breaking news
asylum in usa
-
ట్రంప్ ఉత్తర్వు చట్ట విరుద్ధం
వాషింగ్టన్: సరిహద్దుల గుండా జరిగే వలసల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల వాగ్దానాల్లో అత్యంత కీలకమైన వలసలకు అడ్డుకట్ట వేస్తూ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వును చట్ట విరుద్ధమంటూ అప్పీల్స్ కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును శుక్రవారం సమర్థించింది. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్లో యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లోని ముగ్గురు సభ్యుల జడ్జీల కమిటీ ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ‘వలస చట్టాలు సరిహద్దు వద్ద ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తాయి. అధ్యక్షుడు తన అధికారంతో ఆ చట్టాలను అతిక్రమించలేరు’అని స్పష్టం చేసింది. -
పాపం.. మహిళా పైలట్!
అఫ్ఘానిస్థాన్ వైమానిక దళంలో మొట్టమొదటి మహిళా పైలట్‌గా ఆమె గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మీడియాను ఆమె ఆకర్షించింది. కానీ ఇప్పుడు అక్కడ కష్టాలు భరించలేక.. అమెరికాలో ఆశ్రయం కోరుతోంది. ఇప్పటికి 15 నెలలుగా టెక్సాస్‌లో శిక్షణ పొందుతున్న కెప్టెన్ నీలోఫర్ రహమానీ.. తాను ఇక అక్కడే ఉండిపోతానని చెబుతోంది. అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితులు ఏమాత్రం మారకపోగా, అవి రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయని ఆమె వాపోయింది. తాను ఇప్పటికీ మిలటరీ పైలట్‌గానే ఉండాలనుకుంటున్నాను గానీ, తన సొంత దేశంలో మాత్రం కాదని ఆమె తన అమెరికన్ శిక్షకులకు చెప్పినట్లు తెలుస్తోంది. తనకు అమెరికాలో ఆశ్రయం కావాలంటూ ఇప్పటికే ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసింది. అక్కడే ఆమె ఎయిర్‌ఫోర్సులో చేరే అవకాశం కనిపిస్తోంది. అఫ్ఘానిస్థాన్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమెను చంపేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. అఫ్ఘానిస్థాన్‌లో మొట్టమొదటి మహిళా పైలట్ కావడంతో ఆమెకు తొలుత మంచి పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. గత సంవత్సరం ఆమెకు వాషింగ్టన్లో ఇంటర్నేషనల్ వుమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు కూడా లభించింది.


