సాక్షి, తాడేపల్లి: డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో వీడియో రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసి.. ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
కాగా, నిన్న(గురువారం) ప్రెస్‌మీట్‌లో మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ మరోసారి ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు.
ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని.. వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.


