సిద్ధిపేట: రేపట్నుంచి(సోమవారం, సెప్టెంబర్ 07వ తేదీ) ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకున్నామని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అనంతరం హరీష్ మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ నష్టం చేసిందని, ఆ పార్టీ ప్రజలకు చేసిన ద్రోహాల మీద అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.
‘ఈ అసెంబ్లీ కనీసం నెల పెట్టాలని మేము బీఏసీలో డిమాండ్ చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ద్రోహాల మీద నిలదీస్తాం. 22a అంశం పై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాబోయే కొద్ది రోజుల్లో లక్షలాది మందితో కాళేశ్వరం ఎత్తిపోతల, రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.
రాజీనామా చేయాల్సి వస్తే మీరే చేయాలి. అన్ని విషయాల్లో ఫెయిల్ అయిన మీరే రాజీనామా చేయాలి.ప్రధాన ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వడం లేదు. సీఎం బూతులు తిడుతున్న ఈ సభ కు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు అని అందరం ఎమ్మెల్యేం చెప్పాం. మీ తమ్ముడు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. ఆయనకు ఎందుకు గన్‌మెన్‌లను ఇచ్చి ఖర్చు పెడుతున్నారు. అసెంబ్లీ కనీసం నెలరోజులు జరగాలని మేము స్పీకర్ ను కోరుతాం.సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను అడుగుతాం. మాకు తగిన సమయం ఇవ్వకపోతే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా వెనకాడం’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
త్వరలో పాదయాత్ర చేస్తా: కేసీఆర్ కీలక ప్రకటన


