అందుకే కలెక్టర్లను చంద్రబాబు బెదిరిస్తున్నారు: టీజేఆర్‌ | YSRCP Leader TJR Sudhakar Babu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

అందుకే కలెక్టర్లను చంద్రబాబు బెదిరిస్తున్నారు: టీజేఆర్‌

Sep 12 2026 5:11 PM | Updated on Sep 12 2026 5:39 PM

YSRCP Leader TJR Sudhakar Babu Fires On Chandrababu

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఫ్రస్టేషన్‌ పీక్ లెవల్‌కు చేరిందని.. అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ సునీతను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని.. స్కిల్ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతో చంద్రబాబు ఉన్నారన్నారు.

‘‘చంద్రబాబు ఒత్తిడి చేయటం వలనే తాను సంతకాలు చేసినట్టు సునీత చెప్పారు. అందుకే తాను స్కిల్ కేసులో ఇరుక్కున్నానని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతిసారీ సునీతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక దళిత ఐఏఎస్ అధికారిణిపై చంద్రబాబు నోరు పారేసుకోవటం సరికాదు. ఆమె తన బాధను మిగతా అధికారులతో చెప్పుకుంది. స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ తన మనుషులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఆధారాలన్నీ బయట పడినా.. చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ టీజేఆర్‌ నిలదీశారు.

‘‘డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేశారు. అందుకే చంద్రబాబు మాటలు నమ్మి సంతకాలు చేయవద్దని పదేపదే చెప్పాం. మా పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ జైలుకు‌ వెళ్లటం ఖాయం. నీట్ పేపర్ లీక్‌తో కేంద్రమంత్రి రాజీనామా చేశారు. మరి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో అధికారులు బాధ్యులు కావద్దు. ఐఏఎస్ అధికారిని సునీత లాగా స్ట్రాంగ్‌గా నిలబడాలి.

..ఎల్‌నినో ఎఫెక్ట్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు పడవని ముందే ప్రపంచమంతా తెలుసు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయటం సబబు కాదు. చంద్రబాబు చెప్పిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలన్నీ పచ్చి అబద్దాలు. రాష్ట్ర ప్రజలను దగా చేశారు. పెన్షనర్లను తాగుబోతులనటం దుర్మార్గం. వృద్దులు, వికలాంగులను తాగుబోతులు అంటూ అవహేళన చేయటం తగదు. ఆ మాటలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ టీజేఆర్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్‌ జగన్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement