter.com/kW5ZXwomWF— NDTV India (@ndtvindia) October 19, 2025లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చెందిన జనశక్తి జనతాదళ్ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర కుమార్ శుక్రవారం బరౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఈ సందర్బంగా అతని చేతులకు సంకెళ్లు ఉన్నాయి. ఈయన కలెక్టరేట్ వద్దకు చేరుకోగానే విలేకరులు, జనం ఆయన చుట్టూ గుమిగూడారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ ‘నేను కుట్రకు బలైపోయాను. అయితే ఇప్పుడు ప్రజల నుండి న్యాయం కోరుకుంటాను’ అని అన్నారు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. तेज प्रताप यादव के प्रत्याशी अरुण यादव भैंस पर चढ़कर नामांकन करने पहुंचे#BiharElection2025 pic.twitter.com/X86XD0BRjo— NDTV India (@ndtvindia) October 18, 2025ఇదేవిధంగా అర్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దిగిన అరుణ్ యాదవ్ తన నామినేషన్ దాఖలు చేసేందుకు గేదెపై స్వారీ చేస్తూ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. ఇది అక్కడున్నవారిని అమితంగా ఆకట్టుకుంది. లాలూ యాదవ్ ఫొటోను పట్టుకుని.. ‘రాజకీయాల్లో తన ఏకైక రోల్ మోడల్ లాలూ అని, అతని ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాను" అని అరుణ్ యాదవ్ మీడియాకు తెలిపారు. తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీకి చెందిన అభ్యర్థులు విచిత్ర తీరుతెన్నులతో నామినేషన్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్లకు తరలిరావడం విశేషంగా మారింది. -
ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు’’ అంటూ కొలికపూడి మండిపడ్డారు.తిరువూరులో కిషోర్ ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా -
బీహార్ ఎన్నికలు.. ఎన్డీయే కూటమికి బిగ్ షాక్
పట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly Election) ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే(NDA Alliance) కూటమికి ఊహించని షాక్ తగిలింది. మధుర అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా నిలిచిన సీమా సింగ్(Seema Singh) నామినేషన్ రద్దైంది. దీంతో, మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీలో లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీల మధ్య ఉండనుంది.వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా సీమా సింగ్ నామినేషన్ వేశారు. మొదటి విడత నామినేషన్ వేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ కావడంతో ఆమె.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులు శనివారం పరిశీలించగా సీమా సింగ్ నామినేషన్లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు చేసినట్లు డిప్యూటీ ప్రొవిన్షియల్ ఎలక్షన్ ఆఫీసర్ (డీపీఆర్వో) ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, ఈ నియోజకవర్గంలో నామినేషన్లో లోపం కారణంగా సీమా సింగ్‌తో పాటు మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు.సినిమా నుంచి పాలిటిక్స్‌లోకి.. సీమా సింగ్ పలు భోజ్‌పురి సినిమాల్లో నటించారు. తన మార్క్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమా రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చి అందరనీ ఆశ్చర్యపర్చారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ తనకు మధుర స్థానాన్ని కేటాయించిన తర్వాత ఆమె చాలా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి రాజకీయంగా యాక్టివ్‌గా ప్రచారం చేసుకుకున్నారు. మరోవైపు.. ఆమె తన అఫిడవిట్లో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై ప్రజల్లో మరింత ఫోకస్ పెరిగింది. ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీమా సింగ్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా షేక్‌పురాలో ఆమె హోలీ నిర్వహించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీకి గడువు నవంబర్ 22తో ముగియనుంది. -
Bihar Elections: బీజేపీపై ఆగ్రహం.. స్వతంత్రంగా పోటీ.. క్షణంలో మారిన సీన్
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ పోలింగ్నకు సంబంధించి, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలో ఒక ఉదంతం మీడియా దృష్టిని ఆకర్షించింది. భాగల్పూర్ బీజేపీ టికెట్ లభించకపోవడంతో కలత చెందిన మాజీ కేంద్ర మంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శశ్వత్ చౌబే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో వచ్చిన ఒక ఫోన్ కాల్‌తో క్షణంలో అతని నిర్ణయం మారిపోయింది.నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి అర్జిత్ శశ్వత్ చౌబే జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగానే, అతని మద్దతుదారులు అతనికి పూలమాలలు వేసి, మరింత ఉత్సాహపరిచారు. ఇంతలో శశ్వత్ చౌబే ఫోన్ రింగ్ అయ్యింది. అదే సమయంలో అతనితో మాట్లాడేందుకు విలేకరులు వేచివున్నారు. శశ్వత్ చౌబే తనకు వచ్చిన కాల్ తీసుకుని, నామినేషన్ పత్రాలను దాఖలు చేయకుండా వెనుదిరిగారు. తరువాత తాను ఊహించని విధంగా యూ టర్న్ తీసుకోవడానికి గల కారణాన్ని మీడియాకు వివరించారు.తన తండ్రి అశ్విని చౌబే సూచనల మేరకు బీజేపీలోనే ఉంటానని శశ్వత్ చౌబే స్పష్టం చేశారు. తన తండ్రి మాటను మన్నిస్తూ, ఆయనకు గౌరవాన్నిస్తూ, ఎన్నికల్లో పోటీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే, బీజేపీ అగ్ర నాయకత్వం నుండి ఒత్తిడిని ఎదురయ్యిందని శశ్వత్ చౌబే పేర్కొన్నారు.‘ఈరోజు, నా తల్లిదండ్రులు నాతో మాట్లాడారు. ఇది బీజేపీ అగ్ర నాయకత్వం నుండి వచ్చిన సూచన. నేను వారికి అవిధేయునిగా ఉండలేను. నేను నా పార్టీకి, దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేను.వారిని వ్యతిరేకించలేను’ అని శశ్వత్ చౌబే మీడియాకు తెలిపారు. -
ఆ రెండు పార్టీలు తలచుకుంటే ఆపేదెవరు?
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతు న్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీసీ రిజర్వేషన్ల పెంపుదలను ఎవరు ఆపగలరు? అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటులో బీజేపీకి 240, కాంగ్రెస్‌కు 99 మంది ఎంపీల బలం ఉన్నా బీసీలను మభ్య పెడుతూ ఢిల్లీలో కొట్లాడకుండా గల్లీలో డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్పుడు కులగణన చేయని కాంగ్రెస్, నాలుగేళ్లుగా జనగణనను వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ.. బీసీలపై కపట ప్రేమ చూపుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలకు మంత్రిత్వ శాఖను కోరిందే కేసీఆర్: కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కేసీఆర్ కోరా రని, బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ అసెంబ్లీలో రెండు సార్లు తీ ర్మానం చేయడంతో పాటు ప్రధానిని కూడా స్వయంగా కలిశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. జనాభా సంఖ్యకు అనుగుణంగా రిజర్వే షన్లు కావాలని కోరుతున్న రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రైవే టు బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. -
గులాబీ సైన్యమంతా ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ప్రచారపర్వంలో సర్వశక్తులూ ఒడ్డుతోంది. నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఓటరును కలవడం లక్ష్యంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా మరోవైపు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు సుమారు 60 మంది క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటున్నారు. స్థానిక కేడర్‌తో సమన్వయంజూబ్లీహిల్స్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు డివిజన్లలో సంపూర్ణంగా, మరో మూడు డివిజన్లలో పాక్షికంగా విస్తరించి ఉంది. యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, షేక్‌పేట, బోరబండ డివిజన్లు పూర్తిగా, శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ డివిజన్లు పాక్షికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. డివిజన్ వారీగా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. వీరు స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. బయటి నియోజకవర్గాల నుంచి వచ్చిన 60 మంది ముఖ్యనేతలకు మూడు లేదా నాలుగు పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ముఖ్యనేత తమతోపాటు వచ్చిన అనుచరులతో కలిసి తమకు కేటాయించిన బూత్‌లలో ప్రచారం చేస్తున్నారు. అలాగే, బయటి నుంచి సుమారు వేయి మంది జెడ్పీటీసీ, ఎంపీపీ స్థాయి నేతలు ప్రచారానికి తరలివచ్చినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బూత్‌ల వారీగా ముఖాముఖి సమావేశం నిర్వహించి ఇన్‌చార్జీలకు ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. భారీగా నకిలీ ఓటర్లు నమోదయ్యారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఓటరు జాబితాను వడపోస్తూ అసలైన ఓటర్లను చేరుకోవాలని భావిస్తోంది.సాదాసీదాగా నామినేషన్నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగా సాగేలా బీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే మూడు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఈ నెల 19న మరో సెట్ దాఖలు చేయనున్నారు. 19న భారీ ర్యాలీ నిర్వహించాలని భావించినా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కేటీఆర్, హరీశ్‌రావు రోడ్ షోలు, హాల్ మీటింగ్స్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది: వైఎస్సార్సీపీ
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం 16 నెలలు తర్వాత ఉద్యోగులతో హడావుడిగా చర్చలు జరిపి ఒకే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడంపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందంటూ విమర్శించింది. ఈరోజు( శనివారం, అక్టోబర్ 18వతేదీ) పెన్షనర్ల సంఘ నాయకులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి సమావేశాలు జరిపి ఒక్క విడత డి ఏ మాత్రమే అనౌన్స్ చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, 4 విడతలు డిఏ పెండింగ్ ఉంటే ఒకటి విడత మాత్రమే మంజూరు చేయడం, ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు మాట ఎత్తక పోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేక పోతోంది దీపావళి పండుగకు ఇవి తప్పక ఇస్తారని ఎదురు చూశారు కానీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి దీపావళి కానుక ఒక్క డీ ఏతో తుష్ మనిపించారు’ అని విమర్శించారు.కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి చూపెట్టారు. ఉద్యోగులకు ఐఆర్‌పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు.. పీఆర్సీపైనా కూడా నోరు మెదపలేదు. వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు.. కేవలం సింగిల్ డీఏతో సరిపెట్టేశారు. నాలుగు డీఏల్లో ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇక, ఐఆర్, పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులుకు కేవలం ఒక డీఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది. చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపినప్పటికీ, చివరికి ఒక డీఏనే ప్రకటించారు చంద్రబాబు. మరొకవైపు పెండింగ్ బకాయిల అంశానికి సంబందించి కూడా ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. -
‘దండుపాళ్యం’ పాలన ఎవరిదో అందరికీ తెలుసు
హైదరాబాద్: ‘దండుపాళ్యం’ పాలన అంటే ఎవరిదో అందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అందుకే గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారం లేదన్న అసహనం, నిరాశలో ‘కేబినేట్’పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మంత్రుల మధ్య కుమ్ములాటలు, కేబినేట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారంతా సినిమాల్లో ‘రచయితలు’ గా ప్రయత్నించాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినేట్ సమష్ఠిగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమిస్తున్న మా మంత్రులకు ప్రత్యేకంగా వ్యక్తిగత అజెండా అంటూ ఏదీ లేదన్నారు. మాకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలే మా అందరి అజెండా అని తేల్చి చెప్పారు. మేం వేసే ప్రతి అడుగు రాష్ట్రాభివృద్ధి కోసమేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహాలకు తావు లేదని స్పష్టం చేశారు. ‘విలువ ఆధారిత వృద్ధే’ లక్ష్యంగా మా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందన్నారు. మేం పాలనను గాలికొదిలేస్తే గత 20 నెలల్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. మంత్రులంతా వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకుంటే "ఎలీ లిల్లీ" లాంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మాది మాటల ప్రభుత్వం కాదని... చేతల్లో చేసి చూపించే ప్రజా ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. మీ అహంకారపూరిత వ్యవహారశైలి, పాలనా వైఫల్యాల చరిత్రను దాచుకునేందుకు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను నమ్మరని గుర్తు చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.6 నెలల్లోనే రూ.12,864 కోట్ల ఎఫ్‌డీఐలు..‘పారిశ్రామికాభివృద్ధి విషయంలోనూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) ఆకర్షణలో తెలంగాణ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్ డీఐలు వచ్చాయి. 2023–24లో ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనే టాప్ – 3 అర్బన్ ఎఫ్ డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘2023-24లో పరిశ్రమల జీఎస్ వీఏ రూ.2.46 లక్షల కోట్లు. అది 2024-25లో 12.6 శాతం పెరిగి రూ.2.77 లక్షల కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 8.68 శాతం. గతేడాదితో పోలిస్తే 2.1 శాతం అధికంగా నమోదయ్యింది. అదే జాతీయ సగటు వృద్ధి రేటు 6.2 శాతం మాత్రమే’ అని పేర్కొన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
కానీ.. ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పాలకులు యువత ఆకాంక్షలను రాజకీయాల కోసం వాడుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. వారి కుటుంబం కోసమే గత పాలకులు ఆలోచించారు. గత పాలకులు నిజాం నవాబులతో పోటీపడి సంపద పెంచుకున్నారంటూ ఆరోపించారు.‘‘గత పదేళ్లలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేదు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. ఎకరానికి రూ.కోటి సంపాదించే విద్య ఉందని గత పాలకులు చెప్పారు. కానీ ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు. గత పాలకులు వారి కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నారు. కానీ గ్రూప్-2 నియామకాలు చేపట్టాలని ఆలోచించలేదు’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పదిహేనేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా?. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నాం...మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్-1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్..మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలి. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి. గత పాలకుల పాపాల పుట్ట పలుకుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
ఐవీఆర్ఎస్ కాల్స్‌తో వైఎస్సార్సీపీపై విష ప్రచారం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పెద్దల ప్రోత్సహాంతో నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్‌తో వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్యతో లింక్ చేస్తూ, నకిలీ మద్యం దందాపై ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న చంద్రబాబుకు నిజంగా దీనిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐ విచారణ కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ దందాలో కిలారు రాజేష్, నారా లోకేష్‌ల దోపడీ వ్యవహారం బయటపడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు నేతృత్వం లోని ప్రభుత్వం నకిలీ మద్యం రాకెట్‌ను ప్రోత్సహిస్తూ మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున అమ్ముతోంది. ఈ విషయం కాస్తా బయటపడిపోవడం, ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న టీడీపీ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని అసహ్యించుకుంటున్నారు. దీని నుంచి బయటపడటానికి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరమీదికి తీసుకువచ్చి, వైఎస్సార్సీపీకి ఆ బురద అందించేందుకు సిద్ధమయ్యాడు.అందులో భాగంగానే నిందితుడు జనార్థన్‌తో మాజీ మంత్రి జోగి రమేష్‌పై తప్పుడు ఆరోపణలు చేయించాడు. ఈ విషయాలను ప్రజలు నమ్మడం లేదని తెలిసి, పదేపదే ఈ నిందను వైఎస్సార్సీపీపై మోపుతూ పెద్ద ఎత్తన ప్రచారం చేయించేందుకు తెగబడ్డాడు. దీనిలో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు ఫోన్లు చేయించి, ముందుగా రికార్డు చేసిన మెసేజ్‌ను వారి మెదళ్ళలో జొప్పించేందుకు దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు.ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్టగత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా 'మీ భూమిని వైయస్ జగన్ లాగేసుకుంటున్నారు, మీ భూములకు రక్షణ లేదంటూ' ఒక ఫేక్ న్యూస్‌ను విస్తృతంగా ప్రచారం చేసి లభ్దిపొందారు. తిరిగి ఇప్పుడు టీడీపీ కార్యాలయం నుంచి ప్రజలకు మళ్ళీ అటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. నకిలీ మద్యం దందాలో కీలక నిందితుడు జనార్థన్‌రావు వాయిస్‌తో ఉన్న ఐవీఆర్ఎస్ కాల్స్‌లో జోగి రమేష్‌పై చేసిన ఆరోపణలను వినిపిస్తూ, నకిలీ మద్యం అంతా కూడా వైయస్ఆర్సీపీ వారే చేశారనే ఫేక్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. (టీడీపీ నేతలు చేయిస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ ఆడియోను ప్రదర్శించారు) తెలుగుదేశంకు ఈ నకిలీ మద్యం దందాతో సంబంధం లేకపోతే ఎందుకు పనిగట్టుకుని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జనార్థన్ వాయిస్‌తో జోగి రమేష్ పేరు చెప్పిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి.నాణ్యమైన లిక్కర్ అంటూ నకిలీ లిక్కర్ ఇస్తున్నాడుప్రజాస్వామ్యంలో ఇటువంటి నికృష్టపు రాజకీయాలు ఒక్క చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేయలేదు. చంద్రబాబు పేరు చెబితే నేడు ప్రజలకు నకిలీ మద్యం దందానే గుర్తుకు వస్తోంది. మందుబాబులకు నాణ్యమైన మద్యంను ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీలు గుప్పించాడు. ప్రబుత్వ ఆధీనంలోని మద్యంను ప్రైవేటువారి చేతికి ఇస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ నకిలీ మద్యం తాగి అనేక మంది చనిపోయారు. నేడు అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నకిలీ మద్యం దందాను ప్రారంభించాడు. నాణ్యమైన మద్యం, తక్కువ రేటుకు ఇస్తానంటూ హామీలు ఇస్తే మద్యం తాగే అలవాటు ఉన్న వారు చంద్రబాబు మాటలపై ఎంతో ఆశలు పెంచుకున్నారు.కానీ నేడు నాణ్యమైన మద్యం సంగతి పక్కకుపెట్టి, నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకువచ్చాడు. ఈ విషయం ప్రజల ముందు బయటపడిపోవడంతో, దాని నుంచి బయట పడేందుకు తన హయాంలోనే జరిగిన వివేకా హత్యకేసు, సీబీఐ విచారణలో ఉన్న ఆ కేసుపైన కూడా తప్పుడు వక్రీకరణలు చేస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. ఇటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసే బదులు నకిలీ మద్యం దందాపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు కోరాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. వివేకా హత్యకేసు ఇప్పటికే సీబీఐ పరిధిలో ఉంది. నకిలీ మద్యంను, వివేకా హత్య కేసును ఎలా ముడిపెడతారు? ప్రజలను పక్కదోవ పట్టించేందుకే ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం ఏ షాప్‌ల్లో ఉందో ప్రజలను ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అడగాలి. చంద్రబాబు నకిలీ మద్యం తాగి చనిపోయిన ప్రతి ప్రాణం ఉసురు ఆయనకు తగిలితీరుతుంది.చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండిఐవీఆర్ఎస్ కాల్స్‌లో తప్పుడు ప్రచారాలు మాని… మీకు ధైర్యం, నిజాయితీ ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నారా లోకేష్‌తో అయినా చెప్పించండి. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు? ఏయే షాపుల్లో గుర్తించారు? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీల నుంచి సరఫరా చైన్ ఏంటి? ఎవరెవరు వాటిని కొన్నారు? ఏయే లిక్కర్ షాపులు అమ్మాయి? ఎక్కడెక్కడ బెల్టుషాపులకు సప్లై అయ్యాయి? ఇది బయటకు రావడం లేదంటే.. ఇదంతా మీరు నడిపించిన మాఫియా కదా? అద్దేపల్లి జనార్దన్‌ను మీరు రప్పించారా? తనే వచ్చాడా? తాను వస్తున్నట్టుగా మీకు తెలిస్తే.. ముంబై వెళ్లి ఎందుకు అరెస్టు చేయలేదు? అంతకుముందు రెడ్‌కార్నర్ నోటీసు ఎందుకు జారీచేయలేదు? పరస్పర సహకార ఒప్పందం వెనుక మతలబు ఏమిటో చెప్పాలి.అద్దేపల్లి జనార్థన్ ఫోన్ ఎక్కడ ఉంది?అద్దేపల్లి జనార్దన్ తన ఫోను ముంబైలో పోయిందని చెప్పారు. ఆ ఫోన్లో జోగిరమేష్‌తో చాట్ చేసినట్టుగా మరోవైపు లీక్ చేయించారు. పోయిన ఫోన్ నుంచి చాటింగ్ స్క్రీన్ షాట్ ఎలా బయటకు తీశారు? ఇదెలా సాధ్యమైంది? జనార్దన్‌ను ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. జనార్దన్ లాయర్ల సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు. మరి మీ కస్డడీలో ఉన్నప్పుడు జనార్దన్ ఎలా వీడియో తీసుకున్నాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగాడు? అదీ అతనికి ఫోన్లేకుండా? ఈ మాయా మర్మం ఏంటి మహానుభావా? నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె నుంచి పోటీచేసిన మీ పార్టీ నాయకుడు జయచందరారెడ్డి తనకు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయని, ఆఫ్రికాలో ఉన్నాయని నేరుగా అఫిడవిట్లో పెట్టారు.మీకు ఇవన్నీ తెలిసే గత ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికోసం సీనియర్, మాజీ ఎమ్మెల్యే అయిన శంకర్‌యాదవ్‌ను నట్టేటా ముంచిన మాట వాస్తవం కాదా? ఈ టిక్కెట్లు ఇవ్వడానికి నడిచిన క్యాష్… సూట్‌కేస్… రాజేష్.. లోకేష్.. వ్యవహారం మీద మీకు విచారణ చేసే దమ్ము ఉందా? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబరు 3న బయటపడితే ఇవ్వాళ్టికి 16 రోజులు అయ్యింది. ఇప్పటికీ జయంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. రెడ్‌కార్నర్ నోటీసు జారీచేయలేదు. పాస్ పోర్టు రద్దు చేయాలంటూ మీ జేబులో సిట్ దరఖాస్తు కూడా చేయలేదు. కారణం ఏంటో…? స్తుతి మెత్తని, సానుకూలత పద్ధతులు ఎందుకు? మీకు మీకు ఉన్న ఒప్పందాలు ఏంటి?కిలారు రాజేష్, లోకేష్‌ల గుట్టు బయటపడుతుందని భయంజయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డి, పీఏ రాజేష్లనుకూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? నన్ను ఇబ్బందిపెడితే కిలారు రాజేష్, లోకేష్‌ల గట్టువిప్పుతానని జయంద్రారెడ్డి మీకు గట్టి హెచ్చరిక పంపినట్టుగా తెలుస్తోంది. ఈ స్టోరీపై కాస్త స్పందిస్తారా? కనీసం లోకేష్ అయినా మాట్లాడతాడా? మీ నకిలీ మద్యం అమ్మకానికి అడ్డురాకుండా మీరు అద్భుతమంటూ ప్రచారం చేసిన రూ.99ల లిక్కర్ సప్లైని తగ్గించేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అద్భుతమైన ఈ రూ.99ల సరుకు ఎంత అమ్మారు? నెలల వారీగా… వివరాలు బయటపెట్టగలరా? మీరు డాష్‌బోర్డు సీఎం కదా? కనీసం ఆ ముఖేష్‌కుమార్ మీనా కైనా చెప్పండి. పాపం మిమ్మల్ని కవర్ చేయలేక, ఆయన్ని ఆయన కాపాడుకోలేక తెగ ఇబ్బందిపడుతున్నాడు. దీంతో పాటు గతంలో ఉన్న బ్రాండ్లు, వాటి రేట్లు, ఇప్పుడున్న బ్రాండ్లు వాటి రేట్లు, మీరు కొత్త పాలసీ తెచ్చిన తర్వాత నెలవారీగా వాటి విక్రయాలు, అలాగే ఆయా డిస్టలరీలకు ఇచ్చిన ఆర్డులు, వాటి నుంచి సప్లై, చెల్లించిన మొత్తాలు.. ఇవి బయటపెడితే బాగుంటుంది. మీరు బయటపెట్టకపోయినా ఎలాగూ.. మేం వచ్చాక బయటపెడతాం. అందులో సందేహం లేదు. చంద్రబాబూ.. రూల్ ప్రకారం బార్లకు సెపరేట్‌గా, లిక్కర్ షాపులకు సెపరేట్‌గా మందును సప్లై చేయాలి. కాని, బార్లు ఏవీకూడా ఆర్డర్లు పెట్టుండా… నేరుగా లిక్కర్ షాపుల నుంచి తెచ్చి అమ్మేస్తున్నారు. ఇందులో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, కిలారు రాజేష్‌కి, తద్వారా లోకేష్‌కి వాటాలు అందుతున్న విషయం వాస్తవం కాదా? -
మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్ర స్వార్థం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. చిరు వ్యాపారులను రోడ్డున పడేశారంటూ ధ్వజమెత్తారు.‘‘కొల్లు రవీంద్ర కాంప్లెక్స్ కోసం అన్యాయంగా స్థానికులకు నోటీసులు ఇస్తున్నారు. కొల్లు రవీంద్ర బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొల్లు రవీంద్ర కట్టే నిర్మాణాలకు మున్సిపల్ ప్లాన్ లేదు. మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏమయ్యారు?. సామాన్యులు ఇల్లు కట్టుకుంటే మాత్రం అధికారులు ఆపేస్తున్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే టీడీపీ నేతలు 50 వేలు వసూలు చేస్తున్నారు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్‌ను రెడీ చేసేసుకున్నారు. బెల్లపుకొట్ల సందును నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విస్తరణ చేశా. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన రాలేదు. రోడ్డు విస్తరణపై పేపర్లో వచ్చే వరకూ ఎవరికీ తెలియదు. హడావిడిగా పేపర్ ప్రకటనపై మచిలీపట్నం ప్రజల్లో ఆందోళన మొదలైంది. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్‌హౌస్ కడుతున్నాడు..కొల్లు రవీంద్ర చేపట్టే ఒక్క నిర్మాణానికీ ప్లాన్లు లేవు. చిన్నచిన్న వారి పై ప్రతాపం చూపించే మున్సిపల్ కమిషనర్‌కు కొల్లు రవీంద్ర నిర్మాణాలు కనిపించలేదా?. ప్లాన్లు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ(ముడా) కళ్లు మూసుకుందా?. కొల్లు రవీంద్ర అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ రెచ్చిపోతున్నాడు. సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపల్ సిబ్బంది వాలిపోతున్నారు. స్థానిక టీడీపీ ఇంఛార్జ్‌లకు కమిషన్ ఇస్తేనే అనుమతులిస్తున్నారు. నువ్వు మీ ఇంఛార్జిలకు ఎంత కమిషన్ ఇచ్చావ్ కొల్లు రవీంద్ర?..బడ్డీ కొట్లు కూలగొట్టించి నీఇంఛార్జ్లకు కమిషన్లు ఇప్పించి మళ్లీ అక్కడే షాపులు పెట్టించావ్. కొల్లు రవీంద్ర కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్‌కు కనీసం ప్లాన్ లేదు. తన కాంప్లెక్స్ ప్లాన్ కోసం రోడ్డును విస్తరణ చేయిస్తున్నాడు. చంద్రబాబు, లోకేష్ ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు పోగేశాడు. ఎంతమంది కన్నీళ్లతో నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటావ్. నీ స్వార్థం కోసం వ్యాపారుల ఉసురు పోసుకోకు. నేను ఊరు బాగు కోసం గతంలో రోడ్డు విస్తరణ చేయించా. ఈ రోజు ఎవరి బాగు కోసం మీరు ఈ రోడ్డు విస్తరణ చేయిస్తున్నావు. మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ (ముడా) ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని రూ.5 కోట్లు తీసుకున్నావు. లోకేష్ దగ్గర పెండింగ్ ఉందని మరో కోటి 70 లక్షలు తీసుకున్నది నిజం కాదా?..ఉచ్ఛనీచాలు ఆలోచించకుండా పాపాలు చేయడం దేనికి కొల్లు రవీంద్ర. నువ్వు, చంద్రబాబు కలిసి 650 ఎకరాల ముడా భూమి తవ్వింది నిజం కాదా?. నేను చెప్పింది నిజమో కాదో ముడా పదవికి రాజీనామా చేసిన బీజేపి నేతను అడగండి చెబుతాడు. బెజవాడలోనో.. హైదరాబాద్‌లోనో కట్టుకోవచ్చు కదా. మచిలీపట్నంలోనే నీ మల్టీ కాంప్లెక్స్ ఎందుకు కట్టడం?. తన కమర్షియల్ కాంప్లెక్స్ కోసం స్వార్థంతో రోడ్డు విస్తరణ చేస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కడతానంటే చూస్తూ ఊరుకునేది లేదు. బలవంతంగా కొల్లు రవీంద్ర షాపింగ్ కాంప్లెక్స్ కట్టలేడు. కొల్లు రవీంద్ర చేస్తున్న పాపం.. దగాపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. చంద్రబాబుకి పిటిషన్లు పెడతాం. హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం..పోలీసులను ఉపయోగించి బలవంతంగా ఆర్యవైశ్యుల ఆస్తులు లాక్కోవాలని చూస్తే ఊరుకోం. కృత్తివెన్నులో 35 ఎకరాల ఆర్య వైశ్యుల ఆస్తులను కొట్టేశావ్. బెంగుళూరులో ఉన్న వారిపై అక్రమంగా కేసులు పెట్టావ్. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే కచ్చితంగా నీ అక్రమ కేసుల సంగతి తేలుస్తాం. బీచ్‌లో ఫెస్టివల్ తప్ప బందరుకు నువ్వు చేసిందేంటి?. మచిలీపట్నంలో రోడ్డు విస్తరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. కొల్లు రవీంద్రను ఎదుర్కోలేకే... సామాన్యులు నన్ను ఆశ్రయించారు. నన్ను సాయం కోరిన వారికి కచ్చితంగా నేను అండగా ఉంటా’’ పేర్ని నాని పేర్కొన్నారు. -
గూగుల్‌తో లక్ష ఉద్యోగాలు అనేది అబద్ధం: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో గూగల్ సంస్థలో ఉద్యోగాల విషయమై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక కామెంట్స్ చేశారు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అంటూ నిజాలను బయటపెట్టారు. వాస్తవాలను కుండబద్దలు కొట్టారు. దీంతో, చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు అబద్దమని తేలిపోయింది.బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిజం చెప్పడానికి నాకు మొహమాటం లేదు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు. డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం. రెండు, మూడు వేలలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయానేది సమస్య కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల పట్ల బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో విష్ణుకుమార్..‘ఉచిత బస్సు ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైంది. టికెట్ ఉన్న మగవాళ్లను కూడా బస్ నుంచి దించేస్తున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులే ఈ మాట చెప్పారు. మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. దీంతో, కూటమి ప్రభుత్వం ఉన్న లొసుగులు మరోసారి బహిర్గతమయ్యాయి. -
‘నకిలీ మద్యం.. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్’
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి నేతల కనుసన్నల్లో లిక్కర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు సాకే శైలజానాథ్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంటే.. మీరు జేబులు నింపుకుంటున్నారా? అని ప్రశ్నించారు. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ పాలనలో బెల్టు షాపులు లేవు. ప్రభుత్వమే నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరిపించింది. చంద్రబాబు ఓ అసమర్థ ముఖ్యమంత్రి. బాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోంది. కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ వారంతా టీడీపీ నేతలే. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంటే.. మీరు జేబులు నింపుకుంటున్నారా?. చంద్రబాబు అబద్దాల ముఖ్యమంత్రి. నకిలీ లిక్కర్ కుటీర పరిశ్రమను చంద్రబాబు రాష్ట్రమంతా నడిపిస్తున్నారు. కల్తీ మద్యం వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.ఏపీలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. చంద్రబాబు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. చాలా కాలం నుంచి లిక్కర్ దందాకు చంద్రబాబు ప్లాన్ చేశారు. చంద్రబాబు మనుషుల చేతుల్లోనే లిక్కర్ షాపులున్నాయి. లక్షలాది బెల్టు షాపులు టీడీపీ వారివే. చంద్రబాబు డర్డీ పాలిటిక్స్ చేస్తున్నారు. అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ లిక్కర్ అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. కల్తీ మద్యం అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే కేసును సీబీఐకి అప్పగించాలి. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌ను ఇరికించే కుట్రలు జరుగుతున్నాయి. జోగి రమేష్ ఛాలెంజ్‌ను చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్వీకరించలేదు?.రాష్ట్రంలో అన్యాయం, అరాచక పాలన సాగుతోంది. లోకేష్ మీ నాన్నలా రాజకీయాలు చేయకు.. మంచి రాజకీయాలు నేర్చుకో. చంద్రబాబు సిట్ అంటేనే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. చంద్రబాబు వేసే సిట్.. ఆయన సిట్ అంటే సిట్, ఆయన స్టాండ్ అంటే స్టాండ్ . చంద్రబాబు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రి గా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ శాఖలు సరిగా పనిచేయలేదని సాక్షాత్తూ మంత్రి సత్యకుమార్ అంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ఇస్తే పేదల పరిస్థితి ఏంటి?. వైఎస్సార్సీపీ, ప్రజలు అడిగే ప్రశ్నలకు కూటమి నేతల దగ్గరా సమాధానాలు లేవు’ అని అన్నారు. -
అతకని అతిశయోక్తులతో ప్రధాని ప్రసంగం...
దేశ రాజధాని ఢిల్లీ.. అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయిట. దేశ ప్రగతిలో కీలకంగా మారాయట. ఈ వ్యాఖ్యలు ఎవరో ఆషామాషీ వ్యక్తులు చేసింది కాదు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నవి. మరీ ఇంత అతిశయోక్తా? ఢిల్లీ ఇప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతమన్నది అందరికీ తెలుసు. కానీ అమరావతి? అమరావతి అభివృద్ది చెందుతుందని, దానికి తమ సహకారం ఉంటుందని చెబితే ఫర్వాలేదు. అలా కాకుండా భారతదేశాన్ని నడిపించగలిగే శక్తి ఆంధ్రప్రదేశ్‌కు ఉందంటే ప్రజలు నమ్మగలుగుతారా? ఇదే నిజమైతే ముంబై, బెంగుళూరు, చెన్నై హైదరాబాద్, పూణేల మాటేమిటి? అవి కదా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నవి. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ ముఖచిత్రం మారుతోందని, ఈ 16 నెలల ఎన్డీయే పాలనలో వేగవంతమైన అభివృద్ది జరుగుతోందని ప్రధాని అన్నారు. అదేంటో కాస్తా వివరించి ఉంటే బాగుండేది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపడం, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటకు అప్పనంగా అప్పగించేయడమేనా ముఖచిత్ర మార్పు అంటే? లేక... ఏడాదిన్నర కాలంలో రూ.2.10 లక్షల కోట్లు అప్పులు చేయడమా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టం చేశాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఏపీలో సుదీర్ఘకాలం అధికారం వెలగబెట్టింది తన భాగస్వామి చంద్రబాబే అన్నది మరచిపోయారు. మొన్నటికి మొన్న ఎన్డీయేను వీడిన చంద్రబాబును మోడీ, అమిత్ షాలు అనని మాటలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేసుకున్నారని విమర్శించడం మాత్రమే కాదు.. తనకన్నా సీనియర్ అని చంద్రబాబును వెటకారమాడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. లోకేశ్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగానూ తెగనాడిన ప్రధాని ఇప్పుడు అదే నోటితో ఆయన్నో యువనేతగా అభివర్ణిస్తున్నారు. మనోడైతే వారసత్వ రాజకీయాలు చేసినా ఓకే అన్నమాట. జీఎస్టీ రేట్లలో తగ్గింపులను ఉత్సవాలుగా జరిపే ప్రయత్నం చేస్తున్న మోడీ, చంద్రబాబులు ఏడేళ్లుగా ప్రజల నుంచి అప్పనంగా దోచుకున్న విషయంపై మాట్లాడరు. వాస్తవానికి పెట్రోలు, డీజిళ్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తేనే మధ్యతరగతి వారికి నాలుగు రూకలు మిగులుతాయి. సూపర్ గిఫ్ట్ అవుతుంది. విశాఖలో రానున్న అదానీ, గూగుల్ల డేటా సెంటర్‌ను ప్రస్తావించిన మోడీ దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న రూ.22 వేల కోట్ల రాయితీల్లో కొంత కేంద్రమూ భరిస్తుందని చెప్పి ఉంటే ప్రజలపై అప్పుల భారం కొంతైనా తగ్గిఉండేది. ఏపీ అభివృద్ధికి రాయలసీమ కీలకమన్న ప్రధాని ఆ ప్రాంతంలో వలసల నిరోధానికైనా, టమోటా, ఉల్లి, మిర్చి వంటి పంటలకు తగిన ధరలు కల్పించేందుకైనా ఏమైనా పథకాలు ప్రకటించి ఉంటే అసలు మేలు చేసిన వాళ్లు అయ్యేవారు. అదేదీ చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడితే ఎవరికి ప్రయోజనం? విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా ఊసైనా ఎత్తలేదు ప్రధాని తన ప్రసంగంలో. మొత్తం ప్రసంగంలో మోడీ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడం ఒక ప్రత్యేకతని చెప్పాలి. బహుశా ఇది టీడీపీ, జనసేనలకు నిరాశ కలిగించి ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో ఐదారు సార్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రధాని రాష్ట్రనికి ఇచ్చిందేమీ లేదని, పర్యటనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు వృథా చేస్తోందని అవుతోందన్న విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానిని ఆకాశానికి ఎత్తేస్తే.. మోడీ కూడా బాబు, పవన్‌లను కీర్తించి వెళ్లారు. ఎందరో ప్రధానులతో పనిచేసిన తనకు మోడీ లాంటి నేత అస్సలు కనపడనే లేదని, విలక్షణ నాయకుడని, జాతికి ఎనలేని సేవలందిస్తున్నారని చంద్రబాబు కీర్తిస్తే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత పాటే మళ్లీ పాడారు. కూటమి ఏపీలో 15 ఏళ్లపాటు కలిసి ఉంటుందని భరోసా ఇచ్చారు. మోడీ దార్శనికతతో, చంద్రబాబు స్పూర్తితో సమష్టిగా ముందుకు వెళతామని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీ తగ్గింపులనే డబుల్ బెనిఫిట్లు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పు చేయకుండా వారం గడవని పరిస్థితుల్లో, ఎన్నికల హామీలు నెరవేర్చలేక సతమతమవుతున్న చంద్రబాబు ఈ మాటలనడం ఆత్మవంచనే అవుతుంది. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుందన్న భయమున్నా అది సూపర్ అని ప్రచారం చేయక తప్పడం లేదు. జీఎస్టీ తగ్గింపువల్ల ప్రజలకు నేరుగా కలిగే ప్రయోజనం ఎంతన్నదానిపై కూడా ప్రయోజనం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ తన ప్రతిభే అని అన్నిచోట్ల చెప్పుకునే చంద్రబాబు ఈసారి మాత్రం అన్నీ మోడీ చలవేనని చెప్పుకున్నారు. గతంలో ప్రధాని మోడీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్రానికి అవసరమైన కొన్ని డిమాండ్లను సీఎం హోదాలో జగన్ ప్రస్తావించే వారు. వినతిపత్రం లాంటివి ఇచ్చేవారు. చంద్రబాబు ఈ పని మాత్రం చేయలేకపోయారు. కారణమేమిటో మరి?తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న లోకేశ్ తనకు ఇచ్చిన శాఖలను సమర్థం నిర్వహిస్తున్నారని పవన్ పొగడడం గమనించాల్సిన అంశమే. లోకేశ్ నాయకత్వానికి పరోక్షంగా ఆమోదం చెప్పినట్లు అనుకోవాలి. లోకేశ్ కూడా తన శక్తి వంచన లేకుండా సినిమా డైలాగుల మాదిరి మోడీని మురిపించే యత్నం చేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..అనేది నమో స్టైల్ అని ఆయన అన్నారు. మోడీ లోకేశ్‌కు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అనుచరులు సంబరపడుతున్నారు. రాజకీయ వారసత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలు సభ ప్రచారానికి బాగానే ఉపయోగపడవచ్చు కానీ ప్రజలకు ఎంత ప్రయోజనం సిద్దిస్తుందన్నదే డౌటు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీ!?
సాక్షి, హైదరాబాద్: 42 శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్‌తో బీసీ సంఘాలు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శనివారం ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో.. ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు.‘‘కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు.. ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు ఎంతో అవసరం’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కవితను ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో నొచ్చుకున్న ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు రాగా.. అనూహ్యంగా ఇవాళ్టి బంద్, ధర్నాల్లో పాల్గొనడం గమనార్హం. దీంతో 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రెడీనా? అనే చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది. -
‘బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా’
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కారణంగా బంద్ కొనసాగుతోంది. బంద్‌లో అన్ని రాజకీయ పార్టీ నేతలు పాల్గొంటున్నారు. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండాపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారు. కామారెడ్డి డిక్లరేషన్ బూటకం. కానీ, బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం. చెల్లని జీవోలను, ఆర్డినెన్స్‌ను విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది. సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి’ అని కామెంట్స్ చేశారు. మాజీమంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ పాల్గొంటున్నాయి. మొక్కుబడిగా బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వామ్యం కావద్దు. బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గవద్దు అంటూ కామెంట్స్ చేశారు. -
మంత్రులు వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం.. దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందని..కేబినెట్ మీటింగ్‌లో మంత్రులు అరడజను వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కమీ షన్లు, కాంట్రాక్టులు, వసూళ్లు, వాటాలు, కబ్జాలు, పోస్టింగుల కోసం పోటీలు పడుతూ పాలన గాలికి వదిలి వ్యక్తిగత పంచాయితీలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్య మంత్రి, మంత్రులు పరస్పరం తిట్లతో గడుపుతున్నారని, అతుకుల బొంత ప్రభుత్వ మనుగడపై అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడే అందినకాడికి దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మాజీమంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్‌రావు, పార్టీ నేతలు చిరుమర్తి లింగయ్య, పల్లె రవికుమార్‌తో కలిసి శుక్రవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. దీపావళి పండుగ నేపథ్యంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశం ద్వారా తీపి కబురు చెప్తారని ఆశించిన అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారన్నారు.రేవంత్ ‘గన్ కల్చర్’ తెచ్చారు‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యాపార వేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి పెట్టుబడులతోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేశాం. కానీ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోకి గన్ కల్చర్ తెచ్చి వ్యాపారవేత్తలను తుపాకులతో బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి సన్నిహితులు తుపాకులు పెడుతున్నారని, సీఎం జపాన్ నుంచి ఫైళ్లు ఆపించారని ఓ మంత్రి కుమార్తె స్పష్టంగా చెప్తోంది.కాంట్రాక్టుల కోసం.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా హీరోలు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. ఇక్కడ జరుగు తున్న అరాచకాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో లేదా స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణ జరిపించాలి. సీఎం తుపాకీ పంపారు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డీజీపీ స్పందించాలి’అని హరీశ్‌రావు అన్నారు. దేని కోసం విజయోత్సవాలు..?‘ప్రభుత్వ సంస్థలను అప్పుల కుప్ప చేసి ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అప్పులు తెచ్చారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకునేందుకు హ్యామ్ మోడల్ పేరిట రూ.10,547 కోట్లతో రోడ్లకు టెండర్లు పిలిచారు. బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోవడంతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను రేవంత్ ప్రభుత్వం దొంగ దెబ్బతీసింది. 23 నెలల పాలనలో అన్ని పథకాలు, హామీలను అమలు చేయకుండా డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు జరపాలని నిర్ణయించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో పెరిగిన అరాచకాలపై విచారణ ఏజెన్సీలకు ఫిర్యాదు చేస్తాం’అని హరీశ్‌రావు చెప్పారు. -
‘లోకేశ్‌ని ఎదిరించినందుకు హత్య కేసులో ఇరికించారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉంటూ, పార్టీ నిర్వహిస్తున్న నకిలీ లిక్కర్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక వైఎస్సార్సీపీ దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త దాసరి వీరయ్యపై పోలీసులు అక్రమంగా హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఒక హత్య కేసుతో సంబంధం లేకపోయినా కూడా దాసరి వీరయ్యను ఆ కేసులో నిందితుడిగా చేర్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలతో వీరయ్యకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తప్పుడు వాంగ్మూలం తీసుకుని దొంగ సాక్ష్యాలతో ఒక కట్టు కథ అల్లారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వ్యతిరేక గళం వినిపించకూడదన్న నియంత ఆలోచనలతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మనోహర్‌రెడ్డి చెప్పారు. నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా గళమెత్తినందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతోపాటు మరో 13 మంది వైయస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదే నకిలీ మద్యం గురించి వార్తలు రాసినందుకు సాక్షిమీడియాపై 17 అక్రమ కేసులు నమోదు చేశారని, ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు ఎలా తెలిసిందో సోర్స్ చెప్పాలని వేధించడం రాజ్యాంగం ఇచ్చిన మీడియా స్వేచ్చను కాలరాయడమేనని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే ...కుట్రపూరితంగా దాసరి వీరయ్యపై కేసు బనాయించారుచట్టాన్ని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం కూటమి నాయకుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తోంది. కూటమి నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ పోలీసులు రోజురోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా అమల్తూరు మండలం యడవూరు గ్రామానికి చెందిన నాగ గణేశ్, కొలకలూరు గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనాదేవి అనే యువతి వారి కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా కోటిలింగాల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పోలీసుల రక్షణ కోరారు. ఇరువురు తల్లిదండ్రులను పోలీసులు పిలిపించగా అమ్మాయి తల్లిదండ్రులు నచ్చలేదని వెళ్లిపోయారు. దీంతో నవ దంపతులు కొత్త కాపురం పెట్టుకుని జీవిస్తుండగా, ఇటీవల కీర్తి వీరాంజనాదేవి అన్న కాపు కాసి ఆమె భర్త నాగ గణేశ్‌ను మరికొందరితో కలిసి తండ్రి ముందరే నరికి చంపేశాడు. దీనిపై ప్రత్యక్ష సాక్షి, మృతుడు నాగ గణేశ్ తండ్రి స్టేట్మెంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంతటితో ఆగకుండా ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ నాయకుడు, దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త అయిన దాసరి వీరయ్యని నిందితుడిగా చేర్చారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్‌ని ఎదిరించి నిలబడిన కారణంగా ఆయనపై పోలీసులు ఈ విధంగా అక్రమ కేసు బనాయించారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మొన్న అర్థరాత్రి అరెస్ట్ చేసి నిన్న రాత్రి కోర్టులో హాజరు పరిచారు. ఈ వాంగ్మూలం కాపీలో పేర్లు, చిరునామా దగ్గర నుంచి చంపిన ఘటన వరకు వారే ప్రశ్నలు వేసినట్టు, వారే సమాధానాలు రాసుకున్నారు. నాగ గణేశ్‌ని చంపడం వెనుక మాస్టర్ మైండ్ దాసరి వీరయ్య అన్నట్టుగా ఆయన అండదండలతోనే హత్య చేసినట్టుగా ఒక కథనం అల్లారు. దాన్ని ధ్రువీకరిస్తూ ఇద్దరు మధ్య వ్యక్తులతో సాక్షి సంతకాలు చేయించుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో సంతకం చేయడానికి దాసరి వీరయ్య సంతకం చేయడానికి నిరాకరించినట్టు మళ్లీ మధ్యవర్తులతో సంతకాలు చేయించుకున్నారు. చేయని నేరాన్ని అంగీకరించాలంటూ దాసరి వీరయ్యను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. తనపై అన్యాయంగా అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎలాంటి సంబంధం లేకపోయినా 302 కేసులో ఇరికించారని దాసరి వీరయ్య స్వయంగా మెజిస్ట్రేట్‌కి వివరించారు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో జరిగిన పరువు హత్య ఘటనలో ఆ ఊరితో సంబంధమే లేని దాసరి వీరయ్యను పోలీసులు అక్రమంగా ఇరికించారు. ప్రమోషన్ల ఆశ చూపించి కొంతమంది పోలీసులను రాజకీయ ప్రతీకార దాడులకు కూటమి నాయకులు వాడుకుంటున్నారు.ధర్నా చేసినందుకు 13 మందిపై హత్యాయత్నం కేసునకిలీ మద్యం వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ పిలుపునివ్వడంతో పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో పార్టీ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొంచెం పెనుగులాట జరిగింది. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఒకరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. నిరసనలో పాల్గొన్నందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతోపాటు మరో 13 మందిపై పోలీసులను చంపడానికి ప్రయత్నం చేశారంటూ 307 కింద అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. ఎక్కడ చూసినా అక్రమ కేసులే. విచారణ పేరుతో పదే పదే పిలిపించడం వంద ప్రశ్నలు రాసుకొచ్చి వాటికి సమాధానాలు చెప్పాలని వేధించడం పోలీసులు అలవాటుగా మార్చుకున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి మీడియాపై 17 అక్రమ కేసులునకిలీ లిక్కర్ గుట్టురట్టు చేయడమే నేరమన్నట్టు సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. విచారణ పేరుతో సాక్షి ఎడిటర్‌ను పిలిపించి గంటలకొద్దీ కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్నారు. నకిలీ లిక్కర్ దందా వెలికితీసిన వ్వవహారంలో వార్తలు రాయడినికి దొరికిన సోర్స్ వివరాలు చెప్పాలని వేధిస్తున్నారు. సోర్స్ చెప్పే అవసరం లేని పత్రికా స్వేచ్ఛ ఉందని తెలిసీ, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని తెలిసీ పోలీసులు సాక్షి కార్యాలయాన్ని చుట్టుముట్టి వార్త ఎవరు రాశారు? ఎవరు ఎడిట్ చేశారు? వార్తకు సోర్స్ ఏంటి చెప్పాలంటూ వంద ప్రశ్నలు రాసుకొచ్చారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో సాక్షి ప్రసారాలు రాకుండా కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారు. ఏకంగా సాక్షిపై 17 కేసులు నమోదు చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో శ్మశాన వాతావరణం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, వైఎస్సార్సీపీ నాయకుల మీద హత్యాయత్నం, హత్య కేసులు బనాయిస్తున్నారు. కోర్టు పదే పదే మొట్టికాయలేస్తున్నా లెక్కచేయకుండా కూటమి నాయకులకు ఊడిగం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ఇలాంటి పోలీసులంతా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. వారిని న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెట్టడం ఖాయం. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతాం’ అని హెచ్చరించారు,ఇదీ చదవండి: లేఖ రాశానని.. నా భర్తను అరెస్ట్ చేశారు: మేకతోటి అరుణ -
మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాల దాడి
సాక్షి,కర్నూల్: కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాలు దాడి చేశాయి. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు వెళ్తుండగా టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాల దాడిలో వైఎస్సార్సీపీ ఎంపీపీ వాహనం ధ్వంసమైంది. వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలోకి అడుగు పెట్టకూడదు అంటూ హుకుం జారీ చేశారు. గ్రామంలో రెచ్చిపోతూ స్థానికుల్ని టీడీపీ గూండాలు భయబ్రాంతులకు గురి చేశారు. -
హరీష్‌కు మంత్రి సీతక్క కౌంటర్
హైదరాబాద్: క్యాబినెట్లో రాద్దాంతం జరిగిందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటరిచ్చారు. క్యాబినెట్లో రాద్దాంతం జరిగిందని హరీష్ నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘ నిన్న క్యాబినెట్లో ఎలాంటి రాద్దాంతం జరగలేదు. క్యాబినెట్ ఎజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారు. హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. నిన్న వ్యక్తిగతంగా సీఎంతో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ చేయలేదు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం హరీష్ రావు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనే’ అని విమర్శించారు మంత్రి సీతక్క.ఇదీ కూడా చదవండి:‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’ -
దివ్యాంగులపై మానవత్వం లేదా బాబూ?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, దివ్యాంగుల విభాగం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆయన ఏమన్నారంటే..దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై వైఎస్ జగన్ క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ హయాంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం, అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధిచేయాలని తపించారు. సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు సరళీకృతం చేయాలని, అవసరమైన సవరణలు చేశారు. క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు...పాలన అంటే ఒక సార్ధకత దానిని నాడు వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో చూశారు. అసమానతలు తొలగించి రాజ్యాంగ స్పూర్తిని అమలు చేసింది వైఎస్ జగన్ పాలనలోనే. మానవత్వంతో పాలన సాగించడం అనేది చూశాం. వైఎస్సార్సీపీ అనేది ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళుతుంది. వైఎస్ జగన్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగుతుంది. ఏ రకంగా వడపోసి సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించాలనేది చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు సంక్షేమం అంతా తన కోసం, అయిన వారికే తప్ప నిజమైన లబ్ధిదారులకు కాదు. ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.ఊత కర్రల సాయంతో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాజిక భద్రత అనేది లేకపోతే పేద వర్గాలు ఏమవ్వాలి. దివ్యాంగులకు పింఛన్లు అవసరమా అనే చర్చ లేవనెత్తారు చంద్రబాబు. దానికి ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారు. వికలాంగుల విషయంలో జగన్ ఏనాడు పార్టీలు చూడలేదు. వారికి ఎలా చేయూత ఇవ్వాలి, వారు ఆత్మగౌరవంతో ఎలా బతకాలి అని ఆలోచించారు. వైఎస్ జగన్ పాలన ఈ ఐదేళ్ళు కొనసాగి ఉంటే ఒక కొత్త జనరేషన్ తయారయ్యేది. ఒక మంచి వ్యవస్థలను జగన్ రూపొందిస్తే.. చంద్రబాబు దానిని కుప్పకూల్చారు.వైఎస్ జగన్ పాలనలో నాడు-నేడు పేరుతో స్కూల్స్ అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఏం జరుగుతుంది. కురుపాం, తురకపాలెం ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా.? ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..? పాలన అనేది ఒక యజ్ఞంలా వైఎస్ జగన్ భావించారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల డెలివరీ పెడితే చంద్రబాబు లిక్కర్ షాప్‌లు, బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ డెలివరీ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా రెడ్ బుక్ పేరుతో నాశనం చేశారు. మళ్ళీ అధికారం రాదని తెలిసి చంద్రబాబు ఆయన కుమారుడు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఒక బలీయమైన శక్తిగా రూపొందింది. అందుకు ఉదాహరణే జగన్ పర్యటనలకు వస్తున్న లక్షలాది మంది జనమే. కోటి సంతకాల సేకరణలో మీ విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలి. మీ పరిధిలో ఉన్నంత మేరకు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషిచేయండి.కూటమి సర్కార్ దివ్యాంగులను మోసగించింది: మేరుగ నాగార్జునదేశ చరిత్ర లోనే దివ్యాంగులకు భరోసా, ఆత్మస్ధైర్యం కల్పించింది జగనన్న పాలనలోనే. ఏపీలో కూటమి ప్రభుత్వం దివ్వాంగులను మోసగించింది. వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఆసుపత్రుల చుట్టు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారికి నరకయాతన చూపుతున్నారు. చంద్రబాబు ఇదేనా మానవత్వం. చంద్రబాబు దివ్యాంగుల పట్ల నువ్వు చేస్తున్నది మోసం, దగా కాదా అని ప్రశ్నిస్తున్నాం.దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి?: పులిపాటి దుర్గారెడ్డిచంద్రబాబు దివ్యాంగులను నిలువునా మోసం చేశారు. దివ్యాంగుల పెన్షన్లలో కోతలు, ఆంక్షలతో వేధిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు నువ్వు దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి. లక్షల మంది దివ్యాంగలకు నోటీసులు ఇచ్చి మా దివ్యాంగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నావు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావ్. జగన్ హయాంలో తలెత్తుకు తిరిగిన మేమంతా ఇప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిని బతుకీడుస్తున్నాం. అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మీకు సమంజసమా అని నిలదీస్తున్నాం. -
‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మంత్రులు వారి పంచాయితీలు చెప్పుకోవడానికే క్యాబినేట్ మీటింగ్‌లు పెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం (అక్టోబర్ 17) తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ మాట్లాడుతూ.. ‘మంత్రులు గ్రూపులుగా విడిపోయారు. దంళుపాళ్యం ముఠాకంటే అధ్వాన్నంగా మారింది. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే క్యాబినెట్ మీటింగ్. కేసీఆర్ ఢిల్లీలో తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాటా, నీళ్ల వాటాను సాధించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి కమీషన్లు.కాంట్రాక్టుల వాటాల కోసం కొట్లాడుతున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పాలనతో అతితక్కువ ఇండస్ట్రీలు వచ్చాయి. టీఎస్ ఐపాస్ ఏర్పడిన తర్వాత పరిశ్రమల రాక సంఖ్య పెరిగింది.మా హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యాత ఇచ్చాం. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు గురి పెడుతున్నారు. గన్ కల్చర్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మంత్రిగా టీమిండియా క్రికెటర్ భార్య ప్రమాణ స్వీకారం
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా సోలంకి జడేజా (Rivaba Solanki Jadeja) రాజకీయ జీవితంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్ర మంత్రిగా ఆమె శుక్రవారం (అక్టోబరు 17) ప్రమాణ స్వీకారం చేశారు. కాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మంత్రులంతా గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టగా.. రివాబా జడేజా తాజాగా మంత్రి అయ్యారు.జడేజాతో ప్రేమ, పెళ్లిరివాబా సింగ్ సోలంకి 1990, నవంబరు 2న జన్మించారు. తండ్రి హర్దేవ్ సింగ్ సోలంకి బిజినెస్‌మ్యాన్ కాగా.. తల్లి ప్రఫుల్లాబా సోలంకి భారత రైల్వేస్‌లో ఉద్యోగిని. రాజ్‌కోట్‌లో ఉన్నత విద్యనభ్యసించిన రివాబా.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు.రవీంద్ర జడేజా సోదరి నైనాబాకు రివాబా ఫ్రెండ్. ఓ పార్టీలో నైనా.. తన సోదరుడు రవీంద్ర జడేజాకు రివాబాను పరిచయం చేశారు. అలా జడ్డు- రివాబాల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల సమ్మతితో 2016లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే అంటే.. 2017లో రివాబా- జడ్డూ దంపతులకు కూతురు నిధ్యానా జన్మించింది.సామాజిక సేవపెళ్లికి ముందు నుంచే రివాబా తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారు. రాజ్‌పుత్‌లకు చెందిన కర్ణి సేన మహిళా విభాగానికి ఆమె అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు రివాబా బీజేపీలో చేరారు.ఈ క్రమంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రివాబా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాతృశక్తి అనే చారిటబుల్ ట్రస్టు ద్వారా మహిళా సాధికారికత, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా జడ్డూ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రివాబా.. చిన్న వయసులోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.టీమిండియా అత్యుత్తమ ఆల్రౌండర్సౌరాష్ట్ర స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 87 టెస్టులు, 204 వన్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. ఆయా ఫార్మాట్లలో 3990, 2806, 515 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో 338 టెస్టు వికెట్లు, 231 వన్డే వికెట్లు, 54 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక భార్య రివాబాతో కలిసి జడ్డూ సైతం గతంలోనే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.చదవండి: అఫ్గాన్ చేతిలో వైట్ వాష్.. బంగ్లాదేశ్ క్రికెటర్ల వాహనాలపై దాడి! -
గుజరాత్లో నూతన మంత్రివర్గం కొలువు దీరింది
గాంధీనగర్: గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన క్యాబినెట్ ఏర్పాటు అయింది.ఈ సందర్భంగా 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో గుజరాత్ హోంమంత్రి నేత హర్ష్ రమేష్‌భాయ్ సంఘవీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని లక్షకు పైగా ఓట్లతో ఓడించి ఘన విజయం సాధించారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతున్నారు.కమలం అధిష్టానం క్యాబినెట్లో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చింది. 7 మంది పాటిదార్లు, 8 మంది ఓబీసీలు, 3 మంది ఎస్సీలు, 4 మంది ఎస్టీలు, 3 మంది మహిళా నేతలు ఉన్నారు. కొత్త క్యాబినెట్లో ఎక్కువ మంది కొత్తవారికే అవకాశం లభించింది. గత క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో కేవలం ఆరుగురు మాత్రమే తిరిగి పదవులు చేపట్టారు. #WATCH | BJP MLA Rivaba Jadeja takes oath as Gujarat Cabinet minister in Gandhinagar pic.twitter.com/mJzv53J2C0— ANI (@ANI) October 17, 2025 -
లేఖ రాశానని.. నా భర్తను అరెస్ట్ చేశారు: మేకతోటి అరుణ
సాక్షి, తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలో బెల్ట్‌షాప్‌లపై మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నిస్తూ ఒక జెడ్పీటీసీగా లేఖ రాయడాన్ని జీర్ణించుకోలేక తన భర్త వీరయ్యపై పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులో అర్ధరాత్రి దౌర్జన్యంగా లాక్కెళ్ళారని దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి వైఎస్సార్సీపీ ఇంచార్జి దొంతిరెడ్డి వేమారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. దళితులమైన తమపై మంత్రి నారా లోకేష్ కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయించి, తన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనే నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడతామని, నారా లోకేష్ ఎన్ని అక్రమ కేసులు పెట్టించినా భయపడేదే లేదని మేకతోటి అరుణ స్పష్టం చేశారు. తాను చేస్తున్న తప్పులకు నారా లోకేష్ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ఈనెల పదో తేదీన దుగ్గిరాల మండల సర్వసభ్య సమావేశంలో బెల్ట్‌షాప్‌లపై బాధ్యత కలిగిన ఒక జెడ్పీటీసీ సభ్యురాలుగా అధికారులను ప్రశ్నించాను. మా మండలంలో ప్రతి వీధిలోనూ బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసి, మద్యాన్ని విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. దీనిపై ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని సర్వసభ్య సమావేశంలో నేను ప్రస్తావించాను.ఈ సమావేశానికి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. అందువల్ల ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెడుతూ లేఖ రాశాను. (ఈ సందర్బంగా ఆ లేఖ ప్రతిని వీడియాకు ప్రదర్శించారు) ఈ లేఖను ఎండీఓకు అందచేయడం ద్వారా దానిని మంత్రివర్యులకు పంపాలని కోరాను. మండలంలో కూల్ డ్రింక్ షాప్‌లు, కంటైనర్లలో బెల్ట్‌షాప్ లను నిర్వహిస్తూ, ప్రజలకు మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ, వారిని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఫోటోలతో సహా ఆ లేఖకు జత చేసి ఎండీఓకు అందచేశాను.ఆ రోజు నేను మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏం మాట్లాడానో దానికి సంబంధించిన వీడియోను కూడా ఈ సందర్బంగా ప్రదర్శిస్తున్నాను. (ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). ఈ సమావేశంలో కేవలం మద్యం, బెల్ట్‌షాప్‌ల గురించి, అధిక ధరలకు జరుగుతున్న మద్యం విక్రయాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే మాట్లాడానే తప్ప ఎవరినీ విమర్శించలేదు. అయినా కూడా దీనిని తట్టుకోలేని స్థితిలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంది. దీనిని బయటపెట్టినందుకు నా భర్త దాసరి వీరయ్యను ఎక్కడో జరిగిన హత్యకేసులో నిందితుడిగా కేసులు బనాయించి, అర్థరాత్రి దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు.నారా లోకేష్ అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దళితులపై తప్పుడు కేసులు, అరాచకాలు, దాష్టీకాలు పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ఏడాది జూన్ 4న తుమ్మపూడిలో జరిగిన హత్యకేసులో కూడా నా భర్త వీరయ్యను ఇరికించారు. మంత్రి నారా లోకేష్ కావాలనే మాపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానికి నా భర్తనే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఐజీ నా భర్తపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. నారా లోకేష్ దళితులమైన మాపైన ఎన్ని కేసులు పెట్టినా, వేధించినా భయపడేదే లేదు.వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన గళం విప్పకుండా మమ్మల్ని అడ్డుకోలేరు. గత ప్రభుత్వంలో అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే, అది అక్రమ కేసు అంటూ ఇదే నారా లోకేష్ మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటీ? వైఎస్సార్సీపీలో ఉన్న దళిత నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం లేదా? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ది చెబుతారని అరుణ స్పష్టం చేశారు.వీరయ్య పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసులు: దొంతిరెడ్డి వేమారెడ్డివీరయ్యను కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పోలీస్ రాజ్యంలో జీవిస్తున్నామా? అనే సందేహం కలుగుతోంది. తప్పుడ చేస్తే చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చు. కానీ పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే, వైఎస్సార్సీపీలో ఆయన నాయకుడిగా కొనసాగుతున్నందున కక్షసాధింపుతో కావాలనే ఒక భయోత్పాతాన్ని సృష్టించేలా ఆయనను అరెస్ట్ చేశారు.అర్ధరాత్రి తన కుటుంబంతో నిద్రిస్తున్న సమయంలో, ఆయనను పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు హంగామాతో బలవంతంగా ఈడ్చుకుంటూ తమతో తీసుకువెళ్ళిన ఘటన అభ్యంతరకరం. ఆయన సంతానంలో దివ్యాంగురాలైన కుమార్తె కూడా ఉంది. జరుగుతున్న ఈ తతంగంతో ఆమె భీతావాహం అయ్యింది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? లోకేష్ రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందా? అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వైయస్ఆర్సీపీ నేతలను భయపెట్టాలనుకోవడం వారి అవివేకమని వేమారెడ్డి హెచ్చరించారు. -
ఎల్లో మీడియాకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సవాల్
సాక్షి, కర్నూలు జిల్లా: ఎల్లో మీడియాకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సవాల్ విసిరారు. ప్రధాని మోదీ పర్యటనలో వైఎస్సార్సీపీ నేతలు కలవలేదని అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మేం ఫేక్ ఎమ్మెల్యేలం కాదు.. ఎల్లో మీడియా ఫేక్ అంటూ విరూపాక్షి మండిపడ్డారు. మేం వినతి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపించకపోతే ఈటీవీ, ఏబీఎన్ మూసేస్తారా? అంటూ విరూపాక్షి ఛాలెంజ్ విసిరారు.వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే చేపట్టాలని.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుంటే దాన్ని పచ్చ మీడియా తప్పుదోవ పట్టిస్తుందంటూ విరూపాక్షి దుయ్యబట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని మోదీకి వినతి పత్రం ఇస్తే జీర్ణించుకోలేక పోయారంటూ ఎల్లో మీడియాపై ఆయన మండిపడ్డారు.కాగా, మెడికల్ కళాశాలలను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం(అక్టోబర్ 16, గురువారం) కర్నూలుకు వచ్చిన మోదీని ఓర్వకల్లు విమానాశ్రయంలో జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని అందించారు.అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను మీడియాకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారన్నారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి 5 మెడికల్ కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.ఈ కళాశాలల నిర్వహణను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ తరహాలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు అధిక నిధులు విడుదల చేసేలా నీతి ఆయోగ్‌కు సూచనలు ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు నిరి్మంచనున్న 167కే జాతీయ రహదారి మధ్యలో కొల్హాపూర్ సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నదిపై వైర్ కమ్ రోడ్ వంతెనగా మార్చాలని కోరామన్నారు. 2019లో ఇచ్చిన హామీ మేరకు వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరామన్నారు. -
నన్ను కలవొద్దని ఈ కుటుంబాన్ని బెదిరించారు: రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్ రాయ్‌బరేలీలో గాంధీ జయంతి నాడు దొంగ అనే అనుమానంతో హరీఓం వాల్మీకి అనే దళితుడ్ని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన అక్కడ తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం ఫతేపూర్‌లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను కలవొద్దని ఈ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని బెదిరించిందని.. అది కుదరకపోవడంతో ఫేక్ ప్రచారానికి దిగిందని మండిపడ్డారాయన. దేశంలో దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కుటుంబం ఎలాంటి నేరం చేయలేదు. ఇది ఒక బాధిత కుటుంబం. కానీ వీళ్లేదో నేరస్తులన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నన్ను కలవొద్దని వీళ్లను పోలీసులు బెదిరించారు. వీళ్లను కనీసం ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. హరీఓం కుమార్తెకు శస్త్రచికిత్స అవసరం. వీళ్ల ఆంక్షలతో ఆమెకు కనీస వైద్యసేవలు అందడం లేదు. చర్యలు తీసుకోవాల్సింది నేరస్తుల మీద. వీళ్ల మీద కాదు. నేరస్తుల రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అని యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. మాకు మీ పరామర్శ అక్కర్లేదు.. ప్రభుత్వం తగినంత సాయం చేసింది అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పోస్టర్లను చించేయగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంకోవైపు.. హరీఓం సోదరుడు, ఆ కుటుంబం పేరిట కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యింది. मृतक हरिओम वाल्मीकि के भाई ने Rahul Gandhi को Expose कर दिया।शर्मा आनी चाहिए कांग्रेस को।pic.twitter.com/UnKZrN1Tlf— Unfileterd Rencho (@UnfileterdR) October 17, 2025రాష్ట్ర మంత్రులు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. మా సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు. నేరస్తులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో మేం సంతృప్తిగానే ఉన్నాం. రాహుల్ గాంధీ సహా నేతలెవరూ మా ఇంటి వైపు రావొద్దు అంటూ ఆయన చెప్పడం అందులో ఉంది. పైగా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయానే వాటిని పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వీడియోలపై మీడియా నుంచి రాహుల్ గాంధీకి ప్రశ్న ఎదురైంది.ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతీసారి బీజేపీ ఇలానే చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అది బలవంతంగా తీయించిన వీడియో అని, ఆ వీడియోను మోదీ అనుకూల మీడియా(Godi Media), బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారాయన. అయితే కాసేపటికే రాహుల్‌ను కలవడం సంతోషంగా ఉందంటూ మరో వీడియో ఆ కుటుంబం పేరిట బయటకు రావడం గమనార్హం.Whenever you think that BJP can’t stoop lower than this, they set a new parameter. Hariom Valamiki family told Rahul Gandhi Ji that they were threatened by the BJP govt to not meet him and they were forced to say this on camera. That video was made viral by Godi media and BJP. pic.twitter.com/q42JsYrBxc— Shantanu (@shaandelhite) October 17, 2025అక్టోబర్ 2వ తేదీన జమునాపూర్ వద్ద హరీఓం వాల్మీని దొంగగా అనుమానించి కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విమర్శల నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించింది యోగి ప్రభుత్వం. అక్టోబర్ 11వ తేదీన బాధిత కుటుంబాన్ని యోగి పరామర్శించారు. ఆ కుటుంబం కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆ సమయంలో భరోసా ఇచ్చారాయన. అంతేకాదు.. హరీఓం సోదరికి కాంట్రాక్ట్ బేస్ మీద స్టాఫ్ నర్స్‌గా ఉద్యోగం ఇప్పించారు. राहुल गांधी जी आज हमसे मिलने आए। वे हमारे लिए मसीहा हैं, हम चाहते हैं कि वे हमें न्याय दिलाएं। - हरिओम वाल्मिकी जी का परिवारअब बिलकुल चुप रह तू ।pic.twitter.com/wr7DkBZW5Y— Surbhi (@SurrbhiM) October 17, 2025ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిని అక్టోబర్ 10న ఎన్కౌంటర్లో పట్టుబడ్డాడు. ఇప్పటిదాకా 14 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమర్శల నేపథ్యంలో.. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. జాతి కోణంలో ఈ ఘటనను చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. -
చంద్రబాబుకు పేర్ని నాని సవాల్..
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్థన్‌తో వీడియో చేయించారని ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబుకు సవాల్ విసిరారు. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు ఎల్లో మీడియా సైతం సిద్దమా అని సవాల్ చేశారు. ఇక, బార్లలో నెలకు రూ.5 కోట్లు భారీ అవినీతి జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నకిలీ మద్యాన్ని కవర్ చేయడం తెలియక ఎల్లో మీడియా చచ్చిపోతుంది. ఈనాడులో నకిలీ మద్యం మీద వార్తలే లేవు!. నకిలీ మద్యంపై ఆంధ్రజ్యోతి వార్తలు జుగుప్సాకరంగా ఉన్నాయి. జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదు. జనార్థన్, సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. నకలీ మద్యం కేసులో ఏ1 జనార్థన్ పెళ్లికి వచ్చినట్టు గన్నవరంలో దిగాడు. జనార్థన్‌తో కూటమి ప్రభుత్వ పెద్దలు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలాడారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు జనార్థన్‌తో వీడియో చేయించారు.అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్‌లు.. కూటమి ప్రభుత్వం వచ్చాక క్యూఆర్ కోడ్ ఎందుకు రద్దు చేశారు. నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముకోవడానికే క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. మళ్లీ ఏడాదిన్నర తర్వాత క్యూఆర్ కోడ్ ఎందుకు తెచ్చారు?. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందానా.. క్యూఆర్ కోడ్ రాగం ఎత్తుకున్నారు. నకిలీ మద్యం వ్యవహారం చేయిదాటి పోతుందనే క్యూ ఆర్ కోడ్ తెచ్చారు. క్యూ ఆర్ కోడ్‌పై కూటమి నేతలు డ్రామాలు మానుకోవాలి. రాష్ట్రంలో పర్మిట్ రూమ్లేని షాపులు ఉన్నాయా?. పట్టణాల్లో పర్మిట్ రూమ్‌కు రూ.7.5లక్షలు, గ్రామాల్లో 5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్‌లు పెట్టారు. ఏపీలో 3736 మద్యం దుకాణాలు ఉంటే 3736 పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది. రాష్ట్రంలో లక్షా 50వేలకు పైగా బెల్టు షాపులు ఉన్నాయి. బెల్టు షాపులు ఏర్పాటు చేసింది నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముకోవడానికే కదా.నగదుకే మందు ఎందుకు?..రూ.99 మందును రెండు నెలలకే అటక ఎందుకెక్కించారు?. రూ.99కే మందు దొరికితే నకిలీ మద్యం అమ్ముకోవడం కుదరదు కాబట్టే ఆపేశారు. కూటమి ప్రభుత్వంలో పది శాతం కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు. వైన్ షాపుల్లో 25 శాతం డిజిటల్ పేమెంట్స్ అంటే చంద్రబాబు ఎలా నమ్ముతున్నారు?. నగదుకే మందు ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు తెలియదా?. జనార్థన్ ఫ్యాక్టరీలో మందు నకిలీయే కానీ.. ప్రమాదం కాదట!. నకిలీ మద్యం అయినా తాగేయమని అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు సవాల్చంద్రబాబు.. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా?. నెలకు రూ.5 కోట్లు దండుకుని బార్లలో పెద్ద ఎత్తున స్కాం చేస్తున్నారు. ప్రభుత్వ డిపోల నుండి కాకుండా బయటి నుండి పెద్ద ఎత్తున సరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఆ మద్యం విక్రయాల కోసం నెలకు రూ.5 కోట్లు లంచాల కింద వసూలు చేస్తున్నారు. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?. చంద్రబాబుకు దమ్ముంటే బార్లలో తనిఖీలు చేసేందుకు రాగలరా?. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు ఎల్లోమీడియా, రాజకీయ పార్టీల సమక్షంలో మేము సిద్దం. మా హయాంలో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?. నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. మద్యం సీసాల మీద క్యూఆర్ కోడ్ పెట్టామని ప్రెస్ మీట్ పెట్టేంత ఖాళీగా చంద్రబాబు ఉన్నారు. రోజుకు రూ.3 లక్షల బిజినెస్ చేయకపోతే బార్లకు నష్టం వస్తుంది. విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు లాంటి నగరాల్లో నెలకి రూ.80 లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి. ఈ మేరకు ఆ షాపులు కొనుగోలు చేస్తున్నాయా?. ప్రభుత్వానికి చాలెంజ్ చేస్తున్నా.. ఆ వివరాలు బయట పెట్టగలరా?.కరకట్టకే డబ్బంతా..డబ్బంతా కరకట్ట బంగ్లాలోకి వెళ్తోందా? విమానాల్లో హైదరాబాద్ వెళ్తుందో చెప్పాలి. నకిలీ మద్యం తాగినా జనం చనిపోరని ఎల్లోమీడియా రాసింది. అంటే నకిలీ మద్యం తాగొచ్చని ప్రభుత్వమే స్టాంప్ వేసినట్టు కాదా?. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా?. రేపోమాపో జయచంద్రారెడ్డిపై సస్పెన్షన్ ఎత్తేస్తారు. జనార్థన్కి బెయిల్ ఇప్పించి బయటకు తెస్తారు. నకిలీ మద్యం తయారు చేసిన జయచంద్రారెడ్డి, జనార్ధన్, సురేంద్ర నాయుడు ఫోన్లను అధికారులు ఎందుకు సీజ్ చేయలేదు?. ఏ సంబంధం లేని జోగి రమేష్ ఫోన్లను ఎందుకు సీజ్ చేశారు?. అన్ని వర్గాల ప్రజలను పథకాల పేరుతో చంద్రబాబు నిలువునా మోసం చేశారు. పిఠాపురం వర్మ నుండి తాగుబోతుల వరకు ఇలా అందరినీ మోసం చేశారు. మద్యం షాపుల ఓనర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఈ విషయం వచ్చే సెప్టెంబరు నాటికి తెలుస్తుంది. -
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్చించి చెప్పాలని హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నెల 9 న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయగా.. నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిన్న సుప్రీం కోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్‌గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అన్నారు.నిన్ననే(అక్టోబర్ 16, గురువారం) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశాం. ఫ్రెష్ గా రిజర్వేషన్ లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుంది. రెండు వారాల సమయం కావాలంటూ కోర్టును స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. -
చారాణా కోడికి బారాణా మసాలా
ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడికి మించిన బ్రాండే లేదంటారు ఆయన కుమారుడు, టీడీపీ నేతలు. బాగానే ఉంది కానీ.. ఈ బ్రాండ్ విలువ కాస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత పేదలను చేస్తేనే వస్తుంది తంటా. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ వివరాలు తెలిస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. కేవలం రెండు వందల మందికి ఉద్యోగాలిచ్చే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకాఎకిన రూ.22 వేల కోట్ల రాయితీలు కల్పిస్తోంది మరి. చారాణా కోడికి బారా అణా మసాలా అన్నమాట!ఇంతటి భారీ రాయితీల వల్ల ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చితికిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఇప్పటికే విస్పష్టంగా చెప్పేశారు కూడా. కానీ యథావిధిగా ఏపీ మంత్రివర్యులు లోకేశ్ ఆ మాటలను ఖండించేశారు. కడుపుమంట అన్నట్టుగానూ మాట్లాడారు. ఇలా కాకుండా భారీ రాయితీలతో ఆర్థిక నష్టం ఉండదన్న విషయాన్ని వివరించి ఉంటే బాగుండేదేమో. ఐటీ ఉద్యోగాల కోసం రాష్ట్ర యువత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు భారీ ఎత్తున వెళుతున్న నేపథ్యంలో ఆచితూచి మాట్లాడటం మంచిదన్నది పలువురి అభిప్రాయం.గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితం ఎల్లో మీడియా దీనిపై పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించింది. రైడెన్ ఇన్ఫోటెక్ రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీంతో రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగం గతి మారిపోతుందన్నది దీని సారాంశం. దీంతోపాటే మరుసటి రోజు ఈనాడులో ఇంకో కథనం కూడా ప్రచురితమైంది. డేటా సెంటర్ ఏర్పాటకు గాన ప్రభుత్వం ఇస్తున్న రాయితీల మొత్తం రూ.22 వేల కోట్లు అని! కేబినెట్ ఆమోదం రోజున వెల్లడైన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో వచ్చే ఉద్యోగాల సంఖ్య 200 మాత్రమే.పెట్టుబడి మొత్తం ఒక్కో కోటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వవచ్చునన్నది సాధారణ అంచనా. ఈ లెక్కన డేటా సెంటర్‌తో 87 వేల ఉద్యోగాల సృష్టి జరగాలి. పరోక్షంగా ఉపాధి పొందేవారు దీనికి అదనం. కానీ ఇవేవీ జరుగుతున్నట్లు లేదు. అటు సీఎం చంద్రబాబు, ఇటు రైడెన్ సంస్థ ప్రతినిధులు కానీ ఉద్యోగాల సంఖ్య విషయంలో పెదవి విప్పలేదు. ప్రభుత్వ జీవోలోనూ స్పష్టత లేదు. ఈ విషయాన్ని కవర్ చేసుకునేందుకా అన్నట్టు ఎల్లోమీడియా తరువాతి రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల మంది వరకూ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని కాకిలెక్కలు కొన్ని ప్రచురించింది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల సంఖ్య 1.87 లక్షలైతే.. కొత్తగా ఏర్పాటయ్యే ఒక డేటా సెంటర్లోనే అంతమొత్తంలో ఉద్యోగాలు ఎలా వస్తాయన్నది ప్రశ్న!ఎల్లో మీడియా బొంకులు అక్కడితో ఆగాయా? ఊహూ లేదు. డేటా సెంటర్ పెట్టుబడులన్నీ గూగుల్ పెడుతున్నట్టుగా రాశారు. వాస్తవానికి గూగుల్ అనుబంధం సంస్థ రైడెన్, అదానీ గ్రూపులు కలిసి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ కూడా భాగస్వామి అని తెలుస్తోంది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అదానీ ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ కోసం 150 ఎకరాల భూమి కేటాయించారు. సీఎంగా ఆయన శంకుస్థాపన కూడా చేశారు.డేటా సెంటర్‌తోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని, 25 వేల ఉద్యోగాలు కల్పించాలన్న షరతులతో అదానీకి స్థలం కేటాయించడం గమనార్హం. ఈ ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలోనే అదాని కంపెనీకి రైడెన్, ఎయిర్‌టెల్‌లు తోడయ్యాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాలు డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించిన తరువాతే రైడెన్ అదానీ కంపెనీతో జత కట్టడం గమనార్హం. ఈ డేటా సెంటర్లకు కావాల్సిన భారీ విద్యుత్తు, నీటి అవసరాలను తీర్చలేకపోవడం, డేటా సెంటర్లతో వచ్చే కాలుష్య సమస్యపై ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఎక్కడైనా పరిశ్రమ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి. కాని చంద్రబాబు ఇచ్చిన రాయితీలను పరిగణనలోకి తీసుకుంటే మరో పది నుంచి ఇరవై ఏళ్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఖర్చే మినహా పైసా ఆదాయం ఉండదని స్పష్టమవుతోంది. లక్షల కోట్ల టర్నోవర్, వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన స్థోమత ఉన్న కంపెనీలకు మళ్లీ అంతే స్థాయిలో రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందా? అన్నది ప్రశ్న. అసలు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న కంపెనీ ఇన్ని రాయితీలు ఎలా కోరుతోందో అర్థం కాదు. తాము పెట్టదలచిన మొత్తంలో 25 శాతం ముందుగానే గిట్టుబాటు చేసుకుంటున్నారన్న భావన రాదా? కంపెనీలను ఆకర్శించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదు కానీ.. ఒకపక్క వైద్య కళాశాలల నిర్మాణానికి డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలకూ నిధుల్లేవంటున్న ప్రభుత్వం ఇలా కంపెనీలకు వేల వేల కోట్ల రాయితీలు ఇవ్వడం ఎంత వరకూ సమంజసం? కొన్ని కంపెనీలకు భారీ రాయితీలు.. ఇంకొన్నింటికి కారుచౌకగా భూములు ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... భారతీ సిమెంట్స్ మైనింగ్ లీజులను కక్షపూరితంగా రద్దు చేసే ప్రయత్నం చేస్తూండటం విమర్శలకు గురవుతోంది. అడక్కపోయినా టీసీఎస్ కంపెనీకి ఎకరాకు రూపాయి చొప్పున 22 ఎకరాల భూమి కేటాయించింది. కాగ్నిజెంట్, ఉర్సా కంపెనీలకూ ఇదే లెక్కన భూమి ఇస్తున్నామని అంటున్నారు.తాజాగా రైడెన్ కంపెనీకి 25 శాతం రాయితీతో 480 ఎకరాలు ఇస్తారట. స్టాంపు డ్యూటి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయిస్తారు. కంపెనీ వారు ప్లాంట్, మెషినరీ కొనుగోలు ఖర్చులో పది శాతం రాయితీ అంటే రూ.2129 కోట్లు ప్రభుత్వం భరిస్తుందట. డేటా సెంటర్ నిర్మాణానికి చెల్లించే జీఎస్టీ మొత్తం కంపెనీకి తిరిగి చెల్లిస్తారు.దీని విలువ రూ.2245 కోట్లు. లీజులపై చెల్లించే జీఎస్టీ పదేళ్లపాటు చెల్లించే మరో రూ.1745 కోట్లు కూడా ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఏపీ ప్రజలపై కొన్నివేల కోట్ల రూపాయల అదనపు ఛార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వం రైడెన్ కంపెనీకి మాత్రం యూనిట్‌కు రూపాయి రాయితీ ఇస్తోంఇ. తద్వారా కంపెనీకి పదేళ్లలో కలిగే లాభం రూ.4800 కోట్లు! సుంకాల్లో మినహాయింపులు మరో రూ.1200 కోట్లు. పంపిణీ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ ఛార్జీలు కలిపి మరో రూ.8500 కోట్లు ఉంటాయని లెక్క గడుతున్నారు.ఈ అంశాలపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేశారనుకోండి.. ఈనాడు వంటి సంస్థలు ఠకీమని అదంతా విష ప్రచారమన్న పాట అందుకుంటున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధాని అని గతంలో జగన్ అన్నప్పుడు ఇదే ఎల్లోమీడియా విశాఖకు వ్యతిరేకంగా బోలెడు కథనాలు వండి వార్చాయి. సముద్రం మట్టం పెరుగుతోందని, విశాఖకు ఏదో అవుతుందంటూ, ప్రజలను భయపెట్టేశారు. రిషి కొండపై నాలుగు ఆధునిక భవనాలు గత ప్రభుత్వం నిర్మిస్తే, పర్యావరణం నాశనం అయిపోయిందని, కొండకు గుండు కొట్టారంటూ తప్పుడు వార్తలు రాశారు. విష ప్రచారం అంటే అది! రిషికొండ భవనాలతోపాటు మరో తొమ్మిది ఎకరాల భూమిని ఇప్పుడు ప్రైవేటు వారికి ఇస్తుంటే మాత్రం వీరికి నోరు పెగలడం లేదు.డేటా సెంటర్ వల్ల ఉష్ణాగ్రత పెరుగుతుందని ఒప్పుకుంటూనే అది పెద్ద ఇబ్బంది కాదని సమర్థించుకున్నారు. ఇలా ఉంది వారి జర్నలిజం . మరో వైపు చక్కగా నడుస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న భారతి సిమెంట్, ఏసీసీ, రామకో సిమెంట్ కంపెనీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన సున్నపురాయి లీజులను రద్దు చేస్తారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధం ఉన్న భారతి సిమెంట్ కంపెనీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేస్తోందన్నది వాస్తవం. ఇది కదా నడుస్తున్న పరిశ్రమలకు తరిమివేసే ప్రయత్నం అంటే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.గూగుల్ డేటా సెంటర్ ఏపీ ప్రజలకు, ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి ప్రయోజనం కలిగేలా ఏర్పాటైతే స్వాగతించాల్సిందే. కాకపోతే దాని వల్ల వచ్చే సమస్యలను అధ్యయనం చేయడం అవసరం.అప్పులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏపీలో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థకు 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంలోని హేతుబద్దతపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోతే ప్రజలలో అనుమానాలు బలపడతాయని గమనించాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అదే జరిగితే బెంగాల్లో రాష్ట్రపతి పాలనే.. సువేందు అధికారి హెచ్చరిక
జల్పాయ్గురి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి 2026లో జరగనున్న ఎన్నికలతో ప్రభుత్వం మారనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి జోస్యం చెప్పారు. సకాలంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.జల్పాయ్గురి జిల్లా నగ్రాకటలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తికాని పక్షంలో ఎన్నికలు జరగవన్నారు. ‘వచ్చే ఏడాది మే 4వ తేదీకల్లా ఎస్ఐఆర్ పూర్తి చేయాల్సి ఉంది. లేకుంటే ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల ముందు సెమీఫైనల్స్ వంటిది. ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదు’ అని సువేందు వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ‘2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలు పొందిన ఓట్లలో తేడా 42 లక్షలు మాత్రమే. అప్పట్లో అక్రమంగా చేర్చిన 2.4 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎస్ఐఆర్లో తొలగిస్తారు. అక్రమ వలసదారులు, ఇతరత్రా అనర్హుల పేర్లు సైతం ఉండవు. భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీకి తన చేతిలో ఓటమి తప్పదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
గూగుల్‌తో ఆ మాట చెప్పిస్తే సన్మానం చేస్తాం: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో గూగుల్ డాటా సెంటర్ రాకతో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం, దాని అనుకూల మీడియా.. సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రచారంపై క్లారిటీ ఇవ్వకపోగా.. గత వైఎస్సార్సీపీ పాలనపై, ఆ పార్టీ నేతలపై ఐటీ మంత్రి నారా లోకేష్ నిందలు వేస్తున్నారు. అయితే వాటికి మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ (Gudivada Amarnath on Google Data Center Jobs)ఇచ్చారు. శుక్రవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గూగుల్‌తో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కదా. ఆ మాట గూగుల్‌తోనే చెప్పించండి. కనీసం ఆ సంస్థతో ఓ అధికారికి ప్రెస్‌నోట్ అయిన రిలీజ్ చేయించండి. అది నిజమని తెలిస్తే మేమే సన్మానం చేస్తాం.... గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం, ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోకేష్ మీడియా ముఖంగా ప్రజల అనుమానాలకు సమాధానం చెపుతారు అని భావించాను. కానీ ఆ డేటా సెంటర్‌ను మా పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనిని స్వాగతిస్తున్నట్లు తొలిరోజే వైఎస్సార్సీపీ చెప్పింది. అయితే.. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయని, ఎంత రెవెన్యూ రాష్ట్రానికి వస్తుందని మాత్రం అడిగాం. అందులో తప్పేముంది?.... 1 గిగా వాట్ డేటా సెంటర్ ద్వారా గూగుల్ ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది?. గూగుల్ డేటా సెంటర్ వలన 200 మందికి ఉద్యోగాలు వస్తాయని ఈనాడు పేపర్ లో వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ లో ఉన్న ఉద్యోగులు 1.88 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో 1.88 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది కదా. అయినా ఉద్యోగాల గురించి లోకేష్, టీడీపీ నేతలు కాదు చెప్పాల్సింది. ఆ మాట ఆ సంస్థ చెప్పాలి. అసలు గూగుల్‌తో సమాధానం చెప్పించడానికి ఐటీ మంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటి?. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నన్ను గుడ్డు అన్నా.. నేను లోకేష్‌ను పప్పు అన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు.ముందు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి. మాయ మాటలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయొద్దు. కష్టపడి పోరాటం చేసి జగన్ ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను. ఎవరో డబ్బులు కడితే చదువుకోలేదు(లోకేష్‌ను ఉద్దేశించి..). విశాఖ నగరానికి ఏడాదికి ఐదు టీఎంసీల నీళ్లు అవసరం. గూగుల్ డేటా సెంటర్‌కు ఏడాదికి మూడు టీఎంసీల నీళ్లు అవసరం, ఎలా సర్దుబాటు చేస్తారు?. డేటా సెంటర్ వలన ఒకటి నుంచి రెండు సెంటిగేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అని మేధావులు చెబుతున్నారు. దాని మీద ఏమైనా స్టడీ చేశారా?. ఒక రోజు మొత్తానికి విశాఖ నగరంకు ఎంత కరెంట్ అవసరమో, గూగుల్ డేటా సెంటర్ కు ఒక గంటకు అంత కరెంట్ అవసరం అవుతుంది. రామాయపట్నం, బందరు మూలపేట, భోగాపురం ఎయిర్ పోర్టు, NTPC గ్రీన్ ఎనర్జీ దగ్గర నేను నిలబడి మా హయంలో వచ్చింది అని చెప్పగలను. నువ్వు మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చావు నేను మంత్రి ఎన్ని పరిశ్రమలు తెచ్చావు కూర్చొని రాసుకుందాం రా?.. నారా లోకేష్ ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏం తెచ్చారు.. ఏ ప్రయోజనం చేకూర్చారు. నువ్వు మంత్రిగా ఏమి చేశావో చెప్పగలవా.. అమరావతి రోడ్లు తప్ప. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే లోకేష్ భరించలేరు. వర్ధంతి జయంతికి తేడా తెలియని వ్యక్తి కూడా మాట్లాడుతున్నారా?. ఆయనలా నేను ఎవరి దగ్గర స్క్రిప్ట్ తీసుకొని చదవను. ట్రోలింగ్‌కు జాతి పితా లోకేష్ అని ఎద్దేశా చేశారు. వ్యక్తిగత విమర్శలు ఇకనైనా మానుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ లోకేష్‌కు హితవు పలికారు. ఇదీ చదవండి: కల్తీ మద్యం కేసు.. కమీషన్ మాట్లాడుకుందామా? -
నితీశ్ మళ్లీ సీఎం.. డౌట్ కామెంట్స్ చేసిన అమిత్ షా!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార ఎన్డీయే కూటమిలో లుకలుకలు నడుస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అలాగే.. బీహార్ సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపైనా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ స్పష్టత ఇచ్చారు.బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు(Amit Shah On Bihar CM Candidate). బీహార్ ఎన్డీయే కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పనికి మాలినవని తోసిపుచ్చారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోనే బీహార్ ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని షా ప్రస్తావించారు. అయితే.. బీహార్ ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు.. అంత తొందర ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారా? కారా?(Will Nitish Kumar CM Again) అనేది నేను ఒక్కడినే నిర్ణయించే అంశం కాదు. ప్రస్తుతానికి ఆయన సారథ్యంలోనే మేం ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలయ్యాక.. మిత్రపక్షాలన్నీ కూర్చుని అప్పుడు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తాయి అని షా స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల్లో(2020) జేడీయూ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు నెగ్గింది. ఆ టైంలో నితీశ్ కుమార్ ప్రధాని మోదీని కలిసి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండడం సబబని అన్నారు. కానీ, మా మిత్రపక్షానికి మేం ఎప్పుడూ గౌరవం ఇస్తాం. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని సీఎం చేశాం అని షా అన్నారు.నితీశ్ తరచూ పార్టీలు మారుతున్న సందర్భాన్ని ప్రస్తావించగా.. షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1974లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణన్ సారథ్యంలో జరిగిన ఆందోళనతో నితీశ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని, అది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సందర్భాన్ని గుర్తు చేశారు. పైగా నితీశ్ రెండున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగించారని.. ఎక్కువ కాలం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇక..నితీశ్ ఆరోగ్యం, పబ్లిక్‌లో ఆయన ప్రవర్తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా అమిత్ షా స్పందించారు. వయసు కారణంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ, ముఖాముఖిగా, ఫోన్ ద్వారానూ నితీశ్ సుదీర్ఘంగా, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారని షా అన్నారు. అంతేకాదు.. సీఎంగా ఆయన సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు.ఇక.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections 2025) ఎన్డీయే కూటమి మునుపెన్నడూ చూడని ఘన విజయం సాధిస్తుందని.. నవంబర్ 14న వెల్లడయ్యే ఫలితాలతో గత రికార్డులను బద్దలు కొడతామని షా ధీమా వ్యక్తం చేశారు.74 ఏళ్ల వయసున్న నితీశ్‌కుమార్ ఇప్పటికే 9 సార్లు(2000 సంవత్సరంలో తొలిసారి) బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ఆయన బీహార్ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని, గవర్నర్‌గానో, రాజ్యసభకో వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. అంతెందుకు మొన్నీమధ్యే ఉప రాష్ట్రపతి పదవి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. అయితే నితీశ్ 10వ సారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని జేడీయూ అంటోంది.ఇదీ చదవండి: కరూర్ ఘటన తర్వాత.. విజయ్ క్రేజ్ మరింత పెరిగిందా? -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్‌కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్‌లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.ఈ పరిస్థితులలో విజయ్‌కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్ ఘటనతో విజయ్‌కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. -
కాంగ్రెస్, జేడీయూ అభ్యర్థుల ప్రకటన.. కూటమిలో ట్విస్ట్!
న్యూఢిల్లీ: బీహార్ (Bihar Assembly Election) అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ (Congress Party) శుక్రవారం 48 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ రామ్ కుటుంబా స్థానం నుంచి... కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత షకీల్ అహ్మద్ ఖాన్‌కు కద్వా నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ చీఫ్ ప్రకాశ్ గరీబ్ దాస్‌కు బెచ్వాడా సీటు కేటాయించారు.బగాహాలో జయేశ్ మంగళ్ సింగ్, నౌతన్లో అమిత్ గిరి, చన్‌పటియాలో అభిషేక్ రంజన్, బెట్టియాలో వాసి అహ్మద్, రక్జౌల్లో శ్యామ్ బిహారీ ప్రసాద్ పోటీ చేయనున్నారు. గోవింద్గన్ స్థానం నుంచి శశి భూషణ్ రాయ్ అలియాస్ గప్పు రాయ్, రిగా నుంచి అమిత్ కుమార్ సింగ్ పోటీకి దిగనున్నారు. కాగా, ఆర్జేడీ సహా మహా ఘఠ్బంధన్ పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాకమునుపే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17వ తేదీ ఆఖరు. రెండో దశ పోలింగ్‌కు నామినేషన్లకు ఈ నెల 20వ తేదీతో గడువు ముగియనుంది.101 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన జేడీయూమరోవైపు.. బీహార్‌లో అధికార ఎన్డీఏ (NDA) కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ జనతాదళ్(యునైటెడ్) తాము పోటీచేయబోయే మొత్తం 101 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 57 మందితో తొలిజాబితా విడుదలచేయగా గురువారం మిగతా 44 మంది అభ్యర్థులతో చివరి జాబితాను వెల్లడించింది. చాలా మంది అభ్యర్థులు వెనువెంటనే తమ నామినేషన్లు దాఖలుచేస్తూ బిజీగా కనిపించారు. మొత్తం 101లో ఓబీసీలకు 37, ఈబీసీలకు 22, అగ్రవర్ణాలకు 22 చోట్ల అవకాశం కల్పించింది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తన రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇచ్చారు. విజయ్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జామా ఖాన్, షీలా మండల్, లేశీ సింగ్, సుమిత్ సింగ్, విభా దేవి, చేతన్ ఆనంద్, శ్వేతా గుప్తా ఈసారి బరిలో దిగనున్నారు. -
పెద్దల వద్దకు ‘కొండా’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణా మాలు కలకలం రేపాయి. కొంతకాలంగా నెల కొన్న వివాదం గురువారం రాత్రి వరకు కొన సాగింది. పరిస్థితి మరీ దిగజారి రచ్చకెక్కకుండా పార్టీ పెద్దలు అతికష్టం మీద నియంత్రించగలి గారు. తనను లక్ష్యగా చేసుకొని పార్టీలో, మంత్రివర్గంలో కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్న మంత్రి సురేఖ గురు వారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశ మై తన వాదన వినిపించారు.అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో కూడా చర్చించారు. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా తన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీని ప్రభుత్వం తొలగించడాన్ని అవమానకరంగా భావించినట్లు ఆమె వారికి తెలిపినట్లు సమాచారం. పార్టీలో తనపై జరుగుతున్న దాడి గురించి మీనాక్షికి వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాలేదు. పార్టీ పెద్దల నిర్ణయమే శిరోధార్యం: కొండా మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘తాజా పరిణామాలపై పార్టీ ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడు మహేష్మార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినం. ఈ విషయంలో పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. సమస్యను పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా మని చెప్పారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసా ఉంది’అని పేర్కొన్నారు. నివురుగప్పిన నిప్పులా పరిస్థితి..వరంగల్‌లో మంత్రి పొంగులేటి దేవాదాయ శాఖకు సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సమావేశం జరగడం, ఆ తరువాత సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగించడంతో వివాదం ముదిరింది. మేడారం అభివృద్ధి పనులను దేవా దాయ శాఖ నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదలాయించడంతో మంత్రి సురేఖ ప్రమేయం లేకుండానే పనులు జరుగుతున్నాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంత్రి కుమార్తె సుష్మిత.. సీఎం పలువురు మంత్రులపై నేరుగా విమర్శలు చేశారు. బీసీ నాయకురాలైన తన తల్లి పట్ల ఓ వర్గం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం సృష్టించాయి. -
రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు
రాజమహేంద్రవరం రూరల్: ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు లిక్కర్ సిండికేట్‌తో అధికార పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ మండిపడ్డారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ పరిధిలోని 39 మద్యం షాపుల సిండికేట్‌కు సంబంధించిన ఆడియో సాక్షిగా అధికార పార్టీ నేతల అక్రమాలను భరత్ బయటపెట్టారు.రేట్ల పెంపు, బెల్టు షాపుల ఏర్పాటుతో పాటు ఎక్సైజ్ అధికారుల మామూళ్ల గురించి నిస్సిగ్గుగా చర్చిస్తున్న టీడీపీ రాజమహేంద్రవరం నగర పట్టణ అధ్యక్షుడు మజ్జి రాంబాబుతో పాటు ఆయన వెనకున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అక్రమాలకు వేదికగా రాజమహేంద్రవరం టీడీపీ ప్రభుత్వంలో రాజమహేంద్రవరం అక్రమాలకు వేదికగా మారింది. రాజమండ్రి సిటీ ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమహేంద్రవరం నగరం, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నియోజకవర్గం రాజమండ్రి రూరల్‌లోని 39 మద్యం దుకాణాల సిండికేట్ మీటింగ్ పెట్టారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడైన టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఫోన్ సంభాషణ ద్వారా అధికార పార్టీ నేతల సిగ్గులేని తనం బయటపడింది.రూ.100 బాండ్ పేపరు మీద సంతకాలు చేద్దామంటూ నిస్సిగ్గుగా ప్రతిపాదించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 37ఏ, 39/1, 2 సెక్షన్ల ప్రకారం వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలి. మజ్జి రాంబాబు వెనుక ఉన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేయాలి. ఆయన్ని చంద్రబాబు బర్తరఫ్ చేయాలి. దీంతో పాటు ప్రభుత్వ అధికారులకు లంచాలిద్దామంటూ నేరుగా చెబుతున్నారు. దీనిపై బీఎన్ఎస్ 274, 276 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే అండతోనే సిండికేట్ మంతనాలు ఎక్సైజ్ అధికారులు ఎవరి మీద కేసు పెట్టాలో కూడా డ్రా తీసి వీళ్లే నిర్ణయిస్తామని చెబుతున్నారు. కేసు పెట్టిన షాపు కట్టాల్సిన ఫైన్ సిండికేట్ మొత్తం భరించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. రెండుసార్లు కేసులు వస్తే.. ఆ షాపు క్లోజ్ అవుతుంది కాబట్టి వంతుల వారీగా ఏ షాపు మీద కేసు పెట్టాలో కూడా సిండికేటే నిర్ణయిస్తుంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అండ లేకుండా ఇలా అధికారులను సైతం ప్రభావితం చేయడం సాధ్యమా? లేని లిక్కర్ కేసులో మా పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని, ఇతర నేతలను అరెస్టు చేశారు. ఇవాళ మీ పార్టీ నేతలు బహిరంగంగా దొరికిపోయారు.రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీలో చంద్రబాబుకు సైతం భాగస్వామ్యం ఉంది. కూటమి నేతలు ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇంత పెద్ద ఎత్తున స్కామ్‌కు పాల్పడుతున్న వీళ్లందరినీ అండమాన్ లేదా తీహార్ జైలుకు పంపించాలి. కూటమి నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఆ బురదను ప్రతిపక్షంపై చల్లుతున్నారు. మద్యం షాపుల్లో అమ్మే మందు అసలా, నకిలీయా తేల్చాల్సింది ప్రభుత్వం. ఒకవైపు నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ.. కొనే ముందు ఫోనులో స్కాన్ చేసి అది అసలా.. నకిలీయా టెస్ట్ చేయమంటున్నారు. రూ.100కు చీప్ లిక్కర్ కొనే వారి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందా?వైఎస్ జగన్ హయాంలోనే డేటా సెంటర్విశాఖలో ఏర్పాటు చేస్తున్నది గూగుల్ అదానీ ఎయిర్ టెల్ డేటా సెంటర్. దీనితో పాటు ఐటీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని వైఎస్ జగన్ విశాఖలో 130 ఎకరాల స్థలం ఇచ్చి ఎంఓయూ చేసుకున్నారు. 2021లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులతో 25 వేల ఉద్యోగాలతో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎక్స్‌పోలో అదానీ డేటా సెంటర్‌తో ఎంఓయూ చేసుకుని, 2023 మే నెలలో శంకుస్థాపన కూడా చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధినే చంద్రబాబు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. -
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ
సాక్షి, కాకినాడ: మంత్రి నారాయణ వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీకి నేనెప్పుడూ ఫైర్ బ్రాండేనన్న వర్మ.. మంత్రి నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదన్నారు. ఎవడో కర్మ, గడ్డి పరక అంటే నాకేంటి? అంటూ వ్యాఖ్యానించారు. తానేంటో పిఠాపురం ప్రజలకు తెలుసునన్నారు.కాగా, టెలి కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అసహనంగా ఉన్నారన్నారు. తనను నియోజకవర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచుకోకపోతే సహించేదిలేదన్నారు.నీ నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి పది, ఇరవై రోజులకు చిన్న ఇష్యూలు వస్తే పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కలిసి మాట్లాడుకుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొన్నారు.మనోహర్ తనకు ఫోన్ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా.. అంటూ అడిగారన్నారు. మీ నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. తన డిపార్ట్మెంట్ను డీగ్రేడ్ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా? అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ తిట్టడం వచ్చు.. కేకలేయడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
‘బీసీ రిజర్వేషన్లలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో వెనకడుగు వేసే ప్రకస్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్లో బీసీ సంఘాల నేతలతో సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ కుల సర్వేకు ఆద్యులు రాహుల్ గాంధీ. స్వాతంత్ర్యం అనంతరం శాస్త్రీయ బద్దంగా కుల సర్వే నిర్వహించి అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చాం. కామారెడ్డి డిక్లరేషన్‌కే కట్టుబడి ఉన్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్‌కు మద్దతు ఇస్తున్నాం. బంద్ విజయవంతం కావాలి. బీసీ బంద్‌తో కనువిప్పు కలగాలి. అసెంబ్లీలో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి మోకాలడ్డు పడుతున్నారు. రాహుల్ గాంధీ ఎవరి వాటా వారికి నినాదం.. ఉద్యమంగా మారింది. రాహుల్ గాంధీ నినాదం గొప్ప వరంబీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ పరంగా పోరాడుదాం. రాజకీయాలు ఎన్నికల వరకే. రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రిజర్వేషన్ల 9 వ షెడ్యూల్ చేర్చే విషయంలో ప్రధాని మోదీని అడిగేందుకు బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారు. బీజేపీ బిఆర్ఎస్లో పాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. సిఎం రేవంత్,నాకు ఉన్న సఖ్యత దేశంలో ఎక్కడా లేదు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ ఎనలేని కృషి చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి:బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్! -
అందుకే పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు: పోతిన మహేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని.. వారి కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నకిలీ మద్యంలో పవన్ కళ్యాణ్‌కీ భాగస్వామ్యం ఉందని.. అందుకే ఆయన దీనిపై నోరు మెదపటం లేదన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పవన్‌కు కనపడటం లేదా? అంటూ పోతిన మహేష్ నిలదీశారు.‘‘కొత్తగా తెచ్చిన క్యూ ఆర్ కోడ్ కంటితుడుపు చర్య మాత్రమే. రాష్ట్రంలో వైన్ షాపులన్నీ టీడీపీ నేతలవే. వారందరికీ నకిలీ మద్యంలో ప్రమేయం ఉంది. అలాంటప్పుడు క్యూ ఆర్ కోడ్ వలన ఏం ప్రయోజనం ఉంటుంది?. అసలు క్యూ ఆర్ కోడ్ పెట్టటం అంటే రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టు చంద్రబాబు అంగీకరించినట్టే.. అందుకే ఇప్పుడు వైన్ షాపుల్లో క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నారు. నకిలీ మద్యంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోంది, వేల కోట్ల రూపాయలు దోపిడీకి టీడీపీ పెద్దలు ప్లాన్ చేశారు. నకిలీ మద్యాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పటం లేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు.‘‘ప్రజలను మభ్య పెట్టటానికే క్యూ ఆర్ కోడ్ ప్రకటన చేశారు. స్మార్ట్ ఫోన్లు పేద ప్రజలందరి దగ్గర ఎలా ఉంటాయి?. వారు నకిలీ మద్యాన్ని ఎలా గుర్తిస్తారు?. బెల్టు షాపులు, పర్మిట్ రూములు పెట్టి గత 16 నెలలుగా దోపిడీ చేశారు. ఈ పర్మిట్ రూములలో పెగ్గుతో పాటు, ఫుడ్, బెడ్‌కి కూడా అవకాశం కల్పించారు. నకిలీ మద్యాన్ని ప్రోత్సాహించటానికే పర్మిట్ రూములకు అవకాశం ఇచ్చారా?. లూజుగా మద్యం విక్రయిస్తే అది నకిలీదో మంచిదే ఎలా తెలుస్తుంది?. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం షాపులన్నీ ప్రభుత్వ ఆదీనంలో నడిచాయి. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. డిస్టలరీస్ నుండి షాపుల వరకు అన్ని పాయింట్లలోనూ చెకింగ్ జరిగేది. అందువలన ఎక్కడా నకిలీ మద్యానికి ఆస్కారం లేదు..ఇప్పుడు టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ములకలచెరువు, అనకాపల్లి, ఏలూరులో భారీగా నకిలీ డంపులు బయట పడ్డాయి. ఇంత జరిగినా వైన్ షాపులలో ఎందుకు తనిఖీలు చేయట్లేదు?. రాష్ట్ర ప్రజలందరికీ ఏపీలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అర్థం అయింది. పవన్ కళ్యాణ్ ఈ నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. అనేక మంది చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు?. పవన్‌కు కూడా నకిలీ మద్యంలో భాగస్వామ్యం ఉంది. అందుకే ఆయన మాట్లాడటం లేదు’’ అంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. -
గుజరాత్లో కీలక పరిణామం.. మంత్రులంతా రాజీనామా
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. "ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారు" అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్త వారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు. -
Bihar Election: స్ఫూర్తినిస్తున్న ‘జన్ సురాజ్’ అభ్యర్థి నీరజ్
పట్నా: అతను ఢిల్లీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. అంచలంచలుగా ఎదుగుతూ రూ. 400 కోట్ల టర్నోవర్ గల కంపెనీని నడిపేస్థాయికి చేరుకున్నారు. అతనే బీహార్ పారిశ్రామికవేత్త నీరజ్ సింగ్. అతని జీవన ప్రయాణం సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది.38 ఏళ్ల నీరజ్ సింగ్ రాబోయే బీహార్ ఎన్నికల్లో షియోహార్ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు.బీహార్‌లోని షియోహార్ జిల్లాలోని మధురాపూర్ గ్రామంలో జన్మించిన నీరజ్ సింగ్ పదవ తరగతి పూర్తిచేశాక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్యోగాల వేటలో పడ్డారు. ఎటువంటి ఉద్యోగం దొరక్క, గ్రామంలో పెట్రోల్, డీజిల్ విక్రయించడం మొదలుపెట్టాడు. తరువాత ఢిల్లీకి వెళ్లి, సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరారు. అనంతరం పూణేకు చేరుకుని, ఒక ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ అటెండెంట్‌గా చేరారు. 2010లో ధాన్యం వ్యాపారాన్ని ప్రారంభించారు. అది కలసివచ్చింది. దీంతో ఇటుకలు, బిల్డింగ్ బ్లాక్స్, టైల్స్, ఇతర సిరామిక్ వస్తువులను విక్రయించే ఉషా ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. తదనంతర కాలంలో సింగ్ తన వ్యాపారాన్ని రోడ్డు నిర్మాణ రంగానికి కూడా విస్తరించారు. ఇటీవలే సొంత పెట్రోల్ పంపును ప్రారంభించారు. నీరజ్ సింగ్ స్థాపించిన కంపెనీ ప్రస్తుతం రూ. 400 కోట్ల టర్నోవర్‌తో, రెండువేల మంది సిబ్బందికి ఉపాధిని అందిస్తోంది. ఒకప్పుడు సైకిల్ కూడా లేని నీరజ్ సింగ్ దగ్గర నేడు అర డజనుకు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. సింగ్ తన ఇద్దరు సోదరులు, భార్య, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులతోపాటు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. పేద మహిళలకు వివాహాలు చేయడం, సీనియర్ సిటిజన్ల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు, వృద్ధుల కోసం తీర్థయాత్రలను నిర్వహించడం లాంటి సేవాకార్యక్రమాలను నీరజ్ సింగ్ నిర్వహిస్తున్నారు. -
‘సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిస్తామన్నారు.. ఏమైంది?’
విశాఖ: టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీ అని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలను అవమానించడమే టీడీపీ నేతల అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. జీడీ నెల్లూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మీ కోసం ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడరని, మహిళలను అవమానించినా చంద్రబాబు ఏమి అనరు అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘ టిడిపి నేతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే ఎలా ఉంటుంది. దళిత మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేశారు. ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలి. కృపాలక్ష్మి నిజాలు మాట్లాడితే ఆమెపై దాడి చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో టిడిపి నేతలు కాలకేయుల్లా ప్రవర్తిస్తున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన మహిళ నేత వీడియోలు తీయించాడు..డబ్బులు ఎరచూపి వీడియోలు తీయించారని కోట వినూత ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన వారిపై పోలీసులను ఉపయోగించడం లేదు. సుగాలి ప్రీతి తల్లిని నిర్బంధించడానికి మాత్రం పోలీసులను వాడుతున్నారు. సుగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకొని పవన్ ఓట్లు దండుకున్నారు.సుగాలి ప్రీతి కేసును సిబిఐకు ఇస్తామని ఎన్నికలకు ముందు పవన్ మాట్లాడారు. సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత బాబు పవన్ కళ్యాణకు లేదా?, సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ఎప్పుడూ తారు సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ఎప్పుడూ తారుమారయ్యాయి..?, ఎన్నికల్లో ఓట్ల కోసం సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారు. జడ్పీ చైర్పన్ ఉప్పాల హారికపై టిడిపి గుండాలు దాడి చేశారు. కేసు పెడితే కనీసం పోలీసులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో మహిళలపై ఎన్ని దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మహిళల పట్ల తప్పులు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?’ అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి. -
సాక్షి మీడియాపై కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్ కుట్రలు
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి ఏపీ పోలీసులు వరుసగా నోటీసులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వరుసగా మూడు రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు. సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇస్తున్నారు.కాగా, హైదరాబాద్‌లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం(అక్టోబర్ 15) కూడా దాదాపు 10 గంటల పాటు హల్చల్ చేయడం... ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో వేధించారు. ఇక ఎస్సీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జిని కూడా వారం రోజులుగా వేధిస్తుండటం సర్కారు కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు సాగిస్తోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్‌కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో కూడా ఆదివారం(అక్టోబర్ 12) తెల్లవారుజామున పోలీసుల దాష్టీకానికి దిగిన సంగతి తెలిసిందే.టీడీపీ సిండికేట్ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పోలీసు జులుంతో బరి తెగిస్తోంది! రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న ‘సాక్షి’పై అధికార మదంతో విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్ 19 (1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. -
కొండా సురేఖ ఎపిసోడ్.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపంగా కనిపిస్తుందన్నారు. సాయంత్రం లోగా ఈ విషయంపై క్లారిటీ వస్తుందని మహేష్ గౌడ్ అన్నారు.కాగా, సుప్రీం కోర్టు తీర్పుపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. హైకోర్టులో కేసుకి సమయం ఉందని.. వేచి చూస్తామన్నారు. హైకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. బీసీ రేజర్వేషన్ అంశం మీద కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉందని.. వెనక్కి తగ్గేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలనే తపన ఉందని.. హై కోర్టులో పోరాడతామని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి: బీజేపీ చీఫ్మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు మాట్లాడుతూ.. సిమెంట్ ఫ్యాక్టరీని బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండ సురేఖ కుటుంబ సభ్యులు చెబుతున్నారని.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలన్నారు. ‘‘కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి. బలవంతంగా కాంగ్రెస్ వసూలు చేస్తుంది. సీఎంపై ఆరోపణలు చేసింది కేబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే...దోచుకున్న సొమ్మును పంచుకోలేక దంచుకొని తన్నుకుంటున్నారు. కొండ సురేఖ కుమార్తె మాట్లాడిన విషయంపై విచారణ జరపాలి. దోచుకునే లీడర్లు ఎక్కువ రోజులు ఉండొద్దు. కాంగ్రెస్ నాయకులు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయొద్దు’’ అంటూ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. -
కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
తన తల్లిదండ్రులకు ఏమైనా హానీ జరిగితే సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత అంటున్నారు తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె సుస్మిత. మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తమను వేధిస్తున్నారని ఆరోపించారు. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను ఆమె అడ్డుకున్నారు.బుధవారం రాత్రి ఆమె తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ''బీసీ లీడర్లను, మమ్మల్ని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఎక్స్‌టార్సన్ కేసు అంటున్నారు. ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నను తీసుకొద్దామని ట్రై చేస్తున్నారని నా డౌట్. ఆ డౌట్లో మాత్రం మానాన్నకు కానీ, మా అమ్మకు కానీ ఎటువంటి హాని జరిగినా పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డిలదే. వీళ్లందరు మాత్రం బాధ్యత వహించాలి. నేను ముందే చెబుతున్నా.ఇది కాంగ్రెసా, తెలుగుదేశమా తెలుస్తలేదండీ. రెడ్ల రాజ్యం నడుస్తోంది. బీసీ నినాదమేమో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎత్తుకుంటే.. ఇక్కడ బీసీ మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ సీఐ వస్తడా? అసలు ఎక్కడైనా ఉందా? ఎంత సిగ్గుమాలిన చర్య? ఒక ముఖ్యమంత్రి సిగ్గుపడాలి దానికి. ఒక బీసీ లేడీ లీడర్ ఇంటికి రాత్రి తొమ్మిదింటికి ఒక టాస్క్‌ఫోర్స్ సీఐ వచ్చిండంటే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. అయామ్ టెల్లింగ్ ఆన్ మీడియా'' అంటూ సుస్మిత ఫైర్ అయ్యారు. కాగా, నిన్నరాత్రి తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని గురువారం మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు కొండా సుస్మిత. చదవండి: కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది? -
Bihar Elections: తేజస్వి ఆస్తులెంత? బెరెట్టా పిస్టల్ వివాదమేంటి?
పట్నా: దేశంలో ఎక్కడ చూసినా బీహార్ ఎన్నికలకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం మొదలయ్యింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అధికారిక అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడిది ఎంతో ఆసక్తికరంగా మారింది.ఆర్జేడీ కోట నుండి వరుసగా మూడవసారి విజయం సాధించాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన తేజస్వి యాదవ్.. బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏపై పలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో బెరెట్టా పిస్టల్‌తో పాటు రూ. 8.98 కోట్ల విలువైన కుటుంబ ఆస్తులను వెల్లడించారు. అలాగే తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా తెలిపారు. ఆ వివరాలు..తేజస్వి యాదవ్ ఆస్తులు- రూ 1.88 కోట్లు (స్థిరచరాస్తులు) భార్య రాజ్శ్రీ యాదవ్ ఆస్తులు- రూ 59.69 లక్షలు(స్థిరచరాస్తులు)ఇద్దరు పిల్లల ఆస్తులు- రూ. 40 లక్షలు(స్థిరచరాస్తులు)మొత్తం కుటుంబపు చరాస్తులు- రూ. 6.12 కోట్లుబంగారం, వెండి- రూ. 85.9 లక్షలు- (980 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండి)ఆయుధాలు- రూ.1.05 లక్షలు ఇటాలియన్ బెరెట్టా ఎన్పీబీ 380 బోర్ పిస్టల్, 50 రౌండ్లుఎలక్ట్రానిక్స్- రూ. 85 లక్షలు డెస్క్‌టాప్, ల్యాప్టాప్మొత్తంగా ప్రకటించిన కుటుంబ ఆస్తులు రూ. 8.98 కోట్లుఈ అఫిడవిట్లో తేజస్వి యాదవ్ పేరు మీద ఏ వ్యక్తిగత వాహనం లేదా రియల్ ఎస్టేట్ వివరాలు లేవు. ఇది తేజస్వి సామాన్యుడనే ఇమేజ్ను బలోపేతం చేస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జాబితాలోని ఎలక్ట్రానిక్స్ , ఆయుధం విలువ అతని సామాన్య జీవనశైలికి విరుద్ధంగా ఉన్నాయనే వాదన విపిస్తోంది. కాగా అఫిడవిట్లో ఇటాలియన్ బెరెట్టా ఎన్పీబీ 380 బోర్ పిస్టల్, 50 బుల్లెట్లను చేర్చడం, దాని విలువ రూ. 1.05 లక్షలుగా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. 1984 నుండి దేశంలో పౌర ఆయుధాల దిగుమతిని నిషేధించారు. ఆయుధ చట్టం- 1959 ప్రకారం అధికారం కలిగిన భారతీయ డీలర్ నుండే ఆయుధాన్ని కొనుగోలు చేయాలి. అయితే తేజస్వి బెరెట్టా పిస్టల్ కలిగివుండటంపై పలు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇది అక్రమంగా వచ్చిన ఆయుధమనే వాదన వినిపిస్తోంది.తేజస్వి యాదవ్ తన అఫిడవిట్లో తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో నాలుగు అప్పీల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులు రాజకీయ ర్యాలీలు, నిరసనలు, వివాదాస్పద ప్రకటనల కారణంగా నమోదయ్యాయి. తాజగా అక్టోబర్ 13న ఢిల్లీ కోర్టు.. ఆయనతో పాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీ దేవిలపై ఐఆర్సీటీసీ హోటళ్ల అవినీతి కుంభకోణం, ల్యాండ్-ఫర్-జాబ్స్ స్కామ్‌లో అధికారికంగా అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఇది ఎన్నికలకు ముందు తేజస్వికి ఎదురుదెబ్బగా మారింది.రాఘోపూర్ నియోజకవర్గం ఆర్జేడీకి ఎంతో కీలకమైనది. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఇద్దరూ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమిది. తేజస్వి 2015, 2020లలో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక్కడి ఓటర్లలో యాదవులు 25 శాతం, ముస్లింలు 20 శాతం, ఈబీసీలు 30 శాతం ఉన్నారు. ఇది ఆర్జేడీ విజయానికి కీలకమైన జనాభాగా పరిగణిస్తుంటారు. హాజీపూర్ కలెక్టరేట్లో తేజస్వి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశాక తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ‘ఎక్స్’ ఖాతాలో ‘ఈ నామినేషన్ తేజస్వి ఒక్కడికే కాదు.. బీహార్ అంతటా మార్పు కోసం’ అని పేర్కొన్నారు. -
నకిలీ మద్యం కేసులో ఉన్నది లోకేష్, ఎంపీ: దేవినేని అవినాష్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.జోగి రమేష్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) గురువారం ఉదయం జోగి రమేష్‌ను(Jogi Ramesh) కలిశారు. ఈ క్రమంలో ఆయనపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనంతరం, దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులతో జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను జోగి రమేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్‌కు వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ నేతలే. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్(Nara Lokesh), మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు. జయచంద్రారెడ్డి, జనార్ధన్ రావు నెలనెలా మామూళ్లు చినబాబు, వసంత కృష్ణప్రసాద్, ఎంపీ చిన్నికి పంపించారు. టీడీపీ నేతలు దొరికిపోవడంతో వైఎస్సార్సీపీపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పెట్టిన తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.పోలీసులు కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సెక్షన్లను వైఎస్సార్సీపీ(YSRCP) నేతలపై పెడుతున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ కమిషనర్ కలవలేదు. అదే టీడీపీ నుంచి చోటా మోటా నేతలు వెళితే సీపీ వారిని కలిశాడు. పోలీస్ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా? టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా?. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం బుద్ధా వెంకన్న ఆరాటపడుతున్నాడు. వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేస్తే పదవులు వస్తాయని బుద్ధా వెంకన్న అనుకుంటున్నాడు అని ెసెటైరికల్ కామెంట్స్ చేశారు. -
‘నా మాటలకు కట్టుబడి ఉన్నా.. ఫోన్ వచ్చింది ఇప్పుడేం మాట్లాడలేను’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఎపిసోడ్ తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, తాజాగా మరోసారి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని సుస్మిత చెప్పుకొచ్చారు. దీంతో, అధికార కాంగ్రెస్ పార్టీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.కొండా సుస్మిత(konda Sushmita) తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాత్రి నేను మాట్లాడిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. అధిష్టానం మాతో మాట్లాడింది. మీడియాలో ఎలాంటి అంశాలపై మాట్లాడవద్దని అదేశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని విషయాలపై మాట్లాడలేను. ఏం జరిగిందో అందరికీ తెలుసు’ అని కామెంట్స్ చేశారు.మరోవైపు.. మంత్రి కొండా సురేఖకు సైతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు వెళ్లింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి రావాలని సురేఖకు తెలిపారు. మరికాసేపట్లో ఎమ్మెల్యే క్వాటర్స్‌కి మంత్రి కొండా సురేఖ వెళ్ళనున్నారు. కేబినెట్ భేటీకి కూడా కొండా సురేఖ హాజరకానున్నారు. ఇదిలా ఉండగా.. మినిస్టర్ క్వార్టర్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి ఆమె మాజీ osd సుమంత్ భార్య డాక్టర్ మనిషా చేరుకున్నట్టు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: కొండా సురేఖకు బిగ్ షాక్.. -
ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి ఝలక్.. టీడీపీ శ్రేణుల కొత్త రాజకీయం!
సాక్షి, వైఎస్సార్: కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబావుట ఎగురవేశారు. మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆయన భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్లు లేరు.. తొక్కా లేదన్న శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు ఎగురవేశారు. పార్టీకి మొదటి నుంచీ సేవలందించిన వారిని పక్కన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడపలోని పలువురు మైనార్టీ టీడీపీ నేతలు పెద దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవీ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ప్రార్ధనలు చేశారు. క్రమంలో తిరుగుబాటు వర్గాన్ని కమలాపురం నేత పుత్తా నరసింహారెడ్డి దగ్గరకు తీసుకున్నారు. పార్టీని కాపాడాలంటూ పుత్తా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు.అధికారం వచ్చి ఏడాదిన్నర అయినా పార్టీ సీనియర్లను పట్టించుకోలేదని ఆరోపించారు. దీనికి తోడు అంతా తమ కుటుంబ పెత్తనమేనంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై నిరసన తెలిపారు. ఇంత వరకూ ఒక్క మైనార్టీ నేతకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కడపకు రాక ముందు నుంచీ పార్టీ తరఫున కష్టాలకోర్చి ముందుకు తీసుకెళ్లామని సీనియర్ నాయకులు అన్నారు.మరోవైపు.. కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీరుతో రోజుకో వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ శ్రేణులు మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీలో రోజుకో వర్గం తిరుగుబావుటా ఎగురవేయడంతో ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో, టీడీపీలో మరో వర్గం ఏర్పడినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది?
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. తన మాజీ ఓఎస్డీ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల మంత్రి సురేఖ కోపంగా ఉన్నట్టు కనబడుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన సురేఖ ఓఎస్డీపై చట్టపరమైన చర్యలకు సర్కారు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను సురేఖ కుమార్తె సుస్మిత (konda sushmitha) అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తమను టార్గెట్ చేశారని, రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తోందంటూ సుస్మిత మీడియా ముందు ఫైర్ అయ్యారు.మరోవైపు ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని మంత్రి సురేఖ భర్త కొండా మురళి హన్మకొండలో చెప్పారు. తమ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి వివాదం పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. అదే సమయంలో తన కూతురును ఆయన వెనకేసుకొచ్చారు. కాగా, ఈ వివాదంపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా సురేఖ వ్యవహరించిన తీరు పట్ల సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖను ఆమె నుంచి తీసేసుకోవాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.అసలేం జరిగింది? తన నియోజకవర్గం హుజూర్‌నగర్‌లోని డెక్కన్ సిమెంట్స్‌లోని పనిచేస్తున్న ఓ వ్యక్తిని డబ్బుల కోసం కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అతడిని విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడు సురేఖ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో బుధవారం రాత్రి అక్కడికి వెళ్లారు. జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్‌లోని తమ ఇంటికి మఫ్టీలో వచ్చిన పోలీసులను సురేఖ కూతురు సుస్మిత అడ్డుకున్నారు. మంత్రి ఇంటికి పోలీసులు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఈలోపు ఇంట్లో ఉన్న సురేఖ, సుమంత్ బయటికి వచ్చి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా ప్రమేయం లేదుఈ నేపథ్యంలో మేడారం జాతర పనులను రోడ్లు భవనాలకు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కొండా సురేఖ (Konda Surekha) వివాదంపై స్పందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిరాకరించారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో తనపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి తోసిపుచ్చారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని అన్నారు.తెలంగాణ కేబినెట్ భేటీసీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ, ట్రో ఫేజ్-2 టెండర్లపై మంత్రి మండలిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కొండా సురేఖ వివాదం నేపథ్యంలో కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, సురేఖకి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి క్యాబినెట్ మీటింగ్‌కు హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. చదవండి: నన్ను తిట్టినవాళ్లే నాకోసం వస్తున్నారుపొంగులేటిపై ఫిర్యాదు!అంతకుముందు మేడారం పనుల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. తన శాఖకు సంబంధించిన రూ. 71 కోట్ల విలువైన పనులను తనవాళ్లకు ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని సురేఖ ఆరోపించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి పొంగులేటితో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. మహేష్ గౌడ్ క్లారిటీమంత్రి కొండా సురేఖ వివాదంపై పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని తాను మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపం కనిపిస్తుందని, తొందరలో క్లారిటీ వస్తుందని మీడియా ప్రతినిధులతో చెప్పారు. -
ప్రైవేటీకరణ ఆపించండి.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ని ఎయిర్‌పోర్టు వద్ద పలువురు నేతలు కలిశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అలాగే.. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని మోదీని కలిసిన వాళ్ళలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్.. తదితరులు ఉన్నారు. -
ట్రంప్ ప్రకటన.. రాహుల్ విమర్శలు.. స్పందించిన కేంద్రం
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందని, ఇందుకుగానూ భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంధన దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ నోట్ రూపేణా స్పందించింది. అస్థిర పరిస్థితుల నడుమ.. వినియోగదారుల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం ఉంటుందని అందులో కేంద్రం స్పష్టం చేసింది(India Reacts On Trump Russia Oil Comments).మీడియా ప్రశ్నలకు బదులుగా.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తాజా పరిణామాలపై ఒక నోట్ విడుదల చేశారు. చమురు సంబంధిత దిగుమతులు భారత్‌కు ఎంతో కీలకం. మార్కెట్ అస్థిరతల మధ్య ఇక్కడి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రధాన ధ్యేయం. అందుకే దిగుమతుల విధానాలు ఆ దిశగా రూపొందించబడ్డాయి.... స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో కూడిన సరఫరా.. ఇవే మా ద్వంద్వ లక్ష్యాలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఇంధన వనరుల విస్తరణ, వివిధ దేశాల నుంచి సరఫరా పొందడం జరుగుతోంది అని అందులో పేర్కొన్నారాయన. అలాగే..Our response to media queries on comments on India’s energy sourcing⬇️🔗 https://t.co/BTFl2HQUab pic.twitter.com/r76rjJuC7A— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2025అమెరికాతో సంబంధం గురించి మాట్లాడుతూ.. గత దశాబ్దంగా ఇంధన సహకారం పెరుగుతోంది. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సహకారం మరింతగా అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపుతోంది. చర్చలు కొనసాగుతున్నాయి అని జైస్వాల్ అందులో తెలిపారు. తద్వారా.. అంతర్జాతీయ ఒత్తిడులకు కాకుండా దేశ ప్రయోజనాల ఆధారంగా భారత్ ముందుకు వెళ్తుందని మరోసారి భారత్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) ముగింపు దిశగా కీలక అడుగు పడిందని, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయబోతోందని, మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. ట్రంప్ నుంచి సానుకూల స్పందన లేకపోయినా తరచూ అభినందన సందేశాలు ఎందుకంటూ మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ తరుణంలో కౌంటర్‌గా కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.ఇదీ చదవండి: మోదీ నన్ను ప్రేమిస్తారు.. అంటే మరోలా కాదు! -
కొండా సురేఖకు బిగ్ షాక్?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖను దేవాదాయశాఖ నుంచి తప్పించేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు... -
కల్తీ మద్యం కేసులో కీలక పరిణామాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నకిలీ మద్యం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నేత జనార్ధన్‌రావుకి చెందిన వైన్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో.. ఓ వైన్ షాపును సీజ్ చేశారు. అదే సమయంలో వైఎస్సార్సీపీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది.ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీనివాస వైన్స్.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఈ వైన్స్‌కు నకిలీ మద్యాన్ని జనార్దన్‌రావే సరఫరా చేశారు. ఈ వ్యవహారాన్ని జనార్దన్ పిన్ని కొడుకు కల్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చాడు. అలా వచ్చిన సొమ్ముతోనే గొల్లపూడిలో విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో కల్యాణ్ కూడా అరెస్ట్ అయ్యారు. కక్ష సాధింపులో భాగంగా..మరో వైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు ఈ తెల్లవారుజామున దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే.. మంత్రి లోకేష్,మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.ఇదీ చదవండి: అమౌంట్ తగ్గితే వసంత బావ ఊరుకోడు! -
పవన్‌కు ఆ ధైర్యం ఉందా?
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు న్యాయం చేయకపోతే రాజీనామా చేసేస్తానని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ఈ మాటల వెనుక చిత్తశుద్ధి ఎంత? అన్న దానిపై అందరిలోనూ సందేహాలున్నాయి. సినిమా నటుడైన పవన్ ఇప్పుడు రాజకీయాల్లోనూ మేలైన నటనకు అలవాటు పడిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన మాటలకు.. అధికారం వచ్చిన తరువాత చేతలకూ అసలు పొంతన లేకపోవడం ఇందుకు కారణమవుతోంది.సముద్రజలాల కాలుష్యం పెరిగిపోతుండటం తమ ఉపాధిని దెబ్బతీస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు. పిఠాపురం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. తమ సమస్యలు వినేందుకైనా ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే రావాల్సిందేనని భీష్మించుకున్నారు. అనారోగ్యం, ఇంకో కారణం చెప్పి జిల్లా కలెక్టర్ ద్వారా రాయబారం నడిపిన పవన్ వారిని కలవలేదు. త్వరలో వస్తానన్న హామీ మేరకు మత్స్యకారులు తమ ఆందోళన విరమించుకున్నారు కూడా. ఆ తరువాత.. సరిగ్గా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన రోజే పవన్ కళ్యాణ్ కూడా తన సభ పెట్టుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని కొందరి అనుమానం పక్కనబెట్టినా.. మత్స్యకారులను కలిసిన పవన్ ఏదైనా నిర్దిష్టమైన హామీ ఇచ్చారా? అంటే అదీ లేదు. వందరోజుల్లోపు న్యాయం జరక్కపోతే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానన్న నామ్ కా వాస్తే అన్నట్టుగా ప్రకటనైతే చేశారు.కొన్ని సినిమా డైలాగులతో ప్రసంగాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. సమస్యను అధ్యయనం చేయాలని.. సముద్రంపైకి వెళ్లి తానే పరిశీలిస్తానని కూడా చెప్పారు కానీ.. ఏదీ చేసినట్లయితే తెలియరాలేదు. మాటలు మార్చడం పవన్‌కు కొత్తేమీ కాదు. ఈ విషయాన్ని రుజువు చేసే పలు వీడియోలు సోషల్ మీడియాలో ఏళ్లుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆయనకే చిత్తశుద్ధి ఉండి ఉంటే తాము అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చామన్న విషయం ఒప్పుకునేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతెందుకు.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ప్రకటించిన పవన్ ఈమధ్య కాలంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అనేకానేక వ్యవహారాలపై పల్లెత్తు మాట కూడా అనలేదు కదా? సొంత పార్టీ ఎమ్మెల్యేల దందాలు కానీ.. లంచాలు తీసుకుంటున్నామని బహిరంగంగానే చెప్పిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నా వ్యతిరేకించలేదు సరికదా.. ఇది తప్పని చిన్న మాటైనా అనలేకపోయారు. నకిలీ మద్యంలో టీడీపీ నేతలే సూత్రధారులు, పాత్రధారులని తేటతెల్లమవుతున్నా.. పవన్ కళ్యాణ్ స్పందిస్తే ఒట్టు.గతంలోనూ ఇంతే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించిన చంద్రబాబుకు వపన్ దన్నుగా నిలిచాడు. సనాతని వేషం కట్టి.. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు వెళ్లాయని ఆరోపించారు. వాస్తవాలు బయటపడిన తరువాత మాత్రం ఇప్పటివరకూ ఆ అంశంపై కిమ్మనలేదు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన ప్రకటనలు ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారి పొట్టకొట్టబోమని, జీతాలు పెంచుతామని బహిరంగంగానే ప్రకటించారు. అధికారం వచ్చిన తరువాత వాటి ఊసెత్తేందుకూ ఇష్టపడటం లేదు. సుగాలి ప్రీతి విషయంలోనూ అంతే. ఈ కేసులో నిందితులను పట్టుకోవాలని అధికారం వచ్చిన వెంటనే తొలి ఆదేశం జారీ చేస్తానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదిపాటు ఆ ఊసే ఎత్తలేదే! కూతురికి న్యాయం చేయాలని సుగాలి ప్రీతి తల్లి రోడ్డెక్కితే మాత్రం ఆమెనే తప్పు పట్టారు. ఇంకో జనసేన నేత ఆ తల్లిపై నీచమైన కామెంట్లు చేశారు.ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో 30వేల మంది మహిళలు కనపడకుండా పోయారని, కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు తనకీ విషయాన్ని చెప్పాయని ఊరంత ఊదరగొట్టిన పవన్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావనే తేవడం లేదు. తప్పిపోయింది కేవలం 34 మంది మహిళలు మాత్రమేనని స్వయంగా కూటమి నేతలే ప్రకటించారు. వాస్తవానికి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసేంత విషయం ఇది. అలాగే.. నాసిరకం మద్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, కిడ్నీలు పాడైపోతున్నట్లు హైదరాబాద్ డాక్టర్లు చెప్పారంటూ కూడా పవన్ అప్పట్లో తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు అధికార భాగస్వామి టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ, పంపిణీ కర్త, కర్మ, క్రియలని తెలిసిన తరువాత నోరు కూడా విప్పడం లేదు. పవన్ కళ్యాణ్ కలుగులో దాక్కున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేయడం కూడా ఇందుకే. ఒక్కో నియోజకవర్గంలోని 500 మంది యువకులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి పరిశ్రమలు స్థాపింపజేస్తామని కూడా పవన్ గతంలో చెప్పారు. ఎందుకని ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదో ఆయనకే తెలియాలి.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇన్ని హామీలను అమలు చేయకపోవడం ప్రజలను వంచించడమే. రాజకీయాలకు గుడ్‌బై చెప్పాల్సినంత పెద్ద విషయాలే. కానీ.. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో పర్యటిస్తూ, సినిమాలలో నటిస్తూ, అటు అధికారాన్ని.. ఇటు సినిమాలను ఎంజాయ్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటారు? తప్పుకోకున్నా ఫర్వాలేదు కానీ.. తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పినా పవన్‌కు మంచి పేరు వస్తుంది. అయితే ఆయనకు ఆ ధైర్యం ఉందా? అన్నదే ప్రశ్న. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజులు మిగిలి ఉంది. ఇప్పటికీ బీహార్‌లో విపక్ష మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అయోమయం, గందరగోళం నడుమే ఆర్జేడీ 35 మందితో తన జాబితాను విడుదల చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 10 మంది పేర్లను ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.పది మంది అభ్యర్థులకు సింబల్ పంపిణీ చేసింది కాంగ్రెస్. ఆ ఫొటోలను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేశారు. అయితే.. సీట్ల పంపిణీ లెక్కలు తేలకుండానే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించిందా? లేదంటే ఒప్పందం ప్రకారమే చేసిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. గత అర్ధరాత్రి పాట్నా ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేగింది.బీహార్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అల్లవరు, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేష్ రామ్, సీనియర్ నేత షకీల్ అహ్మద్ ఖాన్లు ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలు జరిపిన అనంతరం పాట్నా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి.. బిక్రమ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా.. అది ఘర్షణకు దారి తీసింది.బీహార్‌లో బిక్రం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధార్థ్ సౌరభ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. తాజాగా.. కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థులలోఈ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు. అయితే.. विधानसभा क्षेत्र - बिक्रम सेINDIA गठबंधन समर्थित कांग्रेस उम्मीदवार श्री अनिल कुमार जी को अनंत बधाई एवं शुभकामनाएं!जीत रहा है INDIA ✊ pic.twitter.com/au4idsuiOm— Bihar Congress (@INCBihar) October 15, 2025ఈ పరిణామంపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాట్నా ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుని తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రూ.5 కోట్లకు సీటు అమ్ముకున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ మద్దతుదారుడు మనీష్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అలజడి రేగింది.దీంతో ఆ ముగ్గురు పెద్దలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. షకీల్ అహ్మద్ ఖాన్‌ను కార్యకర్తలు రౌండప్ చేయగా.. అతి కష్టం మీద తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఈ సీటు అభ్యర్థికి మార్పు తప్పదా? అనే చర్చ జోరందుకుంది.Congressmen clash at Patna airport, causing uproar over ticket dispute #Patna #Airport #Congress बिहार कांग्रेस के कार्यकर्ता पटना एयरपोर्ट पर टिकट बंटवारे से नाराज़! कृष्णा अल्लावरू, राजेश राम के सामने पहुंचे, लेकिन पप्पू यादव समर्थकों से भिड़ंत। गोली नहीं चली, यही बड़ी बात! pic.twitter.com/cpMcx35U5C— DVN TV (@dvntvnews) October 16, 2025ఇదిలా ఉంటే.. సీట్ల పంపిణీపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దఫా చర్చలు ఇవాళ ఓ కొలిక్కి వచ్చాక.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్జేడీ 130, కాంగ్రెస్ 60, వీఐపీ 18, వామపక్ష పార్టీలు 35 స్థానాలలో పోటీ చేస్తాయని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్! -
కొండా సుస్మిత ఎపిసోడ్.. స్పందించిన రోహిన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూబ్లీహిల్స్‌లో ఉన్న మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఇంటి పోలీసులు వెళ్లడంపై బుధవారం రాత్రి హైడ్రామా నెలకొంది. ఈ సందర్బంగా పోలీసులు, డెక్కన్ సిమెంట్, రోహిన్ రెడ్డిపై(Congress DCC Rohin Reddy) కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత(Konda Sushmitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్‌పై తాజాగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి స్పందించారు.కొండా సుస్మిత పటేల్ ఆరోపణలను రోహిన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘నాపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. డెక్కన్ సిమెంట్స్ అంశం చెప్తే నేను ఇలాంటి వాటిలో వేలు పెట్టను అని సుమంత్‌కి ముందే చెప్పి పంపేశాను. నేను ఎలాంటి అసాంఘిక పనుల్లో తల దూర్చను.. ఈ విషయంలో నా ప్రమేయం లేదు’ అని చెప్పుకొచ్చారు.సుస్మిత ఆరోపణలు..ఇక, అంతకుముందు.. కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుస్మిత మాట్లాడుతూ.. సుమంత్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. డెక్కన్ సిమెంట్ వాళ్లను సుమంత్ గన్‌తో బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఆధారాలు ఉంటే చూపించాలని పోలీసులను అడిగాను. ఆధారాలు అడిగితే వరంగల్ నమోదైన మరో కేసులో అరెస్టు చేసేందుకు వచ్చామని అన్నారు. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి కూడా ఈ ఎపిసోడ్లో ఉన్నారని ఆరోపించారు. ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా? అంటూ ప్రశ్నించారు. సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్టు చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ కామెంట్స్ చేశారు.బీసీ లీడర్లయిన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుస్మిత ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిణ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. -
రేవంతన్నతో గొడవల్లేవ్.. నా బిడ్డ అందుకే అలా మాట్లాడింది: కొండా మురళి
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ(మాజీ) సుమంత్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం, సురేఖ కూతురు సుస్మిత వాళ్లతో వాగ్వాదానికి దిగడం, ఈ క్రమంలో సంచలన ఆరోపణల చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ, సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. సుమంత్ వ్యవహారం, కూతురు సుస్మిత వ్యాఖ్యలపై కొండా మురళి గురువారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించి స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదు. సెక్రటేరియట్లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు.నా బిడ్డకు(సుస్మితను ఉద్దేశించి..) మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది. అందుకే అలా మాట్లాడి ఉంటుంది. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం. నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంతన్న హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు. అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నేను మంత్రుల వద్దకు వెళ్తాను. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను... నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు కోసం నా దగ్గరకు వచ్చిన వాడే. వేం నరేందర్ రెడ్డి(సీఎం సలహాదారు) నేను కామన్ గా కలుస్తుంటాం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం అని మురళి అన్నారు.ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మాజీ ఓస్డీని అర్ధరాత్రి తన కారులో మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొండా మురళి పరోక్షంగా స్పందించారు. కొండా సురేఖ హైదరాబాద్‌లోనే ఉన్నారని.. ఈరోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్‌తో ప్రోగ్రామ్ ఉందని, దానికి ఆమె హాజరవుతారని అన్నారాయన. ఇదీ చదవండి: మా అమ్మ అరెస్టుకు కుట్ర జరుగుతోంది: కొండా సుస్మిత -
అందరికీ సవాలే!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. జూబ్లీహిల్స్ గెలుపు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారుతుంది. దీంతో గెలుపు కోసం మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత లాగా జూబ్లీహిల్స్ గెలుపు రానున్న రోజుల్లో రచ్చ గెలిచేలా చేస్తుందని భావిస్తున్నాయి.కాంగ్రెస్: విజయం కోసం ప్రణాళికలు అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సవాలుగా మారింది. స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. ముగ్గురు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులను ఇక్కడ ప్రచారంలో దింపి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టినా గ్రేటర్లో మాత్రం ఒక్క సీటు గెలవలేదు. దీంతో ఇక్కడ గెలిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు దారి మరింత సులువు అవుతుందని భావిస్తోంది. అధికారంలో ఉన్నా గ్రేటర్ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని ప్రణాళికలు చేపడుతుంది.బీఆర్ఎస్: పట్టు నిలుపుకునే యత్నం బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని గ్రేటర్లో అన్నివర్గాలు తమవైపే ఉన్నాయని చూపించింది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్న ఉపఎన్నికల్లో మాగంటి సతీమణి సునీతకు సీటు కేటాయించి సెంటిమెంట్‌తో పాటు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయి బలంతో మరోసారి పాగా వేయాలని చూస్తోంది. కేటీఆర్, హరీష్‌రావులు తప్పక విజయం సాధించాలనే తపనతో ఇక్కడ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజూ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవచ్చని అంచనా వేస్తొంది. గ్రేటర్ పీఠాన్ని కొట్టి అన్ని ఎన్నికల్లో బలాన్ని మరింత పెంచుకొని అసెంబ్లీ ఎన్నికల నాటికి రాటుదేలి మూడోసారి తెలంగాణలో అధికారాన్ని పొందాలని చూస్తుంది.బీజేపీ: వ్యూహం మారింది.. లేటుగా అయినా లేటెస్ట్ అంటూ..బీజేపీ జూబ్లీహిల్స్‌లో మరోసారి లంకల దీపక్‌రెడ్డికి ఛాన్స్ ఇచి్చంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్‌రెడ్డి 26 వేల ఓట్లను సాధించారు. దీంతో బీజేపీ ఇప్పుడు తన వ్యూహాలను మార్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ఓ వర్గం ఓట్లు రెండు పార్టీలు పంచుకుంటాయని, మరోవర్గం, సెటిలర్లు, కాలనీ, కమ్యూనిటీ ఓట్లు తప్పక వస్తాయని, అనూహ్యంగా రేసులో ముందుండి గెలుస్తామని ధీమాగా ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకోకుండా గట్టి పోటీతో 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్ పీఠం తప్పక తమదేనని బీజేపీ కూడా భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాంచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తమ వ్యూహాలను ఎవరికీ తెలియకుండా గుంభనంగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. -
జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర
బంజారాహిల్స్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్‌లో జరిగే ఉప ఎన్నిక పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదని పదేళ్ల అభివృద్ధి పాలనకు, రెండేళ్ల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండేళ్ల రాక్షస పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటీ 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారన్నారు. ఆమెకు అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని, రాష్ట్రంలో మరోసారి గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతోందని చెప్పారు. బుధవారం తమ పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరే ముందు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. గోపీనాథ్ విశేష సేవలందించారు‘లక్షల మంది రైతన్నలు, నిరుద్యోగులు సునీత గెలవాలని కోరుకుంటున్నారు. తమ ఇళ్లు కూలగొట్టడం లాంటి అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని, ఆ అరాచకాలకు అడ్డుకట్ట పడాలని నగర పేదలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాద్‌లో కట్టలేదు.. కానీ నగరంలో కేసీఆర్ కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ ప్రజలకు గుర్తున్నాయి. బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్ని విషయాల్లో మోసపోయామని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు గుర్తించారు. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడానికి వారితో పాటు మైనారిటీలు కూడా సిద్ధంగా ఉన్నారు. దళితబంధు, అభయహస్తం అమలుకాక దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రతిఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్. ఆయన అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆయన సతీమణి సునీతకు టికెట్ కేటాయించారు. రెండు సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతిఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి..’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాగా సునీత గోపీనాథ్ బుధవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కేటీఆర్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇప్పటికే కూటమిలో విభేదాలు..
నెల్లూరు టాస్క్‌ఫోర్స్: కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశిస్తేనే ఇకపై ఎవరైనా మాట్లాడాలని స్పష్టం చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్డీఏ కూటమిని ఇరకాటంలో పెడుతున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు రాకుండా ఎవరూ స్టేట్మెంట్లు ఇవ్వకూడదని హెచ్చరించారు. ఇక నుంచి ఎవరు మాట్లాడాలో తామే నిర్ణయిస్తామ న్నారు. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అసహనంగా ఉన్నారన్నారు. తనను నియోజకవర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచుకోకపోతే సహించేదిలేదన్నారు. నీ నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి పది, ఇరవై రోజులకు చిన్న ఇష్యూలు వస్తే పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కలిసి మాట్లాడుకుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొన్నారు. మనోహర్ తనకు ఫోన్ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా.. అంటూ అడిగారన్నారు. మీ నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. తన డిపార్ట్మెంట్ను డీగ్రేడ్ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా? అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ తిట్టడం వచ్చు.. కేకలేయడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
‘చెత్త రోడ్లు..మేమెందుకు కట్టాలి ట్యాక్స్’.. భీష్మిస్తున్న నగర వాసులు
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం మరోసారి మౌలిక సదుపాయాల సమస్యలతో చర్చకు దారితీసింది. నగరంలోని అధ్వాన్న రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే పలు మార్లు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా, మౌలిక సదుపాయాలు లేకపోతే తాము ఆస్తిపన్ను ఎందుకు చెల్లించాలి అంటూ పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.నగరంలో గుంతలు పడిన రోడ్ల విషయంలో ప్రభుత్వ చర్యలు వేగవంతం చేసింది. రోడ్లను గుర్తించి మరమత్తులు కూడా చేపట్టింది. అయినా నగర వాసులు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోతే ఆస్తిపన్ను కట్టబోమని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. అలా ఇప్పటి వరకు 13వేల గుంతలు పూడ్చినట్లు తెలిపారు. అలాగే, 550 కిలోమీటర్ల ప్రధాన రహదారుల అభివృద్ధికి వెయ్యి కోట్ల యాక్షన్ ప్లాన్‌ను రూపొందించమని అధికారులను ఆదేశించారు.బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై వ్యక్తిగత పన్ను చెల్లింపు దారుల ఫోరం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసింది. లేఖలో, గ్రేటర్ బెంగళూరు మునిసిపల్ సంస్థలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే, ఆస్తిపన్ను వసూలు చేయకుండా ఉండాలని సూచించారు.వర్తూర్-బలగేరె-పనతూర్ ప్రాంతాల్లో అసంపూర్ణ, శాస్త్రీయతలేని రోడ్ల పనులు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షాకాలంలో వరదలు, డ్రైనేజ్ పూర్తికాకముందే రోడ్ల పనులు ప్రారంభించడం, కొత్త రోడ్లు త్వరగా దెబ్బతినే ప్రమాదం, వైట్ టాపింగ్, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ పనులు ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం వంటి అంశాలను హైలెట్ చేశారు. మౌలిక సదుపాయాలు లేకుండా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడం అన్యాయం. బెంగళూరు ఐటీ హబ్‌గా గుర్తింపు పొందినప్పటికీ ‘గుంతలరోడ్లు, ట్రాఫిక్ జామ్, గార్బేజ్ సిటీ’ వంటి పేర్లు నగర గౌరవాన్ని తగ్గిస్తున్నాయని వాపోయారు. -
జాక్‌పాట్ కొట్టేసింది..ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్‌కు ఎమ్మెల్యే సీటు!
పాట్నా: ప్రముఖ ఫోక్ సింగ్ మైథిలీ ఠాకూర్ జాక్ పాట్ కొట్టేశారు. బుధవారం బిహార్ బీజేపీ అభ్యర్థుల జాబితాలో స్థానం సంపాదించారు. 12 మంది అభ్యర్థులు, వారు పోటీ చేసే నియోజక వర్గాలను బీజేపీ బుధవారం ప్రటించింది. రెండోసారి విడుదల చేసిన బిహార్ బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ (Maithili Thakur), మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు ఉన్నారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ పోటీ చేయనుండగా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా పోటీ చేస్తారు. బిహార్ బీజేపీ రెండవ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 12 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించగా, అలీనగర్ నియోజకవర్గం నుంచి ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్‌కు అవకాశం కల్పించారు. అత్యంత కీలకమైన అలీనగర్ స్థానాన్ని మైథిలీ ఠాకూర్‌కు కట్టబెట్టే విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. మిథిలాంచల్ ప్రాంతానికి చెందిన మైథిలీ ఠాకూర్ ఈ ప్రాంతపు సాంస్కృతిక ప్రతినిధిగా గుర్తింపు పొందారు. మిథిలాంచల్ అనేది భారత్–నేపాల్ మధ్య విస్తరించిన సాంస్కృతిక ప్రాంతం. సీతమ్మతల్లి జన్మస్థలంగా ఈ ప్రాంత స్థల పురాణాలు చెబుతున్నాయి. అలీనగర్ నియోజకవర్గం, దర్భంగా జిల్లాలో ఉంది. ఇది కూడా మిథిలాంచల్‌లో భాగమే. అందుకే మైథిలీ ఠాకూర్‌ను ‘మిథిలా కుమార్తె’గా అభివర్ణిస్తూ, ప్రాంతీయ గౌరవాన్ని, యువతలో ఆదరణను ఆకర్షించేందుకు బీజేపీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది.మైథిలీ ఠాకూర్ ఇంటర్ చదువుకున్న తర్వాత, చిన్న వయస్సులోనే ఫోక్ సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. భోజ్‌పురి, మైథిలీ, హిందీ భక్తి పాటలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పాడిన పాటలకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ద్వారా యువతను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం జేడీయూ చేతిలో ఉండగా, ఈసారి పొత్తు కారణంగా బీజేపీకి దక్కింది. #WATCH | Ahead of #BiharElection2025, folk and devotional singer Maithili Thakur joins the BJP in Patna, Bihar. pic.twitter.com/qkY1ocUsIZ— ANI (@ANI) October 14, 2025క్లాసికల్, ఫోక్ సంగీతంలో శిక్షణ పొందిన ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం పొందారు. ఓవైపు ఫోక్ సింగర్‌గా రాణిస్తూనే రాజకీయాల్లో రాణించాలని కోరికగా ఉందంటూ పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా, ఆమె తన అభిరుచులకు అనుగుణంగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ,బిహార్ సీఎం నితీష్ కుమార్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. వారిలాగే తానుకూడా సమాజానికి సేవ చేయడానికి, బిహార్ అభివృద్ధికి తోడ్పడటానికి నేను ఇక్కడ ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు.కాగా,మైథిలీ ఠాగూర్ గతంలో ప్రధాన మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2024 జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాడిన ‘మా శబరి’పాటను ప్రధాని ప్రశంసించారు. अयोध्या में प्राण-प्रतिष्ठा का अवसर देशभर के मेरे परिवारजनों को प्रभु श्री राम के जीवन और आदर्शों से जुड़े एक-एक प्रसंग का स्मरण करा रहा है। ऐसा ही एक भावुक प्रसंग शबरी से जुड़ा है। सुनिए, मैथिली ठाकुर जी ने किस तरह से इसे अपने सुमधुर सुरों में पिरोया है। #ShriRamBhajan…— Narendra Modi (@narendramodi) January 20, 2024 -
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: కాకాణి
సాక్షి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుట్రలు వెలుగు చూస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్థన్‌రావుతో ఒక వీడియోను కుట్రపూరితంగా తయారు చేయించి, జోగి రమేష్ పేరు చెప్పించడం ద్వారా వైఎస్సార్సీపీకి ఆ బురదను అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలకమైన నిందితుడు, టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకురావడంలో ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సీబీఐ విచారణకు ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే చంద్రబాబు ఒక పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నీచమైన డ్రామాలకు పాల్పడుతున్నారనే దానిని ప్రజలు గమనిస్తున్నారు. నకిలీ మద్యం తయారీ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి కారకులైన తన పార్టీ వారిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందే తప్ప, దీని మూలాలను దర్యాప్తు చేసి, దానిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేదు.ప్రజల దృష్టిని మళ్ళించేందుకు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును తెరమీదికి తీసుకువచ్చారు. చంద్రబాబు ఇంటిపైన దాడి చేశారంటూ గతంలోనే జోగి రమేష్‌పై ఆయనకు అక్కసు ఉంది. ఎవరైతే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారో, నేడు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గళం ఎత్తుతున్నారో వారిపైన దాడులు చేయించాలి, పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టాలనే లక్ష్యంతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రారంభించింది.కూటమి ప్రభుత్వంలోనే ఈ దందా అని నిర్థారించిన ఎక్సైజ్ అధికారులునకిలీ మద్యం తయారీలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, చంద్రబాబు, లోకేష్‌లతో సన్నిహత సంబంధాలు ఉన్నవారే సూత్రదారులు అని బయటపడింది. సాక్షాత్తు తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ప్రమేయం వెలుగుచూసింది. అయినా కూడా సిగ్గులేకుండా విషయాన్ని డైవర్ట్ చేయడానికి నకిలీ మద్యం మరకను వైఎస్సార్సీపీపై రుద్దడానికి చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోంది. నకిలీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 3వ తేదీన ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ బయటపడింది.నకిలీ మద్యం, సీసాలు, లేబుళ్ళు వెలుగుచూశాయి. ఇబ్రహీంపట్నంలో వేల లీటర్ల మద్యంను నిల్వ చేసిన గోడవున్ను గుర్తించారు. ఈ దందా రెండుమూడు నెలలుగా జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్లుగా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషన్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. డిప్యూటీ కమిషన్ మూడు నెలలుగా జరుగుతున్నట్లు చెప్పారు.రెండుమూడు నెలలుగా ఈ నకిలీ మద్యం దందా రెండుమూడు నెలల నుంచే జరుగుతోందని ఒకవైపు ప్రభుత్వ అధికారులు చెబుతుండటంతో ఇది కూటమి ప్రభుత్వం హయాంలోనే అనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో ఈ నకిలీ మద్యం దందా రెండు మూడేళ్ల నుంచి జరుగుతోందంటూ వైఎస్సార్సీపీకి కూడా ఆ బురదను అంటించే కుట్రకు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. అందులో భాగంగా ఒక విషప్రచారాన్ని ప్రారంభించింది. ఇది మా ప్రభుత్వంలో జరిగిందే కాదు, గత ప్రభుత్వంలోనూ జరిగిందంటూ చెప్పేందుకు తంటాలు పడుతోంది.జనార్థన్ వీడియో ద్వారా డైవర్షన్అక్టోబర్ ఆరో తేదీన జనార్థన్‌రావు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ 'నకిలీ మద్యం తయారీలో నన్ను ముద్దాయిగా చూపుతున్నారు. దీనితో తెలుగుదేశం పార్టీ వారికి సంబంధం లేదు. నాకు ఆరోగ్యం బాగోలేదు, ఆఫ్రికాలో వున్నాను, నేను ఇండియాకు వచ్చిన తరువాత జరిగిన వాస్తవాలను వెల్లడిస్తాను' అని చెప్పాడు. ఆయన వీడియోలో ఎక్కడా జోగి రమేష్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఇక ఆయన రెండో వీడియో ఈ నెల 13న విడుదల చేశాడు. దీనిలో జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి జోగి రమేష్ కుట్రపన్ని, తనకు డబ్బులు ఇచ్చి ఈ నకిలీ మద్యం తయారీని చేయించారంటూ' ఆరోపణలు చేశాడు.'నకిలీ మద్యం తయారీ బయటపడటంతో జయచంద్రారెడ్డి తదితరులను టీడీపీ సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ తన ప్లాన్ మార్చుకున్నాడని, ఇబ్రహీంపట్నంలో ముందుగా సరుకును తెచ్చిపెట్టమని చెప్పడని, దానిని సాక్షి మీడియా ద్వారా ఎక్సైజ్ వారికి పట్టించాడని, ఇదంతా ఒక పథకం ప్రకారం చేశాడంటూ' కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు. మొత్తం వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ చెబితేనే తాను చేశానని, టీడీపీ వారికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా పేర్కొన్నారు. తొలి వీడియోకు, రెండో వీడియోకు సంబంధం లేకుండా జనార్థన్‌రావు మాట్లాడాడు. రెండో వీడియోతో నకిలీ మద్యం కేసును డైవర్ట్ చేసేందుకు కుట్ర ప్రారంభమైంది.టీడీపీ నేతలు తప్పు చేయకపోతే ఎందుకు సస్పెండ్ చేశారు?టీడీపీ నేత జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులపై టీడీపీ ఎందుకు సస్పెన్షన్ వేటు వేసింది? జయచంద్రారెడ్డికి చెందిన వాహనంలోనే తాను నకిలీ మద్యంను రవాణా చేశానంటూ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దానికి ఆధారాలు కూడా ఉండటంతోనే విధిలేని స్థితిలో టీడీపీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారంపై సీరియస్‌గా ఉందని, మేమే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని, గోడౌన్లను వెతికి పట్టుకున్నామని, దాడి చేయించామని కూడా ప్రభుత్వం చెప్పుకుంది.అలాంటప్పుడు జనార్థన్‌రావు విడుదల చేసిన రెండో వీడియోలో జోగి రమేష్ నకిలీ మద్యంను తెప్పించి, ఇబ్రహీంపట్నంలో పెట్టించి, సాక్షి మీడియా ద్వారా దానిని బయటపెట్టించి, ఎక్సైజ్ వారితో సీజ్ చేయించారని ఎలా చెబుతారు? చంద్రబాబుకు వంతపాడే ఎల్లోమీడియా ఈనాడులో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడినా కూడా రెండుమూడు రోజుల పాటు దానిపై ప్రస్తావన కూడా చేయలేదు. తరువాత తప్పు చేశారు కాబట్టే మా పార్టీకి చెందిన నాయకులను సస్పెండ్ చేస్తున్నామని నారా లోకేష్, వర్ల రామయ్య ప్రకటించారు. టీడీపీ అధికారిక ట్వీట్లో జయచంద్రారెడ్డి 'ఏ1' అంటూ పేర్కొని, తరువాత రెండు రోజుల్లో 'ఏ1' అనే దానిని తొలగించారు. అంటే తమ కుట్రను ప్రారంభించడానికి సిద్దమయ్యే, దానికి అనుగుణంగా తమ వైఖరిని మార్చుకున్నారనేందుకు ఇదే నిదర్శనం.సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగుచూస్తాయినకిలీ మద్యంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల్లో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? దానికి బదులుగా వైఎస్సార్సీపీపై బురదచల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు కపట నాటకాన్ని మొదలుపెట్టారు. హడావుడిగా పన్నెండో తేదీన చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టడానికి కారణం, వైయస్ఆర్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోమంత్రికి లేఖ రాయడమే. ఎక్కడ ఇది సీబీఐ దర్యాప్తునకు దారి తీస్తుందోనని భయంతోనే చంద్రబాబు మీడియాతో రకరకాలుగా మాట్లాడారు. వైఎస్ జగన్‌కి, ఆయన బంధువులుకు కూడా ఆపాదించే విధంగా చంద్రబాబు మాట్లాడారు. నకిలీ మద్యం బయటపడిన తరువాత మౌనంగా ఉన్న ఈనాడు పత్రిక, ఈ నెల తొమ్మిదో తేదీన ఆఫ్రికాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు లిక్కర్ వ్యాపారంలో ఉన్నారంటూ వైఎస్ జగన్ బంధువులకు అంటగట్టేలా ఒక కథనాన్ని రాసింది.ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలిజనార్థన్రావును అరెస్ట్ చేసి విచారించిన తరువాత ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్బంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో జోగి రమేష్ పేరు ఉందా? రెండో వీడియోలో మొత్తం జోగి రమేష్ చెబితేనే చేశాను అన్న జనార్థన్‌రావు, పోలీసుల విచారణలో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? దానికి సమాధానం చెప్పాలి. జనార్థన్‌రావు నెల్లూరు జైలుకు రిమాండ్‌కు వెళ్ళిన 24 గంటల తరువాత ఏ విధంగా ఆయన మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది?ఒకవేళ పోలీసులు విచారణలో జనార్థన్‌రావు ఈ వీడియోలో మాట్లాడి వుంటే, రిమాండ్ రిపోర్ట్‌లో ఆ విషయం ఎందుకు రాయలేదు? జనార్థన్‌రావు మాట్లాడిన వీడియో ఎలా బయటకు వచ్చిందో విచారణ జరిపారా? పక్కన ఎవరో ఉండి ప్రామ్టింగ్ ఇస్తుంటే జనార్థన్‌రావు మాట్లాడినట్లు కనిపిస్తోంది, అలా ప్రామ్టింగ్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వానికి ఉన్న సమాచారంతోనే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో పోలీసులు దాడులు చేశారని సీఎం చంద్రబాబు చెప్పుకున్న విషయం వాస్తవం కాదా? రెండో వీడియోలో జనార్థన్‌రావు 'జోగి రమేష్ ఒక పథకం ప్రకారమే ఇబ్రహీంపట్నం గోడవున్లో నకిలీ మద్యంను పెట్టించి, ఎక్సైజ్ వారికి పట్లించారని' మాట్లాడిన విషయం వాస్తవం కాదా? అంటే ప్రభుత్వమే నకిలీ మద్యం గురించి తెలుసుకుని దాడులు చేసి, పట్టుకుందన్న సీఎం చంద్రబాబు మాటలు అబద్దమా? లేక జనార్థన్‌రావు తన వీడియోలో చెప్పిన మాటలు అబద్దమా?నకిలీ మద్యం వ్యవహారంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, టీడీపీని అసహ్యించుకుంటున్నారని తెలియగానే, వైఎస్సార్సీపీపై బుదరచల్లేందుకు గానూ జనార్థన్‌రావుతో ఒక పథకం ప్రకారం ఈ రెండో వీడియోను కుట్రపూరితంగా తయారుచేసి, బయటకు వదిలిపెట్టారనేది వాస్తవం కాదా? తాను విదేశాలకు వెళ్ళిపోతే రూ.3 కోట్లు ఇస్తానని జోగి రమేష్ ఆఫర్ చేశారని, అందుకే ఆఫ్రికాకు వెళ్ళినట్లు చెప్పిన జనార్థన్‌రావు, ఎవరు చెబితే తిరిగి ఏపీకి వచ్చారు? ఆయన చెబుతున్నట్లుగా మూడు కోట్లు తీసుకోకుండానే ఎలా ఏపీకి వచ్చాడు? మొలకలచెరువు ఘటనలో కొందరు దోషులను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని విచారణకు ఇవ్వాలంటూ కష్టడీ పిటీషన్ వేశారు. కానీ జనార్థన్‌రావు విషయంలో ఎందుకు కస్టడీ పిటీషన్ వేయలేదు? జనార్థన్‌రావును లోతుగా విచారించకుండా, దొంగ వీడియోను విడుదల చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? టీడీపీ నేతగా ఉన్న జనార్థన్‌రావును ఆఫ్రికా నుంచి పిలిపించిన ప్రభుత్వం, కీలకమైన జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించడం లేదు? ఆయనపై లుక్అవుట్ నోటీస్ ఎందుకు జారీ చేయలేదు? ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు? పోలీసుల విచారణలో టీడీపీకి చెందిన నాయకులు పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యాన్ని సరఫరా చేశారని అధికారులు వెల్లడించారు. ఆ వ్యాన్లను, వాటి యాజమానులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు?వారంతా టీడీపికి చెందిన వారు కావడం వల్లే వారిని ఉపేక్షిస్తున్నారా? రాష్ట్రంలో ఉన్న డెబ్బై అయిదు వేల బెల్ట్‌షాప్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా మద్యం శాంపిళ్లను సేకరించి, నకిలీ అవునా కాదా అని తెలుసుకునేందుకు ఎందుకు ల్యాబ్‌లకు పంపించడం లేదు? జనార్థన్‌రావుతో గుర్తుతెలియని ప్రాంతంలో ఒక వీడియోను తీయించి, రాజకీయం చేయాలని ఎందుకు చూస్తున్నారు. ఈ వ్యవహారం ముదురుతుంటే ఎంపీ మిధున్‌రెడ్డి నివాసాలపై దాడులు చేయించడం, ప్రజల దృష్టి మళ్లించేందుకు కాదా? నకిలీ మద్యంపై మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సీబీఐ దర్యాప్తును కోరడం లేదు? -
చంద్రబాబు, లోకేష్‌కు జోగి రమేష్ సవాల్
సాక్షి, విజయవాడ: తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనార్థన్‌తో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అని సవాల్ చేసి రెండ్రోజులవుతోంది. మళ్లీ చెబుతున్నా లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. చంద్రబాబు, లోకేష్ రెడీనా?. చంద్రబాబు మరి ఇంత దారుణంగా దిగజారిపోయాడు. రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌రావుతో వీడియో రికార్డ్ చేశారు. బలహీనవర్గానికి చెందిన నన్ను జైల్లో వేయాలని చూస్తున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇబ్రహీంపట్నం నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్నా.. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు’’ అని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. -
చంద్రబాబు దుర్మార్గాలను గట్టిగా ఎదుర్కోవాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ‘‘వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 లక్షల మంది క్షేత్రస్థాయి క్రియాశీల నాయకత్వం ఉంది.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై వైఎస్ జగన్ ఆలోచనలు, బ్లూ ప్రింట్‌ను మనం అమలు చేయాలి’’ అని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలన్నీ చిత్తశుద్ధిగా పనిచేయాలన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం.. అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి సహా ఇతర నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి, ఈ దుర్మార్గాలను ఆపగలగాలి. ఇందులో భాగంగా మనం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ అనుబంధ విభాగాలు అన్నీ దీనిపై చిత్తశుద్దిగా పనిచేయాలి. పార్టీ సంస్ధాగత నిర్మాణంలో ప్రధానంగా అనుబంధ విభాగాలు పటిష్టంగా ఉండాలని వైఎస్ జగన్ ఆలోచించి అందుకు అనుగుణంగా స్ట్రక్చర్ నిర్మించారు..క్షేత్రస్థాయిలో కూడా మన అనుబంధ విభాగాలు ఫోకస్డ్గా పనిచేయాలి. ప్రధానంగా 7 అనుబంధ విభాగాలు కీలకపాత్ర పోషించాలి. పార్టీ లైన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అనుబంధ విభాగాలదే ప్రధాన పాత్ర. మన సొసైటీకి ఎలా మంచి చేయాలని తపన పడే నాయకుడు జగన్. మనం ఎక్కడా అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు. మన పార్టీకి కోట్లాది మంది సైన్యం సిద్ధంగా ఉంది. అందరినీ సంఘటితం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నాం. మనం ఇప్పటికే మండల స్ధాయి కమిటీలలో ఉన్నాం. ఇక గ్రామస్థాయికి వెళ్ళబోతున్నాం. డేటా ప్రొఫైలింగ్ చేస్తూ ముందుకెళుతున్నాం. దీనిపై అందరూ సీరియస్‌గా దృష్టిపెట్టాలి...వైఎస్సార్సీపీ అంటే 18 నుంచి 20 లక్షల క్రియాశీల క్షేత్రస్థాయి నాయకత్వం ఉంటుంది. వీరందరి డేటా ప్రొఫైలింగ్‌ను మనం సరిగా నమోదు చేయగలిగినప్పుడే మనం అనుకున్న ఫలితాలను అందుకోగలుగుతాం. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి, ఈ ప్రక్రియకు అవసరమైన సపోర్ట్ సిస్టమ్‌ను మనం అందుబాటులోకి తెచ్చుకోవాలి. అన్ని విభాగాల మధ్య సమన్వయం చేసుకోవాలి. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణంలో అలసత్వం వద్దు. ఉత్సాహం, తపన, బాధ్యతతో పనిచేయాలని ముందుకొచ్చేవారిని గుర్తించి వారికి కమిటీలలో ప్రాధాన్యతనివ్వాలి...ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది. వైఎస్ జగన్ హయాంలో డెలివరీ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చక్కగా ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తే చంద్రబాబు మాత్రం రివర్స్ పాలన సాగిస్తున్నారు. గతంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని చక్కగా చేశాం. ఇప్పుడు జరుగుతున్న రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలతో పాటు కమిటీల నియామకాలు కూడా పూర్తి చేద్దాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి’’ అని సజ్జల పేర్కొన్నారు. -
18న బీసీ సంఘాల బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మద్దతు కోరుతూ ఆ సంఘాల నేతలు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మాదిరే సమస్యను ఢిల్లీ దాకా తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే ఓటు వేసేది తమ ఎంపీలేనన్నారు.‘‘ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే చాయ్ తాగినంతసేపట్లో రిజర్వేషన్లు వస్తాయి. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుంది...పార్లమెంటులో బిల్లు పెడితే కచ్చితంగా అనుకూలంగా పాస్ అవుతుంది. బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి తీసుకెళ్తే మేము వచ్చి మద్దతు ప్రకటిస్తాం. ప్రధాని స్వయంగా ఓబీసీ కాబట్టి, ఆయనకి బీసీ రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి ఉంటే మంచిది’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
Bihar Election: ఎన్నికల బరిలో ప్రముఖ గాయకుని భార్య?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ నేతలతో పాటు పలువురు గాయనీగాయకులు, నటులు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా భోజ్‌పురి గాయకుడు, నటుడు ఖేసరి లాల్ యాదవ్ ఈ ఎన్నికల్లో తన పాత్రపై ఏమిటనేది వెల్లడించారు. తాను ఆర్జేడీ తరపున ప్రచారం చేయనున్నానని, తన భార్యను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నానని తెలిపారు. #WATCH | Patna: On the Bihar Assembly elections, Bhojpuri singer and actor Khesari Lal Yadav says, "I want my wife to contest the election, I have been trying to convince her for the last 4 days. If she agrees, we will file the nomination; otherwise, I will only campaign and try… pic.twitter.com/EjzOgdduS3— ANI (@ANI) October 15, 2025భోజ్‌పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తన భార్య చేత పోటీ చేయించాలని అనుకుంటున్నానని, ఇందుకోసం ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఒకవేళ ఆమె ఇందుకు అంగీకరిస్తే, తమ నామినేషన్ దాఖలు చేస్తామని, లేనిపక్షంలో తాను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. ఇటు తేజస్వి యాదవ్, అటు అఖిలేష్ యాదవ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పోటీ చేసే విషయంలో రెండు పార్టీల నుండి తనపై ఒత్తిడి ఉన్నదని ఖేసరి లాల్ యాదవ్ పేర్కొన్నారు. తన భార్య అంగీకరిస్తే, ఆమె చేత ఖచ్చితంగా పోటీ చేయిస్తానని తెలిపారు. -
విజయ్ మౌనం.. అయోమయంలో టీవీకే, అభిమానులు!
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్‌కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి. ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే.. తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత.. తన్నుకున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌లో(BJP state office) బీసీ నేతల మధ్య కొట్లాట(BC leaders fight) తీవ్ర కలకలం రేపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు(ramachander Rao), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య.. ఎదుటే నేతలు ఇలా తన్నుకోవడం విశేషం. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల 18న బీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన బంద్‌కు(BC Bandh) మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు ఇవాళ ఆర్.కృష్ణయ్యతో(R.Krishnaiah) పాటు బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టే సమయంలో జూనియర్ అయి ఉండి ఫొటోలకు ఎలా ముందుకు వెళ్తావ్ అని ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో, రెండు వర్గాల నేతలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. అనంతరం, ఒక్కసారిగా బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘర్షణకు దిగిన నేతలను మిగతా బీసీ నాయకులు అడ్డుకున్నారు. కొట్లాటకు దిగిన నేతలపై మిగతా బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
ఫేక్ గాళ్ల కుట్రలు.. లై డిటెక్టర్ టెస్టుకి రెడీ: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్‌రావుతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదని.. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారాయన. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నారావారి సారాను చంద్రబాబు ఏరులై పారిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా నడిపిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్‌రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదు. అది నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని జోగి రమేష్ అన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ మీద కూడా ప్రమాణం చేస్తా. చంద్రబాబు ఇంట్లో కూడా ప్రమాణానికి నేను సిద్ధం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా?. అవసరమైతే సత్య శోధన పరీక్ష(లై డిటెక్టర్)కు నేను సిద్ధం. నా సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా? అని జోగి రమేష్ నిలదీశారు.నా ఫోన్ ఇస్తా చంద్రబాబు, లోకేష్ చెక్ చేస్కోండి. ఓ గౌడ కులస్థుడి మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. నీది ఓ బతుకేనా చంద్రబాబు?నా పేరు రిమాండ్ రిపోర్టులో ఉందా?.. ఫేక్ గాళ్లు కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారాయన.ఇదీ చదవండి: బాబు డైరెక్షన్.. జనార్దన్ యాక్షన్! -
Bihar Polls: 57 మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)బుధవారం 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది.రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే కీలక అభ్యర్థుల్లో సోన్బార్సా నుండి రత్నేష్ సదా, మోర్వా నుండి విద్యాసాగర్ నిషాద్, ఎక్మా నుండి ధుమల్ సింగ్, రాజ్‌గిర్ నుండి కౌశల్ కిషోర్ ఉన్నారు. ఈ జాబితాలో పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విజయ్ కుమార్ చౌదరి.. సరాయ్ రంజన్ నుంచి పోటీ చేయనున్నారు. Janata Dal United (JDU) releases the first list of candidates for the Bihar Assembly Elections. pic.twitter.com/Zb2G7PZvv0— ANI (@ANI) October 15, 2025ఆలంనగర్ నుంచి నరేంద్ర నారాయణ్ యాదవ్, బీహారీగంజ్ నుంచి నిరంజన్ కుమార్ మెహతా, సింగేశ్వర్ నుండి రమేష్ రిషి దేవ్, మాధేపురా నుండి కవితా సాహా, మహిసి నుండి గండేశ్వర్ షా, కుశేశ్వరస్థాన్ నుంచి అతిరెక్ కుమార్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇతర ప్రముఖ అభ్యర్థుల విషయానికొస్తే అనంత్ కుమార్ సింగ్ (మొకామా), శ్యామ్ రజక్ (ఫుల్వారీ), కౌశల్ కిషోర్ (రాజ్‌గిర్), ధుమల్ సింగ్ (ఎక్మా), మహేశ్వర్ హజారీ (కళ్యాణ్పూర్), రత్నేష్ సదా (సోన్బర్సా), సంతోష్ కుమార్ నిరాలా (రాజ్పూర్), మదన్ సాహ్ని (బహదూర్‌పూర్), శ్రీష్వా సింఘ్పూర్పూర్), (గైఘాట్) విద్యా సాగర్ సింగ్ నిషాద్.. మోర్వా నుంచి పోటీ చేస్తున్నారు. -
‘వినేవాడుంటే చెప్పేవాడే చంద్రబాబు.. లోకేశ్ శైలీ ఇదే’
సాక్షి, తూర్పుగోదావరి: వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు.. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి అని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్. డేటా సెంటర్‌పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్తో చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీతో ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని చంద్రబాబు, లోకేష్ డబ్బా కొట్టుకుంటున్నారు. అభివృద్ధి అంతా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది. చంద్రబాబు కాలంలో ఏపీలోనూ ఎటువంటి అభివృద్ధి లేదు. తొమ్మిది హార్బర్స్‌కు శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంతో చేసినా ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం చెందాం.. ఇది వాస్తవం. అప్పటి ఐటీ మంత్రి అమర్నాథ్ను డేటా సెంటర్ అంటే తెలుసా అని లోకేష్ ప్రశ్నించడం హాస్యాస్పదం.డేటా సెంటర్ అంటే ఏమిటి లోకేష్?. డేటా సెంటర్‌పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్తో చర్చకు లోకేష్ సిద్ధమా? దీనిపై సవాల్ చేస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖలో పెట్టుబడులు, గోదావరి జిల్లాలో ఆక్వా అభివృద్ధి, పోర్టుల అభివృద్ధి అన్ని గత ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలే. జిందాల్ సంస్థ తరిమివేస్తే మహారాష్ట్రకి వెళ్లి మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అమ్మేసే వ్యవహారం చేస్తున్నారు. పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రాపర్టీ ఏది?. రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం కాకుండా ఉంటాయి’ అని హితవు పలికారు.ప్రజలు చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టుకున్నారని అనుకుంటున్నారా?. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డి.. ఆయన వైఎస్సార్సీపీ కోవర్ట్ అంటున్నారు. మరి ఎమ్మెల్యే టికెట్ మీరెందుకు ఇచ్చారు?. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మీపై ఆరోపణలు వస్తే పక్కవారిపై బురద జల్లడం మీకు అలవాటు. చిన్నపాటి సోషల్ మీడియా కేసులకి దేశం దాటితే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి పాస్‌పోర్టు రద్దు చేస్తున్నారు. మరి జయచంద్రా రెడ్డి విషయంలో ఎందుకు చేయలేదు. ఆయన ఫోన్ సంభాషణలు ఎవరితో చేశారో స్పష్టం చేయండి. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించండి అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి.సిట్ వేయడం వల్ల ఇటువంటి ఉపయోగం ఉండదు. టీడీపీ నేతలపై సిట్ కేసు నమోదు చేస్తుందా?. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే భాగస్వాములు కదా.. సీబీఐకి అప్పగించండి. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు. పాలకొల్లు, అమలాపురం, ఎక్కడ చూసినా నకిలీ మద్యం కేంద్రాలు బయటపడ్డాయి. 16 నెలలుగా రాష్ట్ర ప్రజలతో నకిలీ మద్యం తాగిస్తున్నారు. ప్రతి నాలుగు బాటిల్లో ఒకటి నకిలీ మద్యమే. జోకర్లు ఎమ్మెల్యేలు అయితే రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది. రాజమండ్రిలో ప్రవీణ్ చౌదరి రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల సంఘం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 9000 రూపాయలు పెంచి వేతన సవరణ చేశారు. రాజమండ్రి ప్రస్తుత ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే 5400 మాత్రమే చేయించారు’ అని చెప్పుకొచ్చారు. -
ఇంక కేసీఆర్ ఫొటో ఎందుకు?..: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ప్రజల్లోకి వెళ్తూ నాలుగు నెలలపాటు యాత్ర చేపడుతున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల యాత్రతో తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఉద్యమకారులు,అమరవీరుల త్యాగాలకు అర్ధం ఉండాలంటే సామాజిక తెలంగాణ రావాలి. అందుకే యాత్రను చేస్తున్నాం. అయితే ఈ యాత్రలో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫొటో ఉండబోదు అని అన్నారామె. అయితే.. ఇది కేసీఆర్‌ను అగౌరవపరిచే ఉద్దేశం ఎంతమాత్రం కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం,తెలంగాణ లేదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే మనస్తత్వం నాకు లేదు. ఆ చెట్టు కింద దుర్మార్గులు ఉన్నారు. నేను నా తొవ్వను వెతుక్కుంటున్నా. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన ఫొటోతో ప్రజల్లోకి వెళ్లలేను అని స్పష్టత ఇచ్చారామె. అక్టోబర్ 25 2025 నుంచి నుంచి ఫిబ్రవరి 13 20206 వరకు నాలుగు నెలల పాటు జాగృతి జనం బాట కార్యక్రమం జరగనుందని కవిత ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటన చేస్తూ బీఆర్ఎస్ను వీడే సమయంలో కేసీఆర్ ఫొటోతోనే తాము భవిష్యత్ కార్యక్రమాలు చేపడతామంటూ కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నకిలీ మద్యంపైనా టీడీపీ మార్కు లీల!
తనపై వచ్చిన ఆరోపణలను ప్రత్యర్థులకే చుట్టబెట్టడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అందవేసిన చేయి. అసత్యాలు, కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడే రాజకీయాలు చేస్తారు. విలువలతో నిమిత్తం లేకుండా వ్యవహరించే తీరు సమాజానికి ఏ మాత్రం ఆదర్శంగా కనపడదు. నకిలీ మద్యం కేసు ఇప్పుడు చంద్రబాబు నైజానికి ఇంకో నిలువెత్తు తార్కాణంగా నిలుస్తోంది. ములకల చెరువు నకిలీ మద్యం ప్లాంట్ కర్త, కర్మ, క్రియ అన్నీ తెలుగుదేశం పార్టీ నేతలే అని తేటతెల్లమైనా ఆ కేసును వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్న తీరు అందరికీ విస్మయం కలిగిస్తోంది. కస్టడీలో ఉన్నా ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు ద్వారా వీడియో విడుదల చేయించిన వైనం, అందులో తెలుగుదేశం ప్రభుత్వానికి సర్టిఫికెంట్ ఇప్పించుకోవడం చూసి విస్తుపోవడం ప్రజల వంతైంది.జనార్ధనరావు విడుదల చేసిన వీడియో సారాంశం మొత్తం ఎల్లో మీడియాలో విపులంగా ప్రచురించారు. అది అచ్చంగా కాశీ మజిలీ కథ మాదిరిగా ఉంది. జగన్ జమానాలో జరిగిన అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జోగి రమేశ్ రూ.మూడు కోట్లు ఆశజూపి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టించారట! జోగి రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే తాను ఆయన నేతృత్వంలో నకిలీ మద్యం తయారు చేశానని, హైదరాబాద్ నుంచి తెచ్చి బార్లో విక్రయించేవాడినని ఆయన అన్నారట. ఇది నిజమైతే అలాంటి వ్యక్తి టీడీపీ వారికి ఎలా దగ్గరయ్యాడు? పైగా తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ప్లాంట్ పెట్టిస్తే చంద్రబాబు ఎలా బద్నామ్ అవుతారు? కుప్పంలో పెట్టించి ఉంటే బాబుకు మరింత ఎక్కువ నష్టం జరిగేదిగా అన్న అనుమానం వస్తే కాశీ మజిలీ కథలు ఇలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి. అంతేనా...? నకిలీ ప్లాంట్ సిద్దం చేసి సరకు నిల్వచేసి పెడితే ఆ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి ఆ ప్లాంట్ పై దాడులు జరిగేలా చూస్తామని రమేశ్ చెప్పారట. అంటే మంత్రిగా పనిచేసిన రమేశ్‌కు అలా ప్లాంట్ పట్టుబడితే తన మీదకు కూడా కేసు వస్తుందని తెలియని అమాయకుడని జనార్ధనరావు చెప్పారన్నమాట. ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం ప్లాంట్‌ను గుర్తించిన సందర్భంలోనే అక్కడ టీడీపీ నేత, తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ ద్వారా నకిలీ మద్యం ఇతర చోట్లకు రవాణా అయినట్లు ప్రకటించారు. ఆ స్థలంలోనే ఉన్న పాలవ్యాన్ల ద్వారా బెల్ట్షాపులకూ చేరుతోందని చెప్పారు. ఇవన్నీ అబద్ధాలేనా? టీడీపీ ముఖ్య నాయకులను చంద్రబాబు సస్పెండ్ చేయడంతో తాను చెబుతున్న విషయాలేవి హైలైట్ కాలేదట. రమేశ్ ఆఫ్రికాలో ఉన్న తనకు ఫోన్ చేశారని జనార్ధనరావు చెప్పారట. అది నిజమైతే, ఫోన్ బొంబాయిలోనే వదలివేసి రావడం ఎందుకు? పనిలో పని జయచంద్రారెడ్డికి కూడా మద్యం తయారీతో ఎలాంటి సంబంధం లేదని ఈయన సర్టిఫికెట్ ఇచ్చేశారు. మరి జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో ఉన్న మద్యం వ్యాపారం మాటేమిటి? ఆయన ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తానని, అప్పటివరకూ ఆఫ్రికాలోనే ఉండమని జోగి రమేశ్ తనతో చెప్పారని, ఆ పని జరక్కపోవడంతో ఈలోగా తన తమ్ముడిని అరెస్ట్ చేయడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు జనార్ధనరావు చెప్పారట. జనార్ధన రావు వాదనలో లొసుగులు అన్నిఇన్నీ కావు. ఆఫ్రికాలో ప్లాంట్ పెట్టగలిగిన వ్యక్తి రూ.మూడు కోట్ల ముడుపుల మొత్తానికి ఆశపడటం నమ్మశక్యంగా కనిపించదు. అలాగే అధికారంలో ఉన్న వారి నుంచి గట్టి హామీ ఏదీ లేకుండా ఎవరూ బెయిల్ కోసం ప్రయత్నించకుండా విదేశాల నుంచి ఆకస్మికంగా రారు. తొలుత తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద ఎక్సైజ్ అధికారులు పట్టుకున్న నకిలీ మద్యం ప్లాంట్ విషయాన్ని టీడీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకోలేదు. ఎక్సైజ్ అధికారులు కూడా దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందని, ప్రభుత్వంలోని పెద్దలు కొంతమందికి ఈ కేసులో నిందితులకు సంబంధాలు ఉన్నాయని తెలిసి ఉంటే ఈ వ్యవహారాన్ని ముందుగానే తొక్కిపెట్టి వేసేవారేమో తెలియదు. అనూహ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య అవడం, పలు చోట్ల నకిలీ మద్యం పంపిణీ అయిందని వార్తలు రావడంతో సంచలనమైంది. మద్య పానం చేసేవారిలో ఆందోళన పెరగడం, కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని, మరికొందరు అకాల మృతి చెందారని కథనాలు వచ్చాయి. అప్పటికి దీని సీరియస్‌నెస్ కనిపెట్టిన ప్రభుత్వ ముఖ్యులు వెంటనే టీడీపీ నేతలు జయచంద్రా రెడ్డి, కట్టా సరేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఆ చర్యతో ఈ స్కామ్‌తో టీడీపీ వారికి ఉన్న కనెక్షన్ ప్రజలందరికి తేటతెల్లమైంది. ఇది మరింత డామేజీ అయిందని భావించిన ప్రభుత్వ పెద్దలు వెంటనే మరో వ్యూహంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో టీడీపీ వారు ఉన్నా సహించబోమన్న సంకేతం ఇవ్వాలని, తద్వారా క్రెడిట్ పొందాలని భావిస్తున్న తరుణంలో జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లతో ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చా యి. జయచంద్రా రెడ్డికి టీడీపీ టిక్కెట్ ఇచ్చిన వైనంపై సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో వెంటనే జయచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనిషి అని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. తంబళ్లపల్లెలో రామచంద్రా రెడ్డి సోదరుడు ద్వారకానాథ రెడ్డిని గెలిపించుకోవడానికి టీడీపీలోకి పంపించారని, ఆయన కోవర్టు అనే వాదన తీసుకువచ్చారు. దీనిపై అంతా నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ వెంటనే లోక్‌సభలో వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నకిలీ మద్యం కేసును సీబీఐ విచారించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దాంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటి ద్వారా కొత్త కథలు సృష్టించారు. జగన్ జమానాలోనే నకిలీ మద్యం మొదలైందని, జనార్ధనరావు తదితరులు అప్పటి నుంచే ఈ వ్యాపారం చేశారని అంటూ వార్తలు ఇచ్చారు. ఇంతలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహింపట్నం లో మరో నకిలీ మద్యం డంప్ బయటపడింది. ఇది మద్యం సేవించే వారిలో ఆందోళన పెంచింది. ఈ సమయంలో ప్రభుత్వం దీనిపై కచ్చితమైన చర్యలు తీసుకుని మద్యం తీసుకునే వారి ఆరోగ్యాలపై దృష్టి కేంద్రీకరించకుండా, వాటిని వదంతుల కింద, వైఎస్సార్సీపీవారి దుష్ప్రచారం కింద తిప్పి కొట్టడం ఆరంభించింది. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ కేసు విచారణకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ వారు సీబీఐ విచారణ డిమాండ్ చేస్తుంటే తన అధీనంలో ఉన్న సిట్ వేయడం ఏమిటన్న ప్రశ్న వచ్చింది. అంతేకాకుండా, మీడియాతో మాట్లాడుతూ స్కామ్ ను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని, ఆఫ్రికాలో నేర్చుకుని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగనీయం, రాజకీయం ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారని అన్నారు. ఆ బ్యాచ్ ఎవరో మీకే త్వరలో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఆఫ్రికా వారిని కూడా మనమే కాపాడాలని వింత ప్రకటన చేశారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలన్న వైఎస్సార్సీపీ డిమాండ్ పై స్పందిస్తూ, కేసును సాగదీయాలనే ఆలోచనతోనే అడుగుతున్నారని అనడం తమాషానే అనిపిస్తుంది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి సీబీఐ సమర్థతపై నమ్మకం లేదన్నమాట. తన హయాంలో నకిలీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదని బుకాయించడానికి యత్నించారు. అదే వైఎస్సార్సీపీ టైమ్‌లో మాత్రం నిరాధారంగా 30వేల మంది చనిపోయారని ఎలా చెప్పారు? ఇది శవ రాజకీయం కాదా? సిట్ ఏమి చేయబోతోందో ముందస్తుగానే ఆయన సంకేతాలు ఇచ్చారని ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు.అది అలా ఉండగా, ఆఫ్రికాలో ఉన్న జనార్ధనరావు ఏపీకి వచ్చి లొంగిపోయారు. అంతకు ముందు ఆయన విడుదల చేసిన వీడియో లో ఎక్కడా జోగి రమేశ్ పై కాని, వైఎస్సార్సీపీపైన కాని ఆరోపణలు చేయలేదు.కాని అరెస్టు అయ్యాక, వీడియో ఆయన ఎలా చేశారో, దానిని ఎలా ఎల్లో మీడియాకు అందచేశారో, ఇందులో పోలీసుల పాత్ర ఏమిటో తెలియదు కాని, మొత్తం కధను జోగి రమేశ్ పై నెట్టేశారు. ఇది టీడీపీ పెద్దల నైపుణ్యం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత తామే నకిలీ మద్యం ప్లాంట్ ను ,డంప్ లను కనిపెట్టామని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత మాట మార్చి జోగి రమేష్ ఎక్సైజ్ అధికారులకు ఎవరి ద్వారానో సమాచారం అందించి దాడులు చేయించారని జనార్ధనరావుతో చెప్పించారు. ఇక్కడే ప్రభుత్వం దొరికిపోయిందనిపిస్తుంది. ఈ నకిలీ మద్యం వల్ల కూటమి ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిందన్న అంచనాకు వచ్చిన పెద్దలు వెంటనే డైవర్షన్ రాజకీయాలలో భాగంగా జోగి రమేశ్ వైపు మలుపు తిప్పారన్న అభిప్రాయం వ్యక్తం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఈ నకిలీ మద్యంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ జోరుగా నిరసనలు చేసిన సాయంత్రానికే జనార్ధనరావు వీడియోను వ్యూహాత్మకంగా విడుదల చేశారు. అయితే అందులో జరిగిన తప్పిదాలతో దొరికిపోయారన్న భావన కలుగుతుంది. అలాగే సురేంద్ర నాయుడు కు ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడితే ఆయనకు క్షమాబిక్ష పెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా ?కాదా?ఏ సంబంధం లేకుండా అలా చేస్తారా అని మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ప్రశ్నకు ఎందుకు టీడీపీ నుంచి సమాధానం రాలేదు? ఇవన్ని ఎందుకు ! సీబీఐ విచారణ లేదా సుప్రీంకోర్టు జడ్జి దర్యాప్తు ,లేదా వెంకకటేశ్వర స్వామి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేయడానికి రావాలని, చివరికి లై డిటెక్టర్ పరీక్షకు జోగి రమేశ్ సవాల్ చేశారు. వాటిలో ఒక్కదానికైనా చంద్రబాబు లేదా ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించలేదు? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జూబ్లీహిల్స్ ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills Elections) ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. లంకల దీపక్ రెడ్డిని(Deepak Reddy) తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే.. బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తాజాగా బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది. -
కేసీఆర్ రీఎంట్రీకి ఇదే మొదటి మెట్టు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమకు మంచి రోజులు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటమి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయడానికి బయల్దేరే ముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ మాకు మంచి రోజులు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అన్ని పనులు ఆగిపోయాయి. హైడ్రా పేరిట శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. కాబట్టి ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం.. .. గులాబీ దండు జైతయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం అవుతుంది. కేసీఆర్ పునరాగమనానికి ఇదే తొలి మెట్టు. ప్రజల దీవెనలు బీఆర్ఎస్కే ఉంటాయని ఆశిస్తున్నాం. మాగంటి సునీత గెలుపునకు బీఆర్ఎస్ సమిష్టిగా కృషి చేస్తుంది అని కేటీఆర్ అన్నారు.నామినేషన్ వేసిన సునీతజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీస్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు ఉన్నారు. పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని, బీఆర్ఎస్ గెలిస్తే బుల్డోజర్ అరాచకాలకు పుల్‌స్టాప్ పడ్డట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: వీడిన సస్పెన్స్.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే..? -
‘మోదీకి మా బాధ తెలియాలి..’ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల ఆందోళన
సాక్షి, కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో వేళ.. న్యాయం కోరుతూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో, ఫ్లకార్డుతో నిరసన చేపట్టారు. మోదీకి తమ కుటుంబం పడుతున్న బాధేంటో తెలియజేసుకునే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వాళ్లు కోరుతున్నారు.సుగాలి ప్రీతిపై అఘత్యానికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలి(Sugali Preethi Case News). అసలు లోకేష్ రెడ్ బుక్‌లో వాళ్ల పేర్లు లేవా?. మా కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలి అంటూ ఫ్లకార్డలతో నినాదాలు చేశారు. మరోవైపు.. తమకు న్యాయం చేయాలని, తమ గోడను ప్రధాని మోదీకి వినిపించే అవకాశాన్ని కల్పించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వేడుకుంటున్నారు. 2017లో కర్నూలులోని ఓ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతిబాయి మృతి చెందింది. అయితే.. స్కూల్ యజమాన్యమే అత్యాచారం చేసి, తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ ప్రీతి కుటుంబానికి అందాయి. అలాగే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ.. ఆ అంశం ముందుకు కదల్లేదు. ఈలోపు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఈ కేసు విపరీతమైన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. అయితే తాజాగా బాధిత కుటుంబం కూటమి పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆందోళనకు దిగిన నేపథ్యంలో.. ప్రభుత్వం దిగి వచ్చి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఇదిలా ఉంటే.. న్యాయం చేస్తానని నమ్మించి పవన్ నమ్మక ద్రోహం చేశారని పార్వతి ఆరోపిస్తున్నారు(Sugali Preethi Mother Slams Pawan Kalyan). అంతేకాదు.. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్‌కు మా ఉసురు తగులుతుంది’’ అని వాపోయారామె. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ రేపు(అక్టోబర్ 16న) కర్నూలుకు రానున్నారు(PM Modi AP Kurnool Tour). ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ను మోదీ అప్పాయింట్మెంట్ ఇప్పించాలని పార్వతి విజ్ఞప్తి చేశారు. అయితే.. అవతలి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. ఇదీ చదవండి: న్యాయం గెలిచింది.. కూటమికి గట్టి దెబ్బ -
ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(prashant kishor) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారాయన. తాజాగా ఆ పార్టీ తరఫున అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. అందులోనూ ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బరిలో నిల్చోవడం లేదంటూ స్పష్టత ఇచ్చారాయన. పోటీకి బదులు తనను సంస్థాగత పనులపై దృష్టిసారించాలని పార్టీ నిర్ణయించింది అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఒకవేళ తాను ఎన్నికల్లో గనుక పోటీ చేస్తే తన స్వస్థలం కర్గాహర్ లేదంటే రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పారు. రాఘోపూర్ ఆర్జేడీ కంచుకోట. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి నెగ్గిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్.. హ్యాట్రిక్‌పై కన్నేశారు. అయితే.. జన్ సురాజ్ తరఫున ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారని ప్రచారం నడిచింది. కానీ, జన్ సురాజ్ రెండో జాబితాలో రాఘోపూర్ నుంచి చంచల్ సింగ్ పేరును ప్రకటించారు. దీంతో ఆ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. అయితే పోటీ చేయకున్నా పార్టీని బలోపేతం చేయడానికి.. ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి తాను కృషి చేస్తానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారాయన. జేడీయూకి ఎలాంటి ఓటమి దక్కబోతోందో చెప్పడానికి సెఫాలజిస్ట్( ఎన్నికల విశ్లేషకుడు) అయి ఉండాల్సిన అవసరమేమీ లేదని అన్నారాయన. అలాగే జన్ సురాజ్‌పార్టీ లక్ష్యం భారీదని, 150 స్థానాలకు ఒక్క సీటు తగ్గినా తమ పార్టీ ఓడిపోయినట్లేనని పీకే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో సల్మాన్‌ఖాన్..!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పక్షాల మైనారిటీ ఓటు బ్యాంక్‌కు గండి పడనుందా? అంటే అవుననే రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నియోజక వర్గంలో మైనారిటీ ఓట్లు కీలకం. మొత్తం ఓట్లలో 24 శాతానికిపైగా మైనారిటీ ఓటర్లు గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపనున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు మజ్లిస్ పార్టీకి మైనారిటీల్లో గట్టి పట్టు ఉంది. ఈసారి మజ్లిస్ ఉప ఎన్నికల బరికి దూరం పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటు బ్యాంక్‌తో పాటు మజ్లిస్ ఓటు బ్యాంక్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక బీఆర్ఎస్ మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల బరిలో సోషల్ వర్కర్ సల్మాన్‌ఖాన్ ఎన్నికల బరిలో దిగుతుండటంతో ప్రధాన ప్రక్షాల మైనారిటీ ఓటు బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. స్థానికుడైన సల్మాన్ క్రౌడ్ ఫండింగ్‌తో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండటంతో నిరుపేద మైనారిటీల్లో గట్టి పట్టు ఉంది. యువత ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. సల్మాన్ ఎన్నికల బరిలో ఉంటే మొత్తం మీద 20 శాతంపైగా కుటుంబాలు అతని వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మైనారిటీ ఓటర్లు 96 వేలపైనే జూబ్లీహిల్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల ఓటర్లు ఉండగా అందులో 96 వేలపైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. దీంతో మైనారిటీ ఓటర్లే గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా మారారు. మజ్లిస్ పార్టీ గతంలో పాగా వేసేందుకు ప్రయతి్నంచింది. మొదటి సారి 2014 ఎన్నికలలో నవీన్ యాదవ్‌ను బరిలో దింపగా 41,656 ఓట్లు దక్కించుకొని స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్తో దోస్తీ కారణంగా పోటీకి దూరం పాటించడంతో నవీన్ యాదవ్ పారీ్టకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18,817 ఓట్లు వచ్చాయి.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్‌ను ఎన్నికల బరిలో దింపినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్దిగా భారత క్రికెటర్ దిగ్గజం అజహరుద్దీన్ ఎన్నికల బరిలో దిగడంతో మైనారిటీ ఓట్లు చీలిపోయాయి. బీఆర్ఎస్కు మైనారిటీ ఓటు బ్యాంక్ కలిసి రావడంతో ఎన్నికల్లో గట్టెక్కగలిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసిన నవీన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈసారి మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం ఉన్నా.. సోషల్ వర్కర్ సల్మాన్ ఎన్నికల బరిలో దిగడం మింగుడు పడని అంశంగా తయారైంది. -
బీహార్ కూటమిలో తేలని సీట్ల లెక్క.. లాలూను అడ్డుకున్న తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత కొనసాగుతోంది. అధికార ఎన్డీయేలోని ప్రధాన పక్షం బీజేపీ ఇప్పటికే 71 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించగా ఇండియా కూటమి ఇంకా పోటీచేసే స్థానాలపైనే సిగపట్లు పడుతోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో బుధ, గురువారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని మిత్రపక్షాలు తేల్చి చెబుతున్నాయి.రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లకు గానూ కాంగ్రెస్ గతేడాది పోటీ చేసిన సంఖ్యతో సమానంగా సీట్లను కోరుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీచేసి 19 చోట్ల నెగ్గింది. ఈసారి సైతం తమకే అంతే స్థానాలను కోరుతుండగా, ఆర్జేడీ మాత్రం 54–55 సీట్లకు మాత్రమే ఆఫర్ ఇస్తోంది. ఇదే అంశమై సోమవారం ఏఐసీసీ పెద్దలతో జరిగిన చర్చల సందర్భంగా మరో 3 స్థానాలు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, తమకు కనీసంగా 65 స్థానాలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు సమాచారం. దీనిపై బుధ, గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.తేజస్వీ జోక్యంతో టికెట్లు ఇవ్వడం ఆపేసిన లాలుఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సోమవారం రాత్రి పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇది సరైన విధానం కాదంటూ కుమారుడు తేజస్వీ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటికే టికెట్లు అందుకున్న నేతలు తిరిగి ఇవ్వాలని తేజస్వి కోరారు. ఇందుకు స్పందించింది కొందరే. గత వారమే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సునీల్ సింగ్ మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ల వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్ నేతల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా నడుస్తున్నాయి. -
Jubilee Hills Bypoll: అదృష్టం కలిసి రావాలని..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా అభ్యర్థులు నమ్మే స్వాములు, పంచాంగ కర్తలు వారి జాతకం, నక్షత్రం ప్రకారం ఏ రోజు, ఏ సమయంలో వేస్తే అదృష్టం వరిస్తుందో తెలుసుకొని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఆయా స్వామీజీలు, పంచాంగకర్తలు, జ్యోతిషులు బిజీబిజీగా మారి వారికి తగు సలహాలు, సూచనలు, ఏదైనా సమస్య ఉండే దానికి చేయాల్సిన పరిహారాలు కూడా చెబుతున్నారు. కొందరు నేతలు మా అభ్యర్థే గెలవాలని పూజలు, హోమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు వందల దాకా నామినేషన్లు పడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం విశేషం. అయితే.. 16, 17, 18 తేదీల్లో దశమి, ఏకాదశి, ద్వాదశి మంచి రోజులు కావడంతో ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అధికంగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ నెల 17న నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బుధవారం కొందరు నేతలతో కలిసి నామమాత్రపు నామినేషన్ వేసి, 18వ తేదీలోపు పార్టీ క్రియాశీల నేతలతో కలిసి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
నేడు మాగంటి సునీత నామినేషన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నా రు. హంగూఆర్భాటానికి తావు లేకుండా తొలిసెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామి నేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.కాగా మాగంటి సునీత మంగళవారం ఎర్రవల్లి నివా సంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేతుల మీదుగా సునీత బీఫామ్‌ను అందుకున్నారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున సునీతకు రూ.40 లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ కుటుంబ సభ్యులతోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు ఉన్నారు. -
చంద్రబాబు డైరెక్షన్‌తోనే జనార్దనరావుతో వీడియో రికార్డింగ్
రాజమహేంద్రవరం రూరల్: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇందులో భాగంగానే ఈ కేసులో అరెస్టయి, రిమాండులో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతో వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ పేరును చెప్పిస్తూ వీడియో లీక్ చేయించారని అన్నారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.మంగళవారం రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో వేణు మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు వరుసగా అరెస్టవుతున్నా, సిగ్గు లేకుండా వైఎస్సార్సీపీకి ఈ బురద అంటించాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, దీంతో భయపడ్డ చంద్రబాబు దీనిని డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ పేరును తెరపైకి తీసుకువచ్చారన్నారు. హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించి ‘దీనిలో కుట్రకోణం ఉంది.దాని కోసం సిట్ వేశాను. కొత్త పాత్రలను ప్రజలకు చూపిస్తాను’ అన్నట్టుగా చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వెంటనే జనార్దనరావు వీడియో విడుదలైందన్నారు. జోగి రమేష్ చెప్తేనే తాను నకిలీ మద్యం రాకెట్ నడిపించానంటూ ఈ వీడియోలో అతడు ఆరోపించాడన్నారు. సీఎం తన అనుకూల అధికారులతో వేసిన సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగదని స్పష్టం చేశారు. ఈ సందేహాలకు బాబే జవాబు చెప్పాలి ‘జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? అంతకుముందే ఆయన తన ఫోన్ పోయిందని పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఫోన్‌లేని వ్యక్తి వీడియో ఎలా రికార్డ్ చేశాడు? జుడీషియల్ రిమాండ్‌లో ఉండే ఈ వీడియో రికార్డ్ చేశాడని భావించినా, ఆయనను విచారించే అధికారులు చుట్టూ ఉంటారు. ఆయన నిలబడి, వినమ్రతతో మాట్లాడతాడు. కానీ.. ఈ వీడియో చూస్తే ఆయన చాలా స్వేచ్ఛగా కుర్చీలో కూర్చుని ఉన్నట్టు, పక్కనుంచి ప్రాంప్టింగ్ తీసుకుంటూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రికార్డ్ చేసిన వీడియోగా కూడా దీనిని భావించే పరిస్థితి కనిపించడం లేదు.అందువల్ల జనార్దనరావుతో ఉద్దేశపూర్వకంగానే కావాల్సిన విధంగా చెప్పించి, వీడియో చిత్రీకరించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సందేహాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి’ అని వేణు అన్నారు. జైలులో రిమాండులో ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి, బయటకు విడుదల చేశారంటే, దీనికి ఏ అధికారి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జోగి రమేష్ కు జనార్దనరావు సన్నిహితుడంటూ ఓ కట్టుకథ అల్లారన్నారు. 2024లో తంబళ్లపల్లి టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు బి–ఫామ్ ఇచ్చిన సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బదులు జనార్దనరావు ఉన్నాడన్నారు.ఈ ఫొటోలు కూడా అన్ని పత్రికల్లోనూ వచ్చాయన్నారు. దీనినిబట్టి జనార్దనరావు ఎవరికి అత్యంత సన్నిహితుడో ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ, భరోసా లేకపోతే అంత ధీమాగా ఒక కేసులో నిందితుడు ఆఫ్రికా నుంచి ఆవిధంగా వస్తాడా అని ప్రశ్నించారు. తొలుత ఆయన ఆఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నకిలీ మద్యం వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదని చెప్పాడన్నారు. రిమాండ్‌కు వెళ్లిన తరువాత జనార్దనరావు మాట ఎలా మారిందని ప్రశ్నించారు. -
జూబ్లీహిల్స్ ఓట్ చోరీపై నేడు హైకోర్టుకు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓటర్లను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. డూప్లికేట్ ఓటర్ల నమోదు ద్వారా అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా విశ్వసనీయత ప్రశ్నార్థకమైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలన్నారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. ఓట్ చోరీకి సంబంధించిన రుజువులను తమ పార్టీ కార్యకర్తల సహకారంతో రెండు రోజుల వ్యవధిలోనే ప్రజల ముందు పెట్టామన్నారు. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఓటరు జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలపై మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు దాటినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బుధవారం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. అసాధారణంగా ఓట్లు పెరిగాయ్.. ‘తెలంగాణ ఓట్ చోరీ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలి. బిహార్‌లో ఓటు చోరీ జరిగితే తెలంగాణలో ఓట్ల చోరీ ద్వారా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది. రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతులను చేతిలో పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో నీతి సూక్తులు వల్లె వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని యత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కింది అధికారులతో కుమ్మక్కైన అంశాన్ని రాహుల్ గాంధీ పరిగణనలోకి తీసుకొని ఇక్కడ జరిగిన దొంగ ఓట్ల అంశంపై స్పందించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 23వేల ఓట్లు పెరిగాయని ఎన్నికల సంఘం చెబుతోంది. మరో 12వేల ఓట్లు తొలగించామని చెబుతున్నా అసాధారణంగా ఓట్లు పెరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి అక్రమంగా ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కిందిస్థాయి అధికారులను కాంగ్రెస్ ఉపయోగించుకుందనే అనుమానం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్న తర్వాత స్వేచ్ఛగా ఎన్నిక జరుగుతుందని ఎలా అనుకోవాలి. ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
‘ఆ భయంతోనే చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు’
తాడేపల్లి : నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పులు మీద తప్పులు చేస్తూ కూడా అడ్డగోలుగా బుకాయిస్తున్నారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల సమావేశమయ్యారు. ‘భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మద్యం అసలుదా.. నకిలీదా అని తెలుసుకునేలా యాప్ పెట్టలేదు. చంద్రబాబు యాప్ పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్లే కదా..?, చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా అడ్డంగా బుకాయిస్తున్నారు. సడెన్‌గా ఒకడు ఆఫ్రికానుంచి వస్తాడు, అతనికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. అతని వీడియో బయటికి వస్తుంది, జోగి రమేష్ పేరు చెబుతాడు.. అతను చెప్పినందుకే చేశానంటాడు, నకిలీ మద్యం కేసులో చంద్రబాబు అడ్డం దొరికారు. ఆ భయంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాప్‌లు ఉన్నాయని చంద్రబాబే ఒప్పుకున్నారు.. కల్తీ మద్యాన్ని అసలు మద్యంలా చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాం.. ఆ దుకాణాలకు వచ్చిన మద్యం ఏ డిస్టిలరీ నుంచి వచ్చిందో తెలుసేలా చేశాం. దాని అమ్మకం జరిగితేనే డిస్టిలరీకి డబ్బులు వెళ్ళే విధంగా క్యూఆర్ కోడ్ పెట్టాం. పక్కాగా పకడ్భందీగా లిక్కర్ సేల్స్ జరిగాయి. టీడీపీ ప్రభుత్వం కల్తీ మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. 24 గంటలు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు పెట్టి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఉవ్వెత్తున ఎగిసి పడి మనం పోరాటాలు చేస్తున్నాం. చంద్రబాబు గ్యాంగ్ బరితెగించి అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం అయ్యేలా యాప్‌ను కూడా సిద్దం చేశాం.. డేటా ప్రొఫైలింగ్ జరుగుతుంది. స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తిస్ధాయిలో సిద్దంగా ఉండాలి. పార్టీ కమిటీలు, సంస్ధాగత నిర్మాణం విషయంలో పుంగనూరు, మడకశిర నియోజకవర్గాలను మోడల్ గా తీసుకుని ముందుకెళ్ళాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహిస్తే నష్టమని చంద్రబాబు అంటున్నారు పీపీపీలో మెడికల్ కాలేజీలు మంచిదని చెబుతున్నాడు.. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?’ అని సజ్జల ప్రశ్నించారు.ఇదీ చదవండి:‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’ -
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థికి కేసీఆర్ చేతుల మీదుగా బి ఫామ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్,కు పార్టీ అధినేత కేసీఆర్ బి ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల రూపాయలు చెక్కు ను అందించారు.ఈ సందర్భంగా.. దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు కుమారుడు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
66 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల నేర చరిత్రను బహిర్గతం చేసింది. 66 శాతం మంది శాసనసభ్యులపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 241 మంది ఎమ్మెల్యేల్లో 158 మంది (66 శాతం) తమపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఏడీఆర్ తన నివేదికలో (ADR Report) పొందుపరిచింది.అరాయ్ బీజేపీ ఎమ్మెల్యే రామ్‌సురత్ కుమార్, సూర్యగర్హా జేడీయూ ఎమ్మెల్యే పహ్లాద్ యాదవ్ అఫిడవిట్లు అందుబాటు లేనందున వారిద్దరి వివరాలు పరిగణనలోకి తీసుకోలేదని ఏడీఆర్ తెలిపింది. 2020 ఎన్నికల అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకున్నందున కొంతమంది ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్యలో ఇప్పుడు కొన్ని మార్పులు ఉండవచ్చని తెలిపింది.ముఖ్యంశాలు119 మంది (49 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 8 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై హత్య కేసులు (ఐపీసీ సెక్షన్ 302) ఉన్నాయి.30 మందిపై హత్యాయత్నం కేసులు (ఐపీసీ సెక్షన్ 307) ఉన్నాయి.53 మంది (64 శాతం) బీజేపీ ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 53 మంది (74 శాతం) ఆర్జేడీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.21 మంది (45 శాతం) జేడీయూ ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 14 మంది (82 శాతం) కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.9 మంది (82 శాతం) సీపీఐ (ఎంఎల్) (ఎల్) ఎమ్మెల్యేలపైనా కేసులున్నాయి.విద్యార్హత- వయసుసిట్టింగ్ ఎమ్మెల్యేల విద్యార్హతలను పరిశీలిస్తే.. 82 మంది (34 శాతం) ఎమ్మెల్యేలు 5 నుంచి 12వ తరగతి చదివిన వారు. గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ చదివిన వారు 149 (62 శాతం) మంది ఉన్నారు. వయసులవారీగా చూస్తే.. 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు 122 మంది (51 శాతం) ఉన్నారు. 241 మంది ఎమ్మెల్యేల్లో 29 మంది (12 శాతం) మాత్రమే మహిళలు.బిహార్ అసెంబ్లీకి తాజా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.చదవండి: అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆమెనే! -
కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం.. కేసీఆర్ ఫొటో లేకుండానే..
సాక్షి,హైదరాబాద్: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక తెలంగాణ లక్క్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. తండ్రి కేసీఆర్ ఫొటో కాకుండా ప్రొఫెసర్ జయ శంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. యాత్ర పోస్టర్లను సిద్ధం చేశారని, యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం (అక్టోబర్15) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కవిత మేథావులు, విద్యావంతులతో భేటీ కానున్నారు.అక్టోబర్ చివరి వారం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర తెలంగాణలోని అన్నీ జిల్లాలను కవర్ చేస్తూ ఫిబ్రవరిలో ముగియనుంది. కవిత తెలంగాణ యాత్రపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్కినేని నాగార్జునతో వివాదంపై.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హన్మకొండ: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని దెబ్బతీయాలని కొంతమంది రెడ్లు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం (అక్టోబర్14)ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ..‘కొంతమంది రెడ్లు నన్ను దెబ్బతీయాలని చూస్తున్నారు. మంత్రిగా నేను ఏ పనిచేసినా వివాదం చేయాలనుకుంటున్నారు. నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు. కానీ దాన్ని వివాదంగా చిత్రీకరించారు. అందుకే మీడియాతో ఓపెన్‌గా ఉండటం లేదు. మౌనంగా నాశాఖ పనులు చేసుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యే బొజ్జల చెప్పేవన్నీ అబద్ధాలే: వినుత కోటా
తిరుపతి జిల్లా: తనపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా ఖండించారు. ఆ ప్రచారమంతా అబద్ధమేనని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో తాను రూ. 8 కోట్లు డబ్బులు అడిగానంటూ బొజ్జల చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. అదంతా అసత్య ప్రచారమేనన్నారు వినుత కోట. ఎన్నికల ప్రచారంలో తనను ఎన్నోసార్లు అవమానించిన పార్టీ నిర్ణయం మేరకు పనిచేశానని ఆమె తెలిపారు. ఇదీ చదవండి:మరో ట్విస్ట్.. వినుత కోటా సెల్ఫీ వీడియో -
విజయ్ టీవీకే పార్టీలో కీలక వ్యక్తులు తెలుగువారే
సాక్షి,చెన్నై: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కరూర్ తొక్కిసలాటపై దర్యాప్తు చేపట్టే బాధ్యతల్ని సీబీఐకి అప్పగించింది. ఆ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీం నియమించింది. అయితే, విజయ్ (Vijay) ఇప్పటి వరకు నిర్వహించిన బహిరంగ సభల్లో అధికార, గత పాలకుల అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో విజయకు మద్దతు ఎవరిస్తారు? విజయ్ మద్దతు ఎవరికుంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయ్‌కు విశ్వాసపాత్రులుగా ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. వారిలో ఒకరు తమిళనాడు తిరుచ్చికి చెందిన అధవ్ అర్జున్ రెడ్డి. ఈయన దేశంలో లాటరీ కింగ్ పేరు పేరొందిన మార్టిన్ అల్లుడే ఈ అర్జున్ రెడ్డి. ఎలక్టోరల్ బాండ్స్ కోసం రూ. 1318 కోట్లు ఇచ్చి దేశంలో అగ్రగామిగా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన డీఎంకేకి మద్దతు ఇచ్చారు. ఇంకొకరు ఆనంద్, విజయ్ ఫాన్స్ అసోసియేషన్ తరపున పుదుచ్చేరి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. వారిద్దరు విజయ్‌కు విశ్వాస పాత్రులుగా ఉంటూ టీవీకే (TVK) కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఇక తాజా, సుప్రీంకోర్టు నిర్ణయంతో విజయ్ త్వరలో జిల్లాల పర్యటన ఉండనుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలతో విజయ్.. ఏఐఏడీఎంకే, బీజేపీతో పొత్తుపెట్టుకుంటారా? లేదంటే ప్రశాంత్ కిషోర్ (prashant kishor) సూచనలు మేరకు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగతాడా? అన్నది తేలాలంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చదవండి: అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆమెనే! -
‘కూటమి కల్తీ బురదను జోగి రమేష్‌కు పూయాలని చూస్తున్నారు’
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ నేతల నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు ధ్వజమెత్తారు. కూటమి కత్తీ బురదను జోగి రమేష్‌కు పూయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) జోగి రమేష్‌ను వెల్లంపల్లి, మల్లాది విష్ణులు కలిశారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రప్రభుత్వం ప్రజలను కల్తీ మద్యంతో వేధిస్తోంది. 16 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది. చిత్తూరు నుంచి వెస్ట్ గోదావరి వరకూ ఎక్కడ చూసినా కల్తీ మద్యమే. టిడిపి అవినీతిని ప్రశ్నిస్తున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారు. జోగి రమేష్‌ను ఇరికించాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ మద్యంలో టిడిపి నేతల పాత్ర ఉంది. అఫిడవిట్లోనే డిస్టిలరీలు ఉన్నాయని జయచంద్రారెడ్డి చెప్పినప్పుడు మీ కళ్లు మూసుకుపోయాయా?’ అని ప్రశ్నించారు.మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల అసత్యాలను ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. బీసీ నేత పైన కావాలని కక్ష సాధిస్తున్నారు. కల్తీ మద్యానికి జోగి రమేష్‌కు ఏం సంబంధం?, జనార్ధన్ రావుతో వీడియో చేయించి జోగిరమేష్ పైన తోసేశారు. జోగి రమేష్ పై కక్షసాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కచ్చితంగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది’ అని విమర్శించారు. ‘ఎప్పటికీ చంద్రబాబుకు మంచి బుద్ధి రాదని అర్థమైంది’ -
Bihar: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ తొలి జాబితా విడుదల చేసింది. 71 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం(అక్టోబర్ 14వ తేదీ) తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది బీజేపీ. ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ. తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు. లకిసరాయి నుంచి డిప్యూటీ సీఎం విజయసింహ పోటీచేయనున్నారు. సివన్ నుంచి మంగళ్ పాండే పోటీకి సిద్ధమయ్యారు. ఇక స్పీకర్ నందకిషోర్ యాదవ్‌కి టికెట్ దక్కలేదు. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ పొత్తులో భాగంగా 101 సీట్లలో పోటీ చేయనుంది. भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति द्वारा बिहार विधानसभा चुनाव-2025 के लिए चयनित सभी प्रत्याशियों को हार्दिक बधाई एवं विजयश्री की अग्रिम शुभकामनाएं।#आएगी_NDA pic.twitter.com/vENiqKpx1w— BJP Bihar (@BJP4Bihar) October 14, 2025 రెండు రోజుల క్రితం బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించారు మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఇచ్చారు. ఇదిలా ఉంచితే బిహార్‌లో నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఒప్పందం ఇలా..జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లుభారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లుహిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం): 6 సీట్లురాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం): 6 సీట్లు ఇదీ చదవండి: బిహార్‌లో సంపన్న ఎమ్మెల్యే ఆమెనే..! -
‘చంద్రబాబుకు ఎప్పటికీ మంచి బుద్ది రాదని అర్ధమైంది’
సాక్షి,తాడేపల్లి :సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెటైర్లు వేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దొరకగానే జోగి రమేష్ వెళ్లి ఇది నారావారి సారా అని మాట్లాడారు. దీంతో అతనిపై కక్ష కట్టి ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు.జోగి రమేష్ ఉన్నట్టు జనార్థన్‌రావుతో చందమామ కథ అల్లించారు.అందుకే ఎప్పటికీ చంద్రబాబుకు మంచి బుద్ధిరాదని అర్ధమైందని వ్యాఖ్యానించారు. మంగళవారం (అక్టోబర్14) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యం కేసును సీబిఐకి అప్పగించాలి. చంద్రబాబుకు మంచి బుద్ది ఎప్పటికీ రాదని అర్ధమైంది.లైడిటెక్టర్ పరీక్షకు జోగి రమేష్ సిద్దమని సవాల్ చేసినా స్పందన లేదు. రెండున్నర నెలల నుండి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులే చెప్పారు. కానీ రెండు మూడేళ్లుగా తయారవుతున్నట్టు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం మీద మా వాళ్లు ఒక్క పోస్టు పెడితేనే కేసులు పెడుతున్నారు. ఒక్క ఫ్లెక్సీ కట్టాలన్నా బెదిరిస్తున్నారు. అలాంటిది మా వాళ్లు ఏకంగా నకిలీ మద్యం కుటీర పరిశ్రమను పెట్టగలరా?నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు.అందుకే కేసు విచారణ సక్రమంగా జరగడం లేదు. ఆ కేసును మిగతా పార్టీల మీదకే రుద్దుతే టీడీపీకే నష్టం. మా హయాంలో 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. దానికి తగిన ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్టులు చూపించగలరా?. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం దొరికితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?.ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?. చంద్రబాబు చేసేది బురద చల్లుడు రాజకీయమే. కట్టుకథలతో ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిశారు. కస్టడిలో ఉన్న జనార్ధన్ వీడియో ఎలా బయటకు వచ్చింది?. ఎవరు రికార్డు చేశారు?.సిట్ విచారణ చేస్తుందా? వీడియో లీకులు ఇస్తుందా?. ఎంపీ మిథున్‌రెడ్డితోపాటు కీలక నేతల మీద వేధింపులు ఊహించిందే. ఒక్కొక్కరి మీద పది కేసులైనా పెడతారు.అన్నిటినీ ఎదుర్కోవటానికి మేము సిద్దంగానే ఉన్నాం’అని స్పష్టం చేశారు. -
బిహార్‌లో సంపన్న ఎమ్మెల్యే ఆమెనే!
బిహార్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు వ్యూహాల్లో తలమునకలయ్యాయి. సీట్ల లెక్కలు, ప్రచార పర్వంపై అధికార, విపక్ష కూటముల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ప్రస్తుత ఎమ్మెల్యేలకు సంబంధించిన సమగ్ర నివేదికను వెల్లడించింది. 2020 ఎన్నికలు, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ రిపోర్ట్ తయారు చేసింది ఏడీఆర్. బిహార్‌లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 241 మందికి సంబంధించిన పూర్తి డేటాను విడుదల చేసింది.రూ. 1,121 కోట్ల ఆస్తులుఏడీఆర్ నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 194 మంది అంటే 80 శాతం మంది కోటీశ్వరులు. 241 మంది శాసనసభ్యుల మొత్తం ఆస్తులు విలువ దాదాపు రూ. 1,121.6 కోట్లుగా తేలింది. బీజేపీలో 72 మంది (87 శాతం) సంపన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కమలం పార్టీకి మొత్తం 83 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆర్జేడీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 63 మంది (88 శాతం) కోటీశ్వరులు. జేడీయూ పార్టీ ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది (83 శాతం) సంపన్నులే.కాంగ్రెస్ పార్టీకి ఉన్న 17 మంది శాసనసభ్యుల్లో 13 మంది (76 శాతం) కరోడ్పతులున్నారు. హిందూస్తానీ అవామీ మోర్చా (సెక్యులర్) పార్టీలోని నలుగురు ఎమ్మెల్లో ఇద్దరు (50 శాతం) సంపన్నులు ఉన్నారు. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) నుంచి ఒక్కొక్కరు చొప్పున కోటీశ్వరులు ఉన్నారు. బిహార్ శాసనసభలో ఉన్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ. 4.7 కోట్లుగా అంచనా వేసింది.నీలం దేవి టాప్బిహార్లోని అత్యంత సంపన్న శాసనసభ్యుల జాబితాలో జేడీయూ ఎమ్మెల్యే నీలం దేవి (Neelam Devi) అగ్రస్థానంలో ఉన్నారు. 2022 ఉప ఎన్నికల్లో మోకామా నియోజకవర్గం నుంచి ఆమె గెలిచారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆమెకు రూ. 80 కోట్లుపైగా విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ. 29.8 కోట్ల చరాస్తులు, రూ. 50.6 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. సంపద విషయంలో తన తోటి శాసనసభ్యుల కంటే ఆమె చాలా ముందున్నారు. గయ జిల్లాలోని బెలగంజ్‌కు చెందిన జేడీయూ మరో మహిళా ఎమ్మెల్యే మనోరమా దేవి రెండో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.72.8 కోట్లు. భాగల్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.43.2 కోట్లు.నిరుపేద ఎమ్మెల్యే ఆయనేఖగారియా జిల్లాలోని అలౌలి (ఎస్సీ) ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్‌వృక్ష సదా నిరుపేద ఎమ్మెల్యే అని ఏడీఆర్ రిపోర్ట్ (ADR Report) తెలిపింది. ఆయన మొత్తం ఆస్తులు కేవలం 70,000 రూపాయలు మాత్రమే. వీటిలో రూ.30,000 చరాస్తులు, రూ.40,000 స్థిరాస్తులు ఉన్నాయి. ఫుల్వారీ (ఎస్సీ) నియోజకవర్గ సీపీఐ (ఎంఎల్) గోపాల్ రవిదాస్ (Gopal Ravidas) తదుపరి స్థానంలో ఉన్నారు. ఆయనకు రూ. 1.59 లక్షలు విలువచేసే ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఇదే పార్టీ నుంచి పాలిగంజ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సందీప్ సౌరవ్ రూ. 3.45 లక్షల విలువైన ఆస్తులను ప్రకటించారు.చదవండి: చెట్లకు సెల్ఫోన్లు.. మహిళలకు తప్పని పాట్లుఅంత వ్యత్యాసమా?బిహార్‌లో ధనిక, పేద ఎమ్మెల్యేల మధ్య భారీ వ్యత్యాసం.. అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దం పడుపడుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో బిహారీలకు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Election) రెండు విడతల్లో.. నవంబర్ 6, 11న జరగనున్నాయి. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. -
‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’
సాక్షి, శ్రీకాకుళం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి చంద్రబాబు ప్రభుత్వం ఘోర తప్పిదం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకేసారి వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ధర్మాన పేర్కొన్నారు.పేద, మద్యం తరగతి కుటుంబాల్లో ఒకరికి ఆరోగ్యం పాడైనా అప్పుల పాలవుతున్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పేద, మధ్య తరగతి వారి కోసమే. వైద్య విద్యను అధిక ఖరీదు చేస్తే పేదలు ఎలా చదువుకోగలరు?. కోట్లు పెట్టి మెడికల్ సీట్లు కొన్నవారు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే చంద్రబాబు మార్చుకోవాలి’’ అని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.‘‘నాణ్యమైన విద్య ఒక్కటే సమసమాజాన్ని స్థాపించగలదు. సమ సమాజాన్ని స్థాపనే లక్ష్యంగా వైఎస్సార్సీ హయాంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం. రాజ్యాంగం ఏం చెప్పేది కూడా కూటమి పాలకులకు తెలియదా?. విద్య, వైద్యం ప్రైవేటీకరణ ప్రజలకు అంగీకారం కాదు. వైద్య రంగంలో వైఎస్ జగన్ చేసిన సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే. పలాస కిడ్నీ ఆసుపత్రి, ిసెర్చ్ సెంటర్ వైఎస్ జగన్ పాలనకు గొప్ప నిదర్శనం’’ అని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. -
కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ భగ్గుమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతుంది? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి నియోజకవర్గంలో వేలుపెట్టడం మీకు అలవాటు. నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. మీరు కూడా ఏదో ఒకరోజు బయటకు వెళ్లడం పక్కా’’ అంటూ రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా, అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై పడింది. రాష్ట్ర రాజధానిలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో ఉపఎన్నిక ఆసక్తిగా మారింది. ఎన్నికల బరికి ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు చిన్నా చితక పార్టీలు, సామాజిక వేత్తలు, నిరసనకారులు పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిరసన గళం తలనొప్పిగా తయారైంది. కుల, నిరుద్యోగ సంఘాలతో పాటు బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్ల వేసేందుకు సిద్ధమవడం కలకలం రేపుతోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత రెండో ఉపఎన్నిక కావడంతో జూబ్లీహిల్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మంకంగా తీసుకొని ముందస్తుగానే ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్లు చైర్మన్లను రంగంలోకి దింపారు. గత రెండు మాసాల్లో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయతి్నంచారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసి బీసీ కార్డు ప్రయోగించి యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను ఎన్నికల బరిలో దింపింది. టికెట్ ఆశించిన సీనియర్లు అసంతృప్తికి గురి కావడంతో మంత్రులను రంగంలోకి దింపి బుజ్జగించడంలో సఫలీకృతమైంది. తాజాగా నిరసనగళం ఆందోళన కలిగిస్తోంది. -
ఎల్లో కవర్ల కలకలం.. అర్ధరాత్రి బీహార్‌లో పొలిటికల్ హైడ్రామా
బీహార్ రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన పరిణామాలు నిజంగానే హైడ్రామాను తలపించాయి. రాష్ట్రీయ జనతా దళ్(RJD) పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, వాళ్లకు సీల్డ్ కవర్ల అందజేత, కొద్దిగంటలకే తిరిగి వెనక్కి తీసుకోవడం.. తీవ్ర కలకలం రేపాయి. అధిష్టానం పెద్దల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. అసలేం జరిగిందంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం మహాఘట్ బంధన్‌లో సీట్ల సర్దుబాటు జరిగిపోయిందంటూ జాతీయ మీడియా చానెల్స్‌లో హడావిడి నడుస్తోంది. ఈ తరుణంలో సోమవారం ఢిల్లీలో ఐఆర్సీటీసీ కేసు కోర్టు విచారణ అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో సహా పాట్నాకు చేరుకున్నారు. అయితే కాసేపటికే ఆర్జేడీ శ్రేణులకు అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది(RJD Candidates). కాసేపటికి.. లోపలికి వెళ్లిన కొందరు.. నిమిషాల తర్వాత చేతుల్లో ఎల్లో కవర్లతో(RJD Yellow Covers Drama) బయటకు వచ్చి తమ వర్గీయులతో కోలాహలంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందులో వాళ్ల పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే పత్రాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం నడిచింది. అయితే.. కొద్దిసేపటికే లాలూ తనయుడు తేజస్వి యాదవ్, లాలూ నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే కవర్లు అందుకున్నవాళ్లకు మరోసారి ఫోన్లు వెళ్లాయి. కవర్లు తీసుకెళ్లినవాళ్లు.. అర్ధరాత్రి తిరిగి లాలూ నివాసానికి చేరి వాటిని అప్పగించారు. ఎల్లో కవర్లు అందుకున్నవాళ్లలో.. జేడీయూ నుంచి తాజాగా ఆర్జేడీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నాగేంద్ర కుమార్ సింగ్ అలియాస్ బోగో కూడా ఉన్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందనే దానిపై ఆర్జేడీ నేతలెవరూ స్పష్టత ఇవ్వలేదు. అయితే.. అష్రాఫ్ ఫాతిమా మాత్రం తాము ఎలాంటి కవర్లు అందుకోలేదని, అవి ఏఐ జనరేటెడ్ ఫొటోలు అని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిందనేది తాజా సమాచారం. మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుందని, కాంగ్రెస్ 70 స్థానాల్లో, ముకేష్ సాన్హీ వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయింపు జరిగిందనేది ఆ కథనాల సారాంశం. బీహార్ ఫస్ట్ ఫేస్‌కు ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ నడుస్తోంది. నవంబర్ 6న పొలింగ్ జరుగుతుంది. రెండో దశ పోలింగ 11వ తేదీన జరుగుతుంది. నవంబర్ 14న కౌంటింగ్.. ఆరోజే ఫలితాలు వెల్లడించనున్నారు.ఇదీ చదవండి: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ -
అన్ని చోట్లా నడిచినట్లు మునుగోడులో నడవనీయను: కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లా: ఎక్సైజ్ పాలసీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో ఆయన మరోసారి ప్రభుత్వ ఎక్సైజ్ విధానాలను ఎత్తి చూపారు. ఎక్సైజ్ పాలసీని మార్చాల్సిందేనని.. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే బదులు.. మెరుగు పరిచేలా ప్రభుత్వం పనిచేయాలి. వైన్ షాపుల విషయంలో మునుగోడులో తన సూచనలు పాటించాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా ఒకటే.. అన్ని ప్రాంతాల్లో నడిచినట్లు మునుగోడులో నడవనీయనంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.మునుగోడులో ఎమ్మెల్యే నూతన నిబంధనలుమద్యం దుకాణాలకు ఈ నెలతో గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్తగా టెండర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అందుకు ఈ నెల 18 వరకు గడువు ఉంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని మద్యం దుకాణాల టెండర్లు వేయాలనుకునే వ్యాపారులు తాను సూచిస్తున్న నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని టెండర్లు వేయకముందే చెబుతున్నానని పేర్కొంటున్నారు.అంతే కాకుండా నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలను నల్లగొండ ఎక్సైజ్ కార్యాలయానికి పంపి ఎమ్మెల్యే సూచనలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌కు పంపారు. కార్యాలయం బయట ఆ సూచనల పోస్టర్‌ను ఏర్పాటు చేయించారు. తాను చేస్తున్నది ఎవ్వరి మీదనో కోపంతో కాదని.. అలా అని తాను మద్యానికి పూర్తిగా వ్యతిరేకం కూడా కాదని అంటున్నారు. కొందరు యువకులు, నడి వయస్సు వాళ్లు కుటుంబ పోషణ మరచి ఉదయం నుంచే మద్యం తాగి అనారోగ్యం బారిన పడుతున్నారని.. అలాంటి వారిని కాపాడేందుకే తాను ఈ నిర్ణయాలు తీసుకున్నాని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు.ఎమ్మెల్యే చేస్తున్న సూచనలు ఇవీ..మద్యం దుకాణాలు గ్రామ శివారులో ఏర్పాటు చేయాలి.మద్యం దుకాణంలో సిట్టింగ్ ఏర్పాటు చేయకూడదుబెల్ట్షాపులకు మద్యం విక్రయించవద్దుమద్యం వ్యాపారులు సిండికేట్ కావొద్దురోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలికొత్తగా టెండర్లు వేసేవారు ఈ షరతులు పాటిస్తామంటేనే టెండర్లు వేయాలని, లేదంటే టెండర్లు వేసి నష్టపోవద్దని తమ నాయకులతో సోషల్ మీడియాతో వైరల్ చేయడంతోపాటు గొడలపై పోస్టర్లు ఏర్పాటు చేయించారు. -
‘టీడీపీకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు’
చిత్తూరు జిల్లా: ‘నేను తెలుగుదేశం పార్టీకే ఓటువేశా. ఓటు వేసి కూడా నాకు న్యాయం జరగకుండా పోయింది. ఎవరూ తెలుగుదేశానికి ఓటు వేయకండి. నాశనమైపోతారు. నా.. పోతారు. వద్దు..’ అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఓ యువకుడి సెల్ఫీ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పూతలపట్టు మండలం రామాపురానికి చెందిన దినేష్ ఆదివారం రాత్రి ఓ ప్రభుత్వ బండిని ఢీకొట్టాడని తెలిసింది.ఆ తర్వాత ఒక వీడియో వైరల్ అయింది. తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారంటూ పసికందుతో ఉన్న దినేష్ పోస్ట్ చేసిన వీడియో అందరిని కంటతడి పెట్టించింది. కొందరు కూటమి నాయకుల ప్రోద్బలంతో తనను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోతో మరో సెల్పీ వీడియో పెట్టాడు.వివరాలు అతడి మాటల్లోనే.. ‘నా పేరు దినేష్, నా భార్య సుభద్ర, నా కూతురు సహస్ర. టీడీపీ నాయకులు యువరాజులునాయుడు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు వల్లే మా ప్రాణాలు పోతాయి. వాళ్లు పోలీసు స్టేషన్లో చిత్రహింసలు పెట్టించారు. నేను తెలుగుదేశం పార్టీకే ఓటు వేశాను. నాకు న్యాయం జరగలేదు. కానీ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా.. ఎవ్వరూ కూడా ఆ పార్టీకి ఓటు వేయొద్దు. నాశనం అయిపోతారు. నా.. పోతారు. వద్దు..’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వరుస వీడియోలు పూతలపట్టులో చర్చనీయాంశంగా మారాయి. -
బాబును రక్షించేందుకేనా ‘ఉచిత’ సలహా?
ప్రజాకర్షక పథకాలు, వారసత్వ రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సమయం సందర్భం వెనుక ఉద్దేశం ఏమిటా? అనేదీ చర్చనీయాంశంగా మారింది. ఉచితాల గురించి ఆయన గతంలోనూ కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ.. సంక్షేమ పథకాలను రాజకీయం కోసం వాడుకుంటున్న వారికి మద్దతిచ్చి విమర్శలకు గురయ్యేవారు. అలాంటిది తాజాగా.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘స్వర్ణ భారతి ట్రస్టు’లో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణాల వంటివి మహిళలకు కాకుండా దివ్యాంగులకైతే అమలు చేయవచ్చునని, ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావిస్తూ ఐదేళ్లలో ఎంత అప్పు చేస్తారన్న దానిపై స్పష్టత ఉండాలని, అప్పులను ఎలా తీర్చుతారో కూడా ప్రజలకు తెలియ చేయాలని ఆయన సూచించారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ది చేస్తే పేదరికం తగ్గుతుందని, ఉచితాల వల్ల కాదని అన్నారు(Venkaiah Naidu Shocking Comments On CBN Govt). వెంకయ్య నాయుడు వ్యాఖ్యలలో తప్పేమీ లేదు కానీ.. ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏపీ సర్కారును సంక్షోభం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేక చంద్రబాబుతో కాస్త తేడా వచ్చిందా అన్న అనుమానం వస్తుంది. అయితే వెంకయ్య నాయుడు, చంద్రబాబు, లోకేశ్‌లు ఇటీవలే ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. దీన్నిబట్టి ఊస్తే పొరపచ్చాలు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఇదీ చదవండి: అడ్డగోలు ఉచితాలెందుకు? ఏపీ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలుఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అలవిగాని హామీలను అమలు చేయలేక నానా పిల్లిమొగ్గలు వేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్‌సహా సుమారు 150 వరకూ వాగ్ధానాలిచ్చిన కూటమి నేతలు ఏడాదిపాటు వాటి అమలును ఎగవేసి ఆ తరువాత కూడా అరకొరగా కొన్నింటిని మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించాయి. అది కూడా ప్రజల నిరసన నుంచి తప్పించుకునేందుకు మాత్రమే. ఎన్నికల సమయంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి షరతుల్లేకుండా తిరగవచ్చని ఊరించిన చంద్రబాబు అధికారం వచ్చిన తరువాత మాత్రం ఏసీ బస్సుల్లో ఎక్క కూడదని, సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ అనుమతించమని, పదహారు రకాల బస్సు సర్వీసుల్లో ఐదింటిలో మాత్రమే ఉచిత స్కీము అమలు మొదలుపెట్టారు. అంతేకాకుండా.. బస్సు సర్వీసులను బాగా తగ్గించి నడుపుతూండటంతో ఉచిత స్కీము ఉన్నా లేనట్టుగా మారిపోయింది. మరోవైపు ఈ స్కీము వల్ల ఆటోలు నడుపుకునే వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆందోళనకు దిగడంతో రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. ప్రచారం సమయంలో 13 లక్షల మంది ఆటోల వారు ఉన్నారని చెప్పి, మూడు లక్షల మందికే ఈ సాయం ఇచ్చారు. రోజుకు వెయ్యి నుంచి రెండువేల వరకు సంపాదించుకునే తమకు ఇప్పుడు రూ.200 నుంచి రూ.500 రావడమే గగనం అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున ఇస్తే ఏ అవసరం తీరుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవే. కాకపోతే ఎన్నికల మానిఫెస్టో ప్రకటించినప్పుడే ఈ కామెంట్లు చేసి ఉంటే అంతా మెచ్చుకునేవారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టీడీపీ, జనసేనలు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలను ఎలా మోసం చేయబోతున్నారో వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి దాదాపు రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని లెక్కగట్టి మరీ చెప్పారు. అయినా అప్పట్లో వెంకయ్య నాయుడు వంటివారు దానిపై కూటమి నేతలను ప్రశ్నించలేదు. పరోక్షంగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ద్వారా చంద్రబాబు సర్కారుకు వాటి నుంచి బయటపడడానికి ఒక మార్గం చూపుతున్నారా? అనే సందేహం వస్తుంది. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేశారు. 1996 ఎన్నికల సమయంలో మద్య నిషేధం, కిలో రెండు రూపాయల బియ్యం పథకం వంటి వాటిని అమలు చేస్తామని ప్రచారం చేసిన ఆయన తదుపరి ఆ స్కాముల వల్ల నష్టం జరుగుతోందని, ప్రజాభిప్రాయం సేకరణ తంతును నిర్వహించి వాటన్నిటిని రివర్స్ చేశారు. గత టర్మ్‌లో రైతులకు పూర్తిగా రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు కాని చేయలేకపోయారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం మీడియాను, వెంకయ్య వంటివారితో ముందుగా ప్రచారం చేయించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టామని చెప్పి, స్కీములకు ఎగనామం పెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరగుతోందా? అనే సందేహం పలువురిలో కలుగుతోంది. ఎందుకంటే.. టీడీపీ మీడియా కూడా కొన్నాళ్ల క్రితం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చింది. ఇదే మీడియా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అద్భుతం అంటూ ప్రచారం చేసేది. అధికారం వచ్చాక చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా ప్రజలను మాయ చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది. ఆ విన్యాసాలలో వెంకయ్య నాయుడు వంటివారు భాగస్వాములు కారాదని అంతా కోరుకుంటారు. విద్య, వైద్యానికి సంబంధించి జగన్ చేసిన కృషి కళ్లకు కనబడుతున్న విషయమే. అయినా వెంకయ్య నాయుడు ఎన్నడూ మెచ్చుకోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఎవరిమీదో ప్రేమతో కాకుండా, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాట్లాడితే మంచి విలువ వస్తుంది. వెంకయ్య ఆ పని చేశారా అన్నది ప్రశ్న. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాని తెలుగుదేశంలోని వారసత్వ రాజకీయాల గురించి ఎందుకు ఆయన ప్రస్తావించరన్న సంశయం వస్తుంది. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న విధానం గురించి తన అబిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది. ఈ పదిహేడు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన రూ.2.10 లక్షల కోట్ల రుణం గురించి కూడా వెంకయ్య కామెంట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు. ఈ మధ్యకాలంలో బీహారు ఎన్నికల నేపథ్యంలో 75 లక్షల మంది మహిళలకు రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. దానికి ప్రదాని మోదీ బటన్ నొక్కారు. 2014లో బీజేపీలో వెంకయ్య నాయుడుకు ముఖ్య భూమికే ఉండేది. అయినా ఆ పార్టీ చేసిన వాగ్ధానాలతో ఎన్ని ప్రజాకర్షక విధానాలు ఉన్నాయో ఆయనకు తెలియవా? అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో.. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకు వచ్చి రూ.15 లక్షల చొప్పున పంచుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసేవారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ విషయాలన్ని పలుమార్లు ప్రస్తావించేవారు. ఆ తర్వాత కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు కూడా మంత్రి. పార్టీ ఫిరాయింపులపై కూడా వెంకయ్య నాయుడు స్పందించారు. కాని ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసిన తీరు కూడా విమర్శలకు గురైంది. ఎన్డీయేకి దూరమైన సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో ఎంత వేగంగా అనర్హత వేటు వేసింది కూడా చర్చనీయాంశమైంది. 2014 టర్మ్‌లో ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న అంశం గురించి కూడా వెంకయ్య పల్లెత్తు మాట అన్నట్టు లేదు. చేతిలో అధికారం ఉన్నప్పుడు గట్టిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఆయన మాటకు విలువ వచ్చేది. మరో సంగతి కూడా చెప్పాలి. ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా తన పరపతి ఉపయోగించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాజీ కుదర్చిన వారిలో ఉన్నారని చెబుతారు. తాజాగా ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్లు, అందులో టీడీపీ నేతల పాత్రపై కూడా వెంకయ్య నాయుడు గట్టిగా మాట్లాడి ఉంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చినవారై ఉండేవారేమో కదా!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఒకే ఇంట్లో 42 ఓట్లు
హైదరాబాద్: యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను ఎన్నికల అధికారులు కొట్టివేశారు. శ్రీకృష్ణానగర్‌లోని బి–బ్లాక్‌లో ఉన్న 8–3–231/బి/160 నెంబర్‌గల సంస్కృతి ఎవెన్యూ అపార్ట్‌మెంట్‌ను సోమవారం ఎన్నికల అధికారులు సందర్శించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఖైరతాబాద్ తహశీల్దార్ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఎల్ఓలు సోమవారం విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆ ఇంట్లో రామకృష్ణ, ప్రసన్న, సుబ్బరత్నమ్మ అనే ముగ్గురు మాత్రమే ఓటర్లు ఉంటున్నారు. అయితే మిగిలిన 39 మంది మాత్రం అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లారు. సిని పరిశ్రమకు చెందిన వారుగా గుర్తించిన అధికారులు అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి వారి వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టŠస్లో వారు విధులు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం వారు నివసిస్తున్న ఇంటి నెంబర్‌తో మరో ఓటును కూడా పొందారా అనే క్రమంలో విచారించగా ఇంకో ఓటు లేదని నిర్థరణకు వచ్చారు. తమ ఓటు అదే ఇంటి నెంబర్లో ఉంటుందని, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేశామని అధికారులకు తెలియజేశారు. గత 20 ఏళ్లుగా ఇక్కడే ఓట్లు వేస్తున్నట్లుగా తెలిపారను. కాగా ఇల్లు ఖాళీ చేసిన వారి ఓట్లను వారి అనుమతి లేకుండా తొలగించే హక్కు బీఎల్ఓలకు లేని కారణంగా వాటిని తొలగించలేదని, 43 ఓటర్లను గుర్తించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. -
Jubilee Hills by Election: బీఆర్ఎస్ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. మొదటి రోజైన సోమవారం ప్రధాన రాజకీయపారీ్టలేవీ నామినేషన్లు దాఖలు చేయలేదు. పోలింగ్‌కు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రచారాల్లో మునిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతోనే ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. దీంతో, తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టకోవడమే కాక, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పేందుకు ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే తలంపులో బీఆర్ఎస్ ఉంది. గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే తమ అభ్యర్థిగా అందరి కంటే ముందే ప్రకటించిన బీఆర్ఎస్, ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించగా, తాజాగా సోమవారం రహ్మత్‌నగర్‌లో పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గెలుపు ఇప్పటికే ఖాయమైందని, ఎక్కువ మెజార్టీ పొందడమే ముందున్న లక్ష్యమని కార్యకర్తలను ప్రోత్సహించారు. అనంతరం కేటీఆర్, అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో భారీ యెత్తున దొంగ ఓట్లు చేర్చిందంటూ ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఓవైపు పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు. మరోవైపు బస్తీల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ నియోజకవర్గాల్లోని వారి సహకారం కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషి తదితరులను కలిసి ఎన్నికలో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరో ప్రకటించకపోవడంతో బహిరంగంగా ప్రచార కార్యక్రమాలేవీ లేనప్పటికీ, లోపాయికారీగా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల తొలిరోజు దృశ్యాలిలా ఉండగా, మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశాక ప్రచార కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. -
పట్టుకోసం బీఆర్ఎస్.. పాగా వేయాలని కాంగ్రెస్..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం పైనే నిలిచింది. అధికార కాంగ్రెస్ పారీ్టకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్‌గా మారగా, ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ అదే స్థాయిలో పావులు కదుపుతోంది. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టలు తమ అభ్యర్థులను బరిలోకి దించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా, ఇంకా బీజేపీ అభ్యరి్థని ప్రకటించకపోవడంతో ప్రచారంలో వెనకబడి ఉంది. ఈఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్లకు నువ్వా..నేనా..! అన్నట్లుగా మారడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వేడెక్కుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా సానుభూతితో గెలవాలని బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యరి్థగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను రంగంలోకి దింపింది. ఇక స్థానికుడు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటికే పలుమార్లు పోటీ చేసిన అనుభవం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ యువనేత వి.నవీన్యాదవ్ను అభ్యరి్థగా ప్రకటించింది. నేడో రేపో భారతీయ జనతా పార్టీ లంకాల దీపక్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,549 (43.9 శాతం)ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు 64,212 (35 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి 25,866 (14.1 శాతం) ఓట్లు, ఎంఐఎం అభ్యరి్ధగా పోటీ చేసిన మహ్మద్ రాషేద్ పరాజుద్దీన్కు 7,848 (4.2 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1,83,312 ఓట్లు పోలయ్యాయి. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంటుందా..? కాంగ్రెస్‌దే పై‘చేయి’ అవుతుందా? అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నవీన్.. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్‌యాదవ్‌కు 41,656 ఓట్లు రాగా రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన మాగంటి గోపీనాథ్ పైనే పోటీ చేశారు. తాజాగా మూడోసారి మాగంటి భార్యతో పోటీ పడుతున్నారు. -
కొలిక్కి వచ్చిన మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాటు
కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాష్ట్రీయ జనతా దళ్(RJD) మిత్రపక్షం కోసం కాస్త దిగొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీహార్ ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. కోరుకున్న సీట్లకు కేటాయించడంతో మహాఘట్ బంధన్‌లో సీట్ల కేటాయింపు సస్పెన్స్‌కు దాదాపుగా తెర పడినట్లేనని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి(Bihar Seats Sharing). మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 144 స్థానాలకు పోటీ చేయాలని తొలుత భావించింది. అయితే సర్దుబాటు నేపథ్యంలో ఇప్పుడు 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అలాగే.. కాంగ్రెస్ పార్టీ తొలుత 61 స్థానాలను కేటాయిస్తారనే ప్రచారం జరగ్గా.. ఇప్పుడు 70 స్థానాల్లో పోటీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కూటమిలో భాగమైన ముకేష్ సాన్హీ వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షాలు మాత్రం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అని బహిరంగంగా చెప్పేశాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పోస్టుకు సంబంధించిన అంశమేదీ మహాఘట్ బంధన్‌లో చర్చకు రాలేదని సమాచారం. అంతకు ముందు..బీహార్‌లో ప్రతిపక్ష కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ 70 స్థానాలు తమకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఒకవైపు రాహుల్ గాంధీ సమక్షంలోనే తాను సీఎం అభ్యర్థినంటూ తేజస్వి యాదవ్ ప్రకటించినా.. సీట్ల డిమాండ్‌ను నేరవేర్చుకునేందుకే కాంగ్రెస్ ఆ అంశంపై సైలెంట్‌గా ఉంటూ వచ్చింది. ఇంకోవైపు.. బీహార్ మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకాన్ని ఇరకున పడేసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM), ఐపీ గుప్తా నేతృత్వంలోని ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ(IIP) విపక్షాలతో చేతులు కలిపాయి. దీంతో.. ఎనిమిది పార్టీలకు ఈ కూటమి విస్తరించింది. అదే సమయంలో వీఐపీ పార్టీ అధినేత ముకేశ్ సాహ్ని.. 50 స్థానాలు+ఉపముఖ్యమంత్రి డిమాండ్ చేయడంతో సీట్ల పంపకంలో జాప్యం జరిగింది. చివరకు 16 పార్టీలకు సాహ్ని ఒప్పుకోగా.. ఆర్జేడీ తన కోటా నుంచి జేఎంఎంకు, కాంగ్రెస్ తన కోటా నుంచి IIP పార్టీకి స్థానాలు కేటాయించేందుకు అంగీకరించడంతో.. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లైంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. మొత్తం 243 స్థానాలకుగానూ.. 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ కాగా.. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశలో నవంబర్ 6న, రెండో దశలో నవంబర్ 11న పోలింగ్ ఉంటుంది. ఓట్లు లెక్కించే తేదీ నవంబర్ 14. ఇదీ చదవండి: లాలూ కుటంబానికి భారీ షాక్ -
నకిలీ మద్యంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా?: భూమన అభినయ్
సాక్షి, తిరుపతి: సోషల్ మీడియాలో చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారంటూ వైఎస్సార్సీపీ నార్త్ క్లస్టర్ విభాగం అధ్యక్షుడు నవీన్‌ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. భూమన అభినయ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యంపై తప్పులు ఎత్తి చూపిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులతో పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే నవీన్‌పై కేసు పెట్టారన్నారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుపై అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఒక తీవ్రవాదిని బంధించినట్టు పది మంది పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నాయకులు భయపడే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని అభినయ్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఢిల్లీ కాంగ్రెస్‌కు సెగ తగలాలి: కేటీఆర్
రహమత్‌నగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపించే కాంగ్రెస్ పార్టీకి, ప్రజల మేలు కాంక్షించే కారు పార్టీకి మధ్యే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ కావాలో, హైడ్రా పేరుతో సామాన్య ప్రజల ఇళ్లను కూల్చేయడమే ఎజెండాగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు సెగ తగిలేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. రహమత్‌నగర్ డివిజన్ క్వారీ మైదానంలో సోమవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నగరాన్ని ‘హైడ్రా’బాద్‌గా మార్చి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని దెబ్బతీసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఓట్చోరీ అంటుంటే.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీయే ఓట్‌చోరీకి పాల్పడిందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లను చేర్చిందని ఆరోపించారు. ఇదే మోకా.. బీఆర్ఎస్ కార్యకర్తల కసి, పట్టుదల, తపన పార్టీ విజయానికి నాంది కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నవారు సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ధోకా తిన్న తెలంగాణకు ఇవాళ మోకా వచి్చంది. ప్రతి ఇంటికి వెళ్లి నిజం చెప్పాలి. గులాబీ జెండా రెపరెపలాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన ప్రతి ఒక్కరినీ కలిసి బాకీ కార్డులు పంచాలి’అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వృద్ధులకు రూ.48 వేలు, పెళ్లి అయిన ఆడబిడ్డలకు తులం బంగారం, మహాలక్ష్మి కింద మహిళలకు రూ.40 వేల చొప్పున బాకీ ఉందని అన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అందులో కనీసం 5 శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కొడితేనే ఆరు గ్యారంటీలు వస్తాయి ఆటో డ్రైవర్లు మొదలుకొని బస్ డ్రైవర్ల వరకు అందరి చూపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల వైపే ఉందని కేటీఆర్ అన్నారు. ‘ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డులు పెడతామన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమా? ఎంతో మంది నిరుపేదలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కళ్లు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు వస్తాయి. కాంగ్రెస్ గెలిస్తే ఏమీ ఇవ్వకున్నా గెలిచామని, ప్రజలు తనకే ఓట్లు వేస్తారని సీఎం రేవంత్ అనుకుంటారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. గలీజ్ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని, ఇంత దివాళాకోరు సీఎంను ఎక్కడా చూడలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. సునీత గెలుపు ఖాయం: హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖాన వైద్యులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని కాంగ్రెస్ నాయకులు వాగ్దానం చేశారు. ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదు. ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపు ఖాయమే. భారీ మెజారిటీ కోసమే మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన దివంగత మాగంటి గోపీనాథ్.. నియోజకవర్గ అభివృద్ధితో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన ఆశయాలు నేరవేర్చాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని హరీశ్‌రావు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, నేతలు వద్దిరాజు రవిచంద్ర, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కౌషిక్ రెడ్డి, వేములు ప్రశాంత్‌రెడ్డి, ముఠా గోపాల్, మల్లారెడ్డి, వివేకానంద్‌గౌడ్, సుధీర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, దాసోజు శ్రవణ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, శ్రీనివాస్‌గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, దాస్యం విజయ్ భాస్కర్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సునీత కంటతడి.. ఓదార్చిన సబిత ఎస్పీఆర్ హిల్స్‌లో సోమవారం నిర్వహించిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో తన భర్తను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా వేదికపై ఉన్న నాయకులు మౌనంగా ఉండిపోయారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సునీతను ఓదార్చారు. -
‘చంద్రబాబూ.. కృష్ణా జిల్లా నా అడ్డా.. నేను ఇక్కడే ఉంటా’
విజయవాడ: టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును ఆ కేసులో నిందితుడితో చెప్పించడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కస్టడీలో ఉన్న జనార్థన్‌రావుతో తన పేరును చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) విజయవాడ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యా బిడ్డల సాక్షిగా ఏ తప్పూ చేయలేదని, నకిలీ మద్యం కేసుతో అసలు తనకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. ఈ కథ మొత్తం చంద్రబాబుదేనని, సిట్ చీఫ్‌కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబే అందిస్తున్నారని మండిపడ్డారు. ‘జనార్ధన్ పిల్లల్ని వేధించి నాపై తప్పుడు కేసులు పెట్టించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పుడు కేసుల్లో ఇరికించారు.లైడిటెక్టర్ పరీక్షలకు నేను రెడీ.. చంద్రబాబు మరి నువ్వు?. నకిలీ లిక్కర్ స్కాం కేసులో నా ప్రమేయం లేదు. నాకు సంబంధం ఉందని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. నా భార్య,పిల్లలతో తిరుమలకు వస్తా. చంద్రబాబు కూడా కుటుంబంతో తిరుమలకు రావాలి. అక్కడ నేను తప్పు చేశానని నువ్వు చెబితే నేను ఏ శిక్షకైనా సిద్దమే. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా జనార్ధన్‌తో నా పేరు చెప్పించారు. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. కృష్ణాజిల్లా నా అడ్డా. నేను ఇక్కడే ఉంటా. నాపై చేస్తున్న ఆరోపణల్ని మీ ఇంట్లో వాళ్లు కూడా నమ్మరు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా -
‘నకిలీ మద్యం కేసులో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’
తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితులుగా ఉన్న టీడీపీ నేతలు పట్టుబడుతుండటంతో భయపడ్డ కూటమి ప్రభుత్వం మరోసారి తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌ను బయటకు తీసిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ పెద్దల సహకారంతో టీడీపీ నేతలు నకిలీ మద్యం రాకెట్‌ను నడిపిస్తున్న వైనంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఈ బురదను వైఎస్సార్సీపీకి అంటించేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని ధ్వజమెత్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్థన్‌రావుతో ఒక వీడియోను తీయించి, దానిలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పిండంతో ఈ కుట్ర బయటపడిందని అన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌రావు ఎలా వీడియో తీయగలడని, దానిని ఎల్లో మీడియాకు ఎలా చేర్చగలిగాడని వారు ప్రశ్నించారు. ఇంకా వారేమన్నారంటే..టీడీపీ పెద్దల కుట్రలు పరాకాష్టకు..కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారు చేస్తూ, ఆధారాలతో సహా బయటపడినప్పటి నుంచి, దాన్ని ఎలాగైనా వైఎస్సార్సీపీకి అంటించేందుకు టీడీపీ పెద్దలు, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్‌రావు వీడియో ఒకటి ఈ సాయంత్రం లీక్ చేశారు. నిజానికి ఆయన ఇప్పుడు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన వీడియో ఎలా బయటకు వచ్చింది? అంటే ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతోంది. ఈ కేసుపై నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, దీనిపై ‘సిట్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే, కేసును ఎలా నీరుగార్చబోతున్నారు? వైయస్సార్సీపీకి ఎలా అంటగట్టబోతున్నారు? అనేది తేటతెల్లమైంది. పైగా ఈ కేసులో లోతులోకి వెళ్లేసరికి విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయన్న చంద్రబాబు మాట.. ఆయన కుట్రను బయట పెట్టింది. సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే, కేసులో ప్రధాన నిందితుడైన జనార్థన్ రావు నోటి నుంచి వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరు పలికించి, ఆయన్ను ఈ కేసులో ఇరికించే పని మొదలు పెట్టారు. నిజానికి నకిలీ మద్యం తయారు చేస్తున్న, ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులు జనార్థన్ రావు, జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులు.. స్వయంగా చంద్రబాబు, నారా లోకేష్‌తో దిగిన ఫోటోలు ఉన్నాయి. అంటే వారంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్నారు. కాబట్టే అంత పెద్ద రాకెట్ నడిపించారు. ఇంకా చెప్పాలంటే.. ముందు నుంచి మా పార్టీ చెబుతున్నట్లు ప్రభుత్వ, పార్టీ పెద్దల కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోంది, ఇది వాస్తవం. ఇదంతా టీడీపీ ప్రభుత్వం వచ్చాక, మొదలైన దందా. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యాన్ని పట్టించడమే జోగి రమేష్ చేసిన నేరమా? ఆఫ్రికా నుంచి దర్జాగా పిక్నిక్ నుంచి తిరిగి వచ్చినట్లు జనార్థన్‌రావు రావడం.. అంతకు రెండు, మూడు రోజుల ముందు ఒక వీడియో రిలీజ్ చేసి, నకిలీ మద్యం తయారీలో ఎవరి ప్రమేయం లేదని చెప్పడం.. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగింది. ఆఫ్రికా నుంచి దర్జాగా వచ్చిన జనార్థన్‌రావును గన్నవరం విమానాశ్రయం నుంచే ఎక్సైజ్ అధికారులు ఎక్కడికో తరలించారు. ఏం చెప్పాలో, ఎవరిపై నింద వేయాలో.. అన్నీ ఒక పథకం ప్రకారం ఆయన్ను ప్రిపేర్ చేశారు.వైఎస్సార్సీపీ ఆందోళనలతో కంగారుపడ్డ చంద్రబాబురాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైయస్సార్సీపీ ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసన, ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేయడంతో భయపడిన, చంద్రబాబు నిన్న రాత్రి హడావిడిగా ప్రెస్‌మీట్ పెట్టి, చాలా విషయాలు మాట్లాడి, ఈ కేసులో వైయస్సార్సీపీ నాయకుల ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పినట్లు ఆరోపించి, సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెడ్ హ్యాండెడ్‌గా అన్ని ఆధారాలతో దొరికినా, నకిలీ మద్యం తయారీ ఈ స్థాయిలో జరుగుతున్నా.. అందులో ప్రభుత్వ, పార్టీ పెద్దల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నిందను వైయస్సార్సీపీపై వేయడం అత్యంత దారుణం హేయం. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? భారత రాజ్యాంగ పరిధిలో ఈ రాష్ట్రం లేదా? ఇంత కంటే నిర్లజ్జగా అధికార దుర్వినియోగం ఎక్కడైనా ఉంటుందా? ఇవి దర్యాప్తు సంస్థలా? లేక చందమామ కధలు చెబుతున్నారా? బేతాళ కథలు అల్లడంలో సిద్ధహస్తులయ్యారు. ఏ రాష్ట్రంలోనూ ఇంత దగుల్బాజీ వ్యవస్థ లేదు. చంద్రబాబు మాదిరిగా వ్యవస్థలను ఎవరూ నాశనం చేయడం లేదు. చట్టం, న్యాయం, కోర్ట్లు అంటే ఏ మాత్రం గౌరవం లేదు. రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్న నకిలీ మద్యం తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, జనార్థన్, సురేంద్రనాయుడు తదితరులపై కేసు నమోదు చేశారు. ఒక పథకం ప్రకారం ముందుగా మాట్లాడుకున్న తరువాత జనార్థన్ నాయుడిని దక్షిణాఫ్రికా నుంచి ఏపీకి రప్పించారు. ఎంత దర్జాగా ఆయన విదేశాల నుంచి ఏపీకి వచ్చారో కూడా ప్రజలు చూశారు. ఆ తరువాత ఒక కుట్రపూరితంగా ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియోతో అధికార తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్కయ్యింది. జనార్థన్‌ను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు. 12వ తేదీన కోర్ట్ కు రిమాండ్‌కు పెట్టారు. ఈ రోజు విడుదల చేసిన వీడియోలో 'నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌కు సంబంధం ఉందని, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబుకు చెడ్డపేరు రావాలని, తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం ఫ్యాక్టరీని పెట్టి, ఊరూరా ఆ మద్యాన్ని సరఫరా చేయాలి' అని జోగి రమేష్ చెప్పినట్లుగా ఆ వీడియోలో చూపించారు. మొలకలచెరువులో ఈ వ్యవహారం బయటపడిన తరువాత దాని డిపో ఇబ్రహీంపట్నంలో బయటపడింది. దీనిని కూడా తమకు అనుకూలంగా చేసుకుని మాజీ మంత్రి జోగి రమేష్ సలహా మేరకే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డిపోను ఏర్పాటు చేశారని, మొలకలచెరువు మద్యం తయారీ బయటపడిన వెంటనే, జోగి రమేష్ ఇబ్రహీంపట్నం లోని డిపో గురించిన సమాచారంను ఒక పథకం ప్రకారం లీక్ చేయించారంటూ జనార్థన్‌తో చెప్పించిన వీడియోను బయటకు విడుదల చేశారు. ఈ వీడియో గురించి పూర్తి వాస్తవాలు బయటపెట్టాలి. సిట్ దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే ఎల్లో మీడియా ఈ వీడియోను ఎలా విడుదల చేసిందో చెప్పాలని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. -
చంద్రబాబు కమీషన్ల దందాపై మల్లాది విష్ణు ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత భారీ వ్యయాలతో అమరావతిలో ప్రభుత్వ భవనాలను నిర్మించడం వెనుక సీఎం చంద్రబాబు దండుకుంటున్న కమీషన్ల దందా దాగి ఉందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎంతో గొప్పగా ప్రారంభించిన సీఆర్డీఏ భవన నిర్మాణ వ్యయాన్ని చూస్తేనే ఎంత భారీ అవినీతి దీనిలో ఉందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏకంగా చదరపు అడుగు రూ.11,0002.64 చొప్పున దాదాపు రూ.338.14 కోట్లతో సీఆర్డీఏ భవనాన్ని నిర్మించారని, దేశంలోని అత్యంత ఖరీదైన నగరాలుగా ఉన్న బెంగుళూరు, ముంబై వంటి చోట్ల, స్టార్ హోటళ్ళే చదరపు అడుగు గరిష్టంగా రూ.4500లకే నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. అంచనాలను పెంచడం, అందులో తమ వంతు ముడుపులను అందుకోవడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...సీఆర్డీఏ నూతన భవనం గురించి చెప్పుకోవాలంటే... అప్పుచేసి పప్పు కూడు, జనానికి క్షవరం. రెట్టింపునకు మించి నిర్మాణ వ్యయం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సీఎం చంద్రబాబు చేస్తున్నారేందుకు ఈ సీఆర్డీఏ భవనమే పెద్ద ఉదాహరణ. తొలిగా హెచ్ఓడి పేరుతో పురపాలక, పట్టణాభివృద్ది శాఖలు ఈ భవనం నుంచే పనిచేస్తాయని చెబుతున్నారు. సీఆర్డీఏ భవనంలో ఏ విభాగాలు పనిచేస్తాయి, అందులో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, ప్రస్తుతం వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారంటే సరైన సమాధానం లేదు. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనే సామెతను తలపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజల సొమ్ముతో అవసరానికి మంచిన సామర్థ్యంతో, రెట్టింపు అంచనాలతో భారీ భవనాలను నిర్మించి, తమ ఘనతగా చాటుకోవాలని చూస్తోంది. అనుత్పాదక వ్యయంగా ఈ భవనాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా దీని నిర్వహణ కోసం అత్యధిక వ్యయాన్ని భరించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాల నిర్వహణకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందో తెలియదా? దీనివల్ల ప్రభుత్వంపై భారం పడదా?చంద్రబాబు కమీషన్ల దందాఅంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు దీనిని అత్యంత విలాసవంతమైన, ఖరీదైన వ్యవహారంగా మార్చేశారు. అందుకే దేశంలో భవనాలు, రోడ్ల కోసం ఎక్కడా లేని విధంగా భారీ వ్యయాన్ని కేటాయిస్తున్నారు. అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారు. అప్పులు చేసి రాజధాని పేరుతో భవనాలు నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఈ రుణభారాన్ని ప్రజల నెత్తిమీద రుద్దుతున్నారు. ప్రతిసారీ తాను గొప్ప విజనరీనీ అని చెప్పుకునే చంద్రబాబు కేవలం తన కమీషన్లను పెంచుకోవడానికే, ఈ తరహాలో అంచనాలను పెంచి భారీ నిర్మాణాలను చేపడుతున్నారు.2016లో ఇదే తరహాలో వెలగపూడిలో రూ.1150 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల్లో తాత్కలిక సచివాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు శాశ్వత సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల కోసం 52,90,426 చదరపు అడుగులతో నిర్మాణాలకు సిద్దమయ్యారు. ఈ భారీ భవనాలు, టవర్స్ కోసం రూ. 4688.82 కోట్లు ఖర్చు చేస్తూ, ఇప్పటికే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. సచివాలయంలో ఎక్కువలో ఎక్కువ మూడు వేల మంది పనిచేస్తుంటారు. వారి కోసం ఇన్ని లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు అవసరమా? రాజధాని నిర్మాణం ముసుగులో సీఎం చంద్రబాబు చేస్తున్న దందా ఇది అని అర్థమవుతోంది.ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రం నిధులు లేవా?ఈ రాష్ట్రంలో పేద విద్యార్ధులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎంగా వైఎస్ జగన్ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. వాటిని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు లేవంటూ, వాటిని ప్రైవేటు వారికి అప్పగించేందుకు ఈ కూటమి ప్రభుత్వం తెగబడింది. ఒకవైపు రాజధాని ప్రాంతంలో విలాసవంతమైన భవనాలను వందల కోట్లతో అప్పులు చేసి మరీ నిర్మిస్తున్న ఈ ప్రభుత్వానికి, పేదలకు ఉపయోగపడే వైద్య కళాశాలలకు, దానికి అనుబంధంగా నిర్మించాల్సిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మాత్రం కనిపించడం లేదా? వాటికి కేటాయించడానికి మాత్రం సీఎం చంద్రబాబు వద్ద నిధులు లేవా? అలాగే రాజధాని ప్రాంతంలో రైతులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారు.మరోవైపు ప్రభుత్వ వైద్యరంగాన్ని, మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే మొదటిదశలో భూములు ఇచ్చిన రైతులు తమకు ప్లాట్లు ఇవ్వలేదని, కౌలు సొమ్ములు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో రెండోదశ భూసేకరణ కోసం ప్రభుత్వం సిద్దమవ్వడం, భారీ అంచనాలతో నిర్మాణాలకు సిద్దమవ్వడం వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటీ? ఒకవైపు రైతులు రాజధానిలో తమకు ప్లాట్లు ఇవ్వలేదని ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు భారీ వ్యయాలతో, విలాసవంతమైన నిర్మాణాలు చేపడతామనే ముసుగులో భారీగా కమీషన్లు దండుకుంటున్నారు. -
అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్ వీడియోతో మళ్లీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్సార్సీపీపై బురదజల్లాలని ప్రయత్నించి బుక్కైంది. జోగి రమేష్‌ను ఇరికించేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది.నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్‌రావు పోలీసుల అదుపులో ఉండగా.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను ఎల్లోమీడియా ద్వారా టీడీపీ బయటకు వదిలింది. అరెస్టయినప్పుడు ఉన్న దుస్తులతోనే బలవంతంగా జనార్ధన్రావుతో వీడియో రికార్డింగ్ చేయించింది. ఆపై జనార్ధన్రావుతో జోగి రమేష్ పేరు చెప్పించింది.జోగి రమేష్ చెబితేనే చేశానంటూ బలవంతపు స్టేట్మెంట్ ఇప్పిచ్చింది. అయితే,పోలీసుల అదుపులో ఉన్న జనార్ధన్ వీడియో రికార్డ్ ఎవరు చేశారనే దానిపై అనుమానాలు వ్యక్తం కాగా.. దారి తప్పిన కల్తీ మద్యం కేసు విచారణకు నిదర్శనంగా జనార్ధన్ వీడియో నిలిచింది. నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ నేతలను కాపాడేందుకు ప్రభుత్వం బరితెగించింది.. నకిలీ మద్యం కేసులో కొత్త డ్రామాకు తెరతీయడం చర్చకు దారితీస్తోంది.నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధరావు అరెస్టు అనంతరం, పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు జోగి రమేష్ పేరు ప్రస్తావించలేదు. కావాలని ఇరికించేందుకు కూటమి సర్కార్ కొత్త కథలు అల్లుతోంది. అందుకు నిదర్శనంగా జనార్ధన్‌రావు దగ్గర ఫోన్ లేనప్పుడు వీడియో ఎవరు రికార్డ్ చేశారు? రిమాండ్ రిపోర్ట్‌లో ఎందుకు ఈ వీడియోను ప్రస్తావించలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. -
కాంగ్రెస్‌లోకి మాజీ ఐఏఎస్ అధికారి
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగింపును నిరసిస్తూ ఆరేళ్ల క్రితం తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన కన్నన్ గోపీనాథన్.. తాజాగా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ & కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన కేంద్ర నిర్ణయానికి నిరసనగా, ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఐఏఎస్ గోపీనాథన్.ఢిల్లీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా సమక్షంలో గోపీనాథన్.. సోమవారం(అక్టోబర్ 13వ తేదీ) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనిలో భాగంగా గోపీనాథన్ మాట్లాడుతూ.. దేశం సరైన దిశలో పోవాలంటే కాంగ్రెస్ పార్టీనే సరైన మార్గమని నమ్మే ఇందులో జాయిన్ అయినట్లు పేర్కొన్నారు.అందుకే రాజీనామా చేశా..‘2019లో నేను నా పదవికి రాజీనామా చేశా. ఆ సమయంలో ప్రభుత్వం సరైన మార్గంలో పయనించలేదు,. అదే నాకు అర్థమైంది. వారు చేసిన దానిని నిరసిస్తూ నా పదవికి రాజీనామా చేశా. నేను దేశ వ్యాప్తంగా 80 నుంచి 90 జిల్లాలు తిరిగాను. ప్రజలతో మాట్లాడాను. అదే సమయంలో చాలా మంది పార్టీ నేతల్ని కూడా కలిశాను. నాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే దేశాన్ని సరైన దిశలో నడిపిస్తుందనే విషయం నాకు అర్థమైంది. అందుచేతే కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యా’ అని ఆయన పేర్కొన్నారు.ధైర్యశాలి.. గోపీనాథన్కాంగ్రెస్లో చేరిన గోపీనాథన్పై వేణుగోపాల్ ప్రశంసలు కురిపించారు. అత్యంత సాహసోపేతమైన అధికారుల్లో గోపీనాథన్ ఒకరని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉన్నారని, సామాజిక న్యాయం కోసం, ఐక్యత కోసం పాటుబడుతున్న వ్యక్తి గోపీనాథన్ అని ప్రశంసించారు.కాగా, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గోపీనాథన్. ఆయన 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ -కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన కేంద్ర నిర్ణయానికి నిరసనగా గోపీనాథన్ తన ఉన్నత పదవిని వదులుకున్నారు. కరోనా సమయంలో తిరిగి పదవిలో చేరమని చెప్పినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాజీనామాను ఆమోదించలేదని చెప్పినా ఇక తిరిగి పదవిలో జాయిన్ అయ్యేది లేదని తెగేసి చెప్పారు. ఇదీ చదవండి: సినిమాలే ముఖ్యం.. రాజీనామాకు సిద్ధం: సురేష్ గోపీ -
‘కొల్లు కాదు.. సొల్లు రవీంద్ర.. టీడీపీ కార్యకర్తలే నిన్ను తంతారు’
సాక్షి, కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) సెటైరికల్ కామెంట్స్ చేశారు. మంత్రి రవీంద్ర(Kollu Ravindra) ఇంటి పేరు కొల్లు కాకుండా సొల్లు అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ(TDP) కార్యకర్తలు తాళ్లతో కట్టేశాడని ఆయన అనుకుంటున్నాడు.. గన్మెన్లు లేకపోతే కార్యకర్తలే తిరగబడి దాడి చేస్తారని అన్నారు. కల్తీ మద్యం కారణంగా కుటుంబాలు రగిలిపోతున్నాయని చెప్పుకొచ్చారు.కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్తీ మద్యం కారణంగా అమాయక ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘సారా మంత్రి అంటాడు.. మేము నాణ్యమైన మందు అమ్ముతున్నాం. దాని కోసం ఒక యాప్ కూడా తీసుకొచ్చామని చెబుతాడు. కొన్న వెంటనే స్కాన్ చేసి పరిశీలించుకోండి అని అంటున్నాడు. ఆ సమయంలో పేదవారు, టచ్ ఫోన్ లేని వారి పరిస్థితి ఏంటి?. కల్తీ మద్యం తాగే వారికి కూడా కుటుంబం ఉంటుంది. మద్యం తాగకూడదు అని చెప్పాలి. ఒక వేళ మద్యం తాగకుండా ఉండలేకపోతే నాణ్యమైన మద్యం అయినా ఇవ్వాలి.రాష్ట్రంలో మంచి నీటికైనా కరువు వచ్చిందోమో కానీ మద్యానికి మాత్రం కరువు రాలేదు. ప్రతి గల్లీలో ఎటుచూసినా, ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలే కనిపిస్తున్నాయి. దయచేసి కల్తీ మందు జోలికి వెళ్లొద్దు. మద్యాన్ని నిమంత్రించకుండా విచ్చలవిడిగా మద్యాన్ని అందిస్తున్న ఈ సారా మంత్రిని బర్తరఫ్ చేయాలి. మంత్రి రవీంద్ర ఇంటి పేరు కొల్లు కాకుండా సొల్లు అని మార్చుకోవాలి. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేశావు కాబట్టి ఆగారు అని నువ్వు అనుకుంటున్నావు. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేసి ఒక కత్తి ఇచ్చి చూడు.. నువ్వు కట్టిన తాళ్లను పరాపరా తెంపేసి వాళ్ళు నిన్ను తిరగబడి తన్నకపోతే చూడు. నీ గన్మెన్లు ఉన్నా నిన్ను టీడీపీ కార్యకర్తలు నిన్ను కొట్టకపోతే నన్ను అడుగు. కడుపు రగిలిపోయి సచ్చిపోతున్నారు.. అల్లాడి ఏడుస్తున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
మరో ట్విస్ట్.. వినుత కోటా సెల్ఫీ వీడియో
సాక్షి, చెన్నై: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా(Vinutha Kotaa) అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(bojjala sudheer reddy) తన ద్వారా వినుత.. ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చరచకు దారి తీసింది. ఈ క్రమంలో.. వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారామె. ఆ వీడియోలో సారాంశం ఇలా.. ‘‘మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిలు ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బయలు వచ్చింది. విదేశాల్లో రూ లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. .. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు శివయ్యకు తెలుసు. ధైర్యంగా పోరాడుతాం.ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్ తో బయటకు వస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే.. మీడియా ముందుకు రాలేక పోతున్నాను. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్ అని అన్నారామె. మొన్నీమధ్యే కొట్టే సాయిప్రసాద్‌కు శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా పదవి లభించింది. దీనిపై వినుత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Jana Sena Chief pawan Kalyan)కు ఆమె లేఖ రాశారు. ఈలోపు.. రాయుడి వీడియో కలకలం రేపింది.ఇదిలా ఉంటే.. వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలుగానీ, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ వీడియోపై బొజ్జల నుంచి స్పందన రావాల్సి ఉంది. ఈ ఏడాది జులై 7న కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు.. రాయుడిని హత్యచేసి మర్నాడు చెన్నై కూవం నదిలో పడేశారని కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నిందితులు చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: పవన్ కొత్త పాట.. ఏకిపారేస్తున్న నెటిజన్స్ -
బీజేపీ అభ్యర్థిపై రామచందర్ రావు కీలక ప్రకటన.. హస్తంతో పతంగి ఎగరేస్తారా?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills Election) బీజేపీ అభ్యర్థి ప్రకటన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP Party) అభ్యర్థి ప్రకటన ఈరోజు సాయంత్రం కానీ.. రేపు(మంగళవారం) ఉండే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ గెలవాలని వారి అభ్యర్థిని కాంగ్రెస్‌లోకి పంపించి పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ(Telangana BJP) బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ గుర్తు పైన పోటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో హస్తంతోనే పతంగి ఎగిరేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎంఐఎం పార్టీ గెలవాలని.. వారి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి పంపి పోటీ చేయిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. జూబ్లీహిల్స్‌లో ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదు. విశ్వ నగరం కాదు.. విషాద నగరంగా మార్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు ఓటు వేసినా ఫలితం లేదు. అక్కడ బీఆర్ఎస్ గెలిచినా.. మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్తారు. తెలంగాణలో బీజేపీనే అసలైన ప్రతిపక్షం. ప్రజాసమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుంది. ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయం అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత -
కాంగ్రెస్‌లోకి ఎర్ర శేఖర్.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్(Erra Shekar) కాంగ్రెస్‌లో(Telangana Congress) చేరికపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని తనకు లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.జడ్చర్ల(Jedcherla MLA) ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు. ఇలాంటి వారి కోసం జడ్ కేటగిరి సెక్యూరిటీ అడగాలా?. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని నాకు లేదు. సంచులు తీసుకెళ్లేవారికి పార్టీలో చోటులేదు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లో చేరడానికి వీలులేదు. మోసం చేసి పోయినవారికి మళ్లీ ఎంట్రీలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు(Jubilee Hills By Elections ) సంబంధించి సోమవారం ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. నామినేషన్ల స్వీకరణకు అంతా సిద్ధం.. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆర్వో కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై ఆర్వో, ఏఆర్ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈఎస్ఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు. -
బాలయ్య ఇంటి ఎదుట బలవన్మరణ యత్నం
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna) నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. బాలాంపల్లి గ్రామానికి చెందిన బాలాచారి అనే రైతు(Farmer Balachari).. బాలకృష్ణ ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన భూమిని ఏపీఐఐసీ తీసుకుంటోందని వాపోతూ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోబోయాడు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. బాలాచారిని మీడియా కంట పడకుండా హిందూపురం వన్‌టౌన్ పీఎస్‌కు తరలించారు. అక్కడే ఉన్న కొందరు సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇదిలా ఉంటే.. నియోజకవర్గ పర్యటనలో బాలయ్యకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఆదివారం చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో ఆయన పర్యటించగా.. మహిళలు చుట్టుముట్టి సమస్యలపై నిలదీశారు. ఈ పరిణామంతో తనదైన శైలిలో ఏదో మాట్లాడుతూ.. ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఆయనతో చర్చించి స్పష్టమైన హామీ ఇప్పిస్తామని చెబుతూ నిష్క్రమించారు.ఇదీ చదవండి: వినూత వీడియోలిస్తే.. బొజ్జల బాగోతం బయటికి?? -
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84)(Konda Lakshma Reddy Passed Away) తుదిశ్వాస విడిచారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో అనారోగ్యంతో హైదర్‌గూడ(hyderguda) అపోలోని(Apollo Hospitals) ఆస్పత్రిలో ఆయన మృతి చెందారు. మహా ప్రస్థానంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జర్నలిజం పట్ల మక్కువతో ఆయన 1980లో స్థానిక వార్తా సంస్థ NSSను ప్రారంభించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడు. తన రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో సహా వివిధ పదవులను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. 1999, 2014లో హైదరాబాద్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది కూడా చదవండి: బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు.. -
సినిమాలే ముఖ్యం.. రాజీనామాకు రెడీ: కేంద్ర మంత్రి సురేష్ గోపి
మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి(Suresh Gopi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాల కోసం తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు తన స్థానంలో రాజ్యసభ సభ్యుడు సీ సదానందన్ మాస్టర్‌ను కేంద్ర మంత్రిని చేయాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారాయన. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సురేష్ గోపి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను వదిలేసి మంత్రిని కావాలని ఏనాడూ నేను కోరుకోలేదు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత నటించలేకపోతున్నా. తద్వారా నా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. నా పిల్లలు ఇంకా స్థిరపడలేదు. నాకు ఆదాయం అవసరం. అందుకే నటన కొనసాగించాలి అనుకుంటున్నా. నేను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మనస్ఫూర్తిగా చెబుతున్నా.. నన్ను మంత్రి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో సదానందన్ మాస్టర్(Sadanandan Master)ను కేంద్ర మంత్రిని చేయండి. ఇది కచ్చితంగా కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం అవుతుంది అని సురేష్ గోపి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సదానందన్ పక్కనే ఉన్నారు.మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 200 చిత్రాల్లో నటించారు సురేష్ గోపి. ప్రత్యేకించి 90వ దశకంలో యాక్షన్ చిత్రాల హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు. డబ్ చిత్రాలతో తెలుగులోనూ ఆయన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2016లో బీజేపీలో చేరిన సురేష్ గోపి.. తొలుత రాజ్యసభ సభ్యుడిగా, ఆపై 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి నెగ్గారు. కేరళ చరిత్రలో బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తి ఈయనే. అందుకే ఆయనకు కేంద్ర పెట్రోలియం.. ప్రకృతి వాయువు, పర్యాటక శాఖల సహాయ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ఈ మధ్యకాలంతో తరచూ పలు వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.ఇదిలా ఉంటే.. సదానందన్ ఇటీవలె రాజ్యసభకు ఎన్నికయ్యారు. కన్నూరు జిల్లాకు చెందిన సదానందన్.. 1994లో సీపీఎం కార్యకర్తల దాడిలో రెండు కాళ్లను పొగొట్టుకున్నారు. -
బీహార్‌లో పొలిటికల్ ట్విస్ట్.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో, ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఎమ్మెల్యేలు నవాడా ఎమ్మెల్యే విభాదేవి, రజౌలి ఎమ్మెల్యే ప్రకాశ్ వీర్ ఆదివారం స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్‌ను కలిసి రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. విభా దేవి భర్త, మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ పోక్సో కేసులో కొన్నేళ్లుగా జైలులో ఉండి, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబంలోని వారికి టిక్కెట్ ఇవ్వలేదని ఆర్జేడీపై ఈయన ఆగ్రహంతో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్ వీర్ మరోసారి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. బీహార్‌లో సీట్ల సర్దుబాటు పరిష్కారమైంది. బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల నుంచి పోటీచేయాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీ(యూ)తోపాటు బీజేపీ సైతం చెరో 101 సీట్ల నుంచి బరిలో దిగనుంది. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి(రామ్ విలాస్) పార్టీ 29 స్థానాల నుంచి పోటీ చేయనుంది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(సెక్యూలర్), ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాలు చెరో ఆరు స్థానాల నుంచి పోటీచేయనున్నాయి. 243 నియోజకవర్గాలున్న బీహార్‌లో పాలక ఎన్డీఏ కూటమిలో ఎవరే స్థానం నుంచి పోటీచేయాలన్న దానిపై కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. -
ఉచితాలపై పవన్, నాదెండ్ల కొత్త పాట.. ఏకిపారేసిన నెటిజన్లు
సాక్షి, అమరావతి: ‘యువత ఉచితాలను అడగడం లేదు. సంక్షేమ పథకాలను కోరుకోవడం లేదు.’ అని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. తిత్లీ తుపాను సమయంలో 2018 అక్టోబర్ 12వ తేదీన పవన్ కళ్యాణ్‌తో కలిసి తాను శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విషయాలను గుర్తు చేసుకుంటూ జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ‘ఎక్స్’లో ఒక పోస్టు పెట్టారు.ఈ క్రమంలో దానికి కొందరు యువతతో కూర్చుని మాట్లాడుతున్న ఫొటోను జత చేశారు. ఆ పోస్టును ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఆ పర్యటనలో మేం అక్కడివారితో జరిపిన సంభాషణ నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. వారు ఉచితాలను అడగలేదు. వారు ఎటువంటి సంక్షేమ పథకాలనూ అడగలేదు. కానీ, వారు మాకు 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వండి.. ఉచితాలను కాదని గట్టిగా చెప్పారు. మన యువత నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. వారి కలలను నెరవేర్చడం కోసం వారిని అర్థం చేసుకోవడానికి నేను యువతను కలుస్తూనే ఉంటాను’ అని పవన్‌కళ్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.I remember quite vividly about the conversation we had with them. They were not asking for freebies, they were not asking for any welfare schemes but they have said firmly ‘ give us 25 years of future not freebies.’ We need to tap the true potential of our youth. I will keep… https://t.co/8bWCtI1ryL— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2025నెటిజన్ల ప్రశ్నలు..పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’లో పెట్టిన పోస్టుపై పలువురు ప్రతిస్పందించారు. ‘యువత ఉచిత, సంక్షేమ పథకాలు కోరుకోకపోతే గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు? ప్రతి సంవత్సరం రూ.1.2లక్షల కోట్లు ఖర్చయ్యే సంక్షేమ, ఉచిత పథకాలను అమలు చేస్తామని ఎందుకు ప్రచారం చేశారు..? అంటూ పలువురు పవన్‌కళ్యాణ్ పోస్టుపై స్పందిస్తూ రీ పోస్టులు పెట్టారు. ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్ యువతకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది చొప్పున యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నిస్తూ కొందరు పోస్టు చేశారు. మరోవైపు ఎన్నికల ముందు టీడీపీ–జనసేన కూటమిని గెలిపిస్తే నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని, వాటి కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, పది రూపాయలను అదనంగా ఇస్తామని చెప్పారు.ఈ విషయం పదే పదే ప్రజలకు చెప్పాలని జనసేన కార్యాలయంలో 2024 ఫిబ్రవరిలో సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. టీడీపీ నాయకత్వంతో మాట్లాడి డ్వాక్రా రుణాలను ఎలా మాఫీ చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తామని, పెద్దపెద్ద కంపెనీలు బ్యాంకులను మోసం చేస్తే ఉదారంగా వదిలేస్తున్నారని పవన్‌కళ్యాణ్ చెప్పారు. ఇలాంటి హామీలన్నింటినీ ప్రశ్నిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Mari nuvvu untunna nee government lo freebies ni Enduku Prothsahistunnav? Schemes teseyochu ga,free education and free medical ivvandi chalu,civil cases nyayam ga undetattu cheyandi,drinking water ivvandi,nityavasaralu tagginchandi,land rates tagginchandi chaalu ivi cheyandi.— Dr.High Voltage (@it_RAR4all) October 12, 2025 -
బాలకృష్ణకు బిగ్ షాక్.. చుట్టుముట్టిన హిందూపురం మహిళలు
సాక్షి, చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం(hindupur) టీడీపీ(TDP) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు(nandamuri Balakrishna) నిరసన సెగ తగిలింది. ఆదివారం ఆయన చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో పర్యటించగా.. బాలకృష్ణను స్థానిక మహిళలు చుట్టుముట్టారు. తమ సమస్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రజలు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక.. ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు.. తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కొందరు, పింఛన్ రాలేదని మరికొందరు నిలదీశారు. బాడుగ ఇంట్లో ఉంటున్నాం. మాకు ఇంటి స్థలం ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు. వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయిన బాలకృష్ణ.. ‘ఇస్తాం’ అంటూ మాట దాటవేశారు. మహిళలు అడిగిన వాటిపై సరిగా స్పందించని బాలకృష్ణ.. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు అంటూ పథకాలను ప్రస్తావించారు. అవేవీ వినిపించుకోని మహిళలు మళ్లీ మళ్లీ అడగడంతో ఏదైనా జరుగుతుందేమోనని ఆలోచించిన టీడీపీ నేతలు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తాము చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని వారు చెప్పినా మహిళలు వినకపోవడంతో చివరకు బాలకృష్ణ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఇది కూడా చదవండి: కోటా వినుత డ్రైవర్ హత్య కేసులో మరో ట్విస్ట్.. -
‘ ఆ కార్యక్రమంలో నా గురించి మాట్లాడటం బాధాకరం’
ధర్మపురి(జగిత్యాల జిల్లా): నిజామాబాద్‌లో మాల సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి తన సహచర మంత్రి వివేక్ మాట్లాడటం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సాక్షి టీవీతో మాట్లాడారు అడ్లూరి. ‘లక్ష్మణ్ కుమార్ తండ్రి జయంతి కార్యక్రమాల్లో పేరు పెట్టకపోతే ప్రశ్నిస్తున్నాడు... ఇతర ఇన్విటేషన్స్ లో పేరు లేకపోతే ఎందుకు ప్రశ్నించడని వివేక్ మాట్లాడటం బాధాకరం. నేను ఆ విషయమే అసలెక్కడా మాట్లాడలేదు. వెంకటస్వామి జన్మదిన వేడుకలను నా ధర్మపురి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిపాకే నేను హైదరాబాద్ వెళ్లాను.నాకు ఆ అభిమానం ఉంది. నా మైనార్టీ శాఖ కార్యక్రమానికి వారే వచ్చి వస్తడా, రాడా వెళ్లిపొమ్మంటరా అంటూ మాట్లాడటం ఎంతవరకు సబబు..?, తోటి సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను ఓ జంతువుతో పోలుస్తూ మాట్లాడితే కనీసం సహచర దళిత మంత్రిగా ఖండించకపోవడాన్నే నేను ప్రశ్నించా. తెల్లారే వ్యక్తిగతంగా ఫోన్ కాల్ అయినా చేస్తాడని భావించా. ఇవాళ మళ్లీ నిజామాబాద్‌కు వెళ్లి వ్యక్తిగతంగా నా పేరు తీసి మాట్లాడటం ఇక వివేక్ విజ్ఞతకే వదిలేస్తున్నా. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ఉండి ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాలి తప్ప ఈ విధంగా కామెంట్స్ చేయడం బాధాకరం. నేను కాంగ్రెస్ వ్యక్తిని, వ్యక్తిగత విభేదాలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేను కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నా. కాంగ్రెస్‌లో పెద్దలు ఆశీస్సులతో ఇంత వరకూ వచ్చా’ అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. -
Bihar: కుదిరిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సీట్ల సర్దుబాటు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. బీహార్ సీట్ల ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వె ల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా సీట్ల సర్దుబాటు జరిగిన విషయాన్ని స్పష్టం చేశారు.సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి 101 సీట్లు, తమకు(బీజేపీ) 101 సీట్ల సర్దుబాటు జరిగిందన్నారు. చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఒప్పందం కుదిరిందనే విషయాన్ని స్పష్టం చేశారు.हम एनडीए के साथियों ने सौहार्दपूर्ण वातावरण में सीटों का वितरण पूर्ण किया।BJP – 101JDU – 101LJP (R) – 29RLM – 06HAM – 06एनडीए के सभी दलों के कार्यकर्ता और नेता इसका हर्षपूर्वक स्वागत करते हैं।बिहार है तैयार,फिर से एनडीए सरकार।#NDA4Bihar ✌️— Dharmendra Pradhan (@dpradhanbjp) October 12, 2025 జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లుభారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లుహిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం): 6 సీట్లురాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం): 6 సీట్లు కాగా, బీహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.ఇదీ చదవండి:బీహార్‌లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ! -
కోటా వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన ట్విస్ట్
సాక్షి,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోటా వినుత (Vinutha Kota) డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్య బొజ్జల సుధీర్‌రెడ్డి స్కెచ్ వేసినట్లు ఆలస్యంగా కోట వినుత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటకు వచ్చింది. ఆ వీడియోలో బొజ్జల సుధీర్‌రెడ్డి (Bojjala Sudhir Reddy).. కోట వినూత దంపతులను హత్య చేసేందుకు రెండు సార్లు ఏ విధంగా కుట్ర చేశారు. ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కోట వినూత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం, కోట వినుత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు. ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల సుధీర్‌రెడ్డి తనని బెదిరించి, భయపెట్టినట్లు ఆ వీడియోలో చెప్పాడు. 👉ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్‌కు అంతా తెలుసుఆ వీడియోలో కోట వినూత,ఆమె భర్త చంద్రబాబు హత్యకు బొజ్జల ప్రయత్నించినట్లు తెలిపాడు. ఇందుకోసం కోట వినూత డ్రైవర్ రాయుడిని (Kota Vinutha Driver Rayudu ) పావుగా వినియోగించుకున్నాడు.కోట వినూత ప్రైవేట్ వీడియోలు తీయాలని డ్రైవర్ రాయుడికి బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.30లక్షలు ఆఫర్ చేశాడు. ముందుగా కోట వినూత, చంద్రబాబుల సమాచారం ఇవ్వాలని డ్రైవర్ రాయుడికి రూ.20లక్షలు ఇచ్చాడు. ఈ క్రమంలో బొజ్జల సుధీర్ చెప్పినట్లుగా డ్రైవర్ రాయుడు కోట వినూత బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి దొరికిపోయాడు. ఈ వరుస పరిణామాలల నేపథ్యంలో జులై 7న డ్రైవర్ రాయుడును కోట వినూత, చంద్రబాబు హత్య చేశారు. జులై 10వ తేదీన కూవం నది కాలువులో తేలిన డ్రైవర్ రాయుడు శవంజులై 10వ తేదీ చెన్నై కూవం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నివేదికలో హత్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినుత, జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో.. లోతుగా దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం డ్రైవర్ రాయుడిదని నిర్ధారించారు. ఆ దిశగా పోలీసులు చేపట్టిన విచారణలో అప్పటి శ్రీకాళహస్తి(తిరుపతి) జనసేన ఇన్చార్జ్ వినుత దంపతులు జులై 8వ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు తేల్చారు. అనంతరం కోట వినుత దంపతులతో పాటు మరో ముగ్గురు వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు. జనసేన తరఫున చాలా యాక్టీవ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినుత దంపతులు హత్య కేసులో అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. అయితే.. అరెస్ట్ తర్వాత మీడియా ముందు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినుత అనగా.. చంద్రబాబు కల్పించుకుని బొజ్జల సుధీర్ రెడ్డి (టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే) ఉన్నాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. తాజాగా హత్యకు ముందు వెలుగులోకి వచ్చిన కోట వినూత డ్రైవర్ రాయుడు తీసుకున్న సంచలన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కోట వినూత దంపతుల హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రయత్నించారంటూ డ్రైవర్ రాయుడు చెప్పడం కూటమి నేతల్లో కలకలం రేపుతోంది. -
‘రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం.. ఈటల, సంజయ్ ఎక్కడ దాక్కున్నారు?’
సాక్షి, హైదరాబాద్: యూపీఏ హయంలో చారిత్రాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పుకొచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. బీజేపీ.. బీసీ వ్యతిరేక పార్టీ.. బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘రేపు ఢిల్లీకి వెళ్తాం. సుప్రీంకోర్టు తలుపు తడుతాం. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు మేం భయపడం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై మా చిత్తశుద్ధి ప్రజలకు తెలుసు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై వెనక్కి తగ్గేది లేదు. బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగులో ఉన్నాయి. ప్రధాని దగ్గరికి వెళ్ళి బీజేపీ నాయకులు ఎందుకు అడగడం లేదు?. బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిస్తే మద్దతు ఇస్తాం. బీసీ సంఘాలు ధర్నా చేసినప్పుడు ఈటల, సంజయ్ ఎక్కడ దాక్కున్నారు?. బీజేపీ నరనరాన బీసీ వ్యతిరేక పార్టీ. బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది అంటూ విమర్శలు చేశారు. అలాగే,ఆర్టీఐపై కీలక వ్యాఖ్యలు..నేటితో RTI చట్టం అమలులోకి వచ్చి 20 ఏళ్ళు అయిన సందర్భంగా స్పందిస్తూ.. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ దూరదృష్టి నాయకత్వంలో చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం (RTI) 2005 అక్టోబర్ 12న అమలులోకి వచ్చింది. దేశ చరిత్రలో RTI చారిత్రాత్మక నిర్ణయం. ప్రజలకి వాస్తవాలను తెలుసుకోవడానికి మహత్తర అవకాశం RTI ద్వారా కల్పించారు. ప్రజలకు RTI జీవన రేఖగా మారింది. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చి పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకొచ్చింది. 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం RTIకి తూట్లు పొడుస్తోంది.2019 సవరణలతో సమాచారం కమిషన్ల స్వతంత్రతను బలహీనపరిచాయి. కమిషనర్ల పదవీకాలం (5 సంవత్సరాలు), సేవా షరతులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా మార్పులు జరిగాయి. స్వయం ప్రతిపత్తితో నిర్వహించే RTI కమిషనర్లు కేంద్రం ఒత్తిడిలకు తల్లోగే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర సమాచారం కమిషన్ ప్రస్తుతం 11 పోస్టులకు బదులుగా కేవలం ఇద్దరు కమిషనర్లతోనే పనిచేస్తోంది. 2025 సెప్టెంబర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉంటుంది. ఇంతకంటే దుర్మార్గం లేదు. కేంద్రంలోని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేసే వ్యక్తులు రక్షణ లేకుండా దాడులు, వేధింపులకు గురవుతున్నారు. 2019 సవరణలను రద్దు చేసి కమిషన్ల స్వతంత్రతను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర కమిషన్లలో ఖాళీలను తక్షణమే పారదర్శకంగా భర్తీ చేయాలి. కమిషన్ల పనితీరుపై నిర్దిష్ట ప్రమాణాలు, ప్రజా నివేదికలు తప్పనిసరి చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
‘మోదీకి విజ్ఞప్తి.. NDA అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడమే’
సాక్షి, నగరి: ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను సీబీఐ బయటకు తీయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja). ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడమే(NDA) అంటూ ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం(AP Liquor Case) మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు(CM Chandrababu) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఆడవారి పుట్టుకనే చంద్రబాబు అపహాస్యం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజలకు మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ జగన్ కాపాడారు. ఏపీలో 43వేల బెల్ట్ షాపులు తొలగించారు. మద్యం దుకాణాలను మూసేశారు. కానీ, టీడీపీ నాయకుల మాత్రం డెకాయిట్లు, బందిపోట్ల కన్నా ఎక్కువగా ప్రజలను దోచుకుంటున్నారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం. ఎన్డీయే అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కల్తీ మద్యం తయారు చేసేది ఎవరు? దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ రూము ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు?.సాక్ష్యాలతో దొరికిన పచ్చ బ్యాచ్..దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పైనుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు. ఈరోజు సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. ఏ జిల్లాలో చూసినా మన మొలకలచెరువు నుంచి చంద్రబాబు ఇంటి వరకు ప్రభుత్వ సపోర్ట్ లేకుండా కట్టే పరిస్థితి కాదు. ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెడిపేస్తూ వాళ్ళ మంగళ సూత్రాలను మట్టిలో తొక్కేస్తూ సిగ్గులేకుండా మళ్ళీ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.మహిళా ద్రోహి చంద్రబాబు.. చంద్రబాబు మొదటి నుంచి మహిళా ద్రోహి. మహిళలు అంటే గౌరవం లేదు. ఆడదాని పుట్టుకనే అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. మరి ఆడవాళ్ళ మానప్రాణాలకు ఏం విలువ ఇస్తారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వీటివల్ల మహిళల మాన, ప్రాణాలకి హాని కలుగుతుంది. ఏపీలో 16 నెలల్లో ఎంతమంది చిన్న పిల్లల్ని, ఎంతమంది ఆడవాళ్లపై లైంగిక దాడులు జరిగాయి. ఎంత మందిని హత్య చేశారు. కొంత మంది మహిళలు అదృశ్యం కాగా.. ఇప్పటివరకు కూడా దొరకలేదు’ అని విమర్శలు చేశారు.కమీషన్లు, దందాలు బయటకు రావాలి..తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 21% గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ కోవర్టు అయితే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు.. ఎందుకిచ్చారు?. నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మైన్స్, వైన్స్‌లో మంత్రి కొల్లు రవీంద్ర గ్యాంగ్ రెచ్చిపోతోంది. ప్రధాని మోదీకి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను సీబీఐ బయటకు తీయాలి అని డిమాండ్ చేశారు. తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్సార్సీపీ కోవర్టులు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు. ఈ లిక్కర్ కేసుకి మూలం సురేంద్ర నాయుడు అనే వ్యక్తి.. లోకేష్‌కు ఎంత సన్నిహితులు అనేది అందరూ కూడా గమనించాలి. కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006లో హత్య చేసిన వ్యక్తి. జీవితకాలం శిక్ష ఉంది. చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక క్షమాభిక్ష పెట్టించారు. అతడిని బయటకు తీసుకువచ్చారు. చంద్రబాబు క్రిమినల్స్‌కు ఆశ్రయం ఇచ్చారు అని మండిపడ్డారు. -
Bihar Election: నాడు చారిత్రక ఘట్టాలకు సాక్షి.. నేడు మరో రికార్డుకు బక్సర్ సిద్ధం
బీహార్‌లోని బక్సర్‌కు భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1764లో ‘బాటిల్ ఆఫ్ బక్సర్’లో విజయమే బ్రిటిషర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు బాటలు వేసింది. అప్పటి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు మీర్ జాఫర్ వెన్నుపోటు పొడవడంతో దేశంలో తెల్లదొరల పాలనకు బీజం పడింది. ఇప్పుడు కూడా బీహార్ దంగల్‌లో బక్సర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బక్సర్పై పట్టుకు వివిధ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. దీనిపై ‘సాక్షి వెబ్’ ప్రత్యేక కథనం..బక్సర్ జిల్లాకు మతపరమైన నేపధ్యమే కాకుండా పౌరాణిక, చారిత్రక దృక్కోణాల నుండి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈ భూమి భారత చరిత్రలో పలు నిర్ణయాత్మక మలుపులను చూసింది. భారతదేశం అంతటా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు ఇక్కడే పునాది పడింది. 1764లో జరిగిన చారిత్రాత్మక బక్సర్ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు మార్గం సుగమం చేసింది. 1539లో జరిగిన చౌసా యుద్ధంలో, షేర్ షా సూరి హుమాయున్ను ఓడించి, ఢిల్లీలో అధికారాన్ని స్వాధీనం చేసుకుని, భారత పాలనా విధానాన్ని సమూలంగా మార్చివేశారు. అందుకే బక్సర్.. భారత పాలనను సమూలంగా మార్చిన రెండు యుద్ధాలను చూసిందని చెబుతారు.భారతీయ పురాణాల కోణం నుండి కూడా బక్సర్‌కు ఎంతో ప్రాముఖ్యతను ఉంది. ఈ భూమి శ్రీరాముడు విద్యాభ్యాసం చేసిన ప్రదేశం. వామనుడు జన్మించిన భూమి. మహర్షి విశ్వామిత్రుని తపస్సు చేసిన స్థలం. గంగా నది ఒడ్డున ఉన్న ఈ జిల్లా మత విశ్వాసాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ గంగా మాత ఉత్తరాయణి నది ప్రవహిస్తుంది. ఈ జిల్లాకు తూర్పున భోజ్‌పురి ప్రాంతం, దక్షిణాన రోహ్తాస్, ఉత్తరాన గంగా నది, పశ్చిమాన కైమూర్, కర్మనాస నదుల సరిహద్దులు ఉన్నాయి. ఇక్కడి మతపరమైన ప్రదేశాలలో రామరేఖ ఘాట్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడే శ్రీరాముడు కట్టించిన మొదటి రామేశ్వరనాథ్ ఆలయం ఉంది. శ్రీనాథ్ బాబా ఆలయం, వామనుడి జన్మస్థలం, బాబా బర్మేశ్వర్నాథ్ ఆలయం, నౌలఖా ఆలయం, దుమ్రాలోని బిహారీ ఆలయం ఉన్నాయి.బక్సర్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి బక్సర్, రాజ్పూర్, దుమ్రాన్, బ్రహ్మపూర్. ఈ ప్రాంతాన్ని సాంప్రదాయకంగా బీజేపీకి బలమైన కోటగా పరిగణిస్తారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో ఇక్కడి రాజకీయ సమీకరణాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.బక్సర్: ఈ స్థానాన్ని గత రెండు దఫాల ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సంజయ్ కుమార్ తివారీ ఆక్రమించారు. బీజేపీ ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో గెలవడం ద్వారా ఆయన తన రాజకీయ పట్టును బలోపేతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ రైతు నేత పరశురామ్ చతుర్వేదిని ఓడించారు.రాజ్పూర్ : కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ బీజేపీ నేత విశ్వనాథ్ రామ్..జేడీయూ అభ్యర్థి సంతోష్ కుమార్ నిరాలాను ఓడించి, ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.దుమ్రాన్ : సీపీఐ (ఎంఎల్)కి చెందిన అజిత్ సింగ్ కుష్వాహా జేడీయుకు చెందిన అంజుమ్ అరాను ఓడించి, ఈ అసెంబ్లీ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.బ్రహ్మపూర్ : ఆర్జేడీకి చెందిన శంభు యాదవ్ గత రెండు దఫాల ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎల్జేపీ అభ్యర్థి హులాస్ పాండేను ఓడించారు.బక్సర్‌లో ప్రధాన సమస్యలివే..ఈ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి పలు వినతులున్నాయి. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన సీతా మాత ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ చాలాకాలం నుంచి వినిపిస్తోంది. దీనిని రామాయణ సర్క్యూట్‌తో అనుసంధానించాలని కూడా కోరుతున్నారు. అలాగే డుమ్రాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మలై బ్యారేజ్ ప్రాజెక్టును అమలు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. -
‘సాక్షి’ ఆఫీసు వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై(Sakshi) కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై రెడ్‌బుక్ వికృత చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం.. సాక్షి ఆఫీసుకు పోలీసులను పంపించింది. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన పోలీసులు ఓవరాక్షన్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నకిలీ(AP Liquor Scam) మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా(Yellow Media) సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది. నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సాక్షిని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను(AP Police) రంగంలోకి దింపింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది.ఇది కూడా చదవండి: నకిలీ మద్యం కేసులో మరో బిగ్ ట్విస్ట్..దీంతో, ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు.. ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆఫీసు వద్ద పోలీసులు హల్చల్ చేశారు. కేసుకు సంబంధించి నోటీసులు తీసుకోవాలంటూ సాక్షి సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. జర్నలిస్టులను, సాక్షి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలకు దిగారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు సాక్షి కార్యాలయంపైకి పోలీసులను పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడిని జర్నలిస్టులు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బీసీ రిజర్వేషన్లతో పార్టీల ‘రాజకీయం’!
గాల్లో కత్తులు దూయడం... శూన్యంలో యుద్ధాలు చేయడం రాజకీయ పార్టీలు, నేతలకు అలవాటైన విద్యే. తెలంగాణ స్థానిక ఎన్నికల వ్యవహారం ఇప్పుడు దీన్నే నిరూపిస్తోంది. అన్ని పార్టీలకూ తుది పరిణామం ఏమిటన్నది స్పష్టంగా తెలిసినా అందరూ ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తూంటారు. ప్రత్యర్థులపై పైచేయికి వ్యూహాలు పన్నుతూంటారు. నిర్దిష్ట గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్వహణపై చిత్తశుద్ధి ఉంటే ఉండవచ్చు కానీ ఎన్నికల్లో అధిపత్యానికి బీసీ రిజర్వేషన్లను 42 శాతం చేయాలని సంకల్పించారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ చేశారు. కులగణన చేపట్టి రాష్ట్రంలో బీసీలు 56 శాతమని తేల్చారు కూడా. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం 42 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. జనాభాను బట్టి రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. స్థానిక సంస్థలలోనే కాక, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ బీసీలకురిజర్వేషన్లు ఉండాలని కొన్ని రాష్ట్రాల శాసన సభలు తీర్మానాలు కూడా చేశాయి. కాని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఏభై శాతానికి మించే వీలు లేదు. అయినా తాము అనుకున్న రిజర్వేషన్ల శాతంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టింది. ఎవరైనా కోర్టుకు వెళితే అది ఆగిపోతుందని అంతా అనుకున్నదే. అయినా ఎవరికి వారు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఇస్తూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గడిపారు. అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. కాని రాష్ట్ర గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు. గవర్నర్ సకాలంలో ఆమోదం తెలపకపోతే ఆ బిల్లు ఓకే అయిపోయినట్లే అని కొంతకాలం క్రితం సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య ఆధారంగా తాము 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి జీవో ఇచ్చింది. అయినా ఎవరికి ఇది అమలు అవుతుందన్న నమ్మకం లేదు. కాని ఎవరూ దీనికి అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వచ్చారు. ఆ జీవోపై హైకోర్టులో ఊహించినట్లే స్టే వచ్చింది. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈలోగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం మరో చిత్రం. తదుపరి హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రకటించింది. ఈ గేమ్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా భాగస్వామి అవడం గమనించదగిన అంశమే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని కమిషన్‌కు తెలియదా? తీర్పు వచ్చాక మళ్లీ రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు కొనసాగించాయి. రిజర్వేషన్ల జీవోను బీజేపీ, బీఆర్ఎస్లే అడ్డుకున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. కాగా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని, దీనిని ప్రజలలో ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కె.చంద్రశేఖరరావు కేడర్‌కు పిలుపు ఇచ్చారు. ఇక బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిందని విమర్శించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ తీరు దురదృష్టకరం అని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీలలో ఏ ఒక్కరికైనా చిత్తశుద్ది ఉందా అన్న ప్రశ్న వస్తే సమాధానం దొరకదు. ఎవరికి వారు అడ్వాంటేజ్ తమకు రావడానికే గేమ్ ఆడారు తప్ప ఇంకొకటి కాదనిపిస్తుంది. ఈ వ్యవహారానికి ముందు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించేవి. రిజర్వేషన్ల అంశంపై మాత్రం అందరూ పోటాపోటీగా 42 శాతానికి మద్దతిస్తున్నట్లు మాట్లాడేవారు. కేసీఆర్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నిస్తే రేవంత్ విమర్శించేవారని, రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం నేరమన్నారని బీఆర్ఎస్ ఇప్పడు గుర్తు చేస్తోంది. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక తనే రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్రానికి అధికారం ఉందన్నట్లుగా బిల్లు ఆమోదింప చేశారు. జీవో కూడా ఇచ్చేశారు. మరి ఇది చెల్లదన్న సంగతి ఆయనకు తెలియదా? అంటే ఏమి చెబుతాం? కులగణనతో చాలా మార్పులు వచ్చేస్తాయని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్ అంటూ దేశంలో పర్యటిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా ఇప్పుడు వ్యవహారం మొదటికి వచ్చినట్లయింది. తమిళనాడులో మాదిరి షెడ్యూల్ 9 లో చేర్చితేనే రిజర్వేషన్ లకు చట్టబద్దత వస్తుందని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ బీహారు ఎన్నికలలో ప్రయోజనం కోసం ఈ డ్రామా ఆడిందని మాజీ స్పీకర్, శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. అయితే తమకు ఉన్న చిత్తశుద్దిని రుజువు చేసుకున్నామని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ హైకోర్టులో స్టే రాకపోతే స్థానిక ఎన్నికలు జరిగిపోయేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచిన పార్టీగా పేరు తెచ్చుకునేది. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విధంగా చేశామనిపించుకునేది. గతంలో కేసీఆర్ కూడా ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించి ప్రచారం చేశారు.. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని ఆయనకు కూడా తెలుసు. అయినా కావాలని అప్పట్లో అలా చేశారన్నది నిష్టుర సత్యం. అలాగే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే పంథాలో సాగిందని చెప్పాలి. బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించి, అటు పాము చావకుండా, ఇటు కర్ర విరగకుండా వ్యవహరించింది. కేంద్రం మీదకు నెట్టాలని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం మీద నెపం ఉండేలా బీజేపీ ప్రయత్నం చేశాయి. జాతీయ పార్టీలను తప్పుపట్టి తానే బీసీలకు అనుకూలం అన్న భావన కలిగించాలని బీఆర్ఎస్ యత్నం.వాస్తవానికి ఈ మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాయానిపిస్తుంది. కాకపోతే అమాయక గ్రామీణులు కొందరు నిజంగానే ఎన్నికలు వచ్చేస్తాయనుకుని తమ చేతులు కాల్చుకున్నారట. దసరా నాడు వారికి ఎన్నికల ఖర్చు రూపేణా బాగానే చేతి చమురు వదిలిందట. ఏతావాతా ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పార్టీలు ఒక డ్రామాగా మార్చడం దురదృష్టకరం. తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు రావాలని ఆకాంక్షిస్తున్న బీసీ వర్గాలకు మరోసారి నిరాశే ఎదురైంది.తాజాగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఇందుకు భిన్నంగా తీర్పు వస్తే ఒక చరిత్రే అవుతుంది. ఏమి జరుగుతుందో చూద్దాం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Bihar Elections: ఆ ఐదుగురు ఓటరు లిస్టులో చనిపోయి.. బతికే ఉన్నామంటూ..
పట్నా: బీహార్‌లో నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. ఇంతలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఉదంతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలోని ఒక గ్రామానికి చెందిన ఐదుగురు ఓటర్ల పేర్లు ‘జాబితా’లో చనిపోయినట్లు ప్రకటించారు. అయితే వారంతా బ్లాక్ డెవలప్మెంట్ అధికారి(బీడీవో)ని కలుసుకుని ‘సర్, మేము బతికే ఉన్నాం’ అని పేర్కొంటూ ఒక మెమోరాండం సమర్పించారు.బీహార్ ఎన్నికల మొదటి దశకు కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉన్న తరుణంలో, బంకా జిల్లాలోని ధోరైయా బ్లాక్‌లోని బట్సర్ గ్రామానికి చెందిన ఐదుగురు ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాలో తమను చనిపోయినట్లు చూపడాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. వెంటనే వీరంతా బీడీవో అరవింద్ కుమార్‌ను సంప్రదించి, తాము బతికే ఉన్నామంటూ ఒక మెమోరాండం సమర్పించారు. ముసాయిదా ఓటరు జాబితాలో మోహన్ సా, సంజయ్ యాదవ్, రాంరూప్ యాదవ్,నరేంద్ర కుమార్ దాస్, విశ్వవర ప్రసాద్‌ల పేర్లు ఉన్నాయి.సామాజిక కార్యకర్త ఇంద్రదేవ్ మండల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఐదుగురు ఓటర్లు.. జాబితాలోని లోపం కారణంగా ఓటు హక్కును కోల్పోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బీడీఓ కుమార్ వీరి ఫిర్యాదుపై స్పందిస్తూ తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ఏ ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోరని ఆయన పేర్కొన్నారు. దీనికిముందు చంపారన్‌లోని బాగహి పంచాయతీలోని డుమ్రి గ్రామంలో 15 మంది ఓటర్ల పేర్లు జాబితాలో చనిపోయినట్లు చూపించారు. తరువాత దానిని సరిచేశారు. బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు నవంబర్ ఆరు, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. -
విశాఖలో 70 కోట్ల భూమి.. పిఠాపురం వర్మ కుమారుడి పేరుతో స్వాహా
సాక్షి, తగరపువలస: విశాఖ జిల్లా భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీలో సుమారు రూ.70 కోట్ల విలువైన ఆరు ఎకరాల 69 సెంట్ల భూమిని తమకు తెలియకుండా తప్పుడు పత్రాలతో జీపీ రాయించుకున్నారని ఈ భూమి వారసులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కుమారుడు ఎస్వీఎస్ గిరీష్ ఈ జీపీ చేయించుకున్నారని ఈ భూమి వారసులైన దంతులూరి సుజాత, కలిదిండి నరేంద్రవర్మ, బుద్ధరాజు వరలక్ష్మి శనివారం మీడియాకు తెలిపారు.ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. 13.2, 14.1, 15.1, 15.4, 15.5, 15.6, 15.8, 92.2, 93.1 తమ భూమి సర్వే నెంబర్లని చెప్పారు. అయితే, దంతులూరి రామకృష్ణరాజు కుమారుడు నారాయణరాజు వారసుల్లో ఒకరైన పకీరురాజు, మిగిలిన వారసులకు తెలీకుండా, ఆయనొక్కడే వారసుడినని చెప్పుకుని మోసపూరితంగా పాసు పుస్తకాలు, 1బీ సృష్టించి, 2023 అక్టోబరులో గిరీష్‌కు జీపీ ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తాళ్లవలస టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు డీఏఎన్ రాజు, పూసపాటి గోపాలమూర్తి రాజు సహకరించారని బాధితులు వివరించారు.దొడ్డిదారిన ఎల్పీ, నాలా అనుమతులు.. ఈ మోసాన్ని తాము గుర్తించి భీమిలి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, వీఎంఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు వాపోయారు. రెండేళ్లుగా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా పకీరు ఒక్కడే వారసుడు అనడానికి సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు ఇవ్వలేదన్నారు. ఈ భూములపై జిల్లా కోర్టులో ఓఎస్ 115/2025 కేసు రిజిస్టర్ అయి, ఆర్ఓఆర్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్నప్పటికీ, జీపీ పొందిన టీడీపీనేత గిరీష్ దొడ్డిదారిన ఎల్పీ, నాలా అనుమతులు పొందాడని ఆరోపించారు.ఈనెల 5 నుంచి గిరీష్ తన మనుషులతో వచ్చి వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలు రాత్రింబవళ్లు చేస్తున్నారని తెలిపారు. గిరీష్ అధికార టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు తమకు న్యాయం చేయడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ప్రాణహాని ఉందని, ఇటీవల కారుతో తొక్కించి తమను అంతమొందించేందుకు కూడా యత్నించారని బుద్ధరాజు వరలక్ష్మి, ఆమె భర్త రామకృష్ణ రాజు ఆరోపించారు. తప్పుడు పత్రాలతో జీపీ చేసిన వారిపైనా, చేయించుకున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. -
నకిలీ మద్యం వ్యవహారంలో డైవర్షన్ పాలిటిక్స్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో పీకల వరకు కూరుకుపోయిన టీడీపీ పెద్దలు దానినుంచి బయటపడేందుకు అరెస్టయిన వారు కోవర్ట్‌లు అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో అరెస్టయిన టీడీపీ నేత జయచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీతో లింకులున్నాయని, కోవర్ట్‌గా తమ పారీ్టలో చేరాడంటూ సీఎం చంద్రబాబు అనడం ఆయన దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు.దొరికిన దొంగలకు వైఎస్సార్సీపీ కోవర్ట్ అనే ముద్ర వేసి, తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. నకిలీ మద్యం మరణాలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ యాజమాన్యం, విలేకరులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు ప్రజలకు తెలియకూడదని మీడియా గొంతు నొక్కేందుకు కూడా ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా నకిలీ మద్యం మాఫియా బయటపడిందని, ఇందులో టీడీపీ నాయకుల పాత్ర ఆధారాలతో సహా రుజువైందని చెప్పారు.సీఎం సొంత జిల్లా ములకలచెరువులోనే నకిలీ మద్యం తయారు చేసి అసలు మద్యం మాదిరిగా మార్కెట్లోకి తీసుకువచ్చారన్నారు. ఇంత పెద్ద వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్రధారి దాసరిపల్లె జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుని తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారన్నారు. ఈ నిందితుల్లో జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, జనార్దన్ తదితరులు చంద్రబాబు, లోకేశ్‌కు అత్యంత సన్నిహితులే అన్నారు.ఈనాడు రామోజీరావు కొడుకు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ నకిలీ మద్యం వ్యవహారం నుంచి టీడీపీని ఎలా కాపాడాలా అని మధనపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ‘సాక్షి’ పత్రిక విలేకరులపై, యాజమాన్యంపై రెండు కేసులు పెట్టారన్నారు. ‘సాక్షి’ విలేకరి ఇంట్లోకి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు హంగామా సృష్టించారని, నకిలీ మద్యం తాగి చనిపోయారు అని వార్త రాసినందుకు విలేకరిపై జులుం ప్రదర్శించారని పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్ బరిలో కీర్తిరెడ్డి లేదా దీపక్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో బీజేపీ నుంచి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డి, డాక్టర్ పద్మ, మాధవీలత, ఆలపాటి లక్ష్మీనారాయణ పేర్లతో ఓ జాబితాను రూపొందించింది.శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఢిల్లీలో పార్టీ పెద్దలు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్‌కు ఆ జాబితాను అందచేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ కుల, బల సమీకరణాల ఆధా రంగా అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డిలు పార్టీలో చురుగ్గా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక్కరిని జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం రెండు రోజుల్లో ప్రకటించనుంది. -
‘హరీష్ చెప్పేదాంట్లో వాస్తవాలు లేవు’
హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమర్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పని లేకుండా ఉపయోగించకుండా రికార్డ్ స్థాయిలో పంటలు పండించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు ఉత్తమ్. ఈరోజు(శనివారం, అక్టోబర్ 11వ తేదీ) హనుమకొండలో ప్రెస్‌మీట్ నిర్వహించారు మంత్రులు ఉత్తమ్, సీతక్కలు.దీనిలోభాగంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘ బనకచర్ల విషయంలో హరీష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోదావరి, కృష్ణ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాము. బనకచర్ల ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం. ఆల్మట్టి ఎత్తు పెంచడానికి వ్యతిరేకం. హరీష్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రప్రభుత్వంతో కోట్లాడుతున్నాము. కృష్ణనది జలాల విషయంలో కేంద్ర జలశక్తి ముందు వాదనలు వినిపించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే. బీఆర్ఎస్ పాలనలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కాళేశ్వరం ద్వారా ఒక్క చుక్క నీరు ఈ 21 నెలల్లో ఉపయోగించలేదు. తుమ్మడిహట్టి వద్ద 10 ఏళ్లలో తట్టెడు మట్టి తీయలేదు. సీతారామ ప్రాజెక్ట్ మా హయంలో పూర్తి చేసినం. సమ్మక్క, సారలమ్మ ప్రాజెక్ట్ విషయంలో అన్ని అనుమతులు సాధిస్తున్నాం. హరీష్ ఇచ్చే స్టేట్ మెంట్లలో వాస్తవాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్ పూర్తిచేసి టెండర్లు పిలిస్తే మనకేమి సంబంధం. ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో కర్ణాటక ప్రభుత్వాన్ని ప్యతిరేకిస్తాం’ అని ఉత్తమ్ తెలిపారు. -
బిహార్‌లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ!
పాట్నా: మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఎంఐఎం).. ‘ఇంతింతై.. వటుడింతై.. బ్రహ్మాండాంతపు సంవర్ధియై..’’ అన్నట్లుగా 1969లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(బల్దియా) ఎన్నికల్లో పత్తర్‌గట్టీ డివిజన్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి విజయదుందుభీ మోగించిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ క్రమంగా హైదరాబాద్ పాతనగరంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాగా వేసింది. తొలినాళ్లలో సలావుద్దీన్, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. క్రమంగా పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించి, జాతీయ స్థాయికి ఎదిగేలా చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఏఐఎంఐఎం)గా పార్టీని అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో పాగా వేశారు. గత ఎన్నికల్లో బిహార్‌లో ఐదు స్థానాలను గెలుచుకున్నారు. బిహార్ తాజా ఎన్నికల్లో 100 స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు మజ్లిస్ నేతలు.గత ఎన్నికల్లో..నిజానికి 2015 నుంచే బిహార్‌పై మజ్లిస్ వ్యూహరచనను ప్రారంభించింది. అప్పట్లో ఆశాజనకంగా ఓటు బ్యాంకును సాధించినా.. అసెంబ్లీలో పాగా వేయలేకపోయింది. 2020 ఎన్నికల్లో మాత్రం తన సత్తాను చాటుకుంది. సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. అమౌర్ నుంచి ఇమాన్, బైసీ నుంచి రుక్ముద్దీన్ అహ్మద్, కొచ్దమాన్ నుంచి ఇజ్హార్ ఆసిఫీ, బహదూర్ గంజ్ నుంచి అంజార్ నయీమీ, జోకిహాట్ నుంచి షానవాజ్ ఆలం విజయం సాధించి, అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.నాలుగో బలమైన శక్తిగా..బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి బరిలో ఉండగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు మజ్లిస్ బలమైన ప్రత్యర్థిగా ముందుకు సాగుతోంది. తాజాగా శనివారం హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాము 243 సీట్లకు గాను.. 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మజ్లిస్ ఐదు రెట్లు అధిక స్థానాల్లో పోటీ చేయనుంది. ‘‘నిజానికి నేను ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌తోపాటు.. తేజస్వీ యాదవ్‌ను సంప్రదించాను. పొత్తు కోసం కృషి చేశాను. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే.. ఒంటరిపోరుకు సిద్ధమయ్యాం. భావసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకొని పోతాం. దీని ద్వారా బిహార్‌లో తృతీయ ఫ్రంట్‌కు అవకాశాలుంటాయి’’ అని మజ్లిస్ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మీడియాకు చెప్పారు.ఓట్లు చీలుతాయా?మజ్లిస్ పోటీతో సెక్యూలర్ ఓట్లు, ముస్లిం మైనారిటీల ఓట్లు చీలి.. ప్రధాన పార్టీలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలున్నాయి. 2020లో కూడా మజ్లిస్ ఈ అపవాదును మూటకట్టుకుంది. 2020లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఐదు స్థానాల్లో పాగా వేసింది. పలు స్థానాల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ ఫ్రంట్‌ను దారుణంగా దెబ్బకొట్టింది. అయితే.. 2022లో నలుగురు ఎమ్మెల్యేలు మజ్లిన్ను వీడి.. ఆర్జేడీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మాత్రమే మజ్లిస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2022 పార్టీ ఫిరాయింపుల తర్వాత మజ్లిస్ ఓటు బ్యాంకును పెంచుకోవడంపైనే దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17శాతానికి పైగా ఉన్న మైనారిటీల తరఫున అసెంబ్లీలో గళం వినిపించేది తామేనని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ముందుకు సాగాలని మజ్లిస్ అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ అసదుద్దీన్ ఒవైసీ గత నెల నాలుగు రోజులు బిహార్‌లో పర్యటించారు. సీమాంచల్‌పై దృష్టిపెడుతూ.. కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. ముస్లిం సమాజాన్ని ఈ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శలు చేశారు.విమర్శలు మొదలు..మజ్లిస్‌పై ప్రధాన పార్టీలు ఇప్పటికే విమర్శలు మొదలు పెట్టాయి. బీజేపీకి మజ్లిస్ బీ-టీమ్ అని ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్-ఆర్జేడీ ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు కలిగించడమే ఆ పార్టీ ధ్యేయమంటూ మండిపడుతున్నాయి. సెక్యూలర్ ఓట్లను విభజించి, బీజేపీకి లబ్ధి కలిగేలా చేయడమే మజ్లిస్ వ్యూహమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా.. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇంటింటి ప్రచారం అనేది మజ్లిస్ వ్యూహాల్లో ప్రధానాంశం. -
కరూర్ తొక్కిసలాట.. బాధితులతో విజయ్ భేటీపై పోలీసుల ఆంక్షలు
సాక్షి,చెన్నై: కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు నటుడు,తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ సిద్ధమయ్యారు. అయితే ఒక్కో బాధిత కుటుంబానికి వెళ్లి పరామర్శించేందుకు విజయ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన సెప్టెంబర్ 27న టీవీకే ప్రచార సభలో జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలో విజయ్ ఒక్కో బాధిత కుటుంబానికి వెళ్లి నేరుగా పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. కరూర్ తొక్కిసలాటలోని బాధిత కుటుంబాల్ని వ్యక్తిగతంగా కలవాలన్న ఉద్దేశంతో తమిళనాడు డీజీపీకి ఈమెయిల్ ద్వారా అనుమతి కోరారు. అయితే పోలీసుల నుంచి అనుమతి ఇంకా రాలేదు. భద్రతా కారణాల వల్ల విజయ్ పరామర్శను ఒకే వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇంటింటికి వెళ్లి బాధితుల్ని కలవడం వల్ల గందరగోళం నెలకోవడంతో పాటు, అదుపు చేయలేని పరిస్థితులు తలెత్తుతాయని అందుకే విజయ్‌కు తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.మరోవైపు బాధితుల పరామర్శ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించాలని టీవీకే పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. తిరుచ్చి ఎయిర్‌పోర్టు నుంచి వాహనంలో విజయ్ కరూర్‌లో బాధితులందరూ ఒకే చోట సమావేశయ్యేలా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రానున్నారు. ఆ ప్రాంతం వరకు జనం లేకుండా చూడాలని టీవీకే ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.టీవీకే అనుమతికి అనుగుణంగా పోలీసులు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ వచ్చే మార్గంలో చెక్పాయింట్లు,మొబైల్ పెట్రోల్ యూనిట్లు, ప్రజలు గుమిగూడకుండా ట్రాఫిక్ మళ్లింపులు, జనసమూహాన్ని నివారించడానికి విమానాశ్రయం ఎంట్రన్స్,ఎగ్జిట్ పాయింట్ల వద్ద పోలీసు ఎస్కార్ట్‌లు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తమిళ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.దీంతోపాటు కరూర్‌లో జరిగే వేదికకు సంబంధించి..ఒక కిలోమీటరు వరకు పోలీసులు మోహరించనున్నారు. ముందస్తు అనుమతి పొందిన బాధిత కుటుంబ సభ్యులకు మాత్రమే వేదిక వద్దకు అనుమతి ఇవ్వనున్నారు. ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్ల వద్ద బాధితుల కుటుంబ సభ్యులన్ని ధృవీకరిస్తారు. ఆ సమయంలో జనం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. This video shows how much effort @TVKVijayHQ has taken in that time for people safety , he gave priority for the people but #KarurStampede happend was unexpected pic.twitter.com/mZu6s1QPFa— 𝕽æ𝖓𝖏𝖎𝖙𝖍𝕶ü𝖒𝖆𝖗 (@romeorkr) October 4, 2025 -
కల్తీ మద్యం తయారీదారుల వెనుక చంద్రబాబు, లోకేష్
సాక్షి,తాడేపల్లి: తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో పలువురు మరణించారు. అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె శనివారం(అక్టోబర్11)న మీడియాతో మాట్లాడారు.‘కల్తీ మద్యం కేసును సీబీఐకి ఇవ్వాలి. కల్తీ మద్యం తయారీ దారుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. అందుకే కేసును నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు రావటం లేదు?.నకిలీ మద్యం గురించి చంద్రబాబు మాట్లాడాలి.జయచంద్రారెడ్డి టీడీపీ పెద్దలకు కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. అలాంటి వ్యక్తిని వైఎస్సార్సీపీ కోవర్టు అని ముద్ర వేస్తున్నారు. మరి జయచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ కోవర్టులయితే టికెట్ ఎందుకు ఇచ్చారు?. లావు శ్రీకృష్ణదేవరాయలు సహా ఇప్పుడు ఉన్న కొందరు మంత్రులు కూడా మా కోవర్టులే.మరి వాళ్లపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?.ఏపీలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. రేపల్లె, ఏలూరు సహా అనేక చోట్ల టీడీపీ నేతలు నకిలీ మద్యం కింగ్ పిన్‌లా మారారు. మా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయి.ఎక్కడా నకిలీ, కల్తీకి ఆస్కారం లేకుండా చేశారు.కానీ టీడీపీ నేతలు తమ జేబులు నింపు కోవటానికి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.ఈ మద్యంతో రాష్ట్రంలో మహిళల తాళి బొట్టు తెంచుతున్నారు. చంద్రబాబు హయాంలో నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెరిగి పోయాయి. ప్రతి నాలుగు సీసాల్లో ఒకటి నకిలీ మద్యమే. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనిఖీలు చేయటం లేదు. ప్రభుత్వ పెద్దల కుట్ర దీని వెనుక ఉంది. అయినప్పటికీ ఎల్లో మీడియాలో వార్తలు రావటం లేదు. నకిలీ మద్యం కావడం వల్లే తెలంగాణ వెళ్లి కొనుగోలు చేస్తున్నారు’అని అన్నారు.