వ్యూహం మార్చిన ట్రంప్‌.. IRGCకి తొలి దెబ్బ! | US warns firms of sanctions for dealings with Iran airlines | Sakshi
Sakshi News home page

వ్యూహం మార్చిన ట్రంప్‌.. IRGCకి తొలి దెబ్బ!

Apr 28 2026 9:03 AM | Updated on Apr 28 2026 11:13 AM

US warns firms of sanctions for dealings with Iran airlines

అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం అసలు సిసలు స్టేజ్‌కు చేరుకుంది. ఇరాన్‌పై అమెరికా పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఆర్థికంగా ఇరాన్‌ దెబ్బకొట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్ పోర్టులకు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని నౌకలను అడ్డుకుంటోంది. సముద్ర దిగ్భందనం చేసింది. దీంతో, ఇరాన్ రోజుకు దాదాపు 500 మిలియన్ డాలర్లు నష్టం చవిచూస్తోంది.

ఇక, తాజాగా అమెరికా మరో మాస్టర్‌ ప్లాన్‌ చేసింది. అమెరికా ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి విమానయాన రంగాన్ని కీలకంగా ఉపయోగిస్తోంది. అమెరికా ఆపరేషన్‌ ఎకానామిక్‌ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ విమానయాన సంస్థలతో లావాదేవీలు జరిపే కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ విమానాలకు జెట్ ఇంధనం, క్యాటరింగ్, ల్యాండింగ్ సేవలు లేదా నిర్వహణ వంటి సహాయాన్ని అందించే సంస్థలను సాయం నిలిపివేయాలని హెచ్చరించింది. ఈ క్రమంలో, ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కి సేవలు అందించే ఏ కంపెనీ అయినా ఆంక్షలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఆయా కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా పేర్కొంది.

కాగా, ఇరాన్‌కు Iran Air మరియు Mahan Air విమాన సంస్థలు ఉన్నాయి. ఇవి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ప్రకారం, ఇరాన్ ఎయిర్‌లైన్స్ IRGC కోసం ఆయుధాలు, సిబ్బంది, సామగ్రి తరలించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్‌లైన్స్‌పై ఆంక్షలు విధించి ఆర్థికంగా ఇరాన్‌ను దెబ్బతీయాలనే ప్లాన్‌ చేసినట్టు తెలిసింది. అలాగే, ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోని కంపెనీలు ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో సంబంధాలు పెట్టుకోకుండా చూడాలని అమెరికా కోరుతోంది.

ప్రస్తుతం అమెరికా ఆంక్షల జాబితా (SDN List)లో ఇరాన్‌కు సంబంధించిన అనేక కంపెనీలు, షిప్పింగ్ సంస్థలు, రిఫైనరీలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా చైనా, హాంకాంగ్, యూఏఈ, లైబీరియా, మార్షల్ దీవులు, కేమన్ దీవులు వంటి దేశాలకు సంబంధించిన సంస్థలు. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా ఆంక్షల వల్ల చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ఇప్పటికే నష్టపోయాయి. ముఖ్యంగా చైనా రిఫైనరీలు, షిప్పింగ్ కంపెనీలు, మరియు ఇరాన్ ఆయిల్ రవాణా నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ నుండి వేరుచేయబడ్డాయి.

ట్రంప్ వార్నింగ్
యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉందని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్‌కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్, దిగ్బంధనం కారణంగా వారి వద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. ఆర్థికంగా ఇరాన్‌ బలహీనంగా ఉందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ..

  • ఇరాన్‌పై 2025లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇరాన్‌కి సంబంధించిన ఆయుధాలు, డ్రోన్లు, ఆయిల్ స్మగ్లింగ్, విమాన రవాణా నెట్‌వర్క్‌లను అడ్డుకోవడమే లక్ష్యం.

  • ప్రెషర్ పాయింట్: అంతర్జాతీయంగా విమానయాన సేవలు లేకుండా ఎయిర్‌లైన్స్ నడవలేవు. అందుకే ఈ రంగాన్ని ఆంక్షలతో బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు.

  • ప్రాంతీయ ఉద్రిక్తతలు: హార్మూజ్‌ జలసంధిలో ఇరాన్ బలగాలు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపిన ఘటనల తర్వాత ఈ హెచ్చరిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

  • ఆంక్షలు: అమెరికా వెలుపల ఉన్న కంపెనీలు కూడా ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కి సేవలు అందిస్తే ఆంక్షలకు గురవుతాయి. ఆంక్షలు పడిన సంస్థలు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ, మార్కెట్లకు దూరమవుతాయి.


సేవలు నిషేధం:

  • జెట్ ఇంధనం సరఫరా
  • విమాన మెయింటెనెన్స్, రిపేర్
  • ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్
  • గ్రౌండ్ హ్యాండ్లింగ్
  • ల్యాండింగ్, ఎయిర్‌పోర్ట్ ఫీజులు
  • ప్రపంచ వ్యాపారాలు: విమానయాన, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లోని సంస్థలు నేరుగా ప్రభావితమవుతున్నాయి.
  • ప్రాంతీయ ప్రభావం: హార్మూజ్‌ జలసంధి దిగ్భందనం వల్ల చమురు, గ్యాస్‌, ఎరువుల సరఫరా అంతరాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement