అంతా ‘రాజకీయమే’! | Complaints to the state governor in a race | Sakshi
Sakshi News home page

అంతా ‘రాజకీయమే’!

Sep 10 2026 2:36 AM | Updated on Sep 10 2026 2:36 AM

Complaints to the state governor in a race

గవర్నర్‌ శుక్లాకు వినతిపత్రం ఇస్తున్న భట్టి విక్రమార్క. చిత్రంలో దామోదర, పొన్నం, సీతక్క, శ్రీహరి, లక్ష్మణ్, అజహరుద్దీన్, వివేక్‌

బుధవారం రాజకీయమే ఎజెండాగా అసెంబ్లీ కార్యకలాపాలు

సోమవారం నాటి ఘటన చుట్టూనే తిరిగిన శాసనసభ, మండలి

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలు, సస్పెన్షన్లు

రాష్ట్ర గవర్నర్‌కు పోటాపోటీగా ఫిర్యాదులు

కేసీఆర్, బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ సీఎం రేవంత్‌ మాటల దాడి

అసెంబ్లీలో పంచాయతీరాజ్‌ బిల్లు... మండలిలో ప్రశ్నోత్తరాలకే పరిమితం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు వరుసగా మూడోరోజు కూడా రాజకీయం కోణంలో కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. ఇటు అసెంబ్లీ, అటు కౌన్సిల్‌లో సోమవారం బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీ గేటు బయట చేసిన ఆందోళన కేంద్రంగానే దుమారం కొనసాగింది. అసెంబ్లీలో పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టగా, కౌన్సిల్‌లో ప్రశ్నోత్తరాల సెషన్‌ మాత్రమే జరిగింది. అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లకు చెందిన సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలు, సస్పెన్షన్లు జరగ్గా, అసెంబ్లీ బయట అధికార, విపక్ష సభ్యులు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు.  

సభ ప్రారంభం కాగానే.. 
బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగా నే మళ్లీ గొడవ మొదలైంది. తమ ఆందోళన సందర్భంగా మహిళా సభ్యులపై పోలీసుల దురుసు ప్రవర్తన గురించి బీఆర్‌ఎస్‌ సభ్యు లు సభలో లేవనెత్తారు. శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సహా పలువురు మంత్రులు జోక్యం చేసుకుని బీఆర్‌ఎస్‌ సభ్యుల వ్యవహరశైలిని తప్పుపట్టారు. గందరగోళం మధ్య సభకు హాజరైన బీఆర్‌ఎస్‌ సభ్యులందరినీ సెషన్‌ మొతానికి సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ శివపత్రాప్‌ శుక్లాను కలిశారు. తమ హక్కులను పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు.  

మంత్రులతో సీఎం భేటీ 
అసెంబ్లీలోని తన చాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఇతర మంత్రులతో బుధవారం నాటి పరిణామాలపై చర్చించారు. బీఆర్‌ఎస్‌ నేతల సస్పెన్షన్, సభ నిర్వహణపై మంత్రులతో సమాలోచనలు జరిపారు. సభ జరిగినన్ని రోజులు ప్రధానంగా ఏయే అంశాలపై చర్చించాలన్న దానిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విరామం తర్వాత కూడా అసెంబ్లీ రాజకీయ అంశాలపైనే కొనసాగింది. 

ఎర్రవల్లిలోని కేసీఆర్‌ నివాసం వద్ద దళిత సంఘాలు చావు డప్పు కార్యక్రమం నిర్వహించగా, ఆ ప్రదేశాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది. అసెంబ్లీ బయట మీడియా పాయింట్‌లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి కూడా అటు కేసీఆర్, ఇటు బీఆర్‌ఎస్‌లను టార్గెట్‌ చేశారు.  

మండలిలో ప్రకంపనలు 
మండలిలోనూ రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. మండలి ప్రారంభం కాగానే సస్పెన్షన్‌కు గురైన తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలను సభకు అనుమతించి వారి వివరణ తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్‌ అనుమతించకపోవడంతో వాకౌట్‌ చేశారు. ఆ తర్వాత సభలో ప్రశ్నోత్తరాలను ముగించిన తర్వాత ప్రత్యేక ప్రస్తావనలను ప్రవేశపెట్టిన అనంతరం గురువారం నాటికి వాయిదా వేశారు. కాగా తాతామధు, నవీన్‌రెడ్డిలపై ఎలాంటి చర్య లు తీసుకోవాలనే అంశాన్ని మండలి చైర్మన్‌ గుత్తా, మహేశ్‌గౌడ్‌ నేతృత్వంలోని ఎథిక్స్‌ కమిటీకి పంపించారు.  

దళితులు, మహిళల గౌరవం కాపాడాలి  
బుధవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు లోక్‌భవన్‌లో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను కలిసి దళితులు, మహిళల గౌర వం, భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, అజహరుద్దీన్, వివేక్, లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు కవ్వంపల్లి సత్యనారాయణ, వెడ్మ»ొజ్జులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలు అసెంబ్లీ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశా రని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తన చొక్కాను విప్పారని, తదితర సోమవారం జరిగిన ఘటనల గురించి గవర్నర్‌కు వారు వివరించారు. దళితులు నడిచిన రహదారులను పసుపు నీళ్లు, పాలతో శుద్ధి చేయడం ద్వారా నిషేధిత, చట్టవిరుద్ధమైన, అమానవీయమైన, అనై తికమైన అంటరానితన ఆచరణను బీఆర్‌ఎస్‌ ప్రదర్శించిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిపైనే కాకుండా బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులపై అ త్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్య లు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement