‘అవి నరకాలు కావు..మానవాళికి మహోన్నత దేశాలు’ | Iran hits back at Donald Trump | Sakshi
Sakshi News home page

‘అవి నరకాలు కావు..మానవాళికి మహోన్నత దేశాలు’

Apr 23 2026 6:36 PM | Updated on Apr 23 2026 7:09 PM

Iran hits back at Donald Trump

భారత్‌, చైనా నరకాలు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఇరాన్‌లోని నాగరికతను నాశనం చేస్తామంటూ ప్రకటనలు మీద ప్రకటనలు ఇస్తున్న ట్రంప్‌ ఉంటున్న అమెరికానే నరకం అంటూ ఇరాన్‌ రిప్లై ఇచ్చింది. భారత్‌, చైనాలు మానవాళికి మహోన్నత దేశాలు అంటూ ఇరాన్‌ పేర్కొంది. భారత్, చైనాలను నాగరికతకు పుట్టినిల్లు  అని పేర్కొంటూ ట్రంప్‌పై విరుచుకుపడింది. 

చైనా, భారత్ నాగరికతకు పుట్టినిల్లు. నిజానికి అమెరికా దేశ యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు ఇరాన్‌లో నాగరికతను నాశనం చేస్తానని బెదిరించిన చోటే ఆ నరకమనేది ఉంది’ అంటూ ఇరాన్‌ బదులిచ్చింది. 

డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో భారత్, చైనాలను నరక కూపాలు అని అభివర్ణిస్తూ వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా స్పందించింది. ట్రంప్‌ ప్రకటనలకు సంబంధించి కొన్ని నివేదికలను చూశామని పేర్కొంది. తాము కొన్ని నివేదిలైతే చూశామని, ఈ వ్యాఖ్యల వివాదాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: 

భారత్‌పై విషం కక్కిన ట్రంప్‌

Advertisement
 
Advertisement
Advertisement