Donald Trump
-
పశ్చిమాసియా, క్రూడ్‌పై కన్ను!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే భారీగా ఎగబాకిన క్రూడ్ ధరలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మన సూచీలకు కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘తుపాను ముందు ప్రశాంతత’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్‌తో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు మొదలయ్యాయి. హార్మూజ్ జలసంధిలో అడ్డంకుల కారణంగా క్రూడాయిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 109 డాలర్లకు ఎగబాకింది. ఈ రెండు అంశాలపైనే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారిస్తారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు సెగ కారణంగా రోజుకో సరికొత్త కనిష్టాలకు పడిపోతున్న రూపాయి, మరోపక్క, ద్రవ్యల్బణం భారీగా పెరిగిపోవడం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ‘అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, క్రూడ్ ధరలపై దాని ప్రభావం, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా రిస్క్ సెంటిమెంట్‌ను మార్కెట్ వర్గాలు నిశింతంగా గమనిస్తాయి. సమీప కాలంలో మార్కెట్లకు ఇంధన ధరలు, రూపాయి కదలికలే కీలకం’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. భారీ ఒడిదుడుకులు... ‘ఇరాన్–అమెరికా ఉద్రిక్తలపైనే అందరి కళ్లూ ఉన్నాయి. దీనిపైనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆధారపడి ఉంది. ఈ నేథ్యంలో చర్చల పురోగతి, క్రూడ్ రేట్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చు’ అని ఎన్రిచ్ మనీ సీఈఓ ఆర్. పోన్ముడి పేర్కొన్నారు. రూపాయిపై ఫోకస్... యుద్ధ భయాలకు తోడు, పెట్రో ధరల పెంపు, ప్రధాని పొదుపు చర్యల ప్రభావంతో గతవారం రూపాయి మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. డాలరు మారకంలో ఏకంగా 96 స్థాయిని కూడా దాటేసి, కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి జారిపోయింది. క్రూడ్ ధరలు మరింత ఎగబాకితే రూపాయి క్షీణత కొనసాగవచ్చని, ఇది మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపుందని పోన్ముడి తెలిపారు. గణాంకాలు, ఫలితాలపైనా దృష్టి... అమెరికా, చైనా, భారత్‌లలో విడుదలయ్యే కీలక స్థూల ఆర్థిక గణంకాలు, అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశ వివరాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. క్యూ4 ఫలితాల సీజన్ చివరి దశ నేపథ్యంలో రంగాల వారీగా స్టాక్స్‌లో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. ఈ వారం ఐఓసీ, బీపీసీఎల్, గెయిల్, ఎన్టీపీసీ తదితర ఫలితాలు ఉన్నాయి.గతవారమిలా... ప్రధాని పొదుపు పిలుపు ఎఫెక్ట్‌తో పాటు క్రూడ్ ధరల జోరు, రూపాయి పతనం వంటి ప్రతికూలతలతో గత వారం మార్కె ట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2,090 పాయింట్లు (2.7%) పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 533 పాయింట్లు (2.2%) క్షీణించింది.తిరోగమనంలోనే విదేశీ ఇన్వెస్టర్లు... భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడ్ సెగలు, రూపాయి పతన ప్రభావంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన మార్కెట్లో అమ్మకాల జోరు మరింత పెంచారు. వరుసగా మూడో నెలలోనూ రివర్స్‌గేర్‌లోనే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.27,048 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది మొత్తం రూ.2,2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించినట్లు ఎన్ఎస్డీఎల్ డేటా వెల్లడించింది. 2025 మొత్తం ఏడాదిలో నికర విక్రయాలు రూ.1.66 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాదిæ దీనికి రెట్టింపు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయనేది మార్కెట్ వర్గాలు అంచనా.సాంకేతికంగా చూస్తే... ఈ వారం కూడా దేశీ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో నిఫ్టీ పడితే, 23,500 వద్ద తొలి మద్దతు, 23100 స్థాయిలో రెండో మద్దతు ఉండొచ్చు. పెరిగితే 23,800 వద్ద తక్షణ నిరోధం ఉంటుంది. దానిపైన నిలదొక్కుకుంటే 24,000–24,100 వరకు పెరగవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
తుపానుకు ముందు ప్రశాంతత
వాషింగ్టన్: ఇరాన్‌ను ఎలాగైనా తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై కొన్ని రోజులుగా సైనిక చర్యలు చేపట్టకపోవడాన్ని ‘తుపానుకు ముందు ప్రశాంతత’గా ట్రంప్ అభివరి్ణంచారు. ఇరాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వైమానిక దాడులను పునఃప్రారంభించేందుకు ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. కృత్రిమ మేధతో సృష్టించిన ఒక ఫొటోను ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఈ ఫొటోలో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడం(మాగా) అని రాసి ఉన్న టోపీని ట్రంప్ ధరించారు. నావికాదళ అడ్మిరల్ ట్రంప్‌కు వెనకాల నిలబడి ఉన్నారు. వెనక ఆకాశం ఉరుములు మెరుపులతో భీకరంగా ఉంది. ఈ ఫొటోను పోస్ట్‌చేసి ట్రంప్ పరోక్షంగా ఇరాన్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారని యుద్ధరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాంతికి షరతులే అడ్డంకిపశ్చిమాసియాలో శాంతి సాధనకు ఓ వైపు కృషి జరుగుతుంటే మరోవైపు అవరోధాలు ఎదురవుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన పర్వం కొనసాగుతోంది. తమ షరతులకు అంగీకరిస్తే శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ అమెరికా కొత్తగా ఐదు షరతులను తెరమీదకు తెచ్చింది. వాటికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అమెరికా పలుమార్లు తేల్చిచెప్పింది. ఇరాన్ వద్దనున్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు అప్పగించాలని చర్చల సందర్భంగా ట్రంప్ సర్కార్ షరతు విధించింది. మరో షరతు ఏమిటంటే.. ఇరాన్ అణు కర్మాగారాల్లో కేవలం ఒక సముదాయం మాత్రమే పనిచేస్తూ ఉండాలి. మిగిలినవి మూసివేయాలి. క్షిపణి నిల్వలను గణనీయంగా తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఇన్నాళ్లూ అమెరికా ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, అందుకు తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కానీ, అమెరికా ఒప్పుకోవడం లేదు. యుద్ధాన్ని ముగించడానికి అంకితభావంతో చర్చలు జరపాలన్న ప్రతిపాదనకు అమెరికా నిర్దిష్ట హామీని ఇవ్వడంలో విఫలమైందని ఇరాన్ మీడియా ఆదివారం వెల్లడించింది. -
ఇటు అంగీకారాలు, అటు హెచ్చరికలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల చర్చలు ఇరువురూ కోరుకున్నట్లే సాగాయి. బీజింగ్ ప్రయాణానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ, తమకు ‘అన్నింటికన్న వాణిజ్యం ముఖ్య’మన్నారు. షీ చెప్పిన ప్రధానమైన లక్ష్యాలు, ‘అమెరికాతో నిర్మాణాత్మకమైన సంబంధాలు, వ్యూహాత్మకమైన స్థిరత్వం’. నాయకులిద్దరి మధ్య మే 14, 15 తేదీలలో రెండు విడతల సమావేశం తర్వాత, అంతా సజావుగా జరిగిందన్నది ఉభయుల సంతృప్తి. అదే సమయంలో చైనా అధ్యక్షుడు తైవాన్ విషయమై అమెరికాకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు చేసి ఆశ్చర్యపరిచారు. ట్రంప్ నుంచి మౌనమే సమాధానమైంది.‘ఒకే చైనా’కు ఒప్పుకొంటారా?మిగిలినదంతా సవ్యంగానే జరిగినందున, అపశృతిగా మారిన తైవాన్ అంశంపై జరిగిందేమిటో ముందు చూడాలి. చారిత్రకంగా చూసినా, అంతర్జాతీయ చట్టాల ప్రకారమైనా తైవాన్ దీవి చైనాలో భాగం. అమెరికా సహా ప్రపంచమంతా ‘ఒకే చైనా’ సూత్రాన్ని అంగీ కరిస్తున్నాయి. తైవాన్‌తో దౌత్య సంబంధాలు లేవు. అదే సమయంలో గమనించదగ్గదేమంటే... అమెరికా, దాని మిత్ర దేశాలు కేవలం తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం తైవాన్‌కు భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తూ, పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తైవాన్ చైనాదేననీ, కానీ వారికి ఇష్టం లేకుండా చైనాలో విలీనం చేసుకునేందుకు అంగీకరించ బోమనీ విచిత్రమైన వాదన చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాను సాధారణ దౌత్య మార్గంలో ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ వచ్చిన చైనా అధ్యక్షుడు, అమెరికా ‘సవ్యంగా వ్యవహరించని పక్షంలోరెండు దేశాల మధ్య విభేదాలు, చివరకు ఘర్షణ తప్పక పోవచ్చు’ నని ట్రంప్‌ను హెచ్చరించారు.విషయ తీవ్రత దృష్ట్యా ఇందు గురించి మరికొన్ని వివరాలు చూద్దాము: ఒకవైపు ‘ఒకే చైనా’ సూత్రాన్ని అంగీకరిస్తూనే, మరొక వైపు తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా, తన ద్వంద్వ నీతికి ‘వ్యూహాత్మక అస్పష్టత’ (స్ట్రాటెజిక్ ఆంబిగ్విటీ) అనే పేరు తానే పెట్టింది. తైవాన్ను కాపాడటం తమ లక్ష్యమంటూ చట్టమే చేసింది. ఒకవేళ తైవాన్ను చైనా స్వాధీనపరచుకొనజూస్తే తాను తైవాన్‌కు సహాయం మాత్రమే చేస్తుందా లేక స్వయంగా యుద్ధంలో పాల్గొంటుందా అనే ప్రశ్నకు అవుననిగానీ, కాదనిగానీ స్పష్టం చేయటం లేదు. మరొకవైపు బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన ఇండో– పసిఫిక్ స్ట్రాటెజీ (2022), ట్రంప్ తన రెండవ హయాంలో ప్రకటించిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటెజీ (2025), నేషనల్ డిఫెన్స్ స్ట్రాటెజీ (2026) పత్రాలను పరిశీలించినప్పుడు, తైవాన్ను ఉపయోగించు కుని చైనాను నియంత్రించటం వారి ఉద్దేశమని లిఖితపూర్వకంగా, బహిరంగంగా ప్రకటించటం కనిపిస్తుంది.మౌనం ప్రస్తుతానికేనా?ఈ దిశలో అమెరికా ఇంకా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న పరిస్థితిలోనే చైనా అధ్యక్షుడు, బహుశా విసుగెత్తి కావచ్చు, గతంలో ఎన్నడూ లేని రీతిలో పై విధమైన హెచ్చరికను ముఖాముఖీగా చేశారు. సమావేశాల సమయంలో, అంతకుముందూ ఇంకా ఏమేమి మాటలు వినిపించాయో గమనించాలి. తక్కిన విషయాలన్నీ ఎట్లున్నా, చైనాకు గల ‘ముఖ్యమైన ప్రయోజనాలలో అతి ముఖ్యమైన ప్రయోజనం’ తైవాన్ అన్నారాయన. ఈ అంశం సవ్యంగా తేలనట్లయితే ‘అత్యంత తీవ్రమైన ప్రమాదకర పరిస్థితికి’ దారి తీయగలదన్నారు. అమెరికా– చైనా సంబంధాలు యావత్తు ప్రమాదకరమవుతాయని హెచ్చరించారు. తైవాన్ స్వాతంత్య్రం, ఆ ప్రాంతంలో శాంతి అన్న రెండు మాటలు నీళ్లు–నిప్పు వంటివనీ, రెండింటికి పొసిగే ప్రసక్తి లేదనీ అన్నారు.తైవాన్ గురించి ఇంతింత చెప్పుకోవటం ఎందుకంటే, 1949లో చైనాలో కమ్యూనిస్టు విప్లవం రావటానికి ముందు, వారికి చెందిన తైవాన్ దీవిని జపాన్ సైనికంగా ఆక్రమించింది. తర్వాత, మావోతో ఓడిపోయిన చాంగ్ కై షేక్ వర్గం తైవాన్‌కు పారిపోగా, ఆ వర్గాన్ని అమెరికా కూటమి, జపాన్ మద్దతిచ్చి నిలబెట్టాయి. మొదటి నుంచి చైనాకు చెందిన ఆ దీవిని తిరిగి తమ దేశంలో విలీనం చేసుకోవటం చైనా నాయకత్వానికి ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ లక్ష్యంగా మారింది. ఇపుడు ట్రంప్‌తో చర్చల సందర్భంగా చైనా అధ్యక్షుడు ఈ విషయమై ఎన్నడూ లేనంత తీవ్రంగా మాట్లాడటానికి వెనుక ఈ సుదీర్ఘ నేపథ్యం ఉంది. విషయం అమెరికా పక్షానికి తెలియనిది కాదు. పరిస్థితి శాంతియుతంగా తేలనట్లయితే ఎప్పటికైనా సరే తైవాన్ను బలప్రయోగం ద్వారానైనా విలీనం చేసుకోగలమన్నది కూడా చైనా చెప్తున్న మాటే. జిన్‌పింగ్ హెచ్చరికలకు 14వ తేదీన ట్రంప్ స్పందించలేదు. కానీ ముందు రోజున ఆయన విదేశాంగ మంత్రి మార్కో రూబియో ‘మా విధానంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదు. చైనా సైనిక చర్యకు పాల్పడితే అది పొరపాటు అవుతుంది’ అని మాత్రం అన్నారు. కొద్ది నెలల క్రితం ట్రంప్ ఒక ప్రశ్నకు జవాబిస్తూ, ‘చైనా అభిప్రాయాలు తెలుసు. వారు తైవాన్ విషయమై పట్టుదలగా ఉన్నారు. కనీసం నా అధ్యక్ష కాలంలో సైనిక చర్య తీసుకోబోదని ఆశిస్తాను’ అన్నారాయన. గమనించవలసింది ఏమంటే, అధికారంలో ఉన్నది రిపబ్లికన్లా, డెమోక్రాట్లా అన్న దానితో నిమిత్తం లేకుండా, పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజ నాలకు, చైనాను కట్టడి చేసేందుకు తైవాన్ తమ పలుకుబడిలో ఉండాలన్నది అమెరికా వ్యూహం. ఇపుడు చైనా అధ్యక్షుని హెచ్చరిక ప్రభావం ఎట్లుండవచ్చునన్నది వేచి చూడవలసిన విషయం.ట్రాప్‌లో పడొద్దు!చర్చల వివరాలను ఇతరత్రా గమనించినప్పుడు, ప్రధానమై నది పరస్పర ఆర్థిక సంబంధాలు. వాణిజ్యపరంగా ‘గొప్ప ఒప్పందాలు’ జరిగినట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయన వెంట సుమారు 30 అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలను తీసుకువెళ్లటంలోని ఉద్దేశమూ అదే. అమెరికాలోనూ అదే పద్ధతిలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశ మిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో అమెరికా, చైనాలు భాగస్వా ములుగా పరస్పరం సహకరించుకోవాలి తప్ప పోటీదారులు కారా దనీ, ఇరువురి సంబంధాలు స్థిరమైన విధంగా సాగాలనీ షీ అన్న మాటలు ట్రంప్‌కు నచ్చినట్లే కనిపించాయి. తమ సంబంధాలు ‘గతంలో ఎన్నడూ లేనంతగా’ ముందుకు పోగలవన్నారాయన.చైనా అధ్యక్షుడు తన పరస్పర సహకార సూచనలకు మద్దతుగా, క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దంలో స్పార్టా, ఏథెన్స్ల మధ్య జరిగిన ఒక యుద్ధాన్ని ఉదహరించారు. అగ్రస్థానంలో ఉండిన స్పార్టా, రెండవ స్థానంలో ఉండిన ఏథెన్స్ తనను మించి పోగదలనే భయంతో ముందస్తు యుద్ధం వంటిది చేస్తుంది. అట్లా భయంలో చిక్కుకోవటాన్ని తుసిడిడీస్ అనే చరిత్రకారుడు విశ్లేషించి చెప్పాడు. అప్పటినుంచి ఆ భయాందోళనల స్థితిని ‘తుసిడిడీస్ ట్రాప్’ అంటున్నారు. అమెరికా, చైనా అటువంటి ట్రాప్‌లో చిక్కు కోకుండా పరస్పర సహకారంతో అభివృద్ధి చెందాలని జిన్‌పింగ్ సూచించగా, అటువంటి సహకారం గతంలో ఎన్నడూ లేనంతగా ఉండగలదన్నది ట్రంప్ ఇవ్వబూనిన భరోసా!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పశ్చిమాసియా యుద్ధం.. ఇరాన్‌కు అమెరికా ఐదు షరతులు
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరాన్‌కు అమెరికా ఐదు కీలక షరతులను విధించింది. వాటిలో ప్రధానంగా 400 కిలోల యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్లో ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గత ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోం. విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయదు. అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగింపుపై చర్చలు జరగాలి అని స్పష్టం చేసింది.ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదులుగా, ఇరాన్ తన షరతులను ప్రకటించింది. లెబనాన్ సహా అన్ని యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగించాలి. అన్ని ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభించిన నిధులను విడుదల చేయాలి. యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని తెలిపింది.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్‌లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించి, దాన్ని శాంతి పేరుతో మరింత పెంచడం అమెరికా-ఇజ్రాయెల్‌ల పాత పద్ధతి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించకపోతే ఆ దేశ చెల్లింపు దారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌ను తీవ్రంగా కుదిపేశాయి. ప్రతిగా, ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాలను అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింది. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా, శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యం కాలేదు. ఇరాన్ సైన్యం అమెరికా మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని పునరుద్ఘాటించింది. -
చైనా కంత్రీ వేషాలు.. తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేతులెత్తేశారు. తైవాన్‌కు అండగా నిలుస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన ట్రంప్.. చైనా పర్యటన అనంతరం తైవాన్‌కు భారీ షాకిచ్చారు. చైనా నుంచి తైవాన్ను రక్షించలేమని నాలుక మడతేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు తైవాన్ విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది.అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల అనంతరం, తైవాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమది పూర్తి సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం కలిగిన ‘స్వతంత్ర’ దేశమని స్పష్టం చేసింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది. అమెరికా నుంచి తాము కొనుగోలు చేసే ఆయుధాలు, ఉభయ దేశాల మధ్య ఉన్న 'తైవాన్ రిలేషన్స్ యాక్ట్' భద్రతా ఒప్పందంలో భాగమేనని సమర్థించుకుంది. మరోవైపు, తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ను సార్వభౌమ దేశంగా చూస్తామని ప్రకటించారు. తైవాన్ ప్రజాస్వామ్యాన్ని, స్వతంత్రతను కాపాడుకోవడమే తమ లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు చైనా-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతను మరింత పెంచాయి. కాగా, అమెరికా, చైనా ఒత్తిడుల మధ్య తైవాన్ తన స్వీయ గుర్తింపును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.ఇదిలా ఉండగా.. చైనా పర్యటన తర్వాత తైవాన్ విషయమై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత బలీయమైన చైనాను ఢీకొట్టలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎవరో(తైవాన్) స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ఆలోచన మానుకోవాలని తైవాన్‌కు సూచించారు. ‘‘మనం యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను అది కోరుకోవడం లేదు. చైనాకు తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్లు(తైవాన్, చైనా) సహనం వహించాలని కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. తైవాన్ ద్వీపం గురించి నేను, జిన్‌పింగ్ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, తైవాన్ను అమెరికా రక్షిస్తుందా? లేదా అనేదానిపై చర్చించడానికి నేను నిరాకరించా. తైవాన్ విషయంలో జిన్‌పింగ్‌కు స్పష్టమైన, బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. తైవాన్ స్వాతంత్య్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు’’అని స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఇకపై జోక్యం చేసుకునే ఆలోచన లేదని సంకేతాలిచ్చారు. చైనా–తైవాన్ సమస్య ప్రధానంగా “సార్వభౌమాధికార” (sovereignty) పై వివాదం. చైనా తైవాన్ను తన ప్రావిన్స్‌గా భావిస్తే, తైవాన్ ప్రజాస్వామ్యంగా స్వతంత్ర దేశంలా పనిచేస్తోంది. ఈ విభేదం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఘర్షణకు కారణమవుతోంది. ఇక, తైవాన్‌లో అమెరికా పాత్ర ప్రధానంగా రక్షణ, వాణిజ్యం, మరియు రాజకీయ మద్దతు చుట్టూ తిరుగుతుంది. 1979లో చైనాతో అధికారిక సంబంధాలు ఏర్పరచుకున్నప్పటికీ, అమెరికా Taiwan Relations Act ద్వారా తైవాన్‌కు ఆయుధాలు, రక్షణ సహాయం అందిస్తోంది. ఇది చైనా-అమెరికా సంబంధాల్లో అత్యంత ఉద్రిక్తకర అంశం.చరిత్రాత్మక నేపథ్యం1895: షిమోనోసేకి ఒప్పందం ప్రకారం తైవాన్ జపాన్‌కు అప్పగించబడింది.1945: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తైవాన్ను రిపబ్లిక్ ఆఫ్ చైనా (ROC)కు అప్పగించారు.1949: చైనా అంతర్గత యుద్ధంలో కమ్యూనిస్టులు విజయం సాధించగా, నేషనలిస్టులు తైవాన్‌కు పారిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1971: ఐక్యరాజ్యసమితిలో చైనా స్థానాన్ని బీజింగ్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) స్వీకరించింది. తైవాన్ అంతర్జాతీయంగా ఒంటరైంది.చైనా తైవాన్ను “విభిన్న ప్రావిన్స్”గా భావిస్తుంది.ఒక దేశం, రెండు వ్యవస్థలు (హాంకాంగ్ మోడల్) ప్రతిపాదించింది కానీ తైవాన్‌లో ప్రధాన పార్టీలు దీనిని తిరస్కరించాయి.బలప్రయోగం ద్వారా అయినా తైవాన్ను కలుపుకోవాలని హెచ్చరిస్తోంది.తైవాన్‌లో ప్రజాస్వామ్య ఎన్నికల ప్రభుత్వం ఉంది, సుమారు 2.3 కోట్ల జనాభా.ఎక్కువ మంది ప్రజలు ప్రస్తుత స్థితి (status quo) కొనసాగాలని కోరుకుంటున్నారు. అంటే పూర్తిగా స్వతంత్రత ప్రకటించకుండా, చైనాకు లోబడకుండా ఉండాలనుకుంటున్నారు.అంతర్జాతీయ ప్రభావంఅమెరికా: తైవాన్‌కు ఆయుధాలు, రక్షణ సహాయం అందిస్తోంది.ఐక్యరాజ్యసమితి: తైవాన్ సభ్యత్వం లేదు; కేవలం 12 చిన్న దేశాలు మాత్రమే అధికారికంగా గుర్తిస్తున్నాయి.ప్రాంతీయ భద్రత: తైవాన్‌పై దాడి జరిగితే, అమెరికా-చైనా మధ్య యుద్ధం జరిగే ప్రమాదం ఉంది. -
ఈ టైమ్ తుపాన్ ముందు ఉన్న ప్రశాంతత.. ఇక విధ్వంసమే..?
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఈ సారి శాంతి ఒప్పందంపై సంతకం చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు నడుస్తున్న కాలం తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతగా పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో ఒక ఏఐ జనరేటెడ్ పిక్‌తో వార్నింగ్ ఇచ్చారు.ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ చాలా బాగుందని ఆయన చాలా గొప్ప మనిషని కొనియాడారు. తైవాన్ విషయంలోనే అమెరికా మద్దతు ఉండదని చెప్పకనే చెప్పారు. అయితే గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో మరోసారి ఇరాన్‌పై విరుచుకుపడుతూ మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ఒకవేళ ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకుండా, హర్ముజ్ జలసంధి విషయంలో తన దూకుడు వైఖరిని కొనసాగిస్తే, చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న శాంతికాలం తుపానుకు ముందు ప్రశాంతతగా గుర్తుంచుకోవాలి" అని అన్నారు. అయితే ఇరాన్‌పై తిరిగి వైమానిక దాడులను ప్రారంభించడానికి పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని ట్రంప్ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి.మరోవైపు ఇరాన్ సైతం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఏ దాడికైనా గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇదివరకే తేల్చిచెప్పారు. మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రపంచ క్రమాన్ని పునర్నిర్మిస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా పేర్కొన్నారు.కాగా హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు "టోల్ టాక్స్" స్థానంలో "సర్వీస్ ఛార్జ్"ను ప్రవేశపెట్టి, అక్కడ ఒక కొత్త నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరాన్ ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్: చైనా బారి నుంచి తమ మిత్రదేశం తైవాన్ను రక్షించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. తైవాన్‌కు అండగా నిలుస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ఇన్నాళ్లూ ప్రకటించిన ట్రంప్ చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో భేటీ తర్వాత మాట మార్చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత బలీయమైన చైనాను ఢీకొట్టలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎవరో(తైవాన్) స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ఆలోచన మానుకోవాలని తైవాన్‌కు సూచించారు. శుక్రవారం ఫాక్స్‌న్యూస్‌తో ట్రంప్ మాట్లాడారు. ‘‘మనం యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను అది కోరుకోవడం లేదు. చైనాకు తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్లు(తైవాన్, చైనా) సహనం వహించాలని కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. తైవాన్ ద్వీపం గురించి నేను, జిన్‌పింగ్ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, తైవాన్ను అమెరికా రక్షిస్తుందా? లేదా అనేదానిపై చర్చించడానికి నేను నిరాకరించా. తైవాన్ విషయంలో జిన్‌పింగ్‌కు స్పష్టమైన, బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. తైవాన్ స్వాతంత్య్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు’’అని ట్రంప్ స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఇకపై జోక్యం చేసుకొనే ఆలోచన లేదని సంకేతాలిచ్చారు. అమెరికా, చైనా.. జి–2 డొనాల్డ్ ట్రంప్ చైనాలో మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకొని శుక్రవారం సాయంత్రం స్వదేశానికి తిరిగివచ్చారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో జరిగిన చర్చలను రెండు గొప్ప దేశాల నాయకుల సమావేశంగా అభివర్ణించారు. అమెరికా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలతో సహా ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను చైనాతో కుదుర్చుకున్నట్లు చెప్పారు. ‘‘అమెరికా చైనాలు గొప్ప దేశాలు. నేను దీన్ని జి–2 అని పిలుస్తాను’’ అని అభివర్ణించారు.చైనా బహుమతులు బుట్టదాఖలు బీజింగ్: కీలకమైన ఒప్పందాల కోసం తన బృందంతో కలిసి చైనా పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరకు ఉత్తచేతులతోనే వెనక్కి వెళ్లిపోయారు. కొన్ని ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పినప్పటికీ వాటి వివరాలు బహిర్గతం చేయలేదు. ఒక దేశాధినేత మరో దేశానికి అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు బహుమతులతో సత్కరించడం ఆనవాయితీ. పుస్తకాలు కూడా బహూకరిస్తుంటారు. అధినేత బృందంలోని సభ్యులకు కూడా బహుమతులు లభిస్తాయి. వాటిని స్వదేశానికి తీసుకెళ్తుంటారు. అధ్యక్షుడికి వచ్చినవి ప్రభుత్వ ఆస్తి. వాటిని వేలం వేయడమో లేదా మ్యూజియంలో భద్రపర్చడమో చేస్తుంటారు. కానీ.. ట్రంప్, ఆయన బృందం మాత్రం చైనా నుంచి ఏమీ తీసుకెళ్లకుండా తిరిగి వెళ్లిపోయారు. శుక్రవారం బీజింగ్‌లో ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం సమీపంలో ఏర్పాటు చేసిన చెత్తకుండిలో వాటిని వదిలేశారు. చైనా వస్తువులేవీ తమ దగ్గర ఉండకుండా జాగ్రత్తపడ్డారు. ట్రంప్ ప్రతినిధి బృందం, వైట్‌హౌస్ సిబ్బంది, ఆఖరికి అమెరికా జర్నలిస్టులు కూడా చైనా బహుమతులను ఇక్కడే విడిచిపెట్టారు. చైనా పర్యటనకు వచ్చినప్పుడు అమెరికా సిబ్బంది ఇలా చేయడం మొదటిసారి కాదు. కానీ, బహిరంగంగా అందరూ చూస్తుండగా బహుమతులను పక్కనపారేయడం మాత్రం ఇదే తొలిసారి. అమెరికా నుంచి వచ్చిన సిబ్బందికి చైనా అధికారులు ఫోన్లు, ఎల్రక్టానిక్ పరికరాలు, బ్యాడ్జ్‌లు, జ్ఞాపికలను గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ, అవన్నీ చైనాలోనే చెత్తకుండి పాలయ్యాయి. తమపై చైనా ప్రభుత్వం నిఘా పెడుతుందన్న భయంతోనే బహుమతులను వదిలేశారని తెలుస్తోంది. -
వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య సీజ్ఫైర్ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా మీడియా ప్రచురించింది. టెహ్రాన్‌పై మరోసారి వైమానిక దాడులకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.ట్రంప్ చైనా పర్యటన ముగించుకొని ప్రయాణంలో ఇరాన్ ప్రతిపాదించిన శాంతియుత ఒప్పందాని ఆయన తోసిపడేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. "నేను దానిని చూశాను, మొదటి వాక్యం నచ్చకపోతే నేను దానిని పక్కన పడేస్తాను" అని ఆయన అన్నట్లు తెలిపాయి.పశ్చిమాసియాలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు ఈ విషయమై మీడియాతో మాట్లాడారాని అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు మరోసారి సంయుక్తంగా అమెరికాపై దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయనితెలిపినట్లు పేర్కొన్నాయి. కాగా ఇరాన్ అణ్వాయుధ రహిత దేశంగా ఉండాలని అమెరికా, చైనా సంయుక్తంగా అంగీకరించాయిని ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరవాలని సంయుక్త ప్రకటన చేసినట్లు ANI నివేదిక పేర్కొంది.చైనా రాగం పాడిన ట్రంప్చైనా పర్యటన తిరుగు ప్రయాణంలో ట్రంప్ చైనా రాగం పాడారు. "మేము అక్కడ చాలా బాగా గడిపాము అది ఒక అద్భుతమైన కాలం. అధ్యక్షుడు షీ ఒక అద్భుతమైన వ్యక్తి. జిన్‌పింగ్, తాను తైవాన్ గురించి చాలా మాట్లాడుకున్నాము అన్నారు. అదే విధంగా ఇరాన్ గురించి చాలా చర్చించాము ఈ రెండు విషయాలపై మాకు చాలా మంచి అవగాహన ఉందని నేను భావిస్తున్నాను". అన్నారు.కాగా ఇరు దేశాల చర్చలలో చైనాకు తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశంగా నిలిచింది. బీజింగ్ తన భూభాగంగా చెప్పుకుంటున్న ఈ స్వయం పరిపాలన ద్వీపం విషయంలో ఉన్న విభేదాలు అమెరికా, చైనాల మధ్య ఘర్షణలకు లేదా సంఘర్షణలకు దారితీయవచ్చని జిన్‌పింగ్ వ్యక్తిగతంగా ట్రంప్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది. -
ఐసిస్‌కు బిగ్ షాక్.. ట్రంప్ ప్రకటన
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ అగ్రకమాండర్ అబు బిలాల్ మనూకీ హతమయ్యాడు. అమెరికా బలగాలు-నైజీరియా సైన్యం సంయుక్తంగా దాడులు జరిపి అతన్ని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అబు బిలాల్ మనూకీ (ఐసిస్ రెండో ఖలీఫా) ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో కార్యకలాపాలు నడిపించేవాడు. అయితే తన ఆదేశాలతో ఇరు దేశాల సైన్యం సాహసోపేతంగా ఆపరేషన్ నిర్వహించిందని.. అత్యంత క్లిష్టమైన ఈ మిషన్‌ను జాగ్రత్తగా అమలు చేసి అతని చంపేసిందని ట్రంప్ శనివారం తన సోషల్ మీడియాలో ప్రకటించారు. “ఇకపై ఆయన ఆఫ్రికా ప్రజలను భయపెట్టలేడు, అమెరికన్లపై దాడులు ప్రణాళిక చేయలేడు” అని ట్రంప్ పేర్కొన్నారు.ఐసిస్‌లో నెంబర్ 2(రెండో ఖలీఫా) అయిన అబుల్ బిలాల్ చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటూ వచ్చాడు. ఆఫ్రికాలోని లోకల్ గ్యాంగ్‌లే అతని ఆచూకీ గురించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మనూకీ మరణంతో ఐసిస్‌కు పెద్ద దెబ్బేనని.. ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్లు బలహీనపడొచ్చనే ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఐసిస్ నేపథ్యం.. ఇరాక్ యుద్ధం తర్వాత “అల్-ఖైదా ఇన్ ఇరాక్” (AQI) అనే గ్రూప్ నుంచి విడిపోయి.. 2014లో అబూ బకర్ అల్-బగ్దాది నేతృత్వంలో “ఇస్లామిక్ స్టేట్”గా ఖలీఫత్(రాజకీయ-మతాధికార వ్యవస్థ) ప్రకటించింది. కాలక్రమంలో.. 2015 పారిస్ దాడులు, 2016 బ్రస్సెల్స్ బాంబులు, 2016 ఒర్లాండో షూటింగ్, మిడిల్ ఈస్ట్.. ఆఫ్రికాలో అనేక ఆత్మాహుతి దాడులు జరిపి తన మూలాలను విస్తరించుకుంది.అబూ బకర్ అల్-బగ్దాది (2013–2019), అబూ ఇబ్రాహీం అల్-హషిమీ అల్-ఖురైషీ (2019–2022), ఆపై అబూ అల్-హసన్ అల్-ఖురైషీ (2022), అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సైనీ అల్-ఖురైషీ (2022–2023)లు ఖలీఫాలుగా పని చేశారు. ప్రస్తుతం అబూ హఫ్స్ అల్-హషిమీ అల్-ఖురైషీ (2023 నుండి) కొనసాగుతున్నాడు. అమెరికా, భారత్, ఇరాక్ తోపాటు పలు దేశాలు ఐసిస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాయి. క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చిన ఐసిస్ నెట్వర్క్.. ప్రస్తుతం ఆఫ్రికా–ఆసియా ప్రాంతాల్లో చిన్నచిన్న గుంపులుగా కొనసాగుతోంది. -
చైనా ఇచ్చినవి చెత్తబుట్టలో పడేసి మరీ వెళ్లారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో స్నేహపూర్వకంగా మెలిగిన ట్రంప్.. మూడురోజులపాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల ఒప్పందాల మొదలు తైవాన్, ఇరాన్ యుద్ధం-హర్ముజ్ జలసంధి లాంటి సంక్లిష్టమైన అంశాలపైనా ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. అయితే.. పర్యటన ముగింపు వేళ జరిగిన ఓ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ పర్యటన ముగిసి.. మొత్తం బృందం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కే సమయంలో భద్రతా సిబ్బంది నుంచి మైక్ ద్వారా ఓ ఆదేశం వచ్చింది. అందులో.. Nothing from China allowed on the plane అని చెప్పారు. అంటే చైనా నుంచి ఏ వస్తువును తాము విమానంలోకి అనుమతించబోమని. అలా సిబ్బంది వాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. వాటిని సేకరించి అక్కడే ఏర్పాటు చేసిన చెత్తబుట్టలో పడేశారు. అలా పడేసిన వాటిల్లో.. ప్రెస్ పాస్‌లు, వైట్‌హౌస్ సిబ్బందికి ఇచ్చిన బర్నర్ ఫోన్లు, ప్రతినిధుల గుర్తింపు పిన్లు ఉన్నాయట. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ పూల్ ధృవీకరించింది.‘‘చైనా అధికారులు ఇచ్చిన ప్రతిదాన్ని అమెరికా సిబ్బంది సేకరించి, ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కే ముందు చెత్తబుట్టలో వేసేశారు. చైనాలో ఇచ్చిన ఏ వస్తువూ విమానంలోకి రాకూడదని ఆ సమయంలో వాళ్లు స్పష్టం చేశారు’’ అని న్యూయార్క్ పోస్ట్ వైట్‌హౌజ్ ప్రతినిధి ఎమిలీ గూడిన్ తెలిపారు. అయితే ట్రంప్‌నకు చైనా నుంచి ఏమైనా కానుకలు వచ్చాయా? వస్తే వాటిని అనుమతించారా? లేదంటే చెత్త బుట్టలోనే పడేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుల విషయంలోనే కాదు.. రష్యా, ఫ్రాన్స్, నార్త్ కొరియా ఇలా చాలా దేశాల అధినేతల విషయంలో సిబ్బంది కట్టుదిట్టమైన నిబంధనలు పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనల్లో భద్రతా కారణాల వల్ల కొన్ని వస్తువులను(ఎలక్ట్రానిక్ పరికరాలు, గుర్తింపు వస్తువులు) వాడకూడదనే నియమాలు ఉంటాయి. ఒకవేళ వాడినా.. క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే అనుమతిస్తారు. అలాగే కానుకల విషయంలోనూ అంతే. పరిస్థితిని బట్టి వాటిని అనుమతించకపోవడం ఉంటుందేమోగానీ.. మునుపెన్నడూ లేని రీతిలో చైనా పర్యటనలో అమెరికా అధ్యక్ష భద్రతా సిబ్బంది చెత్త బుట్టలో పడేయడం గమనార్హం. ట్రంప్ చైనా పర్యటనలో జరిగింది.. ఇంతదాకా ఏ అధినేత విషయంలో జరగలేదు. బహుశా చైనా ఇచ్చిన వస్తువులతో సర్వైలెన్స్ లేదంటే స్పైవేర్ ప్రమాదం ఉండొచ్చని అమెరికా భద్రతా బృందం భావించి ఉండొచ్చు. అమెరికా–చైనా సంబంధాల్లో ఉన్న అనుమానాలు, గూఢచర్య భయాలు కారణంగా తీసుకున్న నిర్ణయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మారని ఆంక్షలు..ఈ పర్యటనలో ఇరు దేశాల అధ్యక్షుల సమావేశాలు స్నేహపూర్వకంగా కనిపించినా.. భద్రతా, ప్రెస్ బృందాల మధ్య ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపించాయి. టెంపుల్ ఆఫ్ హెవెన్ వద్ద ట్రంప్–షీ సమావేశం సమయంలోనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కి ఆయుధం కారణంగా ప్రవేశం నిరాకరించడం చర్చనీయాంశమైంది. అలాగే అధ్యక్షుడు వెంట ప్రెస్ పూల్‌కి మోటర్కేడులోకి చైనా సిబ్బంది అనుమతించలేదు. దీంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి అమెరికా సిబ్బంది ఒత్తిడి చేసి వారిని లోపలికి తీసుకెళ్లారు. 2016 అప్పటి అధ్యక్షుడు ఒబామా పర్యటన (హాంగ్జౌ, G20 సదస్సు సందర్భంగా)లో అమెరికా–చైనా సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరిగాయి. “ఇది మా దేశం, మా విమానాశ్రయం” అంటూ ఓ చైనా అధికారి చెప్పిన మాట.. ఆ సమయంలో చాలా పాపులర్ అయ్యింది. -
మా చర్చలు చరిత్రాత్మకం
బీజింగ్: చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. స్వదేశానికి పయనమయ్యారు. ఆయన గురువారం, శుక్రవారం చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకున్నారు. తమ చర్చలను చరిత్రాత్మకమైనవి, మైలురాయిగా ఇద్దరు నేతలు అభివర్ణించారు. ఇరాన్ యుద్ధం, ద్వైపాక్షిక వాణిజ్య ఘర్షణలతో సహా పలు అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు. రాజధాని బీజింగ్‌లో చైనా అధినేతలు నివసించే, అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన జోంగ్నాన్హయ్లో చివరిరోజు ట్రంప్, జిన్‌పింగ్ సమావేశమయ్యారు. తమ చర్చలను ముగించారు. వారిద్దరూ ఆ ప్రాంగణంలో నడుస్తూ, మాట్లాడుకుంటూ, మధ్యమధ్యలో ఆగి తోటలోని చెట్లను, పువ్వులను చూస్తూ ముందుకు కదిలారు. చైనా పర్యటన విజయవంతమైందని ట్రంప్ ఉద్ఘాటించారు. ఇది మరపురాని పర్యటన అని అభివరి్ణంచారు. అనేక విషయాలపై చైనాతో అంగీకారానికి వచ్చామని తెలిపారు. ఇరుదేశాలు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అనేక సమస్యలను పరిష్కరించుకున్నాయని వెల్లడించారు. ఇది రెండు దేశాలకు, ప్రపంచానికి మేలు చేస్తుందన్నారు. అయితే, ఆ ఒప్పందాలు ఏమిటన్నది బయటపెట్టలేదు. జిన్‌పింగ్ తన పాత స్నేహితుడేనని, ఆయన పట్ల తనకు చాలా గౌరవం ఉందని, తమ మధ్య ఒక మంచి సంబంధాలున్నాయని ట్రంప్ స్పష్టంచేశారు. అమెరికా–చైనా సంబంధం చాలా ముఖ్యమైందని, అది మరింత మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఉమ్మడి అవగాహనకు వచ్చాం ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమని జిన్‌పింగ్ ఉద్ఘాటించారు. వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా–అమెరికా సంబంధాన్ని నిర్మించుకోవడానికి ఇరుపక్షాలు ఒక నూతన దృక్పథాన్ని ఏర్పరచుకున్నాయని వెల్లడించారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను స్థిరంగా ఉంచడం, వివిధ రంగాల్లో ఆచరణాత్మక సహకారాన్ని విస్తరించడం, వివాదాలను సముచిత రీతిలో పరిష్కరించుకోవడం, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై సంప్రదింపులు, సమన్వయాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఉమ్మడి అవగాహనకు చేరుకున్నామని స్పష్టంచేశారు. బోయింగ్ నుంచి చైనాకు 200 విమానాలు! అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి చైనా రాబోయే పదేళ్లలో 200 విమానాలు కొనుగోలు చేయనుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన స్వదేశానికి తిరిగివెళ్తూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. బోయింగ్ నుంచి విమానాల కొనుగోలుకు చైనా అంగీకరించిందని, జిన్‌పింగ్‌తో జరిగిన భేటీలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో 750 విమానాలను చైనా కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే చైనా కంపెనీలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ తెలిపారు. తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయించే ఒప్పందం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. పాకిస్తాన్‌కు మేలు చేయడానికే.. పాకిస్తాన్‌కు మేలు చేసే ఉద్దేశంతో ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై ఇక ఎలాంటి బాంబు దాడులు జరగవని స్పష్టం చేశారు. మరో దేశం(పాక్) చేసిన అభ్యర్థన మేరకు ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చామని చెప్పారు. పాకిస్తాన్‌కు సహాయం చేయాలనే ఉద్దేశంతో అలా చేశామని అన్నారు. త్వరలో అమెరికాకు జిన్‌పింగ్ షీ జిన్‌పింగ్ మరో ఐదారు నెలల్లో అమెరికాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. సమావేశాలు, ఫోన్‌కాల్స్, లేఖల ద్వారా సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి వారిద్దరూ అంగీకరించారని తెలిపారు. -
ట్రంప్‌ది మామూలు ట్రేడింగ్ కాదు!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక పెట్టుబడుల వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా బయటకు వచ్చిన ఆయన ఆర్థిక వెల్లడి (Financial Disclosure) నివేదిక, 2026 మొదటి త్రైమాసికంలో ఆయన ఖాతాల ద్వారా జరిగిన భారీ స్టాక్ ట్రేడింగ్‌ను బహిర్గతం చేసింది. అమెరికా ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్‌కు సమర్పించిన ఈ నివేదిక ప్రకారం.. జనవరి నుండి మార్చి మధ్య కేవలం 3 నెలల కాలంలోనే ట్రంప్ ఖాతాల ద్వారా ఏకంగా 3,600కు పైగా ఆర్థిక లావాదేవీలు జరగడం విశేషం.రూ. వేల కోట్ల ట్రేడింగ్ వాల్యూమ్!ఈ మూడు నెలల కాలంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువ సుమారు 220 మిలియన్ నుండి 750 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో వేల కోట్ల రూపాయలు) మధ్య ఉంటుందని అంచనా. ప్రముఖ వినోద, మీడియా సంస్థల్లో కూడా ట్రంప్ భారీగానే పెట్టుబడులు పెట్టారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీలో కనీసం 30,000 డాలర్లు పెట్టుబడి పెట్టగా.. డిస్నీకి సంబంధించిన ట్రేడింగ్ విలువ ఏకంగా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.టెక్ దిగ్గజాలపైనే గురి..ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్న ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల్లో ట్రంప్ ఖాతాల ద్వారా భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ (Microsoft), బ్రాడ్‌కామ్, అమెజాన్ (Amazon), యాపిల్ (Apple) స్టాక్స్‌లో 1 మిలియన్ నుండి 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఏఎండీ, ఇంటెల్, ఆల్ఫాబెట్ (Google), గోల్డ్‌మన్ శాక్స్, ఎయిర్‌బీఎన్‌బీ, డోర్‌డాష్, మైక్రాన్, బ్లూమ్ ఎనర్జీ స్టాక్స్‌లో 5,00,000 నుండి 1 మిలియన్ డాలర్ల కొనుగోళ్లు జరిగాయి."మాకు సంబంధం లేదు"ఈ ట్రేడింగ్ హడావుడిపై 'ది హఫ్ పోస్ట్' ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆర్గనైజేషన్ స్పందించింది. ఈ లావాదేవీలతో ట్రంప్‌కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. "ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టుబడులన్నీ పూర్తిగా విచక్షణాధికార ఖాతాల (Discretionary Accounts) ద్వారానే సాగుతాయి. థర్డ్-పార్టీ ఆర్థిక సంస్థలు నిర్వహించే ఆటోమేటెడ్ పెట్టుబడి ప్రక్రియలు, సిస్టమ్స్ ద్వారానే ఈ పోర్ట్‌ఫోలియోలు రీబ్యాలెన్స్ అవుతుంటాయి, ట్రేడ్లు జరుగుతుంటాయి. ఏ స్టాక్ కొనాలి, ఏది అమ్మాలి అనే నిర్ణయాల్లో ప్రెసిడెంట్ ట్రంప్‌కు కానీ, ఆయన కుటుంబానికి కానీ, ట్రంప్ ఆర్గనైజేషన్‌కు కానీ ఎలాంటి పాత్ర లేదు. ఏ ట్రేడింగ్ జరుగుతుందనే ముందస్తు సమాచారం కూడా వారికి ఉండదు." అని ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రతినిధి వివరించారు. -
అస్పష్ట ‘శిఖరాగ్రం’!
దశాబ్దకాలంగా ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక, ఇంధన రంగాల్లో పరస్పరం తలపడుతూ, వాటితోపాటే ఒకదానిపై మరొకటి అవిశ్వాసాన్ని దండిగా పెంచుకున్న రెండు అగ్ర రాజ్యాలు చర్చలకు సిద్ధపడ్డాయంటే ప్రపంచం చాలా ఆశిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం బీజింగ్ చేరుకున్నప్పుడు ఆయనకు లభించిన స్వాగత సత్కారాలు గమనించినా, శిఖరాగ్ర సమావేశం జరిగిన గురు, శుక్రవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు చూసినా అంతా సవ్యంగా ముగిసిందని అనిపిస్తుంది. ట్రంప్‌తో వచ్చిన ప్రతినిధి బృందం సామాన్యమైనది కాదు.భిన్నరంగాల్లో ప్రపంచాన్నేలుతున్న దిగ్గజ సంస్థల చీఫ్‌లు 16 మంది ఆ బృందంలో ఉన్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్‌ల సీఈఓ ఎలాన్ మస్క్, యాపిల్ చీఫ్ టిమ్ కుక్లతోపాటు ఎన్విడియా, క్వాల్కామ్, బ్లాక్‌రాక్, గోల్డ్‌మాన్ శాక్స్, బోయింగ్, మెటా సంస్థల సీఈఓలు వారిలో కొందరు. చైనాతో అద్భుతమైన ఒప్పందాలు కుదిరాయనీ, అవి ఇరు దేశాలకూ ఎంతో గొప్పవనీ ట్రంప్ ప్రకటించినా ఆ ఒప్పందాల వైనమేమిటో ఎవరికీ తెలియదు.బోయింగ్ సంస్థకు చెందిన 200 జెట్ విమానాలు వెంటనే, భవిష్యత్తులో మరో 750 కొనడానికి చైనా అంగీకరించిందనీ... అలాగే వందలకోట్ల డాలర్ల విలువైన సోయాబీన్స్ కొనుగోలు చేయడానికి కూడా ఒప్పుకున్నదనీ ట్రంప్ చివరిలో వివరించారు. కానీ అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలూ రాలేదు. లిఖితపూర్వక ఒప్పందాలు కుదిరిన దాఖలా లేదు. ప్రాథమిక చర్చలవరకూ జరిగి ఉంటాయన్నది దౌత్యరంగ నిపుణుల అభిప్రాయం. ఇరు దేశాలమధ్యా సాగిన సుంకాల యుద్ధం సామాన్యమైనది కాదు. ట్రంప్ సుంకాలు ప్రకటించిన ప్పుడల్లా చైనా దీటుగా స్పందించి ప్రతీకార సుంకాలు విధిస్తూ పోయింది. అరుదైన ఖనిజాల ఎగుమతుల్ని చైనా నిలిపేయటంతో అమెరికా విలవిల్లా డింది. ఇక కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం రెండూ హోరాహోరీ పోటీ పడుతున్నాయి. ఎన్విడియా అత్యాధునిక చిప్‌లు కావాలని చైనా కోరుతుండగా భద్రతా కారణాల రీత్యా కుదరదన్నది అమెరికా వాదన. బహుశా చైనా ఆశలు ఈడేరకపోవటంవల్ల... కొన్ని అంశాల్లో పట్టు సడలించటానికి అమెరికా నిరాకరించటంవల్ల ఒప్పందాలపై ప్రాథమిక చర్చలే సాగాయని అనుకోవాలి. కనీసం వచ్చే సెప్టెంబర్‌లో షీ అమెరికా పర్యటన నాటికైనా స్పష్టత వస్తే మంచిదే.ప్రపంచం మునుపటి తీరుగా లేదని మాత్రం ట్రంప్‌కు అర్థమై ఉంటుంది. ఎందుకంటే తైవాన్ విషయంలో తమకంటూ ఒక ‘రెడ్‌లైన్’ ఉన్నదని షీ జిన్‌పింగ్ నిర్మొహ మాటంగా చెప్పారని మీడియా అంటున్నది. అయితే తైవాన్‌పై గత వైఖరే కొనసాగుతుందని ట్రంప్‌తో వచ్చిన అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో చెప్పటం మినహా మరేదీ బయటకు రాలేదు. తమ సొంతమని చైనా చెబుతున్న తైవాన్ను స్వతంత్ర, స్వయంపాలిత, ప్రజాస్వామిక దేశంగా మనుగడ సాగించనీయాలన్నది అమెరికా వాదన.1979 నుంచి దానితో సంబంధాలు నెరపుతున్నా అవన్నీ ‘అనధికారమైనవి’. కానీ తైవాన్‌కు ఆయుధ విక్రయం జరపాలని ఇటీవల అమెరికా అనుకోవటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే ఈ ‘రెడ్‌లైన్’ హెచ్చరిక. ఇక ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధివద్ద ఉద్రిక్తతలపైనా ఇరు దేశాలూ ఒకే అభిప్రాయంతో ఉన్నట్టు పైకి అంటున్నా వాటిపైనా స్పష్టత లేదు. ఈ పర్యటన తర్వాత హార్మూజ్ వద్ద సామరస్యత ఏర్పడు తుందేమో చూడాలి.దౌత్య పరిభాషలో మర్యాదపూర్వకమైన పదాలు చాలా ఉంటాయి. అందులో రెండు దేశాలమధ్యా కుదిరిందని చెబుతున్న విజన్ కొత్తది. ‘నిర్మాణాత్మక వ్యూహాత్మక స్థిరత్వం’ అనే ఈ విజన్ అర్థం ‘పూర్తిగా స్నేహితులం కాలేకపోయినా, శత్రువులుగా మారి యుద్ధా నికి దిగొద్దు’ అన్నదే. సారాంశంలో పూర్వపు సోవియెట్ అధినేత కృశ్చేవ్ బోధించిన ‘శాంతియుత పోటీ’ వంటిది. నిజానికి ట్రంప్ పర్యటన ఆంతర్యం ఇదే. తమతో సరి సమాన స్థాయికి ఎదిగిన చైనాతో ఇరాన్, తైవాన్ ల విషయంలో స్పర్థ రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. ఆ పరిమితుల్లో చూస్తే ట్రంప్ పర్యటన విజయవంతమైందను కోవాలి. కానీ ట్రంప్ ఏలుబడిలో అమెరికా ఏ మేరకు ఒదిగి ఉంటుంది... చైనా ఏ స్థాయి వరకూ తగ్గివున్నట్టు కనబడుతుందన్నది రానున్న కాలమే చెబుతుంది. -
ట్రంప్, జిన్‌పింగ్ భేటీపై వివాదం.. గీతా గోపీనాథ్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్, జిన్‌పింగ్ మధ్య వరుస కీలక భేటీ జరిగాయి. ఈ భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా నిరోధించడం వంటి వాటిపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరాన్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు అందకూడదని ఇరువురు నేతలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారు. చైనాలో అమెరికన్ ఉత్పత్తులకు మార్కెట్‌ను విస్తరించడం, యూఎస్ పరిశ్రమల్లో చైనా పెట్టుబడులను పెంచడం సహా ఆర్థిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపైనా ఇరువురు చర్చించుకున్నారు.ఈ సమావేశంలో ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల(ఫెంటానిల్) ప్రవాహాన్ని అరికట్టడంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదే సమయంలో చైనాలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలని ట్రంప్, జిన్‌పింగ్ నొక్కిచెప్పారు. హార్మూజ్ స్వేచ్ఛాయుత నౌకాయానానికి అవకాశం ఉండాలని పేర్కొన్నారు. జలసంధి సైనికీకరణకు, వినియోగానికి సుంకం విధించే ఏ ప్రయత్నానికైనా చైనా వ్యతిరేకమని జిన్‌పింగ్ స్పష్టంచేశారు.భవిష్యత్తులో హార్మూజ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, అమెరికా నుంచి మరింత చమురును కొనుగోలు చేయడానికి ఆయన ఆసక్తి వ్యక్తంచేశారు. 2026 సంవత్సరం చైనా–అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే చరిత్రాత్మక సంవత్సరం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ట్రంప్ అన్నారు. చర్చలు ముగిసిన తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ బీజింగ్ సిటీలోని ప్రఖ్యాత టెంపుల్ ఆఫ్ హెవెన్ను సందర్శించారు.మీటింగ్ వివాదం.. బీజింగ్‌లో జరిగిన ట్రంప్-జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశంలో మహిళల గైర్హాజరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో పూర్తిగా పురుషులే ఉండటం విమర్శలకు దారితీసింది. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో జరిగిన ఈ సమావేశంలో ట్రంప్, జిన్‌పింగ్‌తో పాటు ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సమావేశ టేబుల్ వద్ద ఒక్క మహిళ కూడా లేకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్రవేత్త గీతా గోపీనాథ్ ఈ ఘటనను “మెరిటోక్రసీ ముగింపు చిత్రపటం”గా అభివర్ణించారు.మరోవైపు.. కొందరు విశ్లేషకులు కూడా స్పందించి లింగ సమానత్వం లోపం స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. అమెరికా–చైనా వంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మహిళల ప్రాతినిధ్యం లేకుండా సమావేశం జరపడం ప్రతీకాత్మకంగా ప్రతికూల సంకేతం అని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ సంఘటన అంతర్జాతీయ దౌత్యంలో మహిళల పాత్రపై కొత్త చర్చలకు దారితీసింది.🚨JUST IN: The White House has just released new details from President Trump’s bilateral sit-down with Xi JinpingSeveral major wins are already being highlighted:- Cracking down on the flow of fentanyl precursors from China into the United States - Pushing China to buy… pic.twitter.com/8Y1Sgr81cF— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) May 14, 2026భేటీ సందర్భంగా ప్రధానాంశాలుసైబర్ భద్రతా హెచ్చరికలు: అమెరికా ప్రతినిధులకు చైనాలో కమ్యూనికేషన్లు పర్యవేక్షణలో ఉండవచ్చని హెచ్చరించారు. అందుకే బర్నర్ ఫోన్లు, కొత్త పరికరాలు వాడారు.ఇరాన్‌పై చర్య సంకేతాలు: ట్రంప్ “to be continued!” అంటూ ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగవచ్చని సూచించారు.తైవాన్ ఉద్రిక్తతలు: తైవాన్ సమస్యను తప్పుగా నిర్వహిస్తే అమెరికా–చైనా సంబంధాలు “ప్రమాదకర స్థితి”లోకి వెళ్తాయని షీ హెచ్చరించారు.ఆర్థిక ఒప్పందాలు: చైనా 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.థూసిడైడ్స్ ట్రాప్: షీ, అమెరికా “థూసిడైడ్స్ ట్రాప్”ను అధిగమించాలి అని సూచించారు.ఇరాన్ మధ్యవర్తిత్వం: షీ, ఇరాన్ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమని తెలిపారు.ప్రధాన ఆర్థిక ఒప్పందాలుబోయింగ్ విమానాల కొనుగోలుచైనా 200 బోయింగ్ జెట్లు కొనుగోలు చేయడానికి అంగీకరించింది.ఇది దాదాపు దశాబ్దం తర్వాత అమెరికా విమానాలపై చైనా చేసిన మొదటి పెద్ద ఆర్డర్.వ్యవసాయ ఉత్పత్తులుఅమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు పెంచడానికి చైనా అంగీకరించింది.ఇది అమెరికా రైతులకు పెద్ద మార్కెట్ అవకాశాన్ని కల్పిస్తుంది.అమెరికా చమురు కొనుగోలుచైనా అమెరికా నుండి మరిన్ని క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది.దీని లక్ష్యం హార్ముజ్ జలసంధిపై ఆధారాన్ని తగ్గించడం.మార్కెట్ యాక్సెస్అమెరికా కంపెనీలకు చైనా మార్కెట్లలో విస్తృత యాక్సెస్ ఇవ్వబడింది.ఇది టెక్నాలజీ, ఎనర్జీ, మరియు తయారీ రంగాలకు కొత్త అవకాశాలు తెస్తుంది.చైనా పెట్టుబడులుఅమెరికాలో పెట్టుబడులు పెంచడానికి చైనా అంగీకరించింది.ఇది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. -
తైవాన్ కోసం యుద్ధానికైనా సిద్ధమే!
బీజింగ్: తైవాన్ విషయంలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ తన మనసులోని మాటను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నేరుగా చెప్పేశారు. తైవాన్ను ఎప్పటికైనా చైనాలో విలీనం చేసుకోక తప్పదని పరోక్షంగా స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎవరు అడ్డుతలిగినా లెక్కచేయబోమని పేర్కొన్నారు. తైవాన్ అంశంలో సరిగ్గా వ్యవహరించకపోతే చైనా, అమెరికాల మధ్య వివాదాలు, తీవ్ర సంఘర్షణలు తలెత్తవచ్చని ట్రంప్‌తో జిన్‌పింగ్ అన్నారు. తైవాన్ కోసం యుద్ధానికైనా సిద్ధమని సంకేతాలిచ్చారు. రాజధాని బీజింగ్‌లో ట్రంప్, జిన్‌పింగ్ గురువారం సమావేశమయ్యారు. ఇరాన్ యుద్ధం, ఇంధన భద్రత, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై దాదాపు రెండు గంటలపాటు విస్తృతస్థాయిలో చర్చించుకున్నారు. ప్రపంచ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు ఉమ్మడిగా తేల్చిచెప్పారు. ఈ ఏడాది సెపె్టంబర్ 24న వైట్‌హౌస్‌ను సందర్శించాలంటూ జిన్‌పింగ్ దంపతులను ట్రంప్ ఆహ్వానించారు. నిర్మాణాత్మక ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడమే ధ్యేయంగా చైనా, అమెరికాలు ఒక నూతన విధానంపై అంగీకారానికి వచ్చాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా–అమెరికా సంబంధాలను నిర్మించాలనే కొత్త విధానంపై ట్రంప్‌తో ఏకీభవించానని ఉద్ఘాటించారు. ఈ నూతన విధానం రాబోయే మూడేళ్లు, ఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని, దీనిని ఇరు దేశాల ప్రజలు, అంతర్జాతీయ సమాజం కూడా స్వాగతించాలని చెప్పారు. చైనా–అమెరికా సంబంధాల్లో తైవాన్ సమస్య అత్యంత ముఖ్యమైన అంశంగా మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను సరిగ్గా పరిష్కరిస్తే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో స్థిరత్వం నెలకొంటుందని.. లేనిపక్షంలో సంఘర్షణలను ఎదుర్కోవాల్సి రావొచ్చని, ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని జిన్‌పింగ్ వెల్లడించారు. అందుకే తైవాన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాకు సూచించారు. ఇది చరిత్రాత్మక సంవత్సరం ట్రంప్, జిన్‌పింగ్ భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా నిరోధించడం వంటి వాటిపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరాన్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు అందకూడదని ఇరువురు నేతలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారు. చైనాలో అమెరికన్ ఉత్పత్తులకు మార్కెట్‌ను విస్తరించడం, యూఎస్ పరిశ్రమల్లో చైనా పెట్టుబడులను పెంచడం సహా ఆర్థిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపైనా ఇరువురు చర్చించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల(ఫెంటానిల్) ప్రవాహాన్ని అరికట్టడంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదే సమయంలో చైనాలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలని ట్రంప్, జిన్‌పింగ్ నొక్కిచెప్పారు. హార్మూజ్ స్వేచ్ఛాయుత నౌకాయానానికి అవకాశం ఉండాలని పేర్కొన్నారు. జలసంధి సైనికీకరణకు, వినియోగానికి సుంకం విధించే ఏ ప్రయత్నానికైనా చైనా వ్యతిరేకమని జిన్‌పింగ్ స్పష్టంచేశారు. భవిష్యత్తులో హార్మూజ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, అమెరికా నుంచి మరింత చమురును కొనుగోలు చేయడానికి ఆయన ఆసక్తి వ్యక్తంచేశారు. 2026 సంవత్సరం చైనా–అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే చరిత్రాత్మక సంవత్సరం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ట్రంప్ అన్నారు. చర్చలు ముగిసిన తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ బీజింగ్ సిటీలోని ప్రఖ్యాత టెంపుల్ ఆఫ్ హెవెన్ను సందర్శించారు. ట్రంప్ గౌరవార్థం జిన్‌పింగ్ విందు చైనా పర్యటనకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం జిన్‌పింగ్ ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. చైనా, అమెరికాలు సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలని చెప్పారు. సంబంధాలను విజయవంతం చేయాలి, ఎప్పటికీ చెడగొట్టకూడదని అన్నారు. పరస్పర సహకారం వల్ల రెండు దేశాలూ లాభపడతాయని, ఘర్షణ వల్ల నష్టపోతాయని వ్యాఖ్యానించారు. మన రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా కలిసి పని చేయాలన్నారు. అమెరికా–చైనా సంబంధం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ద్వైపాక్షిక సంబంధమని ట్రంప్ ఉద్ఘాటించారు. ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ఇరు దేశాలు సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని వివరించారు. జిన్‌పింగ్‌ను చాలా గొప్ప నాయకుడిగా ట్రంప్ అభివరి్ణంచారు. ఇదిలా ఉండగా, ఒక అమెరికా అధ్యక్షుడు చైనాను సందర్శించడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2017లో అప్పడు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ చైనాలో పర్యటించారు. -
"అదే జరిగితే చైనా-అమెరికా మధ్య యుద్ధం"
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. తైవాన్ విషయంలో గనుక అమెరికా తలదూర్చితే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని జన్‌పింగ్ ట్రంప్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు బీజింగ్ మీడియా కథనాలు పేర్కొన్నాయిప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో ఉన్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఆయన చైనా బయిలుదేరారు. ఈ రోజు ఇరువురు అగ్రనేతల మధ్య భేటీ జరిగింది. అయితే తైవాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి జిన్‌పింగ్ నేరుగా కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.జిన్‌పింగ్, ట్రంప్‌తో మాట్లాడుతూ.. స్వయంప్రతిపత్తి కలిగిన తైవాన్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య "ఘర్షణ" తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించినట్లు ఆ దేశ మీడియా కథనాలు వెల్లడించాయి. చైనా-అమెరికా సంబంధాల కంటే తైవాన్ అంశం చైనాకు అత్యంత కీలకమైనదని జిన్‌పింగ్ ట్రంప్‌తో పేర్కొన్నట్లు తెలుస్తోంది. చైనా,అమెరికా పోటీదారులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని పరస్పర సహకారం రెండు దేశాలకు ఎంతో లాభదాయకమని ఆయన పేర్కొన్నారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.కాగా తైవాన్ విషయంలో అమెరికా వ్యూహాత్మకంగా స్పందిస్తోంది. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన రక్షణ ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తుంది. కాగా దీనిని చైనా తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌తో తొలిరోజు భేటీలోనే జిన్‌పింగ్ చైనా విధానాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. -
మీరు గొప్ప వ్యక్తి.. బంగారు భవిష్యత్తు నిర్మిద్దాం: ట్రంప్
తొమ్మిదేళ్ల తర్వాత తమ దేశంలో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చైనా ఘన స్వాగతం పలికింది. రెడ్‌కార్పెట్ పరిచి సైనిక గౌరవ వందనం సమర్పించింది. అనంతరం గ్రేట్ హాల్ పీపుల్ వద్ద ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కరచలనం చేశారు. ఈ ఇద్దరూ హాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆపై మీడియా ముఖంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు గొప్ప వ్యక్తి. మీకు స్నేహితుడిని కావడం.. మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది. మనం కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించబోతున్నాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే తనతో పాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి వ్యాపార నాయకులను చూపిస్తూ.. “మీకు గౌరవం తెలిపేందుకు మాత్రమే అత్యుత్తమ వ్యక్తులు ఇక్కడికి తరలి వచ్చారు” అని ట్రంప్ జిన్‌పింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మనవి కామన్ ఇంట్రెస్టులు.. స్వల్ప విబేధాలు. ఇప్పటిదాకా.. సమస్యలు వచ్చినప్పుడు మీరు నన్ను సంప్రదించేవారు, నేను మిమ్మల్ని సంప్రదించేవాడిని. చాలా త్వరగా పరిష్కారం కనుగొనగలిగాం. ఇక నుంచి మనం రైవల్స్‌గా ఉండకూదు అంటూ ట్రంప్ జిన్‌పింగ్‌ను ఆకాశానికెత్తారు. చైనా-అమెరికా ద్వైపాక్షిక చర్చల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా.. మన మధ్య జరగబోయే సమావేశం ఎంతో గొప్పది. ప్రపంచంలోని బెస్ట్ బిజినెస్ లీడర్స్‌ను తీసుకొచ్చా. రండి.. బంగారు భవిష్యత్తు నిర్మించుకుందాం అని ట్రంప్ ఉద్ఘాటించారు."It's an honor to be with you, it's an honor to be your friend, and the relationship between China and the USA is going to be better than ever before." - President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/WZkoGeVqhv— The White House (@WhiteHouse) May 14, 2026అనంతరం.. జీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘‘ట్రంప్‌నకు, అమెరికన్లను ముందస్తుగా 250 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచం ఇప్పుడు క్రాస్ రోడ్లో ఉంది. పాత ట్రాప్స్నుంచి బయటకు వద్దాం. ప్రపంచ సవాళ్లను కలిసి ఎదుర్కొందాం. ఇరాన్‌పై ఒత్తిడి పెంచి.. హర్ముజ్ తెరిపిస్తా’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చైనా పర్యటనలో ట్రంప్‌తో పాటు అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌తో సహా 16 మంది సీఈవోలు వెళ్లారు. నేడు, రేపు ఈ ఇద్దరు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించినప్పటికీ, టారిఫ్స్, టెక్నాలజీ, ట్రేడ్‌తో పాటుగా తైవాన్‌పై అమెరికా వైఖరి, ఇరాన్ యుద్ధం వంటి అంశాలపైనా చర్చలు జరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చైనాలో అడుగుపెట్టిన ట్రంప్.. ఎవరు స్వాగతం పలికారంటే?
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా చేరుకున్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, పలు సాంకేతిక సంస్థల ప్రధాన కార్యనిర్వాహకులు ఉన్నారు. బీజింగ్‌లోని విమానాశ్రయంలో ట్రంప్‌నకు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ స్వాగతం పలికారు. చైనా అగ్రనేతల్లో హాన్ ఒకరు.ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు ఆయనను పంపడం ద్వారా అమెరికా అధ్యక్షుడికి చైనా అమిత ప్రాధాన్యం, గౌరవం ఇస్తోందని భావిస్తున్నారు. గతసారి 2017 పర్యటన సమయంలో స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచీ అనే తక్కువ స్థాయి నేతను పంపారు. గత ఏడాది ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ హాన్ హాజరయ్యారు. కాగా, విమానాశ్రయ రన్‌వే నుంచి మోటర్‌కేడ్‌లో ట్రంప్ వెళ్లారు. బీజింగ్‌లో వచ్చే రెండు రోజుల పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, ఇరాన్ యుద్ధం, తైవాన్‌కు అమెరికా ఆయుధాల విక్రయం సహా పలు అంశాలపై షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ చర్చించనున్నారు. ద్వైపాక్షిక చర్చలు, అధికారిక విందులో పాల్గొంటారు. “మేము రెండు మహాశక్తులం. సైనిక బలంలో భూమిపై అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా. చైనాను 2వ స్థానంలో భావిస్తారు” అని ట్రంప్ కొన్ని గంటల క్రితం చెప్పారు.బీజింగ్‌లో జరుగుతున్న ఈ సదస్సు దాదాపు 10 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో చేస్తున్న తొలి పర్యటనగా నిలిచింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో సున్నితమైన వాణిజ్య సంధిని కొనసాగిస్తూ కొన్ని ఒప్పందాలు చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చైనాలో ట్రంప్ గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో స్వాగత కార్యక్రమం, యునెస్కో వారసత్వ కట్టడం టెంపుల్ ఆఫ్ హెవెన్ సందర్శన, అధికారిక విందు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
ట్రంప్ ఈ విషయాల జోలికి రాకండి..!
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనకు శ్రీకారం చుట్టారు. కొద్ది సేపటి క్రితమే బీజింగ్‌కు బయిలుదేరారు. అయితే ఈ పర్యటనలో ఏ విషయాలపై ఒప్పంద జరగనుందా అని ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ ఎట్టిపరిస్థితుల్లో తమ దేశానికి సంబంధించిన నాలుగు అంశాల జోలికి వెళ్లద్దని వార్నింగ్ ఇస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.చైనా- అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే టాఫ్ ఎకానమీ కలిగిన దేశాలు కావడంతో అధిపత్యం కోసం పరస్పరం పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే మిడిల్ ఈస్ట్ యుద్ధంలో సైతం చైనా పరోక్షంగా ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. వీటిని చైనా కొట్టిపడేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటనకు బయిలుదేరారు. ఆ నేపథ్యంలో ట్రంప్ అస్సలు.. ఈ రెడ్‌లైన్ అంశాలు చర్చించకూడదని చైనా పేర్కొంది. నాలుగు ప్రధానమైన అంశాలుతైవాన్ అంశం ఇది చైనాకు అత్యంత కీలకం.ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులు వీటి పేరుతో చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.దేశ రాజకీయ వ్యవస్థ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోని సోషలిస్ట్ వ్యవస్థను గౌరవించాలి.చైనా అభివృద్ధి హక్కు చైనా ఆర్థిక, సాంకేతిక వృద్ధిని అడ్డుకోకూడదు.తైవాన్ వివాదం అనేది ప్రస్తుతం చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. తైవాన్‌కు అమెరికా ఆయుధాలను విక్రయించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తైవాన్‌కు 11 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది, ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఒప్పందం. దీనిపై చైనా మండిపడుతుంది.తైవాన్ తమ భూభాగంలో భాగమని, ఇది పూర్తిగా తమ అంతర్గత విషయమని ఈ విషయంతో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. కాగా 2017 తర్వాత ట్రంప్ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి. ట్రంప్ గతంలో ప్రకటించిన అధిక పన్నుల యుద్దం తర్వాత ఆయన చైనాకు వెళుతున్నారు. దీంతో ఏం జరగనుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
చైనా పర్యటనకు ట్రంప్.. ఇరాన్‌పై కొత్త వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, ప్రపంచ చమురు మార్కెట్ ఆందోళనలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఇరాన్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గురించి చైనాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఇరాన్ ఇంకా తమ కంట్రోల్‌నే ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యంగా తైవాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై ట్రంప్, జిన్‌పింగ్ మధ్య కీలక సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బలహీనమైన వాణిజ్య సంబంధాల కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపేందుకు ట్రంప్ మంగళవారం వైట్‌హౌస్ నుండి చైనా పర్యటనకు బయలుదేరారు. మూడు రోజుల పాటు ట్రంప్.. చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్బంగా తీవ్రమవుతున్న భౌగోళిక, రాజకీయ, వాణిజ్యపరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ అంతటా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా-చైనా సంబంధాలలో ఒక కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది.ఇక, ఈ పర్యటన సందర్భంగా ఇరాన్ వివాదం ప్రాముఖ్యతను తగ్గించి చూపడానికి అమెరికా అధికారులు ఇటీవలి రోజుల్లో ప్రయత్నిస్తుండగా, జిన్‌పింగ్‌తో తన చర్చలలో ఈ అంశం ఎంత ప్రముఖంగా ఉంటుందనే దానిపై ట్రంప్ మిశ్రమ సంకేతాలు ఇచ్చారు. బీజింగ్‌కు వెళ్లేందుకు మెరైన్ వన్ హెలికాప్టర్ ఎక్కే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ట్రంప్..‘మేము చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఇరాన్ వాటిలో ఒకటి అని నేను చెప్పను. ఎందుకంటే ఇరాన్ చాలా వరకు మా అదుపులోనే ఉంది. ఇరాన్ విషయంలో మాకు ఎలాంటి సహాయం అవసరమని నేను అనుకోవడం లేదు. శాంతియుతంగానైనా లేదా మరే విధంగానైనా, మేము దీనిని గెలుస్తాము. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం సహా మొత్తం యుద్ధ యంత్రాంగం పూర్తిగా ధ్వంసమైంది. వాళ్లు సరైన నిర్ణయం తీసుకుంటారు.. లేకపోతే మేం మిగతా పని పూర్తి చేస్తాం. దిగ్బంధనం 100 శాతం ప్రభావవంతంగా ఉంది. ఏదో ఒక విధంగా ఇది అమెరికాకు చాలా అనుకూలంగా మారుతుంది. ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా చమురు ఉత్పత్తి పెరుగుతుంది' అని ట్రంప్ తెలిపారు.నాటోపై ట్రంప్ అసంతృప్తిఈ సందర్భంగా నాటోపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు. 'నాటో నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. మాకు అవసరమైన సమయంలో నాటో మాతో లేదు. నిజానికి మాకు నాటో అవసరం లేదు. కానీ అవసరమైతే కూడా వాళ్లు ముందుకు రాలేదు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే మాత్రం కూటమి భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం ప్రపంచ భద్రతా వ్యవస్థలో కీలక అంశంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధానంగా సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు.President Donald J. Trump departs Washington D.C. for a historic visit to China! pic.twitter.com/8Qok0Xcqcd— The White House (@WhiteHouse) May 12, 2026చైనా పర్యటనలో ట్రంప్‌తో మస్క్, టిమ్ కుక్.. బీజింగ్‌తో కొత్త వ్యాపార ఒప్పందాల కోసం తన ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో, ట్రంప్ ఈ పర్యటనకు ఎలాన్ మస్క్, టిమ్ కుక్‌తో సహా పలువురు అగ్రశ్రేణి అమెరికన్ వ్యాపార నాయకులను తీసుకువచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో బోయింగ్ విమానాలు, అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన సరఫరాలకు సంబంధించిన కొనుగోళ్లను కూడా చైనా ప్రకటించే అవకాశం ఉంది. సుమారు 500 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్లు, డజన్ల కొద్దీ జీఈ-పవర్డ్ వైడ్‌బాడీ విమానాల కోసం ఒప్పందంపై బోయింగ్, చైనా అధికారులు చర్చిస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇది ఖరారైతే, 2017 తర్వాత చైనాకు ఇది మొదటి ప్రధాన బోయింగ్ ఆర్డర్ అవుతుంది. అలాగే విమానయాన చరిత్రలోనే అతిపెద్ద విమాన ఒప్పందంగా నిలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చైనా నుండి అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణాను అనుమతిస్తున్న వాణిజ్య సంధిని పొడిగించడంపై కూడా ఇరుపక్షాలు చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటనలో పొడిగింపునకు అంగీకారం కుదురుతుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు.తైవాన్, అమెరికా సంబంధాలపై.. ఇక, అంతకుముందు.. తైవాన్, ఇరాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై అమెరికా అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. తైవాన్ అంశం ట్రంప్, జిన్‌పింగ్ మధ్య గత కొన్ని సమావేశాల్లో కూడా చర్చకు వచ్చిన విషయమేనని తెలిపారు. అయినప్పటికీ అమెరికా పాలసీలో మార్పు చోటుచేసుకోలేదని, ఇకముందూ అలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. తైవాన్‌కు ఆయుధాల విక్రయాల విషయంలో కూడా అమెరికా తన మద్దతును కొనసాగిస్తోందని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ తొలి ఏడాదిలోనే గత ప్రభుత్వ నాలుగేళ్ల కాలంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో తైవాన్‌కు రక్షణ సామగ్రి విక్రయాలకు ఆమోదం లభించిందని వెల్లడించారు.ఇటీవల తైవాన్ ప్రభుత్వం అమెరికా సైనిక పరికరాల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. దాదాపు 780 బిలియన్ తైవాన్ డాలర్ల వ్యయ పరిమితితో ఈ బిల్లును ఆమోదించినట్లు సమాచారం. అయితే ఇందులో కొన్ని కీలక రక్షణ అంశాలకు నిధులు కేటాయించకపోవడం నిరాశ కలిగించిందని అమెరికా అధికారులు వ్యాఖ్యానించారు. మొదట ప్రతిపాదించిన పూర్తి ప్యాకేజీకి నిధులు కేటాయించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. -
ఒబామాను అరెస్టు చేయాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అరెస్టు చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన పరోక్ష పిలుపునిచ్చారు. 2016 ఎన్నికల సమయంలో రష్యా జోక్యంపై జరిగిన దర్యాప్తును ఒక ‘కుట్ర’గా అభివర్ణిస్తూ, ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్టును ట్రంప్ రీ-షేర్ చేశారు.2016లో తన ఎన్నికల ప్రచారాన్ని దెబ్బతీసేందుకు ఒబామా నేతృత్వంలోని యంత్రాంగం కల్పిత ఇంటెలిజెన్స్ సమాచారంతో ‘మోసపూరిత’ దర్యాప్తుకు తెరలేపిందని సదరు పోస్టులో పేర్కొన్నారు.రష్యా దర్యాప్తును అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుంభకోణంగా ట్రంప్ పదేపదే అభివర్ణిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక పత్రాలను వెల్లడించినందుకు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌ను ఆయన ప్రశంసించారు.కాగా ట్రంప్ చర్యను డెమొక్రాట్లు, న్యాయ నిపుణులు తీవ్రంగా ఖండించారు. ఒబామా తప్పు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఇవన్నీ కేవలం ‘కుట్ర సిద్ధాంతాలే’నని కొట్టిపారేశారు. రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.మరోవైపు, ట్రంప్ మద్దతుదారులు ఈ పోస్టును స్వాగతించారు. ‘డీప్ స్టేట్’ అవినీతిని అంతం చేసే ప్రక్రియలో భాగంగా దీన్ని చూస్తున్నారు. దీని ప్రభావంతో సోషల్ మీడియాలో #ArrestObama అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై వైట్ హౌస్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తాజా పరిణామాలు అమెరికా రాజకీయాల్లో నెలకొన్న లోతైన విభజనను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. -
ఇరాన్‌కు ట్రంప్ ‘ఏఐ వార్నింగ్’..
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ మేఘాలను కమ్ముకొనేలా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన ఏఐ (కృత్రిమ మేధ) చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధ విమానాలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నట్లు ఉన్న ఈ కాల్పనిక చిత్రాలు మళ్లీ యుద్ధం తప్పదా? అన్న సంకేతాలను పంపుతున్నాయి.‘బింగ్.. బింగ్.. గాన్!’ట్రంప్ షేర్ చేసిన ఒక చిత్రంలో.. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ ఆయుధంతో ఇరాన్ జెండా ఉన్న విమానాన్ని గాలిలోనే పేల్చివేస్తున్నట్లు ఉంది. దీనికి "లేజర్స్: బింగ్, బింగ్, గాన్!!" అనే శీర్షికను ఆయన జోడించారు. మరో చిత్రంలో ఇరాన్‌కు చెందిన 'ఫాస్ట్ బోట్ల' సమూహంపై అమెరికా డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు చిత్రీకరించారు. దీనికి "బై బై, ఫాస్ట్ బోట్స్" అని క్యాప్షన్ ఇచ్చారు.‘లైఫ్ సపోర్ట్’పై కాల్పుల విరమణ!గల్ఫ్ రీజియన్‌లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక ఎంతో కాలం నిలవదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. చర్చల పునరుద్ధరణ కోసం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. "ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ‘లైఫ్ సపోర్ట్’ మీద ఉంది. తన ప్రియమైన వారు బతికే అవకాశం కేవలం ఒక శాతమే ఉందని డాక్టర్ చెప్పే పరిస్థితిలో ఆ ఒప్పందం ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.యుద్ధానికే మొగ్గు?హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మాటిమాటికీ మూసివేయడం, చర్చల పట్ల టెహ్రాన్ మొండి వైఖరితో ట్రంప్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా 'పూర్తి విజయం' సాధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్‌పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించే అంశాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ (CNN) కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా శాంతి ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. -
ఇరాన్ యుద్ధంలో పాక్ దొంగ నాటకాలు?
పశ్చిమాసియా యుద్ధంలో తమది శాంతిదూత పాత్ర అని పాకిస్తాన్ మొదటి నుంచి చెబుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ మాత్రం కేవలం మధ్యవర్తిగానే చూస్తున్నాయి. ఇజ్రాయెల్ అయితే ఓ అడుగు ముందుకేసి పాక్ పాత్రపై అనుమానాలు సైతం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఇప్పుడు సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.యుద్ధంలో ఇరాన్‌కు పాకిస్తాన్ సహాయం చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఇందుకోసం తన కీలక ఎయిర్‌బేస్ నూర్ ఖాన్‌ను ఇరాన్ సైనిక విమానాలకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చిందని ఓ సంచలనాత్మక కథనం తెరపైకి వచ్చింది. పైగా అమెరికా అధికారులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ ఓ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ ప్రారంభంలో కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్‌కు చెందిన కొన్ని సైనిక విమానాలను పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ (రావల్పిండి)కి తరలించిందని సమాచారం. వాటిలో ఒకటి RC-130 రికానైసెన్స్ విమానం కూడా ఉందని తెలుస్తోంది. ఈ తరలింపులు అమెరికా దాడుల నుంచి మిగిలిన ఇరాన్ సైనిక ఆస్తులను రక్షించడమే లక్ష్యమని అంచనా వేస్తున్నాం అని అధికారులు వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ కథనం పేర్కొంది.ఈ సమాచారం వెలుగులోకి రావడంతో ఇస్లామాబాద్ మధ్యవర్తి పాత్రపై కొత్త ప్రశ్నలు తలెత్తాయి. తాజా నివేదికపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్పందించారు. ‘‘ఈ సమాచారం నిజమైతే, పాకిస్తాన్ మధ్యవర్తి పాత్రను మళ్లీ సమీక్షించాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.ట్రంప్ ఊరుకుంటారా?ఇప్పటికే ఇరాన్ పంపిన ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించారు. దీంతో శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇరాన్‌కు సాయం తేలిందని ట్రంప్ భావిస్తే పాక్‌కు చిక్కులు తప్పకపోవచ్చనే విశ్లేషణ నడుస్తోంది. ఇరాన్–అమెరికా చర్చల్లో దాని పాత్రను తగ్గించే అవకాశమో లేదంటే ఆంక్షలు విధించడమో చేయొచ్చని భావిస్తున్నారు. పాక్–చైనా సన్నిహిత సంబంధాల కారణంగా.. ట్రంప్ దీనిని వ్యూహాత్మకంగా కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు.పాక్ వివరణ.. పాకిస్తాన్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. నూర్ ఖాన్ బేస్ నగర మధ్యలో ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో విమానాలు నిలిపితే ప్రజల కంటికి దూరంగా ఉంచడం అసాధ్యం అని ఓ సైనికాధికారి సీబీఎస్ న్యూస్‌కు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇరాన్ కొన్ని పౌర విమానాలను ఆఫ్ఘానిస్తాన్‌కు తరలించినట్లు కూడా ఆ కథనం పేర్కొంది. తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ వార్తలను కొట్టిపారేశారు. అయితే అఫ్గన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రం ఒక ఇరాన్ సివిలియన్ విమానం (మహాన్ ఎయిర్) కాబూల్‌లో నిలిచిందని.. తర్వాత హెరాత్‌కి తరలించబడిందని చెప్పారు.వ్యూహాత్మక సమీకరణాలుఇరాన్ యుద్ధంలో చైనా కూడా పాక్ తరహాలోనే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందా? అనే చర్చ జోరందుకుంది. ఒకవైపు చర్చలు జరగాలని అంటూనే.. మరోవైపు ఇరాన్‌తో ఉన్న వర్తక వాణిజ్య సంబంధాల దృష్ట్యా ఆయుధాల్ని సరఫరా చేస్తోందన్న ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది. అయితే.. పాకిస్తాన్ మాత్రం అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే.. ఇరాన్–చైనా అనుబంధాన్ని దూరం పెట్టకుండా జాగ్రత్త పడుతోంది.స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. 2020–2024 మధ్య పాకిస్తాన్ ప్రధాన ఆయుధ దిగుమతుల్లో 80% చైనా నుంచే వచ్చాయి. చైనా కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ప్రశంసించింది. అయితే.. ఇరాన్‌తో మాత్రం సంబంధాలు కొంతకాలంగా చెడిపోతూ వస్తున్నాయి. సరిహద్దు ఉగ్రవాదం, గ్యాస్ పైప్‌లైన్ వివాదాలు, సైనిక ఘర్షణలు ఇరాన్-పాక్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఇరాన్ పాక్ మధ్యవర్తిత్వంపై పూర్తి నమ్మకం చూపడం లేదు.నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ఆరోపణలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ వార్తలు దక్షిణాసియా భూభౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంలో పాక్ “శాంతిదూత” ఇమేజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఇరాన్ యుధ్ధం.. ప్రస్తుత పరిస్థితికాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ.. దాడులు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా నుంచి యుద్ధ పరిహారం, హర్ముజ్ జలసంధిపై సార్వభౌమాధికార గుర్తింపు, ఆంక్షల తొలగింపు వంటి డిమాండ్లు చేస్తోంది. ట్రంప్ ఈ ప్రతిపాదనలను “అంగీకరించలేనివి” అని తిరస్కరించారు. అణు ఒప్పందానికి దిగి రావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. -
కాల్పుల విరమణ గాల్లో దీపం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలవంతంగా కొనసాగిస్తున్నామని, అది గాల్లో దీపంలా తయారైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘కాల్పుల విరమణ సమర్థంగా అమలుకావట్లేదు. కాల్పుల విరమణ అనేది అత్యంత బలహీనంగా ఉంది. ఒక రకంగా అది ఐసీయూలో వెంటిలేటర్ మీద ప్రాణాధార వ్యవస్థ మీద నడుస్తోంది. అది ముగిసిపోయే అవకాశాలే చాలా ఎక్కువ’’అంటూ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చని ట్రంప్ పరోక్ష సంకేతాలిచ్చారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనలను వెనువెంటనే తిరస్కరించానని ట్రంప్ వెల్లడించారు. ‘స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేని ఇరాన్ నాయకత్వం మధ్యవర్తుల ద్వారా కొన్ని చెత్త ప్రతిపాదనలను తాజాగా నా ముందుకు తెచ్చింది. అందుకే వాటిని పూర్తిగా చదవకుండానే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించా. అవి నాకు అస్సలు నచ్చలేదు. ఆ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు’’అని అన్నారు. ఇరాన్ నాయకత్వ ఆలోచనా ధోరణిపై ట్రంప్ మాట్లాడారు. ‘‘ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకోవడం, మా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులతో నేను ఇబ్బంది పడతానని, ఏం చేయాలో తోచక పిచ్చెక్కుతుందని ఇరాన్ భావిస్తోంది. నాపై ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నారు. వాస్తవానికి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మేం విజయం సాధించబోతున్నాం. నా దగ్గర అద్భుతమైన ప్రణాళిక ఉంది. సైనికపరంగా ఇరాన్‌ను ఎప్పుడో ఓడించాం. వాళ్ల దగ్గర పరిమితస్థాయిలోనే సైనిక సంపత్తిఉంది. అదికూడా ఈ కాల్పుల విరమణ కాలంలో సమకూర్చుకున్నదే. ఈపాటి ఇరాన్ బలాన్ని మేం ఒక్కరోజులో సర్వనాశనం చేయగలం. అందుకు నా దగ్గర చక్కటి ప్లాన్ ఉంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించబోదు. వాస్తవానికి ఇరానియన్లు చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎలాంటి విపరీత ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలీదు’’అని అన్నారు. -
జిన్‌పింగ్ ఆహ్వానం.. రంగంలోకి ట్రంప్.. టార్గెట్ ఏంటి?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు సిద్ధమయ్యారు. అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పర్యటన మే 13 నుంచి 15 వరకు జరగనుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు బీజింగ్ వెళ్తున్న ట్రంప్.. పశ్చిమాసియా సంక్షోభం, వాణిజ్య సంబంధాలతో పాటు పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నారు.ఇరాన్, రష్యా కేంద్రంగా వ్యూహాలుఈ చారిత్రక భేటీలో ప్రధానంగా ఇరాన్, రష్యా అంశాలు కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు చైనా అందిస్తున్న ఆర్థిక సహకారం, విడిభాగాలు, ఆయుధ ఎగుమతుల సామర్థ్యంపై ఉభయ దేశాల అధినేతలు ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పర్యటనలో అమెరికా-చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్, బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనల్లో పురోగతిపై చర్చలు జరగనున్నాయి. ఏరోస్పేస్, వ్యవసాయం, ఇంధన రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలకు ప్రాధాన్యత దక్కనుంది. వాణిజ్యంలో ఉమ్మడి ప్రాధాన్యతలను గుర్తించడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ పర్యటన అనంతరం ఈ ఏడాది చివర్లో షీ జిన్‌పింగ్ దంపతులకు వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.తైవాన్, ఇరాన్ ఆంక్షల వేళ ఉత్కంఠఈ అగ్ర దేశాల చర్చల్లో తైవాన్ అంశం ప్రస్తావనకు రానున్నప్పటికీ, అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ ఇంధన, ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇటీవల విధించిన తాజా ఆంక్షలు టెహ్రాన్, చైనా వాణిజ్య నెట్‌వర్క్‌లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రకటించిన ఈ కఠిన ఆంక్షల నడుమ ట్రంప్ పర్యటన అత్యంత ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: ‘యూపీఐ పేమెంట్’తో సువేందు పీఏ హంతకుల పట్టివేత -
ఏం ఆటలా?.. 47 ఏళ్లుగా అదే మోసమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఇరాన్ అమెరికాతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇరు దేశాలు తమ ప్రతిపాదనలను పరస్పరం తిరస్కరించుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం కావొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజాగా చేసిన మెసేజ్ సారాంశం ఇలా ఉంది.. ఇరాన్ 47 సంవత్సరాలుగా అమెరికాతో పాటు ప్రపంచాన్ని మోసం చేస్తోంది. వారు ఎప్పటికప్పుడు ఆటలాడుతూ ఆలస్యం(మూడుసార్లు నొక్కి.). చేస్తున్నారు’’ అని న్యూక్లియర్ డీల్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఒబామా చారిత్రక తప్పిదం చేశారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఇరాన్‌పై “సడలింపు” చూపారని.. ఆయన హయాంలో అమెరికా నుంచి ఇరాన్‌కు విమానాల్లో పెద్ద మొత్తంలో(400 మిలియన్ డాలర్లు) నగదు వెళ్లిందని ఆరోపించారు. ఒబామా కుదిర్చిన 2015 అణు ఒప్పందం ‘‘అత్యంత చెత్త ఒప్పందం’’. దాని వల్లే మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్‌కు అనవరసమైన ప్రాధాన్యం పెరిగింది. ఒబామా ప్రభుత్వం ఈ నగదు పంపిణీని 1979లో విఫలమైన ఆయుధ ఒప్పందం కారణంగా చెల్లించాల్సిన డబ్బు అని చెప్పింది. కానీ, అది ఎంతమాత్రం కాదు. ఈ చర్యతో ఒబామా ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన పాలనను బలపరిచారు’’ అని మండిపడ్డారు. గతంలో నేను ఈ ఒప్పందాన్ని రద్దు చేశానని.. లేకపోతే ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధం తయారు చేసి ఇజ్రాయెల్‌పై వాడేదని అన్నారు. అలాగే, తన బలమైన నాయకత్వంలోనే జనరల్ ఖాసీం సోలేమానీని హతమార్చానని.. ఆ చర్యను “అత్యవసరమైన రక్షణ చర్య”గా ప్రకటించారు. (ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని క్వాడ్స్ ఫోర్స్ కమాండర్. 2020 జనవరి 2న ఇరాక్ బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించాడు. అప్పటి ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీకి ఖాసీం సోలేమానీ కుడి భుజంగా ఉండేవాడు.)ఇరాన్ నుంచి ఒక లేఖ రావొచ్చు, చూద్దాం ఎలా ఉంటుందో అని రెండ్రోజుల కిందటే ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే రోజు ఇరాన్ తన ప్రతిస్పందనను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు అందజేసిందని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. అయితే.. ఇరాన్ తాజా ప్రతిపాదనలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, అందులో ఏ అంశాలు అంగీకరించలేనివిగా ఉన్నాయో మాత్రం ఆయన బయటకు చెప్పడం లేదు. మరోవైపు.. ఇరాన్ మాత్రం దిగి రామంటోంది. అమెరికా చెప్పినట్లు ఒప్పందం చేసుకోవడం అంటే.. లొంగిపోవడం కిందకే వస్తోందని అంటోంది. ఇరాన్ డిమాండ్లు:అమెరికా నుంచి యుద్ధ పరిహారం (war reparations) హర్ముజ్ జలసంధిపై పూర్తి ఇరాన్ సార్వభౌమాధికారంఇరాన్పై ఆంక్షల ఎత్తివేతఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల, వీటికి అదనంగా..అమెరికా నావికాదళ ఆంక్షలు తొలగించాలిభవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలిఇరాన్ చమురు అమ్మకాలపై నిషేధం తొలగించాలిఅయితే ఈ డిమాండ్లు, యుద్ధం మొత్తం కాలంలో అమెరికా ప్రకటించిన ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. కమ్యూనికేషన్ లోపం వల్లే.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం ఎంత పేలవంగా ఉందో అమెరికా మాటలతో బయటపడింది. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఎన్బీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రధాన లక్ష్యం హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా నావిగేషన్.. అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ. ఇరాన్ నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. ప్రభుత్వంలో వర్గాల ఒత్తిడి, మధ్యవర్తితత్వం వహిస్తున్న కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఆలస్యం జరుగుతోంది’’ అని చెప్పారు.ఒకవైపు పాక్‌తో పాటు ఈజిప్ట్ కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ ప్రతిస్పందన.. ఈ ఘర్షణను మరింత క్లిష్టం చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో పాటు.. పర్షియన్ గల్ఫ్ రీజియన్‌లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా దాడులతో లెబనాన్ వణికిపోతోంది. దీంతో దౌత్య ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అదే సమయంలో.. ఇంధన ధరలు పెరుగుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
సంతోషపు లెక్కల్లో పాశ్చాత్యుల పొరపాటు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లేదా చైనాలను ‘నరక కూపాలు’ అని పిలిచినప్పుడు అందరికీ కోపం రావడం సహజం. కానీ ఒక శాస్త్రవేత్తగా నాకు అది కేవలం అమర్యాదగా మాత్రమే అనిపించలేదు, ఇదొక కొలమాన లోపం అనిపించింది. వాషింగ్టన్ ఇప్పటికీ 1950ల నాటి పాత ఆలోచనలతోనే ప్రపంచాన్ని చూస్తోంది. తాను ఎంత విద్యుత్తును వాడుతున్నాను అనే దానినే గొప్పగా భావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసలైన తృప్తిని అర్థం చేసుకోవడంలో పొరబడుతోంది. నేను 1982లో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి పీహెచ్డీ పూర్తి చేసి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి వెళ్ళాను. కొన్ని దశాబ్దాలుగా నేను జీవితంలోని రెండు వేర్వేరు ‘ఆపరేటింగ్ సిస్టమ్స్‘ను గమనిస్తున్నాను. వాషింగ్టన్ చూసే కోణం కేవలం ఆర్థిక గణాంకాల చుట్టూనే తిరుగుతుంది తప్ప, మనిషి అనుభవాన్ని నిర్దేశించే అసలైన విషయాలను పట్టించుకోదు. ప్రపంచాన్ని ‘ఆనందపు సామర్థ్యం’ అనే కోణం నుండి చూస్తే, ఆనందం అనేది డబ్బు (జీడీపీ) వల్ల మాత్రమే రాదని అర్థమవుతుంది. అది ఒక సామాజిక నిర్మాణం. ఈ కోణంలో చూసి నప్పుడు, బయటకు ‘నరక కూపం’లా కనిపించే దేశాలే మనిషి సంతోషంగా ఉండటానికి అనువైన ప్రదేశాలుగా కనిపిస్తాయి.ప్రమాణాల్లో తేడా నెల్లూరు జిల్లాలోని అల్లూరు మా స్వగ్రామం. 1980లో బెంగళూరులో నా పీహెచ్డీ స్టైపెండ్ నెలకు ‘50 డాలర్లు’(400 రూపాయలు). అమెరికా లెక్కల ప్రకారం ఇది పేదరికం. కానీ అప్పట్లో వాస్తవం వేరేలా ఉండేది. నా గది అద్దె 4 డాలర్లు, మరో 16 డాలర్లతో రోజుకు నాలుగు పూటలా మంచి భోజనం దొరికేది. వైద్యం అందరికీ అందుబాటులో ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా, నా సొంత పనుల కోసం నేను ఎప్పుడూ శారీరక శ్రమ చేయలేదు. మధ్యతరగతి జీవితాల్లో పనివారు అనే వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడిన, ఒక ముఖ్యమైన భాగం. నేను అమెరికా వెళ్ళాక ఒక వింత పరిస్థితి చూశాను. చికెన్, గుడ్లు, కూల్ డ్రింక్స్ వంటివి చాలా చౌకగా దొరికేవి. కానీ నా ‘జీవన ప్రమాణం‘లో ఒక లోటు వచ్చింది. నా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవడం వల్ల నేను ఒక కూలీలా మారిపోయాను. వంట, ఇల్లు ఊడ్వడం, బట్టలు ఉతకడం వంటి పనులకు మనుషులు దొరకరు, దొరికినా చాలా ఖరీదు. భారత్‌లో మధ్యతరగతి మనిషి మేధస్సు ఇటువంటి పనుల నుండి విముక్తి పొంది ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో సంపద ఉండవచ్చు కానీ, అక్కడ ‘సమయం, సామాజిక లోటు’ ఎక్కువ.2026 నాటికి, ఒక సగటు అమెరికన్ ఒక భారతీయుడి కంటే 12 రెట్లు ఎక్కువ కరెంటు వాడుతున్నాడు. ఇంత కరెంటు వాడినంత మాత్రాన 12 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుందా? నేను 1986లో కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను. నా అపార్ట్మెంట్ మేనేజర్, ఒక మైలు దూరంలో మంచి షాపు ఉన్నా కూడా, ఐదు మైళ్ల దూరంలో ఉన్న ‘మరింత శుభ్రమైన‘ షాపుకు నన్ను కారులో తీసుకెళ్లాడు. అమెరికాలో పెట్రోల్, కరెంటు చౌకగా దొరుకుతాయి కాబట్టి, ఆనందాన్ని ఇవ్వని చిన్న చిన్న సౌకర్యాల కోసం వాటిని వృథా చేస్తారు. కానీ ఇండియాలో మనం సామీ ప్యతకు, సమాజానికి విలువ ఇస్తాం. మనకు సంతోషం మన దగ్గర్లోనే దొరుకుతుంది. తక్కువ వనరులను వాడుతూ ఎక్కువ ఆనందాన్ని పొందడంలో భారతీయులు ముందున్నారు.వలసల వెనుక అసలు నిజంవలసల మీద విమర్శలు చేసేవారు ఒక విషయం మర్చి పోతున్నారు: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి దిగ్గజాలను నడిపిస్తున్నది ఈ దేశాల మేధావులే. అమెరికా తన బయోమెడికల్ రంగం కోసం, టెక్నాలజీ కోసం ఈ దేశాల శాస్త్రవేత్తలపై ఆధార పడుతోంది. ఇవేమీ ‘లూప్‌హోల్’ వలసలు కాదు. ఇది వ్యూహాత్మక వనరుల సముపార్జన. వై2కే సంక్షోభ సమయంలో, డిజిటల్ మౌలిక సదుపాయాలు కుప్పకూలకుండా కాపాడుకోవడానికి అమెరికాకు భారతీయ ప్రతిభావంతులే అక్కరకొచ్చారు. అలాంటప్పుడు వాటిని ‘నరక కూపాలు’ అనడం అమెరికా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే అవుతుంది.అమెరికా నేర్చుకోవాల్సింది ఎంతో!సైన్స్ పరంగా చూస్తే, నిరంతరం సౌకర్యాల మధ్య ఉండటం వల్ల అమెరికన్లలో ‘హెడోనిక్ నంబ్నెస్‘ (ఆనందాన్ని ఫీల్ అవ్వలేని తనం) ఏర్పడుతోంది. ఏసీలు, కార్లు ఎప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల వాటి వల్ల వచ్చే కిక్ (డోపమైన్, సెరోటోనిన్) తగ్గిపోతుంది. కానీ వనరులు తక్కువగా ఉన్న చోట ఆనందం ఎక్కువగా ఉంటుంది. 25 షర్టులు ఉన్నవాడికి 26వ షర్టు వల్ల వచ్చే ఆనందం కంటే, 5 షర్టులు ఉన్నవాడికి 6వ షర్టు వల్ల వచ్చే ఉత్సాహం చాలా ఎక్కువ. అలాగే అమెరికన్ మధ్యతరగతి మనిషి భారీ ‘ఆందోళన పన్ను‘ (యాంగై్జటీ ట్యాక్స్) కడుతున్నాడు. లక్ష డాలర్ల జీతం వచ్చినా, ఇన్సూరెన్స్ బిల్లులు, ఇతర సేవల కోసం అది ఖర్చయిపోయి చేతిలో ఏమీ మిగలదు. ఇండియాలో మనకు కుటుంబం అనే భావోద్వేగ అండ ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖరీదైన వ్యవస్థల కంటే, పక్కనే ఉండే కుటుంబ సభ్యులు మనకు ధైర్యాన్ని ఇస్తారు.ప్రపంచాన్ని కేవలం ఒకే కోణం నుండి చూడటం ఆపాలి. ఇల్లు ఎంత పెద్దది, ఎంత వాడుతున్నాం అనే లెక్కలతో చూస్తే భారత్, చైనాలు పేదవిగా కనిపించవచ్చు. కానీ వాటి దగ్గర లెక్కించలేని సంపద ఉంది– అదే ఆపదలను తట్టుకునే శక్తి, సామాజిక ఐక్యత.ఏ దేశాన్నయినా తక్కువ చేసి చూసే ముందు, సంతోషం అనేది ఆయా దేశాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. ఈ దేశాల నుండి పాశ్చాత్య దేశాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాషింగ్టన్ ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకుంటే, ముందు ఈ అహంకారాన్ని విడిచిపెట్టి, ప్రపంచం నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.మేడా పరమేశ్వర రెడ్డివ్యాసకర్త రిటైర్డ్ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త; రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ డైరెక్టర్ -
ట్రంప్ దాడికి.. ఇరాన్ మాస్టర్ ప్లాన్.. రష్యా సాయంతో..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం సీజ్ఫైర్ ఒప్పందంతో నడుస్తోంది.అయితే ఈ యుద్ధంలో అమెరికా మెుదటి నుంచి రష్యా ఇరాన్‌కు సహకారం అందించిందనే అమెరికా వాదిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఆరోపణల్ని బలపరుస్తూ 'ది ఎకనామిస్ట్' నివేదిక ప్రచురించింది. అమెరికా ఇరాన్ యుద్దంలో డొనాల్డ్ ట్రంప్ తొలుత నుంచి రష్యాపై గుర్రుగా ఉన్నారు. మాస్కో రహస్య సమాచారం ఆధారంగానే ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేస్తోందన్నారు. ఇరాన్ సాంకేతికతను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినా పక్కా ప్రణాళికతో అమెరికా స్థావరాలను ఎలా టార్గెట్ చేయగలుగుతుందని దీనిలో కచ్చితంగా మాస్కో హస్తం ఉందని ఆరోపించారు. ది ఎకనామిస్ట్ నివేదిక ఈ నివేదిక ప్రకారం, "వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఇరాన్‌కు దాదాపు 5,000 షార్ట్-రేంజ్ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లను సరఫరా చేయడానికి రహస్య ప్రణాళిక రూపొందించింది. వీటితో పాటు శాటిలైట్ ద్వారా నడిచే లాంగ్-రేంజ్ డ్రోన్లను కూడా అందించాలని రష్యా భావించింది.ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లురేడియో సిగ్నల్స్‌కు బదులుగా సన్నని వైర్ల ద్వారా నియంత్రించబడతాయి. దీనివల్ల శత్రువులు వీటిని 'జామ్' చేయడం (సిగ్నల్స్ కట్ చేయడం) సాధ్యం కాదు. ఇవి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలవు". అని నివేదిక ప్రచురించింది.రష్యా తన లాంగ్-రేంజ్ డ్రోన్లలో ఎలాన్ మాస్క్‌కు చెందిన 'స్టార్‌లింక్' టెర్మినల్స్‌ను ఉపయోగించే.. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలను దాటవేసింది. ఇప్పుడు అదే సాంకేతికతను మధ్యప్రాచ్యంలో ఇరాన్ దళాలకు మళ్లించాలని రష్యా చూస్తోంది.కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, వాటిని ఎలా వాడాలో శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా రష్యా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కథనం ప్రచురితమైంది. దీని కోసం రష్యాలోని విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న సుమారు 10,000 మంది ఇరాన్ విద్యార్థుల నుండి ఆపరేటర్లను ఎంపిక చేయాలని రష్యా నిఘా సంస్థ భావించిందని తెలిపింది. అలాగే రష్యన్ భాష మాట్లాడగలిగే తజిక్ ప్రజలను మరియు సిరియాలోని అలవైట్ మైనారిటీలను కూడా ఈ పనుల కోసం వినియోగించుకోవాలని ప్రణాళికలో ఉంది.ట్రంప్ వ్యూహానికి కౌంటర్గాఇటీవల ట్రంప్ ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరిగింది. అంతే కాకుండా అమెరికా సైన్యం నేరుగా ఇరాన్‌పై దాడి చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికాను ఎదుర్కొనేలా ఈ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లు ప్రధానంగా ఇరాన్ తీర ప్రాంతంలోని ద్వీపాల వద్దే మోహరించేలా ప్రణాళికలు రచించారు. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా పదాతి దళాలతో దాడికి ఆదేశిస్తే అమెరికాను ఎదుర్కొవడానికి ఈ డ్రోన్లు కీలకంగా మారతాయని నివేదిక పేర్కొంది. -
ట్రంప్ కంపెనీకి భారీ నష్టం.. వందల మిలియన్లు లాస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా సంస్థ 'ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్'కు (TMTG) ఈ ఏడాది ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2026 మొదటి త్రైమాసికానికి (Q1) సంబంధించి కంపెనీ విడుదల చేసిన ఆర్థిక ఫలితాల్లో ఏకంగా 405.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,400 కోట్లు) నికర నష్టాన్ని నమోదు చేసింది. ప్రధానంగా క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల విలువ పడిపోవడమే ఈ భారీ నష్టానికి కారణమని నివేదిక వెల్లడించింది.అవాస్తవిక నష్టాల వెల్లువట్రూత్ సోషల్ మాతృ సంస్థ అయిన టీఎంటీజీ, గతేడాది మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు క్రిప్టోకరెన్సీలలో భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే, ప్రస్తుత త్రైమాసికంలో డిజిటల్ ఆస్తులు, ఈక్విటీలలో ఏర్పడిన 370 మిలియన్ డాలర్ల వాస్తవీకరించని నష్టాలు కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను దెబ్బతీశాయి.కంపెనీ ఖజానాలో ప్రస్తుతం 9,500 బిట్కాయిన్లు ఉన్నాయి. గత జూలైలో బిట్‌కాయిన్ విలువ గరిష్టంగా ఉన్నప్పుడు, ఒక్కో కాయిన్‌ను సగటున 1,08,519 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఫిబ్రవరి చివరలో బిట్‌కాయిన్ ధర 70,000 డాలర్ల కంటే తక్కువగా ఉన్న సమయంలో కంపెనీ 2,000 బిట్కాయిన్లను విక్రయించింది. దీనివల్ల భారీగా పెట్టుబడి నష్టపోవాల్సి వచ్చింది.ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 80,000 డాలర్ల మార్కు వద్ద ఊగిసలాడుతోంది. గత అక్టోబర్‌లో 1,26,000 డాలర్ల వద్ద ఉన్న ధర, ఫిబ్రవరి నాటికి 60,000 డాలర్లకు పడిపోవడం కంపెనీ అంచనాలను తలకిందులు చేసింది.ఆర్థిక పునాది పటిష్టమేనా?భారీ నష్టాలు పీడిస్తున్నప్పటికీ, కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే కంపెనీ ఆర్థిక ఆస్తులు మూడు రెట్లు పెరిగి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 17.9 మిలియన్ డాలర్లుగా నమోదైంది.క్రిప్టో మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రస్తుతానికి కాగితంపై నష్టాలు కనిపిస్తున్నప్పటికీ, కంపెనీ వద్ద తగినంత లిక్విడిటీ ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పకూలుతున్న స్టాక్.. సీఈఓ నిష్క్రమణఒకవైపు ఆర్థిక నష్టాలు, మరోవైపు నాయకత్వ మార్పులు కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2022లో ఒకానొక దశలో 97.54 డాలర్ల వద్ద ఉన్న కంపెనీ షేర్ విలువ, ప్రస్తుతం ఏకంగా 90% పైగా క్షీణించి 8.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కంపెనీ సీఈఓ, మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు డెవిన్ న్యూన్స్ ఈ ఏడాది ఏప్రిల్ 22న తన పదవికి రాజీనామా చేశారు. ఇది పెట్టుబడిదారుల్లో మరింత ఆందోళన కలిగించింది.జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ట్విట్టర్ (ప్రస్తుత X) ట్రంప్‌పై నిషేధం విధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రంప్ సొంతంగా 'ట్రూత్ సోషల్' నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. రాజకీయంగా ఆదరణ ఉన్నప్పటికీ, ఆర్థికంగా లాభాల బాట పట్టడంలో ఈ సంస్థ ఇంకా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. -
హంటా వైరస్ కలకలం
వాషింగ్టన్ డీసీ: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటావైరస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్‌పై తనకు సమాచారం అందిందని ప్రస్తుతానికి పరిస్థితి అంతా బాగానే ఉందన్నారు. ఇటీవల ఓ క్రూయిజ్‌షిప్‌లో హంటా వైరస్‌తో ముగ్గురు మృతిచెందిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ పునరుద్ధరణ పనులను పరిశీలించడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి మీడియా హంటా వైరస్ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా "అంతా అదుపులోనే ఉందని మేము ఆశిస్తున్నాం. ఆ నౌక గురించి రేపు పూర్తి నివేదిక ఇవ్వబోతున్నాం. గొప్ప నిపుణులు దీనిపై అధ్యయనం చేస్తున్నారు, అంతా బాగుంటుంది," అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా అదుపులోనే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. హంటా కలకలంకాగా ఈ నౌకలో ప్రయాణించి అమెరికా చేరుకున్న ఐదుగురు పౌరులకు అమెరికా క్వారంటైన్ విధించింది. ఇటీవల అట్లాంటిక్ మహాసముద్రంలో ఎంబీ హోండియన్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్‌తో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురిని వ్యాది అనుమానిత రోగులుగా గుర్తించారు. అనంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వాళ్లకు వైరస్ సోకలేదని నిర్ధారించుకున్నాక 12 దేశాలకు చెందిన డజను మందికిపైగా ప్రయాణికులను నౌక నుంచి సురక్షితంగా బయటకు పంపేశామని నౌక యాజమాన్యం, నెదర్లాండ్స్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.అయితే లక్షణాలు కనిపించనంత మాత్రాన నౌకలోని ప్రయాణికులను స్వేచ్ఛగా వదిలేస్తారా? వాళ్లు స్వదేశాలకు వచ్చాక వాళ్లలో వైరస్ లక్షణాలు బయటపడి ఇతరులకు వ్యాపిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న అనుమానాలు, భయాందోళనలు ఎక్కువయ్యాయి. నౌకలోకి ఎక్కకముందు విమానంలో ప్రయాణించిన ఒక మహిళలో హంటావైరస్ లక్షణాలు వెలుగుచూశాయి.దీంతో ప్రయాణం మొదలెట్టిన రోజు నుంచి వైరస్ వెలుగుచూసిన రోజుదాకా ఎంత మంది ఎక్కడెక్కడ దిగిపోరనే వివరాలతో వాళ్ల జాడను కనిపెట్టి వైద్యపరీక్షలు చేయడంలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈలోపు ఈ విషయం తెలియక వాళ్లు స్థానికంగా ఇంకెంత మందికి వైరస్‌ను వ్యాపింపజేస్తారో అనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి.హంటావైరస్ అంటే ఏమిటి ?హంటావైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపించే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించడం చాలా అరుదు. ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాపించదు కాబట్టి, సాధారణ ప్రజలకు దీనివల్ల కలిగే ప్రమాదం తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. -
త్వరలోనే అందుబాటులోకి హార్మూజ్
టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే తెరుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా, ఇరాన్‌లు మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సమాచారం. హార్ముజ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆస్కారం ఉంది. దాంతో జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుంది. అక్కడ చిక్కుకుపోయిన చమురు నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఫిబ్రవరి 28న దాడులు, ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత హార్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది. కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అనంతరం అమెరికా కూడా జలసంధిలో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హార్మూజ్ మూసివేతతో చమురు రవాణా స్తంభించిపోయింది. చమురు, ఎల్పీజీ ధరలు పెరిగిపోయాయ. ప్రధానంగా ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హార్మూజ్‌లో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన నౌకలను విడిపించేందుకు అమెరికా సైన్యం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించింది. కానీ, ఇరాన్‌తో చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లభించడంతో ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని ఆయన స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో రెండు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి త్వరలోనే తెరపడవచ్చన్న సంకేతాలు రావడం గురువారం అంతర్జాతీయ మార్కెట్లను ఉత్తేజపరిచింది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందం అతి త్వరలోనే కుదురుతుందని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహీర్ అంద్రాబీ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీలో పోప్ లియో–14తో సమావేశయ్యారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని సాధించడానికి సాగుతున్న ప్రయత్నాల గురించి చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పోప్ లియో–14పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, వాటికన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్కో రూబియో ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పారోలిన్తోనూ రూబియో భేటీ అయ్యారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. -
యుద్ధంలో అమెరికాకు తీవ్ర నష్టం
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దానికంటే తీవ్రమైన నష్టమే వాటిల్లింది. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, వాయు, నావిక దళాల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగింది. ఇరాన్ నుంచి ఇంతటి వినాశకరమైన ప్రతిస్పందనను ట్రంప్ బృందం ఊహించలేదు. ట్రంప్ ప్రభుత్వం గతంలో నివేదించిన దానికంటే అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చాలా ఎక్కువ విధ్వంసం సృష్టించిందని తేలింది. 15 స్థావరాల్లోని 228 నిర్మాణాలు.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ విడుదల చేసిన 128 అధిక–రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ‘ది వాషింగ్టన్ పోస్ట్’నష్ట తీవ్రతను విశ్లేషించింది. మధ్యప్రాచ్య ఉపగ్రహ చిత్రాలను అందించే రెండు వాణిజ్య సంస్థలైన వాంటోర్, ప్లానెట్ చిత్రాలను విడుదల చేయడాన్ని నిలిపేయాలని ట్రంప్ కోరడం వల్ల అమెరికాకు జరిగిన నష్ట తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం ఇప్పటివరకు కష్టంగా ఉందని నివేదించింది. గల్ఫ్‌లోని 15 అమెరికా సైనిక స్థావరాల్లో 228 నిర్మాణాలు, పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. సాంకేతికంగా ఉన్నతమైన అమెరికాకు ఇది భారీ నష్టం. హ్యాంగర్లు, బ్యారక్‌లు, ఇంధన డిపోలు, విమానాలు, రాడార్, కమ్యూనికేషన్లు, వాయు రక్షణ పరికరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులతో కొన్ని సైనిక స్థావరాలు నిరుపయోగంగా మారాయి. బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలో, కువైట్‌లోని మూడు స్థావరాలైన అలీ అల్–సలేం, అమెరికా సైన్యం ప్రాంతీయ ప్రధాన కార్యాలయం క్యాంప్ అరిఫ్జాన్, క్యాంప్ బ్యూరింగ్లలో అత్యధిక నష్టం జరిగింది. ఇందులో ఖరీదైన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఒక విద్యుత్ కేంద్రం, ఐదు ఇంధన నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖతార్‌లోని అల్–ఉదైద్ వైమానిక స్థావరం వద్ద ఉన్న ఉపగ్రహ సమాచార కేంద్రం, జోర్డాన్, యూఏఈలలోని థాడ్ రాడార్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న ఈ–3 సెంటినల్ కమాండ్ అండ్ కంట్రోల్ విమానం ధ్వంసమైంది. ఒక ఇంధన ట్యాంకర్ కూడా కోల్పోయింది. ఫ్రెండ్లీ ఫైర్‌లోనూ భారీ నష్టం.. యుద్ధం, గాలింపు చర్యలు, ఫ్రెండ్లీ ఫైర్ సమయంలో అమెరికా కోల్పోయిన 40 డ్రోన్లు, యుద్ధ విమానాలనూ కోల్పోయిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్కొక్కటి 30 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే 24 ఎమ్క్యూ–9 రీపర్ డ్రోన్లు, 200 నుంచి 240 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే అత్యంత విలువైన ఎమ్క్యూ–4సీ ట్రైటాన్ ఉన్నాయి. నాలుగు ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగిల్స్, ఒక ఏ–10 వార్హాగ్ కూడా కోల్పోయింది. ఒక ఎఫ్–35ను కూడా కూల్చి వేశామని ఇరాన్ పేర్కొంది. ఫిబ్రవరి 28న ఈ ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఏడుగురు అమెరికా సైనికులు మరణించారు. సుమారు 400 మంది సైనికులు గాయపడ్డారు. మరణించిన వారిలో ఆరుగురు కువైట్‌లో, ఒకరు సౌదీ అరేబియాలో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అత్యంత కచ్చితత్వంతో దాడులు 200కు పైగా కట్టడాలపై ఇరాన్ అత్యంత కచ్చితమైన దాడులు జరిపింది. కచ్చితత్వంతో నడిచే క్షిపణులను సమర్థవంతంగా ఉపయోగించారు. భారీ ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో బ్యారక్‌లు, హ్యాంగర్లు, గిడ్డంగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా దళాలు స్థావరాలను విడిచిపెట్టిన తర్వాత కొన్ని దాడులు జరిగి ఉండవచ్చు. జిమ్‌లు, ఫుడ్ హాల్లు, వసతి గృహాల వంటి సున్నితమైన లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయి. ‘ఇరాన్ దాడులు చాలా కచ్చితమైనవి. గురి తప్పిందని సూచించే యాదృచ్ఛిక గుంతలు ఏవీ లేవు’అని రిటైర్డ్ మెరైన్ కార్ప్స్ కల్నల్ మార్క్ కాన్సియన్’తెలిపారు. చవకైన షాహెద్ డ్రోన్లతో పోరాడటానికి విలువైన ఇంటర్సెప్టర్లను ఉపయోగించకుండా కాపాడుకోవడానికి అమెరికా ఉద్దేశపూర్వకంగా కొంత నష్టాన్ని అనుమతించి ఉండవచ్చన్నారు. 50 బిలియన్ డాలర్ల ఖర్చు.. ఈ యుద్ధానికి ఇప్పటివరకు సుమారు 50 బిలియన్ డాలర్ల ఖర్చు అయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇక, ఇరాన్ దాడి చేసిన అధునాతన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఖరీదైనవి. వాటిని భర్తీ చేయడం కష్టం. ఆ సైనిక స్థావరాలను పునర్నిర్మించడానికి, ధ్వంసమైన ఆస్తుల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి సుమారు 40 నుంచి 50 బిలియన్ డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ ఖర్చుగా సెనేట్‌కు సమర్పించిన 25 బిలియన్ డాలర్ల అంచనా కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. 2027 సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కోరింది. ఇది గత సంవత్సరం కంటే 42% ఎక్కువ. అయితే, డెమోక్రాట్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 630 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల మధ్య నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. -
పాకిస్తాన్‌కు అమెరికా ఝలక్.. కీలక ప్రకటన
వాషింగ్టన్: దౌత్య సిబ్బంది భద్రత దృష్ట్యా పెషావర్‌లోని తమ కాన్సులేట్‌ను దశలవారీగా మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఖైబర్ పఖ్తూంఖ్వాలోని దౌత్య సంబంధాల సంబంధిత విషయాలను ఇస్లామాబాద్‌లోని యూఎస్ రాయబార కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు మంగళవారం యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దౌత్య సిబ్బంది భద్రత, వనరులను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది.పెషావర్‌లో తమ కార్యాలయంను మార్చినప్పటికీ పాకిస్తాన్ విషయంలో అమెరికా ప్రభుత్వ విధాన ప్రాధాన్యతలు స్థిరంగానే ఉన్నాయని తెలిపింది. ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి, ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు, అధికారులతో అమెరికా సంప్రదింపులు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. యూఎస్–పాకిస్తాన్ సంబంధాలను ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లలో ఉన్న తమ దౌత్య కార్యాలయాలు, పాకిస్తాన్‌లోని యూఎస్ మిషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లడానికి శాఖ కట్టుబడి ఉందని పేర్కొంది.ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పెషావర్ కాన్సులేట్, ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించిన అమెరికా కార్యకలాపాలలో ముఖ్య పాత్ర పోషించింది. ఒక కీలకమైన లాజిస్టికల్, దౌత్య కేంద్రంగా పనిచేసింది. ఆఫ్ఘనిస్తాన్‌కు భూమార్గాన్ని సులభతరం చేయడంతో పాటు, ఆ ప్రాంతంలోని అమెరికన్ పౌరులకు, ఆఫ్ఘన్ జాతీయులకు సహాయాన్ని అందించింది. ఈ కాన్సులేట్‌లో ప్రస్తుతం 18 మంది అమెరికన్ సిబ్బంది, 89 మంది స్థానిక సిబ్బంది పనిచేస్తున్నారు. -
అమెరికా వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్
-
ఇరాన్ ఒప్పుకుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఎట్టకేలకు ఇరాన్.. ట్రంప్ డిమాండ్‌కు తలొగ్గినట్టు ఆయన వెల్లడించారు. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ అంగీకరించినట్టు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. దీంతో, ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకునే అవకాశముంది.ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వైట్‌హౌస్ వేదికగా మాట్లాడుతూ..‘ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం మంచిది కాదు. ఇరాన్ అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలకు ముప్పు. న్యూక్లియర్ వెపన్స్ ఉండటం ఇరాన్‌కు కూడా మంచిది కాదు. మా డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించింది. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ ఓకే చెప్పింది. ఇరాన్ అంగీకారంతో చర్చలు తుది దశకు చేరుకునట్టే’ అని వ్యాఖ్యలు చేశారు. 🚨 DONALD TRUMP CONFIRMS IRAN HAS AGREED TO NO NUCLEAR WEAPONSThis is HUGE! 🇺🇸"Iran cannot have a nuclear weapon, and they won't. And they've agreed to that, among other things, yes!" 🔥 pic.twitter.com/3kgf8pkBeS— Eric Daugherty (@EricLDaugh) May 6, 2026ట్రంప్ వార్నింగ్.. ఇదిలా ఉండగా.. అంతకుముందే ఇరాన్‌ను ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో, అత్యంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మూజ్‌లో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరిస్తుందని వ్యాఖ్యనించారు.ఇరాన్ కొత్త ప్లాన్.. మరోవైపు, హార్మూజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. "సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్" పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఇ-మెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలి. ఫిబ్రవరి 28న ఇరాన్ భూభాగంపై జరిగిన దాడుల తర్వాత ఇజ్రాయెల్, అమెరికాలతో సంబంధం ఉన్న నౌకలను సురక్షితంగా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. దీనిని మరింత చట్టబద్ధం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఒక ముసాయిదాను కూడా పరిశీలిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు, శత్రువులు కాని ఇతర దేశాల నౌకల ప్రయాణానికి 'టోల్ సిస్టమ్' తీసుకురావాలని భావిస్తోంది. -
మళ్లీ ట్రంప్ బెదిరింపులు
వాషింగ్టన్: ఇరాన్‌పై బాంబులేసి యుద్ధాగ్ని జ్వాలల్ని రాజేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. ‘‘గతంలో మేం పెట్టిన షరతులకు తలొగ్గి ఇరాన్ ఆచరణసాధ్యమైన శాంతి ఒప్పంద ప్రతిపాదనలతో ముందుకొస్తోందని సమాచారమొచ్చింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులకు మేం ఆరంభించిన ‘ఎపిక్ ఫ్యూరీ’సైనిక చర్య దాదాపు ముగింపుకొచ్చింది. అత్యంత ప్రభావవంతమైన మా దిగ్బంధం ధాటికి ఇప్పుడు హార్మూజ్ ఇరాన్ సహా అందరికీ అందబాటులోకి రాబోతోంది. ఈ దిశలో ఇరాన్గనక మళ్లీ తోకజాడిస్తే బాంబుల వర్షం కురవడం ఖాయం. గతంలో ఎన్నడూలేనంతటి భీకరంగా బాంబులేస్తాం’’అని ట్రంప్ తన సోషల్‌మీడియా మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. హార్మూజ్‌ను వీలైనంత త్వరగా తెరవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీకి బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సూచించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటనచేయడం గమనార్హం. మరోవైపు ఒక పేజీకి సరిపడా షరతులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్, అమెరికాలు ఓవైపు ముందడుగేస్తున్నాయన్న వార్తలు వెలువడ్డాయి. మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే విదేశీ చమురునౌకలకు రక్షణగా తమ యుద్ధనౌకలను సాయంగా పంపే ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. -
కాల్పుల విరమణ ఎత్తివేత..! మళ్లీ ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం
-
ప్చ్.. ట్రంప్ వల్లే కావడం లేదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను పవర్ఫుల్ లీడర్‌గా చెప్పకుంటారు. ఒక్కో యుద్ధాన్ని ఆపుతూ.. శాంతి ఒప్పందాలు కుదురుస్తూ ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో “శాంతి దూత”గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, సొంత దేశంలో మాత్రం పరిస్థితులను చక్కదిద్దడం ఆయన వల్ల కావట్లేదు.. “నో కింగ్స్” నిరసనలు, ఐస్ (Immigration and Customs Enforcement) వ్యతిరేక ప్రదర్శనలు ఇందుకు ఉదాహరణలు. ఇవి అమెరికా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. అయితే, ఇవి చాలదన్నట్లు గన్ కల్చర్ మరింత పేట్రేగిపోవడం మరో తలనొప్పిగా మారింది. క్రమం తప్పకుండా అక్కడ సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండగా.. అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో తమ భద్రతపై అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చివరికి.. వైట్‌హౌస్‌కు అత్యంత సమీపంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం.. అమెరికాలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. టెక్సాస్ కాల్పుల ఘటన దాకా..అమెరికాలో గన్ కల్చర్ ఏ రేంజ్‌కు చేరుకుందో తెలుసా?. తాజా టెక్సాస్ షూటింగ్ ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనతో.. 2026లో ఇప్పటివరకు 130 మాస్ షూటింగ్స్ ఘటనలు నమోదయ్యాయి. గన్ వైలెన్స్ ఆర్కైవ్ గణాంకాల ప్రకారం.. 2026 జనవరి నుంచి మే దాకా 4,200 మందికి పైగా మరణాలు, 7,300 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ గణాంకాలు.. అమెరికా సమాజం ఎదుర్కొంటున్న భయానక వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. షాకింగ్ నిర్ణయం..అమెరికాలో గన్ కల్చర్ సమస్య కొత్తది కాదు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం కనిపించడం లేదు. పైగా బ్యాక్‌గ్రౌండ్ చెక్స్, స్కూల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్, లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్ వంటి అంశాలకు నిధులు తగ్గించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపోయేలా చేసింది. అమెరికాలో గన్ వయలెన్స్ వల్ల పిల్లలు, టీనేజర్లు ఎక్కువగా బలవుతున్నారు. అయినప్పటికీ, ట్రంప్‌లో చలనం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.గన్ లాబీ..అమెరికాలో ఇన్నేళ్లలో గన్ కల్చర్ కంట్రోల్ చేసే ప్రయత్నాలేవీ జరగలేదు. గన్ లాబీ ఒత్తిళ్ల కారణంగానే వైట్‌హౌజ్ ఈ విషయంలో కఠిన చట్టాలు చేయలేకపోతోందన్న విమర్శ బలంగా వినిపిస్తుంటుంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (NRA) వంటి సంస్థలు.. గన్ తయారీ పరిశ్రమ, అలాగే గన్ రైట్స్‌కు మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులు కలసి ఏర్పడిన వర్గమే ఈ గన్ లాబీ. గన్ కల్చర్‌కు అడ్డుకట్ట వేసే చట్టాలను అమెరికా కాంగ్రెస్ ఎదుటకు తీసుకొచ్చినప్పుడల్లా.. ఈ గ్రూప్ తెర మీదకు వచ్చి మోకాలు అడ్డుపెడుతూ ఉంటుంది. గన్ లేకుంటే ఎలా.. ?అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ప్రకారం.. ప్రజలకు ఆయుధాలు కలిగి ఉండే హక్కు ఉంటుందని గన్ లాబీ వాదిస్తుంటుంది. అలాగే.. తనను తాను రక్షించుకోవడానికి ప్రాణాంతక శక్తిని(తుపాకుల్ని) ఉపయోగించవచ్చనే చట్టాలకూ ఈ లాబీ మద్దతు ఇస్తుంటుంది.ఎంత పవర్ఫుల్ అంటే..1998–2020 మధ్య ప్రో-గన్ గ్రూపులు లాబీయింగ్ కోసం అమెరికాలో 171.9 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. అందులో ఎన్ఆర్ఏ కంపెనీ ఒక్కటే 64 మిలియన్ డాలర్లు పెట్టింది. అలాగే అమెరికా ఎన్నికలనూ ఈ గ్రూపులు ప్రభావితం చేస్తుంటాయి. 2016లో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి ఎన్ఆర్ఏ ఏకంగా 30 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అలాగే రిపబ్లికన్ సెనేటర్లకు మద్దతుగా మరో 20 మిలియన్ డాలర్లు పెట్టింది. మనీ పవర్‌తోనే అమెరికా రాజకీయాల్ని ఈ గన్ లాబీ శాసించగలుగుతోంది. రిపబ్లికన్లు అయినా.. డెమొక్రాట్లు అయినా ప్రతిపాదించిన గన్ కంట్రోల్ చట్టాలు ఆమోదం పొందడం కష్టంగా ఉంటోంది. -
ఒహియోలో వివేక్ రామస్వామి సంచలనం
ఒహియో: అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేత, రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామి మరోసారి సంచలనం సృష్టించారు. ఒహియో రాష్ట్ర గవర్నర్ అభ్యర్థిత్వానికి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, నవంబర్‌లో జరిగే తుది సమరానికి సమరశంఖం పూరించారు. బయోటెక్ వ్యాపారవేత్త అయిన వివేక్ రామస్వామి మంగళవారం జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, వ్యాపారవేత్త కేసీ పుచ్పై భారీ మెజారిటీతో గెలుపొందారు.ఈ విజయం దరిమిలా డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా నామినేట్ అయిన ఒహియో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మాజీ డైరెక్టర్ ఎమీ ఆక్టన్‌తో ఆయన నేరుగా తలపడనున్నారు. అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘన విజయం అనంతరం వివేక్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు, కానీ మన అసలు గమ్యం నవంబర్‌లో ఉంది’ అని అన్నారు. రామస్వామి గెలుపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘వివేక్ యువకుడు, చాలా తెలివైనవాడు. దేశాన్ని ప్రేమించే మంచి వ్యక్తి. ఒహియోకు ఆయన గవర్నర్ అవుతారు. అతనికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని ట్రంప్ ప్రకటించారు. ప్రముఖ కన్జర్వేటివ్ నేత లారా లూమర్.. ఇది అతిపెద్ద విజయమని అభివర్ణిస్తూ, వర్ణ వివక్షతో ఆయనను అణగదొక్కాలని చూసిన వారికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.నవంబర్ సమరానికి సై 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంతో జాతీయ స్థాయిలో అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న వివేక్ రామస్వామి, ఆ తర్వాత వ్యూహాత్మకంగా ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. ప్రైమరీ దశలో రిపబ్లికన్ ప్రత్యర్థులను ఎదుర్కొంటూనే, ఆయన తన ప్రచారాన్ని ప్రధానంగా డెమొక్రాట్ అభ్యర్థి ఎమీ ఆక్టన్ లక్ష్యంగా సాగించడం విశేషం. మరోవైపు కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఒహియో రాష్ట్రానికి సమర్థవంతంగా నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆక్టన్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుత గవర్నర్ మైక్ డివైన్ పదవీకాలం ముగియడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు బలమైన అభ్యర్థుల మధ్య నవంబర్‌లో జరగబోయే ఈ పోరు రసవత్తరంగా మారనుంది. -
ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ నిలిపేస్తున్నాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌లోని హార్మూజ్ జలసంధికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో దౌత్యపరమైన ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తున్నందున జలసంధి గుండా నౌకల రాకపోకలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్‌ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్‌పై ఉన్న బ్లాకేడ్ (నౌకాశ్రయాల నిర్బంధం) మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి కనిపిస్తోంది. అందుకే హార్మూజ్‌లో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆపరేషన్‌ను నిలిపివేయడానికి మేం పరస్పరం అంగీకరించాం. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సంపూర్ణ, తుది ఒప్పందం దిశగా వెళ్తున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముంది. అయితే, సముద్ర కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగుతుంది. ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న పోరాటం సైనిక విజయమే. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముందని పేర్కొన్నారు.President Trump posts on TruthSocial: Based on the request of Pakistan and other Countries, the tremendous Military Success that we have had during the Campaign against the Country of Iran and, additionally, the fact that Great Progress has been made toward a Complete and Final… pic.twitter.com/BF6mZ4AtCc— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 6, 2026కాగా, ఈ చర్యల ద్వారా అమెరికా ఒకవైపు సైనిక ఒత్తిడి కొనసాగిస్తూ, మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తోంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గం. ముఖ్యంగా చమురు రవాణాలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.కీలక పరిణామాలు.. ఇక, ఇరాన్‌తో అమెరికా చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతోంది. అయితే అమెరికా ప్రతిపాదనలపై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అణు కార్యక్రమం కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాల దిశగా కదులుతోందని అమెరికా ఆరోపిస్తుండగా, ఇరాన్ మాత్రం తన కార్యక్రమం శాంతియుతమని చెబుతోంది. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చూస్తే హార్మూజ్‌లో ఉద్రిక్తతలు తగ్గకపోయినా, చర్చల ద్వారా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌కు ఇచ్చిన తాత్కాలిక విరామం ఆ దిశలో కీలక మలుపుగా మారే అవకాశముంది. -
మోదీ ఉండటం భారత ప్రజల అదృష్టం: ట్రంప్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపునకుగానూ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, చరిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ ప్రతినిధి కుశ్ దేశాయ్ మీడియాకు వెల్లడించారు. ‘‘బెంగాల్ విజయంపై ట్రంప్ మోదీకి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. గత నెలలో ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ టైంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన వంటి నేత ఉండటం భారత ప్రజల అదృష్టమని అన్నారు’’ అని కుశ్ దేశాయ్ అన్నారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బ్రేకులు వేస్తూ.. బెంగాల్లో బీజేపీ బంపర్‌హిట్ కొట్టింది. మూడింట రెండొంతులకుపైగా మెజారిటీతో కైవసం చేసుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బెంగాల్లో మెజారిటీ మార్కు 147 కాగా.. బీజేపీ ఏకంగా 206 సీట్లు సాధించింది. తృణమూల్ 81 సీట్లకే పరిమితమైంది. -
వైట్‌హౌస్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: వైట్‌హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వాషింగ్టన్ మాన్యూమెంట్ సమీపంలో తుపాకీతో అనుమానాస్పద వ్యక్తి హల్చల్ చేశాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను చూసిన నిందితుడు కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో అనుమానితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల ఘటనలో ఓ బాలుడు కూడా గాయపడ్డాడు.తుపాకీ కాల్పులు జరగడానికి కొద్ది నిమిషాల ముందు.. వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల గస్తీ తిరుగుతున్న సీక్రెట్ సర్వీస్ అధికారులు,ఏజెంట్లు తుపాకీని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్న ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించారని యూఎస్ఎస్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ మాట్ క్విన్ మీడియా సమావేశంలో చెప్పారు. యూనిఫాంలో ఉన్న సీక్రెట్ సర్వీస్ పోలీసులు ఆ వ్యక్తిని సమీపించగా.. అతను పారిపోతూ అధికారులపై కాల్పులు జరిపారని క్విన్ తెలిపారు. అధికారులు ఎదురుకాల్పులు జరపడంతో ఆ వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి.సదరు వ్యక్తి అంతకుముందు సోమవారం వైట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు మేరీల్యాండ్‌కు చెందిన శ్వేత జాతీయుడిగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. కాగా, నిందితుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని.. స్వల్ప గాయంతో బయటపడ్డారని డీసీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాన్వాయ్ ఆ ప్రాంతం మీదగా వెళ్ళింది.కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. అధ్యక్షుడు ట్రంప్‌కు ఎలాంటి ముప్పు లేదని.. ఈ ఘటనకు వైట్ హౌస్‌తో సంబంధం ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని క్విన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ జరిగిన హోటల్ వద్ద కాల్పుల ఘటన జరిగిన రెండు వారాల లోపే ఈ రెండో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
హర్ముజ్‌పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు పరస్పర ప్రతిపాదనలను తోసిపుచ్చుకున్నాయి. శాంతి చర్చలంటూనే.. ఇరాన్‌ను రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ప్రకటన హర్ముజ్‌లో సరికొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్.. ట్రంప్ చేసిన తాజా ప్రకటన. హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ మేరకు ఆయన సోషల్ ట్రూత్‌లో ‘‘చిక్కుకున్న ఆ నౌకలు తటస్థమైనవి. ఈ ఉద్రిక్తతలతో వాటికి ఏ సంబంధం లేదు. ఏ తప్పు చేయకుండానే అందులో ఉన్న సిబ్బంది ఆహారం, ఇతర అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని సురక్షితంగా బయటకు తేవాల్సిన అవసరం అమెరికా బాధ్యత’’ అని ప్రకటించారు. ఏం చేస్తారంటే.. ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు ఫ్రీడమ్ సోమవారం మధ్యాహ్నాం(మిడిల్ ఈస్ట్ కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. మానవతా దృక్పథంతో ఈ ఆపరేషన్ చేపడుతున్నామని.. ప్రాంతీయ స్థిరత్వానికి, అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం.. సముద్ర మార్గంలో చిక్కుకున్న వందలాది నౌకలు, వాటిల్లోని సుమారు 20,000 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం. ఆ నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు అమెరికా సైన్యం దారి చూపుతుంది. వాటికి రక్షణగా నిలుస్తుంది. తద్వారా వాటి వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు సహాయం చేస్తుంది. సీ ఆపరేషన్‌కు ఇరాన్ సహకరిస్తుందా?హర్ముజ్ సముద్ర మార్గం ప్రపంచ చమురు రవాణాకు కీలకమైనది. రెండు నెలలుగా ఇక్కడ ఏర్పడ్డ అంతరాయం, కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై ప్రభావం పడింది. గ్లోబల్ మార్కెట్ కుదేలైంది. దీనిని ఆసరాగా చేసుకుని అమెరికాను తమ డిమాండ్లకు ఒప్పించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్ తాజా ప్రకటనకు, నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు సహకరిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఇరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల శాంతి ప్రణాళికను ట్రంప్ తిరస్కరించారు. ఆయన దానిని "అంగీకారయోగ్యం కాదు" అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో "సానుకూల చర్చలు" జరుగుతున్నాయని ట్రంప్ సూచించారు. అదే సమయంలో ప్రాజెక్టు ఫ్రీడమ్‌లో గనుక జోక్యం చేసుకుంటే కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.ఇరాన్ ఏమందంటే.. ప్రాజెక్టు ఫ్రీడమ్‌ను మానవతా చర్యగా ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఇది ముమ్మాటికీ అమెరికా వ్యూహాత్మక శక్తి ప్రదర్శనగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఈ చర్యను అసాధ్యంగా ఇరాన్ అభివర్ణిస్తోంది. హర్ముజ్ తమ ఆధీనంలో ఉందని.. ఇప్పటికే అమెరికా బ్లాకేడ్(దిగ్బంధనం) తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని.. ఇప్పుడు నౌకల తరలింపునకు అమెరికా తన సైన్యాన్ని రంగంలోకి దించితే గనుక అది కాల్పుల విరమణ ఉల్లంఘన కిందకే వస్తుందని ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి అబ్రహీం అజిజీ ఈ సముద్ర ఆపరేషన్‌పై సెటైర్లు వేశారు. హర్ముజ్ సముద్ర మార్గం అనేది అమెరికా ట్రూత్ సోషల్ పోస్టులతో నిర్వహించబదని ఎద్దేవా చేశారు. హర్ముజ్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారాయన. దీంతో “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”కు ఇరాన్ సహకారం ఇవ్వదనేది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. -
దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులు చేస్తాం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో తాత్కాలికంగా నిలిచిపోయిన యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు ఇరాన్ నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనను సమీక్షిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒకవేళ ఇరాన్ గనక దురుసుగా ప్రవర్తిస్తే ఆ దేశంపై దాడులు మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆయన శనివారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ నుంచి మియామీ వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ తప్పుగా ప్రవర్తిస్తే, ఏదైనా చెడు చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనను నిశీతంగా పరిశీలిస్తున్నానని, దానిపై మళ్లీ మీడియాతో మాట్లాడతానని తెలిపారు. ఈ కొత్త ఆఫర్ కూడా తనకు అంతగా నచ్చలేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత 47 ఏళ్లుగా మానవాళిపై పాల్పడిన అకృత్యాలకు ఇరాన్ ఇంకా మూల్యం చెల్లించలేదని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నూతన ప్రతిపాదన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను భావించడం లేదన్నారు. ఇరాన్‌కు పెద్ద శిక్ష పడాల్సి ఉందని తేల్చిచెప్పారు. అయితే, పశ్చిమాసియాలో శాంతి సాధన విషయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఈ ప్రపోజల్‌ను ఇరాన్ గురువారం అమెరికాకు పంపించినట్లు తెలిసింది. గతంలో ఇరాన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించి విషయం విదితమే. దానిపై తాను సంతృప్తిగా లేనని ఆయన తేల్చిచెప్పారు. బంతి అమెరికా కోర్టులోనే ఉంది: ఇరాన్ నూతన ప్రతిపాదన పట్ల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతిస్పందించింది. చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరుకుంటారా? లేక యుద్ధానికి తిరిగి వెళ్తారా? అనేది అమెరికా ఇష్టమని తేల్చిచెప్పింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి కజెమ్ ఘరీబాబాదీ పేర్కొన్నారు. దౌత్య మార్గాన్ని ఎంచుకుంటారో లేక ఘర్షణను కొనసాగిస్తారో వారే నిర్ణయించుకోవాలని ఉద్ఘాటించారు. తన జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకోవడమే తమకు ముఖ్యమని స్పష్టంచేశారు. ఇరాన్ రెండు మార్గాలకు.. చర్చలకు లేదా యుద్ధానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఏమిటీ కొత్త ప్రతిపాదన? అమెరికా చేసిన 9 పాయింట్ల ప్రతిపాదనకు ప్రతిస్పందనగా ఇరాన్ 14 పాయింట్లతో ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా దిగ్బంధనాన్ని ముగించడం, ఇరాన్, లెబనాన్‌లో యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంపై ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయా అంశాలపై చర్చలకు ఒక నెల గడువు విధించింది. అటువంటి ఒప్పందం కుదిరిన తర్వాతే అణు కార్యక్రమంపై మరో ఒప్పందానికి వచ్చేందుకు మరో నెల రోజులపాటు చర్చలు కొనసాగించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఎలాంటి దాడులు చేయకూడదని, తమ భద్రతకు హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేస్తామంటూ ఇరాన్ స్పష్టమైన గ్యారంటీ ఇవ్వలేదని సమాచారం. హార్మూజ్‌ను తెరుస్తామని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించే చర్యలపై దృష్టి సారిస్తామని ఇరాన్ వెల్లడించింది. అమెరికా ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని, తమ చమురు ఎగుమతులపై ఆంక్షలు సహా ఆర్థిక ఆంక్షలను తొలగించాలని షరతు విధించింది. సముద్ర వాణిజ్యం, చమురు సరఫరా పునరుద్ధరణను అణు కార్యక్రమాల చర్చల నుంచి వేరు చేయాలన్నదే ఇరాన్ వ్యూహమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనల కింద తమ అణు కార్యక్రమ హక్కులను అధికారికంగా గుర్తించాలని ఇరాన్ కోరుతోంది. ఏ ఒప్పందమైనా శాశ్వతంగా ఉంటుందని, ఏకపక్ష ఉపసంహరణకు తావులేదన్న హామీలు ఇవ్వాలని అంటోంది. -
అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఇదే..
యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇరాన్ ఒక పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపింది. యుద్ధ విరమణ.. ప్రాంతీయ భద్రత, ఆంక్షల తొలగింపు, ఇతర డిమాండ్లతో ముడిపడి ఉండాలని.. వీటన్నింటినీ 30 రోజుల్లోపు పరిష్కరించాలని ఇరాన్ కోరింది. అమెరికా ప్రతిపాదించిన 9 అంశాల ప్రణాళికకు ఇరాన్ అధికారికంగా ఈ 14 అంశాల వివరణాత్మక ప్లాన్‌తో సమాధానమిచ్చినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.అమెరికా రెండు నెలల యుద్ధ విరమణను ప్రతిపాదించగా.. ఇరాన్ దానిని తిరస్కరించింది. అన్ని ప్రధాన సమస్యలను 30 రోజుల్లోనే పరిష్కరించాలని పట్టుబట్టింది. భవిష్యత్తులో సైనిక దాడులు జరగకుండా హామీ ఇవ్వాలని.. ఇరాన్ సరిహద్దు ప్రాంతాల నుండి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. నిలిపివేసిన తమ ఆర్థిక ఆస్తులను విడుదల చేయాలని, నష్టపరిహారం చెల్లించడంతో పాటు సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది.ఈ శాంతి ఒప్పందం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. లెబనాన్‌తో సహా అన్ని వైపులా పోరాటాలను ముగించాలని ఇరాన్ కోరింది. అలాగే, వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిలో భద్రత, రవాణా నియంత్రణ కోసం కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. ఈ కొత్త ప్రతిపాదనను సమీక్షిస్తానని చెబుతూనే.. దశాబ్దాలుగా టెహ్రాన్ చేసిన చర్యలకు ఇంకా తగినంత భారీ మూల్యం చెల్లించలేదని పేర్కొన్నారు. తాను త్వరలోనే ఇరాన్ పంపిన ఈ ప్రణాళికను పరిశీలిస్తానని.. అయితే ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను ఊహించలేకపోతున్నానని ఆయన రాసుకొచ్చారు. -
జర్మనీకి ట్రంప్ భారీ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ మిత్రదేశాలకు ఊహించని షాక్ ఇచ్చారు. జర్మనీలో మోహరించిన అమెరికా సైనిక బలగాలను భారీ సంఖ్యలో తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఇరాన్ వివాదంలో జర్మనీ సహకారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ట్రంప్.. గతంలో పెంటగాన్ ప్రతిపాదించిన 5,000 కంటే చాలా ఎక్కువ సంఖ్యలో సైనికులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. ఈ అనూహ్య నిర్ణయంతో అగ్రరాజ్యానికి, నాటో మిత్రదేశాలకు మధ్య ఉన్న దౌత్యపరమైన అంతరం మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది.జర్మనీ వైఖరిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిజర్మనీ నుంచి సుమారు 5,000 మంది అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలనే పెంటగాన్ తాజా ప్రణాళికల నేపథ్యంలో ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే సమయంలో సౌత్ ఫ్లోరిడాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మేము బలగాలను భారీగా తగ్గిస్తున్నాం.. ఆ సంఖ్య 5,000 కంటే చాలా ఎక్కువే ఉంటుంది’ అని తేల్చి చెప్పారు. ఇరాన్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్లకు జర్మనీ వంటి కీలక ఐరోపా మిత్రదేశాల నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్నదే ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.జర్మన్ ఛాన్సలర్ మెర్జ్‌పై విమర్శనాస్త్రాలుఈ వ్యవహారంలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌పై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరాన్‌పై అమెరికా తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వడంలో మెర్జ్ విఫలమయ్యారని ఆరోపించారు. జర్మనీలో ఇమ్మిగ్రేషన్, ఇంధనం, ఉక్రెయిన్ వంటి అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో మెర్జ్ అత్యంత పేలవంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ‘ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం మీకు ఇష్టమేనా?’ అని తాను మెర్జ్‌ను ప్రశ్నించానని, ఆయన ‘కాదు’ అని సమాధానం ఇచ్చారని ట్రంప్ ఒక కార్యక్రమంలో వెల్లడించారు.ఇటలీ, స్పెయిన్లకూ హెచ్చరికలుకేవలం జర్మనీకే పరిమితం కాకుండా, ఇటలీ, స్పెయిన్లలో మోహరించిన అమెరికా సైనిక సిబ్బందిని సైతం తగ్గించే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు. ఇరాన్ వివాదంలో ఆయా దేశాల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ తాజా ప్రకటనలు.. అమెరికా, దాని చిరకాల యూరోపియన్ మిత్రదేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన విబేధాలను ఎత్తిచూపుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో విదేశాంగ విధానం, సైనిక వ్యూహాలకు సంబంధించి వాషింగ్టన్కు, కీలక నాటో సభ్య దేశాలకు మధ్య రోజురోజుకూ తీవ్ర అంతరాలు పొడచూపుతున్నాయని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.ఇది కూడా చదవండి: స్ట్రాంగ్‌రూమ్ పాలిటిక్స్‌తో బెంగాల్ హీట్ -
ఇరాన్‌పై యుద్ధం ముగిసింది.. కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదు
వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కాబట్టి యుద్ధం ముగిసినట్లేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేశారు. యుద్ధానికి చట్టపరమైన ఆమోదం కోసం తాను గడువును పాటించాల్సిన అవసరం లేదని వాదించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న ఆరంభమైన దాడులు ఏప్రిల్ 7 నుంచి ఆగిపోయాయని గుర్తుచేశారు. 1973 నాటి వార్ పవర్స్ చట్టం ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు మరో దేశంపై సైనిక చర్య ప్రారంభించినప్పుడు దాని గురించి చట్టసభ సభ్యులకు తెలియజేసిన 60 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాలి. లేకపోతే యుద్ధాన్ని విరమించుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ శుక్రవారం కాంగ్రెస్ సభ్యులకు లేఖ రాశారు. కాల్పుల విరమణ నేపథ్యంలో యుద్ధం ఆగిపోయింది కాబట్టి వార్ పవర్స్ చట్టం ప్రకారం తాను నడుచుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధం గురించి కాంగ్రెస్ సభ్యులకు అధికారికంగా తెలియజేసిన తర్వాత సరిగ్గా 60వ రోజున ట్రంప్ ఈ లేఖ రాయడం గమనార్హం. 60 రోజుల డెడ్‌లైన్ శుక్రవారమే ముగిసింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దీర్ఘకాల శాంతి ఒప్పందంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రధానంగా అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో అమెరికా విధించిన షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. వారికి లేని అనుమతి నాకెందుకు? ఇరాన్‌తో యుద్ధం కొనసాగించడానికి తనకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. గతంలో అమెరికా కమాండర్–ఇన్–చీఫ్‌లు అలాంటి అనుమతి ఏనాడూ తీసుకోలేదని స్పష్టంచేశారు. యుద్ధం చేసే విషయంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కాంగ్రెస్ అధికారాన్ని మాజీ అధ్యక్షులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా భావించారని తెలిపారు. ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై దాడులు కొనసాగించడానికి కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకుంటారా? అని ప్రశ్నించగా, మాజీ అధ్యక్షులు కాంగ్రెస్‌ను పరిగణనలోకి తీ సుకోకుండా యుద్ధాలు చేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎవరూ అనుమతి అడగలేదని వెల్లడించారు. వారికి లేని అనుమతి తనకెందుక ని ట్రంప్ పరోక్షంగా అసహనం వ్యక్తంచేశారు. ఇరాన్ నుంచి తిరిగొస్తూ క్యూబాను స్వాదీనం చేసుకుంటాం చమత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చమత్కరించారు. ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు అమెరికా నౌకాదళం క్యూబాతో తలపడుతుందని అన్నారు. క్యూబాను స్వాధీనం చేసుసుకొనే ఆలోచన ఉందంటూ తన మనసులోని మాటను పరోక్షంగా వ్యక్తీకరించారు. క్యూబాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ట్రంప్ శుక్రవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ఇరాన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు, మా పెద్ద విమాన వాహక నౌకల్లో ఒకటైన, బహుశా ప్రపంచంలోనే అతిపెద్దదైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను క్యూబా తీరానికి సుమారు 100 గజాల దూరంలో నిలిపినప్పుడు క్యూబా ప్రజలు ఎదురొస్తారు. మీకు ధన్యవాదాలు, మేము లొంగిపోతున్నాం అని చెబుతారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. క్యూబాపై అమెరికా ఎప్పటినుంచో కన్నేసింది. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తనకు కావాల్సింది సాధించుకోవడానికి క్యూబాపై సైనిక చర్య తీసుకోవచ్చని ట్రంప్ పదేపదే బెదిరిస్తూ వస్తున్నారు. హార్మూజ్‌లో ఇరాన్‌కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తాం దుబాయ్: హార్మూజ్ జలసంధిలో ప్రయాణించడానికి ఇరాన్‌కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తామని షిప్పింగ్ కంపెనీలను అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ ఆఫీసు ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేసింది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. జలసంధిలో ఇరాన్ ఓడరేవులను అమెరికా సైన్యం దిగ్బంధించింది. మరోవైపు విదేశీ నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. తమ తీరానికి దగ్గరగా ఉన్న మార్గాల్లో కొన్ని నౌకలకు మాత్రం అనుమతి ఇస్తోంది. అందుకు వాటి నుంచి రుసుము వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. -
"మేము సముద్రపు దొంగలమేమో" .. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. తాజాగా ఆయన అటువంటి వ్యాఖ్యలే చేశారు. "మేము సముద్రపు దొంగల లాంటి వాళ్లం" అని అమెరికాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల స్వాధీనం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీ ట్రంప్ మాట్లాడారు. అందులో " మేము ... నౌకపైకి దూకి, దాన్ని మా ఆధీనంలోకి తీసుకున్నాము. సరుకును స్వాధీనం చేసుకున్నాం, చమురును తీసుకున్నాం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం." అన్నారు. ట్రంప్ ఇలా వ్యాఖ్యానించిన తర్వాత ఆ సభలో ప్రజలు కేరింతలు కొడుతూ ఈలలు వేశారు. ఇటీవల ఇరాన్‌కు చెందిన నౌకలను అమెరికా దిగ్భందనం చేసింది ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడారు.అయితే ఇరాన్ ఓడరేవుల వద్ద అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగుతుంది. అమెరికా దళాలు 'మేజిస్టిక్ ఎక్స్' ఇరాన్-ఫ్లాగ్ కలిగిన 'టూస్కా' వంటి కార్గో నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై ఇరాన్ సైతం ఘాటుగానే స్పందించింది. "అంతర్జాతీయ జలాల్లో సాయుధ దోపిడీ" అని పేర్కొంటూ, వాషింగ్టన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఈ చర్య వాస్తవంగా సముద్రపు దొంగతనాన్ని సమర్థించడమేనని అన్నారు. దీనిని ఆయన "అంతర్జాతీయ జలాల్లో సముద్రపు దొంగతనం మరియు సాయుధ దోపిడీని ప్రత్యక్షంగా చట్టబద్ధం చేయడమే" అని అభివర్ణించారు. తాజాగా ట్రంప్ సైతం ఈ వ్యాఖ్యలకు కౌంటర్ తాము సముద్రపు దొంగలమేనన్నారు.అయితే కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ చర్యలు తనను సంతృప్తి పరచలేదని యుద్దాన్ని ముగించే ప్రసక్తే లేదన్నారు. -
నో డీల్..నో క్లారిటీ : మా దళాలు సిద్ధం : ఇరాన్ సంచలన ప్రకటన
ఏప్రిల్ 7 నుంచి అమెరికా బలగాలు, ఇరాన్ మధ్య కాల్పులు జరగలేదని కాంగ్రెస్ నేతలకు శుక్రవారం(మే 1) రాసిన లేఖలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ముగిసిందంటూ కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో ట్రంప్ ఈ లేఖ రాశారు. అంతేకాదు యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం ఇప్పుడు తనకు లేదని పేర్కొన్నారు. అయితే దీనికి స్పందనగా ఇరాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, దీనివల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగే అవకాశం ఉందని, తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించింది.ఖతం అల్-అన్బియాసెంట్రల్ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్దార్ మహమ్మద్ జాఫర్ అసాదీ శనివారం మాట్లాడుతూ, వాషింగ్టన్ దౌత్యపరమైన అవగాహనలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శించారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రధానంగా మీడియా ప్రేరేపితమైనవని విమర్శించారు. కేవలం చమురు ధరలు తగ్గకుండా చూడటానికి ,వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమే వారు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏవైనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!భారీ నష్టంసిఎన్ఎన్ (CNN) పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. కువైట్‌లోని క్యాంప్ బ్యూరింగ్ ప్రాంతంలోని అతిపెద్ద అమెరికా స్థావరాలలో ఒకటైన ఇక్కడ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీనిలోని ప్రధాన భాగాలు ప్రస్తుతం పనిచేయడం లేదు.ఇదీ చదవండి: నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకంఎనిమిది దేశాల్లోని కనీసం 16 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. పశ్చిమ ఆసియాలోని మెజారిటీ అమెరికా సైనిక స్థావరాలు ఈ దాడుల వల్ల ప్రభావితమయ్యాయని, కొన్ని చోట్ల సౌకర్యాలు పూర్తిగా ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంమరోవైపు, అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.పారిశ్రామిక మార్గాల్లో అమెరికా కఠిన చర్యల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల చమురు ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగాన్ అంచనా వేసినట్లు యాక్సియోస్ (Axios) నివేదించింది. కాగా అమెరికా, ఇరాన్ మధ్య దీర్ఘకాలిక ఒప్పందమేదీ ఇంతవరకూ కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ ద్వారా తెహ్రాన్ కొత్త సందేశం పంపించిందని ఇరాన్ మీడియా చెబుతోంది. మరోవైపు మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపిన ఒక అధికారిక ప్రతిపాదనలో కొత్త కాలపరిమితిని స్పష్టంగా పేర్కొన్నారని ఆ అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ఇజ్రాయెల్ మరియు అమెరికా మళ్లీ దాడి చేయవన్న హామీతో యుద్ధం ముగుస్తుంది. ఇరాన్ జలసంధిని తెరుస్తుంది ,అమెరికా ఇరాన్‌పై తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. -
ఇరాన్ నన్ను ఇరిటేట్ చేస్తోంది.. ట్రంప్
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని ప్రస్తుతానికి యుద్దం ముగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే ఇరాన్ మాత్రం తమతో యుద్దం ముగింపుకై సంప్రదింపులు జరుపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 60 రోజులు గడుస్తోంది అయినప్పటీకీ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు దేశాలు చర్చల విషయంలో తగ్గడం లేదు. అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం కుదరదు అనడం ఇరాన్ దానికి ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడంతో చర్చలు సాగడం లేదు. అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంలో మరోసారి స్పందించారు.ట్రంప్ మాట్లాడుతూ "వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ నేను దానికి సిద్ధంగా లేను; నాకు దానితో తృప్తి లేదు, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వారు పురోగతి సాధించారు, కానీ వారు ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్లో వారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.కాగా ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైననాటి నుంచి చట్టపరమైన అనుమతి కోరడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఈ రోజు ( శనివారం)చివరి గడువు అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో యుద్ధం ముగిసిపోయినందున దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ కాంగ్రెస్‌కు తెలిపినట్లు సమాచారం. -
ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!
యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించకపోవడం వల్ల తాను ఈ సుంకాలను పెంచుతున్నట్లు ట్రంప్ తెలిపారు."మనం పూర్తిగా అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ పాటించలేదు. కాబట్టి వచ్చే వారం అమెరికాలోకి వచ్చే కార్లు, ట్రక్కులపై యూరోపియన్ యూనియన్‌కు విధించే సుంకాలను పెంచుతాను," అని ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల బిలియన్ల డాలర్ల ఆదాయం యునైటెడ్ స్టేట్స్లోకి వస్తుంది. అంతే కాకుండా ఇది ఉత్పత్తిని మరింత వేగవంతం చేసేలా ఒత్తిడి తెస్తుందని పేర్కొన్నారు.ఆగస్టులో అమెరికా, యూరోపియన్ యూనియన్ ఒక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి, దీని ప్రకారం యూరోపియన్ యూనియన్‌పై సుంకాలను 15 శాతానికి తగ్గించారు. ఆ సమయంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పారిశ్రామిక వస్తువులు, వాహనాలపై సుంకాలను తొలగించడానికి యూరోపియన్ యూనియన్ కూడా అంగీకరించింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు! -
మళ్లీ అదే జరగొచ్చు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చంటూ ఇరాన్ సీనియర్ సైనిక అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు నిలిచిపోవడంతో అమెరికాతో తిరిగి ఘర్షణ తలెత్తే అవకాశం ఉందన్నారు. అమెరికా హామీలకు, ఒప్పందాలకు కట్టుబడి ఉండదని ఆధారాలు చూపిస్తున్నాయంటూ ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్ సెంటర్ 'ఖతమ్ అల్-అంబియా'కు చెందిన మొహమ్మద్ జాఫర్ అసాదీ అన్నట్లు ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ పేర్కొంది. మరో వైపు, యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని.. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదన్న ట్రంప్... అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు.ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్‌పై యుద్ధం ముగిసిపోయిందంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్‌పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. -
వైట్‌హౌస్‌లో అసలు జరిగింది ఇదే.. కీలక వీడియో విడుదల
వాషింగ్టన్: వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అమెరికా న్యాయశాఖ.. కీలక వీడియోను విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపే ఉద్దేశంతో గత వారం జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ విందులోకి కోల్ టోమస్ అలెన్ చొరబడటానికి ప్రయత్నించిన దృశ్యాలు విడుదలయ్యాయి. అలెన్ లొంగిపోయే ముందు అసలు కాల్పులు జరిపాడా? సందేహాల మధ్య, వాషింగ్టన్ డిసి టాప్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జీనైన్ పిరో, ఈ ఘటనకు సంబంధించిన ఎడిట్ చేసిన భద్రతా కెమెరా ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.సెక్యూరిటీ చెక్ పాయింట్లో నుంచి నిందితుడు ఒక్కసారిగా దూసుకొచ్చి కాల్పులు జరపడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. శనివారం నాటి విందు కంటే ఒక రోజు ముందుగానే అలెన్ ఆ హోటల్ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. తనిఖీ కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్లను తొలగిస్తున్న సమయంలో అలెన్ ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై కాల్పులు జరిపి లోపలికి దూసుకెళ్లాడు. అలెన్.. సీక్రెట్ సర్వీస్ అధికారి కాల్పులు కారణంగా కిందపడలేదు. తనిఖీ కేంద్రం వద్ద ఉన్న ఒక మెటల్ డిటెక్టర్ బాక్స్‌ను ఢీకొని కింద పడిపోయాడు. ఏజెంట్ జరిపిన ఐదు రౌండ్ల కాల్పుల్లో ఏ ఒక్కటి కూడా అలెన్‌కు తగలలేదని అధికారులు తెలిపారు.అలెన్ మొదట కాల్పులు జరిపాడని ప్రభుత్వం వాదిస్తుండగా.. వాషింగ్టన్ పోస్ట్ వీడియో విశ్లేషణలో కేవలం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జరిపిన నాలుగు షాట్లు మాత్రమే కనిపించాయి. ఏజెంట్‌పై అలెన్ కాల్పులు జరిపాడనడానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఆధారాలను సేకరిస్తోందని అలెన్ తరపు పబ్లిక్ డిఫెండర్లు పేర్కొన్నారు.🇺🇸 The United States has released high quality footage from the White House Correspondents Dinner shooting.This is not AI generated..😳 pic.twitter.com/AAP86I160M— Orbit News (@Orbit_News10) May 1, 2026 -
అమెరికా అధ్యక్షుడి మరో సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. క్యూబాపై ఆర్మీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇరాన్ నుంచి అమెరికా సైన్యం తిరిగి వచ్చే దారిలోనే ఈ ఆపరేషన్ ముగియవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నాం. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటాం. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలోనే మా సైన్యం ఆ పని చేయబోతోంది. అబ్రహం లింకన్ యుద్ధ నౌకను ఆ దేశానికి 100 గజాల దూరంలో ఆపుతాం. మేం లొంగిపోతున్నాం అని క్యూబా చెప్పేలా చేస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారాయన. అమెరికా–క్యూబా మధ్య వైరం కొత్తది కాదు. 19వ శతాబ్దం నుంచే ప్రారంభమై.. ఫిడెల్ కాస్ట్రో విప్లవం తర్వాత మరింత తీవ్రమైంది. అమెరికా వ్యాపార ప్రయోజనాలు, కమ్యూనిస్టు సిద్ధాంతం, సోవియట్ యూనియన్‌తో క్యూబా స్నేహం.. ఇవన్నీ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణమయ్యాయి. అయితే.. ఆ మధ్యలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. అయితే ట్రంప్ రాకతో ఆ పరిస్థితి మారిపోయింది. ట్రంప్ తాజా ప్రకటన ఇరు దేశాల మధ్య వైరం మరింత పెంచేలా కనిపిస్తోంది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను సైనిక చర్య ద్వారా అమెరికా బంధించిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనే ట్రంప్ ‘క్యూబా నెక్ట్స్..’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అదొక ఒక విఫల దేశం. దాని దగ్గర డబ్బు లేదు.. చమురు లేదు. కానీ అదో అందమైన ద్వీపం. దానిని స్వాధీనం చేసుకోవడం నాకు గౌరవం’’ అని వ్యాఖ్యానించారు. అది జరగదు.. ఇప్పటికే అమెరికా తీవ్ర ఆంక్షలతో క్యూబా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చమురు దిగుమతులపై బ్లాకేడ్ కారణంగా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అలాగే.. విద్యుత్ కోతలు, నీటి కొరత, ఔషధాల కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ట్రంప్ తాజా అల్టిమేటంపై క్యూబా స్పందించింది. ‘‘క్యూబా ఓ స్వతంత్ర దేశం. అలాంటప్పుడు అమెరికా మాకు ఆదేశాలివ్వడం ఏంటి?. నేను లొంగిపోను.. రాజీనామా చేయను. మా నాయకత్వాన్ని నిర్ణయించేది ఇక్కడి ప్రజలే’’ అని అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ ప్రకటించారు. -
ఇరాన్ కొత్త ప్రతిపాదన నచ్చలేదు
వాషింగ్టన్: యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని స్పష్టంచేశారు. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదని అన్నారు. అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఇంకా తెలియరాలేదు. ‘‘ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ ప్రతిపాదన నాకు సంతృప్తి కలిగించలేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం’’అని శుక్రవారం వైట్ హౌస్‌లో ట్రంప్ విలేకరులతో అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫోన్ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన రావడం ఇదే మొదటిసారి కాదు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఇంతకుముందు అంగీకరించింది. కానీ తమ అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని షరతు విధించింది. అందుకు అమెరికా ఒప్పుకోలేదు. ఇరాన్‌తో చర్చల ముసాయిదా పత్రంలో అణు కార్యక్రమ అంశాన్ని చేర్చాలంటూ తమ ప్రతినిధి బృందాన్ని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. చర్చలు కొనసాగుతున్నంత కాలం.. బాంబు దాడికి గురైన ఇరాన్ అణు కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను తరలించడానికి ప్రయతి్నంచబోమని, లేదా ఆ కర్మాగారాల్లో ఎలాంటి కార్యకలాపాలను పునఃప్రారంభించబోమని ఇరాన్ హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేసింది. దీనిపై ఇరాన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి మళ్లీ కొత్త ప్రతిపాదన రావడం ఆసక్తి కలిగిస్తోంది. మాతో ఒప్పందానికి ఇరాన్ తహతహ పశ్చిమాసియాలో ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసిన యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ తహతహలాడుతోందని ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై వైమానిక దాడులను పునఃప్రారంభించే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టంచేశారు. ఇరాన్లో కాల్పుల విరమణను ఉల్లంఘించాలన్న ఆలోచన అమెరికాకు ఉందా? అని ప్రశ్నించగా.. ఆ అవసరం ఉందని తాను అనుకోవడం లేదని ట్రంప్ బదులిచ్చారు. అమెరికా చేపట్టిన సైనిక చర్య ఇరాన్ సైనిక సామర్థ్యాలను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నౌకాదళం, వాయుసేన చాలావరకు ధ్వంసమయ్యాయి. డ్రోన్ ఫ్యాక్టరీలు 82 శాతం నష్టపోయాయి. క్షిపణి ఉత్పత్తి కూడా దారుణంగా పడిపోయింది. క్షిపణి ఫ్యాక్టరీలు దాదాపు 90 శాతం పడిపోయాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని నాశనం చేశాం. హార్మూజ్ జలసంధిపై అమెరికా విధించిన దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా కుప్పకూలుతోంది’’అని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈయూ వాహనాలపై సుంకాల పెంపుయూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను వచ్చేవారం 25 శాతం పెంచబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తాము పూర్తిగా అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించడం లేదని ఆక్షేపించారు. అయితే, తమ అభ్యంతరాలు ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఇరాన్‌పై యుద్ధం ముగిసింది: అమెరికా వాషింగ్టన్: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్‌పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్‌పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. -
అమెరికా కీలక నిర్ణయం.. 5,000 మంది సైనికులు వెనక్కి..
వాషింగ్టన్: జర్మనీ నుంచి 5,000 మంది అమెరికా సైనికులను వెనక్కి తీసుకురావాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించినట్లు పెంటగాన్ తెలిపింది. ఇరాన్ యుద్ధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరప్ మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నాటో మిత్ర దేశానికి హెచ్చరికగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌తో అమెరికా జరపాల్సిన శాంతి చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాను ఇరాన్ ప్రభుత్వం అవమానానికి గురిచేసిందంటూ ఇటీవల జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరిగిన చర్చల్లో అమెరికా బలహీనంగా కనిపించిందని, సరైన ఫలితం తీసుకురాలేకపోయిందని విమర్శించారు.దీంతో ట్రంప్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ.. జర్మనీ నుంచి సైనికులను ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. పెంటగాన్ ప్రధాన ప్రతినిధి షాన్ పార్నెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉపసంహరణ ప్రక్రియ వచ్చే 6 నుంచి 12 నెలల్లో పూర్తవుతుందని రాయిటర్స్ పత్రిక పేర్కొంది. మరోవైపు, ఇటలీ, స్పెయిన్‌లో కూడా తమ సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పారు. జర్మనీలో 36,436 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వారిలో 5,000 మంది అమెరికాకు తిరిగి వచ్చేయనున్నారు. ఇక, ఇటలీలో 12,662 మంది, స్పెయిన్‌లో 3,814 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో పాటు హార్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోవడం వల్ల నాటో మిత్రదేశాలపై డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇరాన్ తన మాట వినకపోవడంతో దాడులు చేయాలని ఆయన ఆదేశించినట్లు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ వెల్లడించింది.యాక్సియోస్ నివేదిక ప్రకారం.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి లేకపోవడం, ఇరాన్ బెదిరింపులు పెరగడం వంటి పరిణామాలపై ట్రంప్ యూనైటెడ్ స్టేట్ సెంట్రల్ కమాండ్ అధికారి బ్రాడ్ కూపర్, రక్షణ మంత్రి, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో 45 నిమిషాల పాటు ముఖాముఖీ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఇరాన్‌పై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధ సామాగ్రిని పంపింది. జెరూసలేం పోస్టు ప్రకారం సుమారు 6,500 టన్నుల ఆయుధాలు, పరికరాలు ఇజ్రాయెల్‌కు చేరాయి. వీటిలో వాయు, భూతల ఆయుధాలు, సైనిక ట్రక్కులు, జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్ యూనిట్లు ఉన్నాయి. ఈ సరుకు రెండు నౌకల ద్వారా అష్డోడ్, హైఫా పోర్టులకు చేరగా, అనేక విమానాల ద్వారా కూడా రవాణా జరిగింది.‘ఆపరేషన్ రోరింగ్ లయన్ ప్రారంభమైనప్పటి నుంచి 403 ఎయిర్లిఫ్ట్స్, 10 సీలిఫ్ట్స్ ద్వారా 115,600 టన్నులకుపైగా సైనిక సామాగ్రి అందుకుంది’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ ఎప్పుడైనా శత్రువులపై చర్యలకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రక్షణ అధికారులు ఆయుధ రవాణా కొనసాగుతుందని, మరింత విస్తరించవచ్చని తెలిపారు. -
ట్రంప్ పై దాడి Live వీడియో.. ఇలా వచ్చాడు.. అలా కాల్చాడు
-
‘జాతీయత ఆధారంగా వివక్ష చూపకూడదు’
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకువచ్చిన వివాదాస్పద నిర్ణయాలకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని నిర్దిష్ట దేశాలకు చెందిన వారి గ్రీన్ కార్డులు, వర్క్ పర్మిట్లు, దరఖాస్తులను నిలిపివేస్తూ తీసుకున్న చర్యలు వివక్షతో కూడుకున్నవని, అవి చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తేల్చిచెప్పారు.కేసు నేపథ్యంఇరాన్, హైతీ, వెనిజులా, సిరియా సహా సుమారు 20 దేశాలకు చెందిన దాదాపు 200 మంది వలసదారులు తమ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేతను సవాలు చేస్తూ బోస్టన్ కోర్టులో దావా వేశారు. నవంబర్ 2025లో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అవలంబించిన విధానాన్ని వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విధానం ప్రకారం, ప్రయాణ నిషేధం ఉన్న 39 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల జాతీయతను, వారి అప్లికేషన్లను తిరస్కరించడానికి ‘ముఖ్యమైన ప్రతికూల కారకం’ (significant negative factor)గా పరిగణించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆదేశించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఈ ఏజెన్సీ దరఖాస్తులను ప్రాసెస్ చేయకుండా నిలిపివేసింది.న్యాయమూర్తి తీర్పులోని ముఖ్యాంశాలుఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జూలియా కోబిక్ కీలక తీర్పును వెలువరించారు. జాతీయత ఆధారంగా వివక్ష చూపడం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌కు విరుద్ధమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆశ్రయ(అకామిడేషన్) దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏజెన్సీ వాటిని నిలిపివేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం వల్ల పిటిషన్‌దారులు తీవ్రంగా నష్టపోయారని భావించిన న్యాయమూర్తి వారి దరఖాస్తులపై యూఎస్సీఐఎస్ నిబంధనలను నిలిపేయాలని చెప్పారు.న్యాయ నిపుణుల స్పందనఈ తీర్పును పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది జిమ్ హ్యాకింగ్ స్వాగతించారు. ‘యూఎస్సీఐఎస్ కేవలం ఫలానా దేశం నుంచి వచ్చారన్న కారణంతో ఎవరికీ ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు దక్కకుండా చేయాలని చూస్తోంది. కానీ దీనికి కాంగ్రెస్ ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఈ తీర్పు ప్రధానంగా 22 మంది వాదులకు వర్తిస్తుండగా మిగిలిన 200 మందికి కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేసే అంశంపై చర్చించాలని ఇరుపక్షాలకు న్యాయమూర్తి సూచించారు.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
అందుకే బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ వేసుకోను: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించవచ్చు కదా? అని మీడియా నుంచి ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన వింత సమాధానమే ఇచ్చారు. నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం ఇష్టం లేదు. అది వేసుకుంటే లావుగా కనిపిస్తా అని అన్నారాయన. ‘‘ మరో 20 పౌండ్లు ఎక్కువ బరువును నేను మోయగలనో లేదో నాకైతే తెలియదు. కానీ, అలా లావుగా ఉన్నట్లు కనిపించడం మాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే అది వేసుకోను. ..బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ వేసుకోవాలని భద్రతా సిబ్బంది కోరారు. కానీ దాన్ని వేసుకుంటే.. దుష్ట శక్తుల ముందు నేను లొంగిపోయినట్లే అవుతుంది. అది నాకు అంతగా ఇష్టం లేదు’’ అని ట్రంప్ చెప్పారు. ఏప్రిల్‌లో జరిగిన వైద్య పరీక్షల ప్రకారం.. 79 ఏళ్ల వయసున్న ట్రంప్ బరువు 102 కేజీలు. డైట్ విషయంలో ఓ పద్దతీ లేకుండా అన్నీ లాగించేస్తుంటారాయన. గత రెండేళ్లలో ట్రంప్‌పై మూడుసార్లు హత్యాయత్నం జరిగింది. చివరగా.. హిల్టన్ హోటల్లో జరిగిన వైట్‌హౌజ్ కరస్పాండెంట్స్ అసోషియేషన్ మీటింగ్‌లో ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. అయితే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని.. ట్రంప్ దంపతులతో పాటు వీవీఐపీలందరినీ రక్షించగలిగారు. పిరికిపందలా పరిగెత్తడం కంటే.. ప్రజల మధ్య ధైర్యంగా కనిపించడం నాకు ముఖ్యం అని ట్రంప్ తరచూ చెబుతుంటారు. -
60 రోజుల గడువు ముగుస్తున్న వేళ.. అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: అరవై రోజుల గడువు ముగుస్తున్న వేళ.. ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ బృందం కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య కోసం కాంగ్రెస్(అమెరికా పార్లమెంటు) ఆమోదం పొందాల్సిన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 60 రోజుల గడువు గురించి అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్‌ను ఓ వార్తా సంస్థ ప్రశ్నించగా.. తాము యుద్ధంలో లేమంటూ ఆయన సమాధానమిచ్చారు.ప్రస్తుతం బాంబు దాడులు, కాల్పులు వంటి క్రియాశీలక సైనిక చర్యలేవీ జరగడం లేదు. ప్రస్తుతం మేము శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. చాలా సున్నితమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగలడానికి నేను ఇష్టపడను. ఏం జరుగుతుందో వేచి చూడాలని జాన్సన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా టెహ్రాన్, ఇరానియన్ నగరాలపై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సీనియర్ కమాండర్లు, పౌరులు మరణించారు.దీనికి ప్రతికారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాంబు దాడులు చేసింది. అంతేకాకుండా కీలకమైన వాణిజ్య నౌకా రవాణా మార్గమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను కూడా ఇరాన్ మూసివేసింది. మార్చి 2న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య గురించి కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా యుద్ధ అధికారాల చట్టం (US War Powers Act) ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది. ఇవాళ (మే 1)తో ముగుస్తుంది.చట్టపరమైన నిబంధనలు ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి లేదు. కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని వాడటానికి గరిష్ఠ గడువు 60 రోజులుగా నిర్ణయించారు. శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా అమెరికా పార్లమెంటుకు అధ్యక్షుడు తెలపాల్సి ఉంటుంది.కాగా, తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ.. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కష్టతరంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సెనేట్‌లో తీర్మానం ఆమోదం పొందినా, రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న హౌస్‌లో ఆమోదం పొందడం.. అలాగే ట్రంప్ దానిపై వీటో (Veto) అధికారాన్ని ఉపయోగించడం వంటి అడ్డంకులు ఉన్నాయి. 'వార్ పవర్స్ యాక్ట్' (War Powers Act) అధ్యక్షుడి యుద్ధ నిర్ణయాలను నియంత్రించడంలో అరుదుగా మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, కోర్టులు జోక్యం చేసుకోవడానికి వెనుకాడడం, వివాదాలు రాజకీయ వేదికలకే పరిమితం కావడంతో ట్రంప్‌ను నియంత్రించడం డెమోక్రాట్లకు సవాలుగా మారింది. -
ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళిక సిద్ధం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రణాళికలో భాగంగా మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ, హార్మూజ్‌లో ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.జలసంధిలో స్వేచ్ఛాయుత ఇంధన రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి పెంచడం, తద్వారా ఆ దేశం దిగొచ్చేలా చేయడమే అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. హార్మూజ్‌పై ఇరాన్ పట్టును సడలించేలా ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ పలు దౌత్య, విధానపరమైన మార్గాలను పరిశీలిస్తున్నారని తెలియజేశారు. మొత్తానికి ఇరాన్‌కు దారికి తీసుకురావడం, హార్మూజ్‌ను తెరిపించడం ట్రంప్ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు, శత్రువుల భారీ నుంచి గల్ఫ్‌ను కాపాడుతామని.. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్‌లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామంటూ పరోక్షంగా స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా.. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్‌తోపాటు హార్మూజ్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. -
ట్రంప్ మరో కీలక ప్రకటన.. ఆ 2 దేశాల్లోనూ..
వాషింగ్టన్: ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో నాటోలోని దేశాలపై విమర్శలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. ఇటలీ, స్పెయిన్‌లో తమ సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. “అవును.. బహుశా నేను ఈ పనిని చేస్తాను. ఎందుకు చేయకూడదు. ఇటలీ మాకు ఎలాంటి సాయమూ చేయలేదు, స్పెయిన్ కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తోంది” అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు జర్మనీ విషయంలోనూ ఇలాంటి ప్రతిపాదనే చేశారు ట్రంప్. జర్మనీలో అమెరికా మోహరించిన వేలాది మంది సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, సమీక్షిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఇటీవల మాట్లాడుతూ.. ఇరాన్‌తో జరిగిన చర్చల్లో అమెరికా బలహీనంగా కనిపించిందని, సరైన ఫలితం తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఫ్రెడ్రిక్ ఆ విమర్శ చేసిన నేపథ్యంలో ట్రంప్ జర్మనీలో సైనికులను తగ్గిస్తామంటూ స్పందించారు. కాగా, 2025 డిసెంబర్ 31 నాటికి ఇటలీలో 12,662 మంది, స్పెయిన్‌లో 3,814 మంది క్రియాశీల అమెరికా సైనికులు ఉన్నారు. జర్మనీలో 36,436 మంది ఉన్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ఇవ్వకపోవడం, హార్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోవడం వల్ల నాటో మిత్రదేశాలపై ట్రంప్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇరాన్ విషయంలో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ధైర్యం లేదంటూ ఈ నెల ప్రారంభంలో ట్రంప్ విమర్శించారు. గత వారం వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఇరాన్‌పై సైనిక చర్యలకు మద్దతు ఇవ్వనందుకు స్పెయిన్‌ను నాటో నుంచి సస్పెండ్ చేయాలన్న విషయాన్ని అమెరికా పరిశీలిస్తోంది. -
ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇరాన్ ఇప్పటికే బలహీనమైపోయిందని, ఇంకెంత కాలం నిలబడుతుందో చూద్దామని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్ నేతలు 42,000 మందిని చంపారు. నేను ఓ విధంగా ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇది రఫ్ గ్రూప్, కానీ, మేము వారిని పూర్తిగా బలహీనపరిచాం. వారి ఆర్థిక వ్యవస్థ దుర్భర స్థితిలో ఉంది. కాబట్టి వారు ఎంతకాలం నిలబడతారో చూద్దాం.సైనిక చర్య జరిగినప్పటికీ దాన్ని నేను యుద్ధం అని పిలవను. ఇరాన్ ఒప్పందం చేసుకోవడానికి అమితాసక్తి చూపుతోంది. వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, అన్ని రకాల సామగ్రి దాదాపు పూర్తిగా నశించింది. వారి డ్రోన్ ఫ్యాక్టరీలు సుమారు 82 శాతం తగ్గిపోయాయి. వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు.. మేము వారి అణు సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం. అందువల్ల వారికి అణు బాంబు దక్కలేదు.నేను 8 యుద్ధాలను ఆపాను. దాదాపు ప్రతి సందర్భంలో వారు నాకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖలు పంపారు. నోబెల్ కమిటీకి కూడా లేఖలు పంపారు. నేను 30 నుంచి 50 మిలియన్ మంది ప్రాణాలు కాపాడానని భారతదేశ విషయంలో.. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అన్నారు. అది ఇంకా ఎక్కువ కావచ్చు. రెండు అణ్వాయుధ దేశాలు పోరాడుతున్నాయి. 11 విమానాలు కూల్చివేశారు. నేను దాన్ని పరిష్కరించాను. టారిఫ్‌లు వాడాను.. వాళ్లు యుద్ధం కొనసాగిస్తే వారిపై టారిఫ్‌లు విధిస్తానని నేను చెప్పాను” అని తెలిపారు. మరోవైపు, అమెరికా హార్మూజ్ నిర్బంధం వల్ల చమురు మార్కెట్లో సరఫరా సంక్షోభం తీవ్రత పెరుగుతోంది. తగ్గిన సరఫరాతో చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్మూజ్ మూసివేతతో గ్లోబల్ మార్కెట్‌పై భారీ దెబ్బ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పట్లో ఒప్పందం కుదిరే పరిస్థితులు కనపడట్లేదు. -
జలసమాధి చేస్తాం
టెహ్రాన్: శత్రువుల భారీ నుంచి గల్ఫ్‌ను కాపాడుతామని, ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్‌లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామని పరోక్షంగా స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమేనీ విడుదల చేసిన లిఖిత సందేశాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్లో గురువారం చదివి వినిపించారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా, అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్‌తోపాటు హార్మూజ్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. హార్మూజ్‌లో ‘నూతన నిర్వహణ’అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని వెల్లడించారు. తద్వారా పొరుగు దేశాలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. పర్షియన్ గల్ఫ్‌లో అభద్రతకు అమెరికా ఇక్కడ తిష్టవేయడమే ముఖ్య కారణమని ఖమేనీ ఆక్షేపించారు. గల్ఫ్‌లో సొంత స్థావరాలను కాపాడుకొనే సామర్థ్యం అమెరికాకు లేదన్నారు. అలాంటప్పుడు ఈ ప్రాంతంలోని ఆశ్రితులకు భద్రత కల్పిస్తుందన్న ఆశ అసలే లేదని ఉద్ఘాటించారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అక్కడ దురాశ, దురుద్దేశంతో ప్రవర్తించే ఇరాన్ శత్రువులకు నీటి అడుగున తప్ప మరెక్కడా స్థానం లేదని హెచ్చరించారు. సముద్ర గర్భంలో శత్రువును దెబ్బకొట్టడానికి రహస్య అస్త్రం సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించిన తర్వాత మొజ్తబా ఖమేనీ అమెరికాకు ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అమెరికా ప్రమేయం లేకపోతేనే గల్ఫ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన వెల్లడించారు. అమెరికాతో స్నేహం వదులుకోవాలని గల్ఫ్ దేశాలకు పరోక్షంగా సూచించారు. భయంకర భూతం అమెరికా ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తిగా పరిరక్షించుకుంటామని మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబించక తప్పదని తెలిపారు. దేశంలోనూ, వెలుపల ఉన్న 9 కోట్ల మంది ఇరానీయన్లు నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు, క్షిపణి సామర్థ్యాల వరకు తమ ఆధ్యాతి్మక, మానవ, శాస్త్రీయ, పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలన్నింటినీ జాతీయ సంపదలుగా భావిస్తారని స్పష్టంచేశారు. వారు దేశ జలాలను, భూమిని, గగనతలాన్ని ఎలాగైతే కాపాడుకుంటారో.. అలాగే వీటిని కూడా భద్రంగా కాపాడుకుంటారని పేర్కొన్నారు. అమెరికాను ‘గ్రేట్ సాతాను’గా ఖమేనీ అభివరి్ణంచారు. అదొక భయంకర భూతమని నిందించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్లకు ఏం పని అంటూ ప్రశ్నించారు. వారు ఇక్కడి వ్యవహారాలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. హార్మూజ్‌పై ఇరాన్ నియంత్రణ ఉంటేనే గల్ఫ్ దేశాలు సురక్షితంగా ఉంటాయని స్పష్టంచేశారు. -
బీటలువారిన ఒపెక్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకటి తలిస్తే జరిగేది ఎప్పుడూ మరోటి. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తే అది నాలుగురోజుల్లో పాదాక్రాంతమవుతుందని అంచనావేసుకుని ప్రారంభించిన యుద్ధం కాస్తా వికటించి ఆయన ఆ ఊబిలో కూరుకుపోయారు. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియని తరుణంలో పశ్చిమాసియాలో ఆయన ఉద్దేశించని పరిణామం సంభవించింది. మే 1 నుంచి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. దాన్నుంచి మాత్రమే కాదు... 2016లో ఏర్పడిన ‘ఒపెక్ ప్లస్’నుంచి కూడా వైదొలగనున్నట్టు తెలిపింది. ఒపెక్‌లో సభ్యత్వం తీసుకోని రష్యావంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో ఈ గ్రూప్ ఏర్పడింది. ఒపెక్ ప్రపంచ చమురు ఉత్పత్తుల పరిమాణాన్నీ, ఎగుమతుల్నీ, వాటి ధరల్నీ నిర్దేశిస్తున్న కీలక సంస్థ. ప్రపంచ ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులు దానిపైనే ఆధారపడతాయి. ప్రపంచ పెట్రో ఉత్పత్తుల్లో ఒపెక్ వాటా మూడోవంతుకన్నా ఎక్కువ. ఒపెక్ నుంచి తప్పుకోవాలన్న యూఏఈ ఆలోచన చాలా పాతది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ ఇరాన్ యుద్ధంతో అది తుది నిర్ణయానికొచ్చింది.ఒపెక్ సంస్థ ఆవిర్భావానికీ, విస్తరణకూ పాశ్చాత్య బహుళజాతి సంస్థల నిర్వాకం కారణం. చమురు దేశాలు ఎంత ఉత్పత్తి చేయాలో, ఏ ధర నిర్ణయించాలో అవి నిర్దేశించేవి. వాటి చెప్పుచేతల్లో ఉండటం ఇక సాధ్యంకాదన్న నిర్ణయానికొచ్చిన చమురు దేశాలు 1960 సెప్టెంబర్‌లో బాగ్దాద్‌లో సమావేశమై ఒపెక్ ఏర్పాటుకు తీర్మానించాయి. ఇరాన్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనెజులా దేశాలు ఇందులో భాగస్వాములు. 1967లో యూఏఈ చేరింది. 1973లో అరబ్–ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకొస్తున్న అమెరికా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, పోర్చుగల్ తదితర దేశాల వైఖరిపై ఆగ్రహించిన ఒపెక్... చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తూ, ఆ దేశాలకు ఎగుమతుల్ని నిషేధించింది. దాంతో పెను సంక్షోభం ఏర్పడింది. అనంతరకాలంలో ఈ దేశాలన్నీ అమెరికాకు సాగిలబడ్డాయి. అది వేరే కథ!ఒపెక్‌లో రాజుకుంటున్న అసంతృప్తికి సౌదీ పెద్దన్న పాత్ర పోషిస్తుండటం ఒక కారణం. ఏ దేశం ఎంత ఉత్పత్తి చేయాలో అదే నిర్ణయించటంవల్ల తమకు అన్యాయం జరుగుతున్నదని సభ్యదేశాల్లో ఎప్పటినుంచో అసంతృప్తి ఉంది. అందుకే 2019లో ఖతార్, ఆ మరుసటి ఏడాది ఈక్వెడార్, 2024లో అంగోలా సంస్థనుంచి వైదొలగాయి. ఆ వరసలో యూఏఈ నాలుగో దేశం. అంతర్జాతీయ చమురు ధరల్ని బట్టి ఉత్పత్తిని నియంత్రించుకుంటూ, అది కోరుకున్న ధరలో ఉండేలా చూసుకోవటం ఒపెక్ అలవాటు. తన తొలి ఏలుబడిలో ఒపెక్ దేశాలపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలున్నాయి. చమురు ధరలు పెంచుతూ ప్రపంచ ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. అయితే 2020లో కోవిడ్ సమయంలో పాతాళానికి పడిపోయిన చమురు ధరలతో దివాలా స్థితికి చేరిన అమెరికన్ సంస్థల్ని కాపాడుకునేందుకు ఉత్పత్తిని తగ్గించమని ఒపెక్‌ను వేడుకున్నది కూడా ఆయనే. సౌదీ తీరుపై యూఏఈ ఆగ్రహంతో ఉండటానికి కారణం ఉంది. అది ప్రస్తుతం రోజుకు 35 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. తనకున్న సామర్థ్యంతో అంతకన్నా ఎక్కువ చేయగలిగినా, సౌదీ అరేబియా నిర్దేశిస్తున్న కోటా ఆటంకంగా ఉంది. వచ్చే ఏడాదికల్లా దాన్ని 50 లక్షల బ్యారెళ్లకు పెంచాలంటే తప్పుకోవటమే ఉత్తమమని అది భావిస్తోంది. ఈలోగా ఇరాన్ యుద్ధం దాని సమస్యల్ని పెంచింది. గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడుల్లో ఆ దేశమే అధికంగా నష్టపోయింది. కనుకనే ఈ బాదరబందీని వదుల్చుకోవాలని నిర్ణయించుకుంది. పర్యవసానంగా వెనువెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర మూడు శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా, దీర్ఘకాలంలోగానీ దాని అసలు ప్రభావం కనబడదు. యూఏఈ మిత్రదేశంగా భారత్‌కు ఈ పరిణామం లాభదాయకమే. కానీ ఒపెక్ ఎలాంటి ఆంక్షలు పెడుతుందో చూడాలి. మొత్తానికి ఇన్నాళ్లూ కలిసికట్టుగా ఉన్నట్టు కనబడిన గల్ఫ్, ఒపెక్ బీటలువారుతున్నాయి. ఈ పరిణామం పశ్చిమాసియాలో అమెరికా పలుకుబడిని తగ్గిస్తుంది. ఇరాన్ పాదాక్రాంతం మాటేమో గానీ... అమెరికాకు మున్ముందు ఇది సమస్యాత్మకం. -
జలసంధిలో చట్టాల ఉల్లంఘన!
ప్రపంచమంతా ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ, యుద్ధ విరమణ గురించి ఉత్కంఠగా పరిశీలిస్తున్నది. విచిత్రమయిన, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ యుద్ధంలో న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, మధ్యవర్తి అర్హతల గురించిన చర్చ మచ్చుకు కూడా లేదు. యుద్ధంలో భాగస్వాములు కాని అరబ్ దేశాల అవస్థల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరి దృష్టీ కేవలం హార్మూజ్ జలసంధిని ఒకవైపు ఇరాన్, మరోవైపు పరోక్షంగా అమెరికా దిగ్బంధించడం మీదనే ఉన్నది. ఎందుకంటే హార్మూజ్ గుండా చమురు, గ్యాస్ నిరాటంకంగా రవాణా జరిగితే చాలు, మిగతా విషయాలు మాకేమిటనే ధోరణిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల ఉల్లంఘన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘బలవంతుడి మాటే చట్టం’ అని ప్రపంచ దేశాలు రాజీ పడినట్టుగా కనిపిస్తున్నది. అంతర్జాతీయ చట్టాల అమలుకు బాధ్యత తీసుకోవాల్సిన ఐక్యరాజ్య సమితి కోమాలో ఉన్నట్టుగా తోస్తున్నది.మౌనం దాల్చిన ప్రపంచ దేశాలు!పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలలో ప్రతిష్ఠంభనకు రెండు ప్రధాన పీటముడులు ఉన్నాయి. ఒకటి, హార్మూజ్ దిగ్బంధనం; రెండు, ఇరాన్ అణు కార్యక్రమం. హార్మూజ్ జలసంధిని పూర్తిగా నియంత్రించే అధికారం తనకున్నదని ఇరాన్ వాదిస్తున్నది. మొదటి విడత చర్చల తర్వాత ఇరాన్ కాస్త మెత్తబడి హార్మూజ్ నుండి అన్ని నౌకల రవాణాకు సహకరించడానికి ముందుకొచ్చింది. కానీ, ఇరాన్ రేవు పట్టణాల నుండి వచ్చే నౌకలను, ఇరాన్ రేవులకు వెళ్లే నౌకలను అడ్డగిస్తామని అమెరికా మంకుపట్టు పట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇరాన్, అమెరికాలకు ఈ రకంగా ప్రపంచ వాణిజ్యాన్ని అడ్డుకొనే హక్కు ఉందా అని ప్రపంచ దేశాలు ప్రశ్నించాల్సింది పోయి, నోరు మెదపకుండా కూర్చోవడం శోచనీయం. సన్నని జలసంధులు, సముద్ర మార్గాల గుండా సరుకుల రవాణాను నియంత్రించడానికి రెండు ప్రధాన అంతర్జాతీయ చట్టాలున్నాయి. 1. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యు.ఎన్.సి. ఎల్.ఓ.ఎస్), 2. శాన్ రెమో మాన్యువల్. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. రెండు రకాల జలసంధి రవాణా మార్గాలను గుర్తించింది. అవి : 1. ఇన్నోసెంట్ పాసేజ్, 2. ట్రాన్సిట్ పాసేజ్. తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం లోపు నౌకల రవాణా జరిగితే ఆ మార్గాన్ని ఇన్నోసెంట్ పాసేజ్‌గా పరిగణిస్తారు. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. ఆర్టికల్ 19 కింద తీరదేశాల భద్రతకు ముప్పు లేకుండా నౌకలు ప్రయాణించవచ్చు. ఆర్టికల్ 25 (3) ప్రకారం తీర దేశం ఇన్నోసెంట్ ప్యాసేజ్ గుండా నౌకల రవాణాను తన దేశ భద్రత దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. భౌగోళిక రాజకీయ వ్యూహాలు12 నాటికల్ మైళ్లకు ఆవల ఉండే జలమార్గాలను ట్రాన్సిట్ ప్యాసేజ్గా పరిగణిస్తారు. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. ఆర్టికల్ 44 ప్రకారం తీరదేశాలు ట్రాన్సిట్ ప్యాసేజ్ గుండా నౌకల రవాణాను అడ్డుకోవడం నిషేధం. ఇరాన్–ఒమన్ తీరాలను విభజించే హార్మూజ్ జలసంధి వెడల్పు కనిష్ఠంగా 21 నాటికల్ మైళ్లు. ఒమన్, ఇరాన్ సార్వభౌమ సముద్ర జలాలు (టెరిటోరియల్ వాటర్స్) చెరొక 12 నాటికల్ మైళ్లకు విస్తరిస్తే మొత్తం 24 నాటికల్ మైళ్లు. కానీ జలసంధి 21 నాటికల్ మైళ్లు మాత్రమే. అంటే నౌకలు ఇరాన్ సార్వభౌమ సముద్ర జలాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఇరాన్ హార్మూజ్‌ను ఇన్నోసెంట్ పాసేజ్‌గా పరిగణిస్తూ, తన భద్రత దృష్ట్యా మూసివేస్తానని వాదిస్తున్నది. ఇక అమెరికా హార్మూజ్ జలసంధి గుండా ఇరానియన్ రేవు పట్టణాలకు నౌకల రవాణాను అడ్డుకోవడం యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్ నిబంధనలను, యుఎన్ ఛార్టర్, హై సీస్ ఫ్రీడమ్ యాక్ట్ నిబంధనలను అతిక్రమించడమే. 1908లో ఇరాన్లో చమురు నిల్వలు కనుగొన్నప్పటి నుంచి మధ్యప్రాచ్యం... యూకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా; అనంతరం అమెరికాల జియోపొలిటికల్ వ్యూహంలో పావుగా మారింది. యూకే, ఫ్రాన్స్, డచ్, జర్మన్, యూఎస్ఏల చమురు కంపెనీలు, రాత్స్‌చైల్డ్ వంటి యూదుల ప్రైవేట్ బ్యాంకులు చక్రం తిప్పాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా పంచుకున్నాయి. టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ల సరిహద్దులను తమ ఇష్టానుసారం చమురు నిల్వల ప్రయోజనాల ఆధారితంగా నిర్ధారించాయి. వలస పాలకులు, చమురు కంపెనీల వారు సరిహద్దులను గీయటం, మధ్యప్రాచ్యంలో సున్నీ–షియా–కుర్ద్ –యూదుల మధ్య వైషమ్యాలు తీవ్రరూపం దాల్చటం... ప్రస్తుత రావణకాష్టానికి కారణం. షియాల ప్రాబల్యమున్న ఇరాన్–ఇరాక్‌ల నుంచి రక్షణ కోసం అరబ్ దేశాలు అమెరికా పంచన చేరాయి. అమెరికా ఈ దేశాలలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి, రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. పెట్రో డాలర్ బూమ్‌తో అరబ్ దేశాలు బలమైన ఆర్థిక శక్తులుగా తయారయ్యాయి. కానీ పొరుగున పాలస్తీనా (గాజా), సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్లలో అనిశ్చితి కొనసాగుతున్నది. ఈ ప్రాంతీయ అనిశ్చిత స్థితి తమ ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ముప్పు అని గుర్తించి అరబ్ దేశాలు క్రమంగా ఇజ్రాయిల్‌తో మైత్రికి ముందుడుగు వేశాయి. ఇజ్రాయిల్‌తో సంబంధాలను మెరుగుపరచుకున్నాయి. ఇరాన్ మంత్రి రష్యా పర్యటన!2020 కల్లా చైనా, రష్యా, భారత్‌లు అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తులుగా ఆవిర్భవించాయి. 2023లో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీ అరేబియా ఇరాన్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసింది. భారత్ ప్రతిపాదించిన ఐమెక్ (ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్)లో యూఏఈ, సౌదీ చేరాయి. అమెరికా–ఐరోపాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పాటయిన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో సౌదీ, యూఏఈలు 2024లో సభ్యులుగా చేరడం అరబ్ దేశాల నూతన వ్యూహాన్ని బలపరుస్తున్నది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీలు ‘పెట్రో యువాన్’ను బలపరచటానికి తోడ్పడుతున్నాయి. భారత్–యూఏఈలు డాలర్లో కాకుండా స్థానిక కరెన్సీలలో వాణిజ్యానికి ఒప్పందం చేసుకున్నాయి. యూఎస్ఏ నాయకత్వంలోని పశ్చిమ దేశాల స్విఫ్ట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీ, చైనా, హాంకాంగ్‌లు ఎం–బ్రిడ్జ్ ప్రాజెక్టును పరీక్షిస్తున్నాయి. డాలర్లకు బదులుగా ఖతర్, సౌదీలు బంగారంలో పెట్టుబడులను అధికం చేస్తున్నాయి. మరోవైపు అరబ్ దేశాలు గత దశాబ్దకాలంగా చైనా, భారత్, రష్యాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. భారత్ అనుసరిస్తున్న మల్టీ అలైన్మెంట్ విధానం అరబ్ దేశాలకు కూడా అనుసరణీయంగా కన్పిస్తున్నది. ఈ నేపథ్యంలో, ఇరాన్–అమెరికాల మధ్య శాంతి చర్చల సమన్వయ ప్రయత్నాలలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి జరిపిన రష్యా పర్యటన క్రమంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇరాన్ యుద్ధంలో రష్యా ప్రత్యక్ష పాత్రకు బహుశా ఇది నాంది కావచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఇరాన్‌పై అమెరికా దాడులు మళ్లీ మొదలు.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని రీతిలో ఇరాన్‌పై మెరుపు దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటామ్) సైనిక చర్యలకు సన్నాహాలు చేస్తోందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ నివేదించింది. రెండు వేర్వేరు మూలాల ఆధారంగా.. గురువారం ఇరాన్‌పై దాడుల ప్రణాళికలపై సెంటామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌తో ట్రంప్ చర్చించనున్నట్లు పేర్కొంది.చర్చలలో ప్రధాన అంశాలుట్రంప్–కూపర్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఇరాన్‌పై భారీ స్థాయిలో కాంబాట్ ఆపరేషన్ నిర్వహించడం, శాంతి ఒప్పంద చర్చలు ముందుకు సాగేందుకు ప్రయత్నించడం, యుద్ధం ముగించే ముందు శత్రువుకు చివరి దెబ్బ ఇవ్వడం వంటి వ్యూహాలు ఉన్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్‌ను ఒప్పించేలా స్వల్పకాలిక శక్తివంతమైన దాడులు జరిపేందుకు సెంటామ్ మొగ్గు చూపుతోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, అదనంగా బాంబులు వర్షం కురిపించి అణు చర్యలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.సెంట్రల్ కమాండ్ మరో ప్రణాళికలో హర్మూజ్ జలసంధిలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్య నౌకాయానానికి తిరిగి తెరవడంపై దృష్టి సారించింది. ఈ ఆపరేషన్‌లో భూతల దళాలు కూడా పాల్గొనవచ్చని నివేదిక పేర్కొంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ట్రంప్ ప్రధాన బలంగా భావిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ, ఇరాన్ లొంగకపోతే ఆయన సైనిక చర్యను పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.మూడవ ప్రత్యామ్నాయంఈ బ్రీఫింగ్లో ప్రస్తావనకు రాబోయే మరో వ్యూహం, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక దళాలతో ఆపరేషన్ చేపట్టడం. గతంలో ఇరాన్ అణు కార్యక్రమం ఒక ముప్పు అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడానికి ఇది ప్రధాన కారణమని ఆయన అన్నారు. యుద్ధం ఇప్పటికే 60 రోజులకు పైగా కొనసాగుతోంది. ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాలను కోరుకోవడం లేదని, శాంతియుత ప్రయోజనాల కోసం అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని చెబుతోంది.జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా ట్రంప్‌తో జరిగే సెంట్రల్ కమాండ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ముందు కూడా కూపర్ ఇలాంటి బ్రీఫింగ్ ఇచ్చారు. దానికి ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై దాడులు జరిపి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచిందని యాక్సియోస్ నివేదిక హైలెట్ చేసింది. -
ప్రపంచానికే నష్టం.. ట్రంప్‌నకు పుతిన్ హెచ్చరిక
మాస్కో: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతల వేళ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ ఉత్కంఠకు తెరలేపింది. వీరిద్దరూ దాదాపు 90 నిమిషాలు మాట్లాడుకున్నారని రష్యా ప్రతినిధి వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ముఖ్యంగా ఇరాన్, ఉక్రెయిన్ గురించి జరిగినట్టు తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్‌పై మరోసారి సైనిక చర్చ వద్దని ట్రంప్‌ను పుతిన్ హెచ్చరించినట్టు సమాచారం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఘర్షణ, మరియు తాత్కాలిక కాల్పుల విరమణ అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పుతిన్.. ఇరాన్‌పై ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఆ సైనిక చర్య ప్రభావం ఇరాన్ దాని పొరుగు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి అత్యంత నష్టదాయకంగా మారుతుందని పుతిన్ హెచ్చరించారు. ఇదే క్రమంలో ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు.ఈ మేరకు వారిద్దరి సంభాషణ జరిగినట్టు క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషాకోవ్ వెల్లడించారు. ట్రంప్-పుతిన్ ఫోన్ సంభాషణలో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధం, ఉక్రెయిన్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులను, రష్యా సైన్యం సాధిస్తున్న పురోగతిని పుతిన్ వివరించారని చెప్పారు. ఐరోపా దేశాల మద్దతుతో జెలెన్స్కీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని పొడిగిస్తోందని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఉషాకోవ్ తెలిపారు. ఈ ఫోన్ కాల్ రష్యా చొరవతోనే జరగ్గా, సంభాషణ ఫలప్రదంగా సాగిందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. రష్యా సైన్యం డోన్బాస్ ప్రాంతంలో ఇరుక్కుపోయింది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌కు ట్రంప్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో మే 9వ తేదీన రష్యా విక్టరీ డే సందర్భంగా ఉక్రెయిన్‌పై తాత్కాలిక కాల్పులు విరమణపై పుతిన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ట్రంప్ వల్లే యుద్ధం ఆగలేదు.. యూఎస్ రాయబారుల రాజీనామా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో బిగ్ షాక్ తగిలింది. ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారుల పదవీ విరమణలు, మార్పుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ విధానాల వల్లే తాము రాజీనామాలు చేస్తున్నట్టు సదరు వ్యక్తులు ఆరోపించడం గమనార్హం. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్.. పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపణలు చేయడం ఇక్కడ పెద్ద ట్విస్ట్. అందుకే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆగడంలేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారుల పదవీ మార్పులు తరచూ జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిడ్జెట్ బ్రింక్ (2022–2025) అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆమె తరువాత బాధ్యతలు చేపట్టిన జూలీ డేవిస్ కూడా 2026 జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ మార్పులు అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల్లో అస్థిరతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయబారులు ఇద్దరూ ట్రంప్ విధానాలను వ్యతిరేకించడం సంచలనంగా మారింది.I resigned as U.S. Ambassador Ukraine when Trump kept siding with Putin over our democratic partner. Now, my successor is doing the same.I knew I had to speak out and run for office because siding with dictators is just not who we are. https://t.co/j1cGvub4Bf— Bridget Brink (@AmbBridgetBrink) April 29, 2026బ్రిడ్జెట్ బ్రింక్ 2022 నుండి 2025 వరకు కీవ్‌లో పనిచేశారు. తాజాగా ఆమె.. మిచిగాన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పదేపదే అనుకూలంగా వ్యవహరించడం వల్లే తాను తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. నియంతల పక్షం వహించడం మన నైజం కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. మన ప్రజాస్వామ్య భాగస్వామి కంటే పుతిన్‌కు ట్రంప్ పదేపదే వత్తాసు పలుకుతున్నప్పుడు నేను ఉక్రెయిన్ యూఎస్ రాయబారి పదవికి రాజీనామా చేశాను అన్నారు. ఈ పదవిలో ఏడాది లోపే పనిచేసిన తన వారసురాలు జూలీ డేవిస్ కూడా ఇలాంటి కారణాలతోనే వైదొలుగుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా, డేవిస్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలిగి, మూడు దశాబ్దాల దౌత్య వృత్తికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ చేస్తారని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.ట్రంప్ పరిపాలనలో ఉక్రెయిన్ విధానానికి వ్యతిరేకంగా మే 2025లో రాజీనామా చేసిన బ్రింక్ స్థానంలో, డేవిస్ గత ఏడాది మేలో తాత్కాలిక ప్రాతిపదికన బాధ్యతలు స్వీకరించారు. ఆమె కూడా.. పుతిన్‌కు ట్రంప్ మద్దతు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్‌పై వీరిద్దరూ విమర్శలు చేయడాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఖండించారు. ఇదంతా నిజం కాదన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు రాయబారి డేవిస్ గట్టి మద్దతుదారుగా ఉన్నారని కామెంట్స్ చేశారు. -
నో ప్లాన్ బీ..! నెక్ట్స్ స్టెప్ బాంబింగ్ కంటే డేంజర్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాటే లేకుండా తిరస్కరించారు. అణు ఒప్పందం విషయంలో తాను పెట్టిన షరతులకు అంగీకరించే దాకా హర్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముందు హర్ముజ్‌ను తెరవండి. ఆ తర్వాత అణు ఒప్పందంపై చర్చలు జరుపుదాం.. అని ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన వెళ్లింది. అయితే ట్రంప్ అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా అణు ఒప్పందం జరగాలని.. అప్పటివరకు బ్లాకేడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ దిగ్బంధనంతో ఊపిరి ఆడకుండా విలవిలలాడుతోంది(ఈ క్రమంలో త్రీవ పదజాలం ప్రయోగించారాయన). అమెరికా షరతులపై అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు ఈ బ్లాకేడ్ కొనసాగిస్తుంటుంది. ఈసారి బ్లాకేడ్ బాంబింగ్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది’’ అని అన్నారాయన. అయితే..దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికా బ్లాకేడ్‌కు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తాం అంటూ బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. మేం దౌత్యానికి అవకాశం ఇస్తున్నాం. కానీ మా సహనం పరిమితమే. అవసరమైతే కఠోర చర్యలకు దిగుతాం అని హెచ్చరించారు.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం తమదేనని.. అవసరమైతే టోల్ కూడా వసూల్ చేస్తామని చెబుతూ ఇరాన్ జలసంధిని మూసేసింది. ఫలితంగా చమురు సంక్షోభం మొదలైంది. అయితే తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో జలసంధిని ఇరాన్ తెరిచింది. ఈలోపే తన మిత్రదేశం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ వెంటనే మళ్లీ మూసేసింది. ఇక చర్చల్లో ఇరాన్ మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఏప్రిల్ 13న అమెరికా నేవీ హర్ముజ్ బ్లాకేడ్‌ను ప్రకటించింది. అమెరికా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు ఇరాన్‌కు వచ్చీపోయే వాణిజ్య నౌకలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వస్తే దాడులు చేశాయి. అప్పటి నుంచి ఈ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇంకోవైపు ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయి ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. హర్ముజ్‌ను తాము మూసేయడంతో ఇరాన్‌కు ఒకరోజుకి 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అమెరికా అంటోంది. అయితే ఇరాన్ మాత్రం దీన్ని సార్వభౌమత్వంపై దాడిగా ప్రకటించుకుంది.ప్లాన్‌బీ లేనే లేదు!అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ ఇంకా కుదరలేదు. మధ్యవర్తిగా ఉన్న పాక్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. దీంతో మరో వ్యూహం జోలికి పోకుండా ట్రంప్ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను చర్చలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘‘ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరు చమురును వినియోగించుకోలేకపోతోంది. ఆ నిల్వలు పేరుకుపోయి పైప్లైన్లు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు.. ఇకపై తాను మంచోడిలా ఉండలేనంటూ తుపాకీతో ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌పై మరోసారి దాడులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పరిస్థితిని సమీక్షిస్తోంది. కుదిరితే చిన్నస్థాయిలో దాడులు చేయాలని.. వాటి ఫలితం మాత్రం ఇరాన్‌పై అత్యంత ప్రభావం చూపాలని ప్రణాళిక గీస్తోంది. అయితే ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉందని ఓ అధికారి చెబుతున్నారు. ఇరాన్ మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని.. ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఈ లెక్కన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు హర్ముజ్ మరోసారి కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. -
ఇకపై నేను మంచివాడిని కాదు
వాషింగ్టన్: ఇరాన్ అణు కార్యక్రమాలపై దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమైనంత త్వరగా లభించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఒకవేళ ఆశించిన పరిష్కారం లభించకపోతే అత్యంత కఠినంగా వ్యవహరించక తప్పదని ఇరాన్‌ను హెచ్చరించారు. ముప్పు తప్పించుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలని ఇరాన్‌కు సూచించారు. అణ్వస్త్ర కార్యక్రమాలకు స్వస్తి పలకాలని పరోక్షంగా స్పష్టంచేశారు. ఈ మేరకు చేతుల్లో తుపాకీ పట్టుకున్న ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో తాజాగా పోస్టుచేశారు. ఇందులో కొండలపై బాంబు పేలుళ్ల దృశ్యం కనిపిస్తోంది. తన మాట వినకపోతే ఇరాన్‌పై భీకర యుద్ధానికి సిద్ధమని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇకపై తాను మంచివాడిగా ఉండబోనని(నో మోర్ మిస్టర్ నైస్ గై) అని ట్రంప్ పోస్టు చేశారు. శాంతి చర్చల విషయంలో ఇరాన్ సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. అమెరికాతో అణ్వస్త్ర రహిత ఒప్పందం ఎలా చేసుకోవాలని ఇరాన్‌కు ఏమాత్రం తెలియడం లేదని ఆక్షేపించారు. వారు కాస్త తెలివిగా ప్రవర్తిసే బాగుంటుందని పేర్కొన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. అమెరికా యుద్ధ వ్యయం రూ.2.37 లక్షల కోట్లుపశ్చిమాసియాలో ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ఇప్పటిదాకా 25 బిలియన్ డాలర్లు(రూ.2.37 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు పెంటగాన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జూల్స్ హస్ట్–3 వెల్లడించారు. ఈ సమాచారాన్ని అమెరికా చట్టసభ సభ్యులకు చేరవేశారు. హౌస్ ఆరŠమ్డ్ సర్వీసెస్ కమిటీతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. 25 బిలియన్ డాలర్లలో ఎక్కువ భాగం ఆయుధ సామగ్రిపై ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికి, ఖాళీ అయిన పరికరాలను భర్తీ చేయడానికి కూడా పెద్ద ఎత్తున సొమ్ము వ్యయం చేసినట్లు తెలియజేశారు. -
చమురు నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ప్రతిపాదనకు నో చెప్పేశారు. బాంబుదాడుల కంటే నిర్బంధమే ప్రభావవంతమని ట్రంప్ భావిస్తున్నారా? ఇరాన్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు? అవసరమైతే సైనిక చర్యకు సిద్ధమని సంకేతాలు ఎందుకు వస్తున్నాయి? అమెరికా హార్మూజ్ నిర్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులకు బ్రేక్ పడుతోంది. నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా? ఏయే పరిణామాలు సంభవిస్తాయి? ట్రంప్ మళ్లీ ఏం చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాల వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ‘యాక్సియోస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలిపారు. తదుపరి ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో, తమ వైఖరి ఏంటో స్పష్టం చేశారు.ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరిస్తూ.. ఆ దేశ అణు కార్యక్రమంపై అమెరికాకు ఉన్న ఆందోళనలకు పరిష్కారం వచ్చే వరకు హార్మూజ్ నిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముందుగా హార్మూజ్ జలసంధిని తెరవాలని, ఆ తర్వాత అణు చర్చలు జరపాలని ఇరాన్ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. దీన్నే ట్రంప్ తిరస్కరించారు.ట్రంప్ యాక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ నిర్బంధం బాంబుదాడుల కంటే కొంత ప్రభావవంతంగా ఉందని భావిస్తున్నానని తెలిపారు. ఇరాన్ బాగా ఇబ్బందులు పడుతోందని, పరిస్థితి ఇంకా కఠినంగా మారుతుందని చెప్పారు. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని, నిర్బంధం కొనసాగాలని కోరుకోవడం లేదని ట్రంప్ అన్నారు. కానీ తాను నిర్బంధాన్ని ఎత్తివేయాలనుకోవడం లేదని అన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదని తెలిపారు.చమురు నిల్వలు, పైపులైన్లు పేలతాయా?నిర్బంధం వల్ల ఇరాన్ చమురు ఎగుమతి చేయలేకపోతోందని, నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితికి సమీపిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, విశ్లేషకులు మాత్రం ఈ విషయంలో ఇప్పట్లో ప్రమాదం లేదని అంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ నిర్బంధాన్ని ప్రధాన ఒత్తిడి సాధనంగా చూస్తున్నారని యాక్సియోస్ తెలిపింది. అయితే, ఇరాన్ ఒప్పుకోకపోతే సైనిక చర్యను కూడా పరిగణనలోకి తీసుకుంటారని చెప్పింది. కాగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సైనిక దాడికీ అమెరికా ఆదేశాలు ఇవ్వలేదని యాక్సియోస్ చెప్పింది.యాక్సియోస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ దాడుల ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్‌లోని మౌలిక వసతులను లక్ష్యాలుగా చేసుకునే అవకాశం ఉంది.ఇరాన్ సైతం రెడీ ఇదిలా ఉండగా, ఇరాన్ భద్రతా వర్గాల ఉన్నత అధికారి మాట్లాడుతూ.. అమెరికా హార్మూజ్ నిర్బంధానికి ప్రతిగా ఇంతవరకు చూడని విధమైన చర్యను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. దౌత్యానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరాన్ సైన్యం ఇప్పటివరకు సహనం వహించిందని, సహనానికి పరిమితి ఉంటుందని చెప్పారు.ఇలాగైతే ఏయే పరిణామాలు సంభవిస్తాయి?ఇరాన్-అమెరికా తీరు వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఘర్షణకు దారితీయవచ్చు. హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం ఏర్పడి చమురు సరఫరా దెబ్బతినవచ్చు. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. దౌత్య చర్చలు కఠినమై పరిష్కారం ఆలస్యం కావచ్చు. -
దౌత్యమా... ఇంకా దాదాగిరీయేనా?
మొదటి విడత చర్చలు ఏప్రిల్ 12న విఫలమై, రెండవ విడతకు ముహూర్తమైనా కుదరని స్థితిలో, తాను దౌత్యానికి మారదలచుకున్నారా లేక దాదాగిరీ పద్ధతిలోనే కొనసాగుతారా అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చుకోవలసి ఉంది. లేదంటే ఇరాన్‌తో మళ్ళీ చర్చలు గానీ, సమస్య పరిష్యారం గానీ జరిగే సూచనలు లేవు. రెండవ విడత కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తుండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇస్లామాబాద్‌కు ఏప్రిల్ 24, 25వ తేదీలలో వెళ్ళి చర్చల పునరారంభానికి తమ షరతులేమిటో చెప్పి తిరిగిపోవటం, తమ ప్రతినిధుల ప్రయాణాన్ని ట్రంప్ అకస్మాత్తుగా రద్దు చేయటాన్ని బట్టి అర్థమవుతున్నది ఇదే. అరాగ్చీ ప్రతిపాదించిన షరతులేమిటో అధికారికంగా వెల్లడి కాలేదు గానీ, అవి గతానికన్నా భిన్నంగా ఉండే అవకాశం తక్కువ. అసలు విషయం అది కాదు. ఇరాన్‌కు సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్‌ల లక్ష్యాలు మారటమన్నది మౌలిక ప్రశ్న. ఒకసారి అది తేలితే ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో రాజీలు కుదరటం సాధ్యమవుతుంది. మొదట్నుంచీ అదే వైఖరిఈ మాట అనటం ఎందుకంటే, ఇరాన్ పట్ల దౌత్యానికి బదులు దాదాగిరీ వైఖరిని తన మొదటి విడతలోనే (2017–21) ప్రదర్శించిన ట్రంప్, ఈ రెండవ విడతలోనూ అదే పని చేస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగానే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు ఆరంభించటం మొదలుకొని, మొదటి విడత చర్చల వైఫల్యం మీదుగా ఈ రెండవ విడత చర్చల అనిశ్చితి వరకు తను చూపుతున్నది ఆసాంతం దాదాగిరీయే. తమ అసమానమైన ఆర్థిక, సైనిక శక్తులు మినహా ఆయన నోటి నుంచి మరొక మాట వినిపించదు. వాటిని ఉపయోగించి ఇరాన్ సహా ఎవరినైనా సర్వనాశనం చేయగలమంటారు. ఇందులో దౌత్య విధివిధానాలు ఆవగింజంతయినా కనిపిస్తున్నాయా?ట్రంప్‌లో దౌత్య నీతి లక్షణాలుంటే, యురేనియం శుద్ధి విషయమై ఇరాన్, అమెరికాల మధ్య (రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో కలిపి) 2015లో కుదిరిన ఒప్పందం సజావుగా సాగుతుండగా 2018లో దానిని అకస్మాత్తుగా రద్దు చేసేవారు కాదు. ఇరాన్‌పై యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఎంత ఒత్తిడి చేసినా బుష్, ఒబామా, బైడెన్లు నిరాకరించిన స్థితిలో, తాను దాడులకు సిద్ధమయ్యేవారు కాదు. పరిష్కారం లభించవచ్చుననుకున్న ప్రతి దశలోనూ ఆ అవకాశాలను ఇజ్రాయెల్ భంగపరుస్తుండగా మౌనం వహించేవారు కాదు. వాస్తవానికి దాదాగిరీ లక్షణాన్ని ఆయన చూపుతున్నది ఇరాన్ విషయంలోనే కాదు. రెండవసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి పనామా కాలువ, కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనిజులా విషయమై చేసిందేమిటో తెలిసిందే. యుద్ధాలు ఆపే ప్రతిజ్ఞలు చేసిన మనిషి, 9 యుద్ధాలు ఆపానంటూ ఇప్పటికి కొత్తగా 8 సైనిక దాడులు సాగించారు. టారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాల అరాచకం సరేసరి. ఇందులోనూ గమనించదగ్గ విశేషం ఒకటున్నది. తన పులి చారలు, కోరలను అనునిత్యం ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టజూసే ఆయనలో ‘కాగితం పులి’ లక్షణాలు కూడా ఉన్నాయి. అది, బలహీనుల ముందు విజృంభించి బలవంతుల ఎదుట తగ్గి ఉండటం. పనామా, వెనిజులా విషయంలో జరిగింది ఒకటైతే, తనను ధిక్కరించిన కెనడా, గ్రీన్‌ల్యాండ్ (యూరప్), బ్రెజిల్, దక్షిణాఫ్రికాల సంగతి వేరయ్యింది. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాను లొంగదీయలేక తానే రాజీకి ప్రయత్నిస్తున్నారు. చైనా మాట అయితే చెప్పనక్కరలేదు. ఇరాన్ ప్రతిఘటనలు మరొక దృష్టాంతం.పరిష్కారానికి రాజమార్గంకొంత లోతుకి వెళ్ళినట్లయితే, ట్రంప్ ద్వారా ప్రదర్శితమవుతున్న ఈ లక్షణాలన్నీ అమెరికా సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడుతూ... దానికి స్లో–మోషన్ సంకేతాల వంటివి. అమెరికన్ నాయకత్వపు ‘నాటో’ కూటమిలోనే పెరుగుతున్న భిన్నాభిప్రాయాలు, కనీసం ఇరాన్ దిగ్బంధానికైనా ఏ ఒక్కరూ కలిసి రాకపోవటం, మరొక స్థాయిలో బహుళ ధ్రువ ప్రపంచ ఆకాంక్షలు విస్తరిస్తుండటం ఈ మార్పులను ప్రతిఫలిస్తున్నాయి. ఈ పలు విధాలైన పరిణామాల దశలో ఇరాన్ ఒక హీరోలా లేచి నిలుచున్నది. అందువల్ల అమెరికా అధ్యక్షుడు వాస్తవాలను కనీసం ఇప్పటికైనా గుర్తించి, ఇజ్రాయెల్ ప్రభావం నుంచి బయటపడి, దౌత్యమార్గం వైపు మళ్లటం మంచిదవుతుంది. తమ సార్వభౌమతను, హక్కులను కాపాడుకునేందుకు ఇరాన్ చూపుతున్న దృఢ సంకల్పం, ప్రతిఘటన సాధారణమైనవి కావు. మనం స్వయంగా చూసినంతవరకు వియత్నాం(1955–75), అఫ్గానిస్తాన్(2001–21) తర్వాత, 1953 నుంచి మొదలై నేటికీ సాగుతున్న ఇరాన్ పోరాటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. యురేనియం శుద్ధి తదితర అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతుండగానే అకస్మాత్తుగా దాడులు జరిపి ఇరాన్ రాజకీయ, సైనిక నాయకత్వాలను నిర్మూలించటం నుంచి మొదలు కొని, ఇరాన్ రేవులను దిగ్బంధించటం వరకు గల క్రమం అంతా చూపుతున్నది అమెరికా దౌత్య నీతినా లేక బస్తీ రౌడీ లక్షణాలనా? ఇరాన్ రెండవ విడత చర్చలకు నిరాకరించటమే సరైనదని భావించక తప్పదు. విదేశాంగ మంత్రి అరాగ్చీ ఇస్లామాబాద్‌లో 25వ తేదీన మరోమారు అన్నమాట: అమెరికాకు విశ్వసనీయత లేకుండా పోయిందనీ, అది కుదిరేవరకు తాము చర్చలకు వెళ్లబోమనీ, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనీ. ఆ తర్వాత ఒమాన్, రష్యా సందర్శనల వెనుక ఆయన తెహ్రాన్‌కు తిరిగి వెళ్ళి అన్ని పరిస్థితులను సమీక్షించుకున్నపుడు, వైఖరి అంటూ మార్చుకోవలసింది స్వదేశంలోనూ విశ్వసనీయతను కోల్పోతున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని అర్థమవుతుంది. సమస్య పరిష్కారానికి రాజమార్గం ఎదుటనే ఉంది. అది అంతర్జాతీయ నిబంధనల మేరకు అణుశుద్ధికి ఇరాన్‌కు గల హక్కులకు అడ్డుచెప్పకపోవటం, పాలస్తీనా సృష్టిని అంగీకరించటం, గ్రేటర్ ఇజ్రాయెల్ పథకాన్ని రద్దు చేయటం!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
గన్ ఫొటోతో ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుందనే ఊహాగానాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇకపై తాను మంచిగా ఉండదలచుకోవడం లేదంటూ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ట్రంప్ గన్నుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘ఇకపై నేను మంచిగా ఉండాలనుకోవడం లేదు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ తన వైఖరి మార్చుకోవాలి. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియదు. లేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక, సైనిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది’అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో హర్మూజ్ జలసంధిలో దీర్ఘకాలిక బ్లాకేడ్ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు.వైట్ హౌస్‌లో ట్రంప్ వ్యాఖ్యలువైట్ హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాలో తన శత్రువులను సైనికంగా ఓడించిందని పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను అభివృద్ధి చేయడానికి అనుమతించబోమని ఆయన పునరుద్ఘాటించారు.ఇరాన్ ప్రతిస్పందనఇరాన్ తాజాగా అమెరికాకు కొత్త ప్రతిపాదనను పంపింది. ఇందులో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించడం వంటి అంశాలు ఉన్నాయి. అణు చర్చలను తరువాత దశకు వాయిదా వేయాలని కోరింది. అమెరికా మాత్రం ఇరాన్ కనీసం 10 సంవత్సరాలపాటు యురేనియం ఎన్రిచ్మెంట్ నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం తొలగించాలని డిమాండ్ చేస్తోంది. President Trump posts on Truth Social: Iran can’t get their act together. They don’t know how to sign a nonnuclear deal. They better get smart soon! President DJT pic.twitter.com/tFEwmalvrD— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) April 29, 2026 -
ఇరాన్‌కు ముచ్చెమటలు.. ట్రంప్ బ్లాక్‌బస్టర్ వ్యూహం
అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్‌కు చుక్కలు చూపిస్తోంది. మొన్నటి వరకు ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడిన అమెరికా.. ఇప్పుడు ప్లాన్ మార్చి వ్యూహాత్మకంగా ఇరాన్‌ను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై కఠిన ఆర్థిక చర్యలకు దిగింది. తాజాగా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) రంగంలోకి దిగింది. ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు, వ్యక్తులపై.. ‘షాడో బ్యాంకింగ్’ నెట్వర్క్ ద్వారా ఇరాన్ ఆయుధాలు, క్షిపణి ప్రోగ్రామ్‌లు, ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చుతున్నాయని ఆరోపిస్తూ వీరిని బ్లాక్‌లిస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా యుద్ధంలో రోజురోజుకు పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇరాన్‌పై ట్రంప్ కఠిన ఆర్థిక చర్యలకు దిగారు. ఇరాన్‌పై ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంలో భాగంగా ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు(కొన్ని బ్యాంకులు కూడా), వ్యక్తులపై ఓఎఫ్ఏసీ ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ రహస్యంగా నిర్వహిస్తున్న షాడో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా భారీ మొత్తంలో డబ్బు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతోంది. ఈ నిధులు ఇరాన్ సైన్యం, క్షిపణి కార్యక్రమాలు, ప్రాంతీయ ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చేరుతున్నాయి. ఇరాన్ సైనిక వ్యవస్థకు ఈ రహస్య బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక జీవనాధారంగా పనిచేస్తుంది. ఈ నెట్‌వర్క్‌కు సహకరించే ఏ ఆర్థిక సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలు, ఆంక్షలకు గురైన సంస్థలకు అంతర్జాతీయ ఆర్థిక రంగంలోకి అక్రమ ప్రవేశం కల్పించడానికి విదేశీ అధికార పరిధిలోని షెల్ ఖాతాలను ఉపయోగిస్తున్నాయి’ అని ఆరోపించారు.ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. ఇదిలా ఉండగా.. ఇరాన్ టార్గెట్ అమెరికా.. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌కు సంబంధించి దాదాపు వెయ్యి సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. తాజా చర్యలతో అమెరికాలో ఉన్న సంబంధిత సంస్థల ఆస్తులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే వీరితో లావాదేవీలు కొనసాగించే విదేశీ బ్యాంకులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దూరమయ్యే ప్రమాదం ఉంది.బ్యాంకులకు ఝలక్.. మరోవైపు.. అమెరికా విధించిన ఆంక్షలకు గురైన సంస్థల్లో బ్యాంక్ సెపాత్ అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంక్ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అలాగే బ్యాంక్ సినా సుప్రీం లీడర్ నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. పార్సియన్ బ్యాంక్‌లతో సంబంధాలు ఉన్న కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అయితే, తాజా చర్యలు ఇరానియన్ ఆయిల్ కంపెనీలకు నిధులను తరలించే వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన షుకున్ లిమిటెడ్ సంస్థ, 2024లో ఇరాన్ చమురు లావాదేవీల కోసం 70 మిలియన్ డాలర్లకు పైగా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.చైనా రిఫైనరీలకు హెచ్చరిక..ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న “టీపాట్ రిఫైనరీలు” (ప్రధానంగా షాండాంగ్ ప్రావిన్స్‌లో)తో వ్యాపారం చేసే బ్యాంకులు కూడా ఆంక్షలకు గురవుతాయని OFAC హెచ్చరించింది. ఇవి చిన్న, స్వతంత్ర రిఫైనరీలు. ప్రధానంగా చైనా షాండాంగ్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. పెద్ద ప్రభుత్వ రిఫైనరీలతో పోలిస్తే, వీటికి అంతర్జాతీయ నియంత్రణలు తక్కువగా ఉంటాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న ఈ రిఫైనరీలతో వ్యాపారం చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆంక్షలకు గురవుతాయి అని అమెరికా స్పష్టం చేసింది. అంటే, ఈ రిఫైనరీలకు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ సర్వీసులు అందించే సంస్థలు కూడా బ్లాక్‌లిస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. -
‘మా అమ్మకి చార్లెస్‌పై క్రష్’.. ట్రంప్ కామెంట్ వైరల్!
వాషింగ్టన్: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III అమెరికాలో చారిత్రక పర్యటన చేపట్టారు. ఈ దౌత్య పర్యటనలో జరిగిన చర్చలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య వైరల్‌గా మారింది.వైట్ హౌస్‌లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుకింగ్ చార్లెస్‌కు వైట్ హౌస్ వద్ద అత్యున్నత దౌత్య మర్యాదలతో కూడిన ఘనస్వాగతం లభించింది. 21 తుపాకుల వందనం, సైనిక కవాతుతో అమెరికా ప్రభుత్వం ఆయనకు గౌరవం అందించింది. స్వాగత కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ‘చార్లెస్ యువరాజుగా ఉన్నప్పుడు తన దివంగత తల్లి అతనిని ఎంతో ఇష్టపడేదని, ఆయనను ‘క్యూట్’ గా ఫీలయ్యేదని సరదాగా వ్యాఖ్యానించారు. ‘మా అమ్మకు చార్లెస్ అంటే క్రష్. మీరు నమ్ముతారా? ఆమె ఇప్పుడు ఏమనుకుంటుందో’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమానికి కాస్త వినోదాన్ని జోడించాయి. In this bizarre moment, with King Charles sitting behind him, President Trump tells the crowd that his mother had a crush on King Charles. pic.twitter.com/LX0iYuwwCU— Ed Krassenstein (@EdKrassen) April 28, 2026ఉద్రిక్తతల నడుమ దౌత్య వ్యూహాలుఒకవైపు ఇరాన్ వివాదం, టారిఫ్ సమస్యలతో వాషింగ్టన్, లండన్ మధ్య సంబంధాలు కాస్త తగ్గన వేళ ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, సవాళ్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్, చార్లెస్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా కింగ్ చార్లెస్ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 1991లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఈ గౌరవం దక్కించుకున్న రెండవ బ్రిటీష్ చక్రవర్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇది కూడా చదవండి: ‘అధిపత్యం కాదు..’ ట్రంప్‌కు కింగ్ చార్లెస్ చురక! -
‘అధిపత్యం కాదు..’ ట్రంప్‌కు కింగ్ చార్లెస్ చురక!
వాషింగ్టన్: అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 వసంతాలు పూర్తవుతున్న వేళ.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక మైత్రీబంధాన్ని ఆకాశానికెత్తిన ఆయన.. అదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై సున్నితంగా, పరోక్షంగా చురకలు అంటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.‘ఆధిపత్యం కాదు.. బాధ్యత ముఖ్యం’మానవ చరిత్రలోనే అత్యంత బలమైన, పరిణామాత్మక భాగస్వామ్యాల్లో అమెరికా-బ్రిటన్ మైత్రి ఒకటని రాజు కొనియాడారు. అయితే, దేశాలు కేవలం అంతర్ముఖంగా (ఇన్వర్డ్-లుకింగ్) మారొద్దని హెచ్చరించారు. ప్రపంచ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన బాధ్యతను అమెరికా నాయకత్వానికి గుర్తుచేశారు. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని, నాటో కూటమిని బలోపేతం చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా, మత సామరస్యం, వాతావరణ మార్పుల కట్టడిపై ట్రంప్ విధానాలకు భిన్నంగా రాజు తన గళాన్ని వినిపించారు.నియంతృత్వానికి చెక్.. పరోక్ష విమర్శలుకార్యాచరణ అధికారాలపై సమతౌల్యం, నియంత్రణలు (చెకస్ అండ్ బ్యాలెన్సెస్) ఉండాలంటూ 1215 నాటి ‘మాగ్నా కార్టా’ను చార్లెస్ ప్రస్తావించడం విశేషం. ఇది ‘నా సొంత నైతికతే నాకు హద్దు’ అని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలకు పరోక్ష కౌంటర్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇరు దేశాల రాజకీయాలను కుదిపేసిన జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణాన్ని పేరు చెప్పకుండానే ప్రస్తావిస్తూ.. సమాజంలోని దురాచారాల బాధితులకు అండగా నిలవాల్సిన సామూహిక బలాన్ని ఆయన నొక్కిచెప్పారు.అట్టహాసంగా అధికారిక పర్యటనవాణిజ్య, విదేశాంగ విధానాలపరంగా విభేదాలు ఉన్నప్పటికీ, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కింగ్ చార్లెస్, క్వీన్ కమీల్లాలకు వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం లభించింది. టెక్ దిగ్గజాలు జెఫ్ బెజోస్, టిమ్ కుక్ సహా 130 మంది ప్రముఖులతో కలిసి ట్రంప్ దంపతులు వీరికి స్టేట్ డిన్నర్ (అధికారిక విందు) ఏర్పాటు చేశారు. కాగా, 1991లో క్వీన్ ఎలిజబెత్-II తర్వాత కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించిన రెండో బ్రిటిష్ చక్రవర్తిగా చార్లెస్ చరిత్ర సృష్టించారు. ఇటీవల ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలుఇరాన్ యుద్ధం విషయంలో బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ అనుసరిస్తున్న వ్యూహాలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డిజిటల్ సేవల పన్ను రద్దు చేయకపోతే బ్రిటన్‌పై భారీ టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడం గమనార్హం. అయినప్పటికీ, కింగ్ చార్లెస్ చేసిన సున్నితమైన విమర్శలను పక్కనపెట్టి, ట్రంప్ ఈ ప్రసంగాన్ని ‘అద్భుతం’ అని ప్రశంసించడంతో పాటు.. ప్రసంగం చూసి నాకే అసూయ వేసింది అని సరదాగా వ్యాఖ్యానించడం విశేషం.ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్ నిజమేనా? ‘ఈసీఐ’ ఏమంటోంది? -
ఇరాన్ దగ్గరే అణ్వాయుధం గనుక ఉంటే..
ఇరాన్‌తో అణు ఒప్పందం ఎటూ తేలకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. చర్చలకు ఇరాన్ దిగి రాకపోవడం, మధ్యవర్తి పాకిస్తాన్ సైతం చేతులెత్తేయడంతో ఈ డీల్‌పై అనిశ్చితి నెలకొంది. ఈ తరుణంలో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు మరింత చిరాకు పుట్టించినట్లున్నాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా తీరును మెర్జ్ తప్పుబట్టగా.. అందుకు ట్రంప్ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇరాన్ అణు ఆయుధం కలిగి ఉండడం సరైందేనని మెర్జ్ భావిస్తున్నారు. కానీ, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. ఒకవేళ ఇరానే గనుక అణ్వాయుధం కలిగి ఉంటే.. ప్రపంచమే దానికి బందీ అవుతుంది’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. గత అమెరికా అధినేతలెవరూ చేయలేని పనిని తాను చేస్తున్నానని.. అందుకు సంతోషించాలని మెర్జ్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వాస్తవానికి.. ‘‘ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలను పొందకూడదు. ఆ దేశ అణు సామర్థ్యం యూరప్‌కే కాదు.. ప్రపంచానికి ప్రమాదకరం’’ అని మెర్జ్ అన్నారు. అదే సమయంలో చర్చల్లో ఇరాన్ నైపుణ్యంగా వ్యవహరిస్తోందని.. అమెరికా ఈ సమస్యను ఎదుర్కొనే విధానం అస్పష్టంగా ఉందని ఆయన విమర్శించారు. అమెరికా ప్రతినిధులు పాకిస్తాన్‌కి వెళ్లి చర్చలు జరిపినా, ఎటువంటి ఫలితం రాలేదని ఆయన ఉదహరించారు. అయితే..మెర్జ్ వ్యాఖ్యలను ట్రంప్ పొరపాటుగా అర్థం చేసుకున్నారా? లేదంటే అమెరికా తీరును తప్పుబట్టినందుకు మండిపోయి అలా పోస్ట్ చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఉక్రెయిన్ యుద్ధంలోనూ అమెరికా వ్యూహాలపై యూరప్ దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అగ్రరాజ్యం అసలు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందా? అని ప్రశ్నించాయి. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోలాండ్, బాల్టిక్ దేశాలు, అలాగే యూరోపియన్ యూనియన్ నాయకత్వం అమెరికా–రష్యా మధ్య జరుగుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టారని విమర్శించాయి. అప్పటి నుంచి అమెరికా-యూరప్ దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతూ వస్తున్నాయి. -
ఇన్‌స్టాలో ట్రంప్‌పై 86-47 అంటూ పోస్ట్.. అరెస్ట్ వారెంట్ జారీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బెదిరింపునకు పాల్పడ్డారంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు జేమ్స్ కోమీ గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్టుతో సంబంధం ఉంది. ఆ పోస్టులో ఓ ఫొటో ఉంటుంది. సముద్రం పక్కన గవ్వలతో “86 47” అంకెలను రాసి ఉన్న ఫొటో అది. ఈ మెసేజ్‌ను 47వ అధ్యక్షుడు ట్రంప్‌పై హింసకు పిలుపుగా విశ్లేషకులు భావించారు. ఇక 86 అనే అంకెను కొన్ని సందర్భాల్లో ‘‘తొలగించడం” లేదా “వెంటనే పంపివేయడం” అనే అర్థంలో వాడే స్లాంగ్ పదం.. ఈ పోస్టు చేసిన కొద్ది సేపటి తర్వాత కోమీ ఆ పోస్టును తొలగించారు. అది బెదిరింపు పోస్టుకాదని తెలిపారు. “కొంతమంది ఆ అంకెలను హింసతో కలిపి చూస్తారని నాకు తెలియదు” అని ఆయన చెప్పారు. అలాగే, తాను హింసకి వ్యతిరేకినని కూడా పేర్కొన్నారు. జేమ్స్ కోమీపై ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టుకు సంబంధించి ఇప్పుడు అధికారికంగా కేసు నమోదైంది. పోస్టు గత సంవత్సరం చేసినప్పటికీ దానిపై విచారణ తర్వాత ఇప్పుడు అభియోగాలు మోపడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సోషల్ మీడియా పోస్టుతో సంబంధం ఉన్న కేసులో అమెరికా న్యాయ శాఖ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జేమ్స్ కోమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపిన ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో మంగళవారం ముందుగా కోమీపై రెండోసారి అభియోగాలు మోపారు. గతంలో కోమీపై ఒక కేసు పెట్టారు. కానీ ఆ కేసు నిలవలేదు.. ఎందుకంటే కేసు వాదించిన న్యాయవాది (ప్రాసిక్యూటర్) నియామకంలో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అదే విషయంపై మళ్లీ కొత్తగా కేసు పెట్టారు. కాగా, 2017లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి నుంచి తనను తొలగించిన తర్వాత ట్రంప్‌ను బహిరంగంగా విమర్శిస్తున్నారు కోమీ. ఆయన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ను ట్రంప్, ఇతర పరిపాలనా అధికారులు బెదిరింపు మెసేజేనని అంటున్నారు. -
పూర్తిగా పతనమయ్యే స్థితిలో ఇరాన్: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: ‘ఇరాన్ పూర్తిగా పతనమయ్యే స్థితిలో ఉంది. ఈ విషయాన్ని ఇరాన్ మాకు తెలిపింది. ఇరాన్ తమ నాయకత్వ పరిస్థితిని సర్దుబాటు చేసుకునేందుకు వీలైనంత త్వరగా హార్మూజ్ జలసంధిని తెరవాలని కోరుతోంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు. ఇరాన్ అంతర్గత నాయకత్వ సంక్షోభం కారణంగానే ఆ వ్యూహాత్మక జలమార్గాన్ని తెరవాలని కోరుతోందని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్రంప్ తెలిపారు. ప్రపంచ చమురు రవాణాలో అధిక భాగం సాగే కీలకమైన సముద్ర మార్గం హార్మూజ్ జలసంధి. దాని చుట్టూ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంటో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం నెలకొన్న శత్రుత్వాన్ని ఆపే లక్ష్యంతో ఇరాన్ తాజాగా చేసిన దౌత్యపరమైన ప్రతిపాదనను తిరస్కరించడానికే తాను మొగ్గు చూపుతున్నట్లు ట్రంప్ అంతకుముందే సూచించారు. హార్మూజ్ జలసంధిని తెరవాలని, అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చను ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో జరపాలని ఇరాన్ సూచించినట్లు సమాచారం.తాజాగా జాతీయ భద్రతా అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు సందేహాలను వ్యక్తం చేశారు. అలాగే, ఇరాన్‌లోని యురేనియం నిల్వల గురించి చర్చించకుండా కీలకమైన హార్మూజ్ జలమార్గాన్ని తిరిగి తెరిస్తే అమెరికా దౌత్యపరంగా విధిస్తున్న ఒత్తిడి ఇక ఉండదని పరిపాలనా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. జలసంధి మూసివేత వల్ల పెరిగిన ఇంధన ధరలు అమెరికాలో ఇంధన ఖర్చులను భారీగా పెంచే అవకాశం ఉంది. అమెరికా తదుపరి వ్యూహంపై స్పష్టత రాలేదు.ఇదే సమయంలో, కొనసాగుతున్న సంఘర్షణను ముగించడానికి వ్యూహాత్మక జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదనను ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం చర్చిస్తున్నట్లు వైట్ హౌస్ ధ్రువీకరించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదన చర్చకు వచ్చిందని చెప్పారు. -
ట్రంప్‌ను డైలామాలోకి నెట్టిన ఇరాన్!
ఇరాన్, అమెరికా మధ్య చర్చల విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ఇరాన్ తాజాగా చేసిన కొత్త ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అణ్వస్త్ర కార్యక్రమాన్ని మినహాయించి ఇరాన్‌తో చర్చలు జరపడంలో అర్థమే ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని అడ్డుకోవడం లక్ష్యంగా ప్రారంభమైన నేపథ్యంలో దాని ప్రస్తావనే ఆలస్యం కావడంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి.అయితే, శాంతి చర్చల్లో భాగంగా అమెరికాకు ఇరాన్ ఇటీవలే కొత్త ప్రతిపాదనలను పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా పంపించింది. ఇందులో భాగంగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, హార్మూజ్ జలసంధిని తెరవడం అనేవి జరిగిన తర్వాతే తమ అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరుపుతామని ఇరాన్ తేల్చి చెప్పింది. మరోవైపు.. అణ్వస్త్ర కార్యక్రమంపై ఇరాన్‌తో చర్చలు ఫలప్రదమైన తర్వాతే మిగతా విషయాలపై ఫోకస్ పెడతామని అమెరికా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పంపిన నూతన ప్రతిపాదనలపై చర్చించేందుకు తన సలహాదారులతో ట్రంప్ తాజాగా సమావేశమైనట్లు తెలిసింది. అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరగనిదే, మిగతా అంశాలపై ఇరాన్‌తో చర్చలను మొదలుపెట్టలేమని ట్రంప్ తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఇరాన్ ప్రతిపాదించిన క్రమంలో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేమని ట్రంప్ స్పష్టం చేశారని పేర్కొన్నాయి.ఇరాన్‌కు నో ఛాన్స్.. ఇరాన్‌తో శాంతి చర్చలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కో రూబియో తాజాగా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ..‘ఇరాన్ ఇక ఏ దశలోనూ అణ్వాయుధాలను అభివృద్ధి చేయలేదని నిర్ధారించే ఒప్పందం కుదరాల్సిందే. ఈ విషయంలో ఇరాన్‌కు తప్పించుకునే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇరాన్ నుంచి దీనిపై అమెరికా ధ్రువీకరణ పొందాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల ప్రక్రియలో మరోసారి ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాలూ తమ షరతుల ప్రకారమే చర్చలు జరగాలని వాదిస్తున్నాయి. వాదనను నెగ్గించుకునే యత్నంలో అమెరికా, ఇరాన్ ఉండటంతో చర్చల ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు.ఇరాన్ ప్రతిపాదనలు ఇవే...ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడం, మళ్లీ ఇరాన్‌పై దాడులు జరగవు అనే హామీలను పొందడం.ఇరాన్ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపడం, హార్మూజ్ జలసంధిని తెరవడం.మొదటి రెండు ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాక తమ అణ్వస్త్ర కార్యక్రమం, సంవర్ధిత యురేనియం హక్కులపై అమెరికాతో చర్చలను మొదలుపెడతామని ఇరాన్ ప్రతిపాదించింది. -
నేనే రాజునైతే సీన్ వేరేలా ఉంటుంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి డెమోక్రట్లు అత్యంత ప్రమాదకరమని.. తనపై జరిగిన హత్యాయత్నానికి ఒకరకంగా వాళ్లే కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో మీడియాపైనా ఆయన చిందులు తొక్కారు. ‘‘నేరాల విషయంలో మీడియా, డెమోక్రట్లు ఒకేలా ఉన్నాయి. నేను మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నా. నో కింగ్స్ ఆందోళనలో పాల్గొన్న వ్యక్తే నాపై హత్యాయత్నం చేశాడు. నేరస్తుడు వైడ్ అవేక్స్ అనే టీంలో సభ్యుడిగా ఉన్నాడు. నో కింగ్స్ నిరసనలకు కొందరు కుట్రదారులు ఫండింగ్ చేశారు. రాజుల్లేరు.. నేను రాజును కాదు. నేనే గనుక రాజును అయితే సీన్ వేరేలా ఉండేది’’ అని అన్నారాయన. సీబీఎస్ ‘60 నిమిషాలు’ కార్యక్రమంలో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం గురించి స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షులపై హత్యాయత్నం కొత్తేం కాదు. అది ఎప్పుడూ జరిగేదే. గతంలో గతంలో అబ్రహం లింకన్, మెక్ కిన్లే, కెనెడీలపైనా జరిగాయి. డెమోక్రట్ల విషపూరిత ప్రసంగాల వల్లే ఇలా జరుగుతోంది. వాళ్లు అమెరికాకు అత్యంత ప్రమాదకరం’’ అని అన్నారాయన. అదే సమయంలో కాల్పులకు దిగిన నిందితుడు కోలో టోమస్ ఎలెన్ చేసిన సంచలన ఆరోపణలను సీబీఎస్ ప్రతినిధి నోరా ఓడోనెల్ ప్రస్తావించారు. అయితే.. ‘‘నేను రేపిస్ట్‌ను కాదు’’ అంటూ ట్రంప్ ఆమెపై ఆయన ఫైర్ అయ్యారు. -
వ్యూహం మార్చిన ట్రంప్.. IRGCకి తొలి దెబ్బ!
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం అసలు సిసలు స్టేజ్‌కు చేరుకుంది. ఇరాన్‌పై అమెరికా పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఆర్థికంగా ఇరాన్ దెబ్బకొట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్ పోర్టులకు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని నౌకలను అడ్డుకుంటోంది. సముద్ర దిగ్భందనం చేసింది. దీంతో, ఇరాన్ రోజుకు దాదాపు 500 మిలియన్ డాలర్లు నష్టం చవిచూస్తోంది.ఇక, తాజాగా అమెరికా మరో మాస్టర్ ప్లాన్ చేసింది. అమెరికా ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి విమానయాన రంగాన్ని కీలకంగా ఉపయోగిస్తోంది. అమెరికా ఆపరేషన్ ఎకానామిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ విమానయాన సంస్థలతో లావాదేవీలు జరిపే కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ విమానాలకు జెట్ ఇంధనం, క్యాటరింగ్, ల్యాండింగ్ సేవలు లేదా నిర్వహణ వంటి సహాయాన్ని అందించే సంస్థలను సాయం నిలిపివేయాలని హెచ్చరించింది. ఈ క్రమంలో, ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కి సేవలు అందించే ఏ కంపెనీ అయినా ఆంక్షలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఆయా కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా పేర్కొంది.కాగా, ఇరాన్‌కు Iran Air మరియు Mahan Air విమాన సంస్థలు ఉన్నాయి. ఇవి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ప్రకారం, ఇరాన్ ఎయిర్‌లైన్స్ IRGC కోసం ఆయుధాలు, సిబ్బంది, సామగ్రి తరలించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్‌లైన్స్‌పై ఆంక్షలు విధించి ఆర్థికంగా ఇరాన్‌ను దెబ్బతీయాలనే ప్లాన్ చేసినట్టు తెలిసింది. అలాగే, ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోని కంపెనీలు ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో సంబంధాలు పెట్టుకోకుండా చూడాలని అమెరికా కోరుతోంది.ప్రస్తుతం అమెరికా ఆంక్షల జాబితా (SDN List)లో ఇరాన్‌కు సంబంధించిన అనేక కంపెనీలు, షిప్పింగ్ సంస్థలు, రిఫైనరీలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా చైనా, హాంకాంగ్, యూఏఈ, లైబీరియా, మార్షల్ దీవులు, కేమన్ దీవులు వంటి దేశాలకు సంబంధించిన సంస్థలు. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా ఆంక్షల వల్ల చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ఇప్పటికే నష్టపోయాయి. ముఖ్యంగా చైనా రిఫైనరీలు, షిప్పింగ్ కంపెనీలు, మరియు ఇరాన్ ఆయిల్ రవాణా నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ నుండి వేరుచేయబడ్డాయి.ట్రంప్ వార్నింగ్యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉందని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్‌కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్, దిగ్బంధనం కారణంగా వారి వద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. ఆర్థికంగా ఇరాన్ బలహీనంగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ..ఇరాన్‌పై 2025లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇరాన్‌కి సంబంధించిన ఆయుధాలు, డ్రోన్లు, ఆయిల్ స్మగ్లింగ్, విమాన రవాణా నెట్‌వర్క్‌లను అడ్డుకోవడమే లక్ష్యం.ప్రెషర్ పాయింట్: అంతర్జాతీయంగా విమానయాన సేవలు లేకుండా ఎయిర్‌లైన్స్ నడవలేవు. అందుకే ఈ రంగాన్ని ఆంక్షలతో బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు.ప్రాంతీయ ఉద్రిక్తతలు: హార్మూజ్ జలసంధిలో ఇరాన్ బలగాలు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపిన ఘటనల తర్వాత ఈ హెచ్చరిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.ఆంక్షలు: అమెరికా వెలుపల ఉన్న కంపెనీలు కూడా ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కి సేవలు అందిస్తే ఆంక్షలకు గురవుతాయి. ఆంక్షలు పడిన సంస్థలు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ, మార్కెట్లకు దూరమవుతాయి.సేవలు నిషేధం:జెట్ ఇంధనం సరఫరావిమాన మెయింటెనెన్స్, రిపేర్ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్గ్రౌండ్ హ్యాండ్లింగ్ల్యాండింగ్, ఎయిర్పోర్ట్ ఫీజులుప్రపంచ వ్యాపారాలు: విమానయాన, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లోని సంస్థలు నేరుగా ప్రభావితమవుతున్నాయి.ప్రాంతీయ ప్రభావం: హార్మూజ్ జలసంధి దిగ్భందనం వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా అంతరాయం. -
ట్రంప్ కోటకు కింగ్ చార్లెస్: 20 నిమిషాల ప్రసంగంపై ఉత్కంఠ
వాషింగ్టన్: ఇరాన్ వివాదం నేపథ్యంలో అమెరికా-బ్రిటన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III రంగంలోకి దిగారు. నాలుగు రోజుల చారిత్రక పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న ఆయనకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం పలికారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ పర్యటనలో కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన చేయబోయే ప్రసంగంపైనే అందరి దృష్టి నిలిచింది.చారిత్రక ఘట్టం: అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగం1991లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత అమెరికా చట్టసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ III చరిత్ర సృష్టించనున్నారు. సుమారు 20 నిమిషాల పాటు సాగే ఈ ప్రసంగంలో ఉమ్మడి ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను, రెండు దేశాల మధ్య దెబ్బతిన్న బంధాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పనున్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో 21 తుపాకుల వందనంతో లాంఛనప్రాయ స్వాగతం అందుకున్న అనంతరం, ట్రంప్ దంపతులతో ఓవల్ ఆఫీసులో రాజు, క్వీన్ కెమిల్లా ఏకాంతంగా చర్చలు జరుపుతారు.ఉద్రిక్తతలు.. ఆసక్తికర పరిణామాలుఇరాన్పై అమెరికా సైనిక చర్యకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మద్దతు ఇవ్వకపోవడంతో ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన తొలి రోజైన సోమవారం ట్రంప్ దంపతులు బ్రిటన్ రాజ దంపతులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా 2024లో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన ఓ పెయింటింగ్‌ను ట్రంప్ వారికి చూపించడం గమనార్హం. అనంతరం బ్రిటిష్ ఎంబసీలో జరిగిన విందులో రాజు పాల్గొన్నారు.250 వసంతాల స్వాతంత్యానంతరం..అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ పర్యటన జరగడం రెండు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకపక్క ఈ పర్యటనను రద్దు చేయాలని కొందరు బ్రిటన్ పౌరులు కోరుతున్నప్పటికీ, ప్రధాని స్టార్మర్ దీనిని గట్టిగా సమర్థించారు. మంగళవారం రాత్రి వైట్‌హౌస్‌లో జరిగే అధికారిక విందులో రాజు ప్రసంగించనున్నారు. బుధవారం న్యూయార్క్‌లోని 9/11 స్మారకాన్ని సందర్శించి, గురువారం బెర్ముడా పర్యటనతో ఆయన తన అమెరికా టూర్‌ను ముగిస్తారు.ఇది కూడా చదవండి: కమలానికి ‘వంద’ కష్టాలు: షా వ్యూహం రివర్స్? -
ట్రంప్‌ను కసితీరా చంపాలనుకున్నాడు!
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు జరిపిన నిందితుడు కోల్ టొమాస్ ఎలెన్‌పై నేరాభియోగం నమోదు అయ్యింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలని ప్రయత్నించాడని దర్యాప్తు సంస్థలు తేల్చేశాయి. దీంతోపాటు మరో రెండు నేరాలను కూడా అతనిపై మోపారు. ఈ తీవ్ర నేరాల కింద ఫెడరల్ కోర్టులో ఎలెన్ విచారణను ఎదుర్కొబోతున్నాడు.‘‘ఇది స్పష్టంగా అధ్యక్షుడిని హత్య చేయడానికి చేసిన ప్రయత్నం. నిందితుడు తన ఉద్దేశాన్ని కుటుంబానికి పంపిన మేనిఫెస్టోలో(మెసేజ్‌లో) స్పష్టంగా పేర్కొన్నాడు. అధ్యక్షుడిని కసితీరా చంపాలన్నదే అతని ఉద్దేశం. అయితే సీక్రెట్ సర్వీస్ తక్షణ చర్య తీసుకోవడంతో ఆయన సురక్షితంగా ఉండగలిగారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ప్రభుత్వం తరఫున అటార్నీలు వాషింగ్టన్ డీసీ ఫెడరల్ కోర్టులో వాదనలు వినిపించారు.సోమవారం ఈ కేసు విచారణ జరిగింది. ఎలెన్ తరఫున వాదించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఇద్దరు ఇద్దరు పబ్లిక్ డిఫెండర్లు (ప్రభుత్వ న్యాయవాదులు) నియమించారు. ఎలెన్‌కు గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని.. కాబట్టి నేరం రుజువయ్యేంతదాకా అతన్ని నిర్దోషిగా పరిగణించాలని న్యాయవాది టెజిరా అబే వాదించారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 30న జరగనుంది. జైలా? బెయిలా? అనేది ఆరోజే డిసైడ్ కానుంది.ఇదిలా ఉంటే.. గతంలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా హత్యాయత్నం జరిగింది. 2024లో జరిగిన పెన్సిల్వేనియా ఘటనలో నిందితుడు థామస్ క్రూక్స్.. ట్రంప్‌పై కాల్పులు జరిపిన తర్వాత సీక్రెట్ సర్వీస్ స్నైపర్ల చేతిలో చనిపోయాడు. అయితే ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ఒకవేళ హత్యాయత్నం నేరం గనుక రుజువైతే కోల్ టొమాస్ ఎలెన్(31)కు జీవిత ఖైదు పడనుంది. ట్రంప్‌పై హత్యాయత్నంతో పాటు అనుమతి లేకుండా ఆయుధాన్ని కలిగి ఉండటం(illegal possession of a firearm), ఆ ఆయుధాన్ని ఉపయోగించి దాడి చేయాలని చూడడం.. ఈ రెండు నేరాలను కూడా నమోదు చేశారు. ఈ నేరాలకుగానూ ఒకదానికి భారీ జరిమానా, మరోదానికి 10 జైలు శిక్ష పడతాయి.శనివారం రాత్రి వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికారులు సహా పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. కాసేపట్లో ట్రంప్ మాట్లాడాల్సి ఉండగా.. అదే హోటల్లో బస చేసిన ఎలెన్ భద్రతా వలయాన్ని దాటుకుని మరీ వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. అయితే మీటింగ్ జరుగుతున్న రూమ్ వైపు అతన్ని వెళ్లకుండా భద్రతా సిబ్బంది అదుపు చేయగలిగారు. అక్కడికక్కడే అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.మేనిఫెస్టోలో ఏముందసలు..కోల్ టొమాస్ ఎలెన్ బాగా చదువుకున్న వ్యక్తి. కాలిఫోర్నియాలో టీచర్‌గానూ పని చేస్తున్నాడు. అయితే దాడి యత్నానికి ముందు తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో ట్రంప్‌పై అతడు పలు ఆరోపణలు చేశాడు. ‘ఒక పీడోఫైల్, రేపిస్ట్, దేశద్రోహిని అంగీకరించేది లేదు’ అని పేర్కొన్నాడు. అయితే ఆ ఆరోపణలన్నీ ట్రంప్ పేరు ప్రస్తావన లేకుండా పరోక్షంగానే ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత వర్గాలే తన టార్గెట్ అని అందులో పేర్కొన్నాడతను. అమెరికాలో అరాచక పాలనను భరించలేకనే దాడికి దిగుతున్నానని.. సాధ్యమైనంత వరకు ఇతరులను చంపే ప్రయత్నం చేయబోనని.. గత్యంతరం లేని పరిస్థితిలో అలా చేయాల్సి వస్తే తనను క్షమించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు హిల్టన్ హోటల్ భద్రత ఘోరంగా ఉందని.. తాను పెద్ద తుపాకీతో వచ్చినా ఎవరూ గుర్తించేవారు కాదేమో అంటూ సెటైర్ వేశాడు. ట్రంప్ రియాక్షన్.. తనపై కోల్ టొమాస్ ఎలెన్ చేసిన ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. సీబీఎస్ 60 మినిట్స్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. అతడు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తి, ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. పైగా అతనో క్రైస్తవ వ్యతిరేకి అని ట్రంప్ ఆరోపించారు. కొందరు అనుకుంటున్నట్లు కాల్పులు జరిగిన సమయంలో తానేం భయపడలేదని.. ఏం జరుగుతుందో చూడాలనిపించిందని.. కానీ, సీక్రెట్ సర్వీస్ అధికారులు తనను బయటకు తీసుకెళ్లారని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
యుద్ధం ముగింపు? ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ కీలక చర్చలు
వాషింగ్టన్ డీసీ: యుద్ధాన్ని ముగించడం, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించడం లక్ష్యంగా ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం చర్చలు జరుపుతున్నట్లు వైట్ హౌస్ ధ్రువీకరించింది.వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “ఇవాళ ఉదయం అధ్యక్షుడు ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారని నేను ధ్రువీకరిస్తున్నాను. సమావేశం ఇంకా కొనసాగుతుండవచ్చు, లేక ముగిసి ఉండవచ్చు. ప్రతిపాదనపై చర్చ జరిగింది. దాన్ని పరిశీలిస్తున్నారని నేను చెప్పను. ఈ ఉదయం చర్చ జరిగింది అని మాత్రమే చెబుతాను. దీనిపై ముందుగా వివరాలు చెప్పదలచుకోలేదు. ఈ అంశంపై త్వరలోనే అధ్యక్షుడు స్వయంగా మాట్లాడతారు” అని ఆమె చెప్పారు.మూడోసారి పాక్‌కు అబ్బాస్ అరాఘ్చీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌కు చేరుకున్నారు. అమెరికాతో ఘర్షణను ముగించేందుకు కొనసాగుతున్న దౌత్య చర్యల్లో భాగంగా ఆయన ఇస్లామాబాద్‌కు రావడం 48 గంటల్లో ఇది మూడోసారి.అబ్బాస్ అరాఘ్చీ అంతకుముందు రష్యాలో కార్యక్రమాలు ముగించుకున్నారు. అరాఘ్చీ ఇస్లామాబాద్ తాజా పర్యటన రష్యా, ఒమాన్ సహా పలు దేశాల్లో ఉన్నతస్థాయి సమావేశాల తర్వాత జరిగింది. పాకిస్థాన్‌కు ఆయన పదేపదే రావడం ప్రస్తుత పరిస్థితిలో శాంతికి మధ్యవర్తిగా ఇస్లామాబాద్ పాత్రను సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అరాఘ్చీ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చ జరిగింది. కాగా, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తర్వాతి దశలో నిర్వహించాలని షరతు పెట్టింది. -
అటు తిరిగి, ఇటు తిరిగి ఎఫ్‌బీఐ చీఫ్ మీదికి వచ్చింది!
ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి అమెరికాలో ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అమెరికాలో ఉగ్రవాదం, గూఢచర్యం, అంతర్గత భద్రతా ముప్పులను ఎదుర్కోవడంలో ఎఫ్‌బీఐ కీలక పాత్ర పోషిస్తుంది. అవినీతి, సైబర్ నేరాలు, మాఫియా, పౌరహక్కుల ఉల్లంఘనలు వంటి 200 కంటే ఎక్కువ రకాల ఫెడరల్ నేరాలను ఎఫ్‌బీఐ పరిశీలిస్తుంది.సైబర్ దాడులు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ భద్రతా సమస్యలను ఎదుర్కోవడానికి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. రాష్ట్ర, స్థానిక, అంతర్జాతీయ పోలీస్ సంస్థలతో కలిసి పనిచేసి, నేరాల నియంత్రణలో సమన్వయం కల్పిస్తుంది. మొత్తానికి, ఎఫ్‌బీఐ అమెరికాకు భద్రతా కవచంగా, అలాగే ఫెడరల్ నేరాల పరిశోధన సంస్థగా పనిచేస్తుంది. అటువంటి ఎఫ్‌బీఐకు చీఫ్ అంటే ఎలా ఉండాలి? ఎంతో సమర్థుడై ఉండాలి. ఏదైనా ముప్పు తలెత్తినప్పుడు ముందు నిలబడి ఎదుర్కోవాలి. కానీ, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి కెమెరాకు దొరికిపోయారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఇటీవల నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాష్ పటేల్ హాయిగా కుర్చీకే అతుక్కుపోయి కూర్చుండిపోయారు.There is a shooting and…The head of the FBI is just hanging out? pic.twitter.com/jrIKMYhHte— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) April 26, 2026దీంతో ఎఫ్‌బీఐ చీఫ్ పదవిలో కాష్ పటేల్ నిలదొక్కుకోగలరా? వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేళ భద్రతా లోపాలు, నిందితుడి స్టేట్మెంట్ వంటివాటి వల్ల కాష్ పటేల్ పదవి వీడాల్సిందేనా? అన్న ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి తొలగించే వారి లిస్టులో.. కాష్ పటేల్ ఉండవచ్చని ఒక సీనియర్ వైట్‌హౌస్ అధికారి ఇటీవలే మీడియాకు తెలిపారు. పటేల్‌ను పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమని, “ఎప్పుడు తొలగిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న?” అని వ్యాఖ్యానించారు. అసలు కాష్ పటేల్‌ను తొలగిస్తారన్న ప్రచారం చాలా కాలంగా ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు ఆ ప్రచారం మరింతగా పెరగడానికి కారణాలు ఏంటి? మీడియాలో కాష్ పటేల్‌పై ప్రతికూల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆయన పనితీరుతో పాటు నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలపై విమర్శలు పెరిగాయి. కేబినెట్ కార్యదర్శి దృష్టిలో ఇది మంచిది కాదు. ఇటీవల వాషింగ్టన్ హిల్టన్‌లో జరిగిన భద్రతా లోపం ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ విషయంలో రాజకీయ చర్చగా మారుతోంది. నిందితుడు రాసిన “ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్” లేఖలో పలువురు ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ, పటేల్ పేరు మాత్రం లేదన్న విషయం తెలిసిందే.కాల్పుల ఘటన తర్వాత ఏం జరిగింది?కాల్పుల ఘటన అనంతరం పలు వీడియోలు ఆన్లైన్లో కనపడ్డాయి. ఒక వీడియోలో నిందితుడు అలెన్ హోటల్లోకి పరుగెత్తాడు. తర్వాత కాల్పుల శబ్దం వినిపించింది. మరో వీడియోల్లో అతిథులు టేబుళ్ల కింద దాక్కోవడం, భద్రత సిబ్బంది వేగంగా కదలడం, అధికారులను బయటకు తరలించడం కనిపించింది.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో కాష్ పటేల్ అయోమయంగా చుట్టూ చూస్తూ కుర్చీలో కూర్చుండిపోయారు. భద్రతా సిబ్బంది అతిథులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వీడియోలో కాష్ పటేల్ అక్కడ ఏమీ జరగనట్లు అటూఇటూ తిరుగుతూ ఫోన్లో మాట్లాడారు. ఆ సమయంలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ప్రజలను బయటకు తీసుకెళ్తుండగా కాష్ పటేల్ ప్రశాంతంగా కనిపించారు.FBI Director Kash Patel seen on his phone, just hanging around outside the venue like a random WHCD attendee trying to figure out how to get an Uber after the incident. pic.twitter.com/28eIcwGUdl— MeidasTouch (@MeidasTouch) April 26, 2026కాష్ పటేల్ ఆ పదవిలో కొనసాగుతారా?వైట్ హౌస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడికి ముందు అలెన్ తన కుటుంబానికి ఒక లేఖ పంపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పత్రంలో తాను “ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్” అని పేర్కొంటూ, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుంటానని తెలిపాడు.అయితే “ప్రభుత్వ అధికారులు (మిస్టర్ పటేల్ మినహా)” అని పేర్కొన్న ఒక వాక్యం ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దాని వెనుక ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఆ పత్రంలో ట్రంప్ వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక అభిప్రాయాలు కూడా ఉన్నాయి.ఈ ఘటనకు ముందు కూడా పటేల్‌పై పలు భద్రతా అంశాలపై విమర్శలు ఉన్నాయి. 2024 చివర్లో, 2026 మార్చిలో ఆయన వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాలపై ఇరాన్ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడులు జరిగాయని నివేదికలు వెలువడ్డాయి. ఇది సైబర్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. కాష్ పటేల్ వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన వాటిని ఖండించారు. ఈ ఆరోపణలపై ఆయన పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారు. -
ఈసారి భీకర దాడే: ఇరాన్ వార్నింగ్
గల్ప్ దేశాలకు ఇరాన్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ నుంచి నాలుగింతలు దాడి చూడాలనుకుంటేనే అమెరికా మద్దతు విషయంలో ముందుకెళ్లాలని, ఈ తరుణంలో జరిగే పరిమాణాలకు మీరే బాధ్యత వహించాలని ఇరాన్ హెచ్చరించింది. యుద్ధానికి సంబంధించి రెండో విడత శాంతి చర్చలు ఇంకా అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో తమ పొరుగు గల్ఫ్ దేశాలు ఏమైనా అమెరికాకు మద్దతు ఇస్తే మాత్రం ఈసారి తమ నుంచి భీకర దాడి చూడాల్సి వస్తుందని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఎస్మాయిల్ సాగాబ్ ఎస్ఫహానీ హెచ్చరించారు. ప్రధానంగా హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న నిర్బంధం కారణంగా తమ మౌలిక వసతులు, ముఖ్యంగా చమురు బావులు, దెబ్బతింటే మాత్రం నాలుగు రెట్లు ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వాలని భావించే గల్ఫ్ దేశాలు కాస్త వెనక్కి తగ్గితేనే మంచిదని, లేని పక్షంలో తమ నుంచి ఈసారి వచ్చే ప్రతిస్పందన మీ ఊహకు కూడా అందదని ఎస్ఫహానీ ముందస్తు సంకేతాలు పంపారు. ‘మా లెక్కలు వేరుగా ఉంటాయి. ఒక చమురు బావి అంటే నాలుగు చమురు బావుల నష్టం, అమెరికాకు మద్దతిస్తే మాకు భారీ నష్టాన్ని తేవడంలో మీ వంతు పాత్ర కూడా ఉందనే అనుకుంటాం. అందుకు ప్రతి స్పందన కూడా నాలుగింతలే ఉంటుంది’ అని పేర్కొన్నారు. గత వారం, తన ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్.. ఇరాన్‌ను కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థగా రాసుకొచ్చారు. ‘ ఇరాన్ ఆర్థికంగా కూలిపోతోంది. వారు హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని కోరుకుంటున్నారు . నగదు కోసం ఆకలితో ఉన్నారు. రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతున్నారు. సైన్యం, పోలీసులు జీతాలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి’ అని తెలిపారు. -
దిగివచ్చిన ఇరాన్.. యుద్ధం ముగింపు, హార్మూజ్‌పై గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు అందించింది అంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీంతో, యుద్ధంగా ముగుస్తుందా? అనే చర్చ మొదలైంది. అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ ప్రకారం..‘అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తానీ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ చేరవేసింది. వివాదాస్పద అణు చర్చలను తదుపరి దశకు వాయిదా వేస్తున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొంది’ అని వెల్లడించింది. కాగా, పశ్చిమాసియా సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన కీలక పరిణామంగా ఆ మీడియా కథనం అభివర్ణించింది. యాక్సియోస్ ప్రకారం.. వైట్‌హౌస్‌కు ఈ ప్రతిపాదన అందింది. కానీ, దీనిని పరిశీలించడానికి యునైటెడ్ స్టేట్స్ సుముఖంగా ఉందో లేదో స్పష్టంగా తెలియదు.Amid the deepening stalemate in peace talks, Iran has conveyed a fresh proposal to the United States through Pakistani mediators, prioritising reopening the Strait of Hormuz and bringing the ongoing war in West Asia to an end while deferring contentious nuclear negotiations to a… pic.twitter.com/DNRlZgKoZH— India Today Global (@ITGGlobal) April 27, 2026ఇదిలా ఉండగా.. చర్చలకు రెడీ అయితే ఇరాన్ ఎప్పుడైనా తమకు సందేశాన్ని పంపొచ్చని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు పొందే అవకాశాన్ని ఇరాన్‌కు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక, ఇరు దేశాల మధ్య స్తంభించిపోయిన శాంతి ప్రయత్నాల మధ్య ఈ ప్రతిపాదన వచ్చింది.అణు చర్చలపై ఉత్కంఠ..అంతకుముందు.. ఇరాన్ కనీసం ఒక దశాబ్దం పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్న నిల్వలను దేశం నుండి తరలించాలని అమెరికా డిమాండ్ చేసింది. అయితే, నివేదిక ప్రకారం, ఈ డిమాండ్లకు ఎలా స్పందించాలనే దానిపై ఇరాన్ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి మరియు ప్రధాన సంధానకర్త అబ్బాస్ అరఘ్చి వారాంతంలో మధ్యవర్తులతో చెప్పారు. ఇక, పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా తెలియజేసిన రెండు దశల ప్రణాళికలో మొదట హార్మూజ్ జలసంధిపై సంక్షోభాన్ని పరిష్కరించడం, అమెరికా దిగ్బంధనాన్ని ముగించడంపై ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, కాల్పుల విరమణను సుదీర్ఘ కాలం పాటు పొడిగించడమో లేదా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమో చేయాలి. జలసంధిని తిరిగి తెరిచి, దిగ్బంధనాన్ని ఎత్తివేసిన తర్వాత, తదుపరి దశలో మాత్రమే అణు చర్చలు ప్రారంభించాలి. -
భారతీయ మేధస్సుపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఆత్మగౌరవానికి దెబ్బ
నేడు ప్రపంచ యవనికపై ఒక వికృత దృశ్యం ఆవిష్కృతమైంది. ఏ దేశమైతే స్వేచ్ఛకు, సమానత్వానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకుంటుందో.. ఏ దేశమైతే వలసదారుల రక్తం, చెమట మీద నిర్మించబడిందో.. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారతీయ వలసదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమైనవి. భారతీయులు నరకం నుంచి వస్తున్నారంటూ ఒక లేఖను సోషల్ మీడియాలో షేర్ చేయడం అత్యంత దారుణమైన విషయం. ఇది కేవలం ఒక దేశాధ్యక్షుడు చేయాల్సిన ప్రకటన కానే కాదు, ఇది ఒక జాతి మేధస్సుపై చేసిన దాడి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి తగిలిన గాయం. అధ్యక్షుడు ట్రంప్ గారూ మీరూ… ఒక్కసారి చరిత్ర పుటలు తిరగేయండి. మీ అహంకారపు పునాదుల కింద ఉన్నది భారతీయ మేధస్సు అని మర్చిపోకండి!అమెరికా వెన్నెముక.. భారతీయులే అన్న విషయాన్ని విస్మరించకండి. అసలు భారతీయులు లేని అమెరికాను ఊహించడం అసంభవం. గణాంకాలు ఏం చెబుతున్నాయో మీరే చూడండి. సుందర్ పిచాయి లేని గూగుల్, సత్య నాదెళ్ల లేని మైక్రోసాఫ్ట్, అరవింద్ కృష్ణ లేని IBM, శంతను నారాయణ్ లేని అడోబ్.. ఇవి కేవలం పేర్లు కావు, అమెరికాను ప్రపంచానికి నాయకుడిగా నిలబెట్టిన మేధావులు. మీరు ఈ రోజు వాడుతున్న విండోస్ నుంచి సెర్చ్ చేస్తున్న గూగుల్ వరకు ప్రతి అణువులోనూ భారతీయుడి మేధస్సు ఉంది. అమెరికాలోని అత్యంత శక్తివంతమైన 500 కంపెనీల్లో దాదాపు 35 శాతం కంపెనీల సారథులు భారతీయులే. సుందర్ పిచాయి, సత్య నాదెళ్ల మాత్రమే కాదు.. లీనా నాయర్ (చానెల్), రవి కుమార్ (కాగ్నిజెంట్), నిమేష్ షా.. ఇలా ఒక సుదీర్ఘమైన జాబితా ఉంది. వీరు లేకపోతే అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది.అమెరికా జనాభాలో భారతీయులు కేవలం 1.5 శాతం మాత్రమే. కానీ అమెరికా చెల్లించే మొత్తం ఆదాయపు పన్నులో భారతీయుల వాటా దాదాపు 6 శాతం. అంటే 300 పై చిలుకు బిలియన్ డాలర్లు. అంత పెద్ద మొత్తంలో ఖజానాకు పన్నుల రూపంలో ఇస్తున్నది భారతీయులే. అంతే కాదు అమెరికాలో ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు భారతీయులే. భారతీయులు గనుక ఒక్క రోజు సమ్మె చేస్తే అమెరికా ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి ఏమిటో అమెరికా అధ్యక్షుడు ఒక సారి గుర్తు చేసుకుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఒకవేళ భారతీయులు అక్కడ నరకాన్ని సృష్టిస్తే, ఆ నరకంలో నుంచి అమెరికన్లను కాపాడే దేవుళ్లు ఎవరు? అంతెందుకు మీరు గొప్పగా చెప్పుకునే నాసా లోని శాస్త్రవేత్తలలో 36 శాతం మంది భారతీయులే. అంటే అమెరికా జెండా అంతరిక్షంలో రెపరెపలాడాలన్నా, వెనక ఉండాల్సింది భారతీయుడి మేధస్సే.అమెరికా గత 50 ఏళ్లుగా గ్రీన్ కార్డ్ ఆశ చూపి మన దేశంలోని అత్యుత్తమ మేధస్సును దోచుకుంది. ఐఐటీలు, ఐఐఎంలలో మన ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తే.. ఆ మేధస్సును వాడుకుని అమెరికా లాభపడింది. తీరా పనయ్యాక, ఇప్పుడు నరకం అని ముద్ర వేస్తారా? ఇదేనా మీ సంస్కారం? గత అమెరికా అధ్యక్షులు తెలివైన వారు కాబట్టే భారత్ నుంచి మేధో వలసను ప్రోత్సహించారు. తద్వారా అమెరికా నేడు అగ్రరాజ్యమైంది. కానీ నేడు ట్రంప్ ఆ మేధావులను నరకం నుంచి వచ్చిన వారుగా సంబోధించడం ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ఠ. ఏ నోటితో అయితే భారతీయులను దూషిస్తున్నారో, అదే నోటితో మళ్ళీ భారతీయ ఐటీ కంపెనీల సాయం కోరడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. అమెరికా అభివృద్ధి చెందింది వారి సొంత తెలివితేటలతో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను, ముఖ్యంగా భారతీయులను ఆకర్షించి, వారిని వాడుకోవడం వల్ల మాత్రమే. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? మన దేశ గడ్డపై పుట్టి, ఇక్కడి నీరు తాగి, ఇక్కడ చదువుకుని.. అమెరికాను నిర్మిస్తున్న మన మేధావులను అవమానిస్తుంటే మన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇది దౌత్యపరమైన అంశం మాత్రమే కాదు, ఇది మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం. మన టెక్కీలను, డాక్టర్లను, సైంటిస్టులను తిరిగి రండి.. మీ దేశాన్ని నిర్మించండని పిలిచే దమ్ము మన దేశ నాయకత్వానికి లేదా?పొరుగున ఉన్న చైనా గూగుల్ లేకుండా నడవగలుగుతోంది, వాట్సాప్ లేకుండా ఉండగలుగుతోంది. మరి భారత్ ఎందుకు గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్‌లపై ఆధారపడాలి? మన డేటాను వారు వాడుకుంటూ, మన దేశం నుంచి బిలియన్ డాలర్ల కొద్దీ వ్యాపారం చేస్తూ మనపైనే అహంకారం ప్రదర్శిస్తే ఎందుకు మౌనంగా ఉండాలి? మేకిన్ ఇండియా అనేది కేవలం నినాదం కాదు, అదొక నిప్పు కణిక కావాలి. మన మేధావులతో సరికొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తీసుకురావాలి. భారతీయులను గౌరవించని దేశాల యాప్‌లను మన దేశంలో ఎందుకు అనుమతించాలి? చైనా తరహాలో మనం కూడా మన సొంత డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ కేవలం ఖండనలతో సరిపెట్టకూడదు. మా టెక్కీలను, మా డాక్టర్లను వెనక్కి రమ్మని భారత ప్రధాని ఎందుకు పిలుపు ఇవ్వకూడదు? గూగుల్ లేదా ఏఐ సెర్చ్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా మనం సెర్చ్ ఇంజిన్ తయారు చేయలేమా? వాట్సాప్ కు బదులు మన సొంత మెసేజింగ్ యాప్ తీసుకురావడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? మన డేటాతో అమెరికా కంపెనీలు బిలియన్ల లాభాలు గడిస్తున్నాయి. ఆ డేటాను మన దేశంలోనే ఎందుకు భద్రపరచుకోకూడదు?మేకిన్ ఇండియా - ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? చైనా తన దేశంలో విదేశీ యాప్‌లను నిషేధించి సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. భారత్ ఆ సాహసం ఎందుకు చేయకూడదు? మన దగ్గర ప్రతిభ ఉంది, కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. భారతీయులను అవమానించే నాయకులు ఉన్న దేశం నుంచి వస్తున్న టెక్నాలజీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? ఆత్మనిర్భర్ భారత్ ఇది కేవలం వస్తువుల తయారీకే పరిమితం కాకూడదు. ఇది సాఫ్ట్వేర్, డిజిటల్ రంగాల్లో కూడా ప్రతిబింబించాలి.చివరగా, అధ్యక్షుడు ట్రంప్ గారూ.. వినండి! మీరు నిర్మిస్తున్న గోడలు మనుషులను వేరు చేయవచ్చు కానీ మేధస్సును ఆపలేవు. అమెరికా తన వినాశనాన్ని తనే కోరుకుంటుందని మీ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. భారతీయులు లేని అమెరికా ఒక శూన్యం. ఇకనైనా మన భారతీయ యువత ఆలోచించాలి. ఎన్నాళ్లు పరాయి దేశానికి ఊడిగం చేస్తాం? మన మేధస్సు మన దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. విదేశీ యాప్‌లను బహిష్కరిద్దాం.. స్వదేశీ పరిజ్ఞానాన్ని వెలిగిద్దాం. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే అమెరికా కల మనకు వద్దు! భారతీయ మేధస్సు.. ప్రపంచానికి దిక్సూచి కావాలి. - కంచర్ల యాదగిరిరెడ్డి, Managing Editor, సాక్షి టీవీ. -
క్రిమినల్ గా మారిన బెస్ట్ టీచర్.. కోల్ అలెన్ కి ఏమైంది?
-
దాడికి 10 నిమిషాల ముందు ఏం చేశాడంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ఉన్నతాధికారులపై హత్యాయత్నం వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దాడికి ముందు అనుమానితుడు తన కుటుంబానికి ఓ సుదీర్ఘమైన లేఖ(మేనిఫెస్టో) రాశాడు. అందులో దాడికి కారణాలు.. తన లక్ష్యం.. అలాగే ఆ దాడిని ఈ తరహాలోనే ఎందుకు చేయాలనుకుంది.. మొత్తం చెప్పుకొచ్చాడు.తనను తాను ఫ్రెండ్లీ ఫెడరల్ అస్సాసిన్’ అంటూ సంబోధించుకున్న ఎలెన్ ఇలా రాసుకొచ్చాడు.. హింసకు హింసతో ప్రతిస్పందించకూడదు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు అని క్రైస్తవం చెబుతుంది. వ్యక్తిగత అవమానాలు లేదా దాడులు ఎదురైనప్పుడు ప్రతీకారం తీర్చుకోవద్దు అని అంటోంది. కానీ, ఇతరుల చెంప మీద కొడుతున్నప్పుడు మౌనంగా చూడమని కాదు. అలాంటి సమయంలోనూ స్పందించకపోతే అణచివేతకు సహకరించినట్లే అవుతుంది.నిత్యం అఘాయిత్యాలు, ఆకలి కేకలు, వేధింపులు, అన్యాయంగా మరణశిక్షల విధింపు.. వీటిని చూస్తూ భరించలేకపోతున్నా. సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం తగ్గించాలని భావిస్తున్నా. కానీ, ఒక రేపిస్ట్, ద్రోహి.. పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వ్యక్తి ప్రసంగం వినడానికి చాలామంది వచ్చారు. నా లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో..తన కుటుంబ సభ్యులు, సహచరులు, విద్యార్థులు, ప్రయాణికులు, హోటల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే తన నిర్ణయాలు ఇతరులకు నష్టం కలిగించవచ్చని క్షమాపణలు తెలియజేశాడు.అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్’(డబ్ల్యూహెచ్‌సీఏ) విందు సమావేశం జరిగింది. పదేళ్ల తర్వాత ఆ డిన్నర్‌కు హాజరైన ట్రంప్.. మరికాసేపట్లో మాట్లాడాల్సి ఉంది. ఈలోపు.. 8.34గం. ప్రాంతంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.హాల్ బయట కాల్పులు జరుగుతుండడంతో ట్రంప్ దంపతుల చుట్టూ భద్రతాధికారులు వలయంగా ఏర్పడి వేదిక వద్ద నుంచి తరలించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ దంపతులను, ఇతర అధికారులనూ సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. తుపాకులు, కత్తులతో వచ్చిన ఆగంతుకుడిని మీటింగ్ జరుగుతున్న బాల్రూంవైపు వెళ్లకుండా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆపేశాయి. సంకెళ్లు వేసి ఆపై అక్కడి నుంచి తరలించాయి. నిందితుడు కోల్ టొమాస్ ఎలెన్‌ను (31)గా ధృవీకరించిన దర్యాప్తు సంస్థలు.. కాలిఫోర్నియా టొరాన్స్లో అతనో టీచర్‌గా చెబుతున్నారు. అంతేకాదు.. ఎలెన్ అదే హోటల్లో బస చేశాడని అధికారులు గుర్తించారు.లిస్ట్ నుంచి ఆయనొక్కడికే మినహాయింపు.. ఎలెన్ లిస్ట్‌లో ఉన్న పేర్లు బయటకు రావాల్సి ఉంది. అయితే.. ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని హైలెవల్ నుంచి లోలెవల్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ నుంచి ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పేరు మాత్రం మినహాయించబడిందట. ఎలెన్ ఆయన్ని మాత్రమే ఎందుకు తప్పించాడు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే హోటల్ సిబ్బందిని కూడా దాడి నుంచి మినహాయించుకున్నాడని తెలుస్తోంది.ఇవాళే కోర్టుకు.. వాషింగ్టన్ హిల్టన్‌లో భద్రతా తనిఖీ కేంద్రాన్ని దాటి, అధికారులతో కాల్పులు జరిపిన తర్వాత ఎలెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా యు.ఎస్. అటార్నీ జీనిన్ పిర్రో ఏం చెబుతున్నారంటే.. అతనిపై ఫెడరల్ ఆయుధాలు, దాడి కేసులు నమోదు చేయబడ్డాయి. అదనపు కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు.తనపై జరిగిన హత్యాయత్నంపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ‘‘ఎలెన్ క్రైస్తవ వ్యతిరేకి. క్రైస్తవుల పట్ల అతనిలో విద్వేషం పెరిగిపోయింది. అతనో మానసిక రోగి. గతంలో అతనిపై సోదరుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు’’ అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు దాడిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అధ్యక్షుడిగా ఉండటం ప్రమాదకరమైన పనైనా నేను భయపడలేదు. మెలనియా కూడా పలుమార్లు నాతో ఈ విషయం చెప్పింది. జరిగిన దాని గురించి ఇక ఆలోచించను. ఎప్పటిలాగే పని చేసుకుంటూ వెళ్తా. దేనిని ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటానని ప్రకటించారు. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం... వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దుండగుడి కాల్పులు
-
లెవిట్ చెప్పినట్టే పేలిన ‘తూటాలు’!
వాషింగ్టన్: హిల్టన్ హోటల్లో కాల్పుల నేపథ్యంలో ఆ ఉదంతానికి కొద్దిసేపటి ముందు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లెవిట్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఈరాత్రి జరగబోయే కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ అద్భుతంగా ప్రసంగించనున్నారు. ఆ సందర్భంగా మాటల తూటాలు పేలనున్నాయి. ఆ తూటా శబ్దాలను అందరూ విని తీరాల్సిందే’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు. ట్రంప్ పదునైన పదజాలంతో, వాగ్ధాటితో ప్రసంగిస్తారనే ఉద్దేశంలో ఆమె మాట్లాడినా, కొద్దిసేపటికే కార్యక్రమంలో నిజంగా తూటాలు పేలడం సరదా వ్యాఖ్యలకు తావిచ్చింది. ‘‘తూటా పేలుళ్లను లీవిట్ ముందే పసిగట్టారు. ఇలా జరగబోతోందని ఆమెకు ముందే తెలుసేమో’’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదంతా రాజకీయ ఎత్తుగడ కాదు కదా!!’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.బాటిళ్లు తీసుకెళ్లారు!ఓవైపు కాల్పుల మోత మోగుతుంటే కొందరు జర్నలిస్టులు మాత్రం మద్యం బాటిళ్లపై దృష్టిపెట్టారు! ఖరీదైన వైన్, షాంపేన్ బాటిళ్లతో సెలీ్ఫలు దిగారు. మరికొందరు వాటిని చెరోటి చంకలో పెట్టుకుని మరీ వెంట తీసుకెళ్లారు. మహిళా జర్నలిస్టులు వైన్ బాటిళ్లను వెంట తీసుకెళ్తున్న వీడియో వైరలైంది. అయితే ఈ సందర్భంగా పలువురు అగ్రనేతలు ప్రాణభయంతో పరుగెత్తుతుంటే, అది చూసి అక్కడే ఉన్న కొందరు మీడియా ప్రతినిధులు బిగ్గరగా నవ్వడం వివాదాస్పదమైంది. మరోవైపు, అంతటి గందరగోళంలోనూ ఒక పెద్దాయన నింపాదిగా కూర్చుని హాయిగా మద్యం సేవిస్తూ స్టఫ్ తింటూ కన్పించారు! -
అతడో ఉన్మాది: ట్రంప్
వాషింగ్టన్: హిల్టన్ హోటల్లో కాల్పులకు తెగబడ్డ దుండగుడు అలెన్ తన యంత్రాంగంలోని అధికారులను లక్ష్యం చేసుకున్నట్టు తెలుస్తోందని ట్రంప్ అన్నారు. దీనికి సంబంధించి అలెన్ కుటుంబం శనివారం విందుకు ముందే కనెక్టికట్‌లో పోలీసులకు సమాచారం కూడా ఇచ్చినట్టు వివరించారు. కాల్పుల అనంతరం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా భేటీ, తర్వాత ఫాక్స్ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు చెప్పుకొచ్చారు. ‘‘దుండగుడు ఓ ఉన్మాది. చాలా ఆయుధాలతో హోటల్ లాబీలో కాల్పులకు దిగాడు. సీక్రెట్సర్వీసు సిబ్బంది అడ్డుకోగా ఒక అధికారిపై అత్యంత సమీపం నుంచి శక్తిమంతమైన తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. సిబ్బంది సాహసోపేతంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారి సాహసం ప్రశంసనీయం’’ అన్నారు. మిమ్మల్నే లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ‘అనుకుంటాను’ అని ట్రంప్ బదులిచ్చారు. హిల్టన్ హోటల్ వద్ద భద్రతా సక్రమంగా లేదని, అది సురక్షితమైన భవనం కాదని అభిప్రాయపడ్డారు. ‘‘హోటల్లో కాల్పుల శబ్దాన్ని మొదట తప్పుగా అర్థం చేసుకున్నా. పల్లెం లాంటిది కింద పడడం వల్ల వచ్చిన శబ్దంగా భావించా’’ అని చెప్పారు. లింకన్‌పై జరిగినట్లుగానే.. హత్యల గురించి తానెంతో అధ్యయనం చేశానని ట్రంప్ వ్యాఖ్యానించారు. అత్యధిక ప్రభావం చూపే శక్తివంతులనే లక్ష్యంగా చేసుకుంటారని చెప్పారు. ప్రభావం చూపలేని వారి జోలికి ఎవరూ రారని అన్నారు. 1865లో జరిగిన అబ్రహం లింకన్ హత్యాకాండను ప్రస్తావించారు. లింకన్‌పై జరిగినట్లుగానే తనపైనా హత్యాయత్నాలు జరిగాయని వెల్లడించారు. రాజకీయాలను రేస్ కార్ డ్రైవింగ్, బుల్ రైడింగ్‌లతో పోల్చారు. ‘‘రాజకీయాలు నిజంగా ప్రమాదకరమైన వృత్తి. ఇది చాలా ప్రమాదకరమన్న విషయం నాకెవరూ చెప్పలేదు. అమెరికా అధ్యక్ష పదవిని ఆశించడంలో ఉన్న రిస్క్‌ల గురించి మంత్రి మార్కో రూబియో ముందుగా నన్ను హెచ్చరించలేదు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు, ఇతర వీఐపీలకు భద్రతను కనీవిని ఎరగనంతగా కట్టుదిట్టం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ దపంతులు, కేబినెట్ సభ్యులు తదితరులంతా క్షేమంగా ఉన్నారంటూ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. పాత్రికేయుల విందు 30 రోజుల్లోగా మళ్లీ జరుగుతుందన్నారు. -
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌ను సైతం తొలగించనున్న ట్రంప్?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్ నుంచి మరో కీలక అధికారిని తీసేయనున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ కాష్ పటేల్ ట్రంప్ కేబినెట్ నుంచి వైదొలిగే ఛాన్స్ ఉందని ‘పోలిటికో’ వార్తా సంస్థ తెలిపింది. ట్రంప్ అడ్మినిట్రేషన్లో అంతర్గత ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో పటేల్ భవిష్యత్తుపై వైట్‌హౌస్ వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇప్పటికే ట్రంప్ పలువరు కీలక అధికారులను తొలగించారు. ఈ వారమే ట్రంప్ అనుమతితో అమెరికా నౌకాదళ కార్యదర్శిని తొలగించారు. ఆ తర్వాత తదుపరి వెళ్లే సీనియర్ అధికారి ఎవరన్న ఊహాగానాలు మరింత పెరిగాయి. పోలిటికో తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్ తదుపరి తొలగించే వారి లిస్టులో పటేల్ ఉండవచ్చని ఒక సీనియర్ వైట్‌హౌస్ అధికారి సూచించారు. కాష్ పటేల్‌ను పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమని, ఇప్పుడు ప్రశ్న “ఎప్పుడు తొలగిస్తారు?” అన్నదేనని వ్యాఖ్యానించారు. మీడియాలో ఆయనపై నెగటివ్ వార్తలు ఎక్కువగా రావడం, ఆయన పనితీరు, నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలపై విమర్శలు పెరగడం అందుకు కారణాలుగా చెప్పారు. కేబినెట్ కార్యదర్శి దృష్టిలో ఇది మంచిది కాదని పేర్కొన్నారు. ఇది ట్రంప్‌ను నిరుత్సాహానికి గురి చేస్తోందని చెప్పారు.కీలక అడ్మినిస్ట్రేటివ్ పదవుల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై రాజకీయపరంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కాష్ పటేల్ గురించి వార్తలు వస్తుండడం గమనార్హం. వరసగా తొలగిస్తున్న ట్రంప్ కొన్ని రోజుల క్రితమే అమెరికా యుద్ధ శాఖ, నౌకాదళ కార్యదర్శి జాన్ సీ ఫెలన్ను పదవి నుంచి తొలగించారు. ఉప కార్యదర్శి హంగ్ కావో తాత్కాలిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.మార్చి నుంచి దాదాపు ఐదుగురు సీనియర్ అధికారులు (ఫెలన్ సహా) ఒత్తిడి మధ్య పదవులు వదిలుకున్నారు. ఫెలన్కు ముందు, జనరల్ రాండీ జార్జ్ ఈ నెల ప్రారంభంలో ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి విరమణ చేశారు. ఇరాన్ యుద్ధం మధ్య ఇది అసాధారణ పరిణామం. అలాగే, మరో ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులను తొలగించారు. కాగా, ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో.. ట్రంప్ గవర్నమెంట్ చేస్తున్న ఈ యుద్ధానికి తాను సపోర్టు ఇవ్వలేనని జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ పేర్కొంటూ ఆయన సైతం ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. -
ట్రంప్.. మీకే ఇలా పదే పదే ఎందుకు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి వైట్‌హౌస్ ప్రెస్ కరస్పాండెంట్ల వార్షిక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందులో ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగెత్స్,విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు ఉన్నారు. ట్రంప్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్‌గా అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. గత కొన్నేళ్లలో ఇలా ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరగడం మూడోసారి. అయితే రెండు గంటల పాటు ఆయనను హోటల్ నుండి హడావిడిగా తీసుకువెళ్లిన అనంతరం, అధ్యక్షుడు వైట్ హౌస్ నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే ట్రంప్‌కు అనూహ్యమైన ప్రశ్నలు రిపోర్టల నుంచి ఎదురయ్యాయి. విలేకరులు ఆయనను ప్రశ్నలతో ముంచెత్తుతున్న సమయంలో ఒక అనూహ్యమైన ప్రశ్న . ఫాక్స్ న్యూస్ విలేకరి పీటర్ డూసీ నుంచి దూసుకొచ్చింది. ఈ ప్రశ్నను మీపై చాలా గౌరవ భావంతోనే అడుగుతున్నానంటూనే.. ‘ట్రంప్.. మీపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి. పదే పదే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. మీకు ఇలా ఎందుకు పదేపదే జరుగుతోందని మీరు అనుకుంటున్నారు’ అని ప్రశ్నించాడు. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. ఈ దాడి కూడా తానొక అద్భుతమైన వ్యక్తిని కాబట్టే జరుగుతుందన్నారు. ‘అవును, మీకు తెలుసు, నేను హత్యల గురించి అధ్యయనం చేశా. ఇక్కడ మీకు నేనొక విషయం చెప్పాలి. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు. విశేషంగా కృషి చేసిన వ్యక్తులపైనే ఎప్పుడూ దాడులు జరుగుతాయి. మీరు అబ్రహం లింకన్నే చూడండి. అలాంటి వ్యక్తులే టార్గెట్ అవుతూ ఉంటారు’ బదులిచ్చారు. -
అతనో మానసిక రోగి : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: వైట్ హౌస్‌లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు ఉన్నాయి. దాడికి నిందితుడు ఒక్కడే పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దాడి చేసిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. దాడి వెనుక ఉద్దేశ్యం ఇతర అంశాలపై దర్యాప్తు జరుగుతోంది’అని చెప్పారు. ఏప్రిల్ 25న వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన కారస్పాండెంట్స్ డిన్నర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 2,600 మంది ప్రముఖులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకలో ప్రధాన భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడ్డాడు. అయితే అతను ధరించిన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ కారణంగా ప్రాణాపాయం తప్పింది.వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన ఈ కాల్పుల ఘటనతో అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు ఉన్నతాధికారులను సీక్రెట్ సర్వీస్ తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించింది. దాడి చేసిన వ్యక్తిని కోల్ టోమాస్ అలెన్ అనే కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఘటన అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో వైట్ హౌస్‌లో భద్రతా చర్యలు మరింత కఠినతరం అయ్యాయి. కారస్పాండెంట్స్ డిన్నర్‌కు హాజరైన వారిని తక్షణమే బయటకు తరలించారు. అధికారులు దాడి వెనుక ఉన్న కారణాలను, అతను ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాడో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!
-
"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్
-
పాక్ ప్రధానితో ఇరాన్ ఫోన్ కాల్..
ఇస్లామాబాద్: ఇరాన్, అమెరికా మధ్య చర్చల సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ బయల్దేరి వెళ్లిపోయారు. దీంతో శాంతి చర్చలకు తన ప్రతినిధులను ఇస్లామాబాద్‌కు పంపించడం లేదని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక కామెంట్స్ చేశారు.పెజెష్కియాన్ తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. అలాగే, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పేర్కొన్నారు. అమెరికా అనుసరిస్తున్న చర్యలే చర్చలకు ప్రధాన అడ్డంకి ఆయన కుండబద్దలు కొట్టారు.కాగా, ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి దిగ్బంధనాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడం అసాధ్యమని పేజెష్కియాన్ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అరాగ్చీ స్పందన..ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇప్పటికే తాము ఒక ఫ్రేమ్ వర్క్‌ను పాకిస్తాన్‌కు అందించామని తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇది ఒక మంచి మార్గమని ఆయన చెప్పారు. అయితే, శాంతి చర్చలపై అమెరికాకు నిజంగా ఆసక్తి ఉందా? అన్నది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అబ్బాస్ అరాగ్చీ ఒమన్ పర్యటనలో ఉన్నారు. అయితే, చర్చల కోసం ఆయన తిరిగి పాకిస్తాన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. -
ట్రంప్ మనసు చదవాలనుకున్నాడు.. ఇంతలోనే..
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో శనివారం రాత్రి ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం షాక్‌కు గురిచేసింది. షాట్గన్తో భద్రతా సిబ్బందిపై కాల్పులు కలకలం రేపాయి. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్.. ఒక ప్రదర్శనకారుడితో నిమగ్నమై ఉన్నారు. అతని పేరు ఓజ్ పెర్ల్‌మాన్. ఆ విందులో ఆయన ప్రాధాన్యత ఏంటి?. ఈసారి విందు.. సంప్రదాయానికి భిన్నంగా ఎందుకు జరిగింది? పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాంఓజ్ పెర్ల్‌మాన్.. అమెరికన్ మెంటలిస్ట్. మైండ్ రీడింగ్ (మనసును చదవడం), ఇంటరాక్టివ్ మెంటలిజంలో ఆయన ప్రసిద్ధి చెందారు. 43 ఏళ్ల పెర్ల్‌మాన్ 2015లో 'అమెరికాస్ గాట్ టాలెంట్' సీజన్ 10లో మూడో స్థానంలో నిలిచి గుర్తింపు పొందారు. అప్పటి నుండి కార్పొరేట్ క్లయింట్లు, అథ్లెట్లు, టీవీ ప్రేక్షకుల కోసం ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆయన.. ది జో రోగన్ ఎక్స్పీరియన్స్, ది ఎల్లెన్ షో, లేట్ నైట్ విత్ జిమ్మీ ఫాలన్ వంటి ప్రసిద్ధ కార్యక్రమాల్లో కనిపించారు. 2018లో తన ఎన్బీసీ ట్రావెల్ షో 'ఓజ్ నోస్'కు ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు.ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా..ఈసారి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సంప్రదాయానికి భిన్నంగా జరిగింది. సాధారణంగా డిన్నర్లో అధ్యక్షుడు, మీడియా రంగంపై జోకులు వేయడానికి హాస్యనటుడిని ఆహ్వానిస్తారు. కానీ ఈసారి పెర్ల్మాన్ను ప్రధాన ప్రదర్శనకారుడిగా ఎంపిక చేశారు. 2025 కోసం కమెడియన్ అంబర్ రఫిన్‌ను అనుకున్నప్పటికీ.. ట్రంప్ పరిపాలనతో ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఆమెను ముందే తొలగించారు. 2026 నాటి ఈ విందు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.. ఎందుకంటే తన రెండు అధ్యక్ష కాలాల్లో ట్రంప్ హాజరైన మొదటి వేడుక ఇది. రాజకీయ విమర్శల కంటే.. 25 నిమిషాల పాటు నవ్వులు పూయించి.. అద్భుతమైన క్షణాలతో అందరినీ ఏకం చేయడమే తన లక్ష్యమని పెర్ల్‌మాన్ పేర్కొన్నారు.నేను ట్రంప్ మనసును చదవగలనా?వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవ్వడం అంత సులభం కాదు అంటూ పెర్ల్‌మాన్ ఈ కార్యక్రమానికి ముందు ఒక వ్యాసంలో రాశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి మనసును చదవాలని నాకు ఉంది. అధ్యక్షుడు తదుపరి ఏమి చెబుతారో?. ఏమి చేస్తారో ఎవరూ ఊహించలేరు. ట్రంప్ అందరిలాంటి వ్యక్తి కాదు.. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టం’’ అని ఆయన పేర్కొన్నారు.అందుకే ఈసారి ఇలా..తాను రాజకీయాలకు అతీతుడినని.. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి, విభజించడానికి తాను రాలేదన్నారు. అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ అలరించడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. కమెడియన్ల విమర్శలు ట్రంప్‌కు నచ్చవు కాబట్టే.. ఈసారి తనలాంటి మెంటలిస్ట్‌ను ఎంపిక చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. -
ట్రంప్ పై దాడి చేసిన.. షూటర్ ఎవరంటే?
-
కింద పడిపోయిన ట్రంప్.. వాన్స్‌ను లాగేసి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు కీలక నేతలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ట్రంప్ హాజరైన కరస్పాండెంట్ల వార్షిక విందులో కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్, జేడీ వాన్స్‌తో పాటు ఇతర ప్రముఖులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ట్రంప్, వాన్స్‌ను సెక్యూరిటీ తరిలించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి వైట్‌హౌస్ ప్రెస్ కరస్పాండెంట్ల వార్షిక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందులో ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగెత్స్,విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు ఉన్నారు. ట్రంప్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్‌గా అనే వ్యక్తి కాల్పులు జరిపాడు.The White House Correspondents’ Dinner shooter was armed with a shotgun, handgun, and multiple knives, according to DC police chief Jeffrey Carroll.The shooter was identified as 31-year-old teacher Cole Allen from Torrance, California. The suspect emerged from a "makeshift… pic.twitter.com/aUK5m6AwCr— Collin Rugg (@CollinRugg) April 26, 2026దీంతో, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్, జేడీ వాన్స్‌ను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. మొదట వాన్స్‌ను జాకెట్ పట్టుకుని లాగేసిన సిబ్బంది.. అనంతరం, ట్రంప్‌ను తీసువెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్ కిందపడిపోయినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇక, మొలానియా సహ పలువురు మహిళా ప్రముఖులు భయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. విందు హాల్‌ను వెంటనే ఖాళీ చేయించారు. ఇక, ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తమంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.Trump and Vance being rushed off the stage after shots fired at White House Correspondents Dinner.ExecutiveProtection #WHCD2026 #SecretService #SecurityBreach #PresidentialSecurity #VenueSecurity #EPBestPractices pic.twitter.com/5eEaISHev1— RAJA Imran (@enconnect) April 26, 2026 O país do medo. pic.twitter.com/1LRWrzzXhJ— Renan Brites Peixoto (@RenanPeixoto_) April 26, 2026JUST IN: CMS Administrator Dr. Mehmet Oz was seen being rushed out by security from the White House Correspondents’ Dinner after gunshots rang out. | @GiannoCaldwell pic.twitter.com/K40X5Bovv6— Fox News (@FoxNews) April 26, 2026 -
ట్రంప్ పై హత్యాయత్నం.. CCTV వీడియో
-
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. ట్రంప్ పై హత్యాయత్నం
-
అయ్యో ఇరాన్.. ఎంతటి గడ్డు పరిస్థితులు..
వెనకటికి ఒక సామెత ఉండేదంటారు.. పైన పటారం.. లోన లొటారం.. అని.. ఈ సామెత ఇప్పుడు అచ్చు గుద్దినట్టు ఇరాన్‌కు వర్తించేలా ఉంది. ఎందుకంటే అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. పైకి అంత బాగానే ఉన్నట్టు మేనేజ్ చేస్తున్న ఇరాన్.. వాస్తవంగా మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అది ఎంతలా అంటే.. ఆహార ద్రవ్యోల్బణం 112 శాతానికి చేరుకుంది. వంట నూనెల ధరలైతే 200% పైగా పెరిగాయి. నిత్యావసరాలే కాదు.. చివరికి అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగాయి. దీంతో, ఇరాన్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.అమెరికా, ఇజ్రాయెల్ మార్చి యుద్ధం తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా క్షీణించింది. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గడం, పరిశ్రమలకు జరిగిన నష్టం.. ఇలా అన్నీ కలిసి పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఇరాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, కోడిగుడ్లు తదితర ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 2026 ఏప్రిల్ నాటికి పాలు, గుడ్లు, చికెన్, బియ్యం వంటి ఆహార పదార్థాలు 70–130% వరకు పెరిగాయి. ముఖ్యమైన ఔషధాలు అయితే 300% నుండి 2,700% వరకు పెరిగి సాధారణ కుటుంబాలకు అందని స్థాయికి చేరాయి. ఇన్సులిన్ కొరత కారణంగా రేషన్ విధానం అమలు చేస్తున్నారు. సాధారణ నొప్పి నివారణ మందులు కూడా రేషన్‌లోనే అందిస్తున్నారు. మానసిక ఆరోగ్య మందులు లభ్యం కావడం కష్టమైంది. దీంతో, సామాన్యులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాదికి ద్రవ్యోల్బణం 80% నుంచి 500% వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.అయితే, 2025 చివరి నాటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ద్రవ్యోల్బణం 50% పైగా కొనసాగింది. రియాల్ విలువ 20 రోజుల్లో 20% కంటే ఎక్కువ తగ్గింది. బ్యాంక్ అయాందె కుప్పకూలడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో నమ్మకం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లోనే యుద్ధం ప్రారంభమైంది. దీంతో, ఇరాన్ రియాల్ విలువ ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయింది. ఒక డాలర్ విలువ 16 లక్షల రియాల్స్‌కు దగ్గరలో ఉంది. దీంతో పౌరుల పొదుపు ఆవిరవుతోంది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాలు తగ్గి, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ మూతపడుతున్నాయి. యుద్ధ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించడంలేదు సరి కదా, రుణాలు కట్టడం ఆలస్యమైతే జరిమానాలు విధిస్తోంది. చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీంతో బ్యాంక్‌లు చాలా ఖాతాలను మూసివేస్తున్నాయి.గుడ్డు, మాంసం ఎంతంటే.. గత రెండు నెలల్లో ఇరాన్లో గుడ్లు, మాంసం, వంట నూనె ధరలు నిరంతరం పెరిగాయి. గుడ్ల ధరలు 2026 ఏప్రిల్ నాటికి రూ.333(భారత కరెన్సీ ప్రకారం)కి చేరాయి. మాంసం ధర కిలోకు రూ.574 వరకు పెరిగాయి. 2025లో మాంసం ధర రూ.313గా ఉంది. ఇక, వంట నూనె ధరలు కూడా 100% పైగా పెరిగి 380 వరకు చేరాయి. 2025లో వంట నూనె ధర రూ.180గా ఉంది. ఇక, 2025లో బియ్యం ధర రూ.34 ఉండగా.. తాజాగా 67కు చేరుకుంది.ఉద్యోగుల పరిస్థితి ఇదీ.. అధికారిక లెక్కల ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనధికారికంగా ఈ సంఖ్య 20 నుంచి 30 లక్షల వరకు ఉండొచ్చని ఓ అంచనా. 1.5 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఆదాయం లేక అల్లాడుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే నెలవారీ సబ్సిడీ, ఫుడ్ వోచర్లతో కనీసం 10 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి నెలకొంది.కారణాలు..ఇంటర్నెట్ బ్లాకౌట్ ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం.యువత, చిన్న వ్యాపారాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి.పేదరికం, నిరుద్యోగం పెరుగుతూ ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.ప్రభావిత రంగాలుఈ-కామర్స్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, మీడియా, విద్య, సర్వీస్ రంగాలు ప్రభావితమయ్యాయి.నిరంతర కనెక్టివిటీ అవసరం ఉండటంతో ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి.పెద్ద కంపెనీలు: ఉద్యోగాల కోతలు ఇప్పుడు పెద్ద వాణిజ్య సంస్థలలో కూడా ప్రారంభమయ్యాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం, ప్రజల జీవన ప్రమాణాలను కాపాడుకోవడం, అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ చర్యలు తీసుకుంటే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా, కనీస స్థాయిలో అయినా నిలబడే అవకాశం ఉంటుంది.ప్రధాన లక్ష్యాలు..ఆర్థిక స్థిరీకరణ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, కరెన్సీ విలువను నిలబెట్టడం.ప్రజల జీవన ప్రమాణాలు: ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడం.పరిశ్రమల పునరుద్ధరణ: పెట్రోకెమికల్స్, మెటల్స్, వ్యవసాయం, నిర్మాణ రంగాలను తిరిగి నిలబెట్టడం.బ్యాంకింగ్ వ్యవస్థ రక్షణ: బ్యాంకుల లిక్విడిటీ, డిపాజిట్లపై నమ్మకం కాపాడుకోవడం, రుణాలపై నియంత్రణ.సామాజిక స్థిరత్వం: నిరుద్యోగం తగ్గించడం, ప్రజల్లో అసంతృప్తి తగ్గించడం.అంతర్జాతీయ సంబంధాలు: నిర్బంధం, బ్లాకేడ్ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు కనుగొనడం. యూఏఈ, టర్కీ వంటి ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా పరిమిత ఎగుమతులు కొనసాగించడం. -
కాల్పులు జరిపింది ఇతడే.. ఫొటో విడుదల చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ప్రతినిధుల విందులో కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. భద్రతా బలగాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. కాల్పుల శబ్దంతో ట్రంప్‌ను వెంటనే వేదికపై నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల జరిపిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్‌గా గుర్తించారు. నిందితుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని.. టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా అతడు తీసుకున్నట్లు సమాచారం.వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్న వ్యక్తి మొదటి చిత్రం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ మెట్ల వద్ద భద్రతా సిబ్బంది అతడిని నేలపై నొక్కిపట్టి ఉంచినట్లు ఆ చిత్రంలో కనిపిస్తోంది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో ఈ చిత్రాలను పంచుకున్నారు. అందులో అనుమానితుడు చొక్కా లేకుండా.. చేతులు వెనుకకు కట్టేసి, నేలపై పడి ఉండటం గమనార్హం.ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అనుమానితుడు పలు ఆయుధాలతో ఉన్నాడని, సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిని అడ్డుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఒక అధికారిపై కాల్పులు జరిగాయని, అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల అతను ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడని చెప్పారు. ఒక వ్యక్తి ఆయుధాలతో సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్దకు దూసుకువచ్చాడు, సీక్రెట్ సర్వీస్ సభ్యులు ధైర్యంగా అతడిని పట్టుకున్నారు. ఒక అధికారికి గాయమైంది.. కానీ జాకెట్ అతడిని కాపాడింది. నేను ఆ అధికారితో మాట్లాడాను. అతను క్షేమంగా ఉన్నాడు" అని ట్రంప్ పేర్కొన్నారు. -
ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అత్యంత పటిష్ట భద్రత నడుమ జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్లో ఒక్కసారిగా తుపాకీ మోతలు దద్దరిల్లాయి. వందలాది మంది ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు హాజరైన ఈ ప్రతిష్టాత్మక విందులో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం తీవ్ర కలకలం రేపింది. ఈ అనూహ్య ఘటన నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా ప్రముఖులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్ హౌస్‌లో ప్రసంగించారు. ఇది అమెరికా రాజ్యాంగంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వెలుపల చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై డోనాల్డ్ ట్రంప్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ కీలక వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద అనేక ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొనగా, ఘటనా స్థలంలో ఒక లాంగ్ గన్, తుపాకీ షెల్స్ లభ్యమైనట్లు కాష్ పటేల్ ధృవీకరించారు. అయితే, నిందితుడి వద్ద ఉన్న ఆయుధాల గురించి మరిన్ని ఇతర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవన్నారు.ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తాను ఎంతో పదునైన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నానని, కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల తదుపరి కార్యక్రమంలో తన ప్రసంగం చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. తాను ప్రసంగించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నానని, కానీ భద్రతా కారణాల దృష్ట్యా వచ్చేసారి చాలా సాదాసీదాగా వ్యవహరిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ, భవిష్యత్తులో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వేదికపైనే ఉండాలని తాను గట్టిగా ప్రయత్నించానని, కానీ భద్రతా బలగాల సూచన మేరకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ట్రంప్ వివరించారు. ఈ కాల్పుల ఘటన ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది అత్యంత వేగంగా స్పందించిన తీరును అభినందించిన ట్రంప్.. ‘సీక్రెట్ సర్వీస్ అద్భుతంగా స్పందించింది... ఒక వ్యక్తి అనేక ఆయుధాలతో భద్రతా తనిఖీ కేంద్రం వైపు దూసుకువచ్చాడు.. అతడిని సీక్రెట్ సర్వీస్‌కు చెందిన కొందరు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో పారదర్శకత, స్పష్టత కోసం, నేను విడుదల చేయమని ఆదేశించిన ఒక టేప్‌ను ఇప్పుడే అధికారులు విడుదల చేశారు... మన రాజ్యాంగంపై దాడి చేసిన ఈ దుండగుడి హింసాకాండను, అలాగే మన దేశం తరపున సీక్రెట్ సర్వీస్, చట్ట అమలు సంస్థలు ఎంత వేగంగా స్పందించాయో ఆ టేప్ తెలియజేస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఎవరూ మన సమాజాన్ని హస్తగతం చేసుకోవడానికి వీల్లేదని, ఇలాంటి ఘటనల వల్ల కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. -
ట్రంప్‌పై హత్యాయత్నం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. అధ్యక్షుడి హోదాలో ఆయన తొలిసారిగా పాల్గొన్న వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ విందు భేటీలో ఓ యువకుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడటం తీవ్ర సంచలనం సృష్టించింది. వాషింగ్టన్లో వైట్‌హౌస్ సమీపంలోని ప్రఖ్యాత హిల్డన్ హోటల్లో ఇందుకు వేదికైంది. శనివారం రాత్రి 8.34 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. బాల్ రూమ్‌లో జరిగిన విందులో ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ దంపతులు, మంత్రులు పీట్ హెగెŠస్త్, మార్కో రూబియోతో పాటు చాలామంది వీఐపీలు, విలేకరులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆ సమయంలో బాల్రూమ్ బయట ఉన్న లాబీలోకి సాయుధుడైన యువకుడు చొరబడ్డాడు. తుపాకులు, కత్తులతో బాల్ రూమ్ కేసి దూసుకెళ్లాడు. ఆ క్రమంలోనే షాటగన్తో దాదాపు ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దాలు వినిపించడంతో బాల్ రూమ్‌లోని వేలాది మంది అతిథులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెద్దగా కేకలు వేస్తూ టేబుళ్ల కింద తలదాచుకున్నారు. ట్రంప్ ఈ సమయంలో కరెస్పాండెంట్స్ అసోయేషన్ ప్రెసిడెంట్ వీజియా జియాంగ్తోపాటు మెంటలిస్ట్ ఓజ్ పెరల్మ్యాన్తో మాట్లాడుతున్నారు. కాల్పుల శబ్దాలు విని ఆయన ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణం అప్రమత్తమై ట్రంప్, వాన్స్ దంపతుల చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. తొలుత వాన్స్‌ను, తర్వాత ట్రంప్ దంపతులను సురక్షితంగా బాల్ రూమ్ నుండి తరలించారు. వేదిక దిగే సమయంలో ట్రంప్ ఆందోళనకు గురై తడబడగా ఆయనకు భద్రతా సిబ్బంది చేయూత అందించారు. అనంతరం ట్రంప్ దంపతులను హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. విందును కొనసాగిస్తానని ట్రంప్ తీవ్రంగా పట్టుబట్టారు. దాంతో నిర్వాహకులు కూడా బాల్ రూమ్‌ను తిరిగి సిద్ధం చేశారు. కానీ సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు అందుకు అనుమతి ఇవ్వలేదు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రంప్ దంపతులను వైట్‌హౌస్‌కు తరలించారు. దుండగున్ని భద్రతా సిబ్బంది నిర్బంధించారు. అతన్ని 31 ఏళ్ల కోల్ టోమస్ అలెన్‌గా గుర్తించారు. #WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event. (Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Z2nDjWzWW0— ANI (@ANI) April 26, 2026ఏజెంట్‌పై కాల్పులుఅలెన్ హోటల్ లాబీ నుంచి చెక్ పాయింట్‌ను దాటుకొని బాల్ రూమ్‌వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు ఒక్కసారిగా షాకైనా వెంటనే తేరుకుని దుండుగుడిని వెంబడించారు. ఎంతో దూరం వెళ్లకుండానే అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఓ సీక్రెట్ సర్వీస్ఏజెంట్పై అతడు కాల్పులు జరిపాడు. ఏజెంట్‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. దుండగుడు తీవ్రంగా ప్రతిఘటించడంతో నేలమీదకు నెట్టేసి అతికష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పలు మారణాయుధాలను స్వా«దీనం చేసుకున్నారు. #WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event.(Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Ulm93FCTM1— ANI (@ANI) April 26, 2026దుంగడునికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని టారెన్స్ అలెన్ స్వస్థలం. అతను హిల్టన్ హోటల్లో బస చేశాడు. దాంతో పక్కా పథకం ప్రకారమే అతను దాడికి దిగినట్టు భావిస్తున్నారు. ట్రంప్ భద్రతలో తీవ్ర లోపాలను ఈ ఉదంతం మరోసారి తెరపైకి తెచ్చిందంటున్నారు. ఆనవాయితీగా జరిగే వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ వార్షిక విందు భేటీలో ట్రంప్ పాల్గొనడం ఇదే తొలిసారి. అధ్యక్షునిగా తొలి హయాంలో కూడా దీనికి ఆయన దూరంగా ఉన్నారు.🚨 WATCH: Absolute PANIC following shots fired at the White House Correspondents DinnerThis guy should not even been able to enter the BUILDING.Just insane! pic.twitter.com/bF5P9HcO0o— Nick Sortor (@nicksortor) April 26, 2026ట్రంప్ సహా ఉన్నతాధికారులే లక్ష్యం విందుకు హాజరయ్యే అధ్యక్షుడు ట్రంప్ సహా అమెరికా ఉన్నతాధికారులే కోల్ టోమస్ అలెన్ లక్ష్యమై ఉండొచ్చని తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె అనుమానం వ్యక్తం చేశారు. అతడి వద్ద లభించిన ఎల్రక్టానిక్ పరికరాలు, రాతలను బట్టి ప్రాథమికంగా ఈ విషయం తెలుస్తోందన్నారు. అలాగే రెండేళ్ల వ్యవధిలో ఆయుధాలను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. అలెన్ కాలిఫోర్నియా నుంచి షికాగో, అక్కడి నుంచి వాషింగ్టన్కు చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. #WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event. (Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Z2nDjWzWW0— ANI (@ANI) April 26, 2026రెండేళ్లలో మూడోసారి! ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం గత రెండేళ్లలో ఇది మూడోసారి! 2024 జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ సిటీలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలో థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు సమీపం నుంచి కాల్చగా ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. తూటా ఆయన కుడి చెవిని చీల్చుకుంటూ దూసుకెళ్లింది. 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ట్రంప్‌పై మళ్లీ హత్యాయత్నం జరిగింది. తాజా కాల్పుల ఘటన నేపథ్యంలో ట్రంప్ భద్రతను పూర్తిస్థాయిలో పునఃసమీక్షిస్తున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ చెప్పారు.Shots fired at White House Correspondents' Dinner venue. US President Donald Trump posts, "Quite an evening in D.C. Secret Service and Law Enforcement did a fantastic job. They acted quickly and bravely. The shooter has been apprehended, and I have recommended that we “LET THE… pic.twitter.com/HXMmyprGQe— ANI (@ANI) April 26, 2026 -
మళ్లీ మొదటికి!
ఇస్లామాబాద్/వాషింగ్టన్/దుబాయ్: పశ్చిమాసియాలో హార్మూజ్ దిగ్బంధం ఏ స్థాయిలో కొనసాగుతోందో పాకిస్తాన్ వేదికగా రెండో దఫా ప్రత్యక్ష చర్చలపై ప్రతిష్టంభన అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒకడుగు ముందుకేసి పాకిస్తాన్‌కు స్వయంగా విచ్చేసి ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లతో చర్చిస్తున్న వేళ సంతోషం వ్యక్తంచేసిన అమెరికా తన బృందాన్ని సైతం పంపేందుకు సంసిద్ధమవుతుండగా అరాఘ్చీ హఠాత్తుగా పాక్‌కు వీడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోపం తెప్పించారు.దీంతో ఇరాన్ బృందంలేని పాకిస్తాన్లో తాము మాత్రం ఎలా ప్రత్యక్ష చర్చలకు కూర్చోగలమనే అసహనంతో ట్రంప్ వెంటనే తన బృందం ప్రయాణాన్ని రద్దుచేశారు. దీంతో రెండోదఫా ప్రత్యక్ష చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ అంశంలో ఇరాన్ ఒక స్పష్టతనిచ్చింది. అమెరికాతో మరోమారు ప్రత్యక్షచర్చలకు కూర్చోబోమని తెగేసి చెప్పింది. పరోక్ష చర్చలకే తాము సుముఖంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ శనివారం ప్రకటించారు. పాక్ ప్రధాని, ఫీల్డ్ మార్షల్‌తో మంతనాలు పాక్ నుంచి ఒమన్‌కు వెళ్లిపోయే ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషక్ దార్లతో విస్తృతస్థాయిలో చర్చించారు. శాంతి చర్చలకు సంబంధించిన తమ దేశ డిమాండ్లను అమెరికాకు తెలియజేయాలని సంబంధిత ప్రతిపాదనల చిట్టాను షెహబాజ్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ తరఫున ఉప విదేశాంగ మంత్రి కజీమ్ ఘరీబ్అబాదీ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్, పాక్ తరఫున పాక్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.అయితే చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాల వివరాలను అటు పాక్‌గానీ ఇటు ఇరాన్‌గానీ అధికారికంగా బహిర్గతంచేయలేదు. ప్రాంతీయ అస్థిరత, శాంతి చర్చల అంశాలపై నేతలు చర్చించారని సామాజిక మాధ్యమంలో ఇరాన్ రాయబార కార్యాలయం ఒక పోస్ట్పెట్టింది. ఇరాన్ పెట్టిన షరతులను ఇస్లామాబాద్‌కు విచ్చేసే అమెరికా ప్రతినిధుల ఎదుట పాక్ పెట్టనుందని, వాటికి సమ్మతిస్తేనే ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ బృందం పాక్‌కు రానుందని పాక్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ వివరాలను తుర్కియేతో పాక్ పంచుకుంది. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు.. తమ బృందం రాకముందే ఇరాన్ మంత్రి పాక్ నుంచి వెళ్లిపోయారనే వార్త తెల్సి ట్రంప్ వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రతినిధులనూ పాక్‌కు పంపబోమని తెగేసి చెప్పారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘18 గంటలు ప్రయాణించి ఇస్లామాబాద్‌కు వెళ్లేందుకు నా బృందం సిద్ధమవుతుంటే వెంటనే ఆగిపొమ్మని చెప్పేశా. పాక్‌కు అన్ని గంటలపాటు ప్రయాణంచేయడం వృథా. అనవసర శ్రమ. పాక్‌లో మనతో మాట్లాడ్డానికి ఎవరూ లేనప్పుడు, ఎలాంటి చర్చల్లేనిదానికి అంతదూరం వెళ్లడం దండగ.అసలే ఇరాన్లో ఎవరు తమ నేతనో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. వాళ్లలో ఇన్చార్జ్ ఎవరో వాళ్లకే తెలీడంలేదు. ఆట మనచేతుల్లోనే ఉంది. వాళ్లకు అంతగా మాట్లాడాలనుకుంటే ఇరాన్ నాయకులు మనకు ఫోన్‌చేసి మాట్లాడతారు. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని ట్రంప్ స్పష్టంచేశారు. పశి్చమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్‌లను పాక్‌కు కొద్దిసేపట్లో పంపబోతున్నామని శ్వేతసౌధంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అంతకుముందే ప్రకటించగా కొన్ని నిమిషాలకే ట్రంప్ విరుద్ధమైన ప్రకటన చేశారు.దీంతో అమెరికా ప్రతినిధి బృందం పాక్ పర్యటన చివరినిమిషంలో వాయిదాపడింది. ఈ బృందం ఇక ఎప్పుడు పాక్‌కు వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రత్యక్ష చర్చల కోసం తమ ప్రయత్నాలు నిరాటంకంగా కొనసాగుతాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్ పునరుద్ఘాటించారు. అమెరికా చిత్తశుద్ధిచూద్దాం.. పాక్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు చేరుకున్న ఇరాన్ మంత్రి అరాఘ్చీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘పాక్‌లో పర్యటన సత్ఫలితాలనిచ్చింది. యుద్ధం శాశ్వత పరిసమాప్తికి మేం చేసిన ప్రతిపాదనలను పాక్ ముందుంచాం. వాటిని వినేందుకు, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ఏపాటి చిత్తశుద్ధిచూపుతుందో చూద్దాం’’అని అన్నారు. ఒమన్ తర్వాత రష్యాలో అరాఘ్చీ పర్యటిస్తారు. తిరిగి ఆయన శనివారం లేదా ఆదివారం పాక్‌కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇంధనాన్ని ఆదా చేసుకోవాలి: మసూద్ యుద్ధకాలంలో ఇరాన్ ఇంధన వనరులు, మౌలికవసతులను అమెరికా సేనలు దారుణంగా దెబ్బతీయడంతో వాటిని ఇప్పుడు పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సూచించారు. ‘‘ఇంట్లో పది లైట్లు ఉంటే అన్ని వెలిగించాల్సిన అవసరమేంటి? ఒక రెండు వెలిగిస్తే సరిపోతుంది’’అని సలహా ఇచ్చారు. కరెంట్ వృథా ఖర్చును భారీగా తగ్గించుకోవాలని ఇరాన్ విద్యుత్ సంస్థ సీఈవో తవానిర్ ఇరానియన్లను కోరారు. -
‘హెచ్–1బీ’ కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో స్థిరపడాలనే భారతీయ టెక్నాలజీ నిపుణుల ఆశలపై నీళ్లు చల్లేలా అగ్రరాజ్యం కీలక అడుగులు వేస్తోంది. వీసా వ్యవస్థ ప్రక్షాళన పేరుతో నూతన హెచ్–1బీ వీసాల జారీపై మూడేళ్ల పాటు నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టిన ‘హెచ్1బీ అబ్యూజ్ యాక్ట్–2026’ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ పార్టీ సభ్యులే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు ఎలీ క్రేన్ ‘హెచ్–1బీ వీసా అబ్యూజ్ యాక్ట్–2026’బిల్లును అమెరికా చట్టసభ(కాంగ్రెస్)లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు మరో ఏడుగురు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు బ్రియన్ బాబిన్, బ్రాండన్ గిల్, వెస్లీ హంట్, కీత్ సెల్ఫ్, ఆండీ ఓగ్లెస్, పాల్ గోసర్, టామ్ మెక్‌క్లింటాక్ మద్దతుగా నిలిచారు. సహ ప్రాయోజకులుగా(కో–స్పాన్సర్లుగా) సంతకాలు చేశారు. అసలు ఉద్దేశం ఏమిటి? హెచ్–1బీ వీసా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రతిపాదకులు చెబుతున్నారు. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు పని చేసే విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు హెచ్–1బీ వీసా వ్యవస్థను దురి్వనియోగం చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ‘అమెరికన్లకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటే, వారినే నియమించుకోవాలి’అని డిమాండ్ చేస్తున్నారు. విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని అరికట్టేందుకు మూడేళ్ల పాటు హెచ్–1బీ వీసాల జారీని పూర్తిగా నిలిపివేసి, ఆ తర్వాత కఠిన నిబంధనలు అమలు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ నిబంధనల ద్వారా అమెరికా పౌరులకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత దక్కేలా చేయడమే బిల్లు లక్ష్యమని చట్టసభ సభ్యుడు ఎలీ క్రేన్ స్పష్టం చేశారు. హెచ్–1బీకి కొత్త నిబంధనలు ⇒ ప్రతిఏటా జారీ చేసే 65,000 హెచ్–1బీ వీసాల పరిమితిని ఏకంగా 25 వేలకు తగ్గించడం. ⇒ వీసా దక్కించుకునే విదేశీ నిపుణుల కనీస వార్షిక వేతనం 2 లక్షల డాలర్లుగా ఉండాలి. ⇒ ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, ఎక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాల ఆధారంగా(వేజ్–బేస్డ్) ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. ⇒ హెచ్–1బీ వీసాదారులు తమ కుటుంబ సభ్యులను (డిపెండెంట్లు) అమెరికాకు తీసుకురావడాన్ని నిషేధించాలి. ⇒ విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కునేందుకు, పని చేసుకునేందుకు వెసులుబా టు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) విధానాన్ని రద్దు చేయాలి. ⇒ హెచ్–1బీ వీసాపై వచి్చన వారిని గ్రీన్ కార్డు (శాశ్వత నివాసిత హోదా) పొందేందుకు అనర్హులుగా మార్చాలి. ఈ వీసాలను కేవలం తాత్కాలిక అవసరాల కోసమే పరిమితం చేయాలి. ⇒ థర్డ్–పార్టీ స్టాంఫింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను తీసుకోవడాన్ని నిరోధించాలి. భారతీయులపైనే అధిక ప్రభావంఅమెరికా ప్రభుత్వం ఏటా జారీ చేసే హెచ్–1బీ వీసాల్లో సుమారు 70 శాతానికి పైగా భారతీయులకే దక్కుతున్నాయి. తాజా బిల్లు ఆమోదం పొందితే, ప్రధానంగా భారతీయ టెక్నాలజీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొత్తగా అమెరికాలోని ఐటీ కంపెనీల్లో చేరాలనుకునే నిపుణులకు కొన్నేళ్ల పాటు అవకాశాలు ఉండవు. అక్కడే ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థుల కలలకు ఆటంకం ఏర్పడుతుంది.కంపెనీల నిర్వహణ వ్యయం పెరుగుదలహెచ్–1బీ వీసాల జారీ నిలిచిపోతే అమెరికాలోని టెక్ కంపెనీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికులనే అధిక వేతనాలకు నియమించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం పెరిగి సంస్థలపై ఆర్థిక భారం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్ లాంటి దేశాల్లో మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్‌తో చర్చలకు బ్రేక్!
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగా ల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చల కోసం అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వెళ్లాల్సి ఉండగా, వారి పర్యటనను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ప్రకటించారు. ‘కేవలం చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణం చేసి అక్కడ ఖాళీగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఫలితం లేని చర్చల వల్ల సమయం తప్ప మరేమీ వృథా కాదు. మా దగ్గర అన్ని దారులు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ చర్చలు జరపాలని అనుకుంటే వారే మాకు నేరుగా ఫోన్ చేయవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.వెనుదిరిగిన ఇరాన్ ప్రతినిధులు..మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా శనివారం సాయంత్రం ఇస్లామాబాద్ నుండి వెనుదిరిగింది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌తో చర్చలు జరిపిన అనంతరం వారు తమ దేశానికి బయలుదేరారు. చర్చల ప్రక్రియలో ఈ ఆకస్మిక బ్రేక్ కారణంగా పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా అనే ఆందోళన నెలకొంది. అయితే, ‘చర్చల రద్దు అంటే యుద్ధం మొదలైనట్టు కాదు, మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు’ అని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, పరిస్థితులు మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అటు ఇరాన్ తన విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నా, సరిహద్దుల్లో బలగాల కదలికలు ఆగడం లేదు. -
చర్చల వేళ మరో ట్విస్ట్.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
టెహ్రాన్: మరోసారి అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా 'సముద్రపు దోపిడీ' కొనసాగిస్తే.. ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ సైన్యం తేల్చిచెప్పింది. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మధ్య సమన్వయం వహించే అత్యున్నత సైనిక విభాగం 'ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్' ఈ ప్రకటనను విడుదల చేసింది. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తమ సాయుధ బలగాల నుండి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటూ ఇరాన్ పేర్కొంది.ఇరాన్ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా, గరిష్ట స్థాయి సంసిద్ధతతో ఉన్నాయని.. జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఇరాన్ స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో శత్రువుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని.. అమెరికా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు జరపాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇవాళ(శనివారం) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఈ చర్చల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా నౌకాదళం ముందుగా హార్ముజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని టెహ్రాన్ స్పష్టమైన షరతు విధించింది. ఒకవైపు శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. మరోవైపు సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధనౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న ‘యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా’ అనే గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఏప్రిల్ 24న ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం అధికారికంగా ప్రకటించింది. -
వాషింగ్టన్ డీసీ ‘తెర’లపై ట్రంప్-ఎప్స్టీన్ వీడియోలు!
వాషింగ్టన్ డీసీ.. అమెరికా రాజధాని. ఇది చారిత్రకంగా వాస్తు శిల్ప పరంగా అత్యంత ప్రసిద్ధి చెందిన భవనాలతో నిండిన నగరం. ముఖ్యంగా వైట్ హౌస్, కాపిటల్ బిల్డింగ్, వాషింగ్టన్ మాన్యుమెంట్ వంటి నిర్మాణాలు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాయి. వాషింగ్టన్‌డీసీలో గోడలపై సాధారణంగా కళా ప్రదర్శనలు, రాజకీయ నినాదాలు, సామాజిక ఉద్యమాల పోస్టర్లు కనిపిస్తాయి.అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్స్టీన్ వీడియోలు వాషింగ్టన్ డీసీలో బిల్డింగ్ గోడలపై ప్రదర్శితమయ్యాయి. వాషింగ్టన్ డీసీ వెలుగుల్లోట్రంప్-ఎప్‌స్టీన్‌లు కలిసి ఉన్న వీడియోలను ప్రదర్శించారు నిరసనకారులు.అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు.. మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల సంబంధాన్ని మరింత ముడిపెడుతూ పలు దృశ్యాలను, దాంతో పాటు కొన్ని పత్రాలను వాషింగ్టన్ హిల్టన్ భవనం ముఖ భాగంపై ప్రదర్శించారు నిరసనకారులు. ఈ వీడియోలలో ఎప్స్టీన్కు సంబంధించి ఫోటోలు, పత్రాలతో పాటు, అతని ఈ-మెయిళ్లను చదివి వినిపించనట్లుగా ఉన్న ఆడియో కూడా ఉంది. వీటిని వాషింగ్టన్ డీసీ గోడలపై ప్రదర్శించిన కాసేపటికే జనం గుమిగూడిపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఎప్స్టీన్ ఫైళ్ల గురించి జనానికి తెలిసినా ఆ వీడియోలను మరొకసారి ఆసక్తిగా తిలకించారు జనం. అయితే వాషింగ్టన్ డీసీలో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి ట్రంప్ హాజరు కానున్న ఒక రోజు ముందు ఈ వీడియోలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. వాషింగ్టన్ డీసీలో అధ్యక్ష హోదాలో ఏర్పాటు చేసిన విందుకు ట్రంప్ తొలిసారి హాజరు కానున్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ నిర్వహించే ఈ విందు కార్యక్రమంలో సంప్రదాయంగా పదవిలో ఉన్న అధ్యక్షుడు కూడా పాల్గొంటారు. ఇది మీడియా స్వేచ్ఛను జరుపుకునే దీర్ఘకాలిక సంప్రదాయం. ప్రతి అధ్యక్షుడు తన పదవీకాలంలో కనీసం ఒకసారి హాజరయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన మొదటి పదవీకాలమంతా, అలాగే 2025లో కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. తాజాగా దీనికి హాజరయ్యే సందర్భంలో ఇలా వాషింగ్టన్ డీసీలో బిల్డింగ్‌ల ముఖభాగాలపై ఎప్స్టీన్తో కలిసి ఉన్న వీడియోలను నిరసన కారులు ప్రదర్శించడం ఇప్పుడు ట్రంప్‌కు మరింత తలనొప్పిగా మారింది. ఇటీవలే మీడియాపై ట్రంప్ చిందుకు తొక్కారు. తనపై మీడియా కక్ష కట్టిందని, చెడ్డ వాడిగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుందంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్‌లో రాసుకొచ్చారు ట్రంప్. Washington Hilton, where Trump will soon be arriving for the White House correspondents’ dinner. End the cover-up. pic.twitter.com/PmGZlhtRAv— Led By Donkeys (@ByDonkeys) April 25, 2026 -
చర్చల్లో ఇరాన్ బిజీ.. యుద్ధం బహుమతి అంటూ అమెరికా వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు చేరుకోగా, వాషింగ్టన్ నుంచి విట్కాఫ్, కుష్నర్లు పాకిస్తాన్ బయల్దేరారు. మరోవైపు.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. అలాగే, ఇరాన్ యుద్ధంపై ఈజిప్టు, పాక్ అధికారులు చర్చించారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య మరో విడత చర్చలు ప్రారంభించే ప్రయత్నాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు.ఈ క్రమంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ప్రపంచానికి పెద్ద బహుమతి అని చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్ సముద్ర రవాణాపై అమెరికా దిగ్బంధనం అవసరమైనంత కాలం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక వైఖరి బలహీనపడిందని, సముద్రంలో క్రమరహిత వ్యూహాలపై ఎక్కువగా ఆధారపడుతోందన్నారు. అవసరమైనంత కాలం ఒత్తిడిని కొనసాగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దెబ్బతిన్న ఇరాన్ సైన్యం, ప్రత్యేకించి ఐఆర్జీసీ సముద్రపు దొంగల ముఠాగా మారిపోయిందని తెలిపారు. విచక్షణారహితంగా మందుపాతరలు పాతేది, యాదృచ్ఛికంగా ఓడలపై కాల్పులు జరిపేది, కొన్ని వారాల వ్యవధిలో 45,000 మంది తమ సొంత ప్రజలను అమాయక నిరసనకారులను చంపింది వారేనని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అనుమానాస్పద డ్రగ్స్ పడవపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను యూఎస్ సదరన్ కమాండ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అందులో నీటిలో తేలియాడుతున్న ఒక పడవ పేలుడు ధాటికి పూర్తిగా మంటల్లో కాలిపోతున్నట్టు ఉంది. స్మగ్లింగ్ మార్గాల్లో వెళ్తున్న డ్రగ్స్ సరఫరాదారులనే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం స్పష్టం చేసింది.ఇరాన్ కౌంటర్.. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు వరకు ఇజ్రాయెల్ గగనతలంపై తాము పూర్తి పట్టును సాధించామని ఇరాన్ రక్షణశాఖ అధికార ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ రజా తలాయీ నైక్ వెల్లడించారు. దాడులు చేసేందుకు మరిన్ని అధునాతన ఆయుధాలు ఇరాన్ అమ్ములపొదిలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో ఇరాన్ స్వయంగా అధునాతన ఆయుధాలను తయారుచేస్తోందని, ఇదే పేర్కొన్నారు. -
ట్రంప్ ఉత్తర్వు చట్ట విరుద్ధం
వాషింగ్టన్: సరిహద్దుల గుండా జరిగే వలసల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల వాగ్దానాల్లో అత్యంత కీలకమైన వలసలకు అడ్డుకట్ట వేస్తూ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వును చట్ట విరుద్ధమంటూ అప్పీల్స్ కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును శుక్రవారం సమర్థించింది. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్లో యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లోని ముగ్గురు సభ్యుల జడ్జీల కమిటీ ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ‘వలస చట్టాలు సరిహద్దు వద్ద ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తాయి. అధ్యక్షుడు తన అధికారంతో ఆ చట్టాలను అతిక్రమించలేరు’అని స్పష్టం చేసింది. -
ఇజ్రాయెల్–హెజ్బొల్లా కాల్పుల విరమణ
వాషింగ్టన్: ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణను మరో మూడు వారాలపాటు పొడిగించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికాలోని ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారుల మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన రెండో విడత చర్చల్లో ఈమేరకు ఒప్పందం కుదిరిందన్నారు. లెబనాన్‌కు హెజ్బొల్లా నుంచి అవసరమైన భద్రతను అమెరికా కల్పిస్తుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. -
చైనాకు షాకిచ్చిన అమెరికా!
ఇరాన్‌తో వ్యాపారం చేసే కంపెనీలు, దేశాలపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు చేసిన గంటల వ్యవధిలోనే అమెరికా ఆచరణలోకి తీసుకొచ్చింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం చైనాలోని హెంగ్లీ పెట్రో కెమికల్ రిఫైనరీ సహా ఇరాన్ చమురుతో సంబంధం ఉన్న సుమారు 40 షిప్పింగ్ సంస్థలు, ట్యాంకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. ఇరాన్‌కు కీలక ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను నిలిపేయడానికి ట్రంప్ చేసిన ఎత్తుగడలో ఇదొక భాగమని చెప్పొచ్చు. అంతేకాదు ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన పర్షియన్ గల్ఫ్ జలమార్గమైన హర్మూజ్‌జలసంధిని అమెరికా దిగ్భంధనం చేసిన సంగతి తెలిసిందే. కాగా చైనాకు చెందిన హెంగ్లీ పెట్రో కెమికల్ రిఫైనరీలో రోజుకు సుమారు 400,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది చైనాలోనే అతిపెద్ద స్వతంత్ర రిఫైనరీల్లో ఒకటిగా నిలిచింది. ఇక 2023 నుంచి హెంగ్లీ రిఫైనరీ ఇరాన్ నుంచి ముడి చమురును సరఫరా చేసుకుంటూ ఇరాన్ సైన్యానికి వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నట్లు సమాచారం. ప్రపంచ మార్కెట్లకు చమురును తరలించడానికి ఇరాన్ ఆధారపడే నౌకలు, మధ్యవర్తులు, కొనుగోలుదారుల నెట్‌వర్క్‌ను మరింత కఠినతరం చేస్తామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ మొదటివారంలో ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న చైనా, హాంగ్ కాంగ్, యూఏఈ, ఒమన్‌లోని ఆర్థిక సంస్థలను హెచ్చరిస్తూ ఆంక్షలు విధిస్తామని లేఖలు పంపించింది. కాగా మరికొన్ని వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన కీలక రిఫైనరీపై ఆంక్షలు విధించడం ఎలాంటి చర్చకు దారి తీస్తుందనేది ఆసక్తిగా మారింది. -
మలి విడత చర్చలు.. పాక్‌కు అమెరికా ప్రతినిధులు!
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న మలి విడత శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇరాన్‌తో జరిగే చర్చల్లో పురోగతి కనిపిస్తే వాన్స్ పాకిస్తాన్‌కు వెళ్తారని అధికారులు తెలిపారు. కాగా మలి విడత చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఆయన పాకిస్తాన్‌కు బయల్దేరి వెళ్లడానికి ముందు పాకిస్తాన్ డిప్యూటీ సీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో వరుస హెచ్చరికలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న ఇరాన్, అమెరికాకు చెందిన ప్రతినిధులు పాక్‌కు చేరుకోవడం చూస్తుంటే రెండో విడత శాంతి చర్చలు ఉంటాయనే అంచనాలు బలపడుతున్నాయి. -
‘ఓసారి భారత్ రండి’.. ట్రంప్‌నకు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇరాన్ దౌత్య కార్యాలయాలు ఘాటుగా స్పందించాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. రీపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భారత్, చైనా వంటి దేశాలను నరక కూపాలు(Hell-holes)గా అభివర్ణించడమే కాకుండా.. అక్కడి నుండి వచ్చే వలసదారులను ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అంటూ విమర్శించారు.ఈ క్రమంలో ‘భారత్ వచ్చి చూడండి’ అంటూ ముంబాయిలోని ఇరాన్ ఎంబసీ.. ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. భారత్‌కు వచ్చి చూసి ఆ తర్వాత మాట్లాడాలంటూ సూచించింది ‘భారత్‌లోని అభివృద్ధి, సంప్రదాయాలు ట్రంప్‌నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారత పర్యటనకు తీసుకురావాలి’’ అంటూ పోస్ట్ పెట్టింది. భారత్ అందాలు ప్రశంసిస్తూ.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు హెవెన్ మోడ్(స్వర్గంలా)ఉంటాయని... సాంస్కృతిక విలువలు ఎంతో గొప్పవని ఇరాన్ పేర్కొంది. మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా, ట్రంప్ ‘నరకం’ వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని.. అత్యంత దారుణంగా ఉన్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు భారత్-అమెరికా మధ్య ఉన్న పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలను దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు.ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇచ్చే "బర్త్‌రైట్ సిటిజన్‌షిప్"(జన్మతః పౌరసత్వం) రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర దేశాల నుండి వచ్చే వలసలను విమర్శిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అయితే, పరిస్థితి ముదురుతుండటంతో అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ.. ట్రంప్ గతంలో భారత్‌ను "గొప్ప దేశం" అన్న విషయాన్ని గుర్తు చేస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. -
హిందూ మహాసముద్రంలోకి అమెరికా యుద్ధనౌక..!
-
ఇరాన్‌తో యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్‌పై ట్రంప్ క్లారిటీ
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్ వాడాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ దాడులద్వారానే ఇరాన్ సైన్యం చిన్నాభిన్నమైందంటూ వ్యాఖ్యానించారు. పర్మినెంట్ డీల్ కోసమే చూస్తున్నామని.. ప్రస్తుతం ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ దెబ్బతిన్నాయంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంలో మునిగిపోయిన ఇరాన్‌ను ఆర్థిక సుడిగుండంలో నిండా ముంచేందుకు హార్మూజ్ జలసంధిని గుప్పిట పట్టామని ట్రంప్ పునరుద్ఘాటించారు. జలసంధిపై తమ ఆధిపత్యాన్ని కొనసాగేంచేందుకు అగ్రరాజ్య నావికాదళాలకు ఆయన గురువారం కీలక ఆదేశాలిచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘హార్మూజ్ జలసంధిలో మన యుద్ధ నౌకలు, విదేశీ నౌకల రాకపోకలను పెను ప్రమాదంలోకి నెట్టేసే సముద్రమందుపాతరను వెనువెంటనే ఏరిపారేయండి...కొత్తగా మందుపాతరలను పెట్టేందుకు సముద్రజలాల్లో సంచరించే ఇరాన్ పడవలను వెంటనే పేల్చేయండి. అవి చిన్నపడవలు అనే కనికరం అస్సలు చూపకండి. ఇప్పటికే మన దెబ్బకు ఇరాన్ నావికాదళంలోని కీలక 159 నౌకలు మునిగిపోయి సముద్రగర్భంలోకి చేరాయి. మన మైన్ ‘స్వీపర్లు’ ఇప్పటికే సీమైన్స్‌ను ఏరిపారేయడంలో నిమగ్నమ య్యాయి. ఈ పనిని మూడు రెట్లు అత్యధిక వేగంతో పూర్తిచేసే బాగుంటుంది.హార్మూజ్ దిగ్బంధం కొనసాగుతుంది. ఇరాన్ మనతో ఒప్పందం కుదుర్చుకునేదాకా మన అనుమతి లేకుండా ఏ ఒక్క నౌక ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఐఆర్జీసీ ఆధిపత్యం, పాలకులతో విబేధాలతో తమ అసలైన అత్యున్నత నేత ఎవరు అనేది తేల్చుకోవడం ఇరానియన్లకు కష్టంగా మారింది. అతివాద నేతలేమో మన దాడుల్లో చనిపోతు న్నారు. ఉదారవాదులకు కాస్తంత గౌరవం దక్కుతోంది. ఇది నిజంగా క్రేజీ విషయం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.‘‘ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం ఆత్రంగా ఎదురుచూడట్లేము. మాకు తొందరేం లేదు. యుద్ధాన్ని త్వరగా ముగించి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ట్రంప్ అన్నారు. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే జలసంధి దిగ్బంధించామని అమెరికాæ ఆర్థిక మంత్రి స్కాట్బీసెంట్ అన్నారు. ‘‘ఈ విషయంలో మా అధ్యక్షుడు స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. హార్మూజ్ సహా ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధిస్తే ముడిచమురు సరఫరా ఆగిపోతుంది.దీంతో ఖర్గ్ ద్వీపంలోని ముడిచమురు నిల్వకేంద్రాలన్నీ క్రూడా యిల్లో నిండిపోతాయి. చమురుబావుల నుంచి సరఫరా అయ్యే ముడిచమురును నిల్వచేయడానికి చోటే ఉండదు. అప్పుడు తప్పనిపరిస్థితుల్లో చమురుబావుల నుంచి వెలికితీత ఆపేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆపేస్తే మళ్లీ మొదలెట్టడం శ్రమతోకూడిన సంక్లిష్ట ప్రక్రియ. దీంతో ఆదాయం లేక ఇరాన్ చేతులెత్తేస్తుంది’’ అని హెచ్చరించారు. -
భారత్ నరకం ట్రంప్ వ్యాఖ్యలు.. భారత్ ఘాటు రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై విషం చిమ్మారు. దేశాన్ని నరకంతో పోలుస్తూ జాత్యాహాంకార వ్యాఖ్యలు చేశారు. కాగా దీనిపై తాజాగా భారత్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.ట్రంప్ వ్యవహార శైలి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎప్పుడు ఏవిధంగా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అమెరికా గ్రేట్ ఎగేన్ అంటూ తరచుగా వేరే దేశాలపై విషం చిమ్ముతుంటారు. ఆ దేశ సంపదను అవతలి వారి కొల్లగొడుతున్నారంటూ అవతలి దేశాలపై ఏడుస్తూ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత్‌ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన వివాదాస్పద లేఖను తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.కాగా దీనిపై తాజాగా భారత్ స్పందించింది " మేము ట్రంప్ వ్యాఖ్యలను, అలాగే వాటికి ప్రతిస్పందనగా యూఎస్ రాయబార కార్యాలయం జారీ చేసిన ప్రకటనను కూడా చూశాము. ఆ వ్యాఖ్యలు స్పష్టంగా అవగాహన లేనివి, అనుచితమైనవి మరియు అసభ్యకరమైనవి. అవి ఖచ్చితంగా భారత్-యూఎస్ ప్రస్తుతమున్న సంబంధాల వాస్తవికతను ప్రతిబింబించవు. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా కాలంగా పరస్పర గౌరవం మరియు ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.మళ్లీ భారత్‌ను పొగిడిన ట్రంప్కాగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ దీనిపై మరో విధంగా స్పందించారు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ తనతో అన్నారని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ రెండు సంఘటనలను ఊటంకిస్తూ స్పందించింది.అసలేం జరిగింది ?ఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు. ఒక దేశానికి అధ్యక్షుని హోదాలో ఉండి మరో పెద్ద దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
ఇండియా గ్రేట్ కంట్రీ
న్యూఢిల్లీ: ట్రూత్ సోషల్‌లో తాను చేసిన రీపోస్టు వివాదాస్పదంకావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నష్టనివారణ చర్యలకు దిగారు. డ్యామేజ్‌ను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. భారత్ చాలా గొప్ప దేశమని ప్రశంసించారు. ఆ దేశానికి తన మంచి మిత్రుడు(నరేంద్ర మోదీ) నాయకత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. భారత్‌పై మోదీ ప్రశంసల వర్షం కురిపించినట్లు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అయితే, ఇండియా గ్రేట్ కంట్రీ అంటూ ట్రంప్ ఎక్కడ, ఎప్పుడు వ్యాఖ్యానించారో స్పష్టం చేయలేదు. -
ఊసరవెల్లి సిగ్గుపడుతుందేమే.. భారత్‌పై మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊసరవెల్లి కంటే వేగంగా ట్రంప్ తన మాటలను మార్వగలరు. ఈ రోజు ఉదయమే భారత్‌పై విషం వెల్లగక్కుతూ అవమానించేలా మాట్లాడిన ట్రంప్.. అంతలోనే ఇండియాను ప్రశంసిస్తూ మాట్లాడారని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వలసల విషయంలో భారత్‌పై మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్‌ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. కొన్ని గంటల్లోనే ట్రంప్ తన బుద్ధిని బయటపెట్టాడు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ అన్నారని భారత్‌లోని అమెరికా కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మైఖేల్ సావేజ్ వివాదాస్పద వ్యాఖ్యలుఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు.భారత్ స్పందనఅటు ట్రంప్ ఇటు సావేజ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘మేము కొన్ని నివేదికలను చూశాము. వాటిని అక్కడే వదిలేశాం’ అని అన్నారు. -
అమెరికా నేవీకి ట్రంప్ కీలక ఆదేశాలు
అమెరికా- ఇరాన్ రెండో విడత చర్చలుకు రాయబారం నడుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఆ జలసంధిని బ్లాకేడ్ చేసిన నేపథ్యంలో జలసంధిలో మందుపాతరలు పెట్టడానికి యత్నిస్తున్న ఏ నౌకలైనా పేల్చిపడేయాలని తెలిపారు. ఈ మేరకు యుఎస్ నేవీని ఆదేశించినట్లు ప్రకటన విడుదల చేశారు.పశ్చిమాసియాలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపేమో శాంతి చర్చల ప్రస్థావన తెస్తూనే మరోవైపు అమెరికా- ఇరాన్ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కొద్ది సేపటి క్రితమే హర్ముజ్ జలసంధిలో తొలిసారిగా పన్నువసూలు చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అమెరికా బ్లాకేడ్‌కు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సైతం హర్ముజ్ విషయంలో తీవ్రంగా స్పందిచారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు."హార్ముజ్ జలసంధి ప్రయాణిస్తున్న ఏ నౌకలైనా సరే ఏ బోట్లనైనా, అవి చిన్నవైనా పెద్దవైనా (వారి నౌకాదళ నౌకలన్నీ, మొత్తం 159 కూడా సముద్ర గర్భంలోనే ఉన్నాయి. పేల్చిపడేయాలని నేను యునైటెడ్ స్టేట్స్ నేవీని ఆదేశించాను. ఇందులో ఎటువంటి సంకోచం ఉండకూడదు." అని ఆదేశించినట్లు తెలిపారు.అయితే ప్రస్తుతం జలసంధిలో అమెరికా మైన్-క్లియరింగ్ (గనుల తొలగింపు) కార్యకలాపాలు ఇప్పటికే కొనసాగుతున్నాయని, ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. అదనంగా మరిన్ని మైన్ 'స్వీపర్లు' హర్ముజ్‌కు తరలించాలని దానిని మూడు రెట్లు పెంచాలని అమెరికా నేవీని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
‘అవి నరకాలు కావు..మానవాళికి మహోన్నత దేశాలు’
భారత్, చైనా నరకాలు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్‌లోని నాగరికతను నాశనం చేస్తామంటూ ప్రకటనలు మీద ప్రకటనలు ఇస్తున్న ట్రంప్ ఉంటున్న అమెరికానే నరకం అంటూ ఇరాన్ రిప్లై ఇచ్చింది. భారత్, చైనాలు మానవాళికి మహోన్నత దేశాలు అంటూ ఇరాన్ పేర్కొంది. భారత్, చైనాలను నాగరికతకు పుట్టినిల్లు అని పేర్కొంటూ ట్రంప్‌పై విరుచుకుపడింది. చైనా, భారత్ నాగరికతకు పుట్టినిల్లు. నిజానికి అమెరికా దేశ యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు ఇరాన్లో నాగరికతను నాశనం చేస్తానని బెదిరించిన చోటే ఆ నరకమనేది ఉంది’ అంటూ ఇరాన్ బదులిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో భారత్, చైనాలను నరక కూపాలు అని అభివర్ణిస్తూ వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా స్పందించింది. ట్రంప్ ప్రకటనలకు సంబంధించి కొన్ని నివేదికలను చూశామని పేర్కొంది. తాము కొన్ని నివేదిలైతే చూశామని, ఈ వ్యాఖ్యల వివాదాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్‌పై విషం కక్కిన ట్రంప్ -
భారత్‌పై మరోసారి విషం కక్కిన ట్రంప్
వాషింగ్టన్: వలసల విషయంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్‌ను నరకంతో పోల్చిన ఓ లెటర్‌ను ట్రంప్ షేర్చేశారు. ఇండియా, చైనా దేశాలను అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్.. నరకకూపాలతో పోల్చగా.. ఆయన రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు. జన్మహక్కు పౌరసత్వం గురించి మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థిస్తూ ఆ పోస్టు షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. ఆ జాత్యహంకార లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై చేస్తున్న వాదనలను విమర్శిస్తూ సావేజ్ రాసిన లేఖతో పాటు వీడియోను కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పంచుకున్నారు.ఇక్కడ జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం ఇచ్చే విధానంపై సావేజ్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో కోర్టులకు వదిలేయకుండా జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆయన కోరారు. అంతేకాకుండా భారత్, చైనా వలసదారులు ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు.. వీళ్లు మనల్ని దోచుకున్నారు. ఈ గ్యాంగ్స్టర్లు అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది.. మొత్తం కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మనల్ని రెండో తరగతి పౌరులుగా చూశారు’’ అంటూ సావేజ్ రాసుకొచ్చారు. అమెరికా జెండాను భారతీయులు తొక్కేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్‌పై అమెరికా మరో ట్విస్ట్..
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ గడువు పొడిగింపు, హార్మూజ్ జలసంధి దిగ్బంధంపై అమెరికా భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి ఐదు రోజుల గడువు ఉందన్న వార్తలు, నిరవధిక గడువు ఉందన్న సమాచారం నిజం కాదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట గడువును ఇంకా విధించలేదని ఆమె తేల్చిచెప్పారు.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధం పట్ల ట్రంప్ సంతృప్తిగా ఉన్నారు. ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి 3 నుంచి 5 రోజుల గడువు ఉందన్న వార్తలు నిజం కాదు. చర్చల సమయం, తదుపరి చర్యల గడువును అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే నిర్ణయిస్తారు. ఇక, ఇరాన్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు ట్రంప్ చేతిలోనే ఉన్నాయి.ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులను అమెరికా అడ్డుకుంది. ఖర్గ్ ద్వీపం చమురు నిల్వలతో నిండిపోయింది. ఖర్గ్ ద్వీపం నుంచి చమురును బయటకు పంపే అవకాశం లేకుండా అమెరికా దిగ్బంధించింది. దీనివల్ల ఇరాన్ ప్రతిరోజూ సుమారు 500 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతోంది. కనీసం తన సొంత ప్రజలకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి ఇరాన్ చేరుకుంది. ట్రంప్ ప్రయోగించిన ఈ ఆర్థిక ఒత్తిడి సత్ఫలితాలను ఇస్తోంది అని చెప్పుకొచ్చారు.White House press secretary Karoline Leavitt said Wednesday that President Trump “has not set a firm deadline to receive an Iranian proposal" following another extension to the ceasefire."There's obviously a lot of internal division," Leavitt said, referring to Iran's… pic.twitter.com/zHXmKkdhrB— CBS News (@CBSNews) April 22, 2026 ఇరాన్ కౌంటర్.. మరోవైపు.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శాంతి చర్చలకు అసలైన అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియాలో వివరించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమెరికా గౌరవించక పోవడం ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఓడరేవులపై, ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ఆంక్షలు, దిగ్బంధం మరో కారణమని చెప్పారు. అమెరికా నుంచి వస్తున్న సైనిక, రాజకీయ బెదిరింపులు శాంతి చర్చలకు అడ్డంకులని తెలిపారు. అమెరికా మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను ప్రపంచం మొత్తం చూస్తోందని విమర్శించారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు, ఒప్పందాలకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హార్మూజ్‌ను తెరిచే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. -
50 డేస్.. అమెరికా అట్టర్ ప్లాప్ షో..
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్ వేదిక చర్చల్లో కూడా సందిగ్ధత నెలకొంది. సీజ్‌ఫైర్‌ను ట్రంప్ పొడిగించినప్పటికీ అరకొరదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇరాన్ సైతం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరోవైపు.. ఇరాన్‌పై దాడుల కారణంగా అమెరికా ఆయుధాల సంఖ్య రోజురోజుకి తరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 2027 బడ్జెట్లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది. ఇంతకీ అమెరికా వద్ద ఇంకా ఎన్ని క్షిపణులు, ఆయుధాలు ఉన్నాయనే అంశం ఓ నివేదిక బయటకు వచ్చింది.అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమై 50 రోజులు దాటింది. యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా భారీగానే దాడులు చేసింది. భారీ క్షిపణులు, వైమానిక దాడులతో విధ్వంసమే సృష్టించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఆయుధాలను ఉపయోగించింది. దీంతో, ఇరాన్ సైనిక సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా, అమెరికా ఆయుధ నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయి. ఆయుధ నిల్వలు భారీగా తరిగిపోయాయి. అయితే, అమెరికా వద్ద ప్రస్తుత యుద్ధాన్ని కొనసాగించడానికి సరిపడా మిసైళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో కొత్త యుద్ధాలు తలెత్తితే నిల్వల కొరత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.అమెరికా ఆయుధ నిల్వల పరిస్థితి..టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్లు: యుద్ధానికి ముందు 3,100 ఉండగా.. యుద్ధం కోసం 850 వినియోగించబడ్డాయి. దీంతో, దాదాపు 25% నిల్వలు తగ్గాయి.JASSM (జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండాఫ్ మిసైళ్లు): 4,400 ఉండగా.. ఇరాన్ యుద్ధం కోసం 1,000 వినియోగించబడ్డాయి.THAAD ఇంటర్సెప్టర్లు: 360 ఉండగా.. 190–290 వినియోగించబడ్డాయి. ఇప్పుడు 70 మాత్రమే మిగిలి ఉన్నాయి.పాట్రియట్ PAC-3: 2,330 ఉండగా.. 1,060–1,430 వినియోగించబడ్డాయి. కేవలం 900 మాత్రమే మిగిలాయి.SM-6: 600 ఉండగా..200 వినియోగించారు. 400 వరకు ఉన్నాయి. SM-3: 150 ఉండగా.. 40 వరకు వినియోగం. ఇంకా 110 మిగిలి ఉన్నాయి.భవిష్యత్తు ప్రణాళిక.. భారీగా ఖర్చు..2027 బడ్జెట్లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది.టోమాహాక్: 55 నుంచి 785కి పెంపు( ఒక్క దానికి ఖర్చు: తయారీకి $2.6 మిలియన్ డాలర్లు).Patriot PAC-3: 357 నుంచి 3,203కి పెంపు ( $3.9 మిలియన్)THAAD: 55 నుంచి 857కి పెంపు($15.5 మిలియన్)SM-6: 166 → 540కి పెంపు($4.3 మిలియన్)SM-3: 12 → 136కి పెంపు($9–10 మిలియన్)ప్రధాన సమస్యలు..ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారు చేసే డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు అమెరికా ఖరీదైన రక్షణ వ్యవస్థలను బలవంతంగా వినియోగింపజేస్తున్నాయి.THAAD, Patriot లాంటి రక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.ఉత్పత్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టడం కారణం (టోమాహాక్ – 47 నెలలు, THAAD – 53 నెలలు, SM-36 నెలలు, SM-36 నెలలు) కావడంతో నిల్వలను తిరిగి భర్తీ చేయడం కష్టతరం అవుతుంది. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం.. యుద్ధంలో ప్రధానంగా షాహెడ్ డ్రోన్లు మరియు క్రూయిజ్ మిసైళ్లు వినియోగిస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, పెద్ద సంఖ్యలో తయారు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండటంతో అమెరికా మరియు మిత్రదేశాల రక్షణ వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నాయి. ఇరాన్ ఒకేసారి వందల డ్రోన్లను పంపి, అమెరికా THAAD మరియు Patriot వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. ఇరాన్ ఉపయోగిస్తున్న డ్రోన్లుShahed-136 ("కమికాజే" డ్రోన్)ఒకే దిశలో దాడి చేసే UAV (Unmanned Aerial Vehicle).ఖర్చు: సుమారు $20,000–$50,000 మాత్రమే.లక్ష్యం: శత్రు రక్షణ వ్యవస్థలను అధిక సంఖ్యలో దాడులతో అలసటకు గురి చేయడం.“పేదవాడి క్రూయిజ్ మిసైల్” అని పిలుస్తారు, ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో క్రూయిజ్ మిసైల్ లాంటి ప్రభావం చూపుతుంది.UAE రక్షణ శాఖ ప్రకారం, యుద్ధం ప్రారంభం నుండి 941 డ్రోన్లు గుర్తించబడ్డాయి, వాటిలో 65 UAEలో పడిపోయి మౌలిక వసతులకు నష్టం కలిగించాయి.Shahed-131 / Shahed-238 (అప్‌గ్రేడ్ వెర్షన్లు)Shahed-136 కంటే చిన్నవి లేదా వేగవంతమైనవి.కొన్ని జెట్-ఇంజిన్ ఆధారిత డ్రోన్లు కూడా వినియోగించబడ్డాయి, ఇవి మరింత వేగంగా ఉండి Patriot లాంటి రక్షణ వ్యవస్థలకు సవాలు విసురుతున్నాయి.ఇరాన్ క్రూయిజ్ మరియు బాలిస్టిక్ మిసైళ్లు1. Zolfaghar బాలిస్టిక్ మిసైల్700 కిమీ పరిధి.1,100 పౌండ్ల వార్‌హెడ్ మోసే సామర్థ్యం.ఇరాక్‌లోని ఎర్బిల్ ప్రాంతంలో పలు దాడుల్లో వినియోగించబడింది.2. Soumar క్రూయిజ్ మిసైల్రష్యా KH-55 ఆధారంగా అభివృద్ధి చేయబడింది.దీర్ఘదూర దాడులకు ఉపయోగపడుతుంది.3. Quds-1 / Quds-2 క్రూయిజ్ మిసైళ్లుతక్కువ ఖర్చుతో తయారు చేయగలిగే సామర్థ్యం.గల్ఫ్ ప్రాంతంలోని మౌలిక వసతులపై దాడులకు వినియోగించబడ్డాయి.ఇదిలా ఉండగా.. అమెరికా పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది. -
ఓ మై గాడ్.. ఇరాన్ ఎంత పని చేసింది?
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా బ్లాకేడ్.. ఇరాన్ ఆధిపత్య ప్రయత్నాలతో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అయితే ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఓ క్లారిటీ ఇచ్చింది.హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి కనీసం మరో ఆరు నెలల టైం పట్టవచ్చని తాజాగా పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా చట్టసభ సభ్యులతో ఆ విభాగం రహస్యంగా ఓ సమావేశం నిర్వహించిందని.. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలకమైన నివేదికను అక్కడి సభ్యులకు వివరించిందన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఈ జాప్యానికి శాంతి చర్చలతో సంబంధం లేదని తెలుస్తోంది. ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ఉండటం వల్లే ఈ ఆలస్యం జరగవచ్చని ఆ నివేదిక తెలిపింది. హర్ముజ్ రూట్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 కంటే ఎక్కువ మైన్స్‌నే అమర్చి ఉంటుందని అంచనా. ఇందుకోసం ఇరాన్ జీపీసీ (Global Positioning Capability/Control) టెక్నాలజీ వాడింది. అందుకే వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది. కాబట్టి.. వాటిని తొలగించడానికి టైం పట్టవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే..ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తిస్థాయిలో వాటి తొలగింపు ఆపరేషన్ చేపట్టడానికి వీలుంటుందని కూడా పెంటగాన్ నివేదిక స్పష్టం చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే పెంటగాన్ ఈ కథనాలను ధృవీకరించాల్సి ఉంది. ఇరాన్ ఇటీవల హర్ముజ్ జలసంధి సముద్ర మైన్స్ (Sea Mines) గురించి పలు ప్రకటనలు చేసింది. ముఖ్యంగా, నౌకలు మైన్స్‌తో ఢీకొనే ప్రమాదం ఉందని హెచ్చరించి.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పలు దేశాల వాణిజ్య నౌకలకు సూచించింది. అయితే డీల్ కుదిరాక ఇరాన్ సహకారంతోనే సీ మైన్స్‌ను తొలగిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అది జరిగే పని కాదంటూ ఇరాన్ ట్రంప్ ప్రకటనపై సెటైర్లు కూడా వేసింది. ఏయే యుద్ధాల్లో వాడారంటే..సీ మైన్స్ (Sea Mines) అనేవి సముద్రంలో ఉంచే పేలుడు పరికరాలు. ఇవి నౌకలు లేదంటే జలాంతర్గాములు (submarines) దగ్గరికి వచ్చినప్పుడు పేలిపోతాయి. చరిత్రలో అనేక యుద్ధాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు. 14వ శతాబ్దంలో చైనా సామ్రాజ్యంలో జపాన్ దొంగలపై వీటిని ఉపయోగించినట్లు చరిత్రలో ప్రస్తావన ఉంది. అమెరికన్ రెవల్యూషన్-సివిల్‌వార్ టైంలో అమెరికా తొలిసారిగా వాడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో.. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు కొరియా, వియత్నాం యుద్ధాల్లోనూ వీటిని వాడారు. రష్యా నౌకల కదలికలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్.. తాజాగా హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరులో ఇరాన్ వీటిని ఉపయోగించాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు అంతరాయం కలుగుతూ వస్తోంది. హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం తమదేనని ఇరాన్.. అలా కుదరదు స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని అమెరికా వాదిస్తూ వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల(అణు ఒప్పందం ప్రధానంగా) కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో.. హర్ముజ్ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. కానీ, అమెరికా డిమాండ్లను ఇరాన్ తోసిపుచ్చడం, చర్చలకు(రెండో దఫా) ముందుకు రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. -
శుక్రవారం నాటికి ‘శుభవార్త’.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని.. రాబోయే 36 నుంచి 72 గంటల్లో శాంతి చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు 'న్యూయార్క్ పోస్ట్’ పేర్కొంది. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ అభ్యర్థన మేరకు.. ఇరాన్‌తో కాల్పుల విరమణను ట్రంప్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏడు వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ నాయకత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 8న ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ కీలక ప్రకటన వెలువడింది. దీంతో పాకిస్తాన్‌కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధి బృందం పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో కూడిన బృందం మంగళవారం ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే, హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు ఇరాన్ ఒక సమగ్ర ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, చర్చల కోసం ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనను తెచ్చే వరకు మాత్రమే అమెరికా దాడులకు దూరంగా ఉంటుందని.. కానీ ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.అమెరికా చర్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. ఓడరేవులను దిగ్బంధించడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇది ఒక ‘యుద్ధ చర్య’గా ఆయన అభివర్ణించారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం అన్యాయమని, తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో ఇరాన్‌కు తెలుసని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఆసియాలో ఇరాన్ ముడి చమురును అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్న 'M/T టిఫానీ' అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్‌పై దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టుతో అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు 30 శాతం పెరిగి, బ్యారెల్ ధర 95 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగిన మొదటి విడత చర్చలు విఫలం కావడంతో, ఇప్పుడు రెండో విడత చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
ఇరాన్లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్ చేసేశారా?
టెహ్రాన్: ఇరాన్ అంతర్గత అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై ఓ వైపు సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. ఆయన్ని కాదని ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చాపకింద నీరులా ప్రభుత్వంపై పట్టు బిగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ అంతర్గత పోరాటం కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్’ అన్న చందంగా ఇరాన్ వ్యవహారం మారింది. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో హాట్‌టాపిక్‌గా మారి, అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అమెరికా సైతం చర్చలు విఫలమవడానికి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ ఇరాన్లో ఏం జరుగుతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.ఆరు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన గొంతు వినలేదు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కీలక నేతలను కోల్పోవడం వల్ల భయాందోళనలో ఉన్నారని సమాచారం.అమెరికా మీడియా నివేదికల ప్రకారం, మొజ్తాబా ప్రత్యక్ష నిర్ణయాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పెరిగాయి. అణు కార్యక్రమంపై చర్చల్లో ఇరాన్ ప్రతినిధులకు ఎంత అధికారం ఇవ్వాలో స్పష్టత లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 440 కిలోల నిల్వ ఉంది. ఇది 90 శాతం ఆయుధ స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, ఎనిమిది నుంచి పన్నెండు అణు బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్‌కి చెందిన అలీ వాయేజ్ ప్రకారం, మొజ్తాబా స్వయంగా చర్చలు జరిపే స్థితిలో లేరు. ఆయన కేవలం విస్తృత నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారని, చర్చల వ్యూహాల్లో ఆయన పాత్ర లేదని చెప్పారు. ఆయన గైర్హాజరీని ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపిస్తోందని, ఇది అంతర్గత విమర్శల నుంచి రక్షణగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం ఇరాన్ పాలనకు సవాలుగా మారింది. ఆయన పేరుతో టీవీల్లో వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలతో సందేశాలు పంపడం ఆయన ఆరోగ్యంపై, ఆయన ఎక్కడున్నారనే అనుమానాలను మరింత పెంచుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. మరోవైపు, రాయిటర్స్ ప్రకారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధం, అమెరికాతో చర్చల వంటి ప్రధాన అంశాలపై నిర్ణయాల్లో పాల్గొంటున్నారని సమాచారం.ఇరాన్ ప్రభుత్వంలో కుమ్ములాటఇరాన్లో ప్రస్తుతం పెద్ద రాజకీయ కుమ్ములాట జరుగుతోంది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రభుత్వంపై పట్టు బిగించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ నియామకాలను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించడాన్ని నిరోధించడం ద్వారా అధ్యక్షుడిని పూర్తిగా పక్కకు పెట్టిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఐఆర్జీసీ మరింత ఆధిపత్యం సాధించింది. ఆయన చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులకు ఆయనను కలిసే అవకాశం లేకుండా చేసింది. దీంతో పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలస్యమవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఐఆర్జీసీ ఆధిపత్యం పెరగడం వల్లే శాంతి చర్చలు నిలిచిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు -
టిమ్ కుక్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు
టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. యాపిల్ సంస్థను ప్రస్తుత స్థాయికి చేర్చడంలో టిమ్ పాత్ర అనిర్వచనీయమన్నారు. స్టీవ్ జాబ్స్ హయాంలో కూడా యాపిల్ ఈ స్థాయికి చేరుకునేది కాదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.స్టీవ్ జాబ్స్ కంటే కుక్ మేటి!సాధారణంగా యాపిల్ అంటే స్టీవ్ జాబ్స్ పేరు గుర్తొస్తుంది. కానీ, ట్రంప్ తన విశ్లేషణలో టిమ్ కుక్కు అగ్రతాంబూలం ఇచ్చారు. ‘నేను ఎల్లప్పుడూ టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ ఇద్దరికీ పెద్ద అభిమానిని. అయితే, ఒకవేళ స్టీవ్ జాబ్స్ అకాల మరణం చెందకుండా టిమ్ కుక్ బదులుగా ఆయనే సంస్థను నడిపించి ఉంటే.. యాపిల్ కచ్చితంగా బాగా పనిచేసేది, కానీ టిమ్ హయాంలో ఉన్నంత ఉన్నత స్థితికి మాత్రం చేరుకునేది కాదు’ అని ట్రంప్ అన్నారు.సమస్యల పరిష్కర్తగా కుక్..తమ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ టిమ్ కుక్ పనితీరును ట్రంప్ కొనియాడారు. తన మొదటి టర్మ్ ప్రారంభంలో టిమ్ చేసిన ఒక ఫోన్ కాల్ తమ స్నేహానికి పునాది వేసిందని ఆయన తెలిపారు. ‘సాధారణంగా కంపెనీలు కన్సల్టెంట్లకు మిలియన్ల డాలర్లు చెల్లిస్తాయి, కానీ పని పూర్తి కాదు. కానీ కుక్ నేరుగా నాకు కాల్ చేసి సమస్యను వివరించేవారు. ఆయన అడిగే విధానం, సమస్యలోని తీవ్రత నాకు నచ్చేవి. నేను వెంటనే వాటిని పరిష్కరించేవాడిని’ అని ట్రంప్ పేర్కొన్నారు. టిమ్ కేవలం తన పనే కాకుండా కంపెనీ ప్రయోజనాల కోసం ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో ట్రంప్ గుర్తుచేశారు. కుక్ ఒక నమ్మశక్యం కాని వ్యక్తి అని, ఆయన కెరీర్ సాటిలేనిదని ప్రశంసించారు.15 ఏళ్ల ప్రస్థానం..దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పాటు యాపిల్ సామ్రాజ్యాన్ని ఏలిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ నూతన సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు.ఇంజినీర్ నుంచి గ్లోబల్ లీడర్ వరకు..టిమ్ కుక్ ప్రయాణం ఆబర్న్ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌తో మొదలైంది. ఐబీఎంలో 12 ఏళ్లు, ఆపై కాంపాక్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తర్వాత యాపిల్ చేరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో కంపెనీ సరఫరా గొలుసును క్రమబద్ధీకరించి, లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తర్వాత స్టీవ్‌జాబ్స్ మరణానంతరం సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం యాపిల్ కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తివంతమైన విభాగం. అటువంటి సంస్థను విజయవంతంగా నడిపిన కుక్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
హర్ముజ్‌లో మళ్లీ టెన్షన్: భారత నౌకను దిగ్బంధించి..
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అలాగే భారత్‌కు చెందిన నౌకను సైతం దిగ్బంధించినట్లు సమాచారం అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ఇరాన్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్‌లో వెళ్తున్న కంటైనర్ షిప్‌లపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్ని బ్రిటన్ ఆర్మీ ధృవీకరించింది. మొత్తం మూడు నౌకలపై దాడులు జరిగాయని.. గ్రీక్, పనామా, లైబీరియా రిజిస్ట్రేషన్ నౌకలుగా వాటిని గుర్తించారు. తొలుత.. ఈ ఉదయం గ్రీక్ ఆపరేటెడ్ కంటైనర్ షిప్‌పై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో నౌక పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. సిబ్బంది క్షేమంగానే ఉన్నారని సమాచారం. ఆ వెంటనే పనామా, లైబీరియా షిప్‌లపై దాడి జరిగింది. దాడులను ధృవీకరించిన ఇరాన్ మీడియా.. హర్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేసింది.భారత నౌకపై కూడా.. భారత్‌కు చెందిన నౌకలకు స్వేచ్ఛా రవాణా ఉంటుందని ఇరాన్ పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాటి పరిణామాలు మరోలా ఉన్నాయి. గుజరాత్ వైపు వస్తున్న ఓ నౌకను ఇరాన్ అడ్డగించింది. దిగ్బంధించిన ఆ నౌక పరిస్థితి.. సిబ్బంది క్షేమసమాచారాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొన్నీమధ్య కూడా హర్ముజ్‌లో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. ఏప్రిల్ 18న ఐఆర్జీసీ రెండు భారత-పతాక నౌకలపై కాల్పులు జరిపింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు, కానీ నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత నౌకల భద్రత విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ కోరింది.ప్రపంచ వర్తక వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి కీలకమన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రూట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే.. కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్‌లో తమ బ్లాకేడ్(దిగ్బంధం) కొనసాగుతుందని అమెరికా అంటోంది. ఈ క్రమంలో టౌసా అనే వాణిజ్య నౌకను సీజ్ చేసింది. ఇది యుద్ధ చర్యేనంటున్న ఇరాన్.. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రతరంగా మార్చే అవకాశం లేకపోలేదు. -
ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా.. మొదటికే ముప్పు?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా, ఇరాన్ వద్ద ఉన్న యురేనియం కోసం అధ్యక్షుడు ట్రంప్ ఎదురుచూస్తున్నారు. అయితే, సుసంపన్నం చేసిన యురేనియంను అప్పగించడానికి అమెరికా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ పదార్థాన్ని దేశం నుండి బయటకు తీసుకురావడం అనేది చర్చల కంటే చాలా కష్టతరం కావచ్చు అంటూ పలు నివేదికలు చెబుతున్నారు. అమెరికాకు ఇది అంత సులభం కాదని హెచ్చరిస్తున్నాయి. దీంతో, ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా? అనే అనుమానాలు చర్చకు వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. మాజీ అధికారులు, అణు నిపుణులు ఈ ఆపరేషన్ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన యురేనియం తొలగింపు ఆపరేషన్‌గా ముగిసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే.. ఇరాన్ యురేనియంలో అధిక భాగం ఇస్ఫహాన్ మరియు నతాంజ్ వంటి కేంద్రాలలో నిల్వ చేయబడిందని భావిస్తున్నారు. ఈ రెండూ ఇటీవలి నెలల్లో అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు గురయ్యాయి. దీంతో, అక్కడికి చేరుకోవడం కష్టమైంది. సొరంగాల ప్రవేశ మార్గాలను కూడా పూడ్చివేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయ తనిఖీ అధికారులు కొన్ని నెలలుగా ఈ ప్రదేశాలను సందర్శించలేదు.ఇదే సమయంలో మరో ప్రశ్న కూడా ఉంది. యురేనియం గురించిన దానిలో ఎక్కువ భాగం భారీ సిలిండర్లలో వాయు రూపంలో నిల్వ చేయబడింది. ఆ కంటైనర్లు చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో బృందాలు మొదట తనిఖీ చేయాలని నిపుణులు అంటున్నారు. అవి దెబ్బతిన్నట్లయితే, ప్రమాదాలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఆ పదార్థాన్ని సురక్షితంగా అంచనా వేయడానికి మరియు వెలికితీయడానికి రిమోట్-ఆపరేటెడ్ పరికరాలు మరియు రోబోట్లతో సహా ప్రత్యేక పరికరాలు అవసరం కావచ్చు. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. అలాంటి పరిస్థితులలో కార్యకలాపాలకు వారాలు పడుతుంది. దెబ్బతిన్న, దాడి అనంతర వాతావరణంలో, కాలపరిమితులు అనిశ్చితంగా మారతాయి. దాన్ని బయటకు తరలించడం సులభం కాదు. ఇక, అణ్వాయుధ పదార్థాల రవాణా ఒక సున్నితమైన పని. సంఘర్షణలతో కూడిన ప్రాంతం నుండి దీన్ని చేయడం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.ÚLTIMA HORA: Un periodista iraní afirma que se registraron nuevas explosiones en una instalación subterránea de almacenamiento de misiles en Isfahán (Irán), previamente atacada por EE.UU. antes del alto el fuego, con ondas expansivas sentidas en la zona.pic.twitter.com/RqZxZGZJL6— Isaac (@isaacrrr7) April 20, 20261990లలో కజకిస్తాన్ నుండి ఆయుధ సామగ్రిగా ఉపయోగపడే యురేనియంను తొలగించడంతో సహా, గతంలో అమెరికా చేపట్టిన మిషన్లు నియంత్రిత వాతావరణంలో జరిగాయి. అయితే, ఇరాన్ విషయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. భద్రత, విమాన రవాణా ఏర్పాట్లు వంటివి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.యురేనియం ఎక్కడికి పంపాలి?అయితే, శుద్ది చేసిన యురేనియాన్ని యునైటెడ్ స్టేట్స్కు పంపడాన్ని ఇరాన్ వ్యతిరేకించింది. చర్చలో ఉన్న ప్రత్యామ్నాయాలలో రష్యా లేదా కజకిస్తాన్‌లో సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ ఆ పదార్థాన్ని పలుచగా చేసి అంతర్జాతీయ పర్యవేక్షణలో నిల్వ చేయవచ్చు. ఒకవేళ ఇరాన్ బదిలీకి అంగీకరించినప్పటికీ, ధృవీకరణ చాలా కీలకం. కొంత పదార్థం దాచడం లేదా ధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారు. యురేనియం తరలించబడిందా లేక ఉన్నచోట ఉందా అని నిర్ధారించడానికి పర్యావరణ తనిఖీలతో సహా, ఏ ఒప్పందానికైనా లోతైన తనిఖీలు అవసరం కావచ్చు.ఇరాన్ వద్ద 440 కిలోల యురేనియం..అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) గణాంకాల ప్రకారం.. 2025 జూన్‌లో అమెరికా దాడులకు ముందు ఇరాన్ వద్ద 60 శాతం సుసంపన్నమైన యురేనియం సుమారు 440 కిలోల వరకు ఉంది. అణుబాంబు తయారీకి అవసరమైన 90 శాతానికి ఇది చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ నిల్వల భవితవ్యంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే దాడులకు గురైన ప్రాంతాల్లో తనిఖీలకు ఐఏఈఏ ఇన్స్పెక్టర్లను ఇరాన్ అనుమతించడం లేదు.యురేనియం శుద్ధి ఇలా.. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది. 2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్‌కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అదే విషయంలో ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారు.అయితే, కజకిస్తాన్ (1994), లిబియా (2003) యురేనియం/అణు పదార్థాల తొలగింపు ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. కానీ ఇరాన్ పరిస్థితి వాటితో పోలిస్తే చాలా క్లిష్టమైనది. యురేనియం తరలింపునకు కజకిస్తాన్, లిబియా ప్రభుత్వాలు సహకరించాయి. ఇరాన్ మాత్రం ప్రతిఘటనతో, భూగర్భ సదుపాయాల్లో పదార్థాన్ని దాచిపెట్టింది.కజకిస్తాన్ – Project Sapphire (1994)స్థితి: సోవియట్ యుగం తర్వాత 600 కిలోల weapons-grade HEU (Highly Enriched Uranium) ఉల్బా మెటలర్జికల్ ప్లాంట్‌లో నిల్వ.ఆపరేషన్: అమెరికా–కజకిస్తాన్ రహస్య సహకారంతో 31 నిపుణుల బృందం 6 వారాల పాటు పని చేసి, 1032 కంటైనర్లలో ఉన్న యురేనియాన్ని 448 సురక్షిత కంటైనర్లలో ప్యాక్ చేసింది.తరలింపు: 3 C-5 విమానాల ద్వారా Oak Ridge (USA)కి తరలించి, IAEA పర్యవేక్షణలో low-enriched uranium గా మార్చారు.ప్రధాన అంశం: కజకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది, అందువల్ల ఆపరేషన్ సురక్షితంగా, రహస్యంగా పూర్తయింది.లిబియా – Disarmament (2003–2004)స్థితి: గడాఫీ పాలనలో అణు, రసాయన, జీవ రసాయన ఆయుధాల ప్రోగ్రామ్‌లు కొనసాగాయి.తీర్మానం: 2003 డిసెంబర్ 19న గడాఫీ స్వచ్ఛందంగా WMD ప్రోగ్రామ్‌లను నిలిపివేస్తానని ప్రకటించాడు.ఆపరేషన్: అమెరికా, యుకే, IAEA పరిశీలకులు కలిసి యురేనియం సదుపాయాలు, సెంట్రిఫ్యూజ్‌లు, రసాయన ఆయుధాలను తొలగించారు.ప్రధాన అంశం: లిబియా అంతర్జాతీయ ఒత్తిడి, ఆంక్షలు, ఇరాక్ యుద్ధం తర్వాత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి స్వచ్ఛందంగా సహకరించింది. -
ట్రంప్ ప్లాన్ బీ.. ఉక్కిరి బిక్కిరి నడుమే ఇరాన్ కౌంటర్
పశ్చిమాసియా యుద్ధంలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కాల పరిమితిని లేకుండా యుద్ధ విరమణను పొడిగించారు. అయితే ఇరాన్ దీని వెనక పెద్ద కుట్రే దాగి ఉందని అంటోంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంతో ఇరాన్ ఆర్థికంగా బాగా దెబ్బ తిందని ట్రంప్ అంటున్నారు. ‘‘ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నౌకాదళ నిర్బంధం కారణంగానే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. సైన్యానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతోంది. సైన్యంతో పాటు పోలీసులకు జీతాలు అందడం లేదు. నగదు కోసం ఇరాన్ ఆకలితో ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేయబడటం వల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. దానిని తిరిగి తెరవాలని తహతహలాడుతోంది’’ అని ట్రూత్ సోషల్ ఆయన వ్యాఖ్యానించారు.అయితే ఇరాన్ తొలి నుంచి హర్ముజ్ మూసివేతకే మొగ్గుచూపుతూ వస్తోంది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ దానిని తెరవాలని కోరుకుంటోందని అంటున్నారు. ‘‘ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్లు సంపాదించేది. ఇప్పుడు అదే మొత్తాన్ని కోల్పోతోంది. కాబట్టి తెరవాలనే చూస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. చర్చల్లో పాల్గొంటున్న మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ఇప్పటికే సంకేతాలు పంపిందని.. కానీ, తగిన రాజకీయ రాయితీలు లేకుండా జలసంధి తెరిస్తే చర్చల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారాయన. ట్రంప్ వాదనలో నిజం లేదా?ఇరాన్ సైన్యం పూర్తిగా ధ్వంసమైందని అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. అలాగే.. యుద్ధంతో సైన్య వ్యవస్థ ఘోరంగా దెబ్బ తిందని ట్రంప్ అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. అమెరికా పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది. ప్లాన్ బీ ఇదే.. ప్రాంతీయ మిత్రపక్షాల సహకారంతో ఇరాన్ యుద్ధంలో బలంగానే కనిపిస్తున్నా.. ఆర్థికంగా మాత్రం బలహీనంగానే ఉందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చర్చల కోసం ఇరాన్ మెడలు వంచాలని అమెరికా అడుగులేస్తోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఇరాక్‌కు డాలర్ల సరఫరాను నిలిపివేసింది. ఈ చర్య ద్వారా ఇరాన్ మద్దతు పొందిన మిలీషియాలను బలహీనపరచడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇరాన్ సముద్ర వాణిజ్యాన్ని అడ్డుకోవడం.. వారి ప్రధాన ఆదాయ వనరులను కత్తిరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. చమురు ఎగుమతులే ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరు. అయితే ప్రస్తుతం అక్కడి పోర్టులపై అమెరికా నిర్బంధం కొనసాగుతోంది. దీనివల్ల చమురు బయటకు వెళ్లడం లేదు. ఈ ప్రభావంతో ఖార్గ్ దీవి (ఇరాన్ చమురు ఎగుమతుల 90% నిర్వహించే కేంద్రం) నిల్వలు నిండిపోయి ఉన్నాయి. కొత్తగా చమురు తీయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో చమురు బావులను తాత్కాలికంగా మూసేసే పరిస్థితికి దారి తీసింది. ఇది.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అంటున్నారు. ఇరాన్ కౌంటర్సీజ్ ఫైర్ పొడిగింపు.. అమెరికా ఏకపక్ష నిర్ణయంగానే కనిపిస్తోంది. పాకిస్తాన్ నాయకత్వం అభ్యర్థన మేరకు దాడుల్ని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై ఇరాన్ కౌంటర్ వేసింది. ‘‘ సీజ్ ఫైర్ వంకతో ఈ గ్యాప్‌లో అమెరికా మళ్లీ దాడులు చేయాలని చూస్తోంది. అయినా ఓడిపోయేవాళ్లు నిబంధనలు పెట్టడం ఏంటి?’’ అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ చర్చల ప్రతినిధి మహ్మద్ బాగేర్ ఖలీబాఫ్ ఓ ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ పొడిగింపు కేవలం వ్యూహాత్మక ప్రయోజనం కోసమే. నౌకాదళ నిర్బంధం కొనసాగుతూనే ఉంది. పోర్టులకు వచ్చే నౌకలను ఆపడం కాల్పుల ఉల్లంఘన కాదా?. ఇది యుద్ధ చర్య కాకుండా మరేమిటి?. ఇలాంటి బెదిరింపుల మధ్య మేం చర్చలు జరపం అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. ఇరాన్ చర్చలకు దూరంగా ఉండటం.. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్ పర్యటనను రద్దు చేసుకోవడం.. ఈ రెండు పరిణామాలు కలిపి శాంతి చర్చలపై తీవ్ర అనిశ్చితిని సృష్టించాయి. -
కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని తెలిపారు.ఇరాన్ తమతో ఏకీకృత ఒప్పందానికి వచ్చే వరకు, శాంతి చర్చలు ముగిసేవరకు కాల్పుల విమరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతో కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు, చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం యాథావిధిగా ఉంటుంది. ఇప్పటికే దీనిపై అప్రమత్తంగా ఉండాలని మా సైన్యాన్ని ఆదేశించాను’ అని తెలిపారు. అయితే ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన రెండో విడత శాంతి చర్చలకు వచ్చేందుకు ఇరాన్ విముఖత చూపడంతో ట్రంప్ మంగళవారం సీఎన్‌బీసీ ‘స్వాక్బాక్స్’ కార్యక్రమంలో ఇరాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘ఇరాన్ మాతో ఒప్పందానికి రావడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం.కాల్పుల విరమణ గడువు పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారంతో ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ గడువు ముగియనుంది. అయితే ఇంతలో ట్రంప్ కాల్పుల విరమణపై యూటర్న్ తీసుకోవడంతో కొంతమేర ఉపశమనం లభించినట్లయింది.ఫలించిన పాక్ ప్రయత్నం..హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన దౌత్యప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఒక మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్‌కు హితబోధ చేస్తోంది. కనీసం కాల్పుల విరమణ గడువును అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పాక్ అభ్యర్థనపై ఒక అడుగు ముందుకేసి కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. -
చర్చలపై తొలగని ఉత్కంఠ
వాషింగ్టన్/ఇస్లామాబాద్/టెహ్రాన్: హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో రెండో దఫా శాంతి చర్చలపై సందిగ్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అన్ని ఏర్పాట్లూ చేశాక అతిథులు రాబోరన్న వార్త తెల్సి కంగుతున్న అతిథ్య పాకిస్తాన్ మరోమారు తమ దౌత్యమంత్రాంగాన్ని ముమ్మరంచేసింది. ఓ మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్‌కు హితబోధ చేస్తోంది. గత 24 గంటలుగా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా కొత్తగా హిందూమహాసముద్రంలో ఇరాన్ నౌకను అమెరికా తమ అదీనంలోకి తెచ్చుకోవడంతో ఇరాన్ పాలకుల్లో కోపం మరింత ఎక్కువైంది.కనీసం గడువు తేదీని అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రాయబారం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ‘‘ఇరాన్ మాతో సంప్రతింపులు జరపాలి. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ గొప్పదేశంగా అవతరించవచ్చు. అద్భుత దేశంగా ఎదగవచ్చు. మంచి ఒప్పందంతోనే అమెరికా ప్రతినిధి బృందం సంతోషంగా ఇస్లామాబాద్ నుంచి వెనుతిరుగుతుందని ఆశిస్తున్నా.రెండోదఫా చర్చలకు ఇరాన్ ముందుకు రాక తప్పదు. ఆ దేశానికి మరో మార్గమే లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ గడువును పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు అనేది నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు’’అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం సీఎన్‌బీసీ ‘స్వా్కక్ బాక్స్’కార్యక్రమంలో స్పష్టంచేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగుస్తుండటంతో బుధవారం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత ఎక్కువైంది మేమింకా వేచిచూస్తున్నాంఇరాన్ స్పందన కోసం పాక్ వేచిచూస్తోంది. ‘‘ప్రతినిధి బృందం పంపుతుందోలేదో అనే సందేశం కోసం మేం ఆశగా ఎదురుచూస్తున్నాం. కాల్పుల విరమణ గడువు ముగిసేలోపే రెండోదశ చర్చలు మొదలుకావడం అత్యంత కీలకం’’అని పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లాహ్ తరార్ మంగళవారం సాయంత్రం మీడియాతో చెప్పారు. అమెరికా వైఖరితోనే మేం రావట్లేదు చర్చలపై ఇరాన్ మంగళవారం స్పందించింది. ‘‘అమెరికా అధ్యక్షుడి చంచల మనస్తత్వం, అసంబద్ధ ప్రకటనలు, సంబంధంలేని వ్యాఖ్యానాలు, బెదిరింపులు, అమెరికా ప్రతినిధి బృందం చేసిన అతి డిమాండ్లతో మేం విసిగిపోయాం. ఫలవంతమైన చర్చలు జరుగుతాయనే నమ్మకం ఉంటేనే రెండోదశ చర్చలకు వస్తాం’’అని ఇరాన్ విదేశాంగ శాఖ పతినిధి ఇస్మాయిల్ బఘేల్ తెలిపారు.మరో నౌక స్వాదీనం: అమెరికా ఇండోనేసియా, శ్రీలంక మధ్యలో హిందూ మహాసముద్రజలాల్లో ఇరాన్‌కు చెందిన ‘ఎం/టీ టిఫానీ’నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. హెచ్చరికల తర్వాత తమ బలగాలు నౌకపైకి దిగాయని అమెరికా ప్రకటించింది. ఈ నౌకను అమెరికాకు తరలించాలా లేదంటే మిత్రదేశంలోకి తరలించాలా అనేది మరో నాలుగు రోజుల్లో తేలుస్తామని అమెరికా తెలిపింది. దిగ్భంధనాన్ని ఛేదించిన జీ సమ్మర్ఇరాన్కు చెందిన ముడిచమురు రవాణా నౌక ‘జీ సమ్మర్’విజయవంతంగా అమెరికా దిగ్బంధనాన్ని చేధించుకుని అరేబియా సముద్రం దిశగా పయనిస్తోందని వార్తలొచ్చాయి. ఏ ఒక్క నౌక కూడా తమ దిగ్బంధనం నుంచి తప్పించుకోబోదని గొప్పలుపోయిన అమెరికాకు ఈ వార్త తలనొప్పిగా మారింది. హార్మూజ్‌ను దాటేసి, ఏప్రిల్ 19వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్నూ దాటేసిందని నౌకల ట్రాకింగ్ డేటా పేర్కొంది.ఆ 8 మందిని విడిచిపెట్టండిఇరాన్కు ట్రంప్ పిలుపు వాషింగ్టన్: ఇరాన్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది మహిళలను వదిలేయాలని ఆదేశ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇస్లామాబాద్‌లో అమె రికా–ఇరాన్‌ల చర్చలు ప్రారంభమవుతాయని భావిస్తున్న వేళ ఆయనీ విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఆరుగురు మహిళలు, ఇద్దరు యువతులకు సంబంధించిన ఫొటోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో విడుదల చేశారు. ‘మన మధ్య జరగబోయే చర్చలకు ఇది శుభారంభం అవుతుంది’అనే వ్యాఖ్యను జోడించారు. -
ఈ 8 మంది అమ్మాయిలను వదిలేయండి: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: ఇరాన్‌ను ఇన్నాళ్లుగా హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం మాత్రం ఆ దేశాన్ని ఓ కోరిక కోరారు. ఇరాన్ ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష అమలు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.ఇలా చేస్తే ఇరు దేశాల మధ్య చర్చలకు గొప్ప ఆరంభం అవుతుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్‌లో జరగాల్సిన చర్చలు అనిశ్చితిలో ఉన్న సమయంలో.. సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక్కసారిగా ట్రంప్ చాలా కూల్‌గా విజ్ఞప్తి చేస్తూ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.‘నా ప్రతినిధులతో త్వరలో చర్చల్లో పాల్గొనబోయే ఇరాన్ నాయకులకు చెబుతున్నాను. ఈ మహిళలను విడుదల చేస్తే నేను ఎంతో కృతజ్ఞతగా భావిస్తాను. మీరు తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఆ మహిళలు గౌరవంగా భావిస్తారు, దానికి విలువ ఇస్తారన్న నమ్మకం ఉంది. దయచేసి వారికి ఎలాంటి హాని చేయవద్దు. ఇది మా చర్చలకు గొప్ప ఆరంభం అవుతుంది. ఈ విషయంపై మీరు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు’ అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా, ఎక్స్‌లో ఒకరు ఆ ఎనిమిది మంది మహిళల ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ఈ ఎనిమిది మంది మహిళలను ఉరితీయాలని ఇస్లామిక్ రిపబ్లిక్ సన్నాహాలు చేసుకుంటోంది. అంతర్జాతీయ సమాజం నుంచి, మానవ హక్కుల సంస్థలవారిమని చెప్పుకునే వారి నుంచి దీనిపై ఒక్క మాట కూడా రావడం లేదు’ అని అన్నారు. ఈ పోస్టుపైనే ట్రంప్ స్పందించారు.కాగా, ఇరాన్-అమెరికా మధ్య రెండో దశ చర్చలు ఇప్పటికే జరగాల్సి ఉండగా పాకిస్థాన్‌కు ఇరాన్ రాకపోవడంతో జరగలేదు. అసలు రెండో దశ చర్చలు జరుగుతాయా? అన్న సందిగ్ధత నెలకొంది. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం రాత్రిలో ముగియనుంది. ఆ తర్వాత మళ్లీ యుద్ధం జరుగుతుందా? అన్న భయాలు నెలకొన్నాయి. -
మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణను పొడిగించేది లేదని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ దిగ్బంధంతో ఇప్పటికే విజయం సాధించాం. అద్భుతమైన డీల్‌తో చర్చలకు ముగింపు పలుకుతాం’అని అన్నారు. ముందస్తు ప్రకటించినట్లు ఏప్రిల్ 22తో ఇరాన్‌పై అమెరికా కాల్పుల విమరణ ఒప్పందం ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ సీఎన్‌బీసీ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో ఇరాన్‌తో ఒప్పందం విజయవంతంగా ముగిస్తాం. పశ్చిమాసియా యుద్ధ చర్చల్లో అమెరికా స్థానం బలంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించే అవకాశం లేదు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునే దిశగా అమెరికా కాల్పుల విమరణ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. పొడిగింపులు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటాయి. ఈ నిర్ణయం అమెరికా తన చర్చా శక్తిని తగ్గించకుండా, ప్రత్యర్థులపై ఒత్తిడి కొనసాగించడానికి తీసుకున్నదని ఆయన సూచించారు.మేము చివరికి ఒక గొప్ప ఒప్పందాన్ని సాధిస్తాం. అమెరికా భవిష్యత్తు చర్చలు విజయవంతంగా ముగుస్తాయని, దేశానికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
ఇద్దరిలో ఓ మెట్టు దిగాల్సింది ఎవరు?
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉన్నా.. ఇరాన్ ముందుకు రాకపోవడంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. యుద్ధం గనుక మళ్లీ మొదలైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా కూడా తగ్గబోమని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఇరాన్ కూడా అంటోంది. అయితే..చర్చల విషయంలో సానుకూలంగానే ఉన్నా ఇరాన్ బెట్టు చేయడం సరికాదని అమెరికా అంటోంది. కొత్త ఒప్పందం అమలు అయితే అన్నీ సర్దుకుంటాయని.. ఆ ఒప్పందం ఓ కొలిక్కి రావాలంటే ఇరాన్ చర్చలకు దిగి రావాల్సిందేనని.. అప్పుడే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో ఇరాన్ చర్చలకు వచ్చినా తుది ఒప్పందం కుదురుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఆ ‘ఒక్క’ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేకపోవడమే ఇందుకు కారణంగా చూపిస్తున్నారు. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది.2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్‌కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అయితే..అదే విషయమై.. అదే ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారాయన. యుద్ధం కన్నా ఒప్పందం మంచిదని పదేపదే పాట పాడుతున్నారు. ఇరాన్‌కు మరో దారి లేదని హెచ్చస్తూనే.. అవసరమైన సడలింపులు కూడా ఇచ్చేందుకు రెడీ అంటూ బుజ్జగిస్తున్నారు. అవసరమైతే.. డీల్ కుదుర్చుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అంటున్నారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య యురేనియం శుద్ధి (uranium enrichment) కాలపరిమితి విషయంలోనే కనిపిస్తోంది.ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని సుదీర్ఘ కాలం(20 ఏళ్లపాటు) నిలిపివేయడానికి అంగీకరించిందని, ఇది కొత్త ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. అయితే, అమెరికా ఏ రకమైన సడలింపులు ఇవ్వగలదో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ మాత్రం చాలా తక్కువ కాలం (5–7 సంవత్సరాలు) మాత్రమే అంగీకరించేందుకు సిద్ధంగా ఉంది. తమకు ఇచ్చే సడలింపులపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది. అలాగే ఆర్థిక ఆంక్షలను తక్షణమే తొలగించాలని షరతు పెడుతోంది. ఇక్కడే చర్చలు ముందుకు సాగడం లేదు.అమెరికా ఏం కోరుకుంటోందియురేనియం శుద్ధి, అణు ఆయుధాల అభివృద్ధి పూర్తిగా ఆపడం.బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై నియంత్రణ.లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గించడం.దేశీయ నిరసనలపై కఠిన చర్యలు తగ్గించడం.ఇరాన్ ఏం ఆశిస్తోందంటే..ఆంక్షలు ముందుగా ఎత్తివేయాలి. అమెరికా ఆర్థిక ఆంక్షలు తగ్గించకపోతే, అణు కార్యక్రమంపై పెద్ద సడలింపులు ఇవ్వలేమని ఇరాన్ అంటోంది.అణు శుద్ధి అవసరం కూడా. అణు శక్తి ఉత్పత్తి కోసం అవసరమని వాదిస్తోంది.తక్కువకాల పరిమితి మాత్రమే: అమెరికా కోరుతున్న 20 సంవత్సరాలపాటు అణు కార్యక్రమం నిలిపివేయడం సాధ్యం కాదని, గరిష్టంగా 5–7 సంవత్సరాలు మాత్రమే అంగీకరించగలమని చెబుతోంది.ప్రాంతీయ ప్రభావం తగ్గించలేం. లెబనాన్, సిరియా, యెమెన్‌లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం తమ భద్రతా వ్యూహంలో భాగమని ఇరాన్ అంటోంది.దేశీయ విధానాల్లో జోక్యం వద్దు. నిరసనలపై చర్యలు తమ అంతర్గత వ్యవహారమని, అమెరికా లేదంటే ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం అంగీకరించలేమని చెబుతోంది.సమాన ఒప్పందం కావాలి: అమెరికా మాత్రమే లాభపడే ఒప్పందం కాకుండా, ఇరాన్‌కు కూడా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలిగేలా ఉండాలని కోరుతోంది.సాధ్యమైన సడలింపులు ఆర్థిక ఆంక్షల సడలింపు: చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తగ్గించడం లేదా ఎత్తివేయడం.వాణిజ్య అవకాశాలు: అంతర్జాతీయ మార్కెట్లలో ఇరాన్‌కు తిరిగి ప్రవేశం కల్పించడం.మానవతా మినహాయింపులు: ఔషధాలు, ఆహారం వంటి అవసరమైన వస్తువులపై ఆంక్షలు తగ్గించడం.సైనిక ఒత్తిడి తగ్గింపు: ఇరాన్ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గిస్తే.. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించడం.ఒప్పందం కుదిరితేప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చు: మధ్యప్రాచ్యంలో యుద్ధం అవకాశాలు తగ్గి, స్థిరత్వం పెరుగుతుంది.ఆర్థిక లాభం: ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు సడలితే, చమురు ఎగుమతులు పెరుగుతాయి.చమురు మార్కెట్‌పై ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.రాజకీయ సంబంధాలు మెరుగుపడవచ్చు. అమెరికా–ఇరాన్ సంబంధాలు సానుకూల దిశలో కదిలి, ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.ఒప్పందం కుదరకుంటేఉద్రిక్తతలు పెరుగుతాయి: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఘర్షణలు.. సైనిక చర్యలు పెరిగే అవకాశంఆంక్షలు కొనసాగుతాయి: ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.చమురు ధరలు పెరిగే అవకాశం: సరఫరా తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి.ప్రాంతీయ అస్థిరత: లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు పెరిగి.. ఘర్షణలు మరింత తీవ్రమవుతాయి.చర్చలు విఫలమైతే.. అమెరికా–ఇరాన్ సంబంధాలు మరింత దూరమవుతాయి. రెండువారాల యుద్ధ విరమణ బుధవారంతో(భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి దాటాక) ముగియనుంది. అంటే.. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. చర్చల్లో ఏదో ఒక పురోగతి కనిపిస్తేనే.. అది పొడిగింపు ఉండొచ్చు. అంటే.. ఈ చర్చలు మిడిల్ ఈస్ట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ట్రంప్‌కే ఝలక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్.. వీడియో చూశారా?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు తరుణ్ భాస్కర్. గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లను సరికొత్త పంథాలో తీసుకెళ్తున్నారు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌నే రంగంలోకి దించేశాడు తరుణ్ భాస్కర్. ఏఐతో రూపొందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్ టీ తాగుతూ ఇండియన్ టీ వెరీ నైస్ అంటూ ప్రశంసించారు. దీనికి తరుణ్ భాస్కర్.. ఇండియన్ టీ ఎప్పడు బాగుంటుంది.. కానీ మీకిచ్చింది ఇరానీ టీ అంటూ షాకిచ్చారు.దీనికి డొనాల్డ్ ట్రంప్ షాకయ్యారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ మూవీని ఇరాన్లో మాత్రమే రిలీజ్ చేయడం లేదని.. ఓవర్సీస్లో ఎస్వీసీ, ప్రత్యుంగిరా సినిమాస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉండడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. Dear NRI Simhalu… ❤️🔥#GaayaPaddaSimham Roaring Overseas Release by @SVCRelease @PrathyangiraUS 🦁🔥TRUMP’ING PREMIERES on APRIL 30 💥#GPS #TharunBhascker @JDmaxmode @fariaabdullah2 @Maanasa_chou @kasyapcineverse @pavansadineni @SAMWoffl @POVStoriesOffl @zeestudiossouth pic.twitter.com/7kqGeFXVl2— Prathyangira Cinemas (@PrathyangiraUS) April 21, 2026 -
పాకిస్థాన్‌కు ట్రంప్..? యుద్ధం ముగిసేనా..!
ఇరాన్ అమెరికా మధ్య చర్చల విషయంలో ప్రస్తుతం తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. ఇరాన్ చర్చలకు ససేమిరా అనడంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో జరిగే రెండో విడత చర్చలకు ట్రంప్ స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఎటువంటి ఒప్పందం లేకుండానే భేటీ ముగిసింది. అయితే మరో దఫా చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తుండగా ఇరాన్ మాత్రం అంగీకరించట్లేదు. యుఎస్ఏ పెట్టే డిమాండ్లకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి జరిగే శాంతి చర్చలకు ట్రంప్ నేరుగా లేదా వర్చువల్‌గా పాల్గొనాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్‌తో రాయబారం కోసం ప్రయత్నిస్తున్నట్లు కీలక సమాచారం అందుతుంది. ఇరాన్ సైతం తొలుత చర్చలు జరపమని పట్టుబట్టినప్పటికీ ప్రస్తుతం సానూకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ నేరుగా హాజరైతే చర్చల అంశం ఆశాజనకంగా ముగిసే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చలు విఫలానికి కారణంట్రంప్.. ప్రధానంగా ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకూడదని, హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని కోరుతున్నారు. అయితే దీనికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు అమెరికా యుద్ధ పరిహారం చెల్లించాలని, ఇరాన్ మీద ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ డబ్బులు చెల్లించాలని కోరుతుంది. ఈ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది.సెక్యూరిటీ నీడలో ఇస్లామాబాద్చర్చల జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం ప్రస్తుతం సెక్యూరిటీ నీడలో ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల కోసం పాకిస్థాన్ సుమారు 20,000 మంది భద్రతా సిబ్బందిని ఇస్లామాబాద్‌లో మోహరించింది. తొలిదశ చర్చల సమయంలో సైతం ఇరాన్ అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. -
Magazine Story: యుద్ద కాండ
-
ఇరాన్‌కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఇరాన్, అమెరికా యుద్ధంలో నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాల దృష్టి హార్మూజ్ జలసంధిపైనే ఉంది. జలసంధిని తెరిచి నౌకల రాకపోకలు జరగాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం.. హార్మూజ్ అంతర్జాతీయ జలమార్గం కాదని.. అది తమ భూభాగానికి చెందిన సముద్ర ప్రాంతమంటూ కొత్త పలుకు ఎత్తుకుంది. అందువల్ల నౌకలు వెళ్లడానికి ఇరాన్ అనుమతి అవసరమని, అలాగే టోల్ వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో మొట్టమొదటి సారిగా హార్మూజ్ అంశంపై ఇరాన్ మిత్ర దేశం చైనా స్పందించింది. ఇరాన్‌కు షాక్ ఇచ్చే విధంగా జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.హార్మూజ్‌పై ఇరాన్ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్.. హర్మూజ్‌ను అంతర్జాతీయ జలమార్గంగా అభివర్ణించారు. హార్మూజ్ జలసంధిని సాధారణ రాకపోకలకు తెరిచి ఉంచాలి. వెంటనే జలసంధిని తెరవాలని ఇరాన్‌కు సూచించారు. ఇది ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. తక్షణ, సమగ్ర కాల్పుల విరమణను చైనా సమర్థిస్తుందన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు చైనా మద్దతు ఇస్తుంది. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన తర్వాత చైనా అధ్యక్షుడు తొలిసారిగా ప్రకటన చేయడం విశేషం.అయితే, హార్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియాలో తీవ్రమైన ఇంధన కొరతకు దారితీసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే చైనా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.నౌకపై దాడులు.. చైనా ఆందోళనమరోవైపు అమెరికా నావికా దిగ్బంధాన్ని ధిక్కరిస్తూ, చైనా నుంచి ఇరాన్ ఓడరేవుకు వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరపడంపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని, ఘర్షణలను రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలను పెంచడం వంటివి మానుకుంటాయని భావిస్తున్నాం. అలాగే హార్మూజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునఃప్రారంభించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.హార్మూజ్ మూసివేతతో చైనాకు నష్టాలు👉ఎనర్జీ సరఫరా అంతరాయం: చైనా క్రూడ్ ఆయిల్లో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి వస్తుంది. హార్మూజ్ మూసివేయడం లేదా దాడులు పెరిగితే, చైనాకు రోజుకు లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది.👉ఆర్థిక ప్రభావం: ఇంధన ధరలు పెరగడం వల్ల చైనా పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇది GDP వృద్ధిని మందగింపజేస్తుంది. చైనా ఆర్థిక వృద్ధి 0.5–1% వరకు తగ్గే అవకాశం ఉంది.👉వాణిజ్య నష్టం: ఇరాన్, గల్ఫ్ దేశాలతో చైనా వాణిజ్యం 40–50% వరకు తగ్గింది. ఇది చైనా ఎగుమతులు, దిగుమతులపై నేరుగా ప్రభావం చూపుతోంది. వాణిజ్యం తగ్గడం వల్ల చైనాకు బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతుంది.👉జియోపాలిటికల్ ఒత్తిడి: అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా హార్మూజ్ అస్థిరత పెరిగింది. చైనా తన నౌకలు, వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి అదనపు ఖర్చు పెట్టాలి.చైనా ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలు..1. పైప్లైన్లురష్యా–చైనా పైప్లైన్లు: సైబీరియా నుండి చైనాకు నేరుగా ఆయిల్, గ్యాస్ సరఫరా.మధ్య ఆసియా పైప్లైన్లు: కజకిస్తాన్, టుర్క్‌మెనిస్తాన్ నుండి గ్యాస్ సరఫరా. ఇవి హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గిస్తాయి.2. ఆర్కిటిక్ సముద్ర మార్గంరష్యా "నార్తర్న్ సీ రూట్" ద్వారా చైనాకు ఆయిల్, LNG సరఫరా పెరుగుతోంది. ఈ మార్గం హార్మూజ్, మలక్కా వంటి "చోక్పాయింట్"లను తప్పించగలదు.3. స్ట్రాటజిక్ రిజర్వులుచైనా వద్ద 90 రోజులకు సరిపడే ఆయిల్ రిజర్వులు ఉన్నాయి. హార్మూజ్ మూసివేత వంటి తక్షణ షాక్‌లను ఎదుర్కోవడానికి వీటిని ఉపయోగిస్తోంది.4. ఎనర్జీ డైవర్సిఫికేషన్పునరుత్పాదక శక్తి (సోలార్, విండ్)లో భారీ పెట్టుబడులు.సూపర్‌గ్రిడ్ ప్రాజెక్ట్: దేశీయ విద్యుత్ ఉత్పత్తి పెంచి, ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటోంది. -
ట్రంప్ సంచలన వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు, మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్ మొండి పట్టుదలతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.ముగియనున్న డెడ్ లైన్ఇరు దేశాల మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనుంది. ఈ డెడ్ లైన్ సమీపిస్తున్నప్పటికీ జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందాన్ని తదుపరి చర్చల కోసం పాకిస్తాన్‌కు పంపాలని ట్రంప్ యోచిస్తున్నారు. అయితే అమెరికా తన కఠిన వైఖరిని మార్చుకుంటే తప్ప తాము చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఇదే సమయంలో కాల్పుల విరమణను పొడిగించే అవకాశం లేదని ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హం. ترامپ با اعمال محاصره و نقض آتشبس میخواهد تا به خیال خود این میز مذاکره را به میز تسلیم تبدیل کند یا جنگافروزی مجدد را موجّه سازد. مذاکره زیر سایهٔ تهدید را نمیپذیریم و در دو هفتهٔ اخیر برای رو کردن کارتهای جدید در میدان نبرد آماده شدهایم.— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 20, 2026ట్రంప్ సంచలన హెచ్చరికచర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, సైనికపరమైన చర్యలు కూడా ఉండొచ్చని డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తమ లక్ష్యం కేవలం తాత్కాలిక శాంతి కాదని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించడమేనని ఆయన తెలిపారు. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.బెదిరింపులకు భయపడం: ఇరాన్ఒత్తిడి తెచ్చి ఒప్పందాలకు తమకు ఒప్పించాలని చూస్తే అంగీకరించబోమని ఇరాన్ అధికారులు తేల్చిచెప్పారు. ‘అమెరికా బెదిరింపుల నీడలో మేము చర్చలు జరపబోము’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఖలీబాఫ్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అవసరమైతే కొత్త వ్యూహాలతో బదులిస్తామని హెచ్చరించారు. మరోవైపు, ఈ పరిణామాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో సోమవారం చర్చించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి విడత చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో తాజా పరిణామాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.ఇది కూడా చదవండి: Manipur: తెల్లవారుజామున భారీ భూకంపం -
ట్రంప్ కొత్త రాగం.. మా కండీషన్ అదే..
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా అఖండ విజయం సాధించింది. ఇరాన్‌పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టెహ్రాన్ తీవ్రంగా నష్టపోయిందని, బలహీనపడిందని అన్నారు. ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘యుద్ధంలో ఇరాన్‌పై మేము విజయం సాధించాం. ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అమెరికా దాడుల కారణంగా ఇరాన్ చాలా బలహీనపడింది. ఇరాన్ నౌకాదళం పూర్తిగా దెబ్బతింది. వైమానిక దళం కార్యకలాపాలు తగ్గాయి. రక్షణ వ్యవస్థలు కూడా బలహీనంగా మారాయి. అలాగే, ఆర్థిక పరంగా కూడా ఇరాన్ రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టం చవిచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని వెల్లడించారు.ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవాలి. ఇదే ప్రధాన షరతు అంటూ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే తాను కూడా ఇరాన్ నాయకులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే, చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడులు తీవ్రంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే, ఈ పరిస్థితిని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపుతున్నాయని కూడా ఆయన విమర్శించారు. కొన్ని ఫేక్ న్యూస్ మీడియా సంస్థలు దీనిని తప్పుగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థలను ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, ఇస్లామాబాద్ చర్చలు కీలక మలుపు తిప్పే అవకాశముంది. ఒకవైపు ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ చర్చల ఫలితం ఆధారంగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.


