అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఊహించని నిర్ణయం | Trump Briefed on Iran Final Blow Military Operation Plan | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఊహించని నిర్ణయం

May 1 2026 8:45 PM | Updated on May 1 2026 9:36 PM

Trump Briefed on Iran Final Blow Military Operation Plan

టెహ్రాన్‌: అమెరికా-ఇరాన్‌ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఊహించని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇరాన్‌ తన మాట వినకపోవడంతో దాడులు చేయాలని ఆయన ఆదేశించినట్లు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్‌ వెల్లడించింది.

యాక్సియోస్‌ నివేదిక ప్రకారం.. అమెరికా-ఇరాన్‌ చర్చల్లో పురోగతి లేకపోవడం, ఇరాన్‌ బెదిరింపులు పెరగడం వంటి పరిణామాలపై ట్రంప్‌ యూనైటెడ్‌ స్టేట్‌ సెంట్రల్‌ కమాండ్‌ అధికారి బ్రాడ్‌ కూపర్‌, రక్షణ మంత్రి, జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌తో 45 నిమిషాల పాటు ముఖాముఖీ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఇరాన్‌పై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధ సామాగ్రిని పంపింది. జెరూసలేం పోస్టు ప్రకారం సుమారు 6,500 టన్నుల ఆయుధాలు, పరికరాలు ఇజ్రాయెల్‌కు చేరాయి. వీటిలో వాయు, భూతల ఆయుధాలు, సైనిక ట్రక్కులు, జాయింట్‌ లైట్‌ టాక్టికల్‌ వెహికల్‌ యూనిట్లు ఉన్నాయి. ఈ సరుకు రెండు నౌకల ద్వారా అష్డోడ్‌, హైఫా పోర్టులకు చేరగా, అనేక విమానాల ద్వారా కూడా రవాణా జరిగింది.

‘ఆపరేషన్‌ రోరింగ్‌ లయన్‌ ప్రారంభమైనప్పటి నుంచి 403 ఎయిర్‌లిఫ్ట్స్‌, 10 సీలిఫ్ట్స్‌ ద్వారా 115,600 టన్నులకుపైగా సైనిక సామాగ్రి అందుకుంది’అని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్‌ ఎప్పుడైనా శత్రువులపై చర్యలకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రక్షణ అధికారులు ఆయుధ రవాణా కొనసాగుతుందని, మరింత విస్తరించవచ్చని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement