మేము సముద్రపు దొంగలమేమో .. ట్రంప్ | we are like pirates donald trump on us seizing iranian ships | Sakshi
Sakshi News home page

మేము సముద్రపు దొంగలమేమో .. ట్రంప్

May 2 2026 9:06 PM | Updated on Jun 18 2026 1:11 PM

we are like pirates donald trump on us seizing iranian ships

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. తాజాగా ఆయన అటువంటి వ్యాఖ్యలే చేశారు. "మేము సముద్రపు దొంగల లాంటి వాళ్లం" అని అమెరికాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. హర్ముజ్‌ జలసంధిలో ఇరాన్ నౌకల స్వాధీనం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.  

ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీ ట్రంప్ మాట్లాడారు. అందులో " మేము ... నౌకపైకి దూకి, దాన్ని మా ఆధీనంలోకి తీసుకున్నాము. సరుకును స్వాధీనం చేసుకున్నాం, చమురును తీసుకున్నాం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం." అన్నారు. ట్రంప్ ఇలా ‍వ్యాఖ్యానించిన తర్వాత ఆ సభలో ప్రజలు కేరింతలు కొడుతూ ఈలలు వేశారు. ఇటీవల ఇరాన్‌కు చెందిన నౌకలను అమెరికా దిగ్భందనం చేసింది ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడారు.

అయితే ఇరాన్ ఓడరేవుల వద్ద అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగుతుంది. అమెరికా దళాలు 'మేజిస్టిక్ ఎక్స్' ఇరాన్-ఫ్లాగ్ కలిగిన 'టూస్కా' వంటి కార్గో నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై ఇరాన్‌ సైతం ఘాటుగానే స్పందించింది.  "అంతర్జాతీయ జలాల్లో సాయుధ దోపిడీ" అని పేర్కొంటూ, వాషింగ్టన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.

విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఈ చర్య వాస్తవంగా సముద్రపు దొంగతనాన్ని సమర్థించడమేనని అన్నారు. దీనిని ఆయన "అంతర్జాతీయ జలాల్లో సముద్రపు దొంగతనం మరియు సాయుధ దోపిడీని ప్రత్యక్షంగా చట్టబద్ధం చేయడమే" అని అభివర్ణించారు. 

తాజాగా ట్రంప్‌ సైతం ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌ తాము సముద్రపు దొంగలమేనన్నారు.అయితే కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ చర్యలు తనను సంతృప్తి పరచలేదని యుద్దాన్ని ముగించే ప్రసక్తే లేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement