వాషింగ్టన్: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III అమెరికాలో చారిత్రక పర్యటన చేపట్టారు. ఈ దౌత్య పర్యటనలో జరిగిన చర్చలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య వైరల్‌గా మారింది.
వైట్ హౌస్‌లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
కింగ్ చార్లెస్‌కు వైట్ హౌస్ వద్ద అత్యున్నత దౌత్య మర్యాదలతో కూడిన ఘనస్వాగతం లభించింది. 21 తుపాకుల వందనం, సైనిక కవాతుతో అమెరికా ప్రభుత్వం ఆయనకు గౌరవం అందించింది. స్వాగత కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ‘చార్లెస్ యువరాజుగా ఉన్నప్పుడు తన దివంగత తల్లి అతనిని ఎంతో ఇష్టపడేదని, ఆయనను ‘క్యూట్’ గా ఫీలయ్యేదని సరదాగా వ్యాఖ్యానించారు. ‘మా అమ్మకు చార్లెస్ అంటే క్రష్. మీరు నమ్ముతారా? ఆమె ఇప్పుడు ఏమనుకుంటుందో’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమానికి కాస్త వినోదాన్ని జోడించాయి.
In this bizarre moment, with King Charles sitting behind him, President Trump tells the crowd that his mother had a crush on King Charles. pic.twitter.com/LX0iYuwwCU
— Ed Krassenstein (@EdKrassen) April 28, 2026
ఉద్రిక్తతల నడుమ దౌత్య వ్యూహాలు
ఒకవైపు ఇరాన్ వివాదం, టారిఫ్ సమస్యలతో వాషింగ్టన్, లండన్ మధ్య సంబంధాలు కాస్త తగ్గన వేళ ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, సవాళ్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్, చార్లెస్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా కింగ్ చార్లెస్ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 1991లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఈ గౌరవం దక్కించుకున్న రెండవ బ్రిటీష్ చక్రవర్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
ఇది కూడా చదవండి: ‘అధిపత్యం కాదు..’ ట్రంప్‌కు కింగ్ చార్లెస్ చురక!


