అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు వైఎస్సార్‌ | YS Rajasekhara Reddy Vardhanthi Celebrations in Orlando | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు వైఎస్సార్‌

Sep 14 2026 5:42 AM | Updated on Sep 14 2026 5:42 AM

YS Rajasekhara Reddy Vardhanthi Celebrations in Orlando

వైఎస్సార్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ప్రవాసాంధ్రులు

అమెరికాలోని ఓర్లాండోలో వైఎస్సార్‌కు ఘన నివాళి 

వైఎస్సార్‌ సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్న ప్రవాసాంధ్రులు

సాక్షి, అమరావతి: అమెరికాలోని ఓర్లాండోలో మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ అభిమానులు, ప్రవాసాంధ్రులు ఆదివారం ఘనంగా నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్‌సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు వైఎస్సార్‌ అని కొనియాడారు. వైఎస్సార్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రవాసాంధ్రులు వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయాలని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌ పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్సార్‌ సంక్షేమ వారసత్వాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. 

డాక్టర్‌ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంలో వైఎస్సార్‌ ప్రభు త్వం చేపట్టిన చర్యలు కీలకపాత్ర పోషించాయన్నారు. డాక్టర్‌ కొండ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించారు. పెద్ద సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు, వైఎస్సార్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు హాజరై వైఎస్సార్‌కు నివాళులర్పించారు. రత్నాకర్‌ పి.జలంధర్, రాయల్‌రెడ్డి, రాజశేఖర్, రవి, సంజీవ, రఘు, జనార్దన్, సునీల్, వెంకట్‌ పులి, శేషాద్రి, సురేంద్ర, మధు, కిరణ్, రమణారెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement