బట్టబయలైన టీడీపీ మోసం

Minister Paritala Suneetha Has Given Answers Regarding Dwakra Loans  - Sakshi

అమరావతి: డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలైంది. అసెంబ్లీ వేదికగా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. డ్వాక్రా రుణాల మాఫీపై లేఖ ద్వారా వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎటువంటి రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత సమాధానమిచ్చారు. 2014 నాటికి ఉన్న రుణాలపై ఎటువంటి మాఫీ చేయలేదని వెల్లడించారు.

డ్వాక్రా రుణాలను  పూర్తిగా మాఫీ చేసే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు.. రుణమాఫీ చేసే ఆలోచన లేదని సభలో సమాధానం ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో రూ.14200 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం బహిరంగ సభల్లో మహిళలకు పూర్తిగా డ్వాక్రారుణాలు మాఫీ చేసినట్లు ప్రచారం చేయడం గమనర్హం.

లిఖితపూర్వక లేఖ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top