వైట్‌హౌస్‌లో అసలు జరిగింది ఇదే.. కీలక వీడియో విడుదల | US Justice Department Releases Footage Of White House Correspondents Dinner Shooting Attempt On Trump Assassination Suspect | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌లో అసలు జరిగింది ఇదే.. కీలక వీడియో విడుదల

May 2 2026 8:04 AM | Updated on May 2 2026 10:39 AM

Video Released Of Armed MAN Storming Correspondents Dinner

వాషింగ్టన్‌: వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అమెరికా న్యాయశాఖ.. కీలక వీడియోను విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపే ఉద్దేశంతో గత వారం జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ విందులోకి కోల్ టోమస్ అలెన్ చొరబడటానికి ప్రయత్నించిన దృశ్యాలు విడుదలయ్యాయి. 

అలెన్ లొంగిపోయే ముందు అసలు కాల్పులు జరిపాడా? సందేహాల మధ్య, వాషింగ్టన్ డిసి టాప్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జీనైన్ పిరో, ఈ ఘటనకు సంబంధించిన ఎడిట్ చేసిన భద్రతా కెమెరా ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సెక్యూరిటీ చెక్‌ పాయింట్‌లో నుంచి నిందితుడు ఒక్కసారిగా దూసుకొచ్చి కాల్పులు జరపడం సీసీ కెమెరాల్లో  స్పష్టంగా రికార్డయ్యింది. శనివారం నాటి విందు కంటే ఒక రోజు ముందుగానే అలెన్ ఆ హోటల్ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. తనిఖీ కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్లను తొలగిస్తున్న సమయంలో అలెన్ ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై కాల్పులు జరిపి లోపలికి దూసుకెళ్లాడు. అలెన్.. సీక్రెట్ సర్వీస్ అధికారి కాల్పులు కారణంగా కిందపడలేదు. తనిఖీ కేంద్రం వద్ద ఉన్న ఒక మెటల్ డిటెక్టర్ బాక్స్‌ను ఢీకొని కింద పడిపోయాడు. ఏజెంట్ జరిపిన ఐదు రౌండ్ల కాల్పుల్లో ఏ ఒక్కటి కూడా అలెన్‌కు తగలలేదని అధికారులు తెలిపారు.

అలెన్ మొదట కాల్పులు జరిపాడని ప్రభుత్వం వాదిస్తుండగా.. వాషింగ్టన్ పోస్ట్ వీడియో విశ్లేషణలో కేవలం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జరిపిన నాలుగు షాట్లు మాత్రమే కనిపించాయి. ఏజెంట్‌పై అలెన్ కాల్పులు జరిపాడనడానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఆధారాలను సేకరిస్తోందని అలెన్ తరపు పబ్లిక్ డిఫెండర్లు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement