సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు: వైఎస్‌ అవినాష్‌రెడ్డి | Avinash Reddy demands cbi inquiry on ap dsc | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Sep 7 2026 2:33 PM | Updated on Sep 7 2026 2:41 PM

Avinash Reddy demands cbi inquiry on ap dsc

వైఎస్సార్‌ జిల్లా: డీఎస్సీని సక్రమంగా నిర్వహిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రశ్నించారు. టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగం రావడం ఏమిటని ప్రశ్నించారు. సాఫ్ట్ బాల్ సంఘం వ్యక్తి భార్యకు ఉద్యోగం రావడం ఏమిటి? అని అన్నారు.

‘‘నిజాలు బయటకు వస్తే మీరు దోషులుగా నిలబడుతారనే భయం మీకు ఉంది. అసమర్థ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగాయి. ఏదో ఒక రోజు మీరంతా చట్టం ముందు నిలబడాల్సిందే. చర్చకు రమ్మని మాపై సవాలు విసరడం కాదు. ఫిర్యాదు చేసిన 30,000 మందితో చర్చ పెట్టు. నీకు నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే వాటికి సమాధానం చెప్పు. వాస్తవాలు చెప్తూ తప్పుని ఎత్తిచూపితే సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నారు. వాళ్లు చెప్పుకునే గొప్పలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లాలని ఈ కుట్ర. వాళ్ల తప్పులు బయటకు రాకూడదని మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు’’ అని వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు.

పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు టీడీపీ
టీడీపీ నాయకులు పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నారని వైఎస్‌ అవినాష్‌ రెడ్డి చెప్పారు. విచ్చలవిడిగా సంపాదించిన డబ్బు వారి వద్ద ఉందని తెలిపారు. మేము వైఎస్సార్సీపీ, వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలు చూపి ముందుకు వెళ్తున్నాం. కార్యకర్తలంతా సమష్టిగా ఎన్నికలలో పనిచేయాలి. ప్రభుత్వం అన్ని రకాలా విఫలమైంది. సాగు, తాగు నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పతి చేస్తుంటే మన ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుంది.

రాయలసీమలో ఒక్క రిజర్వాయర్‌కూ నీళ్లు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వేధించిన అందరం సమష్టిగా ఎదుర్కొందాం. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటాం’’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement