ట్రంప్‌ ఉత్తర్వు చట్ట విరుద్ధం  | Appeals court clears way for US to reopen borders | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఉత్తర్వు చట్ట విరుద్ధం 

Apr 25 2026 6:03 AM | Updated on Apr 25 2026 6:06 AM

Appeals court clears way for US to reopen borders

వలసల నిషేధంపై అప్పీల్స్‌ కోర్ట్‌ తీర్పు 

వాషింగ్టన్‌: సరిహద్దుల గుండా జరిగే వలసల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల వాగ్దానాల్లో అత్యంత కీలకమైన వలసలకు అడ్డుకట్ట వేస్తూ ట్రంప్‌ వెలువరించిన ఉత్తర్వును చట్ట విరుద్ధమంటూ అప్పీల్స్‌ కోర్టు కొట్టివేసింది. 

ఈ అంశంపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును శుక్రవారం సమర్థించింది. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా సర్క్యూట్‌లో యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌లోని ముగ్గురు సభ్యుల జడ్జీల కమిటీ ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ‘వలస చట్టాలు సరిహద్దు వద్ద ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తాయి. అధ్యక్షుడు తన అధికారంతో ఆ చట్టాలను అతిక్రమించలేరు’అని స్పష్టం చేసింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement