అతనో మానసిక రోగి : డొనాల్డ్‌ ట్రంప్‌ | trump comments on white house incident | Sakshi
Sakshi News home page

అతనో మానసిక రోగి : డొనాల్డ్‌ ట్రంప్‌

Apr 26 2026 6:23 PM | Updated on Apr 26 2026 6:26 PM

trump comments on white house incident

వాషింగ్టన్‌: వైట్ హౌస్‌లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు ఉన్నాయి. దాడికి నిందితుడు ఒక్కడే పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దాడి చేసిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. దాడి వెనుక ఉద్దేశ్యం ఇతర అంశాలపై దర్యాప్తు జరుగుతోంది’అని చెప్పారు. 

ఏప్రిల్ 25న వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన కారస్పాండెంట్స్ డిన్నర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 2,600 మంది ప్రముఖులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకలో ప్రధాన భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడ్డాడు. అయితే అతను ధరించిన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ కారణంగా ప్రాణాపాయం తప్పింది.

వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన ఈ కాల్పుల ఘటనతో అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు ఉన్నతాధికారులను సీక్రెట్ సర్వీస్ తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించింది. 

దాడి చేసిన వ్యక్తిని కోల్ టోమాస్ అలెన్ అనే కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఘటన అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో వైట్ హౌస్‌లో భద్రతా చర్యలు మరింత కఠినతరం అయ్యాయి. కారస్పాండెంట్స్ డిన్నర్‌కు హాజరైన వారిని తక్షణమే బయటకు తరలించారు. అధికారులు దాడి వెనుక ఉన్న కారణాలను, అతను ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాడో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement