భారత్‌ నరకం ట్రంప్‌ వ్యాఖ్యలు.. భారత్‌ ఘాటు రియాక్షన్‌ | India's reaction to Trump hateful remarks | Sakshi
Sakshi News home page

భారత్‌ నరకం ట్రంప్‌ వ్యాఖ్యలు.. భారత్‌ ఘాటు రియాక్షన్‌

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 8:38 AM

India's reaction to Trump hateful remarks

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల భారత్‌పై విషం చిమ్మారు. దేశాన్ని నరకంతో పోలుస్తూ జాత్యాహాంకార వ్యాఖ్యలు చేశారు. కాగా దీనిపై తాజాగా భారత్‌ ఘాటుగా స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ పేర్కొన్నారు.

ట్రంప్‌ వ్యవహార శైలి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎప్పుడు ఏవిధంగా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అమెరికా గ్రేట్‌ ఎగేన్‌ అంటూ తరచుగా వేరే దేశాలపై విషం చిమ్ముతుంటారు. ఆ దేశ సంపదను అవతలి వారి కొల్లగొడుతున్నారంటూ అవతలి దేశాలపై ఏడుస్తూ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత్‌ను నరకంతో పోల్చుతూ అమెరికా  రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్‌ రాసిన‌ వివాదాస్పద లేఖను  త‌న ట్రుత్ సోష‌ల్ పోస్టులో షేర్ చేశారు.

కాగా దీనిపై తాజాగా భారత్‌ స్పందించింది " మేము ట్రంప్  వ్యాఖ్యలను, అలాగే వాటికి ప్రతిస్పందనగా యూఎస్ రాయబార కార్యాలయం జారీ చేసిన ప్రకటనను కూడా చూశాము. ఆ వ్యాఖ్యలు స్పష్టంగా అవగాహన లేనివి, అనుచితమైనవి మరియు అసభ్యకరమైనవి. అవి ఖచ్చితంగా భారత్-యూఎస్ ప్రస్తుతమున్న సంబంధాల వాస్తవికతను ప్రతిబింబించవు. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు  చాలా కాలంగా పరస్పర గౌరవం మరియు ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

మళ్లీ భారత్‌ను పొగిడిన ట్రంప్

కాగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్  దీనిపై మరో విధంగా స్పందించారు. భారత్‌ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు.  ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్‌ తనతో అన్నారని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ రెండు సంఘటనలను ఊటంకిస్తూ స్పందించింది.

అసలేం జరిగింది ?
ఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్‌ రీపోస్ట్ చేశారు. ఒక దేశానికి అధ్యక్షుని హోదాలో ఉండి మరో పెద్ద దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement