ఊసరవెల్లి సిగ్గుపడుతుందేమే.. భారత్‌పై మాట మార్చిన ట్రంప్ | india great country with very good friend trump | Sakshi
Sakshi News home page

ఊసరవెల్లి సిగ్గుపడుతుందేమే.. భారత్‌పై మాట మార్చిన ట్రంప్

Apr 23 2026 8:13 PM | Updated on Apr 23 2026 9:38 PM

 india great country with very good friend trump

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊసరవెల్లి కంటే వేగంగా ట్రంప్‌ తన మాటలను మార్వగలరు. ఈ రోజు ఉదయమే భారత్‌పై విషం వెల్లగక్కుతూ అవమానించేలా మాట్లాడిన ట్రంప్.. అంతలోనే ఇండియాను ప్రశంసిస్తూ మాట్లాడారని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.  

డొనాల్డ్‌ ట్రంప్  వలసల విషయంలో భారత్‌పై మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్‌ను నరకంతో పోల్చుతూ అమెరికా  రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్‌ రాసిన‌ ఓ లేఖ‌ను ట్రంప్ త‌న ట్రుత్ సోష‌ల్ పోస్టులో షేర్ చేశారు.

ఇండియా, చైనా దేశాలను న‌ర‌క‌కూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌జ‌లు.. అమెరికాలో 9 నెల‌ల్లో ఓ బిడ్డ‌ను కనేస్తారు. ఇక చ‌ట్టం ప్ర‌కారం వాళ్లు త‌క్ష‌ణ‌మే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ త‌న లేఖ‌లో విమ‌ర్శలు గుప్పించారు. 

కొన్ని గంటల్లోనే ట్రంప్‌ తన బుద్ధిని బయటపెట్టాడు. భారత్‌ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు.  ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్‌ అన్నారని భారత్‌లోని అమెరికా కార్యాలయ ప్రతినిధి  క్రిస్టోఫర్ ఎల్మ్స్ తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. 

మైఖేల్ సావేజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్‌ రీపోస్ట్ చేశారు.

భారత్ స్పందన
అటు ట్రంప్‌ ఇటు సావేజ్‌ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘మేము కొన్ని నివేదికలను చూశాము. వాటిని అక్కడే వదిలేశాం’ అని అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement