ఇరాన్‌ నన్ను ఇరిటేట్ చేస్తోంది.. ట్రంప్‌ | Trump Rules Out Early End to War, Iran Holds Firm On Nuclear | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ నన్ను ఇరిటేట్ చేస్తోంది.. ట్రంప్‌

May 2 2026 5:03 PM | Updated on May 2 2026 5:26 PM

Trump Rules Out Early End to War, Iran Holds Firm On Nuclear

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని ప్రస్తుతానికి యుద్దం ముగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే ఇరాన్‌ మాత్రం తమతో యుద్దం ముగింపుకై సంప్రదింపులు జరుపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 60 రోజులు గడుస్తోంది అయినప్పటీకీ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు దేశాలు చర్చల విషయంలో తగ్గడం లేదు. అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం కుదరదు అనడం ఇరాన్ దానికి ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడంతో చర్చలు సాగడం లేదు. అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంలో మరోసారి స్పందించారు.

ట్రంప్ మాట్లాడుతూ "వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ నేను దానికి సిద్ధంగా లేను; నాకు దానితో తృప్తి లేదు, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వారు పురోగతి సాధించారు, కానీ వారు ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్‌లో వారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

కాగా ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైననాటి నుంచి  చట్టపరమైన అనుమతి కోరడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఈ రోజు ( శనివారం)చివరి గడువు అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో యుద్ధం ముగిసిపోయినందున దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ కాంగ్రెస్‌కు తెలిపినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement