నూతన అధ్యక్షుడు సింగంశెట్టి కోటేశ్వరరావు
గుంటూరు: కొరిటెపాడు ట్యాంక్‌బండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సింగంశెట్టి కోటేశ్వరరావు భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన కన్నసాని బాజీపై సింగంశెట్టి కోటేశ్వరరావు 446 ఓట్లతో విజయభేరి మోగించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొరిటెపాడులోని కొరిటెపాడు ట్యాంక్‌బండ్ వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. 2,700 వాకర్స్ ఓట్లకుగాను, 2,222 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
సింగంశెట్టి కోటేశ్వరరావు ప్యానెల్‌లో ఉపా«ధ్యక్షుడిగా ఏరువ ఇన్నారెడ్డి, తలతోటి సురేంద్ర, కార్యదర్శిగా చాగంటి విష్ణువర్థన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు, జాలీ వాకర్‌గా పి.శ్రీనివాస చక్రవర్తి, కోశాధికారిగా ఎల్.సత్యనారాయణ, ఈసీ సభ్యులుగా ఎస్.రామకృష్ణరెడ్డి (జిమ్), కె.శ్రీనివాస రావు (ట్రాక్–1), ఎన్.నరసింహారావు, (ట్రాక్–2), వై.శ్రీనివాసరావు (కల్చరల్) గెలవగా, గార్డెనింగ్ యేళ్ల రత్తయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో సింగంశెట్టి కోటేశ్వరరావుకి 1,307 ఓట్లు రాగా, కన్నసాని బాజికి 861 ఓట్లు పోలయ్యాయి.
ఫలించని కుతంత్రాలు..
సమీప ప్యానెల్ అభ్యర్థులను ఓడించేందుకు కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బాజీ గెలుపు కోరుతూ ఎమ్మెల్సీ ఆలపాటి, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, నగర మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, జనసేన గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు బొనబోయిన శ్రీనివాస్‌లు ఓటు వేసినప్పటికీ కూటమి కుతంత్ర రాజకీయాలను వాకర్స్ తిప్పికొట్టారు. రెండేళ్ల వరకు ట్రాక్‌వైపు చూడకుండా బుద్ధిచెప్పినట్లయిందని చెప్పుకొంటున్నారు.
ఇదీ చదవండి: కుదేలైన ‘పొదుపు’!


