కింద పడిపోయిన ట్రంప్‌.. వాన్స్‌ను లాగేసి.. | Trump And vance Saved By Security Video Viral | Sakshi
Sakshi News home page

కింద పడిపోయిన ట్రంప్‌.. వాన్స్‌ను లాగేసి..

Apr 26 2026 10:32 AM | Updated on Apr 26 2026 12:40 PM

Trump And vance Saved By Security Video Viral

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా పలువురు కీలక నేతలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ట్రంప్ హాజరైన కరస్పాండెంట్ల వార్షిక విందులో కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్‌, జేడీ వాన్స్‌తో పాటు  ఇతర ప్రముఖులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌, వాన్స్‌ను సెక్యూరిటీ తరిలించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం రాత్రి వైట్‌హౌస్‌​ ప్రెస్ కరస్పాండెంట్ల వార్షిక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందులో ట్రంప్‌, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్​, రక్షణ మంత్రి పీట్ హెగెత్స్​,విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు ఉన్నారు. ట్రంప్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో కాలిఫోర్నియాకు చెందిన కోల్‌ అలెన్‌గా అనే వ్యక్తి కాల్పులు జరిపాడు.

దీంతో, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్‌, జేడీ వాన్స్‌ను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. మొదట వాన్స్‌ను జాకెట్‌ పట్టుకుని లాగేసిన సిబ్బంది.. అనంతరం, ట్రంప్‌ను తీసువెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్‌ కిందపడిపోయినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇక, మొలానియా సహ పలువురు మహిళా ప్రముఖులు భయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. విందు హాల్‌ను వెంటనే ఖాళీ చేయించారు. ఇక, ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తమంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement