breaking news
assembly monsoon sessions
-
అంతా ‘రాజకీయమే’!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు వరుసగా మూడోరోజు కూడా రాజకీయం కోణంలో కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. ఇటు అసెంబ్లీ, అటు కౌన్సిల్లో సోమవారం బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ గేటు బయట చేసిన ఆందోళన కేంద్రంగానే దుమారం కొనసాగింది. అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టగా, కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సెషన్ మాత్రమే జరిగింది. అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లకు చెందిన సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలు, సస్పెన్షన్లు జరగ్గా, అసెంబ్లీ బయట అధికార, విపక్ష సభ్యులు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. సభ ప్రారంభం కాగానే.. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగా నే మళ్లీ గొడవ మొదలైంది. తమ ఆందోళన సందర్భంగా మహిళా సభ్యులపై పోలీసుల దురుసు ప్రవర్తన గురించి బీఆర్ఎస్ సభ్యు లు సభలో లేవనెత్తారు. శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సహా పలువురు మంత్రులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ సభ్యుల వ్యవహరశైలిని తప్పుపట్టారు. గందరగోళం మధ్య సభకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులందరినీ సెషన్ మొతానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ శివపత్రాప్ శుక్లాను కలిశారు. తమ హక్కులను పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. మంత్రులతో సీఎం భేటీ అసెంబ్లీలోని తన చాంబర్లో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఇతర మంత్రులతో బుధవారం నాటి పరిణామాలపై చర్చించారు. బీఆర్ఎస్ నేతల సస్పెన్షన్, సభ నిర్వహణపై మంత్రులతో సమాలోచనలు జరిపారు. సభ జరిగినన్ని రోజులు ప్రధానంగా ఏయే అంశాలపై చర్చించాలన్న దానిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విరామం తర్వాత కూడా అసెంబ్లీ రాజకీయ అంశాలపైనే కొనసాగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద దళిత సంఘాలు చావు డప్పు కార్యక్రమం నిర్వహించగా, ఆ ప్రదేశాన్ని బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి కూడా అటు కేసీఆర్, ఇటు బీఆర్ఎస్లను టార్గెట్ చేశారు. మండలిలో ప్రకంపనలు మండలిలోనూ రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. మండలి ప్రారంభం కాగానే సస్పెన్షన్‌కు గురైన తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలను సభకు అనుమతించి వారి వివరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ అనుమతించకపోవడంతో వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభలో ప్రశ్నోత్తరాలను ముగించిన తర్వాత ప్రత్యేక ప్రస్తావనలను ప్రవేశపెట్టిన అనంతరం గురువారం నాటికి వాయిదా వేశారు. కాగా తాతామధు, నవీన్‌రెడ్డిలపై ఎలాంటి చర్య లు తీసుకోవాలనే అంశాన్ని మండలి చైర్మన్ గుత్తా, మహేశ్‌గౌడ్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీకి పంపించారు. దళితులు, మహిళల గౌరవం కాపాడాలి బుధవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దళితులు, మహిళల గౌర వం, భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, అజహరుద్దీన్, వివేక్, లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు కవ్వంపల్లి సత్యనారాయణ, వెడ్మ»ొజ్జులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలు అసెంబ్లీ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశా రని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తన చొక్కాను విప్పారని, తదితర సోమవారం జరిగిన ఘటనల గురించి గవర్నర్‌కు వారు వివరించారు. దళితులు నడిచిన రహదారులను పసుపు నీళ్లు, పాలతో శుద్ధి చేయడం ద్వారా నిషేధిత, చట్టవిరుద్ధమైన, అమానవీయమైన, అనై తికమైన అంటరానితన ఆచరణను బీఆర్ఎస్ ప్రదర్శించిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిపైనే కాకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులపై అ త్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్య లు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. -
రెండోరోజూ అదే వే'ఢీ'
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల ఢీ అంటే ఢీ రెండోరోజూ కొనసాగింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మొదటిరోజు సోమవారం బీఆర్ఎస్ నేతలు నల్ల టీ షర్టులు ధరించి రావడం, వారు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ‘అనుచిత వ్యాఖ్యల వ్యవహారంతో’పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తెలిసిందే. కాగా మంగళవారం కూడా అదే వాతావరణంలో ఉభయ సభలు జరిగాయి. ఈ అంశంపై రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు రెండు పార్టీలు పోటీలు పడి వ్యూహాలు రచించాయి. ఇక అసెంబ్లీ బయట కూడా ఇదే తీరు కొనసాగించాయి. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్‌రావుల మధ్య మాటల యుద్ధం సాగగా, కాంగ్రెస్ చేపట్టిన ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం ముట్టడి కార్యక్రమం, కేసీఆర్‌ను ఉద్దేశించి ఆ పార్టీ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తాజా ఉద్రిక్తతకు, వివాదానికి దారి తీశాయి. మరోవైపు మహిళా పోలీసులపై బీఆర్ఎస్ సభ్యుల దురుసు ప్రవర్తనపై కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇక అసెంబ్లీ లాబీల్లోనూ ఇదే అంశం నడిచింది. ఎమ్మెల్యేలతో మంతనాలు ఉదయం అసెంబ్లీకి రాగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి స్పీకర్ చాంబర్‌కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ప్రభుత్వం పక్షాన అండగా ఉంటామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఓదార్చారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి తన చాంబర్లో రాష్ట్ర మంత్రులతో పలు దఫాలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిల విషయంలో అసెంబ్లీ వేదికగా ఏం చేయాలన్న దానిపై అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతితో చర్చించారు. ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టే తీర్మానం ఎలా ఉండాలి? భవిష్యత్తులో న్యాయ వివాదాలు రాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై మాట్లాడిన సీఎం.. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిని కోరుతూ శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహతో తీర్మానం ప్రతిపాదింపజేసి, ఆమోదింపజేయాలని నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు కూడా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు. కాంగ్రెస్ ముట్టడి కార్యక్రమాన్ని ధీటుగా ఎదుర్కోవాలని, ఎమ్మెల్సీలు మాత్రం సభలోనే ఉండాలని నిర్ణయించారు. తాతా మధు, నవీన్‌రెడ్డిల సస్పెన్షన్ నేపథ్యంలో నిరసనలు, ధర్నాతో బీఆర్ఎస్ నేతలు వాతావరణాన్ని మరింత వేడెక్కించారు. ‘అనుచిత వ్యాఖ్యలపై’చర్చ..సస్పెన్షన్ తీర్మానం మంగళవారం మధ్యాహ్నం సభ ప్రారంభమైన తర్వాత ప్యానెల్ స్పీకర్ స్థానంలోకి వచ్చిన కడియం శ్రీహరి సోమవారం నాటి అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై చర్చను ప్రారంభించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రారంభించగా, పలువురు మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారు. ఆ తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యకు విజ్ఞప్తి తీర్మానం ప్రవేశపెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత ఈ తీర్మానాన్ని సభ ఆమోదించి శాసనమండలికి పంపింది. స్పీకర్ మనస్తాపం.. తాతా మధు ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. అసెంబ్లీలో మాట్లాడిన హరీశ్‌రావు వీలున్నంత వరకు తమ పార్టీ ఎమ్మెల్సీలకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే స్పీకర్ ప్రసాద్‌కుమార్ కొంత ఆవేశానికి లోనయ్యారు. హరీశ్‌రావును ఉద్దేశించి ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల వైఖరి, హరీశ్‌రావు వ్యాఖ్యలకు స్పీకర్ మనస్తాపం చెందారు. ఉదయం సభను కొంతసేపు వాయిదా వేసిన అనంతరం చాలాసేపు ఆయన తన చాంబర్లోనే ఉన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు అసెంబ్లీ కార్యదర్శితో మాట్లాడారు. విలేకరులతో ఇష్టాగోష్టిలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తర్వాత సభ లోపలికి వెళ్లిన ఆయన మనస్తాపం కారణంగా కొద్దిసేపు మాత్రమే సభా కార్యకలాపాలు నిర్వహించి, ప్యానల్ స్పీకర్ కడియం శ్రీహరికి సభాధ్యక్షత బాధ్యతను అప్పగించి వెళ్లిపోయారు. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై..కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, మట్టా రాగమయి, పరి్ణకారెడ్డి, యశస్వినిరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహిళా నేతలు కల్వ సుజాత, గుండు సుధారాణి, ఇందిరా శోభన్‌లు మహిళా కమిషన్‌ను కలిశారు. మహిళా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారని, వారి ముందే అర్ధనగ్న ప్రదర్శన చేశారని, అనుచితంగా వ్యవహరించారంటూ కమిషన్ కార్యదర్శి, సభ్యులకు ఫిర్యాదును అందజేశారు. తగ్గని బీఆర్ఎస్ – అసెంబ్లీ లోపలా, బయటా ఆందోళనలు – నల్ల బ్యాడ్జీలతో సమావేశాలకు హాజరు – కాంగ్రెస్ చేపట్టిన కేసీఆర్ ఎర్రవల్లి నివాసం ముట్టడి కార్యక్రమంపై మండిపాటు – తాతా మధు, నవీన్‌రెడ్డి సస్పెన్షన్‌పై నిరసన, ధర్నా ప్రదాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ లోపలా, బయట అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధం కొనసాగించింది. మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో స్పీకర్ సభకు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనసభ లాబీల్లోని బీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సభ లోపలా బయటా కాంగ్రెస్ అనుసరిస్తున్న ఎత్తుగడలపై చర్చించారు. ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నట్లు అందిన సమాచారంపై చర్చించారు. వారికి పోలీసులు సహకరిస్తున్నారని తెలియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎర్రవల్లికి వెళ్లాలని నిర్ణయించారు. అయితే పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్సీలు మాత్రం సభలోనే ఉండాలని నిర్ణయించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట ఎర్రవల్లిలో కేసీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. అయితే రాజీవ్ రహదారి మీదుగా ఎర్రవల్లికి వెళ్లే క్రమంలో నగర శివారులోని బొల్లారం, హకీంపేట వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై నిరసన తెలుపుతూ తమ వాహనాల నుంచి దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలి నడకన ఎర్రవల్లికి బయలుదేరారు. అయితే హరీశ్‌రావుతో పాటు కొందరు ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని జవహర్‌నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపిన కేటీఆర్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను బోయిన్పల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేల అరెస్టు వార్తను తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున జవహర్‌నగర్, బోయిన్పల్లి పోలీసు స్టేషన్లకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. బోయినపల్లి పోలీసు స్టేషన్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం తోపులాటకు, దాడికి దిగాయి. సాయంత్రం ఐదు గంటల వరకు నేతలను పోలీసు స్టేషన్లోనే నిర్బంధించిన పోలీసులు ఆ తర్వాత వదిలి పెట్టారు. పోలీసు నిర్బంధం నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాయంత్రం తిరిగి అసెంబ్లీకి చేరుకున్నారు. నిరసనలు..ధర్నా తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల అసెంబ్లీ బయట పోలీసులు దురుసుగా వ్యవహరించారని, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ మంగళవారం శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిని అరెస్టు చేయడంపై మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో సమావేశాలకు అంతరాయం కలిగింది. తర్వాత సాయంత్రం మధు, నవీన్‌కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మండలి చైర్మన్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో జరిగిన నిరసనలో ఏకపక్షంగా సస్పెన్షన్ విధించి సభను వాయిదా వేసుకుని వెళ్లారని విమర్శించారు. సస్పెన్షన్‌కు సంబంధించిన శాసనసభ తీర్మానం కాపీని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చర్చ లేకుండా ఎమ్మెల్సీల సస్పెన్షన్‌కు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కొద్దిసేపు గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ.. ధర్నా నిర్వహించారు. ఆ తరువాత వారిని పోలీసులు అక్కడ నుంచి పంపించేశారు. మీడియా పాయింట్లో తాతా మధు మాట్లాడుతుండగా అసెంబ్లీ మార్షల్స్ ఆయనను అడ్డుకున్నారు. మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్‌ను ఉద్దేశించి షాద్‌నగర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. -
అసెంబ్లీ నేడు ఒక్కరోజే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండోరోజు ఆదివారంతోనే ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పలు జిల్లాల్లో వర్ష బీభత్సం, గణేశ్ నిమజ్జనం తదితరాల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అవసరమైతే కొద్ది విరామం తర్వాత మళ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించక పోవడంతో భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. కాళేశ్వరం నివేదిక సమర్పించనున్న సీఎం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ పూర్తి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు సమర్పిస్తారు. దీనిపై చర్చ అనంతరం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులపై కూడా సభలో చర్చిస్తారు. స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేస్తూ సవరణలు ప్రతిపాదిస్తారు. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 (ఎ)కు సవరణల ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీపీటీకి బీఆర్ఎస్ పట్టు పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకు అవకాశం ఇవ్వాలని బీఏసీ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ విజ్ఞాపనను పరిశీలిస్తానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. అయితే సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. యూరియా కొరత, వరద బీభత్సం, విష జ్వరాలు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు తదితర ప్రజా సమస్యలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ ప్రతిపాదించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నాయకుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండలి బీఏసీ సమావేశంలో భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబుతో పాటు డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్ గౌడ్, నెల్లికంటి సత్యం, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ రోడ్ల పరిస్థితులపై సభలో ప్రశ్నోత్తరాలు
-
డ్వాక్రా రుణమాఫీపై బట్టబయలైన టీడీపీ మోసం
-
బట్టబయలైన టీడీపీ మోసం
అమరావతి: డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలైంది. అసెంబ్లీ వేదికగా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. డ్వాక్రా రుణాల మాఫీపై లేఖ ద్వారా వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎటువంటి రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత సమాధానమిచ్చారు. 2014 నాటికి ఉన్న రుణాలపై ఎటువంటి మాఫీ చేయలేదని వెల్లడించారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు.. రుణమాఫీ చేసే ఆలోచన లేదని సభలో సమాధానం ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో రూ.14200 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం బహిరంగ సభల్లో మహిళలకు పూర్తిగా డ్వాక్రారుణాలు మాఫీ చేసినట్లు ప్రచారం చేయడం గమనర్హం. లిఖితపూర్వక లేఖ -
అసెంబ్లీ, మండలి సమావేశాలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6న ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తరువాత స్పీకర్ నేతృత్వంలోని బీఏసీ సమావేశమై సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే షెడ్యూల్‌ను రూపొందిస్తారని పేర్కొన్నారు. 10 నుంచి 12 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 6న శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని మండలి కార్యదర్శి సత్యనారాయణ మరో నోటిఫికేషన్‌ను జారీ చేశారు. -
అసెంబ్లీ సమావేశాలు పొడిగించేది లేదు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను పొడిగించేది లేదని మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కేవలం 5 రోజులకు మాత్రమే ఈ సమావేశాలను పరిమితం చేయడం సరికాదని, అనేక అంశాలు ఉన్నందున కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగైనా స్టేట్మెంట్ ఇవ్వొచ్చని ఆయన చెప్పారు. లిఖితపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో లేని అంశాలను కూడా మాట్లాడొచ్చని అన్నారు. ప్రత్యేక హోదాపై తీర్మానం కోసం స్టేట్మెంట్లో ప్రస్తావించకపోయినా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆయన చెప్పారు. సీఎం స్టేట్ మెంట్ ఇచ్చేటప్పుడు సభలో ఎవ్వరూ మాట్లాడకూడదని రామకృష్ణుడు అన్నారు. ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడానికే తమ సభ్యులు ముగ్గురు మాట్లాడారని ఆయన చెప్పారు.


