హైదరాబాద్: పార్టీకి నష్టం కల్గించారనే కారణాలతో ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. వారిని వారంలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 6వ తేదీ) క్రమశిక్షణా కమిటీ సమావేశమైన అనంతరం మల్లు రవి ఈ విషయాల్ని వెల్లడించారు. పార్టీకి నష్టం కల్గించేలా వ్యహరించారడంతో ఆరుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం తన డిక్లరేషన్‌లో లేదని తెలిపారు మల్లు రవి. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, తాను ఏదైనా తప్పు చేస్తే ఏఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.షోకాజ్ నోటీసులు జారీ చేసిన వారిలో ఆదిలాబాద్ ఇంచార్జి కంది శ్రీనివాస్‌తో పాటు సంజీవ రెడ్డికి, గజ్వేల్ నర్సారెడ్డి, జూపల్లి మల్లారెడ్డిలు ఉన్నట్లు తెలుస్తోంది.


