సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రామచంద్రపురం జనసేన విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ‘‘జనసేన గెలిచిన చోట టీడీపీ వాళ్లను గౌరవించినా.. టీడీపీ గెలిచిన చోట జనసేన కార్యకర్తలను తొక్కుతున్నారు. ఈ విషయం మన నాయకుడు పవన్ కళ్యాణ్‌కు కూడా తెలుసు’’ అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు.
బొలిశెట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాస్తవాన్నే నేను చెప్తా.. ఎవరికీ భయపడనంటూ బొలిశెట్టి తేల్చి చెప్పారు. బొలిశెట్టి కామెంట్స్‌పై టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి.


