వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణను పొడిగించేది లేదని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ దిగ్బంధంతో ఇప్పటికే విజయం సాధించాం. అద్భుతమైన డీల్‌తో చర్చలకు ముగింపు పలుకుతాం’అని అన్నారు.
ముందస్తు ప్రకటించినట్లు ఏప్రిల్ 22తో ఇరాన్‌పై అమెరికా కాల్పుల విమరణ ఒప్పందం ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ సీఎన్‌బీసీ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో ఇరాన్‌తో ఒప్పందం విజయవంతంగా ముగిస్తాం. పశ్చిమాసియా యుద్ధ చర్చల్లో అమెరికా స్థానం బలంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించే అవకాశం లేదు.
అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునే దిశగా అమెరికా కాల్పుల విమరణ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. పొడిగింపులు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటాయి. ఈ నిర్ణయం అమెరికా తన చర్చా శక్తిని తగ్గించకుండా, ప్రత్యర్థులపై ఒత్తిడి కొనసాగించడానికి తీసుకున్నదని ఆయన సూచించారు.
మేము చివరికి ఒక గొప్ప ఒప్పందాన్ని సాధిస్తాం. అమెరికా భవిష్యత్తు చర్చలు విజయవంతంగా ముగుస్తాయని, దేశానికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.


