సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కొడాలి నాని దుయ్యబట్టారు. 16 ఏళ్ల బాబు పాలనలో ఒక్కసారే స్థానిక ఎన్నికలు పెట్టాడు. ఎన్నికలకు వైఎస్ జగన్ భయపడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. భయమంటే ఏంటో తెలియని నాయకుడు జగన్. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతికి అంతులేకుండా పోయింది. డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్మేశారు. కొంతమంది దొంగల కోసం స్పోర్ట్స్ జీవోలను మార్చారు’’ అని కొడాలి నాని మండిపడ్డారు.
‘‘వైఎస్ జగన్‌ను చర్చకు రమ్మనడానికి లోకేష్‌కు ఉన్నస్థాయి ఏంటి?. పేర్ని నాని చర్చకు వస్తానంటేనే లోకేష్ పారిపోయాడు. తండ్రి పేరు నిలబెట్టేందుకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన మాటకోసం మడమతిప్పని నేత వైఎస్ జగన్. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారమే పరమావధిగా బతికే వ్యక్తి చంద్రబాబు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో పెద్ద లిస్ట్ పట్టుకొచ్చాడు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలతో ఎన్నికలకు వెళ్లనని ధైర్యంగా చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చాడా?. మోసంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.
‘‘వెన్నుపోటు సామ్రాట్‌ను, వెన్నుపోటు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. పేర్ని నాని, ఆయన భార్య పై కేసులు పెట్టి వేధించారు. ఎన్ని కేసులు పెట్టినా పేర్ని నాని వెనక్కి తగ్గలేదు. వైఎస్ వెంట నిలిచి ఆయన గొంతును నిరంతరం వినిపిస్తున్నారు. వల్లభనేని వంశీని ఉద్ధేశపూర్వకంగా కేసులతో ఇబ్బంది పెట్టారు. వంశీకి హైదరాబాద్‌లో కోట్ల విలువైన ఆస్తులున్నాయ్. పేదల పట్టాలను అమ్ముకున్నాడని వంశీ పై దొంగ కేసులు పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టు రాకతో ప్రజల కళ్లల్లో ఆనందం చూశానని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ ఎలా ఉంటుందో కూడా చంద్రబాబుకు తెలియదు. నీళ్ల కోసం కొండను ఎలా తవ్వుతారని విమర్శించింది చంద్రబాబే. చంద్రబాబు చేలో మేస్తే.. లోకేష్ గట్టుమీద మేస్తాడా?’’ అంటూ కొడాలి నాని నిలదీశారు.


