ట్రంప్‌ది మామూలు ట్రేడింగ్‌ కాదు!! | Donald Trumps financial disclosure stock trades 2026 | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ది మామూలు ట్రేడింగ్‌ కాదు!!

May 16 2026 3:11 AM | Updated on May 16 2026 3:39 AM

Donald Trumps financial disclosure stock trades 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక పెట్టుబడుల వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా బయటకు వచ్చిన ఆయన ఆర్థిక వెల్లడి (Financial Disclosure) నివేదిక, 2026 మొదటి త్రైమాసికంలో ఆయన ఖాతాల ద్వారా జరిగిన భారీ స్టాక్ ట్రేడింగ్‌ను బహిర్గతం చేసింది. అమెరికా ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్‌కు సమర్పించిన ఈ నివేదిక ప్రకారం.. జనవరి నుండి మార్చి మధ్య కేవలం 3 నెలల కాలంలోనే ట్రంప్ ఖాతాల ద్వారా ఏకంగా 3,600కు పైగా ఆర్థిక లావాదేవీలు జరగడం విశేషం.

రూ. వేల కోట్ల ట్రేడింగ్ వాల్యూమ్!

ఈ మూడు నెలల కాలంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువ సుమారు 220 మిలియన్ నుండి 750 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో వేల కోట్ల రూపాయలు) మధ్య ఉంటుందని అంచనా. ప్రముఖ వినోద, మీడియా సంస్థల్లో కూడా ట్రంప్ భారీగానే పెట్టుబడులు పెట్టారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీలో కనీసం 30,000 డాలర్లు పెట్టుబడి పెట్టగా.. డిస్నీకి సంబంధించిన ట్రేడింగ్ విలువ ఏకంగా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

టెక్ దిగ్గజాలపైనే గురి..

ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్న ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల్లో ట్రంప్ ఖాతాల ద్వారా భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ (Microsoft), బ్రాడ్‌కామ్, అమెజాన్ (Amazon), యాపిల్ (Apple) స్టాక్స్‌లో 1 మిలియన్ నుండి 5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఏఎండీ, ఇంటెల్, ఆల్ఫాబెట్ (Google), గోల్డ్‌మన్ శాక్స్, ఎయిర్‌బీఎన్‌బీ, డోర్‌డాష్, మైక్రాన్, బ్లూమ్ ఎనర్జీ స్టాక్స్‌లో 5,00,000 నుండి 1 మిలియన్ డాలర్ల కొనుగోళ్లు జరిగాయి.

"మాకు సంబంధం లేదు"

ఈ ట్రేడింగ్ హడావుడిపై 'ది హఫ్ పోస్ట్' ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆర్గనైజేషన్ స్పందించింది. ఈ లావాదేవీలతో ట్రంప్‌కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. "ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టుబడులన్నీ పూర్తిగా విచక్షణాధికార ఖాతాల (Discretionary Accounts) ద్వారానే సాగుతాయి. థర్డ్-పార్టీ ఆర్థిక సంస్థలు నిర్వహించే ఆటోమేటెడ్ పెట్టుబడి ప్రక్రియలు, సిస్టమ్స్ ద్వారానే ఈ పోర్ట్‌ఫోలియోలు రీబ్యాలెన్స్ అవుతుంటాయి, ట్రేడ్‌లు జరుగుతుంటాయి. ఏ స్టాక్ కొనాలి, ఏది అమ్మాలి అనే నిర్ణయాల్లో ప్రెసిడెంట్ ట్రంప్‌కు కానీ, ఆయన కుటుంబానికి కానీ, ట్రంప్ ఆర్గనైజేషన్‌కు కానీ ఎలాంటి పాత్ర లేదు. ఏ ట్రేడింగ్ జరుగుతుందనే ముందస్తు సమాచారం కూడా వారికి ఉండదు." అని ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రతినిధి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement