వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో దుండగుని కాల్పులు
ట్రంప్, వాన్స్ దంపతులు, మంత్రులకు తప్పిన ముప్పు
ట్రంప్ హాజరైన బాల్ రూమ్ పక్క లాబీలో ఉదంతం
దుండగున్ని అతి కష్టమ్మీద నిర్బంధించిన సిబ్బంది
వైట్‌హౌస్ జర్నలిస్టుల విందు భేటీలో తీవ్ర కలకలం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. అధ్యక్షుడి హోదాలో ఆయన తొలిసారిగా పాల్గొన్న వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ విందు భేటీలో ఓ యువకుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడటం తీవ్ర సంచలనం సృష్టించింది. వాషింగ్టన్‌లో వైట్‌హౌస్ సమీపంలోని ప్రఖ్యాత హిల్డన్ హోటల్‌లో ఇందుకు వేదికైంది.
శనివారం రాత్రి 8.34 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. బాల్ రూమ్‌లో జరిగిన విందులో ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ దంపతులు, మంత్రులు పీట్ హెగెŠస్‌త్, మార్కో రూబియోతో పాటు చాలామంది వీఐపీలు, విలేకరులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆ సమయంలో బాల్‌రూమ్ బయట ఉన్న లాబీలోకి సాయుధుడైన యువకుడు చొరబడ్డాడు. తుపాకులు, కత్తులతో బాల్ రూమ్ కేసి దూసుకెళ్లాడు.
ఆ క్రమంలోనే షాటగన్‌తో దాదాపు ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దాలు వినిపించడంతో బాల్ రూమ్‌లోని వేలాది మంది అతిథులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెద్దగా కేకలు వేస్తూ టేబుళ్ల కింద తలదాచుకున్నారు. ట్రంప్ ఈ సమయంలో కరెస్పాండెంట్స్ అసోయేషన్ ప్రెసిడెంట్ వీజియా జియాంగ్‌తోపాటు మెంటలిస్ట్ ఓజ్ పెరల్‌మ్యాన్‌తో మాట్లాడుతున్నారు. కాల్పుల శబ్దాలు విని ఆయన ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణం అప్రమత్తమై ట్రంప్, వాన్స్ దంపతుల చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు.
తొలుత వాన్స్‌ను, తర్వాత ట్రంప్ దంపతులను సురక్షితంగా బాల్ రూమ్ నుండి తరలించారు. వేదిక దిగే సమయంలో ట్రంప్ ఆందోళనకు గురై తడబడగా ఆయనకు భద్రతా సిబ్బంది చేయూత అందించారు. అనంతరం ట్రంప్ దంపతులను హోటల్‌లోని ప్రెసిడెన్షియల్ సూట్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. విందును కొనసాగిస్తానని ట్రంప్ తీవ్రంగా పట్టుబట్టారు. దాంతో నిర్వాహకులు కూడా బాల్ రూమ్‌ను తిరిగి సిద్ధం చేశారు. కానీ సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు అందుకు అనుమతి ఇవ్వలేదు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రంప్ దంపతులను వైట్‌హౌస్‌కు తరలించారు. దుండగున్ని భద్రతా సిబ్బంది నిర్బంధించారు. అతన్ని 31 ఏళ్ల కోల్ టోమస్ అలెన్‌గా గుర్తించారు.
#WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event.
(Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Z2nDjWzWW0— ANI (@ANI) April 26, 2026
ఏజెంట్‌పై కాల్పులు
అలెన్ హోటల్ లాబీ నుంచి చెక్ పాయింట్‌ను దాటుకొని బాల్ రూమ్‌వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు ఒక్కసారిగా షాకైనా వెంటనే తేరుకుని దుండుగుడిని వెంబడించారు. ఎంతో దూరం వెళ్లకుండానే అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఓ సీక్రెట్ సర్వీస్‌ఏజెంట్‌పై అతడు కాల్పులు జరిపాడు. ఏజెంట్‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. దుండగుడు తీవ్రంగా ప్రతిఘటించడంతో నేలమీదకు నెట్టేసి అతికష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పలు మారణాయుధాలను స్వా«దీనం చేసుకున్నారు.
#WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event.
(Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Ulm93FCTM1— ANI (@ANI) April 26, 2026
దుంగడునికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని టారెన్స్ అలెన్ స్వస్థలం. అతను హిల్టన్ హోటల్‌లో బస చేశాడు. దాంతో పక్కా పథకం ప్రకారమే అతను దాడికి దిగినట్టు భావిస్తున్నారు. ట్రంప్ భద్రతలో తీవ్ర లోపాలను ఈ ఉదంతం మరోసారి తెరపైకి తెచ్చిందంటున్నారు. ఆనవాయితీగా జరిగే వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ వార్షిక విందు భేటీలో ట్రంప్ పాల్గొనడం ఇదే తొలిసారి. అధ్యక్షునిగా తొలి హయాంలో కూడా దీనికి ఆయన దూరంగా ఉన్నారు.
🚨 WATCH: Absolute PANIC following shots fired at the White House Correspondents Dinner
This guy should not even been able to enter the BUILDING.
Just insane! pic.twitter.com/bF5P9HcO0o— Nick Sortor (@nicksortor) April 26, 2026
ట్రంప్ సహా ఉన్నతాధికారులే లక్ష్యం
విందుకు హాజరయ్యే అధ్యక్షుడు ట్రంప్ సహా అమెరికా ఉన్నతాధికారులే కోల్ టోమస్ అలెన్ లక్ష్యమై ఉండొచ్చని తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె అనుమానం వ్యక్తం చేశారు. అతడి వద్ద లభించిన ఎల్రక్టానిక్ పరికరాలు, రాతలను బట్టి ప్రాథమికంగా ఈ విషయం తెలుస్తోందన్నారు. అలాగే రెండేళ్ల వ్యవధిలో ఆయుధాలను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. అలెన్ కాలిఫోర్నియా నుంచి షికాగో, అక్కడి నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
#WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event.
(Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Z2nDjWzWW0— ANI (@ANI) April 26, 2026
రెండేళ్లలో మూడోసారి!
ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం గత రెండేళ్లలో ఇది మూడోసారి! 2024 జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ సిటీలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలో థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు సమీపం నుంచి కాల్చగా ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. తూటా ఆయన కుడి చెవిని చీల్చుకుంటూ దూసుకెళ్లింది. 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ట్రంప్‌పై మళ్లీ హత్యాయత్నం జరిగింది. తాజా కాల్పుల ఘటన నేపథ్యంలో ట్రంప్ భద్రతను పూర్తిస్థాయిలో పునఃసమీక్షిస్తున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ చెప్పారు.
Shots fired at White House Correspondents' Dinner venue.
US President Donald Trump posts, "Quite an evening in D.C. Secret Service and Law Enforcement did a fantastic job. They acted quickly and bravely. The shooter has been apprehended, and I have recommended that we “LET THE… pic.twitter.com/HXMmyprGQe— ANI (@ANI) April 26, 2026



