రేపు వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్ | Ys Jagan Press Meet On September 10 2026 | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్

Sep 9 2026 7:44 PM | Updated on Sep 9 2026 8:25 PM

Ys Jagan Press Meet On September 10 2026

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(సెప్టెంబర్‌ 10, గురువారం) ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌ మీట్ నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వైఎస్‌ జగన్‌ మాట్లాడనున్నారు.

కాగా, ఇవాళ(బుధవారం) బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని.. ఇది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా ఒక మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ.. ఏదైనా రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఉందంటే అది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమేనని సగర్వంగా చెప్పగలుగుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement