"అక్రమాలు చేయడం చంద్రబాబు నైజం" | Chandrababu must order a CBI inquiry into the DSC issue Rachamallu | Sakshi
Sakshi News home page

"అక్రమాలు చేయడం చంద్రబాబు నైజం"

Sep 7 2026 6:14 PM | Updated on Sep 7 2026 6:39 PM

Chandrababu must order a CBI inquiry into the DSC issue Rachamallu

సాక్షి,వైఎస్సార్‌: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.   అక్రమాలు చేయడమనేది చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌కు నైజంగా మారిందన్నారు. 

రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అబద్ధాలు అక్రమాలతో కూటమి ‍ప్రభుత్వం నడుస్తోందని ఏపీలో టెట్‌ రాయకపోయినా టీచర్ ఉద్యోగం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటలు ఆడకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేశారని చంద్రబాబు మెుసలి కన్నీరు కారుస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి’అని రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement