అందుకే బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకోను: ట్రంప్‌ | Shocking Reason Wht Trump Not Wear Bullet Proof Jacket | Sakshi
Sakshi News home page

అందుకే బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకోను: ట్రంప్‌

May 1 2026 1:03 PM | Updated on May 1 2026 2:03 PM

Shocking Reason Wht Trump Not Wear Bullet Proof Jacket

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రక్షణ కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించవచ్చు కదా? అని మీడియా నుంచి ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన వింత సమాధానమే ఇచ్చారు. 

నాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించడం ఇష్టం లేదు. అది వేసుకుంటే లావుగా కనిపిస్తా అని అన్నారాయన. ‘‘ మరో 20 పౌండ్లు ఎక్కువ బరువును నేను మోయగలనో లేదో నాకైతే తెలియదు. కానీ, అలా లావుగా ఉన్నట్లు కనిపించడం మాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే అది వేసుకోను. 

..బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకోవాలని భద్రతా సిబ్బంది కోరారు.  కానీ దాన్ని వేసుకుంటే.. దుష్ట శక్తుల ముందు నేను లొంగిపోయినట్లే అవుతుంది. అది నాకు అంతగా ఇష్టం లేదు’’ అని ట్రంప్‌ చెప్పారు. ఏప్రిల్‌లో జరిగిన వైద్య పరీక్షల ప్రకారం.. 79 ఏళ్ల వయసున్న ట్రంప్‌ బరువు 102 కేజీలు. డైట్‌ విషయంలో ఓ పద్దతీ లేకుండా అన్నీ లాగించేస్తుంటారాయన. 

గత రెండేళ్లలో ట్రంప్‌పై మూడుసార్లు హత్యాయత్నం జరిగింది. చివరగా.. హిల్టన్‌ హోటల్‌లో జరిగిన వైట్‌హౌజ్‌ కరస్పాండెంట్స్‌ అసోషియేషన్‌ మీటింగ్‌లో ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. అయితే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని..  ట్రంప్‌ దంపతులతో పాటు వీవీఐపీలందరినీ రక్షించగలిగారు. పిరికిపందలా పరిగెత్తడం కంటే.. ప్రజల మధ్య ధైర్యంగా కనిపించడం నాకు ముఖ్యం అని ట్రంప్‌ తరచూ చెబుతుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement