‘వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే’ | YSRCP Organizes Extensive Meeting in Anaparthi East Godavari | Sakshi
Sakshi News home page

‘వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే’

Sep 7 2026 8:36 PM | Updated on Sep 7 2026 8:57 PM

YSRCP Organizes Extensive Meeting in Anaparthi East Godavari

అనపర్తి(తూ.గో.జిల్లా): వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు. ఏపీలో ఏ రంగం చూసినా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఏపీలో ఆక్వా రైతుల పొట్టకొడుతున్నారని, రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలని అమర్నాథ్‌ విమర్శించారు. 

చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని అమర్నాథ్‌ ఎద్దేవా చేశారు. లోకేష్‌ తానే ముఖ్యమంత్రిగా బిహేవ్‌ చేస్తున్నారని, అధికారం పోయిన తర్వాత లోకేష్‌కు తన పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి  నియోజకవర్గం బలబద్రపురంలో వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ సంకేతాలు ఇస్తోంది. ఎన్నికలు జరిగినా జరగకపోయినా, పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని వైఎస్ జగన్ చెప్పారు.  ఏ ఒక్క స్థాయిలోను అధికార పార్టీ ఏకగ్రీవం కాకూడదని విషయాన్ని
స్పష్టం చెశారు. 

రానున్నది వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ప్రభుత్వం. అధికారం పోయిన తర్వాత లోకేష్ తన పరిస్థితి ఏమిటో గుర్తిస్తాడు. తానే ముఖ్యమంత్రినన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు. డీఎస్సీపై సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధమా అన్న వైఎస్ జగన్ సవాలుకు మీ వద్ద నుంచి స్పందన లేదు. 

డిఎస్సీ పై సిబిఐ ఎంక్వయిరీ జరిగే వరకు ఊరుకునేది లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు నాయకులంతా భరోసా కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయాలి’ అని పేర్కొన్నారు.

మరో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టాం. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీలో అన్ని స్థాయిలో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్ అందించాలి. అందరికీ పార్టీ సముచితమైన గౌరవం ఇస్తుంది పార్టీ అధినేత మాటగా చెబుతున్నాను. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కూడా ప్రస్తుత ప్రభుత్వం అందించలేకపోయింది. రెండున్నరేళ్ళ తర్వాత కొత్త పెన్షన్లు గుర్తుకొచ్చాయా. వితంతు పింఛన్లు కూడా ఇవ్వలేకపోయారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు, ప్రభుత్వం కుమ్మక్కై ఆక్వారైతుల పొట్టకొడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి... గెలవాలి.. ఇదే మన లక్ష్యం.’ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 
‘‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా లోకేశే.. రాజీనామా చేయాల్సిందే’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement